1, జూన్ 2024, శనివారం

అర్జునుని ముఖం

 స్వజనులైన యాదవులను, శ్రీకృష్ణుని చూడాలని అర్జునుడు ద్వారకు వెళ్లి చాలా రోజులు పిమ్మట తిరిగి వచ్చాడు.


 అర్జునుని ముఖం తేజో హీనంగా ఉంది. అది చూసి ధర్మరాజు అర్జునా ద్వారక నుండి సుఖంగా వచ్చావా. ద్వారకా నగరంలొ అందరూ కులాసాగా ఉన్నారు కదా దేవకి వసుదేవులు బలరామకృష్ణులు సుఖులే కదా. వారంతా మన యందు మైత్రితో మనం క్షేమం కోరుతున్నారా. 16,108 భార్యలు శ్రీకృష్ణ సేవ చేస్తూ అన్యోన్యమైన మైత్రి గలవారై చరిస్తున్నారా. ఈ కుశల వార్త వినే వరకు నా మనసు ఆత్రుత చెందుతూ ఉంది. నీ ముఖం చూస్తే శ్రీహినంగా కనిపిస్తోంది.


నిన్ను ఎవరు అవమానించలేదు కదా ఎక్కడా ఎవరూ నిన్ను నిందించలేదు కదా. ఎవరినైనా ఏ వస్తువైనా ఇస్తాన్ని వాగ్దానం చేసి ఇవ్వలేకపోయావా. బ్రాహ్మణులు బాలురు వృద్ధులు, రోగులు, స్త్రీలు మొదలైన వారు ఎవరైనా శరణంటే వారిని రక్షించలేనని విడిచి వేయలేదు కదా. 


(ఇక్కడ విశేషమేమిటంటే రాజు ప్రజల పట్ల ఏ విధంగా విధేయుడై ఉండాలి అని ధర్మరాజు ద్వారా అర్జునుని ప్రశ్నించాడు.)


నీ ముఖం చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది ఇంతవరకు ఎట్టి ఆపత్తులు కలిగిన నీ ముఖం ఇలా లేదే అని ప్రశ్నించాడు ధర్మరాజు.

శ్రీ కరింజేశ్వర దేవాలయం

 🕉 *మన గుడి : నెం 335*


⚜ *కర్నాటక  :-*


*కరింజ - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ శ్రీ కరింజేశ్వర దేవాలయం



💠 నాలుగు యుగాలకు సాక్షిగా నిలిచిన దక్షిణ కన్నడ జిల్లాలో అపురూపమైన కొండ శిఖరం శివాలయం! కరింజేశ్వరలోని కొడ్యమలే కొండలలో సముద్ర మట్టానికి సుమారు 100 అడుగుల ఎత్తులో కరింజ కొండ శిఖరంపై గంభీరంగా ఉంది.


💠 భక్తులు తప్పనిసరిగా శిఖరానికి 355 మెట్లను అధిరోహించవలసి ఉంటుంది, అయితే చుట్టుపక్కల విస్మయపరిచే విశాల దృశ్యాలను చూడవచ్చు.


💠 శ్రీ కరింజేశ్వర ఆలయం హిందూ పురాణాలలో పేర్కొన్న 4 యుగాలకు సాక్షిగా ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం. 

🔅 'కృతయుగం' సమయంలో ఈ ఆలయాన్ని 'రౌద్ర గిరి' అని పిలిచేవారు; 

🔅 'ద్వాపర యుగం'లో 'భీమ శైల';  🔅'త్రేతాయుగం'లో 'గజేంద్ర గిరి' మరియు 🔅'కలియుగం'లో 'కరింజ'.


💠 శ్రీ కరింజేశ్వర దేవాలయం రెండు భాగాలుగా విభజించబడింది - 

ఒకటి కొండ శిఖరంపై శివునికి మరియు మరొకటి పార్వతీ దేవి, గణేశుని కోసం కొండకు వెళ్ళే మార్గం మధ్యలో ఉంది.


💠 శివుని ప్రధాన ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. శ్రీరామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించాడని.


💠 దీనికి గుర్తుగా మధ్యాహ్న పూజా సమయంలో స్వామికి పెద్ద మొత్తంలో అన్నం నైవేద్యంగా సమర్పించి, దానిని రాతి పలకపై పోస్తారు కోతుల కోసం.

వేడి అన్నం ప్రసాదం తినడానికి అడవి నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కోతులు రావడం చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడతారు.

ఆ కోతుల మందలో " వృద్ధ కోతి " ముందుగా ప్రసాదం స్వీకరించటం వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ 


💠 కథలు ద్వాపర యుగంను కూడా సూచిస్తాయి, అక్కడ పాండవులు తమ ఉత్సాహంతో ఈ ప్రదేశం చుట్టూ ఉన్న గుహలలో ఆశ్రయం పొందారు.

 బీమ సేనుడు తన గదతో తవ్వినట్లు భావించే కొండ వద్ద ఉన్న పెద్ద సరస్సు గదాతీర్థ కథకు సాక్ష్యంగా నిలుస్తుంది. 

కొండపైన వరాహ తీర్థం అని పిలువబడే అర్జునుడి బాణంచే సృష్టించబడిన మరొక నీటి వనరు ఉంది, దీనితో పాటు ఉంగుష్ట తీర్థం మరియు జనుతీర్థం అనే మరో రెండు నీటి వనరులు ఉన్నాయి, వీటిని భక్తులు గౌరవిస్తారు. నిర్దిష్ట రోజులలో ఈ నీటి వనరులలో పవిత్ర స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయని చెప్పబడింది


💠 ఈ శివాలయం యొక్క నిర్మాణ శైలి వైష్ణవ మరియు జైన నిర్మాణ శైలులచే ప్రభావితమైంది. ఆలయ ధ్వజస్తంభం పునాదిపై ఉన్న రాతి శిల్పం విజయనగర రాజ్యంలో ఉన్న కెలాడి పాలకులు ఈ ఆలయానికి రాచరికం అందించారని సూచిస్తుంది.

కరింజా శిఖరం కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారుతోంది.

ప్రజలు ఈ కొండపైన స్వచ్ఛమైన గాలిని, పచ్చని పచ్చని చల్లని నీటి పరిసరాలను ఆస్వాదించడానికి మాత్రమే ఈ కొండను సందర్శిస్తారు. 

రాత్రి సమయంలో, కొండపై నుండి సమీపంలోని పట్టణాల విద్యుత్ దీపాలను, నక్షత్రాల వలె పేర్కొనడం కనుల పండువగా ఉంటుంది.

ఈ బ్లాగు మనందరిది

  ఈ బ్లాగు మనందరిది దీని అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటు చేయండి. 

Panchaag

 


శంకర వేద విద్యాలయము

॥శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే॥


*శ్రీకంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయము*

*అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం,కర్నూలు*


గత మూడు సంవత్సరములుగా మన కర్నూలు నగరమునందు *శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్రసరస్వతీస్వామి వార్లఆశీస్సులచే అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం* వారిచే నిర్వహించబడుచున్న మన *శంకర వేద విద్యాలయము* నందు *ఋగ్వేదము,ఋగ్వేద స్మార్తము,కృష్ణయజుర్వేదము, కృష్ణ యజుర్వేద స్మార్తము,* నందు నూతన విద్యార్థులను తీసుకొనుటకు దరఖాస్తులు స్వీకరించబడుచున్నవి.*రాయలసీమ ప్రాంతములోనే ప్రప్రథమముగా చతుర్వేదములు మరియు కృష్ణయజుర్వేద స్మార్త విద్యలతో ఎంతో వైభోగముగా విరాజిల్లుతు ఉన్నది*. ఇందు *నూతనముగా ఋగ్వేదస్మార్త విద్య విభాగమును* ప్రవేశ పెట్టటకు యాజమాన్యము వారు సంకల్పించి ప్రవేశపెట్టుట మనకు ఎంతో ఆనందాన్ని కలిగించు విషయము.


కావున ఆసక్తి గలవారు 8 సంవత్సరముల నుండి 14 సంవత్సరముల వయస్సు గల విద్యార్థులను చేర్చుటకు 15 - 06 - 2024 తేదీలోపు మీ మీ దరఖాస్తులను అందజేయగలరు. 


*గమనిక*

1. విద్యార్థులకు తగు మౌలిక సదుపాయములు మరియు విద్యా వైద్య సదుపాయములు అన్నీ కూడా పూర్తిగా ఉచితము.


2. విద్యార్థి వయస్సు 8 సంవత్సరముల నుండి 14 సంవత్సరముల లోపే ఉండవలెను. ఉపనయనము అయ్యి శిఖ ధారణ ఖచ్చితముగా ఉండవలెను. మరియు సంధ్యావందనము ఖచ్చితముగా నోటికి వచ్చి ఉండవలెను. 


3. తెలుగు చూసి చదువుట వ్రాయుట వచ్చి ఉండవలెను 


*ముఖ్య గమనిక*

దరఖాస్తులు స్వీకరించిన తరువాత గురువులు మరియు యాజమాన్యం వారి సమక్షంలో ప్రవేశ పరీక్ష చేసి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను మాత్రమే స్వీకరించబడును ఇతర ప్రశ్నలకు తావేలేదు.


 ఇతర వివరములకై సంప్రదించవలసినటువంటి నెంబర్స్


*పాఠశాల కరస్పాండెంట్*

*శ్రీ చిదంబర రావు గారు*

+91 97048 33439


*శ్రీకృష్ణయజుర్వేద అధ్యాపకులు*

*శ్రీ కళ్ళే ప్రతాప శర్మ గారు*

+91 91770 55817


*శ్రీకృష్ణయజుర్వేద స్మార్త అధ్యాపకులు*

*శ్రీ పాలపర్తి శివరామ శర్మ గారు*

7093089380  7013006638


*ఋగ్వేద అధ్యాపకులు*

*శ్రీ శ్రీదత్త గారు*

+91 82772 46156


*ఋగ్వేద స్మార్త అధ్యాపకులు*

*శ్రీ వేంకటేశ్వర శర్మ గారు*

8555800187


*అథర్వవేద అధ్యాపకులు*

*శ్రీ కాశీభట్ల పవనకుమార శర్మ గారు*

+91 84990 85608


*పాఠశాల మేనేజ్మెంట్*

*శ్రీ నరసింహ గారు*

97018 68448


*శ్రీ మధుసూదన గారు*

6302790576

పంచ ప్రయాగలు.

 ఓం నమః శివాయ.. శ్రీ మాత్రే నమః..!!🙏🙏

 *పంచ ప్రయాగలు...!!* 


ప్రయాగ అంటే సంగమం.

నదులు సంగంమించే పవిత్ర స్థలం.

అంటే నదులు లేక నీటి ప్రవాహాలు,

ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం.


కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్లే మార్గంలో పంచప్రయాగలు అని చెప్పబడే అయిదు 

పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి.

అవి..

విష్ణు ప్రయాగ,

నంద ప్రయాగ,

కర్ణ ప్రయాగ,

రుద్ర ప్రయాగ,

దేవ ప్రయాగ,


ఈ ఐదింటిని కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు.

ఈ క్షేత్రాలు మోక్షప్రదాలని నమ్మకం.


విష్ణు ప్రయాగ :-

బదరీనాథ్ నుండి దక్షిణంగా 38 కి.మీ., దూరంలో విష్ణు ప్రయాగ ఉన్నది.

విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంతదూరంలో

‘నితి’ అనే లోయ ప్రదేశం ఉంది.

ఆ లోయలో ఉన్న కొండశిఖరాల మీద నుండి వాలుగా జారపడిన నీరు, 

ఒక నదీ ప్రవాహంగా మారి దౌలి గంగ (ధవళ గంగ) అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది.

విష్ణుమూర్థి వీర నారాయణ రూపం ధరించి,

తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ,

ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి,

తపస్సు చేశాడట.

అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ

అనే పేరు వచ్చింది.

ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది.

అందులోని దైవం శ్రీ మహావిష్ణువు.


నంద ప్రయాగ:-

బదరీనాథ్ నుండి సుమారు 106 కి.మీ.,

దక్షిన భాగాన నంద ప్రయాగ ఉన్నది.

ఇక్కడకు ఈశాన్యంగా సుమారు 75 కి.మీ దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉన్నది.

ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య,

ఒక మంచులోయ ఉన్నది.

ఆ లోయలో నుండి, నందాకిని అనే చిన్ననది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి,

అలకనంద నదిలో కలుస్తుంది.

నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని అని పిలవబడుతుంది.

ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం

నంద ప్రయాగగా ప్రసిద్ధి చెందింది.

పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని నిర్వహింపజేశాడట. అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నందప్రయాగ అనే పేరు వచ్చిందని

మరొక ఐతిహ్యం ద్వారా తెలిస్తుంది.


కర్ణ ప్రయాగ:-

నంద ప్రయాగ తర్వాత అలకనంద నది యొక్క

దిశ కొంత నైఋతి దిక్కుగా మారుతుంది.

నంద ప్రయాగ తర్వాత సుమారు 22 కి.మీ., దూరంలో, అంటే బదరీనాథ్ నుండి 128 కి.మీ., దూరంలో కర్ణ ప్రయాగ ఉన్నది.

ఇక్కడ నుండి తూర్పుగా సుమారు 100 కి.మీ., దూరంలో ఉన్న ఒక మంచు లోయలో నుండి ‘పిడరగంగ’ అనే నది ప్రవహిస్తూ వచ్చి,

ఆ అలకనంద నదిలో కలుస్తుంది.

ఈ రెండు నదుల సంగమం వద్ద మహాభారత కథలోని కర్ణుడు సూర్యభగవానుని గూర్చి

గొప్ప తపస్సు చేసి, 

ఆయన నుండి కవచకుండలాలు పొందాడని స్థలపురాణం.

ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణ ప్రయాగ 

అనే పేరు వచ్చింది అంటారు.

ఇచ్చటనే ఉమాదేవి అనే చక్కని ఆలయం ఉన్నది. భక్తులు ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.


రుద్ర ప్రయాగ:-

కర్ణ ప్రయాగ నుండి సుమారు 31 కి.మీ.,

నైఋతి దిశగా, అంటే బదరీనాథ్ నుండి 159 కి.మీ., దూరంలో రుద్ర ప్రయాగ ఉన్నది.

హరిద్వార్ – ఋషికేష్ ల నుండి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి,

ఒక మార్గం కేదార్ నాథ్ వైపుకు,

మరొకటి బదరీనాథ్ వైపుకు సాగిపోతాయి.

కేదార్ నాథ్ వద్ద ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది,

దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలుస్తుంది.

రుద్రప్రయాగ తర్వాత మందాకిని నది ఉనికి ఉండదు అనే చేప్పాలి.

కేవలం మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతుంది.

ఈ రుద్రప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతుంది.

ఈ ఊరిలో చాలా పురాతన కాలం నాటి

జగదాంబ దేవి అనే అమ్మవారి ఆలయమూ, రుద్రనాథ్ అనే శివాలయం ఉన్నాయి.

ఈ స్వామిపేరున ఈ ఊరు రుద్రప్రయాగ అని

ప్రసుద్ధి చెందింది.


దేవ ప్రయాగ:-

ఉత్రాఖాండ్ లో టేహ్రీగర్వాల్ జిల్లాలో సముద్రమట్టానికి 2723 అడిగుల ఎత్తులో ఉన్న

ఒక ప్రసిద్ధ పట్టణం దేవప్రయాగ.

ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషికేష్ నుండి 70 కి.మీ., దూరంలో బదరీనాథ్ వెళ్లుదారిలో ఈ క్షేత్రం ఉంది. 

ఈ పట్టణంనకు ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు.

108 దివ్యతిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన

ఈ క్షేత్రంలో కేదారీనాథ్ లో పుట్టిన మందాకినీ నది, బదరీనాథ్, కొండల్లో పుచ్చిన అలకనందా నది, గంగోత్రిలో పుట్టిన గంగానది మూడు నదులు ఇచ్చట కలుసుకుంటాయి.

త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రౌద్ధకర్మలకు ప్రసిద్ధి చెందినది.

బ్రహ్మచర్య వ్రతంతో నాలుగు నెలల కాలం ఇక్కడ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కల్గుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంధపురాణం వివరిస్తుంది.

ఈ దేవ ప్రయాగ దగ్గర, గంగోత్రి నుండి వచ్చిన భాగీరథీ నది గంగానదిలో కలిసిపోతుంది.

దేవ ప్రయాగ తర్వాత ఉండే ప్రవాహం గంగానది

అనే పేరుతో పిలవబడుతుంది.

అటు భాగీరథి, ఇటు అలకనంద నదులు ఈ రెండు తమ ఉనికని ఈ దేవ ప్రయాగతో కోల్పోతాయి.

దేవ ప్రయాగ ఊరు కొండ ఏటవాలులో, వరుసలుగా మెట్లు మెట్లుగా ఉంటుంది.

పురాణాల ప్రకారం, ఇక్కడ శ్రీరాముడు మరియు అతని తండ్రియైన దశరథ మహారాజు ఇక్కడే తపస్సు చేశారు.

పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించారని ప్రతీతి. ఇచ్చట సీతారాముల ఆలయం ఉంది.

భక్తులు స్వామిని “రఘునాథ్ జీ” గా కొలుస్తారు.


ఈ ఆలయానికి వెనకవైపున హనుమాన్ ఆలయం కూడా ఉన్నది.

ప్రధాన దేవాలయంలోని “నీలమేఘ పెరుమాళ్” ఆనాడు భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైనట్లు, స్వామిని పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.


ఓం నమః శివాయ..!!🙏

ఓం నమః శివాయ..!!🙏

ఓం నమః శివాయ..!!🙏

హనుమజ్జయంతి

 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము,

నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.


హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.


🌺🌸🌺 జననం 🌺🌸🌺


పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. 


హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. 


అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. 


అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.


ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. 


ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.


ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.


భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. 


హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.


జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.


♦🔔♦ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది: ♦🔔♦


హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.


1. ప్రసన్నాంజనేయస్వామి.

2. వీరాంజనేయస్వామి.

3. వింశతిభుజాంజనేయ స్వామి.

4. పంచముఖాంజనేయ స్వామి.

5. అష్టాదశ భుజాంజనేయస్వామి.

6. సువర్చలాంజనేయ స్వామి.

7. చతుర్భుజాంజనేయ స్వామి.

8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.

9. వానరాకార ఆంజనేయస్వామి


తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!


దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.


💠💠💠 ఆయన అష్టసిద్ధులు 💠💠💠


1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.


2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.


3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.


4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.


5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.


6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.


7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.


8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.


🌀🌀🌀 హనుమంతుని ప్రదక్షిణాలు 🌀🌀🌀


హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.


'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'


శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం

తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం


శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన

శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||


అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి


''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''


అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.



ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వాట్సాప్ లో వ్యక్తిగతంగా పొందడానికి "HARI OM" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి. 


వాట్సాప్ 

6301029386

ఆంగ్లేయురాలైనా




 పుట్టుకతో ఆంగ్లేయురాలైనా, నలుగురు పిల్లల తల్లి అయి ఉండి, చంకలో ఉన్న  అల్లరి చేస్తున్న  కూతురుని ముద్దుగా, సహనంతో సముదాయిస్తూ, ఎక్కడ విసుగు, చిరాకు, కోపం లేకుండా చక్కగా, అందంగా నవ్వుతూ, తన భావాలను చాలా సున్నితంగా, హిందీలో అలవోకగా చెప్తూ, part time సంస్కృతం నేర్పుతున్నానని చెపుతుంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుందీ, అంతేగాక బోధించే స్థాయికి ఎలా ఎదిగిందీ అంతా అద్భుతమే....అయినా చాలా సాదాసీదాగా మామూలు భారతీయ గృహిణిలా  వ్యవహరిస్తున్న(ప్రస్తుత భారతీయ గృహిణులు గతితప్పియున్నారు) తీరు అమోఘం....భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తనవిగా చేసుకుని ఆచరిస్తున్న ఈ స్త్రీమూర్తి ఎందరికో స్ఫూర్తి...🙏

ఇలాంటి సంప్రదాయాన్ని జాతి,కుల,మత భేదం లేకుండా అందరూ పాటించేలా చేసిన iskcon సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలు🙇‍♀️🙇‍♀️🙇‍♀️ ఆంగ్లేయురాలైనా, నలుగురు పిల్లల తల్లి అయి ఉండి, చంకలో ఉన్న  అల్లరి చేస్తున్న  కూతురుని ముద్దుగా, సహనంతో సముదాయిస్తూ, ఎక్కడ విసుగు, చిరాకు, కోపం లేకుండా చక్కగా, అందంగా నవ్వుతూ, తన భావాలను చాలా సున్నితంగా, హిందీలో అలవోకగా చెప్తూ, part time సంస్కృతం నేర్పుతున్నానని చెపుతుంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుందీ, అంతేగాక బోధించే స్థాయికి ఎలా ఎదిగిందీ అంతా అద్భుతమే....అయినా చాలా సాదాసీదాగా మామూలు భారతీయ గృహిణిలా  వ్యవహరిస్తున్న(ప్రస్తుత భారతీయ గృహిణులు గతితప్పియున్నారు) తీరు అమోఘం....భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తనవిగా చేసుకుని ఆచరిస్తున్న ఈ స్త్రీమూర్తి ఎందరికో స్ఫూర్తి...🙏

ఇలాంటి సంప్రదాయాన్ని జాతి,కుల,మత భేదం లేకుండా అందరూ పాటించేలా చేసిన iskcon సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలు🙇‍♀️🙇‍♀️🙇‍♀️

Free services

 




తత్వవేత్తల నమ్మకాలను

 *ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదవండి*


అందరికి తెలియచేయండి


1)

*లియో టాల్స్ టాయ్ (1828-1910):*

హిందూవులు ఏదో ఒకరోజు ప్రపంచాన్ని పాలిస్తారు! ఎందుకంటే సనాతన ధర్మం జ్ఞానానికి, వివేకానికీ మేలుకలయిక.

2)

 *హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే వరకూ, ఈధర్మం.. ఎన్నో దురాక్రమణలు ఎదుర్కొంటుంది.

ఏదో ఒకరోజు ప్రపంచమంతా ఆ సనాతనధర్మం వైపే ఆకర్షించబడి ప్రశాంతంగా ఉంటుంది.

3)

*ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):*

మేధస్సు మరియు అవగాహన తోనే యూదులు అన్నీ చేయలేరని నేను గ్రహించాను. సనాతనధర్మం కూడా తోడయ్యాకే  అధ్భుత శక్తిగా మారతారు.

4)

 *హుస్టన్ స్మిత్ (1919):*

సనాతన ధర్మాన్ని పూర్తిగా ఆచరించే ఒక భారతీయుడి తెలివి మరియు అవగాహన..లతో, హిందూత్వంలో ఉన్నశక్తి ప్రపంచశాంతికి దారితీస్తుంది.

5)

 *మైఖేల్ నోస్ట్రాడామస్ (1503 - 1566):*

సనాతన ధర్మమే.. ఐరోపాను పాలించే ధర్మమవుతుంది.☝️ 

ఐరోపాలోని ఒక ప్రసిద్ధ నగరం, "సనాతన ధర్మానికి" రాజధాని అవుతుంది.

ఐదు వందల యేళ్ళ క్రితం నోస్త్ర డామస్ చేసిన ఊహ నేడు బ్రిటన్ లో నిజమైంది.

(సనాతన ధర్మ సంతతికి చెందిన శ్రీ ఋషి-శునాక్  బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యారు!)

6)

 *బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*

సనాతనధర్మం గురించి తెలిసాక గ్రహించాక..  మొత్తం మానవాళి అంతటికీ ఇదే ధర్మం అని గ్రహించాను.

ఐరోపానే కాదు, సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపిస్తుంది,

ఏదో ఒకరోజు  సనాతన ధర్మాన్ని ఆచరించేవారే *"ప్రపంచ-ఉద్దీపన"* చేస్తారు. .

7)

*గోస్టా లోబోన్ (1841 - 1931):*

శాంతి, సయోధ్యల గురించి మాట్లాడే సనాతనధర్మం యొక్క సంస్కరణలను,  క్రైస్తవులు అభినందించాలని నేను ఆహ్వానిస్తున్నాను.✅

8)

 *బెర్నార్డ్ షా (1856 - 1950):*

మొత్తం ప్రపంచమంతా ఏదో ఒకరోజున సనాతన ధర్మాన్ని అంగీకరిస్తుంది.

అదేపేరుతో కాకపోయినా "ఏదో-ఒకపేరు"తో నయినా అంగీకరిస్తుంది. సనాతనధర్మాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాల్సిందే!👍

9)

*జోహన్ గీత్ (1749 - 1832):*

మనమందరం ఎప్పుడో ఒకసారి, సనాతన ధర్మంతో కూడిన భారతీయతను అంగీకరించాలి.

*అది, మానవాళిని ఉద్ధరించే నిజమైన మానవీయ ధర్మం!*

      👇


*భారతీయులారా...! ఇదీ, "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం.*

         🚩🚩🚩🚩🚩🚩