10, నవంబర్ 2020, మంగళవారం

దివ్య ఔషధం శొంఠి గృతం.

దివ్య ఔషధం శొంఠి గృతం. 

నాకు కడుపులో మంట, తిన్నది అరగటంలేదు, నాకు గ్యాసు, నాకు కడుపులో నొప్పి, నాకు మోషన్ సరిగా అవటం లేదు. నాకు కడుపు ఉబ్బరం. నీరసంగా వుంటున్నది కానీ ఆకలి కావటంలేదు. అన్నం చూస్తే వెగటుగా వుంటున్నది, అన్నం తినాలని అనిపించటం లేదు. ఈ రకమైన బాధలు అన్ని కానీ కొన్ని కానీ లేక ఏదో వక్కటి కానీ లేనివాళ్లు నూటికి 50 మంది కన్నా ఎక్కువగా ఉంటారంటే ఆశ్చర్య పడవలసిన పనిలేదు.  మీకు జీర్ణాశయానికి సంబందించిన ఏ సమస్య ఐనా సులువుగా ఇంట్లోనే తయారుచేసుకునే మందుతో పరిష్కరించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా. కానీ ఇది నిజం నూటికి నూరు పాళ్ళు మీకు ఉపయోగ పడుతుంది. మీరు చేసుకొని వాడి మీ తోటివారికి కూడా వాడమని చెప్పండి. 

శొంఠి అంటే తెలియని వారు వుండరు. ఇది మామూలు అల్లంను ప్రాసెస్ చేసి తాయారు చేసిందని మనలో చాలామందికి తెలియక పోవచ్చు. కానీ ఇది కూడా అల్లం యొక్క ఔషధ రూపం అని చెప్పవచ్చు. అల్లం కూడా చాల విధాలుగా మనకు ఆరోగ్య కరం. కానీ శొంఠి ఇంకా చాల ఉపయోగకరం. 

ఇప్పుడు శొంఠి గృతానికి కావలసిన పదార్ధాలను చూద్దాం. 

శొంఠి పొడి. దీనిని మనం సూపర్ మార్కెట్లలో కొనుక్కోవచ్చు లేదా శొంఠిని తీసుకొని దానిని మెత్తని పొడిగా మిక్సీ పట్టి కూడా తయారు చేసుకోవచ్చు. 

ఇక గోగృతం అంటే ఆవు నెయ్యి. మీకు నమ్మకంగా మార్కెటులో దొరికితే కొనండి. లేకపోతె రాందేవ్ బాబా స్టోరులో మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది అక్కడ తీసుకోండి. . 

కొంత సింధవ లవణం లేక మాములు ఉప్పు. 

తయారు చేసే విధానం. 

మీరు శొంఠి గృతం యెంత చేయాలని  అనుకుంటున్నారో అంతకు సగం ఆవు నెయ్యి మిగిలిన సగభాగం శొంఠి పొడి తీసుకొని రెంటిని పూర్తిగా కొంచం సైన్ధవ లవణం కానీ మాములు ఉప్పుకాని కలిపి మొత్తం ఒక పేస్టులాగా చేయండి దానిని ఒక గాజు సీసాలో తీసుకోండి. ఈ మిశ్రమాన్నే శొంఠి గృతం అని అంటారు. 

ఉపయోగించే విధానం. 

మీరు రోజు భోంజనఁ చేసే ముందు ఒక చెంచా శొంఠిగృతం తీసుకొని దానిని కొంచం అన్నంలో కలిపి ఒక ముద్దగా చేసి దానిని మొదటి ముద్దగా తినండి తరువాత మీ పూర్తి భోంజనం చేయండి. 

మీరు ఈ విధంగా వాడిన తరువాత రెండు మూడు రోజులలో మీ అనారోగ్యం నయం అవుతుంది. శొంఠి జీర్ణ వ్యవస్థను బాగు పరుస్తుంది. ఆవు నెయ్యి చాలా మంచిది అది మీ ఆహరం పేగులలో సాఫీగా ప్రయాణించటానికి మరియు మీకు మంచి కోలాస్త్రలును అనిడిస్తుంది. ఈ రెంటి మిశ్రమము మీకు చాలా మంచిగా పనిచేస్తుంది. రోజు ఉదయం భోజనములో ఒక చెంచా రాత్రి భోజనములో ఒక చెంచా మాత్రమే వాడండి. పిల్లలకు వారి వయస్సును పట్టి అరచెంచా లేక అంతకన్నా తక్కువ వాడండి. 

గమనిక: ఇది చాలా సురక్షితమైన మందు ఐనా మీరు వాడటం వలన మీకు ఏమైనా సైడు ఎఫెక్ట్స్ వస్తే ఈ రచయిత భాద్యత లేదు గమనించండి. 

ఇది ఉపయోగించి లబ్ది పొందిన మిత్రులు మీ అనుభవాన్ని షేర్ చేస్తే సంతోషంగా ఉంటుంది, మరియు  నలుగురికి ఉపయోగ పడుతుంది. మరొక వైద్య విదితో ఇంకోసారి కలుదాం. 

మీ 

సి. భార్గవ శర్మ 

ఓం తత్సత్. 

సర్వ్యజన సుఖినో భవంతు. 

జీవిత పాఠాలు

 *జీవిత పాఠాలు. 

ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు... లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు. ప్రతి జీవితం ఎలా జీవించాలో, జీవించకూడదో తెలియజేసే ఒక పాఠం అవుతుంది. నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలేగానీ... ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

పుస్తక పఠనం ద్వారా ఎంత నేర్చినా, మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు. ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం.

నాన్ననుంచి క్రమశిక్షణ, అమ్మనుంచి సందర్భోచిత నాయకత్వ లక్షణాలు, మామ్మనుంచి మనశ్శక్తి, తాతయ్యనుంచి అప్పగింతలు, తోబుట్టువులనుంచి క్షమ, మరపు... ఎన్నో నేర్చుకోవచ్చు. మనిషి కళ్లు తెరిచిన దగ్గర్నుంచీ నేర్వదగ్గ పాఠాలు బోలెడు.

మీరా నుంచి భక్తి, హనుమనుంచి సమర్పణ భావం, మహాత్మాగాంధీ సంకల్పబలం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో స్టీవ్‌ జాబ్స్‌నుంచి, ఎడిసన్‌ నుంచి పట్టువిడవని సాధన... ప్రతి జీవితం జ్ఞానసముపార్జనకు అద్భుత అవకాశం కల్పిస్తుంది. మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచడమనేది కీలకం. లోపల ఉండే అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఎవరినుంచైనా, దేనినుంచైనా, ఏ పరిస్థితిలోనైనా నేర్చుకోవడమన్నది విడవకూడదు. చాలామందిలో పాఠశాల రోజులతోనే నేర్చుకోవడం ఆగిపోతుంది. అటువంటి బతుకు నిరర్థకంగా తయారవుతుంది.

మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలంటే, ఆరోగ్యంగా ఎదగాలంటే- అధ్యయనం జీవితాంతం సాగాలి. అది శ్వాస తీసుకోవడంలా, తుదిక్షణాల వరకు నిలవాలి.

ఆటపాటల్లో మునిగితేలే పిల్లల్ని చూస్తే వర్తమానంలో జీవించడమంటే ఏమిటో బోధపడుతుంది.

ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించేదంతా అనుభవం అవుతుంది. అది పరిపక్వతను పెంచుతుంది.

ప్రాముఖ్యం లేని సంఘటనలు సైతం అద్భుతమైన అవకాశాలై జీవితంలో గొప్ప అనుభవాలుగా నిలుస్తాయి. ఎందరికో మార్గదర్శకం అవుతాయి. ఐన్‌స్టీన్‌, ఆర్కిమెడిస్‌, న్యూటన్‌ పరిశోధనలు మానవ జీవనశైలినే మార్చేశాయి. ఆ పరిశోధనలన్నీ ఏ మాత్రం ప్రాధాన్యం తోచని అనుభవాలుగా మొదలై వెలుగులోకి వచ్చినవే.

కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవగతమవుతుంది మనిషికి... పరిపక్వతకు ఒక అడుగు తక్కువలో ఉందన్న విషయం. పరిస్థితులకు తలకిందులైపోయి, చెదిరిపోయి, ఉద్విగ్నతకు లోనై నిరుత్సాహపడితే నేర్చుకునేది ఏమీ లేకపోగా- అవే పరిస్థితులు పునరావృతమవుతుంటాయి.

జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు, ఏళ్లు పడితే... మరికొందరికి జీవితకాలం సరిపోదు.

అనుభవాలు రకరకాలు. జయాపజయాలు, మంచి చెడులు, అనుకూల ప్రతికూలాలు... ప్రతి అనుభవం ఒక పరీక్షే. అవన్నీ ‘నేటి’నుంచి ఎలా ఉండనుందో తెలియని రేపటికి తీసికెళ్ళేందుకు మనిషిని సిద్ధం చేయడం కోసమే.

తాను చేసే పొరపాట్లవల్ల మనిషి లోతైన పాఠాలు నేర్చుకుంటాడు. అపజయాలు గుర్తుండిపోయే పాఠాలు నేర్పుతాయి. విజయం ప్రేరణనందిస్తే, పరాజయం బోధకుడి పాత్ర పోషిస్తుంది. మనిషి పొరపాట్లకు మానసికంగా చలించిపోతే ‘రేపు’ కొత్తగా ఉండదు. బతుకు భారమనిపిస్తుంది.

జీవితం ఒక ఆట. లెక్కకు మించిన అవకాశాలను, సవాళ్లను దారిపొడుగునా విసురుతూనే ఉంటుంది. పట్టుదల ఉంటే వాటినందుకుంటూ జీవితాన్ని మెరుగుపరచుకుంటూ మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు. 

(ఈనాడు అంతర్యామి)

✍🏻మంత్రవాది మహేశ్వర్

భీమేశ్వర జ్యోతిర్లింగము

 *🚩భీమేశ్వర జ్యోతిర్లింగము🚩*


భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు.


యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ!


సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!!


ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామము ఉన్నది. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉన్నది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము.


లింగపురాణం వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి. ఆయన ప్రభంజనుడు. అటువంటి వాడికి శంకరుడు ‘నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి’ అని చెప్పాడు. వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు. ప్రభంజనుడై వాయువు  శరీరములు నిలబడడానికి పది రకములయిన కర్మలను లోపల ఉండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే బ్రతుకే లేదు.


పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటుడు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. పెరిగి పెద్దదయి యౌవనంలోకి వచ్చింది. తగిన సంబంధం చూడాలి. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్ళి చేశారు. కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడకి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదళీ వనంలో వున్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినవాడు అపారమయిన బలవంతుడు అవాలని ఆమె కోరుకుంది. తన కొడుకు తన భర్త విరాధుడిని, కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లాడిని ‘భీమః’ అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే గొప్పబలం ఉన్నవాడని అర్థం.


వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు. వాడు ఒకనాడు తల్లిని “నాన్నగారు ఎక్కడ” అని అడిగాడు. అపుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది. విష్ణువు గురించి లోకములనన్నింటిని వెతికి వెతికి విసిగిపోయాడు. ఎవడయినా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులన్దరినీ చెణకుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజును ఓడించి తీసుకు వచ్చి కారాగారంలో పెట్టాడు.


సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజూ లింగార్చన చేస్తూండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు. అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈవిషయం రాజుకు చెప్పారు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు? ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వరా! నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు.


ఎప్పుడయితే తన చేతిలో ఉన్న చంద్రహాసమును విసిరాడో అంతటా నిండి నిబిడీ కృతమయి ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగంలోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు ‘భీముడు’ అని చెప్పుకున్నాడు. భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు.


ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద. ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థమునకు విష్ణురూపం రావాలి కదా! అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు – వామదేవ, వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు. వామదేవ అంటే పరమశివుడు. ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు ‘మ’ ‘సు’. ఇప్పుడు ‘సు’ పక్కన ‘మ’ పెట్టండి. ‘సుమ’ అవుతుంది. ‘సుమం’ అంటే పువ్వు. పువ్వు అనగా జ్ఞానం. జ్ఞానం కలిగి తెలుసుకుంటే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు అవుతారు. నామములు, రూపములు మారాయి. తత్త్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్ధం. శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళినా, రావణాసురుని పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివ స్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా, శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు.   ఉన్నది ఒక్కటే పదార్థము. ‘ఏకోదేవః సర్వభూతాంతరాత్మా స్రవభూతాభివాసః సాక్షీచేతోకేవలోనిర్గుణస్యా’ అంది వేదం. ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది.  భీమః –  ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదయినా ఇవ్వగలిగిన వాడు.  ఆ స్థితిలో వచ్చి రాక్షససంహారం చేసి తన భక్తుడయినవాడికి రాజ్యాధికారం ఇచ్చి, తదనంతరం మోక్షమునిచ్చినవాడు.


ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ  ఎటువంటి దుఃఖములు రాకుండా కాపాడి రక్షిస్తాడు.

తల్లితండ్రుల గొప్పదనం

 *తల్లితండ్రుల గొప్పదనం గురించి  శాస్త్రాలలో చెప్పబడిన విధానం.*

======================


01. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.


02. ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి0


03. ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.


04. సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.


05. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.


06. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.


07. ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం


08. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.


09. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే  అని ధర్మశాస్త్రం చెబుతోంది.


10. తల్లిని మించిన దైవం లేదు - గాయత్రిని మించిన మంత్రం లేదు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

నామ స్మరణం..ముక్తిమార్గం!*

 🚩🛕 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🚩🛕

=======================


*నామ స్మరణం..ముక్తిమార్గం!*


రాబోయే కాలంలో ఎలాంటి సంఘటనలు, ఉపద్రవాలు సంభవిస్తాయో బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మనకు తెలియని మరో సంగతి ఏంటంటే, ద్వాపర యుగం ముగిసిన తరువాత రాబోయే కలియుగంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో కృష్ణ భగవానుడు కూడా ముందే చెప్పాడు. కలి ప్రభావం వల్ల మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, పాపకర్మలు ఎలా పెరిగిపోతాయో ఆయన తన అవతార సమాప్తిలో చెప్పాడు. అంతేకాదు, కలి ప్రభావం నుంచి బయటపడి, పాపకర్మలను అధిగమించి, పుణ్యకార్యాలవైపు ఎలా వెళ్లాలో కూడా సూచించాడు.


*ద్వాపర యుగాంతం...*


శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఉద్ధవుడిని పిలిచాడు. తన నిర్యాణం తరువాత కలి ప్రవేశం జరుగుతుందనీ, ఏడో రాత్రి లోపల ద్వారకానగరం అంతా సముద్రమయం అయిపోతుందనీ చెప్పాడు. కలి ప్రవేశించిన తరువాత మనుషుల ఆలోచనా ధోరణి, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. అయినప్పటికీ భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రం సులభసాధ్యమంటూ కలియుగం గురించి ఇలా వివరించాడు కృష్ణుడు. ఉద్ధవా! కలి ప్రవేశించగానే రెండు విషయాల పైన ఈ ప్రపంచం ఆధారపడుతుంది. ఒకటి కోపం. రెండవది విపరీతమైన కోర్కెలు. వీటివల్ల మనుషుల్లో ఆయుర్దాయం తగ్గుతుంది. విపరీతమైన కోర్కెలతో సంతృప్తి లేకుండా మనుషులుంటారు. తద్వారా ప్రశాంతత కరువై, తీవ్రమైన వ్యాధులు ప్రబలుతాయి. ఒక పక్క దైవభక్తి తగ్గుతుంది. మరోపక్క ఏ దేవతామూర్తి కోర్కె తీరుస్తుందంటే అటు పరుగులు పెడతారు. అంతేగాని దేవుడొక్కడే అంటే ఒప్పుకోరు. మతాల ఆధారంగా పరమాత్మ పట్ల భేదం చూపిస్తారు. సర్వాంతర్యామి అయిన భగవంతుడిలో రూపాన్ని బట్టి రకరకాల భేదాలు చూపి, కొట్టుకుంటారు. భక్తిలేని వాడు దేవుడి పనులను, గుడి నిర్మాణాలను చేపడ్తాడు. 


వేదాల్ని, యజ్ఞ యాగాదుల్ని ధిక్కరిస్తారు. అర్హత లేనివాళ్లు ఆయా పనుల్లో నిష్ణాతులమంటారు. యోగ్యత, పాండిత్యం వల్ల మనుషులు గౌరవింపబడరు. డబ్బు ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్లనే గౌరవిస్తారు. ఇంద్రియాలకు బానిసలవుతారు. తద్వారా అంతశ్శుద్ధి కోల్పోతారు. ఇంద్రియాలతో మనకు ఏదైతే సుఖాన్నిస్తుందో అది మన జన్మను పాడు చేస్తుందనే జ్ఞానాన్ని కోల్పోతారు. అయితే కలియుగంలో దైవనామం చెప్పినంత మాత్రాన వాళ్లకు పుణ్యం లభించి, పాపకర్మల నుంచి విముక్తులవుతారు. అందుకే బదరికాశ్రమం వెళ్లి, నా మూర్తిని ఆశ్రమంలో ఉంచు. ప్రతిరోజూ భగవన్నామం కొంతసేపైనా చెప్పు. కొన్ని పూలు ఆ మూర్తిపై వేయి. అప్పుడు ఆ మూర్తి అహంకారాన్ని తగ్గించి, పుణ్యం వైపు నడిపిస్తుంది. పాపకర్మల నుంచి విముక్తులవడానికి కలియుగాన ఉన్న సులభమార్గమిది. 


*పరమాత్మను చేరే మార్గం..*


పాపకర్మలన్నీ పెరిగిపోయినప్పటికీ కలి ప్రభావం నుంచి బయటపడి, భగవంతుని చేరుకోవడానికి మనం చేయాల్సిన కర్మల గురించి సూచనలు చేశాడు కృష్ణ భగవానుడు. 

దైవ నామస్మరణ, ఎక్కువసార్లు అనవసర విషయాలు మాట్లాడకుండా మౌనం పాటించడం, దైవపూజ, ఇంద్రియ నిగ్రహం, జపం.. వీటిని పాటిస్తే చాలు పాపాల నుంచి విముక్తులమై ఆయన అనుగ్రహం పొందవచ్చు. అంతేకాదు, కోర్కెలను తీర్చుకునే మార్గాలూ ఇవే. అయితే అమ్మో! ఇన్ని చేయాలా అని అన్పిస్తుంది మనకు. కానీ ప్రతిరోజూ దైవనామం స్మరించే సమయాన్ని పెంచుతూ పోవాలి. సాధారణంగా మనం ఏదో ఒక కోర్కె తీరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కాని ఇది సరైన పద్ధతి కాదు. అంతశ్శుద్ధి, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలి. నామస్మరణతోనే కరుణించే స్వామి వాటిని మనకు ప్రసాదిస్తాడు. అంతశ్శుద్ధితో భక్తి దానికదే వస్తుంది. భక్తి చింతనతో మనకు కావాల్సింది కోరుకుంటే చాలు ఆయనే ఇస్తాడు. అయితే సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నాకు కావాల్సిందేమిటో తెలియదా! ప్రత్యేకించి కోరుకోవడమెందుకు.. అని కూడా అన్పించొచ్చు. కాని మన తోటివారితో, స్నేహితులతో ఎందరితోనో మనకు ఫలానా సమస్య ఉందనీ, కష్టం ఉందనీ చెప్పుకుంటూ ఉంటాం. మానవమాత్రులెవరూ తీర్చలేని కష్టాన్ని కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు. ఆయన జగద్రక్షకుడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే రక్షకుడితో చెప్పుకుంటే బాధ తగ్గుతుందీ, కష్టమూ తీరుతుంది. ఆయా సమస్యల నుంచి విముక్తులమూ అవుతాం. 


*ఇంద్రియ నిగ్రహం.. ఇలా సాధ్యం!*


వివాహం అయిన స్త్రీ తల్లితో సమానమనే భావన కలియుగంలో తగ్గిపోతుంది. పరస్త్రీలు, పర పురుషులపై మోహం కలగడం కలియుగ లక్షణం. దీనికి వివాహంతో సంబంధం లేదు. కలి ప్రభావం వల్ల కలిగే ఈ మోహాల నుంచి బయటపడడానికి కూడా సులువైన మార్గం ఉంది. ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు మోహం కలిగితే - ఇంత అందంగా ఉన్న ఈ అమ్మ కన్పించి కరుణించింది. పొద్దున్నే మా అమ్మ జగన్మాత కనిపించి ఆశీర్వదిస్తున్నది అని అనుకోవాలి. అదేవిధంగా పరపురుషుని పట్ల మోహం కలిగినప్పుడు స్త్రీలు - కృష్ణా! నీ జగన్మోహనాకార దర్శనం ఇచ్చావా తండ్రీ! అని అనుకోవాలి. ఇలాంటప్పుడు పాపచింతన కాస్తా పుణ్యం వైపు దారితీస్తుంది. పాపకర్మలను పుణ్యకర్మలుగా మార్చుకునే సాధనం ఇది. క్రమంగా మనసుకు ఇది అలవాటై పోతుంది. ఇక పాపకర్మల వైపు మనసు మళ్లదు. అలాంటి వాళ్ల మనసు నిర్మలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు.

9, నవంబర్ 2020, సోమవారం

మహాభారతంలో ధర్మరాజుపాత్ర

 మహాభారతంలో ధర్మరాజుపాత్ర       నన్నయ భట్టారకుడు భారతం లో ఉన్న వీరుల గురించి వినుత పరాక్రమముల్ ధృతి వివేకుల్ నిత్య సమన్వితుల్ యశోధ నుల్ కృతజ్ఞులు త్తములుధర్మపరుల్ శరణాగతా ను కం పనుల నగా ప్రసిద్ధులగు భారత వీరులు అని ప్రశంసించి నాడు అట్టిపాత్రలలో ధర్మజుడు ఉత్తముడు ఆ పాత్ర చిత్రణ తిక్కన తన అమర లేఖిని నుండి మనోహర రూపకల్పన గావించినాడు విరాటపర్వం తిక్కన చిత్రించినపాత్రలన్నియుఏ బిగి బిగిసెడక జవసత్వములు వీడక పయనించిన వి ధర్మరాజు విరాట నగరముచేరినది మొదలుయుద్ద యజ్ఞం పూర్తి వరకు ధీరోదాత్త నాయకుడై మెత్తని పులియైమెలంగి నాడు సత్య ధర్మ మునకైజీవితాంతము వరకు పరిశ్రమించి నాడుస్వధర్మ నిర్వహణకై ధర్మరాజు ఉదయించిన కారణజన్ముడు స్వధర్మ విదుడు సంత త శాంతశీలుడు సమంచిత సత్య సంపన్నుడు సంగర విద్య కోవిదుడు కరుణ కలిత హృదయుడు సోదర గౌరవాను రాగములు ప్రజాభిమానం చూరగొన్న పురుషుడు శ్రీ కృష్ణ భక్తి తత్పరుడుభీష్మోపదేశమున నిరుపమాన ధర్మాత్ముడైన మహనీయుడు నిరుపమాన ప్రజాశాంతి సామ్రాజ్య స్థాపనకు అశ్వమేధ మొనరించిన గౌరవ రాజ్యలక్ష్మి వల్ల భుడైన పుణ్యాత్ముడు సేవా తత్పరత ప్రజా పరిపాలన శీలుడు నీతి నియతి అసాధారణ త్యాగం శౌర్య ధైర్య వెలుగొందిన ఉత్తమ నాయకుడు  

ఆంధ్రసాహిత్య సంగ్రహ చరిత్ర నుండి సేకరణ

జయలక్ష్మి పిరాట్ల

శివ_ఆరాధనకు_శ్రేష్ఠమైన_ప్రదోష_సమయము

 #శివ_ఆరాధనకు_శ్రేష్ఠమైన_ప్రదోష_సమయము అంటే ఏమిటి? అసలు #ప్రదోషము ను ఎలా పరిగణిస్తారు?


▪️త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం..


▪️త్రయోదశి సోమవారం వస్తే సోమ ప్రదోషం.


▪️త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం..


▪️త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం..


▪️త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం..


▪️త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం..


▪️త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు...


అన్ని త్రయోదశుల లోనూ శివపూజ తప్పనిసరి..


#ప్రదోషము అంటే పాప నిర్మూలన అని అర్థము.. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయము లో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము... అనగా.., 


చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు #ప్రదోషము అంటారు.. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు #ప్రదోషము కలిగే అవకాశము ఉంది...


ఓం నమఃశివాయ... 🙏🙏🙏

కంచి కామకోఠి పీఠాధిపతులు,* *ప్రాతఃస్మరణీయులు*

 *కంచి కామకోఠి పీఠాధిపతులు,* *ప్రాతఃస్మరణీయులు*


 *శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు* పశ్చిమ గోదావరి జిల్లా "తణుకు" వచ్చారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానమంటే ధర్మానుష్ఠానమే అలా చేసేవాడు. ఆ బ్రాహ్మణుడికి పరమాచార్య స్వామిని దగ్గరగా చూడాలని కోరిక. రెండు రోజులు ఆయన విడిది వద్దకు వెళ్ళాడు. ఆ రెండు రోజులూ విపరీతమైన జనం. స్వామివారిని దూరం నుండే చూసి, ఆయన దగ్గరకు ఎలా వెళతాను, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడం అనవసరం అని, అక్కడి నుండే నమస్కరించి, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు.


శ్రీమహాస్వామి వారు తెల్లవారుఝామున రెండు గంటలకు ఎవరికీ చెప్పకుండా బయలుదేరి, కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. *ఆయనకి ఇల్లు ఎలా తెలుసు* *అనకూడదు.* *ఆయన పరబ్రహ్మస్వరూపులు, త్రికాలవేది.* *"ఆయనకు తెలియనిది ఉండదు.* స్వామివారు ఆ బ్రాహ్మణుడి ఇంటి వద్ద కూర్చుని జపం చేసుకుంటున్నారు.


ఆ బ్రాహ్మణుడి ఇల్లాలు కళ్ళాపి చల్లటానికి బయటకు వచ్చింది. కళ్ళాపి చల్లి పక్కకు చూస్తే మహాస్వామి వారు ఉన్నారు. ఆమె హడలిపోయింది. "నడిచే దేవుడు" అని పేరుగాంచిన వ్యక్తి, ప్రపంచంలో కోన్ని కోట్లమంది ఆయన పాదాలనుకూర్చొని తలచుకొని నమస్కరిస్తారు. అటువంటి ఆయన తన ఇంటి అరుగుమీద కూర్చుని ఉన్నారు. పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. ఆ బ్రాహ్మణుడు నిద్రమంచం మీద నుండి దూకి బయటకు వచ్చి నేలమీద పడి నమస్కరించి ఏడుస్తూ, "మహానుభావా! మాదగ్గర కు ఇంటికి వచ్చారా?" అన్నాడు.

అప్పుడు మహాస్వామివారు "రెండు రోజులుగా నా దగ్గరకు వస్తున్నావుగా! ఈయన దగ్గరకు వెళ్ళగలనా, నన్ను పలకరిస్తారా అనుకున్నావు.


 *ధర్మానుష్ఠానం చేసేవారి* *దగ్గరకు నేను రాను* *అనుకున్నావు! అందుకే, నేనే* *వచ్చాను" అన్నారు.*


*"మహాత్ముల దృష్ఠిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము"* *అనుకోకూడదు! ఏ మూల* *కూర్చుని ధర్మానుష్ఠానం* *చేస్తున్నా మహాత్ముల* *దృష్టిలోనికి వెళ్ళి తీరుతారు.* *సత్పురుషుల దృష్టిలో పడటం జీవితంలో* *గొప్ప అదృష్ణం"*

ధార్మికగీత - 75*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత - 75*

                                     *****

      *శ్లో:- కార్యేషు  దాసీ౹ కరణేషు మంత్రీ ౹*

             *రూపే  చ  లక్ష్మీ:౹ క్షమయా  ధరిత్రీ ౹*

             *భోజ్యేషు  మాతా౹ శయనే  తు  రంభా ౹*

             *షట్కర్మయుక్తా కులధర్మపత్నీ ౹౹*

                                     *****

*భా:-1.గృహము, భర్త, బిడ్డలు, అతిథులు,బంధుమిత్రుల విషయమై దాసీ కంటే మిన్నగా అనన్యమైన సేవలు అందించినా, సతీత్వధర్మంగా అన్వయించుకొనేది ; 2. పెళ్లి,కట్నాలు,కానుకలు, పిల్లల  ఫీజులు, మర్యాదలు,వేడుకల వంటి  జటిలమైన ఆర్ధిక సమస్యలలో, తమ అంగ, ఆర్ధిక బలాల ప్రతిపత్తితో భర్తకు ఆలోచనా పరంగా "మంత్రి"గా వ్యవహరించేది ;    3. సాంప్రదాయ రూపురేఖలతో, సదాచారాలతో అందరి చేత "శ్రీ మహాలక్ష్మి"గా పూజ్యభావనతో మన్ననలందుకొనేది ; 4. కష్ట సుఖాల్లోను, లాభనష్టాల్లోను, గెలుపోటములందును, సిరిసంపదలలోను పొంగక, క్రుంగక సహనగుణంలో  గంభీరమైన "సముద్రము"తో పోల్చగలిగినది ; 5. మృష్టాన్న పానీయాలు తన, పర భేదం లేకుండా రుచిగా, శుచిగా కొసరి,కొసరి  వడ్డించడంలో  "మాతృమూర్తి"ని తలపించేది ; 6. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో,  ధనసముపార్జనలో  అలసి, సొలసి వచ్చిన మనోనాథుని "అప్సరస"లా     తన అందచందాలతో మురిపించి,  మరపించేది--- అనే  ఆరు కర్మలతో సలక్షణమైన ఇల్లాలిని "కులధర్మపత్ని"గా  శాస్త్రాలు కొనియాడుతున్నాయి. అటువంటి గృహిణులందరు "శ్రీ వరలక్మి"  కృపాకటాక్షవీక్షణాలకు పాత్రులై , సమస్త సన్మంగళములు పొందుదురు గాక ! మంగళం మహత్!*

                                    *****

                      *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

🙏శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

🙏శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం లోనే ఆంతర్యం :

మనము పుట్టినప్పుడు పాల వలె శుద్ధ సత్వ స్వరూపముగా ఉంటాము. ఆ పాలు కుండలో పోయటం అనగా దేహము ధరించటమని అర్థము. పిడకల దావిలో పాలకుండను పెడితే ఎంతో నెమ్మదిగా సన్నటి సెగ మీద పెట్టి బాగా కాగుతాయి. ఎర్రటి రంగును సంతరించుకుని దట్టంగా మీగడ కట్టి కాగుతాయి. అనగా నిరంతరమూ సత్సంగంలో పాల్గొని గురుబోధను ఆచరణలో అనుభవిస్తుంటే దేహ సంబంధిత రుగ్మతలు పిడకలు కాలి బూడిద అయినట్లు అయిపోతాయి. సత్సంగ ప్రభావము వలన చిక్కగా, కమ్మగా పాలు తయారయినట్లు మనలో భావం తయారు అవుతుంది. ఇక పాలలో తోడు పెట్టినట్లు గురువు అనుగ్రహమును కలుపుకుంటే జ్ఞానము పెరుగు లాగా గట్టిపడుతుంది. ఆ పెరుగు అనే జ్ఞానంలో భక్తి అనే కవ్వం పెట్టి చిలుకుతుంటే దానిలోనుండి వెన్న వంటి మృదువైన పదార్థం తయారు అవుతుంది. దానిని తీసుకోవటానికి పరమాత్మ స్వయంగా వస్తాడు. అదే వెన్న దొంగలించడంలోని ఆంతర్యం. శ్రీ కృష్ణలీలలో ఎన్నో అన్వయాలు తెలుసుకుని వాటిని మన మాటలలో చెబుతూ మనను ఆనాటి కృష్ణ తత్వము అనుభవింప చేస్తున్న ప్రవచనకర్తలు ఎందరో ఉన్నారు. ఎన్ని వింటున్నా తాత్కాలికానందమే కానీ మహి మాన్విత్వమును అనుభవించటం అనేది ఎవరి పరిధిలో వారు అనుభవించవలసిందే. ఈనాటికీ స్మరించినంత మాత్రాన ఆనాటి వైభవము దృశ్యరూపంగా గోచరిస్తుంది.🙏

సేకరణ.