6, అక్టోబర్ 2023, శుక్రవారం

పుణ్యాలే మనిషిని రక్షిస్తాయి.

 గీర్వాణవాణి


వనే రణే శత్రు జలాగ్నిమధ్యే 

మహార్ణవే పర్వతమస్తకే వా

 సుప్తం ప్రమత్తం విషమస్థితం వా 

రక్షంతి పుణ్యాని పురాకృతాని.


అడవిలో,యుద్ధంలో,శత్రువులమధ్యలో,నీటిలో,అగ్నిలో,సముద్రంలో,పర్వతశిఖరంపైఉన్నా,     నిద్రితుడై,ప్రమత్తుడై ఉన్నా, సంకటస్థితిలో ఉన్నా పూర్వంచేసిన పుణ్యాలే మనిషిని రక్షిస్తాయి.

ఆలోచనాలోచనాలు

 {{{{{ ఆలోచనాలోచనాలు }}}}}} ***** అవధాన మధురిమలు *****                      00000 పంచసహస్రావధాని శ్రీజంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి 00000       సమస్యాపూరణములు         1* " బలివాకిటివాడొ, బాణువాకిటివాడో." పూరణము;--- "" కం. వెలయాలితోడి నెయ్యము/ కలుగగనే రాదు తప్పి, కలిగినొ దానిన్ / నిలుపగ రావలె నజుడో/ బలివాకిటివాడొ, బాణువాకిటివాడో!""              2* "రాతిరి సూర్యుండు సంబరమ్మున దోచెన్." పూరణము;---"" కం. ఆతత కాసారము ల/ జ్ఞాత మనోజ్ఞంబులయ్యె,జక్రము లెల్లన్/ గావరముడిగెన్/ రాతిరి, సూర్యుండు నంబరమ్మున దోచెన్.""          3* "పచ్చి మాంసంబు దినువాడు బ్రాహ్మణుండు." పూరణము;--- ""తే.గీ. బ్రహ్మవిజ్ఞాన హేతు భావప్రబోధి/ నిత్యకర్మాభి నిరతుడే ద్విజుడు కాని/ యగునె కలుద్రావ జందెమ్ము లవలద్రోసి/ పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు.""                4* "భరతున్ దునిమె రాఘవుండు భామిని కొఱకై" పూరణము;--- "" కం.హరిసుతుని బరిమార్చెను/ సిరిగురు నొప్పించె శమముచెడి రావణునిన్/ హరపదసేవనారం/ భ రతుం దునిమె రాఘవుండు భామిని కొఱకై.""                                  5*" ధరతగ్గుట హెచ్చుకొఱకె ద్వైగుణ్యముతో." పూరణము;--- "" కం. ధరణీ ప్రవాహవేగ / స్ఫురణంబునకోడి మొక్క భూమికి వంగన్/ మరియున్ లేచుటకొఱకే / ధరతగ్గుట హెచ్చుకొఱకె ద్వైగుణ్యముతో.""                దత్తపది---పెట్టె -- బెట్టు -- దిట్ట -- గట్టు -- వెద్ది  పదములతో పద్యం.             తే. గీ. " పెట్టెలోనిడి తాళంపు బెట్టువైతె / ధనము బుధులడ్గ? దిట్టవు! ఘనగుణమణి/ గణములకు రోహణంపు బెన్గట్టువెద్ది / ఘనకలాబ్ధికి జెలియలిగట్టు చెపుమ?""      వర్ణనాంశములు--- 1* లక్ష్మీ సరస్వతీ సంవాదము---        సీ. పదివేసములవాఁడు పడతి నీ మగఁడన్న చతురాస్యుఁడగు నటే చామ యనియె.                     అన్యకాంతాలోలుఁడగు నీదు మగఁడన్న, తననోట సతి నుంచుకొనునె యనియె                              పాముపానుపుమీఁదఁ బండు నీ మగఁడన్న, పూరేకులొత్తునే బోఁటి యనియె.                              నటరాజనృత్తనందనుఁడు నీ మగఁడన్న , కర్నశౌంకారోక్తికరుఁడె యనియె                                తే. గీ. సృష్టిలేకున్న నెవనిఁబోషించునన్న / సృజనగావించి యెట్లు రక్షించుననియె/ ఇట్టు లన్యోన్యవాద ప్రవృత్తలైన / వాగ్ధనాత్మక మాతలఁ బ్రస్తుతింతు.                          2* శక్తిత్రయము---                పంచ!! సురాసురేంద్రగేయ గానశోభిచారితన్ సతిన్./     సరోజనేత్ర రంజనైక చాతురీధురన్ రమన్ / వరప్రదాన కౌశలస్వభావయుక్త భారతిన్/ స్థిరస్థితిన్ శుభంబు గూర్పఁ జిత్తమందు నెంచెదన్.            3* "అయిదు భాషల మాటలతో పద్యము"----        ఉ. టైమయిపోయె ధూమశకటంబిఁక నేగు చలోరెహా కదా/ గీమునఁ గాలయంత్ర నహికెం కడునాలస మేలచేసెదో/ జామున నూరికింజని విచారణ సత్సభ నిల్వనేరమో/ యేమి యనర్థ మేర్పడు నొహేసఖ చాంగ్ల యనంగ వింటివే?        ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                         తేది 4--10--2023, బుధవారం, శుభోదయం.

నమ్మకం..రక్షణ..*

 *నమ్మకం..రక్షణ..*


"స్వామివారి సమాధి వద్దకు వెళ్ళడానికి అనుమతి ఇస్తారా?.." అంటూ ఆ యువకుడు నాలుగోసారి నన్ను అడిగాడు.."మీకు ఇందాకటి నుంచీ చెపుతూనే వున్నాను..మీవంతు రాగానే మిమ్మల్ని లోపలికి పంపుతాము..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మీకోర్కెలు తెలపుకోండి..అంతవరకూ ఇక్కడ స్థిమితంగా కూర్చోండి..అందరికీ అవకాశం కల్పిస్తాము.." అని ఒకింత అసహనంగా అతనితో చెప్పాను.."సరేనండీ..వేచి ఉంటాను.." అన్నాడు..ఆదివారం నాటి ఉదయం ప్రభాతసేవ తరువాత స్వామివారి సమాధి దర్శనానికి వచ్చే భక్తులతో..ఆ చిన్న మంటపం నిండిపోయి ఉన్నది..వరుసక్రమంలో ఒక్కొక్కరినీ లోపలికి పంపుతున్నాము..ఆ సమయం లో ఈ యువకుడు పదే పదే అడుగుతున్నాడు..అందువల్ల అసహనానికి గురికావాల్సి వచ్చింది..మరో అరగంట తరువాత..ఆ యువకుడు స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చాడు..భక్తుల హడావిడి కూడా మరో రెండు గంటల్లో సమసిపోయింది..


"ఇప్పుడు మీతో కొద్దిసేపు మాట్లాడటానికి వీలవుతుందా?.." అంటూ మళ్లీ ఆ యువకుడు నా వద్దకు వచ్చాడు.."పొద్దున లాగా హడావిడి లేదు..మీరు చెప్పేదేదో చెప్పండి.." అన్నాను..అతను నా దగ్గరగా వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు.."ప్రసాద్ గారూ..నేను మిమ్మల్ని విసిగించడానికి రాలేదు..నాపేరు మనోహర్..నా స్వానుభవం లో స్వామివారు నన్ను ఎలా కాపాడిందీ మీకు చెప్పుకోవాలని అనిపించి వచ్చాను..పోయిన సంవత్సరం దాకా నాకు మొగిలిచెర్ల కానీ..ఈ స్వామివారి గురించి కానీ ఏమీ తెలీదండీ..నేను సాయిబాబా భక్తుడిని..మా ఊళ్ళో బాబా గుడికి తరచూ వెళుతుంటాను..రెండు మూడేళ్ల కు ఒకసారి శిరిడీ వెళుతుంటాను..నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరండి..నాకు చిన్న వ్యాపారం ఉన్నది..ఆ దుకాణం మీద వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాను..మా ఇద్దరికీ లోటు లేకుండా జరిగిపోతున్నది..పోయిన సంవత్సరం నేను ఒంగోలు వచ్చానండీ..అక్కడ సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు..నా మిత్రుడు ఈ స్వామివారి గురించి చెప్పాడు..ఆరోజు సాయంత్రం అతనితో కలిసి ఇక్కడకు వచ్చానండీ..ఆరాత్రికి ఇక్కడ నిద్ర చేసాము..తెల్లవారి స్వామివారి సమాధి దర్సనం చేసుకొని వెళ్ళాము..ఆరోజే మా ఊరు వెళ్ళిపోయాను..నాలుగు నెలల క్రితం..రోడ్డు విస్తరణ చేయాలని.. మా దుకాణం తొలగించమని మా ఊరు మున్సిపాలిటీ వాళ్ళు నోటీసు ఇచ్చారండీ..ఆరోజే మా అమ్మకు విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది..బాగా మనస్తాపం చెందాను..అమ్మను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి మందులు ఇప్పించాను..పరీక్షలు చేసి ఆపరేషన్ త్వరలో చేయించుకుంటే మంచిది అన్నారు..ఎందుకనో నాకు ఈ స్వామివారు గుర్తుకొచ్చారు..స్వామికి మనసులోనే మొక్కుకున్నాను..ఆ ప్రక్క ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి..స్వామివారి సమాధి వద్ద నా వేదన చెప్పుకొని వెళ్ళాను...మీరు నమ్మండి నమ్మకపోండి..ఒక వారం రోజుల్లో..మా ఊళ్ళో మంచి సెంటర్ లో నాకు దుకాణం పెట్టుకోవడానికి మరో గది అద్దెకు దొరికింది..అదికూడా తక్కువ అద్దెకు..పాత షాప్ ఖాళీ చేసి కొత్తదాంట్లో చేరిపోయాను..వ్యాపారము కూడా మెరుగుపడింది..అమ్మ ఆరోగ్యం కుదుటబడింది..ఇక్కడికి వచ్చి మొక్కుకున్నందువల్లే నాకు మేలు జరిగిందని నాకు బలంగా అనిపించింది..ఈరోజు స్వామివారికి మొక్కు చెల్లించుకుందామని వచ్చాను..స్వామివారి సమాధిని దర్శించుకొని..స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్న తరువాతే..మీతో మాట్లాడాలని అనుకున్నాను..అందుకే ఉదయం మిమ్మల్ని తొందరపెట్టాను..ఏమీ అనుకోవద్దు.." అన్నాడు..


"స్వామివారిని నమ్మి కొలిచినందుకు మీకు మంచి జరిగింది..చాలా సంతోషం మనోహర్.." అన్నాను.."ప్రసాద్ గారూ..స్వామివారి దయవల్ల లక్షణంగా వున్నాను..వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను..నా తరఫున పెద్దదిక్కు మా అమ్మ ఒక్కతే..ఈరోజు స్వామివారి వద్ద ఆ కోరిక కూడా కోరుకున్నాను..మాలో కలిసిపోయే అమ్మాయి వస్తే చాలు..కట్నకానుకలు వద్దు..వచ్చే బుధవారం నాడు  ఇక్కడ అన్నదానం చేయించండి..మీరు కూడా నా తరఫున స్వామివారికి నా కోరిక విన్నవించండి.." అన్నాడు..ఆరోజు సాయంత్రం దాకా స్వామివారి మందిరం వద్దే వుండి..మరోమారు స్వామివారి సమాధిని దర్శించుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు..మరో రెండు నెలల తరువాత మనోహర్ కు వివాహం కుదిరిందని ఫోన్ చేసి చెప్పాడు..పెళ్లికాగానే తన భార్యను, తల్లిని తీసుకొని స్వామివారి సన్నిధికి వస్తానని చెప్పాడు..


మనోహర్ మనసా వాచా స్వామివారినే నమ్ముకున్నాడు..అతనిలో స్వామివారిపై ఉన్న భక్తి విశ్వాసాలే అతనికి అన్ని వేళలా రక్షగా ఉన్నాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Indian Rope Trick


 

Song


 

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు ///// ***** చాటుపద్య సుమ మాలిక***** తెనాలి రామకృష్ణ కవి కృతములు *****                                    1* కం. వక్కలు చేరెఁడు నేఁగొని / చొక్కాలోఁబోసికొంటి --- చొచ్చొచ్చొచ్చో (ధ్వనివైచిత్రి, వ్రాయవీలుగాని పద్ధతి) యెక్కడి దొంగలు వచ్చిరొ! అక్కఱకును లేకపోయె హరిశ్రీకృష్ణా!                          2* సీ. ప్రౌఢదీర్ఘ సమాసపదములఁ గూర్చి శ్రీనాథుండు కూలార్చె నైషధంబు.                          దానితల్లిగ నల్లసానిపెద్దన చెప్పె ముదిమదితప్పి యాముక్తమాల్య                    దూహించి తెలియరాకుండ సూరపరాజు భ్రమఁ గళాపూర్ణోదయము రచించె.                                 నతిశ్లేషశబ్దవాగాడంబరంబొప్పఁ బస ఘటించెను మూర్తి వసుచరిత్ర.               నిట్టికవులకు నేను వాకట్టు కొఱకు / చెప్పినాఁడ మదీయవైచిత్రి మెఱయ / బాండురంగవిజయమును బటిమ దనర / విష్ణువర్ధిష్ణుఁడగు రామకృష్ణ కవిని. ( సూరన కవి ఈ కవి తరువాత తరం వాడు. కావున ఇది కల్పిత పద్యమని సాహితీ విమర్శకుల భావన.)                3* మ. వరబింబాధరముం బయోధరములున్ వక్రాలకంబుల్ మనో / హర లోలాక్షులు చూప కవ్వలిమొగం బైనంతనేమాయె? నీ / గురుభాస్వజ్జఘనంబుఁ గ్రొమ్ముడియు మాకుం జాలవే? గంగ క / ద్దరి మేలిద్దరిఁ గీడునుం గలదె యుద్యద్రాజబింబాననా!          4* కం. విధుకృతకదనము వదనము/ మధుకరనికరములఁ గేరు మగువచికురముల్ / విధు మధుకరలీలాజయ / మధురోక్తులు పిక్కలౌర, మధురాధరకున్.                  5* కం. తారకములఁ గోరకముల / వారకములకెల్ల నెల్ల వారకము లిడున్ / శ్రీరమణీ హారమణీ / భారమణీయత్వదీయ పదనఖరముల్.                    6* కం. జలచరము మిడుత మ్రింగెను/ జలచరమును మిడుత మ్రింగె జగతీస్థలిలో/ వలరాజు రాజు మ్రింగెను / వలరాజును రాజు మ్రింగవచ్చినఁబడియెన్.         7* గీ. చాన నెమ్మోము గెల్చుఁ గంజాతములను / కాంత కంజాతములగెల్చుఁ గంధరమును/ కంధరమును సమదశంఖంబు గెల్చు / శంఖభావంబు నయ్యర్థచంద్రుగెల్చు.         8* కం. కమలాకర కమలాకర / కమలాకర కమలకమల కమలాకారా/ కమలాకరమైన కొలను గనిరాసుదతుల్.                   9* గీ. నాని నీనాను నేనును నాని నాను / నాన నేనును నిన్నూని నున్న నన్ను/ నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన / నిన్న నేనన్న నున్న నన్నెన్ను నన్ని.                                      10* కం. కమలాకమలామోదిత / కమలా కమలావతంస కమలాకమలా/ కమలా కమలాన్వయవర / కమలాకమలాస్య రాధఁ గానరె యిచటన్.                  తేది 3--10--2023, మంగళవారం, శుభోదయం.

నాగమణిగారి నియమం..*

 *నాగమణిగారి నియమం..*


"ఈరోజు నాగమణి గారి పేరుతో అన్నదానము అని రిజిస్టర్ లో ఉన్నది..కానీ ఇతర వివరాలేమీ లేవు..బోర్డ్ మీద అన్నదానానికి విరాళం ఇచ్చిన దాత తాలూకు గోత్రము, పేరు..ఊరు..వ్రాయాలి కదా..ఇక్కడ కేవలం నాగమణి గారు అని మాత్రమే ఉన్నది..కనీసం వారి సెల్ నెంబర్ కూడా లేదు..ఈరోజు ఇక్కడ అన్నదానం జరిపించామని వారికి తెలియచేయాలి కదా?..వారి గోత్రనామాలతో అర్చన చేయించాలి..ఇప్పుడెలా?.." అని మా సిబ్బంది నన్ను అడిగారు..నేను రిజిస్టర్ తెప్పించుకుని చూసాను..నిజమే..ఒక్క పేరు తప్ప మరే వివరాలు లేవు.."ఇది నమోదు చేసింది ఎవరు?.." అని అడిగాను.."మీరు నా పేరు వ్రాసుకోండి..ఆతేదీకి నేను వస్తాను..అన్ని వివరాలు ఇస్తాను.." అని ఆవిడ చెప్పింది సార్..ఎంత ఖర్చు అవుతుంది..అని అడిగింది..చెప్పాను..అంత మొత్తము ఇచ్చింది..రసీదు ఇచ్చాను..ఎలాగూ ఆవిడ వస్తానన్నారు కదా అని నేను మిగిలిన వివరాలు అడగలేదు..." అని సిబ్బందిలో ఒకరు చెప్పారు.."సరే..ఇప్పుడు సమయం ఏడు గంటలేకదా..?..తొమ్మిదిన్నర కు వచ్చే బస్సులో వేస్తారేమో వేచి చూద్దాము.. మరో రెండుగంటలు చూద్దాం..అన్నదానం మాత్రం నిర్వహిద్దాము.." అని చెప్పాను..


స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..మా సిబ్బంది మైకు ద్వారా..అన్నదానం ఉందన్న సంగతి అందరు భక్తులకూ తెలియచేశారు..ఆరోజు మంగళవారం..ఉదయం తొమ్మిదిన్నర సమయం లో వచ్చిన బస్సులో కొందరు భక్తులు వచ్చారు కానీ..అన్నదానానికి విరాళం ఇచ్చిన నాగమణి గారు మాత్రం రాలేదు..మరో అరగంట గడిచింది..స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుండి దంపతులు దిగారు..వారి వెనకాలే నాగమణి గారు కూడా వచ్చారు..మందిరం లోపలికి వచ్చి..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేను కూర్చున్న స్థలం వద్దకు వచ్చి.."నా పేరు నాగమణి అండీ..ఈరోజు ఈ స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం ఏర్పాటుకు నాకు అవకాశం దొరికింది..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని మీ సిబ్బంది చెప్పారు.." అన్నారు.."అమ్మా..ఉదయం నుంచీ మీ గురించే మేము మథనపడుతున్నాము..మీ తాలూకు వివరాలేవీ మా వద్ద లేవు..ఈకార్యక్రమం జరుపుతున్నామని మీకు తెలియచేయాలి కదా..అలాగే మీ గోత్రనామాలతో అర్చన చేయడానికి కూడా ఇబ్బంది వచ్చింది..మీరే వచ్చారు కనుక ఇక మాకు బాధలేదు.." అన్నాను..నాగమణి గారు నా వైపు చిరునవ్వుతో చూసి.."నేను వస్తానని చెప్పే వెళ్ళాను బాబూ..ఆరోజు మీరు లేరు.." అన్నారు..


తనతో వచ్చిన దంపతులను నాకు చూపిస్తూ.."వీళ్ళిద్దరూ నా తమ్ముడూ మరదలూనూ..అసలు వీళ్ళగురించే నేను ఈ స్వామిదగ్గరకు వచ్చాను..వీడిపేరు రాజేశ్వరరావు..అమ్మాయి ప్రసూనాంబ..అమెరికా లో వుంటారు..వీళ్లకు ఇద్దరు పిల్లలు.. మూడేళ్ళ క్రితం వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు..వీడి చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసాడు..మాటల్లో రెండు మూడు రకాల వ్యాపారాలు చెప్పాడు..కొద్దిగా పెట్టుబడి పెడితే..ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు..మా తమ్ముడు ఆశ పడ్డాడు..సరే అన్నాడు..ఆ స్నేహితుడి మాటలు నమ్మి..ఏ కాగితాలూ లేకుండా కొంత డబ్బు ఇచ్చాడు..ముందు కొద్దిగా పెట్టుబడి చాలు అని చెప్పిన ఆ స్నేహితుడు..వీడి నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు..తీరా వీడు ఇక్కడికి వచ్చి విచారిస్తే..మోసపోయానని తెలుసుకున్నాడు..ఆ స్నేహితుడి వద్ద కొన్ని భూముల తాలూకు పత్రాలు తప్ప మరేమీ లేవు..ఆ భూముల కాగితాలు వీడి చేతిలో పెట్టి..ఇంతకంటే ఏమీ చేయలేను..అని తేల్చి చెప్పాడు..అవి ఎవరూ కొనే భూములు కూడా కాదు..మావాడు బాగా దిగులు పడ్డాడు..అప్పుడు నేనే సలహా ఇచ్చాను.."నాయనా మనం ఒకసారి మొగిలిచెర్ల వెళ్లి ఆ దత్తాత్రేయుడి ని శరణు వేడదాము..ఏదో ఒక దారి చూపిస్తాడు..నువ్వు దిగులుపడకు..నీ కష్టార్జితం అయితే ఎక్కడికీ పోదు.." అని చెప్పాను..వీళ్లిద్దరి తరఫున నేనే ఇక్కడికి వచ్చాను..మొత్తం పదకొండు ఆదివారాలపాటు ఒక నియమం అనుకోని ..ప్రతి ఆదివారం ఈ స్వామివద్దకు సాధారణ భక్తులతో పాటు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని..వీళ్ల గురించి ప్రార్ధించి వెళ్ళాను..స్వామివారు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు అని నా మనసుకు తోచింది..అందుకు తగ్గట్టుగానే..పోయిన నెలలో ఈ అవధూతకు మామీద దయ కలిగింది..అనుకోకుండా వీడి వద్ద ఉన్న భూముల కు రేటు వచ్చింది..అగ్రిమెంట్ అయింది..కొంత డబ్బూ చేతికి వచ్చింది..అందుకే ఈరోజు అన్నదానం చేయిస్తానని మొక్కుకొని..వీళ్ళిద్దరినీ పిలిపించాను..ఈరోజు మంగళవారం అయినా..ఈరోజే అన్నదానం చేయడానికి కారణం ఉంది..ఈరోజు వీడి పుట్టినరోజు..స్వామివారి దయవల్ల మా తమ్ముడు నిరాశ లోంచి బయటపడ్డాడు.." అని చెప్పారు..


నాగమణి గారు పదకొండు ఆదివారాలు.. స్వామివారి మందిరానికి వచ్చి వెళ్లిన విషయం మేమెన్నడూ గమనించలేదు..


ఆరోజు అన్నదానానికి బోర్డ్ మీద తమ పేర్లు ఏవీ రాయవద్దని నాగమణి గారు కోరారు..స్వామిచూపిన కరుణ తమ మీద ఎల్లకాలమూ ఉంటే చాలని..తమ పేర్లు ప్రచారం చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు..అందరూ ఆరోజు అర్చన చేయించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం నాగమణి గారు తిరిగి వెళ్లిపోయేముందు నా వద్దకు వచ్చి.."స్వామివారు కరుణించబట్టి మావాడికి తన సొమ్ము లభించింది..ఈ క్షేత్రం అభివృద్ధికి సహాయం చేయమని సలహా ఇచ్చాను..నలుగురికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా నాకు తెలియచేయండి..తప్పకుండా మా వంతు సహకారం మేము అందిస్తాము.." అన్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మంచి మాటలు

 💐 *

     T.Kashinatham.


       🌷 ** 🌷

    🪷 *మంచి మాటలు* 🪷

🎄 “డబ్బు”ఆస్తులను సంపాదించి పెడుతుంది కానీ,”మంచితనం” మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కాని, “ఒంటరితనం” ఎప్పటికీ రాదు. హద్దులకు మించి “ఆశలు” ఉన్నట్లయితే శక్తికి మించి కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది.”


🎄“తెలివి తేటలు ఎక్కువ, తక్కువ అందరికీ ఉంటాయి. కాని, అవి ఎదుటి వారి మనసును గెలుచుకోవాలి. అప్పుడే,మన “గొప్పతనం”తెలుస్తుంది. మోసేది “బరువు” అనుకుంటే దించి వేయాలనిపిస్తుంది, “బాధ్యత” అనుకుంటే మోయాలనిపిస్తుంది. “కర్తవ్యం” అనుకుంటే చేయాలనిపిస్తుంది మరియు. “ఇష్టం” అనుకుంటే కష్టమనిపించదు.”


🎄 “ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆత్మీయతకు చోటుంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మన్నించే వీలుంటుందో మరియు ఎక్కడైతే   పట్టింపులకు ప్రాధాన్యత లేకుండా ఉంటుందో, అక్కడ  “బంధాలు” బలంగా ఉంటాయి. అంతేకాదు,అక్కడ మనుషులతో   పాటు మనసులు కూడా మాట్లాడతాయి.”

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ఆలోచనాలోచనాలు

 {{{{{ ఆలోచనాలోచనాలు }}}}} *** Wisdom evergreen ***.                    ***** My riches consist not in the extent of my possessions , but in the fewness of my wants. --- J. Brother ton.                                      


***** One person's candle is light for many. --- Babylonian Talmud.                           

   ***** Love means exposing yourself to the pains of being hurt, deeply hurt by someone you trust. --- Reira Weems.                  

 ***** You must have bird in your heart before you can find it in the bush. --- John Burroughs.                      

  ***** We ourselves feel that we are doing is just a drop in the ocean. But the ocean would be less because of that missing drop. --- Mother Teresa.                 

***** Success is the sum of small efforts , repeated day in and day out. --- Robert Collier.                               

 ***** Things work out best for those who make the best of how things work out. --- John Wooden.                

  ***** We can't stop the waves , but we can surf them. --- Jonathan Kabat-Zinn.     

 ***** The whole life is now, is today, is this eternal moment. --- Jalaluddin Rumi.    

          ***** The cure of the part should not be attempted without the cure of the whole. --- Plato.                                 Dt 2--10--2023, Monday, Good morning.

5, అక్టోబర్ 2023, గురువారం

Panchaag