14, మార్చి 2025, శుక్రవారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


విహాయ కామాన్ యః సర్వాన్‌పుమాంశ్చరతి నిఃస్పృహః 

నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి (71)


ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి 

స్థిత్వా௨స్యామంతకాలే௨పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి (72)


అర్జునా... కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆశ, అహంకారం, మమకారం లేకుండా మెలగేవాడు పరమశాంతి పొందుతాడు. ఇలా బ్రహ్మజ్ఞానం పొందినవాడి దృష్టి ప్రపంచవిషయాల మీదకు మళ్ళీ మళ్ళదు. జీవితం చివరిఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది.


శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "సాంఖ్యయోగం" అనే రెండవ అధ్యాయం సమాప్తం...🙏

⚜ శ్రీ సుందరేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 1049


⚜ కేరళ : కన్నూరు 


⚜ శ్రీ సుందరేశ్వర ఆలయం



💠 శ్రీ సుందరేశ్వర దేవాలయం కన్నూర్ జిల్లాలో శ్రీ నారాయణ గురుదేవునిచే ప్రతిష్టింపబడిన రెండు ప్రముఖ దేవాలయాలలో ఒకటి , మరొకటి శ్రీ జగన్నాథ దేవాలయం ,


💠 ఈ ఆలయంలో సుందరేశ్వర రూపంలో ఉన్న శివుడు ప్రధాన దేవతగా ఉన్నాడు. 

ఇక్కడ, శివుడు 'అందమైన దేవుడు' అయిన సుందరేశ్వరునిగా పూజించబడతాడు.


💠 ఆలయానికి సుందరేశ్వర అని పేరు పెట్టడం ద్వారా ప్రతి సందర్శకుడికి 'అందరూ అందంగా ఉంటారు' అని మరియు ప్రతిదానిలో అందాన్ని వెతకాలని గుర్తు చేసే ప్రయత్నం.


💠 కన్నూర్ జిల్లాలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ గంభీరమైన ఆలయం 1916లో నిర్మించబడింది మరియు దాని గొప్పతనం మరియు వైభవం కేవలం మాటల్లో చెప్పలేము. 

ఈ సంపన్నమైన దేవాలయం లోపలి భాగాలను ప్రఖ్యాత కళాకారుడు మరియు గొప్ప శివభక్తుడు శ్రీ చైతన్యాళ్ స్వామి డిజైన్ చేసి అలంకరించారు.


💠 ఆధునిక యుగంలో మానవాళికి అంధకారంలో సూర్యకాంతి అద్వైత సిద్ధాంతం యొక్క అన్వయం వలె ఏక ప్రపంచ దృష్టిని మరియు సార్వత్రిక మానవత్వాన్ని అందించిన అవతార పురుషుడు శ్రీ నారాయణ గురుదేవా. నేడు మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు, సంక్షోభాలకు పరిష్కారంగా ప్రపంచానికి గొప్ప ప్రపంచ దృష్టికోణాన్ని దయతో అందించిన ఈ జగద్గురువు యొక్క ఆశీర్వాదంతోనే శ్రీభక్తి సంవర్దినీ యోగం మరియు గురువు ప్రతిష్టించిన శ్రీ సుందరేశ్వరాలయం వచ్చాయి.


💠 కన్నూర్‌లోని శ్రీ సుందరేశ్వర ఆలయాన్ని కన్నూర్‌కు చెందిన తియ్యర్లు నిర్మించారు మరియు తియ్యర్ల అభ్యర్థన మేరకు శ్రీ నారాయణ గురు ప్రతిష్ట చేశారు.  

ఈ ఆలయ డిజైన్లను శ్రీ చైతన్యఆళ్ స్వామి వారు రూపొందించారు.  


💠 శ్రీ నారాయణ గురువు శివునికి శ్రీ సుందరేశ్వరుడు అని పేరు పెట్టారు, ప్రజలందరూ అందంగా ఉంటారు, ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది కాబట్టి ఈ ఆలయంలో శివుడు శ్రీ సుందరేశ్వరుడు అని పేరు పెట్టారు. 

 

💠 ఈ ఆలయాన్ని 1916వ సంవత్సరం మార్చి 16వ తేదీన నిర్మించారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తప్ప, శ్రీ నారాయణ గురుకు కన్నూర్‌లో ఎలాంటి కార్యక్రమాలు లేవు.  

నిజానికి ఉత్తర మలబార్‌లోని తియ్యర్ల జీవన ప్రమాణాలు బాగున్నాయని, ఇక్కడ తన సేవ అవసరం లేదని ఆయన ఒకప్పుడు చెప్పారు.  

కానీ తియ్యర్ల పట్టుదల అభ్యర్థన మేరకు అతను కన్నూర్‌కు రావడానికి అంగీకరించి విగ్రహాన్ని ప్రతిష్టించాడు.  


💠 ఈ ఆలయంలో పూజారి ఈజ్వా అయినప్పటికి బ్రాహ్మణీయ పూజా విధానాన్ని అనుసరిస్తుంది, ఇది తియ్యర్ల వారసత్వంగా వచ్చిన ఆరాధనకు భిన్నంగా ఉంటుంది. వాయనట్టుకులవన్ తియ్యర్ల కులదైవం మరియు ముత్తప్పన్ కులదేవత. తియ్యర్లు శ్రీ నారాయణ గురుని సంఘ సంస్కర్తగా గౌరవిస్తారు.


💠 సుందరేశ్వర ఆలయం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు మే మధ్య ఎనిమిది రోజుల వార్షిక పండుగను నిర్వహిస్తుంది.

ఈ పండుగ తేదీలు మలయాళ క్యాలెండర్‌ను అనుసరించి 'మీనం' మాసంలో 'పూయం నక్షత్రం' నుండి ప్రారంభమవుతాయి.


💠 ఈ పండుగ వేడుక కన్నూర్‌లో మెరిసే లైట్లు, సృజనాత్మక అలంకరణలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తుంది. 

పండుగ చివరి రోజున, 'ఆరట్టు' ఆచారం జరుగుతుంది, అంటే పవిత్ర స్నానం. 

ఈ ఆచారం పయ్యాంబలం బీచ్‌లో జరుగుతుంది, ఇక్కడ భక్తులు స్వామిని పూజిస్తారు మరియు బీచ్‌లోని నీటిలో స్నానం చేస్తారు. 

దీని తరువాత, ఏనుగుల సవారీలు మరియు బాణసంచాతో వేడుక ఊరేగింపు నిర్వహించబడుతుంది మరియు ఇది పండుగ ముగింపును సూచిస్తుంది.


💠 ఈ ఆలయం భారతదేశంలోని కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న సబర్బన్ తలాప్‌లో ఉంది , ఇది కన్నూర్ రైల్వే స్టేషన్ నుండి సుమారు 2 కి.మీ దూరంలో ఉంది, మరియు కన్నూర్ కొత్త బస్టాండ్, థావక్కర నుండి 3 కి.మీ. 


 రచన

©️ Santosh Kumar

14-21-గీతా మకరందము

 14-21-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - త్రిగుణములను దాటినవాడు మోక్షపదవినొందునని శ్రీకృష్ణభగవానుడు చెప్పగనే, అట్లు దాటిన వాడు ఏయే లక్షణములతో గూడియుండునో తెలిసికొనవలెనని అర్జునునకు కుతూహలముగలుగ, ఆ విషయమును గుఱించి భగవానుని ప్రశ్నించుచున్నారు–


అర్జున ఉవాచ :-

కైర్లింగైస్త్రీన్గుణానేతాన్ 

అతీతో భవతి ప్రభో | 

కిమాచారః కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతే || 


తాత్పర్యము:- అర్జును డడిగెను -- ప్రభువగు ఓ కృష్ణా! ఈ మూడుగుణములను దాటినవాడెట్టి లక్షణములతో గూడియుండును? ఎట్టి ప్రవర్తన గలిగియుండును? మఱియు ఈ మూడు గుణములను నాతడు ఏ ప్రకారము దాటివేయగలడు?


వ్యాఖ్య:-మూడుగుణములను దాటినవాడు జన్మమృత్యుజరాదుఃఖములనుండి విడివడి అమృతత్వము (మోక్షము)ను బొందునను భగవద్వాక్యమును వినినవెంటనే అర్జునునకు ఆ గుణము లెట్లు దాటబడునో, అట్లు దాటినవా డెట్లు ప్రవర్తించునో ఏ లక్షణములు, గుర్తులు గలిగియుండునో తెలిసికొనదలంచి వెంటనే ఆ విషయమును గూర్చి భగవానుని ప్రశ్నించివైచెను.


“కైర్లిఙ్గైః” = "ఏ లక్షణములచే, ఏ గుర్తులచే గుణాతీతుడు తెలియబడగలడు?" అని అర్జునుడు అడుగుట చాల సమంజసముగా నున్నది. ఏలయనిన కొందఱు తాము చాల క్రిందిస్థితియం దున్నప్పటికిని, దృశ్యవాసనలు తమకింకను నశింపకున్నప్పటికిని, తాము సిద్ధపురుషులమనియు, గుణాతీతులమనియు, జీవన్ముక్తుల మనియు చెప్పకొని తిరుగుచు ప్రజలను మోసము చేయవచ్చును. గుణాతీతుని యథార్థమగు లక్షణములు, చిహ్నములు తెలిసికొనినచో, ఇక నట్టిస్థితికి అవకాశములేదు. పైగా అట్టి లక్షణములను ఎఱిగియున్నచో మనుజుడు తానుకూడ ప్రయత్నాతిశయముచే వానిని సాధించుటకును వీలుండును. ఇవియన్నియు ఆలోచించి అర్జునుడు సమయోచితమగు ప్రశ్నగావించెను. ఇదివఱలో గీతప్రారంభమునందు రెండవ అధ్యాయమున 'స్థితప్రజ్ఞస్య కా భాషా" - అను నీప్రకారముగ ఇట్టి ప్రశ్ననే అర్జునుడు కావించి యుండుట ఈ సందర్భములో గమనింపదగియున్నది. ఈ స్థితప్రజ్ఞలక్షణములుగాని, గుణాతీతుని లక్షణములుగాని, అద్వేష్టృత్వాది భక్తలక్షణములుగాని, అమానిత్వాది జ్ఞానగుణములుగాని ఒక "బరామీటరు” (Barometre) వంటివి. ‘బరామీటర్' చే శీతోష్ణస్థితు లెట్లు కొలవబడునో, అట్లే మనుజుని ఆధ్యాత్మికౌన్నత్యము ఈ లక్షణములచే కొలవబడగలదు. ఈ లక్షణములను బట్టి చూచినచో జనులలో ఆధ్యాత్మికశక్తిగలవారెవరో, వేషధారులెవరో సులభముగ తేలిపోవును, శుష్కవేదాంతమును రూపుమాపుటకు, పరమార్థక్షేత్రమునందు 

సోమరులచే కల్పింపబడిన కృత్రిమవాతావరణమును విచ్ఛిన్నమొనర్చుటకు ఇట్టి ప్రశ్నలెంతయో ఆవశ్యకములైయున్నవి.


‘కిమాచారః’ - గుణాతీతుని ఆచరణ, అనుష్ఠానము ఎట్టిదో అర్జును డెఱుగ దలంచెను. "కిమాసీత వ్రజేత కిమ్" - అని యిట్టి యాచరణనుగూర్చియే యిదివఱలో అర్జునుడు ప్రశ్నించియుండెను. ఆధ్యాత్మికక్షేత్రమున అనుష్ఠానమునకు గొప్ప ప్రాధాన్య మొసంగబడియున్నది. "సాధ్య” వస్తువునుగుఱించి, లక్ష్యమును గురించి తెలిసికొనుట అవసరమైయున్నను, ఆ లక్ష్యము ఏ సాధనచే బొందబడగలదో దాని నెఱుగుట ఇంకను ఆవశ్యకమైయున్నది. ఏలయనిన, ‘సాధన' నవలంబించినచో “సాధ్యము" దానియంతట నదియే చేకూరును. కనుకనే అర్జునుడు గుణాతీతునియొక్క ప్రవర్తనయెట్టిదో తెలిసికొన దలంచెను. అర్జునుని ఈ ప్రశ్న దానికి భగవాను డొసంగబోవు సమాధానము పాఠకలోకమునకు చాల ముఖ్యములైయున్నవి. గీతలో సాధనసంబంధమైన ప్రముఖ ఘట్టములలో నిదియు నొకటైయున్నది. కావున ముముక్షువులీ గుణాతీతుని లక్షణములను బాగుగ మననముచేసి, కార్యాన్విత మొనర్చుకొనవలయును.


ప్రశ్న:- అర్జునుడు భగవానునిద్వారా ఏ యే విషయములను తెలిసికొనదలంచెను?

ఉత్తరము:- (1) గుణాతీతుని లక్షణము లెవ్వి? (2) ఆతని ప్రవర్తన యెట్టిది? - అను విషయములను తెలిసికొనదలంచెను.

తిరుమల సర్వస్వం 177-*

 *తిరుమల సర్వస్వం 177-*

మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం2* 


 

 ఇప్పుడు ఆలయనిర్వహణ బాధ్యత ఈస్టిండియా కంపెనీ అధికారుల నుండి మహంతుల చేతిలోకి ఎందుకు, ఎలా వచ్చిందో పరిశీలిద్దాం.


 *పరాయి చెరనుండి ఆలయానికి విముక్తి* 


 హిందూ దేవాలయాల, ధార్మిక సంస్థల, మరీ ముఖ్యంగా, కుల వర్గ ప్రాంతీయ బేధాల కతీతంగా హిందువులందరూ ఆరాధించే తిరుమల ఆలయ వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి జోక్యం మితిమీరడంతో; హిందూ సాంప్రదాయ వాదుల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది. క్రమంగా వారి సహనం హద్దులు దాటి, బ్రిటీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వేగంగా విస్తరించడంతో; ముందుచూపు కలిగిన, వివేకవంతులైన కొందరు బ్రిటిష్ అధికారులు కళ్ళు తెరిచారు. లండన్ లోనూ, కలకత్తా లోనూ ఉన్న ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులకు అనేక రహస్య నివేదికలు పంపారు.

2 ఈ వ్యవహారాన్ని తెగే వరకు లాగవద్దని, తిరుమల ఆలయ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం పనికిరాదని సందేశాలు ఇచ్చారు. ఇండియా లోని గవర్నర్ జనరల్ కు దాదాపుగా అన్ని హిందూ మరియు మహమ్మదీయ ధార్మిక సంస్థలకు సంబంధించి ఇలాంటి నివేదికలే అందాయి. వాటన్నింటిని సమీక్షించిన ఆంగ్లేయ పాలకవర్గం, భారతదేశంలోని అన్ని మతపరమైన సంస్థలలో క్రమంగా జోక్యం తగ్గించుకోవాలని తీర్మానించింది.


 తదనుగుణంగా, అప్పుడు తిరుమల దేవాలయం యొక్క వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకు ఆలయ నిర్వహణ విధుల నుండి తప్పుకొని; ఆ బాధ్యతను తగిన వ్యక్తులకు గానీ, వ్యవస్థకు గానీ అప్పగించ వలసిందిగా తాఖీదు అందింది.


 *ఎవరు సమర్థులు?* 


 అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆలయ వ్యవహారాలపై ఆధిపత్యం బ్రిటీష్ వారినుండి ఎవరికి సంక్రమించాలి? ఇంతటి గురుతరమైన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా ఎవరు నిర్వహించగలరు? తిరుమల క్షేత్రం లోనే కాకుండా తిరుపతి పట్టణంలోనూ, దాదాపు చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతమంతటా అప్పట్లోనే శ్రీవారికి లెక్కలేనన్ని మడులు, మాన్యాలు ఉన్నాయి. వాటన్నింటిని సంరక్షించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకలేదు. దానికోసం పెద్ద కసరత్తే జరిగింది.


 అప్పట్లో స్వామివారినే తమ సర్వస్వంగా భావించి, తమ జీవితాలను శ్రీవారిసేవకు అంకితం చేసిన వైష్ణవులలో అంకితభావానికి, సేవానిరతికి ఏమాత్రం కొరత లేదు. వారి నీతి-నిజాయితీలను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించ నవసరం లేదు. అయితే, తంగళ్, వడగళ్ అంటూ ఇరువర్గాలుగా చీలిపోయిన వైష్ణవులలో ఐకమత్యం లోపించి, పరస్పరం కలహించుకునే వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం శాయశక్తులా ప్రయత్నించే వారు. కాబట్టి వారికి అధికారం అప్పగిస్తే, పరస్పర స్పర్ధల కారణంగా వారు ఆలయ పరిపాలనా భారాన్ని సజావుగా నిర్వహించ గలగటం సందేహాస్పదమే!


 అలాగే, ఆలయంలో మరో బలమైన వర్గం అనూచానంగా స్వామివారిని సేవించుకుంటున్నట్టి వంశపారంపర్య అర్చకులు. ఎల్లవేళలా పూజా పునస్కారాలలో మునిగి ఉండే అర్చకులలో పాలనా పాటవం అంతగా లేదు. పైగా, వారికి పాలనపగ్గాలు అప్పజెబితే వైదిక కార్యకలాపాలకు అంతరాయమేర్పడి, భక్తులలో ఆలయం పట్ల నిర్లిప్తత కలిగితే కానుకల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.


 జియ్యంగార్లు కూడా వైదికవిధుల నిర్వహణ, కైంకర్యాలకే పరిమితమయ్యేవారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఏమాత్రం ఆసక్తి కనపరిచేవారు కాదు. పైగా ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా; వారి పాత్ర, పాలకవర్గానికి అర్చకగణాలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించేంత వరకే పరిమితం. వారికి ఇతరత్రా విధులు అప్పగిస్తే, జియ్యంగార్ల వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరదు.


 ఇలా ఆలయానికి సంబంధమున్న వారందరి సామర్థ్యాన్ని, వారివల్ల దేవాలయానికి కంపెనీ వారికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత బ్రిటిష్ వారి దృష్టి *మహంతులపై* పడింది. కొన్ని సానుకూలమైన అంశాలు వారికి సహకరించాయి.


 వీరు సుదూర ప్రాంతానికి చెందిన ఉత్తరభారతీయులు. స్థానికంగా బలము, బలగము లేనివారు. అలాంటివారికి అధికారం అప్పగిస్తే కంపెనీవారు పరోక్షంగా తమ పెత్తనాన్ని కొనసాగించవచ్చు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*



*316. వ రోజు*


ద్రోణుడు ధృష్టద్యుమ్నుని భీముని ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ద్రోణుడు తను పన్నిన శకటవ్యూహం చెదరకుండా కాపాడుతున్నాడు. రణరంగం విరిగిన రథములు, విల్లులు, కేతనములు, చిందరవందరాగా పడిన దుస్తులు కాళ్ళు చేతులు, ఏనుగుల కళేబరాలు, గుర్రముల శవాలు పదాతి దళాల పీనుగులతో భీకరంగా ఉంది. ద్రోణుని రథమును ధృష్టద్యుమ్నుడు ఢీకొట్టి డాలు కత్తి తీసుకుని ద్రోణుని మీద కలియబడ్డాడు. ద్రోణుడు ఈ హటాత్పరినామానికి జంకక ధృష్టద్యుమ్నుని కత్తిని ముక్కలు చేసి డాలును విరిచి రథాశ్వములను, సారథిని చంపి దృష్టద్యుమ్నుని మీద క్రూర నారాచమును వేసాడు. సాత్యకి ఆ నారాచమును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు సాత్యకి రథం ఎక్కి పక్కకు తప్పుకున్నాడు. చేతికి చిక్కిన ధృష్టద్యుమ్నుని తప్పించినందుకు ద్రోణునికి సాత్యకి మీద కోపం వచ్చి సాత్యకిని కోపంగా ఎదుర్కొన్నాడు. సాత్యకి జంకక తన రథమును ద్రోణుని ముందు నిలిపాడు. వారిరువురు ఘోరయుద్ధం సాగించారు. రథములు విరుగుతున్నాయి, కేతనములు తెగి పడుతున్నాయి. సైనికుల శరీరములు మట్టిలో దొర్లుతున్నాయి. అప్పుడు సాత్యకి ద్రోణుని విల్లు విరిచాడు, ద్రోణుడు మరొక విల్లు తీసుకుని సంధేచే లోపల దానిని విరిచాడు. ఆ విధంగా ద్రోణుడు ఎన్ని విల్లులు తీసుకున్నా వాటిని విరిచాడు సాత్యకి. పట్టువదలని ద్రోణుడు ఆఖరికి ఒక విల్లు తీసుకుని బాణములు సంధించి అత్యంత వేగంగా సాత్యకిపై శరములు ప్రయోగించాడు. సాత్యకి వాటినిన్నంటిని త్తుతునియలు చేసాడు. ద్రోణుడు సాత్యకిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. భీకర జ్వాలలను చిమ్ముతూ సాత్యకి వైపు వచ్చిన ఆగ్నేయాస్త్రాన్ని వారుణాస్త్రం ప్రయోగించి సాత్యకి నిర్వీర్యం చేసాడు. సాత్యకికి బాసటగా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నిలిచారు. ద్రోణునికి బాసటగా దుశ్శాసనాదులు నిలిచి యుద్ధం చేస్తున్నారు


*అర్జునుడి సమరం*


అర్జునుడు తాను వెళ్ళే మార్గంలో ఎదురైన యోధులను హతమారుస్తూ సైంధవుని కొరకు ముందుకు దూసుకు వెళుతున్నాడు. ఇంతలో విందాను విందులు తమ సైన్యంతో అర్జునుడిని చుట్టుముట్టి కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించాడు. అర్జునుడు వారి ధనస్సులును విరిచి, పతాకములు పడగొట్టి, వారి రథాశ్వములను చంపి ముందుగా విందుని తల తెగ నరికాడు. అన్న గారి మరణానికి ఆగ్రహించి అనువిందుడు గదను తీసుకుని రథం దిగి అర్జునుని రథం సమీపించి తన గదను శ్రీకృష్ణుని మీద విసిరాడు. అర్జునుడు ఆ గదను విరిచి మరొక బాణంతో అనువిందుని శిరస్సు ఖండించాడు. విందానువిందులు మరణించగానే వారి సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అర్జునుడు వారినందరిని తన శరాఘాతంతో తరిమి తరిమి కొట్టాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

హోలీ

 ---------------------------------------- *ఈ రోజు మదన పూర్ణిమ - హోలీ*

----------------------------------------

ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది. ఈ రోజున రాక్షస పీడ పోయేందుకు *"హోళికా"* అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోసం అందరూ కలిసి గానాలు చేయడం , పరిహాసాలాడడం చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాదించే సాంప్రదాయం ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.

----------------------------------------

శ్రీమహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిందని పురాణ కథ. ఈ రోజున భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాదించి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు , కనకధారాస్తోత్రం , వంటివి పారాయణ చేయడం మంచిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చించే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

----------------------------------------

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాదించాలి. దీని *డోలోత్సవం* అని అంటారు. ఒరిస్సావంటి ప్రాంతాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

----------------------------------------

*నరాడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం !*

*ఫాల్గుణ్యం ప్రయతో భూత్వా గోవిందస్య పురంవ్రజేత్ !!*

--------------------------------------

ఉయ్యాలలో అచింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈరోజున దర్శించిన వారికి వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాల వాక్యం.

----------------------------------------

హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున , తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి , అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.  

----------------------------------------

హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు , భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి , ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే , అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు.

--------------------------------------

హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా , ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు , ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి , తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

----------------------------------------

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి , మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు ; ముఖ్యంగా జానపద పాటలు అనగా *"హోరి"* పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.

సంవత్సరాలు గడుస్తున్నకొద్ది , ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా , ఉత్తర అమెరికాలో , యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.

వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని , సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.

----------------------------------------

సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ , పసుపు , బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.

తడి రంగుల కొరకు , మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు , అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది. ---------------------------------------- *కాముని పూర్ణిమ హోళీ* 

**************************

*'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుతకాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుండే వాడుకలో ఉంది. “హోళీక” అను స్త్రీ రాక్షస దేవత.*

----------------------------------------

*ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణాబ్రహ్మ సోదరి.*

---------------------------------------

*ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవతులవుతారు.*

----------------------------------------

*దీనికి ఒక కథ తెలుసుకుందాము.*

----------------------------------------

*మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించినారట. సగం-సగం శరీరభాగాలతో వారికి శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి)*

--------------------------------------

*ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడు.*

---------------------------------------

*ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి.*

---------------------------------------

*'హోళీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ' కామునిపున్నమి', 'దోలికో త్సవం' అని కూడా పిలుస్తారు.*

--------------------------------------

*హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు.*

----------------------------------------

*కానీ భారతీయ సాంప్రదాయంలోని అసలుతత్త్వం తెలుసు కుందాం. దీనికి పురా ణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమా రుడు ప్రహ్లాదుడు. అతని ని విద్య కొఱకు ఆచార్యుల వద్దకు పంపుతాడు.*

----------------------------------------

*కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవు తాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడ మంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పర మార్ధమని చెప్పి తండ్రిమాటను వినడు.*

----------------------------------------

*హిరణ్యకశిపుడు హరివైరి. కనుక హరిని సేవించే తన కుమారుని తన శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందింపదలచి తన సేవకులను పిలిచి పిల్లవానిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం చేయిస్తాడు.*

----------------------------------------

*కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారా యణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు, విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు. అది గమ నించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలి పించుతాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది.*

----------------------------------------

*ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మం టలు ఆమెను అంటుకొనలేవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు.*

----------------------------------------

*అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తానుమాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది. అత్తఒడిలో కూర్చున్న ప్రహ్లా దుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళికశరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరంమీదకి వచ్చినట్లు చేస్తాడు.*

----------------------------------------

*అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహించ బడిన కారణంచేత ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పేరిచితిని పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు.*

----------------------------------------

*రాక్షసుల పరాక్రమం. ఆ రోజుతో అంతమయినది అని సంతోషంలో జరుపుకొనే పండుగ.*

----------------------------------------

*ఈ పండుగకు మరొకగాధ కూడా ప్రచారంలో ఉంది. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.*

---------------------------------------

*విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయిం చుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికార మును కలిగించగా ఆయన కోవంలో మన్మథుని చూశాడు.*

----------------------------------------

*ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి కోపముతో తన మూడవకన్ను తెరుస్తాడు.*

---------------------------------------

*ఆ సమయంలో ఆ కంటినుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏదురంగులకాంతి మిళిత మైన ఆ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుని ప్రార్ధించగా కామదేవుడయిన మన్మథుని తిరిగి బ్రతి కించుతాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యా త్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు.*

----------------------------------------

*ఆ ఏడురంగుల మంటలను గుర్తుచేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు.*

----------------------------------------

*శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీపండుగకు సంబంధించింది.*

--------------------------------------

*బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.*

----------------------------------------

*అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీపండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.*

----------------------------------------

*కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.*

----------------------------------------

*"రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు.*

----------------------------------------

*తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధశరీర ఎరుపువర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందు కని కృష్ణునితల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట.*

----------------------------------------

*అందువలన అందరూ హోళీపండుగకు రంగులు పులుముకుంటారట.*

-------------------------------------

*పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు.*

----------------------------------------

*మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనంచేసి, వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు.*

----------------------------------------

*కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు.*

---------------------------------------

*ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపిక లను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట.*

--------------------------------------

*అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.*

--------------------------------------

*"విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"*

----------------------------------------

*కాళిదాసమహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. అవి పాలు, వెన్న, నెయ్యి, తేనె రంగు రంగుల పూలు ఇలా స్వభావసిద్ధంగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆనందమంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా. అంతే గానీ రసాయనాల రంగుల హోళీకాదు.*

----------------------------------------

*రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా ఆనారోగ్యాన్ని ఇస్తాయి.*

----------------------------------------

*అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-*

--------------------------------------

*"వెలగడిమి నాడి వెన్నెల అలవడునే గాది బోయెన అమవస నిశితిన్" అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగలద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం.*

---------------------------------------

*ఎలా అంటే ఈ పండుగను గాయన్, హసన్, జల్పన్ అన్నట్లుగా అంటే పాటలతో, నవ్వులతో, కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్ధం.*

---------------------------------------

*ఈ హోలిక బొమ్మను తయారుచేసి పండుగరోజు పాతచెప్పులతో కొడుతూ, తిడుతూ మన మనస్సులో ఉన్న కల్మషాన్నీ పోగొట్టుకుని, కొత్త ఆనందాలను నింపు కోవాలి.*

-----సేకరణ-----------------------------------

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *గోమయేన సదా స్నాయాత్ కరీషే చాపి సంవిశేత్*

        *శ్లేష్మమూత్రపురీషాణి ప్రతిఘాతం చ వర్జయేత్*


               *గోవైశిష్ట్యం - మహాభారతం*

 

తాత్పర్యము : *ఎల్లప్పుడూ గోమయముతో ( ఆవుపేడను కొంచెము నీటిలో కలుపుకుని ) స్నానము చేయవలెను. పిడక మీద కూర్చోవాలి. గోమయం మీద గానీ, పిడకల మీద గానీ ఉమ్మి వేయటం, మలమూత్రవిసర్జన చేయటం చేయరాదు.*


 ✍️💐🌹🪷🙏

శ్రీ నీర్వన్న పెరుమాళ్ ఆలయం -

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


     91వ దివ్యదేశము 🕉


🙏శ్రీ నీర్వన్న పెరుమాళ్ ఆలయం -

తిరు నీర్మలై, 

 చెన్నై 🙏


⚜ ప్రధాన దైవం: నీర్‌వణ్ణన్ స్వామి

⚜ ప్రధాన దేవత: ఆణిమామలర్ మంగై తాయార్

⚜పుష్కరిణి: మణికర్ణిక పుష్కరిణి

⚜ విమానం:తోయగిరి విమానము

⚜ ప్రత్యక్షం: తొండమాన్ చక్రవర్తి, మార్కండేయుడు, భృగు మహర్షి.


🔔 స్థల పురాణం 🔔


💠 తిరునీర్మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. ఇది వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది.


💠నీర్ మలై పర్వతముపై వెలసియున్న శ్రీ మహావిష్ణువు నాలుగు రీతులలో దర్శనమిచ్చును .

1. నిలిచియున్న మూర్తి 

2. ఆసీన మూర్తి

3. శయన మూర్తి

4. త్రివిక్రమమూర్తి 


💠 వాల్మీకి మహర్షి శ్రీ మహావిష్ణువును ఈ నాలుగు రీతులలో దర్శించుకొని పర్వతము దిగి క్రిందకు చేరినంతనే - శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా , శ్రీదేవి సీతాదేవిగా , ఆదిశేషుడు లక్ష్మణునిగా , శంఖచక్రములు భరతశతృఘ్నులుగా , విఘ్నేశ్వరుడు సుగ్రీవునిగా , గరుడుడు హనుమాన్‌గా దర్శనమిచ్చిరి . 

ఈ విధముగా అనేక రూపములలో దర్శించుకొని అర్చించుకొను భాగ్యమును పెరుమాళ్ మనకు అనుగ్రహించి యున్నాడు . 


💠తిరుమంగై ఆళ్వారు ఈ క్షేత్రాన్ని పెరుమాళ్ ను దర్శించుకొనుటకై వచ్చి , నీర్ మలై పర్వతము చుట్టు నీరు నిండి యుండిన కారణమున 6 మాసములు వేచి యుండి నీరు తగ్గిన తరువాత పర్వతము పైకి పోయి పెరుమాళ్ ను దర్శించుకొని సేవించెను .


💠 మూలవిరాట్ -

1. నిలిచియున్నమూర్తి తూర్పు ముఖముగా నీర్వళర్ పెరుమాళ్ భృగు మహర్షి , మార్కండేయ మహర్షి , వాల్మీకి , తొండై మానులకు ప్రత్యక్షము ; 

2. ఆసీన మూర్తి - నరసింహస్వామి . 3. శయనమూర్తి - ఆదిశేషునిపై దక్షిణ ముఖముగా రంగనాథుడు ( మాణిక్యశయనము ) , 

4. త్రివిక్రమ మూర్తి - త్రివిక్రమన్ . 


💠 పుష్కరిణిలు : 

నిలిచియున్న మూర్తికి కారుణ్య పుష్కరిణి ,

 శయన మూర్తికి క్షీర పుష్కరిణి , ఆసీన మూర్తికి స్వర్ణ పుష్కరిణి , త్రివిక్రమమూర్తికి సిద్ధ పుష్కరిణి

కలవు . 

  

💠 విమానములు :

 శ్రీరంగనాథునికి రంగ విమానము , నరసింహునికి శాంత విమానము , త్రివిక్రమునకు తోయగిరి విమానము గలవు .


💠తిరునీర్మలై ఆలయం ఒక చిన్న కొండపై ఉంది .


💠 ఈ దివ్య దేశాన్ని "తోయగిరి క్షేత్రం" అని కూడా అంటారు మరియు దీనిని "తోతాద్రి" అని కూడా అంటారు.

 తోయా అంటే "నీరు" మరియు అధిరి అంటే "పర్వతం" (మలై). 

కొండ చుట్టూ ఒకప్పుడు నీరు ఉండేది కాబట్టి, ఈ ప్రదేశానికి "తిరు నీర్మలై" అని పేరు పెట్టారు.  


💠ఇక్కడ ఈ ఆలయంలో, పాత మర్రి చెట్టు ఉంది. ధూమం అంటే "రాహు".

ధూమకేతు గణపతిగా పిలువబడే వినాయకుడు, ఈ చెట్టు కింద సప్తకానికతో పాటు కనిపిస్తారు. సంతాన హోమం..( బిడ్డ కోసం ప్రార్థిస్తున్న హోమం), భక్తులచే చతుర్థి రోజున మీరు రాహు కాలంలో ఈ గణపతిని పూజిస్తే, ఇక్కడ వినాయకుడిని ప్రార్థించడం ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయని, పిల్లలు పుడతారు అని నమ్ముతారు. 


 

🙏 జై శ్రీమన్నారాయణ 🙏

శ్రీమహాలక్ష్మీ లలితాస్తోత్రం

 శ్రీమహాలక్ష్మీ లలితాస్తోత్రం


🙏🌸🙏🌸🙏🌸🙏

*1) చక్రాకారం మహత్తేజః తన్మధ్యే పరమేశ్వరీ ! జగన్మాతా జీవదాత్రీ నారాయణీ పరమేశ్వరీ !!*



*2) వ్యూహతేజో మయీ బ్రహ్మానందినీ హరిసుందరీ ! పాశాంకుశేక్షుకోదండ పద్మమాలాలసత్కరా !!* 



*3) దృష్ట్వా తాం ముముహుర్దేవాః ప్రణేముర్విగతజ్వరాః ! తుష్టువుః శ్రీమహాలక్ష్మీం లలితాం వైష్ణవీం పరాం !!* 



🌷శ్రీదేవాః ఊచుః🌷

*1) జయ లక్ష్మి జగన్మాతః జయ లక్ష్మి పరాత్పరే ! జయ కల్యాణనిలయే జయ సర్వకలాత్మికే !!*



*2) జయ బ్రాహ్మి మహాలక్ష్మి బ్రహాత్మికే పరాత్మికే ! జయ నారాయణి శాంతే జయ శ్రీలలితే రమే !!*



*3) జయ శ్రీవిజయే దేవీశ్వరి శ్రీదే జయర్ద్ధిదే ! నమః సహస్ర శీర్షాయై సహస్రానన లోచనే !!*



*4) నమః సహస్రహస్తాబ్జపాదపంకజశోభితే ! అణోరణుతరే లక్ష్మి మహతోఽపి మహీయసి !!* 



*5) అతలం తే స్మృతౌ పాదౌ వితలం జానునీ తవ ! రసాతలం కటిస్తే చ కుక్షిస్తే పృథివీ మతా !!* 



*6) హృదయం భువః స్వస్తేఽస్తు ముఖం సత్యం శిరో మతం ! దృశశ్చంద్రార్కదహనా దిశః కర్ణా భుజః సురాః !!* 



*7) మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయో మతాః ! క్రిడా తే లోకరచనా సఖా తే పరమేశ్వరః !!*



*8) ఆహారస్తే సదానందో వాసస్తే హృదయో హరేః ! దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే !!* 



*9) శిరోరుహా ఘనాస్తే వై తారకాః కుసుమాని తే ! ధర్మాద్యా బాహవస్తే చ కాలాద్యా హేతయస్తవ !!*



*10) యమాశ్చ నియమాశ్చాపి కరపాదనఖాస్తవ ! స్తనౌ స్వాహాస్వధాకారౌ సర్వజీవనదుగ్ధదౌ !!*



*11) ప్రాణాయామస్తవ శ్వాసో రసనా తే సరస్వతీ ! మహీరుహాస్తేఽఙ్గరుహాః ప్రభాతం వసనం తవ !!* 



*12) ఆదౌ దయా ధర్మపత్నీ ససర్జ నిఖిలాః ప్రజాః ! హృత్స్థా త్వం వ్యాపినీ లక్ష్మీః మోహినీ త్వం తథా పరా !!*



*13) ఇదానీం దృశ్యసే బ్రాహ్మీ నారాయణీ ప్రియశంకరీ ! నమస్తస్యై మహాలక్ష్మ్యై గజముఖ్యై నమో నమః !!*



*14) సర్వశక్త్యై సర్వధాత్ర్యై మహాలక్ష్మ్యై నమో నమః ! యా ససర్జ విరాజం చ తతోఽజం విష్ణుమీశ్వరం !!*



*15) రుదం తథా సురాగ్రయాశ్చ తస్యై లక్ష్మ్యై నమో నమః ! త్రిగుణాయై నిర్గుణాయై హరిణ్యై తే నమో నమః !!*



*16) యంత్ర తంత్రాత్మికాయై తే జగన్మాత్రే నమో నమః ! వాగ్విభూత్యై గురుతన్వ్యై మహాలక్ష్మ్యై నమో నమః !!* 



*17) కంభరాయై సర్వవిద్యాభరాయై తే నమో నమః ! జయాలలితాపాంచాలీ రమాతన్వై నమో నమః !!* 



*18)పద్మావతీర మాహంసీ సుగుణాఽఽజ్ఞాశ్రియై నమః ! నమః స్తుతా ప్రసనైవంఛందయామాస సవ్దరైః !!* 


🌷*ఫలశ్రుతి*

*శ్రీ లక్ష్మీ ఉవాచ:-*🌷


*1) స్తావకా మే భవిశ్యంతి శ్రీయశోధర్మసంభృతాః ! విద్యావినయసంపన్నా నిరోగా దీర్ఘజీవినః !!* 



*2)పుత్రమిత్రకలత్రాఢ్యా భవిష్యంతి సుసంపదః ! పఠనాచ్ఛ్రవణాదస్య శత్రుభీతిర్వినశ్యతి !!*



*3) రాజభీతిః కదనాని వినశ్యంతి న సంశయః !      భుక్తిం ముక్తిం భాగ్యవృద్ధిముత్తమాం చ లభేన్నరః !!* 


*శ్రీలక్ష్మీ నారాయణ సంహితాయాం దేవసంఘకృతా శ్రీమహాలక్ష్మీలలితాస్తోత్రం.*

🙏🌸🌸🌸🌸🌸🙏

పంచాంగం 14.03.2025 Friday,

 ఈ రోజు పంచాంగం 14.03.2025 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి భృగు వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం శూల యోగః: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.







రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 



శుభోదయ:, నమస్కార: