19, సెప్టెంబర్ 2020, శనివారం

విశేష ధనప్రాప్తి కోసం


శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పాదాలు.🙏


ధనం సంపాదించడానికి మానవులు అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే సంపాదించిన ధనాన్ని దాచిపెట్టడం లేదా స్థలాల కొనుగోళ్ళు లేదా వడ్డీవ్యాపారం వంటి వాటిపై వెచ్చిస్తూ ఉంటారు. కొందరు లాభపడినా కొంతమందికి అది చేదు అనుభవంగా మిగిలిపోతుంది. ఇంట్లో ధనం ఎక్కువగా నిలబడకపోయినా, అనవసరమైన అప్పులలో ఇరుక్కున్నా, పాత బకాయిలు తీరడం లేదు అనుకునే వారికి ఒక చక్కటి పరిష్కారం మార్గం ఉంది అదే శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పటం. ఈ ఐశ్వర్య కాళి పాదాల పటాన్ని గుమ్మానికి ముందు అంటే ఇంటి ప్రధాన తలుపుకి తగిలించడంతో పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచి, ఉదయాన్నే కాళి మాత పాదాలను మనసులో ధ్యానించి పటానికి నమస్కరించి దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమించాలి.


అసలు ఈ శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి పటం విశిష్టత ఏమిటి? అసలు ఈ వాస్తు ఐశ్వర్య కాళి పాదాల పటం ఎవరు ముందుగా వాడుకలోకి తెచ్చారు?

తమిళనాడు రాజధాని చెన్నై పట్టణానికి సమీపంలో అమింజికరై అనే ఊరిలో వీరశాంత కాళీ అమ్మవారి ఆలయం ఉంది. ప్రొఫెసర్ డా. వి. సుకుమారాన్ అనే అమ్మవారి మహాభక్తుడు ఆలయాన్ని నిర్మించారు. ఒకనాటి రాత్రి సుకుమారాన్ గారికి కాళికాదేవి కలలో దర్శనభాగ్యం కలిగించడంతో ఆయన అమ్మవారి పాదాలను పటం చిత్రీకరించి, ఆలయంలో అటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దీనితో ఆయనకు దర్శనం ఇచ్చిన అమ్మవారి పాదాల పటాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకునివచ్చారు. నేడు ఎంతోమంది భక్తులు అమ్మవారి పాదాలు దర్శించుకుని, పూజించి ఆర్ధిక ఇబందుల నుండి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.🙏

మనసు

 *🌹శుభోదయం🌹*


నీవు మానసికంగా కుంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి.


విజయాలకు మూలం నీ మనసు.


శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేదు.


ప్రతి కొత్త వస్తువు ఏదో ఒకరోజు పాతదవుతుంది.


జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలైన ఆనందం.


         🌹🌹🌹🌹🌹

శ్వాసకు, ఆయుష్షుకు ఉన్న సంబంధం*

 *

*(Respiratory guidelines)*

🌺🌺🌺🌺🌺🌺


మానవులు నిముషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటారు.100 నుండి 120 సం.లు బ్రతుకుతారు. 


తాబేలు నిమిషానికి 3 సార్లు శ్వాస తీస్తుంది...500 సం.లు బ్రతుకుతుంది.


అయితే సృష్టిలో బరువును బట్టి శ్వాసను బట్టి ఆయుప్రమాణం ఏవిధంగా ఉందో శోధన ద్వారా తెలుసుకున్న విషయాలను గమనించండి‌


*MAMMAL's* *Avarage LIFESPAN*

*measured by Breathe Per Minute.*


*Mouse*

150 BPM 

2 Years


*Rabbit* 

60 BPM 

6 Years


*Monkey* 

30 BPM 

20 Years


*Dog* 

50 BPM 

15 Years


*Human* 

15–30 BPM 

60–80 Years


*Horse* 

10–15 BPM 

50 Years


*Whale* 

4–6 BPM 

100 Years


*Tortoise*

3 BPM

300 to 500 years


ఐతే శ్వాసలు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగుతుంది...? 

దీనిని శాస్త్రీయ వివరణ తెలుసుకోగలిగితే *ప్రాణాయామం* యొక్క శక్తి, గొప్పదనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.


మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటానుకోట్ల కణాలు ఉంటాయి. వీటినే సెల్స్ అంటాం.


ఈ ప్రతి కణం లోనూ మైతోకాన్ద్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.

ఈ మైతోకాన్ద్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీనిద్వారా ఉష్ణం జనిస్తుంది. ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణ శక్తి. 

ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివరవరకూ ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తున్నది. ఇలా ఒక్కొక్క కణం నిముషానికి 15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది. ఎందుకంటే మనం నిముషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి. ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పని చేసిన తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది. ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్లిపోతాయి. ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది. 


ఉదాహరణకు మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి అనుకుంటే ఆ కణాలన్నీ మనం విసర్జించే ఉమ్మి, మలం, స్వేదం, మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కణాలు తయారవుతాయి. పాత వాటిని ఖాళీ చేస్తేనే కొత్తవి రాగల్గుతాయి.

అందుకే ప్రతిదినం మన విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

 *ఎవరికైతే విసర్జన క్రియ సరిగా ఉండదో వారి శరీరం నిండా ఈ మృత కణాలు (toxins) నిండిపోయి సరిగా ఉష్ణం జనించక తీవ్ర రోగాల బారినపడతారు.* కనుక ఈ టాక్సిన్ లను బయటికి పంపే డిటాక్సీఫికేషన్ (విసర్జన) చాలా ముఖ్యం.


ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది. అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 5 రోజులు జీవిస్తుంది13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 7 రోజులు జీవిస్తుంది ఈ విధంగా మనం శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది. 

ఎలాగైతే ఒక యంత్రం ఎక్కువ పనిచేయిస్తే త్వరగా పాడైపోతుందో, పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుందో అలాగే ఈ కణాలు కూడా.


భారతీయ యోగులు కణం యొక్క జీవిత కాలాన్ని 3 నుండి 21 రోజుల వరకు పెంచి 2100 సంవత్సరాలు కూడా జీవించగలిగారు.


మనం శ్వాసను ఎక్కువ తీసుకునేకొద్దీ శరీరంలోని ప్రతి కణంపై తీవ్ర ఒత్తిడి కలిగి ఆ కణం త్వరగా పాడైపోతుంది. ప్రాణాయామ సాధన ద్వారా శ్వాసల సంఖ్యను తగ్గించి కణాల పనిరోజులని పెంచగల్గితే మన శరీరంలోని ప్రతి అవయవం మరికొన్ని రోజులు ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే అవయవాలు అంటే కణాల సముదాయమే.

ఇలా మనలోని ప్రతి అవయవం యొక్క ఆయుష్షు పెరిగితే మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.


మనం ఒక్క శ్వాసను తగ్గించ గల్గితే 20 సంవత్సరాల ఆయుష్షును పెంచుకోవచ్చు....

యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే తాము ఏరోజు మరణించేదీ ముందే చెప్పగలుగుతారు.


కానీ ఒక్క శ్వాసను తగ్గించడం అనేది అంత సామాన్య విషయం కాదు. 


*ప్రాణాయామం చెయ్యడం ముఖ్యం కాదు. ఏ ప్రాణాయామ ప్రక్రియ తర్వాత ఏ ప్రాణాయామ ప్రక్రియ చెయ్యాలి? అన్న సీక్వెన్స్ చాలా ముఖ్యం.* 


తిరుమల కృష్ణమాచార్య లాంటి యోగులు ప్రాణాదయామం, యోగ సీక్వెన్స్ లను తయారు చేశారు. పతంజలి అష్టాంగ యోగం నందు ఈ క్రమ పద్ధతి వివరం గా ఉంది. కానీ దాదాపు కొద్దిమందికి మాత్రమే ఈ సీక్వెన్స్ గురించి తెలుసు.


క్రమబద్ధీకరణతో కూడిన ప్రాణాయామమే గొప్ప ఫలితాలనిస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏

🕉🕉🕉. "అన్నదాతా సుఖీభవ". 🕉🕉🕉

 


        పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు.

🌺🌺🌺🌺🌺🌺🌺

      అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. 


"ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.

'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. 

🌺🌺🌺🌺🌺🌺🌺

అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.


అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది. ఇదేనా!! ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా, సన్యాసి అతనికొక సూది ఇచ్చి ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.

🌺🌺🌺🌺🌺🌺🌺

ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. 


ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. 


ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు.


 ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.

గుమాస్తా చదవడం ప్రారంభించాడు.


1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!

2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 

3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయాడు. 


సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.


1వ వాడు: అన్నదాతా సుఖీభవ!

2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.

3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు వారి బిడ్డలు అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.

కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. 

ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.


*సర్వే జనా సుఖినోభవంతు*

సుప్రభాతం


*మీ జీవితాన్ని సరళీకృతం చేయండి.*

*మీ మనస్సును సరళీకృతం చేయండి.*

*మీ పరిసరాలను సరళీకృతం చేయండి.*


*🍃🌺నేర్చుకోవాలి అనుకుంటే,అందరి నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు..*

*ఇలా బతకాలనో లేదా ఇలా ఉండకూడదనో..!*


*జీవితంలో మీది చివరి రోజు అని తెలిసినప్పుడు, ఎలా ఉండాలనుకుంటారో, ప్రతిరోజు అలా ఉండడానికి ప్రయత్నించండి..*


*కల్మషంలేనోడి జీవితంలోనే,స్వచ్ఛత ఉంటుంది..!*


*నా ఆత్మాభిమానం,కొందరికీ* *అహంకారంలా,మరికొందరికీ పొగరులా, ఇంకొందరికీ* *మిడిసిపాటులా,మరెందరికో..మూర్ఖత్వంలా అగుపడవచ్చు..*

*కానీ,నాకు నా ఆత్మాభిమానమే ప్రామాణికం..*


*🍃🌺శుభోదయం*


*మనకేది లేదని ఇతరులతో*

      *పోల్చుకోరాదు.*

   *మనలోనే సమస్తం ఉన్నాయి.*

   *అశాశ్వతమైనవి మనకెoదుకు*

        *శాశ్వతమైన మంచితనం*

          *మనలో ఉంటేచాలు..*

       *ఒక్క క్షణంలో ఆస్వాదిoచే*

    *ఆనందం ఏదైనా శాశ్వతంగా*

       *ఉండేలా చూసుకోవాలి.*

        *ఎందుకంటే సంతృప్తే* 

        *సకల సంపద మనకు....*

          🍁🍃🍂☘️🌸

   *🌹🙏 శుభోదయం 🙏🌹*

*సర్వేజనో శుఖీనోభావంతు*

🍁🍁🍁🍁🍁🍁

       

🙏🏽🙏🏽🙏🏽🙏🏽

*దీపంలో ఉండే నవగ్రహాల అంశం:*



🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*దీపపు ప్రమిద సూర్యుడు,*

*నూనె అంశం చంద్రుడు,* 

*దీపం వత్తి బుద్ధుని అంశం,*

*వెలిగే దీపం నిప్పు కుజుని అంశం,*

*దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు,*

*దీపం నీడ రాహువు,*

*దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు( ఆశ )*

*దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు*

*దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగె శని*


🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమి గాను నూనె నీరు గా ను అగ్నిజ్వాల నిప్పు గాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.*


🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*దానివల్లనే మన పెద్దవాళ్లు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహా కలయికతో అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు....*


       🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

తాళ్ళపాక అన్నమాచార్యులు

 శుభోదయం ...


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మర్ద మర్ద మమబంధాని

దుర్దాంత మహా దురితాని॥


చక్రాయుధ రవిశతతేజోంచిత

సక్రోధసహస్ర ప్రముఖా

విక్రమక్రమా విస్ఫులింగ కణ

నక్రహరణ హరినవ్యకరాంకా


కలిత సుదర్శన కఠిన విదారణ

కులిశకోటి భవ ఘోషణా

ప్రళయానల సంభ్రమ విభ్రమకర

రళితదైత్య గళ రక్త వికీరణా


హితకర శ్రీవేంకటేశ ప్రయుక్త

సతత పరాక్రమ జయంకర

చతురోహంతే శరణం గతోస్మి

యితరాన్ విభజ్య యిహమాం రక్ష


మర్ద మర్ద మమబంధాని ...


     


.................................................................


రాగం: నాట

స్వరపరచి పాడినవారు: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏ప్రదోషకాల శివస్మరణ ముక్తిదాయకము🙏

 స౦ధ్యాసమయ౦ పూర్తి అవుతూ రాత్రి వస్తూన్న సమయాన్ని ప్రదోష౦ అ౦టారు. దోష౦ అ౦టే రాత్రి, ప్ర అ౦టే ప్రార౦భదశ. రాత్రికి ప్రార౦భము. ప్రభాతము అనగా ఉదయ కాలము. ప్రదోషము అనగా సాయ౦కాల౦. ఈ ప్రదోషకాల౦లో పరమేశ్వరుని ఆరాధి౦చాలి అని శాస్త్ర౦ మనకి చెప్తో౦ది. ఆ సమయ౦లో ఈశ్వరారాధన విశేష౦. రాత్రి అనేది అ౦తర్ముఖత్వానికి, పగలు బహిర్ముఖత్వానికి స౦కేత౦. కర్మకు స౦బ౦ధి౦చినది పగలును తెలియచేస్తు౦ది. జ్ఞానానికి స౦బ౦ధి౦చినది రాత్రికి తెలియచేస్తు౦ది. "యా నిశా సర్వభూతానామ్ తస్యా౦ జాగర్తి స౦యమీ! యస్యా౦ జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః!!" మన౦దర౦ దేన్లో నిద్ర పోతామో యోగి దానిలో మేల్కొ౦టాడు. దీని అ౦తరార్ధ౦ ఏమిట౦టే మన౦ భగవద్విషయ౦లో నిద్రపోతాము. ప్రప౦చ౦ విషయ౦లో మేల్కొ౦టా౦. యోగి ప్రప౦చ౦ విషయ౦లో నిద్రపోతాడు. భగవద్విషయ౦లో మేల్కొ౦టాడు. ఈస్థితికి ప్రదోష౦ అని పేరు. ఈ సమయ౦లో శివుని తప్ప ఇ౦కో దేవతను ఆరాధి౦చరాదు అని కూడా శాస్త్ర౦ చెబుతో౦ది. ఎ౦దుక౦టే ఆ సమయ౦లో వార౦దరూ శివతా౦డవ౦ చూస్తూ ఆన౦దమయులై ఆయనలో లీనమవుతారట. ఆసమయ౦లో శివుని ఆరాధిస్తే సర్వ దేవతలను ఆరాధి౦చిన ఫలిత౦ లభిస్తు౦ది. జాతక౦లో దోషాలు పోతాయి

*🌻. మోక్షము - వినాశము 🌻*

 


నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరుచుకొని నెరవేర్చుచుండుటయే అహంకారము. అహంకారము దేవుని పనికి సమర్పణమైనపుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. 

*అదియే మోక్షము.*


అట్లుగాక అహంకారమునకు సొంతపని అని వేరుగా ఏర్పడినచో దురహంకారమగును. దానివలన అసురత్వము , వినాశము కలుగును.


 హిమాలయములలోని నదీ ప్రవాహములలో మంచుగడ్డలు పుట్టి , తేలుచు ప్రయాణము చేసి , కరగిపోవుచుండును. పుట్టుట, కరగిపోవుట అను స్థితులకు ముందు , తర్వాత ఆ ప్రవాహముండును. మంచుగడ్డ కట్టుకొనునపుడు దాని లోపల ప్రవాహజలమే గడ్డకట్టి యుండును. అట్లే దేహముల యందు నారాయణుడును.


మంచుగడ్డలు నీటిపై తేలుచున్నపుడు నీరుగా నున్న ద్రవ్యము ననుసరించి మంచుగడ్డగా నున్న అదే ద్రవ్యము ప్రవర్తించును. మంచుగడ్డ ప్రవహించు దిక్కు మున్నగునవి నీటి ప్రవాహము ననుసరించి యుండును. అనగా మంచుగడ్డలోని అదే ద్రవ్యమునకు పరాధీనత , నీటిలోని అదే ద్రవ్యమునకు స్వామిత్వము కలుగును.  


అదే విధముగా త్రిగుణములతో బద్ధుడుగా జీవుడును , త్రిగుణాత్మక ప్రకృతికి ప్రభువుగా ఈశ్వరుడును వర్తించుచున్నారు. ఈ బద్ధస్థితి ఉన్నంత తడవును జీవునకు బోధపడదు. బోధపడుట యనగా ఈశత్వము నందు మేల్కొనుట.


🌹🌹🌹🌹🌹

*ఎన్నడూ అబద్ధం చెప్పనివాడు*


🕉️🌞🌎🏵️🌼🚩


 *ఒక భక్తుడు నేపాల్ లోని పశుపతినాథ్ మందిరానికి వెళ్లి ఒక రుద్రాక్షమాలతో తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో దాన్ని తను ధరించాలని అనుకున్నాడు.* *మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దాన్ని స్వామివారి ముందు ఉంచాడు. దాన్ని స్వామివారి తాకితే తనను* *అనుగ్రహించినట్టు అనుకున్నాడు.* 


“ *దీనితో నువ్వు ఏమి చెయ్యబోతున్నావు?” అని అడిగారు స్వామివారు.* 


 *“ పెరియవ ఆశీస్సులతో దాన్ని నేను వేసుకుందామని* *అనుకుంటున్నాను” అని బదులిచ్చాడు.* 


 *పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.** 


“ *ఇప్పటినుండి నువ్వు అబద్దం చెప్పడం మానివెయ్యగలవా?” అని అడిగారు.* 


 *అతను ఆలోచిస్తున్నాడు. “హఠాత్తుగా ఈ ప్రశ్న ఏమిటి?”. కాని తప్పకుండా నిజమే* *మాట్లాడాలి ఏది ఏమైనా సరే.* 


 *“అబద్దాలు చెప్పకుండా ఉండలేను పెరియవ”* 


 *“ఏం? ఎందుకు?”* 


“ *నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. కొద్దిగా అబద్దాలు వాడకుండా రికార్డ్స్ తయారుచెయ్యడం కుదరదు. వాటిని ఎలా తయారుచెయ్యాలో నా పై అధికారులు సూచిస్తారు. నేను కాదనలేను”* 


 *స్వామివారు ఆ రుద్రాక్ష మాలను తీసుకుని కాసేపు చేతులతో త్రిప్పుతూ,* *కొద్దిసేపటి తరువాత, “మరైతే ఎవరు అబద్దం ఆడరో వారికి దీన్ని ఇవ్వు” అని ఆదేశించారు.* 


 *అతను ఆశ్చర్యపోయాడు. అక్కడున్న సేవకులతో, “అచ్చంగా నా భార్య సూచించినట్టుగానే జరిగింది” అని అన్నాడు.* 


 *ఇతను యాత్ర ముగించుకుని ఆ రుద్రాక్ష మాలతో వచ్చిన తరువాత అతని భార్య అతనితో పూజ గదిలో ఉన్న పరమాచార్య స్వామివారి చిత్రానికి మాలగా వెయ్యమని చెప్పింది.* 


“ *పరమాచార్య స్వామివారు చెప్పినట్టే చేస్తాను” అని అతను రుద్రాక్ష మాలను ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే ఆ మాలను పరమాచార్య స్వామివారి చిత్రపటానికి అలంకరించాడు. తన ఇంటిలో ఎప్పుడూ అబద్ధం చెప్పని ఒక వ్యక్తీ ఉన్నారని ఆరోజే అతనికి అర్థం అయ్యింది.* 


 *అతని భార్య కోరికను పరమాచార్య స్వామివారు తీర్చారు. ఆమె కోరిక స్వామివారికి ఎలా తెలిసింది? టెలిపతి గురించి అందరకూ తెలిసిందే. కాని ఇది కేవలం గురుభక్తి. తరువాత ఒకసారి ఆ భక్తుని బంధువు ఒకరు దర్శనానికి వచ్చినప్పుడు అతని గురించి గొప్పగా చెబుతూ, “అతనిలో హరిశ్చంద్రుని పార్శ్వము కూడా ఉంది” అని అన్నారు మహాస్వామివారు.* 


 *--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్* 


 *అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం* 

 *శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।* 


 *#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం*


🕉️🌞🌎🏵️🌼🚩