20, నవంబర్ 2024, బుధవారం

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - పంచమి - పునర్వసు -‌‌ సౌమ్య వాసరే* (20.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

హాస్పిటల్ కి

 హాస్పిటల్ కి వచ్చాకే ,

అర్దం అయ్యింది,

*ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అంటారోనని*


బీపీ వచ్చాకే తెలిసింది,

*బిజీ లైఫ్ స్టైల్ కాదు - బీ కేర్ ఫుల్ లైఫ్ స్టైల్ ఉండాలని!*


షుగర్ వచ్చాకే తెలిసింది,

*'షు' వేసుకుని పొద్దుటే నడవాలని*


కళ్ల జోడు వచ్చాకే తెలిసింది,

*కళ్ళు ఉన్నవి, ఫోన్ చూడటానికి మాత్రమే కాదు, కళ్ళు మూసుకుని నిద్ర కూడా పోవటానికి అని!*


టెస్టు లకి blood ఇస్తుంటే

తెలిసింది,

*వేస్ట్ ఫుడ్లు, ఫాస్ట్ పుడ్లు తినకూడదు అని,*


గ్యాస్ ట్రబుల్ వచ్చాక తెలిసింది,

*ట్రబుల్ body లో కాదు, మన  ఫుడ్-టైంటేబుల్ లోనూ & టేబుల్ పైనా ఉందని*

*చివరికి అర్దం అయ్యింది.*

👇


లైన్ లో నిలబడి,

బిల్లు లు కట్టి,

టెన్షన్ పడి,

*హాస్పిటల్స్ ని devlop చేయద్దు - health ni devlop చేసుకుందాం అని👌*


_*చదవడం ఈజీ.- ఆచరణ కష్టం!*_

*Forward చేస్తేనో, చదివితేనో రోగాలు తగ్గవు.*

*ఆచరించితేనే ఆరోగ్యం!☝️*

19, నవంబర్ 2024, మంగళవారం

*23 - భజగోవిందం

 *23 - భజగోవిందం / మోహముద్గర*

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


*భజగోవిందం శ్లోకం:-21*


స్వామీ చిన్మయానందజీ గీతోపాన్యాసాలు 11-52-52 చూడుము.


*పునరపి జననం పునరపి మరణం*

*పునరపి జననీ జఠరేశయనమ్ ।*

*ఇహ సంసారే బహుదుస్తారేకృపయాఽ పారే పాహి మురారే॥ భజ ॥ 21*.


*ప్రతి॥* పునరపి = మళ్ళీ తిరిగి; జననం = పుట్టుక; పునరపి=మళ్ళీ తిరిగి; మరణం = చావు; పునరపి = మళ్ళీ మళ్ళీ; జననీ = తల్లి యొక్క; జఠ రే= పొట్టయందు; శయ నమ్ = పడివుండటం; ఇహ = ఈ; సంసారే = ప్రపంచమందు; బహు = చాల; దుస్తారే = దాట టానికి దస్తరమైనది; అపా రే= (ఇలాంటి ఈ) అపార సంసారం నుంచి; కృపయా = దయచేసి అనంతమైన స్వభావం కలిగిన; మురారే = మురను చంపిన నీవు: పాహి = రక్షించుమా!


*భావం:-*


మళ్ళీ మళ్ళీ చావు పట్టుకల్లో తిరగడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడటం ఈ అపార సంసారములోని యీ పద్ధతి యెంతో తరించలేనట్టిదిగా వుంది. ఓ అనంత దయా మయుడవైన మురారీ ! దయచేసి రక్షించుమా !


*వివరణ:-*


పుట్టుక చావుల చక్రం జీవుని విషయంలో విశ్రాంతి అనేది పొందదు. “అహం” అనేది కోరికలతో ప్రేరేపింపబడి, అపరిమిత భావనలను పెంచి, అలవాట్లకు మరిగి, కోరికలు తీర్చుకోవటానికి బదులు క్రొత్తకోరికల పుంజాన్ని చుట్టూ అలంక రించుకొంటుంది. వాసనా ప్రాబల్యంతో జన్మలోకి వచ్చినతను వాసనలను వదిలించు కోవటానికి బదులు ఆ విధంగావృద్ధిపొందించు కొంటుంది. ఆ యహం ఎందుకని? వదిలించు కోవటం చేతగాక, బాహ్యవస్తువులపై దృష్టి మమత్వ దృష్టితోనే మునుగుతూ వుండటం చేత అంతర్గతమైన దృష్టి యేర్పరచు కొనక బాహ్య వస్తువులకు రంగులు చల్లి విలువలు హెచ్చించటంచేత దానిని “మాయ” అంటాము-- ఆ మాయ చేత.


ఈ ప్రపంచములోకి మనం సహజ వాసనలతో సహా పుట్టినాము. ఇక్కడ అడ్డదిడ్డంగా వుండే వాసనలెన్నో ఆడుతూ వున్నాయి. బాహ్య వస్తువులు, మనిషి ప్రయత్నాలు మొదలైన వాటి అనుభవాలు, సహజ వాసనలతో పుట్టిన వాళ్ళము. క్రొత్త వాసనలను ఎక్కించుకోకుండా వుంటే - అనగా అసక్తతతో కోరికలు లేకుండా అహం భావము ప్రదర్శించకుండా కాలం గడిపినట్లయితే అహంకార భావమూ మమకార భావమూ లేకుండ వున్నట్లయితే- క్రొత్త వాసనలు మీద కెక్కక పాత వాసనలు యీ అనుభవంతో ఖర్చయి పోతవి. నిజానికి ఇదీ అనుసరించాల్సిన మార్గం. అంటే పనులు చెయ్యవద్దా? ప్రపంచములో అని శంక. చెయ్యాలి. తప్పకుండా నిరంతరం చెయ్యాలి. కాని ఆ ప నులన్నీ కర్తవ్యాలన్నీ పరమేశ్వర పరంగా చెయ్యాలి. లోక సంగ్రహార్థం చెయ్యాలి. 


యజ్ఞ భావంతో చెయ్యాలి అంటే నేను పరమేశ్వరుడికి చెయ్యి (లేదా ఇంద్రియం) వంటి వాడని, పరమేశ్వరుడు ఈ పని నా కర్తవ్యమన్నాడు. గనుక - చెయ్యి నాకెలా పని చేస్తోందో అలా నేను భగవంతుడి పరంగా పని చేస్తున్నాను అని అలా చేసిన పని ఫలితం నాది కాదు, ఆయనదే. ఆయన అనగా సర్వ ప్రపంచమూనని అర్థం. అందుకని నేను చేసేది లోక సంగ్రహార్థమేననీ భగవంతుడు నడిపించే యీ ప్రపంచమనే యంత్రంలో ఒక "సీల"లా నేనున్నాను. నాకు ఏర్పరచినంత వరకూ నేనూ నా కర్తవ్యం చేస్తున్నాను. "యీ యంత్రము భగవంతుడి కోసమే” అనుకొంటూ ఈ ప్రపంచంలో బ్రతుకుతూ వుండాలి. 


అలా, వున్న వాసనలు తగ్గిపోతే, ఆలోచనల ఆటంకాలు తగ్గిపోతాయి. మనోబుద్ధు లావిధంగా తగ్గితగ్గి పరమేశ్వరుణ్ణి చేరిపోతవి.


ఆ తరువత క్రొత్తవాసనలు చేరక పోవటాన, వున్నవాసనలు ఖర్చయిపోవటాన అసలు వాసనలే వుండవు. వాటిని యిక అనుభవించి తీర్చుకొనటమనే ప్రశ్నే ఉదయించదు కనుక తిరిగి పుట్టవలసి అగత్యమే పోతుంది. ఇక అందుకనే జన్మ వుండదని భావము.


పుట్టటం చాల బాధతో కూడినట్టిది-చావు యింకా యెక్కువ బాధాకరం కావచ్చు. అలా వుంచండి- తల్లికి గల చిన్న పొట్టలో పడటం, వత్తిడి, మెలికలు తిరగ టం, ఖైదీలా వుండటం, తల్లియ్కొ భౌతికమైన, మానసికమైన కష్టనిష్ఠూరాలకల్లా తను కూడ చికాకు పడి ఇరుకున పడుతుండటం, ఆమెను తన్నుతుండటం, ఇదంతా చాల కఠినమైనట్టిది, బాధాకరమే కాదు - భయంకరమైనట్టిది, క్రూరమైనట్టిది కూడ.


పరి పూర్ణతనుండి యిలా పడిపోతుంటే కలిగే దుష్టశక్తి చాలా యెక్కువైంది. మనం ఒంటరిగా దాన్ని ఆపలేమేమో. నానుంచి కలిగింది ఈ శక్తి ఈ అహం - అది యింత పెద్దదై వెలుస్తోంది. నన్నే ముంచి వేస్తోంది. ఇలా ఆక్రమిస్తున్న దీని ముందుఅయ్యో నేను వట్టి బానిసనా? అనిపిస్తోంది. లోపలి నిరంకుశుడి నుంచి నేను విడివడ టానికి - నాకు శక్తి కనపడదు - అందుచేత ఇంకొక బలవంతుడైన స్నేహితుని నాకు సాను భూతి చూపేవాడిని ఆశ్రయించాలి. అతడెవరు?


‘‘అహం’’ అనే ‘ముర’ రాక్షసుని చంపిన ఓ కృష్ణా నన్ను రక్షించు, నన్ను రక్షించవయ్యా మహానుభావా! అనే హృదయ విదారకమైన ఆర్తి కలుగుతుంది. అతడి పాదాలను ప్రేమతో ఆశ్రయించటమనే ఒకే ఒక్క మార్గం తప్ప మరొకటి లేదు.


నిజానికి నా స్వంత ఉద్రేకాలకే నేను బానిసనై పోయిన నాకు ఆ పరమేశ్వరుని సహాయం కోరటంకన్న యింక నేమి మిగిలింది? ఆయన్ను ప్రార్థించటం తప్ప:--


"ఓ ప్రభూ! ఇన్నాళ్ళు నీ మీదకు మనస్సు త్రిప్పని మాట నిజమే! అప్పుడు నీకయి సమర్పించటానికి నా కన్నీరు తప్ప యింకొకటిలేదు నా దగ్గర, నాకు ఏమున్నదని చెప్పుకోను? చిల్లర విషయాల్లో పడిన శ్రమ విసుగూ తప్ప! స్వార్థంతో చేసిన పనుల న్యూనత తప్ప! ఉద్రేకాల్లో విడిచిన స్వేద జలం తప్ప నేను రక్షింపబడ్డ తగనట్టి వా నేమొకాని ప్రభూ! అలిసి పోయాను లోవొక్కింతయి లేదు. -- ధైర్యం విలోలంబయ్యె మూర్చ వచ్చే పశ్చాత్తాపంతో కృశించి పోతున్నా. నిస్సహాయుణ్ణి, సంపూర్ణంగా నశిం చాను, నీ మ్రోల !


" నీ ముందు నీ దయావర్షములో నన్ను నేను సమర్పించుకొంటాను నీవునీవు కనుక-నా మొర వినవచ్చు నేను నీ నుంచి కనక, దయా పూర్ణత నాశించవచ్చు. నీవు కృపాసముద్రుడవు గదా! వికాసమూర్తివి, దయామయుడవు. ప్రేమ పూర్ణుడవు! ముర అనే రాక్షసుని చంపిన వాడవు గదా! నీవు తిరిగి ఆ రాక్షసుణ్ణి చంపకూడదా! వాడు మళ్ళీ నా హృదయంలో వున్నాడు. నా దుర్మార్గపు వాసనలే వాడై హృదయంలో వాడుగా వున్నాడు. ఒక్కసారి మళ్ళీ నా మీద దయతలచి వాణ్ణి చంపివేయవూ!! ప్రభూ! నీ దయ - నీవేంచేసినా సరే - నీ మ్రోల నేను నశించనీ పోనీ!


అలా అతడికి సమర్పించుకోవటం నిష్కపటంగా అతడిని ధ్యానించడం వల్ల మంచి వాసనలను మనసులో సృష్టించబడతవి. అవే ఆ అహం అను వానికి మందు. అహంభావ భూయిష్ఠమైన వాసనలు తగ్గటానికి అదే సూత్రం, అవి తగ్గిపోతే మురళీ కృష్ణుని సంగీతరవం వినపడుతుంది. ఆయన హీనకాంతి దృగ్గోచరమవుతుంది. ఆయన మెడలో పూలహారాలను చూరిస్తుంది. ఆయన చేతిలోని నవనీతం అమృతా న్నిస్తుంది. ఆయన యాలింగనం మనలో కరిగిపోయి వుంటుంది. 


*ఓమ్ తత్సత్.*

*సశేషం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

టీటీడీ పాలక మండలి

 టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. 


👉అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం

👉శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ 

👉గతంలో సీఎం చంద్రబాబు గరుడ వారధిగా ప్రాజెక్టు ప్రారంభించారు 

👉దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది 

👉ఇప్పుడు గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం 

👉తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు 

👉శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేసి.. ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తాం 

👉శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుంది 

👉నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం 

👉లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం 

👉టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం 

👉ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం 

👉టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం 

👉టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం  

👉టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి 

👉ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం 

👉ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం 

👉తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధం  

👉తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు  

తిరుపతిలోని స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం 

👉శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం 

👉ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజ్ రద్దు 

👉ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

Panchang


 

ప్రదక్షణ

 జై శ్రీ రామ్ 

గుడి చుట్టూ ప్రదక్షణ కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు?

గుడిలో ప్రదక్షిణం సాధారణంగా "మూలవిరాట్టు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపుగా ఉండేటట్టు" చేస్తారు అని చెప్తే స్పష్టంగా ఉంటుంది. దీన్నే క్లాక్-వైస్ లేదా గడియారం తిరిగే దిశ అంటారు కదా. ఈ పద్ధతిలో నడిస్తే ప్రదక్షిణంగా నడవడమనీ, మూలవిరాట్టు వ్యక్తి ఎడమవైపుకు వచ్చేలా నడిస్తే అప్రదక్షిణంగా నడవడం అనీ అంటారు.


ఇలా ఎందుకు నడుస్తారంటే - నడిచేప్పుడు భక్తులకు కుడిచేతివైపు భగవంతుడు ఉంటాడు. ఇలా ఉండడమే విధాయకం. భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ, వివాహ క్రతువులోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడమవేపున నిలబడాలి అంటారు. ఈ రెంటికి ఒకటే సూత్రం. (భర్త దేవుడిలాంటివాడు అన్నది కాదండీ, బాబోయ్) చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి.


ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వింటూండగా ఈ విషయం ప్రస్తావన వచ్చి - ఏదైనా వేదిక మీదనో, వైదిక క్రతువుల్లోనో వయసులో పెద్దవారు, మన్నించదగ్గవారు ఉంటే ప్రయత్నపూర్వకంగా వారు మన కుడిపక్కన ఉండేటట్టుగా నిలబడాలి తప్పించి, వారు మనకు ఎడమపక్కన ఉండేట్టుగా నిలబడకూడదు అని. వయస్సులో పెద్దవారికే ఇది వర్తించేట్టు అయితే సాక్షాత్తూ భగవంతునికి తప్పకుండా వర్తిస్తుంది కదా. అందుకే ప్రదక్షిణం అన్నది మూలవిరాట్టు మ్న కుడివైపున ఉండేలా ఉంటుందని నా అనుకోలు.


పైన చెప్పిన ప్రదక్షిణ పద్ధతి అన్ని ఆలయాలకు వర్తిస్తుంది కానీ శివాలయానికి వర్తించదు. శివాలయాల్లో మాత్రం వచ్చినవారు ఏ ఆశ్రమంలో ఉన్నారు (బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసి) అన్నదాన్ని బట్టి వారు ప్రదక్షిణం చేసే పద్ధతి మారిపోతుదంది.

జై శ్రీ రామ్ జై జై హనుమాన్ కంచెర్ల వెంకట రమణ 




గృహస్థు: శివాలయంలో శివుని లింగానికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని సోమసూత్రం అంటారు. గుడిలోంచి ఓ ఏనుగు బొమ్మ వంటి రూపం బయటకు పెట్టి అందులోంచి అభిషేక జలం వదులుతారు చూశారా, అది సోమసూత్రం. గృహస్థు దాన్ని దాటకూడదట. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణంగా (శివుడు కుడిన ఉండేలా) ప్రారంభించి తిరిగి సోమసూత్రం వరకూ వచ్చి, ఆగిపోయి వెనుదిరిగి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకూ వెళ్లి, ఆగి వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దాకా నడచి - ఇలా చేయాలట. ఎందుకంటే గృహస్థు శివుని సోమసూత్రాన్ని దాటకూడదట. ఐతే, ఇలా చేసేప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళడం, తద్వారా శివుడు భక్తుని ఎడమపక్కన ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇలా ఎలా అంటే నాకు తెలియదు మరి.

బ్రహ్మచారి: బ్రహ్మచారికి సోమసూత్రం దాటకూడదన్న నియమం లేదు. (ఎందుకన్నది తెలియదు నాకు) కాబట్టి ప్రదక్షిణం మిగిలిన ఆలయాల్లో ఎలా చేస్తామో అలా పూర్తిగా చేసేయవచ్చు.

సన్యాసి: సన్యాసులు ప్రదక్షిణంగా కాక అప్రదక్షిణంగా (అంటే మూలవిరాట్టు ఎడమపక్క ఉండేలా) తిరగాలి ఆలయం చుట్టూ.

ఇది కూడా చాగంటి వారు చెప్పిందే. శైవాగమం ప్రకారం చేసే ఈ పద్ధతి లింగ పురాణంలో సవివరంగా ఉంది

ఏకముఖి రుద్రాక్ష

 ఏకముఖి రుద్రాక్ష గురించి సంపూర్ణ వివరణ  - 1


      దీనినే శివరుద్రాక్ష అంటారు. దీనిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు . ఇది అసలైనది దొరుకుట మహాదుర్లభం. ఈ ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నం.  ఈ ఏకముఖి రుద్రాక్షని సూర్యుని స్వరూపముగా భావిస్తారు . దీనిని ధరించటం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభించును. ఈ రుద్రాక్ష మాల ధరించటం వలన ఆధ్యాత్మిక శక్తులు వశం అగును. అత్యంత అరుదుగా లభించే ఈ అద్భుత రుద్రాక్ష జీడిపప్పు ఆకారంలో (అర్ధ చంద్రాకారంలో ) లభించును.  మంత్ర , తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టబడును. 


                ఏకముఖి రుద్రాక్ష ధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును . మనస్సులో భక్తి పెరుగును . ఆర్థికాభివృద్ధి జరుగును. జీవితంలో ఉన్నతస్థితి కలుగును. ఈ మాలను ధరించు సమయమున రుద్రాక్ష మంత్రమును 11 సార్లు జపించవలెను . దీని ధారణ వలన బ్రహ్మహత్యా దోషం నివారణ అగును. ఇంద్రియ నిగ్రహం కలుగును.  టీబీ మరియు ఆస్తమా వంటి మొండివ్యాధులను తగ్గించును . తలనొప్పి , కంటి సమస్య , లివర్ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేయును .  ఈ రుద్రాక్షను పూజామందిరంలో ఉంచుకుని పూజించుచున్న సంపదలు తరలివచ్చును . సుఖసంతోషాలు కలుగును.


           రాజకీయ నాయకులు ఈ రుద్రాక్ష ధారణకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులలో శ్రీమతి ఇందిరాగాంధీ , n .t .రామారావు గారి వద్ద మాత్రమే ఈ ఏకముఖి రుద్రాక్ష ఉండేది. కాని ఇందిరా గాంధీ మరణానికి కొన్ని రోజుల ముందే ఈ రుద్రాక్ష ఆమె దగ్గర నుంచి మాయం అయ్యింది . అది ఇప్పటివరకు ఏమైందో ఎవ్వరికి తెలియదు. 


                         ఏకముఖి రుద్రాక్ష పరమతత్వాన్ని బోధిస్తుంది. అలాంటి ఆలోచన ఉన్నవారు మాత్రమే దీనిని ధరించవలెను . దీని దర్శనం కూడా దుర్లభమే .శివరాత్రి పర్వదినమున ఈ రుద్రాక్షను పూజించిన సాక్షాత్తు శివుడ్ని పూజించిన ఫలితం వచ్చును.  


      తరవాతి పోస్టులో ఏకముఖి రుద్రాక్ష ధారణ చేసే విధానం , రుద్రాక్ష ధారణ నియమాలకు సంపూర్ణంగా వివరిస్తాను .


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

కార్తీక పురాణం*_🚩 _*19 వ అధ్యాయము*_

 🕉️🌹🪔🛕🪔🌹🕉️

        🌹 *బుధవారం*🌹

🕉️ *నవంబరు 20, 2024*🕉️


🚩 _*కార్తీక పురాణం*_🚩    

   _*19 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 

*చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*


☘☘☘☘☘☘☘☘☘


ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి *"ఓ దీనబాంధవా ! వేద వేద్యుడవని , వేద వ్యాసుడవని , అద్వితీయుడవని , సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని , సర్వాంతర్యామివని , బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని , నిత్యుడవని , నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా ! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా ! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు , మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా ! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి , మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా , యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా ! ఉపేంద్రా ! శ్రీధరా ! హృషీకేశా ! నన్ను కాపాడుము"* అని మైమరచి స్తోత్రము చేయగా , శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"జ్ఞానసిద్దా ! నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము"* అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు *"ప్రద్యుమ్నా ! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకొనుచున్నాను. కనుక , నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు"* అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు *"ఓ జ్ఞానసిద్దుడా ! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక , మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై , బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.


*నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి , నా సన్నిధికి వత్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు , వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ , జరా , వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును , శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వొసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు."* అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వళించెను.


వశిష్టుడు జనకమహారాజుతో *"రాజా ! ఈ విధముగా విష్ణుమూర్తి , జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు , అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.


*ఇతి స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదో రోజు పారాయణము సమాప్తము.*


            🌷 *సేకరణ*🌷

          🌹🪔🕉️🕉️🪔🌹

                *న్యాయపతి*

             *నరసింహా రావు*

          🙏🙏🕉️🕉️🙏🙏

కర్త ఈశ్వరుడే*

 అన్నింటికి కర్త ఈశ్వరుడే* 
గొడ్డలి కట్టెలను కొడుతుంది. గొడ్డలి గొప్పతనం కాదు. 
కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. కలం గొప్పతనం కాదు. 
మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. మన గొప్పతనం కాదు...

అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం. మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లం.. అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి...

ఓక రోజు.. కాశి వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు. అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు. అయ్యా! ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నావు..? నీ సీటు క్రింద పెట్టుకోవచ్చు గదా.. అన్నాడు. దానికా పల్లెటూరి ఆసామి అంటున్నాడు.. "బాబూ! నేను నాకే టికెట్టు తీసుకున్నాను. వీటిని రైలు మోస్తుందో మోయలేదో తెలియదు గదా.. అందుకే నేనే మోస్తున్నాను అని అన్నాడట. దానికా వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి.. నాయనా! నిన్నూ, నీ పెట్టెలను అన్నింటిని ఆ రైలే మోస్తుంది. నీవు నెత్తిమీద పెట్టుకున్నా వాటి బరువును రైలే మొయ్యాలి. ఎందుకు అనవసరంగా నెత్తిన పెట్టుకొని హైరాన పడతావు.. క్రింద పెట్టుకో.. ఏం ఫరవాలేదు అన్నాడు. 

అలాగే ... అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు. అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది.

కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి. అంటే... 

ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు.
ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు.
ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు...

కర్మఫలాలను గురించి ఆలోచించకు. లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్తమాత్రుడను అని భావించు. కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు. ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరుని లో సన్యసించుట. అలాచేస్తే నీవు ఈశ్వరుని చేతిలో మురళివైపోతావు.

ఇలా సర్వ కర్మలను ఈశ్వరుని తో సన్యసించి, ఈశ్వరుని ధ్యానం నే లక్ష్యంగా పెట్టుకోవాలి...

*|| ఓం నమః శివాయ నమః //*

భిన్నములైన బంధముల వేడుకలే

 ఉ.భిన్నములైన బంధముల వేడుకలే మది మక్కువయ్యె రా

నున్నది మంచికాలము, మహోత్తమమౌ విడిపోయి వేరుగా

నున్న నియంత్రణమ్మనెడు ఊచల బంధన మడ్డుకట్ట లే

కున్న హితమ్మదే యనుచు యుక్త మెఱుంగరు కొందరిమ్మహిన్!౹౹ 27  


శా.ఎన్నో కష్టము లోర్చి కన్న కలలే యీడేరగా బిడ్డలన్ 

సన్నాహమ్మున పెంపు జేసి చదువుల్ శక్త్యుక్తుల న్నేర్ప లే

కున్నన్ జీవన మెందుకంచు మదిలో నుత్తేజముం బూని లే

కున్నన్ జెప్పరు తల్లిదండ్రులిలలో నోర్మిన్ సదాపూనుచున్!౹౹28