13, మార్చి 2025, గురువారం

సంకల్ప బలం*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

          *సంకల్ప బలం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.*


*ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని.*


*ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.*


*తర్వాతి రోజుల్లో‌ ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో‌ బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.*


*కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది. ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది.*


*కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చారు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.*


*తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీ‌ - అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!*


*వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది. ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం‌ నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.*


*'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె. దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.*


*ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది. తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలో‌ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది!*


*దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.*


*మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!*


*ఓం శ్రీ గురుభ్యోనమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

*జై శ్రీమన్నారాయణ॥*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(74వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       *కృష్ణావతారం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*భరతవంశం శాఖోపశాఖలయింది. ఈ సంతతివారు అనేక వర్గాలుగా ఏర్పడ్డారు. వేర్వేరు వంశనామాలతో వీరంతా భరతఖండాన్ని పాలించారు.*


*భరత పుత్రుడయిన మన్యువు కుమారులు అయిదుగురిలో గర్గుని సంతతివారు బ్రాహ్మణులయినారు. వారిని ‘గార్గ్యులు’ అన్నారు.*


*అలాగే మహావీర్యునికి పుట్టినవారు కూడా బ్రాహ్మణులయినారు.*


*బృహత్‌క్షత్రునికి సుహోత్రుడు పుట్టాడు. అతని కుమారుడు హస్తి. యమునానదీతీరాన అతను గొప్పనగరాన్ని నిర్మించాడు. అదే హస్తినాపురం. భారతరాజధాని ఢిల్లీ ప్రాంతమే ఒకనాటి హస్తినాపురం. ఈ నగరమే నాడు కౌరవులకూ, పాండవులకూ రాజధాని అయింది.*


*హస్తి సంతతి శాఖోపశాఖలయింది. ఈ సంతతివారే అయిదు విషయాలలో గొప్పవారై పాంచాల రాజులుగా జన్మించారు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, ద్రౌపది తదితరులంతా ఈ వంశానికి చెందినవారే!*


*ముద్గలుని సంతానం బ్రాహ్మణమయమై ‘మౌద్గల్య’ గోత్రికులయ్యారు. ముద్గలుని కుమారుడే దివోదాసుడు. కుమార్తె అహల్య. అహల్య-గౌతములకు శతానందుడు జన్మించాడు. ఈ వంశంలోనే కృపాచార్యుడు, కృపి, అశ్వత్థామ జన్మించారు.*


*అజమీఢుని వంశంలో సంవరుణుడు జన్మించాడు. అతని కుమారుడే కురువు. యజ్ఞం చేసేందుకు ఇతను దున్నిన భూమినే ‘కురుక్షేత్రం’ అన్నారు.*


*జయద్రధుని వంశంలో జరాసంధాదులు జన్మిస్తే, కురుసంతతిలో శంతనుడు, బాహ్లికుడు జన్మించారు.*


*శంతనునికీ-గంగకీ భీష్ముడు జన్మించాడు. శంతనుడికీ-సత్యవతికీ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే మరణించాడు.*


*కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహమాడాడు. భీష్ముడే వారిని తెచ్చి, విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ప్రతిజ్ఞకు కట్టుబడి, విచిత్రవీర్యుణ్ణే రాజుని చేశాడతను.*


*రోగపీడితుడై విచిత్రవీర్యుడు, సంతానం లేకుండా మరణించాడు. అప్పుడు సత్యవతి అంగీకారం మేరకు అంబిక, అంబాలికలకు వ్యాసుని కటాక్షంతో ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. అంబిక దాసికి వ్యాసమహాముని కృపతో విదురుడు జన్మించాడు.*


*శంతనుని వివాహానికి పూర్వం పరాశర మునీంద్రుని కోరిక మేరకు సత్యవతి ఓ కుమారుణ్ణి కన్నది. అతనే కృష్ణద్వైపాయనుడు. వేదాలను విభజించి ‘వ్యాసుడు’ అయినాడతను.*


*గాంధారి-ధృతరాష్ట్రులకు దుర్యోధనాదులు నూరుగురు కుమారులు, ఓ కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె పేరే దుశ్శల.*


*తన పత్ని కుంతిని కూడి పాండురాజు సుఖించే యోగం లేకపోయింది. అందుకు ఓ మునిశాపం కారణమయింది. ఫలితంగా యముడు, వాయువు, ఇంద్రుడు కటాక్షంతో వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునులను కుంతి కన్నది. అశ్వినీదేవతల అనుగ్రహంతో పాండురాజు రెండవభార్య మాద్రి నకుల సహదేవుల్ని కన్నది. పంచపాండవులు వీరే!*


*యయాతి కుమారుడు అనుడివంశంలో చాలా మంది జన్మించారు. ఈ వంశానికి చెందినవాడే బలి. అతనికి సంతానం లేదు. అయితే అతని భార్య, దీర్ఘతపుని అనుగ్రహంతో అంగుడు, వంగుడు, కళింగుడు, సింహుడు, పుళిందుడు, ఆంద్రుడు అని ఆరుగురు కుమారులను కన్నది. వారంతా ప్రసిద్ధులై వేరు వేరు దేశాలు పాలించారు. ఆయా దేశాలు వారి పేర్లతోనే ప్రసిద్ధి చెందాయి.*


*ఆంఽద్రుడు పాలించిన దేశమే ‘ఆంధ్రదేశం’ అయింది. ఆయన సంతతి వారే ‘ఆంధ్రులు’ అయినారు.*


*యయాతి జ్యేష్ఠపుత్రుడయిన యదువువంశం ‘యదువంశం’ పేరిట లోకంలో ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు ఈ వంశంలోనే అవతరించాడు.*


*కృష్ణావతారం:~*


*రామాయణానికి సుందరకాండ, భారతానికి శాంతిపర్వం ఎంత గొప్పవో భాగవతానికి దశమస్కంధం అంత గొప్పది. సాక్షాత్తూ భగవంతుడు అయిన శ్రీకృష్ణుని అవతారకథ యావత్తూ దశమస్కంధంలో అభివర్ణితం కావడమే దీనికి కారణం.*


*భగవంతుని అవతారాలన్నీ ఒక ఎత్తు, శ్రీకృష్ణావతారం ఒక్కటీ ఒక ఎత్తు అంటారు పెద్దలు. దీనికి కారణం ఉంది. భగవంతుడు శ్రీకృష్ణావతారంలో సమగ్రంగా భాసించాడు. మిగిలిన అవతారాల్లో భగవంతుడు అసాధారణంగా కనిపించినప్పటికీ మానవా తీతంగా కనిపించడు. సాధారణ మానవుడిలాగానే భగవంతుడు కష్టసుఖాలు అనుభవించాడు.*


*రామావతారం దీనికి తార్కాణం. అయితే కృష్ణావతారం దీనికి పూర్తి విరుద్ధం. ఈ అవతారంలో కృష్ణుడు పూర్ణపురుషుడు. భగవంతుడు ఇందులో పరిపూర్ణంగా భాసిస్తాడు. నేను భగవంతుణ్ణి! సృష్టి స్థితిలయలకు కారణభూతుణ్ణి నేనే! ఇదంతా నా కల్పితం. మహాయోగులు కూడా నన్ను తెలుసుకోలేరు. నిష్కాములై నన్ను సేవించండి. మీకు ముక్తిని ప్రసాదిస్తాను అన్నది శ్రీకృష్ణుడు ఒక్కడే! తాను భగవంతుణ్ణి అని చెప్పిన అవతారం మరొకటి లేదు. అంతేకాదు, తనని కాదంటే పుట్టగతులు ఉండవు. వాణ్ణి శిక్షించి తీరుతాను. జాగ్రత అని అన్నది కూడా కృష్ణుడే! హెచ్చరించి ఊరుకోలేదు కృష్ణుడు. దానిని ఆచరించి చూపించాడు. కంస, శిశుపాలాదులవధ, కురుక్షేత్ర సంగ్రామంలో అతను నిర్వహించిన పాత్ర ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తన తత్త్వాన్ని గీతోపదేశం ద్వారా లోకానికి చాటిన వాడు కృష్ణుడు. సకల ఉపనిషత్సారం అయిన గీత నాటికీ నేటికీ లోకపూజ్యంగా నిలిచింది. కృష్ణావతారతత్త్వాన్ని పలువురు పలు విధాలుగా వాఖ్యానించారు. సామాన్యదృష్టితోగాక, విశేషదృష్టితో చూస్తేనేగాని కృష్ణావతారతత్త్వాన్ని అవగతం చేసుకోలేమన్నారు. కృష్ణుడు మహామాయగా కనిపిస్తాడు. అంతటి మాయగాడు మరొకడు లేడు. ‘కృష్ణమాయ’ అన్న పదం జగత్ప్రసిద్ధమన్నది అందరికీ తెలిసిందే! ముందు మాయపుట్టి, తర్వాతే కృష్ణుడు పుట్టాడు. అందుకనే అంతా మాయ అంటారు. ఈ మాయ అంతా భగవత్‌ స్వరూపమే! వేలాది గోపికలూ, మీరాబాయిలాంటి భక్తులూ అనేకమంది కృష్ణుని చెలికానిగా, పతిగా, దైవంగా కొలిచి ముక్తిపొందారు. పురుషులను సైతం మోహింపజేసే జగన్మోహనాకారం కృష్ణునిది.*


*కృష్ణుడెంతటి భోగో అంతటి యోగి. ఆ మహానుభావుడు ద్వాపర, కలియుగ సంధికాలంలో యదువంశంలో అవతరించాడు. భగవంతుని కథా, అతని లీలలని సమగ్రంగా చెప్పడమే భాగవత రచనకు మూలం కనుక కృష్ణావతారం కథను భాగవతం దశమస్కంధంలో వ్యాసుడు నిక్షిప్తం చేశాడు. ఈ కథ చదివితేనే భాగవత పఠనానికి ఫలసిద్ధి.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈశ్వరుడు దుర్గాతిప్రియుడు. శంకరుల మనస్సు కూడా దుర్గము వంటిదట.  అందుకే తన మనోదుర్గంలో నివాసముండుమని ఈశ్వరుని శంకరులు కోరారు.*


*శ్లోకం : 42*


*గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ*

               

*స్తోమ శ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః*

               

*విద్యా వస్తు సమృద్ధి రిత్యఖిల సామగ్రీ సమేతే సదా*

               

*దుర్గాతిప్రియ ! దేవ ! మామక మనోదుర్గే నివాసం కురు !!*


*పదవిభాగం : ~*


*గాంభీర్యం _ పరిఖాపదం _ ఘనధృతిః _ ప్రాకారః _ ఉద్యద్గుణస్తోమః _ చ _ ఆప్తబలం _ ఘనేంద్రియచయః _ ద్వారాణి _ దేహస్థితః _ విద్యా వస్తుసమృద్ధిః _ ఇతి  _ అఖిలసామగ్రీసమేతే _ సదా _ దుర్గాతిప్రియ _ దేవ _ మామకమనోదుర్గే _ నివాసం కురు.*


*తాత్పర్యము :~*


*(దుర్గావల్లభుడైన ಓ స్వామీ).  మిగుల దుర్గమమైన కైలాస పర్వతముపై ప్రీతితో నివసించి యున్న దేవా !  ఈశ్వరా !  నా దేహములో ఒక దుర్గము ఉంది.  దానికి గాంభీర్యమే అగడ్త . అధిక ధైర్యమే, ప్రహారి. ప్రకాశించే సద్గుణాల సముదాయమే, మిత్రసైన్యము.  గొప్ప ఇంద్రియాల సముదాయమే, ద్వారములు.  ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానమే, వస్తువుల సమృద్ధి.  ఇటువంటి సర్వ సామగ్రితో కూడిన నామనస్సు అనే కోటయందు సర్వదా నివసించు. (దుర్గమునకు కావలసిన సామగ్రి అంతయూ మనస్సునకు చెప్పబడింది ).*


*వివరణ :-*


*శంకరుల మనస్సులో కోటకు గల లక్షణాలున్నాయి.  కోటకు, అగడ్త లోతుగా ఉంటుంది.  శంకరుల మనస్సు కూడా , చాలా లోతుగా ఉంది. అంటే శంకరుల మనస్సులో గాంభీర్యముంది. ఆ గాంభీర్యము కోటకుండే యగడ్త వంటిది. శంకరుల మనస్సు లో గొప్ప ధైర్యముంది. ఆ ధైర్యం సహజంగా కోటకు ఉండే ప్రాకారంలా వుంది.  కోట లోపల నమ్మదగ్గ సైన్యమున్నట్లే , శంకరుల మనస్సులో ఉద్యద్గుణములున్నాయి. కోటకు ద్వారములుంటాయి. ఆలాగే శంకరుల దేహంలో  కన్ను, ముక్కు, చెవి, నాలుక , చర్మం వంటి ఇంద్రియ ద్వారాలు ఉన్నాయి. శంకరుల దేహంలో శివ సంబంధమైన జ్ఞాన రూపమైన విద్య ఉంది.  ఆ విద్య కోటలోని అవసరమైన పదార్థ సంపత్తిలా ఉంటుంది. ఈవిధంగా శంకరుల మనస్సు అన్ని విధాలా సౌకర్యాలతో ధృఢంగా ఉండే కోటలా ఉంది.  కాబట్టి కైలాసంలోని కొండలలో, బండలలో నివాసం ఉండడం మాని , తన మనస్సు అనే కోటలో నివాసం చేయుమని శంకరులు శివుని ప్రార్థించారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

అన్నం వండరాదు

 ⚛️🌹⚛️🌹⚛️🌹⚛️🌹⚛️


*స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు*


100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


12. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. 


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు


*చదవండి. మీ పిల్లలతో చదివించండి*

కాముని పూర్ణిమ హోళీ*

 *కాముని పూర్ణిమ హోళీ* 


'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుతకాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుండే వాడుకలో ఉంది. “హోళీక” అను స్త్రీ రాక్షస దేవత.


ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణాబ్రహ్మ సోదరి.


ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవతులవుతారు.


దీనికి ఒక కథ తెలుసుకుందాము.


మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించినారట. సగం-సగం శరీరభాగాలతో వారికి శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి)


ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడు.


ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటు న్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి.


'హోళీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ' కామునిపున్నమి', 'దోలికో త్సవం' అని కూడా పిలుస్తారు.


హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు.


కానీ భారతీయ సాంప్రదాయంలోని అసలుతత్త్వం తెలుసు కుందాం. దీనికి పురా ణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమా రుడు ప్రహ్లాదుడు. అతని ని విద్య కొఱకు ఆచా ర్యుల వద్దకు పంపుతాడు.


కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవు తాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడ మంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పర మార్ధమని చెప్పి తండ్రిమాటను వినడు.


హిరణ్యకశిపుడు హరివైరి. కనుక హరిని సేవించే తన కుమారుని తన శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందింపదలచి తన సేవకులను పిలిచి పిల్లవానిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం చేయిస్తాడు.


కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారా యణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు, విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు. అది గమ నించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలి పించుతాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది.


ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మం టలు ఆమెను అంటుకొనలేవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు.


'అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తానుమాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది. అత్తఒడిలో కూర్చున్న ప్రహ్లా దుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళికశరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరంమీదకి వచ్చినట్లు చేస్తాడు.


అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహించ బడిన కారణంచేత ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పేరిచితిని పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు.


రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమయినది అని సంతోషంలో జరుపుకొనే పండుగ.


ఈ పండుగకు మరొకగాధ కూడా ప్రచారంలో ఉంది. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.


విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయిం చుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికార మును కలిగించగా ఆయన కోవంలో మన్మథుని చూశాడు.


ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి కోపముతో తన మూడవకన్ను తెరుస్తాడు.


ఆ సమయంలో ఆ కంటినుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏదురంగులకాంతి మిళిత మైన ఆ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుని ప్రార్ధించగా కామదేవుడయిన మన్మథుని తిరిగి బ్రతి కించుతాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యా త్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు.


ఆ ఏడురంగుల మంటలను గుర్తుచేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు.


శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీపండుగకు సంబంధించింది.


బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.


అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీపండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.


కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.


"రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు.


తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధశరీర ఎరుపువర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందు కని కృష్ణునితల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట.


అందువలన అందరూ హోళీపండుగకు రంగులు పులుముకుంటారట.


పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు.


మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనంచేసి, వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు.


కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు.


ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపిక లను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట.


అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.


*"విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"*


కాళిదాసమహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. అవి పాలు, వెన్న, నెయ్యి, తేనె రంగు రంగుల పూలు ఇలా స్వభావసిద్ధంగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆనందమంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా. అంతే గానీ రసాయనాల రంగుల హోళీకాదు.


రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా ఆనారోగ్యాన్ని ఇస్తాయి.


అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-


*"వెలగడిమి నాడి వెన్నెల అలవడునే గాది బోయెన అమవస నిశితిన్"* అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగలద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం.


ఎలా అంటే ఈ పండుగను గాయన్, హసన్, జల్పన్ అన్నట్లుగా అంటే పాటలతో, నవ్వులతో, కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్ధం.

నమ్మకం

 N🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏               🔥 *నమ్మకం* చదవడానికి మూడు అక్షరాలే కానీ సంపాదించడం చాలా కష్టం.. ఎందుకంటే ఆది డబ్బు కంటే విలువైనది.. *స్నేహం* ఇది వినడానికి బాగానే ఉంటుంది.. కానీ అందరి దగ్గరా దొరకదు.. కొందరి దగ్గర మాత్రమే దీన్ని ఇవ్వగలరు.. *ప్రేమ* ఇది వినడానికి బాగానే ఉంటుంది.. ఇది కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది.. ఈ మూడింటి విలువ తెలుసుకొని మసలుకుంటే జీవితం అనందం🔥నమ్మకం ఉన్న చోట చీకటీలో కూడా వెలుగు కనిపిస్తుంది.. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటి లానే కనిపిస్తుంది..ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు..స్నేహం ఉన్న చోట విలువలకు అడ్డు రాకూడదు..బంధం ఉన్న చోట ధనం బేధం ఉండకూడదు..బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు🔥జీవితం నీదైనప్పుడు దాని కోసం చేయాల్సిన కష్టం కూడా నీదే.. ఓడినా గెలిచినా కష్టపడటం ఆపకు... నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వకపోవచ్చు.. కానీ ఏదో ఒక రోజు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది🔥 మీ అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్  D.న్.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా. రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం. మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

Panchaag


 

పారమార్థిక సాధన

 పారమార్థిక సాధన చేసే వ్యక్తి కి ద్వంద్వాతీత ప్రవృత్తి రీత్యా బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి అంటే కష్టసుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలతో సంబంధం లేని వాడు. వాటిని లెక్క చేయకుండా ఎల్ల వేళలా తన సాధనలో నిమగ్నం అవుతూ ఉంటాడు.

సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్

 


భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ 14567 ను ఏర్పాటు చేసిందని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను (ఏరియా కోడ్ లేదా ఏదైనా ప్రిఫిక్స్ లేకుండా నేరుగా నంబర్‌కు డయల్ చేయండి). నేను ఈ ఫోన్‌లో తనిఖీ చేసాను మరియు ఒక మహిళ ప్రతిస్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ కేంద్రం ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల మధ్య సీనియర్ సిటిజన్లకు అవసరమైన ఏదైనా సహాయం / మద్దతును అందిస్తుంది. బాధలో ఉన్న సీనియర్ సిటిజన్ల కేసు, అవసరమైన వైద్య సహాయం లేదా వేధింపుల నుండి రక్షణ, సమీపంలోని టీకా కేంద్రాలు మొదలైన వాటిని సూచించవచ్చు. తక్షణ సహాయం కోసం వాగ్దానంతో ఆందోళన వ్యక్తం చేసిన వ్యక్తి నన్ను చాలా ఆకట్టుకున్నాడు. సహాయం అవసరమైన వారికి సహాయం చేయడానికి మేము ఈ సమాచారాన్ని విస్తృతంగా పంచుకోవాలని మరియు వ్యాప్తి చేయాలని నేను సూచిస్తున్నాను.


ఈ సేవ ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంది మరియు ఈ సేవ హర్యానా మరియు పశ్చిమ బెంగాల్ మినహా ప్రతి రాష్ట్రంలో అందుబాటులో ఉంది, అక్కడ ఇది ఇంకా ప్రారంభం కాలేదు కానీ త్వరలో ప్రారంభమవుతుంది. దయచేసి ఈ సందేశాన్ని మీ సర్కిల్‌లోని అన్ని సీనియర్ సిటిజన్లకు (స్నేహితులు, బంధువులు, పొరుగువారు) పంపిణీ చేస్తారా? ఇది భారత ప్రభుత్వం చేపట్టిన గొప్ప చొరవ మరియు సహాయం అవసరమైన సీనియర్ సిటిజన్లకు ఖచ్చితంగా ప్రయోజనాలను అందిస్తుంది.


చాలా సమాచారం, ఇది పనిచేస్తుంది. దయచేసి మీ అన్ని గ్రూపులలో దీన్ని షేర్ చేయండి.

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - త్రయోదశి - మఘా -‌‌ సౌమ్య వాసరే* (12.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*