14, నవంబర్ 2024, గురువారం

వంచనాత్ముల సహింపగ రాదు

 ఉ.ఇమ్మహి వంచనాత్ముల సహింపగ రాదు విపత్తు లొప్పు సం

ద్రమ్మెదురైన, నెత్తఱిఁ గృతఘ్నుల నమ్మ వినాశనమ్మె, దై

వమ్మును నమ్మి భక్తిఁ గొలువం దయఁ జూపుచు చేరఁ దీసి స

ర్వమ్ము హితమ్మొనర్చు ,ధృతి వైరుల నుక్కడగించి మేల్మితో! ౹౹ 17


ఉ. ఇమ్ముగ శాత్రవాధముల కెన్నగ మేలు ఘటింప జేయ మో

సమ్మగు శక్తి యుక్తులను సర్వము దోచి కృతఘ్నతాగ్ని ప

క్షమ్ముల జిమ్మ జీవన మశాంతియుతమ్మగు గాన వాని స్వ

ప్నమ్మున గూడ నెంచఁ దలపం దగ దెన్నడు నిష్ఫలంబగున్ ! ౹౹ 18

75. " మహాదర్శనము

 75. " మహాదర్శనము " --డెబ్భై ఐదవ భాగము--రాజ సభలో


75. డెబ్భై ఐదవ భాగము -- రాజ సభలో



         మరుదినము ప్రాతఃకాలములో చేయవలసిన కార్యములన్నీ చేసి , భగవానులు , తాము వెనుక ఉంటుండిన గుడిసెకు చేరినారు. కాత్యాయని అల్పాహారమునూ , పాలనూ తీసుకొని అక్కడికి వెళ్ళింది. 


          భగవానులు ఆమె ఇచ్చినవి తీసుకొని, " కాత్యాయనీ , ఈ దినము ఇంకేమీ అవసరము లేదు, కాబట్టి ఏకాంతముగా ఉండాలనుకుంటున్నాను. " అన్నారు. కాత్యాయని , " దేవా , అది తమరి ఇఛ్చ , అయితే , తమరే చెప్పునట్లు పరేఛ్చా ప్రారబ్ధమేమున్నదో ఎవరికి తెలుసు ? " అన్నది. 


" అట్లయితే , ఈ దినము మేము చేయవలసినది ఏమైనా ఉందా ? " 


" నాకేమి తెలుసు ? "


" మరి , అలాగంటివి ? "


          " తమరు అనే మాట గుర్తొచ్చింది , చెప్పినాను. ఈ దినము యే గార్గి వస్తుందో, అథవా రాజే దర్శనార్థియై వస్తాడో, అథవా తమరి తండ్రిగారే దయ చేస్తారో, ఎవరికి తెలుసు ? చూడగా , తమరి తండ్రిగారు ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. కానీ నేను వారిని ఏమిటా ఆలోచన అని ఎలా అడగగలను ? "


         " సరే , అయ్యేది కానీలే , నేను మాత్రము ఏకాంతముగా ఉండవలె ననుకున్నాను. కానీ నువ్వు చెప్పినది నిజము. శరీరధారి యైనవాడు సుఖ దుఃఖములను తప్పించుకోలేడు. మన ఇఛ్చ ప్రకారము అయితే సుఖము, ఇంకోలాగ అయితే దుఃఖము. అంతే కదా ? "


        " తమరికి సుఖ దుఃఖాలు కూడా ఉంటాయా ? నాటకము లాడు వారి వలె తమరు కూడా ఇతరుల కోసము సుఖ దుఃఖములను చూపిస్తారు , అంతే! "


          " ఛీ , పాడు దానా ! కనిపెట్టినావు. కాత్యాయనీ , నిజము. అయితే దీనిని గుట్టుగా ఉంచు. గుర్తుంచుకో. మాకు సుఖదుఃఖములు లేకున్ననూ సుఖముగా ఉన్న వాడిని సూచి సుఖించవలెను , దుఃఖముగా ఉన్న వాడిని చూచి దుఃఖించవలెను. లేకుంటే, ఈ క్షర పురుషుడు, ఈ దేహము శాపము నిచ్చును. " 


" అట్లేమి ? "


         వీరు ఇలాగ మాట్లాడు చుండగనే ఆలంబిని, ’ ఏం చేస్తున్నావయ్యా ? " అని వచ్చింది. కాత్యాయని ఆమెను చూచి లేచి నిలబడింది. అలాగ లేచి నిలుచున్న కోడలిని చూచి, ’ నువ్వు వెళ్ళిపోవద్దమ్మా , ఈ ఎద్దును కట్టడానికి నువ్వే సరియైన పగ్గము! " అని కొడుకు వైపుకు తిరిగింది. కొడుకు కూడా లేచి నిలుచున్నాడు. " ఏమిటమ్మా ? ’ అని వినయముతో అడిగినాడు. 


          తల్లి అన్నది : " నువ్వు సర్వజ్ఞుడవు! నీకు తెలియనివీ ఉంటాయా ? అయినా చెపుతాను. మీ తండ్రిగారు కబురు పంపినారు. రాజ పురుషులు నిన్ను రాజభవనానికి పిలుచుకొని వెళ్ళుటకు వస్తున్నారంట ! " 


          కొడుకు నవ్వినాడు , " చూడమ్మా, ఈ దినము ఏకాంతములో ఉండవలెనని నేను సంకల్పించుకొని ఇక్కడికి వచ్చినాను. అదే సంగతి ఈమెకూ చెప్పుచున్నాను. చివరికి నువ్వొచ్చినావు. రాజ భవనమునకు ఇలాగ వెళ్ళకూడదేమో ? "


          " చూడయ్యా , నిన్ననే సర్వజ్ఞాభిషేకమును చేయించుకున్నావు. కాబట్టి , ఆ కిరీటమునూ , అప్పుడు ఇచ్చిన వస్త్రాభరణములనూ ధరించి , కట్టుకొని, పెట్టుకొని వెళితే చందము. నాకైతే , నిజంగా చెపుతాను , నిన్ను ఆ వేషములో ఎంత చూసిననూ తృప్తి లేదు. " 


          " అట్లేమి ? నీ తృప్తికై ఏమి కావాలన్నా చేస్తాను , లేవమ్మా ! నువ్వు సంతోష పడుతానంటే ఈ నగరములో ఉండే వరకూ ఆ బట్టలనే కట్టుకొని తిరిగితే సరి. దానికేమి ? కాత్యాయినీ , వెళ్ళి అవన్నీ తీసుకొనిరా. " 


కాత్యాయని సరేనని వెళ్ళింది.


ఆలంబిని " ఇంకొకటి , " అంది


" చెప్పు "


" మీ తండ్రిగారు కూడా నీతో రాజ సభకు రావలె ననుకొనుచున్నారు. పిలుచుకొని వెళతావా ? "


         "ఇదింకా బాగుంది , ఇది , మీరు తల్లిదండ్రులు ఇచ్చిన దేహము. దీనికి కలుగు వైభవమంతా మీవలన. కాబట్టి , వారొక్కరే కాదు , నువ్వూ రా. అయితే ఒక మాట. మీరిద్దరూ పల్లకిలో ఒకే వైపు కూర్చోండి , నేను మీ ఎదురుగా కూర్చుంటాను. " 


          అంతలోపల కాత్యాయని సర్వజ్ఞ వస్త్రభూషణములను తెచ్చిచ్చి , " రాజ పురుషుడు వచ్చినట్లుంది " అన్నది. భగవానులు వస్త్ర భూషణములను ధరించు వేళకు స్వయం దేవరాతుడే రాజపురుషుని పిలుచుకొచ్చినాడు. 


         రాజ పురుషుడు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి , మహారాజులు ఇతర దేశాధిపతులతోనూ , విద్వాంసులతోనూ సర్వజ్ఞులను ప్రతీక్షించుచున్నారు. రెండు పల్లకీలు వస్తున్నాయి. " అని విన్నవించినాడు. 


" సరే , అమ్మా , నువ్వూ నీ కోడళ్ళూ సిద్ధము కండి. కాత్యాయనీ , కణ్వుడినీ , మాధ్యందినుడినీ సిద్ధము కమ్మని చెప్పు. 


          మహారాజూ , ఇతర దేశాధిపతులూ సవిద్వాంసులై సర్వజ్ఞులను గజద్వారములో ఎదుర్కొని , పిలుచుకొని వెళ్ళినారు. సర్వజ్ఞులకు సలుపవలసిన మర్యాదలన్నీ సలిపి , అందరినీ స్వస్థానములలో కూర్చోబెట్టి , మహారాజు చేతులు జోడించి , వినీతుడై, " ఏదైనా అనుజ్ఞ కావలెను. మేమంతా విని కృతార్థులగుటకు వేచియున్నాము. " అని తెలియజేసినాడు. 


          భగవానులు నవ్వుచూ అన్నారు , " ఈ దినము మేము వృత్తిని తిరోధానము చేసి ( మరుగు పరచి ) ఏకాంతములో ఉండవలెనని యున్నాము. మహారాజుల ఆజ్ఞను మీరలేక ఇక్కడికి వచ్చినాము. తమందరి దర్శనమై మనసు ఇంకా సంతుష్టమైనది. కాబట్టి , తమరు ఏదైనా అడగండి , దానికి ఉత్తరముగా మాకు తెలిసినది చెప్పెదము " 

          భగవానులు జలతారు వస్త్రములను కట్టుకున్నారు. జలతారు ఉత్తరీయమును తమ కృష్ణాజినపు ఉత్తరీయము పైన కప్పుకున్నారు. తలపైన రత్నమయమైన పాండిత్య కిరీటము శోభిస్తున్నది. ముంజేతికి రత్నమయమైన కడియముంది. వేళ్ళకు మూడు మూడు అనర్ఘ్యమైన( వెలలేని ) ఉంగరములు. జలతారు వస్త్రము పైన రత్నమయమైన శృంఖల. కాలికి రత్నమయమైన పెండేరము. పాదములకు రత్నమయమైన పాదుకలు. చూడగా , ఆ రత్నముల కాంతితో వారి ముఖము దేదీప్యమానమైనట్లుంది. అయితే , నిజంగా చూస్తే , వారి తేజస్సు వలన ఆ సర్వమూ వ్యాప్యమైనట్లుది. వేష భూషణములకు కొత్త కాంతి వచ్చినట్లుంది. అందరికీ ఆశ్చర్యమేమంటే , మహానది మహాపూరములో ( ప్రవాహములో ) వచ్చి సముద్రమును చేరిననూ, సముద్రము తనపాటికి తాను ఉండునట్లు , సర్వజ్ఞాభిషేకము భగవానులలో లేశమైనా వ్యత్యాసము కలిగించలేదు. 


    అందరూ గార్గిని ఏమైనా అడగవలెనని సూచించినారు. ఆమె వినయముతో , " మా ఆటోపమంతా ముగిసింది. ఇంకేమున్ననూ వినుట , అంతే! మన మహారాజులు ఇతరులవలె కాదు. వేదోపనిషత్తులను సాంగముగా తెలిసినవారు. వారు అడుగుటా , భగవానులు చెప్పుటా బాగుండును. "


సర్వానుమతితో మహారాజులే లేచినారు. అన్నారు: " భగవానులు ప్రసన్నులై మా ప్రశ్నకు ఉత్తరము చెప్పవలెను. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? "


" ప్రశ్న బాగున్నది. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? రాజా , మనుష్యుడే యేమి , ప్రాణ జాతులన్నీ కూడా ఆదిత్యుడను తేజస్సు వలన ప్రచోదితమై తమ తమ కార్యము లన్నిటినీ చేయును. ఆదిత్యుడు తన కిరణముల ద్వారా సర్వమునూ సృజించును. సర్వమునూ స్థితిలో కాపాడును. సర్వమునూ లయము చేసి తనలో ఉపసంహారము చేసుకొనును. సుఖ నిద్రలో పరుండిన పురుషుని జాగృత్తుకు తెచ్చునది ఆతని కిరణము. ఆదిత్యుడు పురుషుని హృదయమును ప్రవేశించి , నానా విధములైన వ్యాపారములకు కారణమగును. ఒక రూపముతో తపనము చేసి , ఇంకొక రూపముతో వర్షమును వర్షించి , అన్న కారణమగు వాడూ వాడే! అన్నాదుడై దేహములో కూర్చొని అన్నిటినీ జీర్ణించువాడూ వాడే! కాబట్టి , సృష్టికి వచ్చిన భూతజాలమంతా తన సర్వకార్యములకూ ఆదిత్యునికి ఋణి. ఆదిత్యుడు లేకపోతే ఎవరికైనా ఏమి చేయుటకు అవుతుంది ? "


" రాత్రి పూట ఆదిత్యుడుండడు కదా ? "


" ఔను , ఆతడు అప్పుడు దేశాంతరములో ఉండును అని శృతి చెప్పుచున్నది. ఆతడు కంటికి కనబడకున్ననూ , ఆతని కిరణములు ఉండనే ఉంటాయి. లేకుంటే ఉక్కపోయుట ఎలా జరుగును ? కాబట్టి ఆదిత్యుడు ఎల్లపుడూ ఉండనే ఉంటాడు. అయినా ఆతడు రాత్రిపూట ఉండడని లోక ప్రసిద్ధి. అప్పుడు చంద్రుడు జ్యోతియై అందరిచేతా పనులు చేయించును. "


" చంద్రుడు లేనపుడు , జ్యోతి యేది ,భగవాన్ ? "


" చంద్రుడు ప్రతిరాత్రీ ఉండనే ఉంటాడు. శుక్ల పక్షములో సూర్యుడి నుండీ దూరముగా పోతూ పోతూ ఆతని కళాభివృద్ధియగును. కృష్ణ పక్షములో ఆతను తన కళలను ఒక్కొక్క దినమునకు ఒక్కొక్కటిగా దేవతలకు ఇచ్చి, ఇంకొక్క కళ మాత్రమే మిగిలి యున్నది అన్నపుడు సూర్యుడిని ప్రవేశించును. అతడి నుండీ తన కళలన్నీ పొంది , దినమున కొకటిగా పెంచుకుంటూ పోవును. అయినా అతడు లేని కాలము ఉంది యని లోకప్రసిద్ది ఉంది కదా ? అప్పుడు , సూర్యుడూ చంద్రుడూ ఇద్దరూ లేనపుడు అగ్నియే జ్యోతి. " 


" వీరు ముగ్గురూ లేనపుడు జ్యోతి యేది , దేవా ? "


" వీరు ముగ్గురూ బాహ్య జ్యోతులు. వీరు ఎవరూ లేనపుడు పురుషుడు తన కరణములనే జ్యోతిగా చేసుకొనును. చీకటిలో వాణి ఇతనికి జ్యోతియగును. వాణి వినిపించిన చోటికి వెళ్ళును. వాణిని పట్టుకొని అన్ని వ్యాపారములూ చేయును. కాబట్టి అప్పుడు వాణియే జ్యోతి. "


" ఆ వాణికూడా లేనపుడో , దేవా ? "


" వాణి అనేది కరణము. కరణము జడమైనది. కరణమును జ్యోతియనునది ఔపచారమునకే. బ్రాహ్మణ దంపతుల కొడుకు బ్రహ్మ కర్మ చేయకున్ననూ వాడిని ఔపచారమునకు బ్రాహ్మణుడని పిలుచుట లేదా ? అలాగే ఇదీ ! జాగృత్తులో అయితే ఇది ( కరణము ) ఇంకొక జ్యోతి యొక్క ప్రకాశముతో వెలుగును. ఆ ఇంకొక ప్రకాశమున్ననూ , స్వప్నములో అయితే ఇది ( వాణి యనే కరణము ) వెలుగకుండా ఉండును . ఇలాగ జాగృత్తు లో కరణములను ప్రకాశింప జేయుచూ తాను లేనట్టున్న ఆ జ్యోతి స్వప్నములో అంతా తానేయగును. అప్పుడు అది కరణము కన్నా ప్రత్యేకమైనది అని బాగా తెలియును. ఆ జ్యోతి యేదో తెలుసా ? అదే , మీలోనూ , నాలోనూ ఎల్లపుడూ ఉండు ఆత్మ జ్యోతి. అది కార్యమగు శరీరము , కరణమగు వాణి-ఈ రెండింటికన్నా విలక్షణమైనది. ప్రత్యేకమైనది. ఆ ఆత్మను తెలిసినవారు అతడిని అసంగుడు అంటారు. నీటిలో వేసిన పాదరసము వేరుగా ఉండునట్లే , పాలలో వేసిన మరకతమణి తన ప్రభావము చేత పాలను పచ్చగా చేసిననూ , పాల వలన ప్రభావితము కాకుండా వేరుగా ఉండునట్లు , ఈ శరీరపు హృదయములో జ్యోతియై ఉన్ననూ ఈ శరీరము , కరణముల వలన ఏమీ ప్రభావితము కాకుండుట చేత అతడిని అసంగుడు అన్నారు. శృతి చెపుతుంది , ’ వాడిని చూడవలెనంటే స్వప్నములోనే! ’ అని. ఎందుకంటే , జాగృత్తులో బహిర్ముఖమై లేచి ఆడుతున్నట్టు ఆడుతున్న ఈ కరణముల వ్యాపారములో ఆత్ముడు మబ్బుల చాటున నున్న సూర్యుని వలె మాటుగా నుండును. సుషుప్తిలో అక్కడ అంతా తానై నిండి యుండిననూ , తెలివికి సాధనమైన బుద్ధి నిర్లిప్తముగా తూష్ణీభావముతో ఉండుట చేత , అప్పుడు అతడిని తెలుసనుట ఎలాగ ? తెలియలేదనుట ఎలాగ ? కాబట్టి , శృతి , అతడిని చూడవలెనంటే సంధి స్థానమైన స్వప్నమే సరి అన్నది. ఆ ఆత్ముడు , జ్యోతికే జ్యోతి. బయటి ఆదిత్యాదుల లోనూ ప్రకాశమై ఉండువాడు అతడే. ఇలాగ లోపలా , బయటా అంతటా నిండియున్న ఆతడిని తెలిసినవాడే కృతార్థుడు. " 


రాజు ఇంకా ఏదో అడగబోయినాడు. భగవానులు దానిని నివారించి , " అప్పుడే మధ్యాహ్నమగుచున్నది. కర్మఠులకు కర్మచేయు ఆత్రము. ఈ దేశాధిపతులు , తీవ్రమగుచున్న వైశ్వానరుడి ఉపాసన సకాలములో నిర్వహించనీ. నేటికి ఇక్కడికే చాలిద్దాము " అన్నారు. 

 అందరూ గబగబా లేచినారు. రాజు చేతులు జోడించి , ఇంకొక ఘడియ కూర్చోమని ప్రార్థించి , కోశాధికారిని పిలచి ఏమో అడిగినారు. అతడు నివేదిక చదివినట్లు ఏదో చెప్పిన తరువాత , రాజు మరలా భగవానులకు చేతులు జోడించి , " నిన్నటి దినము వచ్చిన కానుక పన్నెండు లక్షలకు దగ్గర దగ్గరగా ఉంది. అనుజ్ఞ అయితే దానిని ఆశ్రమమునకు పంపించెదను ? " అన్నారు. 


భగవానులు నవ్వినారు. " ఇప్పుడే , నా నోటి నుండే వచ్చింది ,’ లోపలా బయటా అంతటా నిండియున్న వాడు ఆత్మ ’ దానిని ఇంత త్వరగా ఎందుకు అబద్ధము చేయవలెను ? దీనిని ఇచ్చినవారు దేవతలు. వారు అందరి శరీరములలోనూ ఉన్నారు. కాబట్టి , ఇచ్చినవారికి తృప్తి కానీయని, వారికి దానిని ఈ విద్వాంసుల ద్వారా అర్పించండి. ఆశ్రమవాసులకు కావలెనన్నచో , వారికిచ్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు. ఆశ్రమవాసులు అందరూ కాకున్నా, కొందరైనా ఈ అంతటా నిండిన ఆత్మ దర్శనములో , విచారములో, మననములో , ఆసక్తి కలవారు కానీ" అని చెప్పి లేచినారు. 


అందరూ భగవానులను పంపించుటకు వాకిలి వరకూ వచ్చినారు. అక్కడ పల్లకీ నెక్కునపుడు భగవానులు రాజును పిలచి , " చూడండి , మనము పశువుకు గడ్డి వేసేది అది పాలిస్తున్నదనో , ఇచ్చుననో కదా ? అలాగే దూర ప్రయాణమునకు బయలు దేరినవాడే కదా శకటము మొదలైన సంభారముల నన్నిటినీ సిద్ధము చేసుకొనును. తమరు ఇప్పుడు విద్వత్సమూహమును కట్టుకొని , వారినందరినీ పోషిస్తూ వారినుండీ వేదోపనిషత్తుల నన్నిటినీ సంగ్రహించు చున్నారు. ఇదెందుకు ? ఆలోచించండి , ఎందుకీ ఆడంబరములన్నీ అనుదానిని గూర్చి చింతించండి " అని , అందరినీ వీడ్కొని వెడలివచ్చినారు.   


Janardhana Sharma

కార్తీక పౌర్ణమి

 *కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?* 


ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.

అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.

దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదుఇక. మొత్తం జనంతో నిండిపోతుంటారుంకొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలోంపడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు.అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.

అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా, మనం చేసే దుష్క్ర్తులను పొగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం. కాబట్టి ఆశ్వయుజమాసం చివర వచ్చిన తిధినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు.

కల నిజమనుకోకు

 శు  భో  ద యం🙏


కల నిజమనుకోకు !


అంతామిధ్య తలంచిచూచిన, నరుండట్లౌటెరింగిన్ సదా/

కాంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ/

భ్రాంతింజెంది చరించుఁగాని,పరమార్ధంబైన నీయందు తా/

చింతాకంతయు చింతనిల్పడుగదా!శ్రీ కాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకం-ధూర్జటి మహాకవి;


లోకంలో మనం చూచేదంతా మిధ్యే.(లేనిదిఉన్నట్లు భ్రమ)

ఏదీ శాశ్వతంకాదు.అయినా అదేమిటో మానవుడు నిరంతరం మోహ సముద్రంలో మునిగితేలుతూ, నా

భార్య,పిల్లలు,శరీరము,సంపద,ఇవన్నీ శాశ్వత మైనవని భ్రమిస్తూ ఉంటాడు.ఈమాయకు అంతంలేదుకదా!

ఇలా గుంటే ముక్తి యెలామరి? అనిదీనిభావం.

విశేషాంశములు:- కల నిజంకాదు.కన్నులుతెరిస్తే కలమాయం.జీవితం కూడా అంతే.ఎప్పుడు దీనికి తెఱపడుతుందో చెప్పలేం.అయినా బ్పతికినంతకాలం ఇదిశాళ్వతమనుకోవటం అవివేకం.భార్యా,పిల్లలు,వగైరా జీవననాటకంలోని అవాంతపాత్రలు.వారిపట్ల మమకారమే మోహం.ఆమోహ క్షయమయ్యేంతవరకూ మోక్షంరాదు.బ్రతుకంతా అదేయావా?చింతాకంతైనా భగవచ్చింతనవలదా?

అని కవి ప్రశ్న.సమాధానము చెప్పవలసినది యెవరికి వారే!!!

                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷☝🏻🌷🌷🌷🌷

కార్తీక పురాణం -14

 _*కార్తీక పురాణం -14 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)*

*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*


☘☘☘☘☘☘☘☘☘


మరల వశిష్ఠులవారు , జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.


ఓ రాజా ! కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట , శివలింగ సాలగ్రామములను దానముచేయుట , ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.


వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక , దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు , సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.


*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు , తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన , సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి , అమావాస్య , సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు , విధవ వండినది తినరాదు. ఏకాదశీ , ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన    కల్లుతో సమానమని  బ్రహ్మదేవుడు చెప్పెను. కావున , వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ , గోదావరి , సరస్వతి , యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని , చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.


*గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |*

*నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||*

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం , హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.


*కార్తీకమాస శివపూజాకల్పము*


ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి

ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి

ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి

ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి

ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి

ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి

ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి

ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి

ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి

ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి

ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి

ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి

ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి

ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి

ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము , వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన , తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల , వారికీ , వారివంశీయులకు , పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క , కుక్క , పంది , పిల్లి , ఎలుక   మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను , పురాణము చదివినను , విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.


*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.*

🙏💐🌻🌺🌸🌼🦜🦚🌞🌝

కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 499*


⚜ *కేరళ  : పాలక్కాడ్‌*


⚜ *కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం*



💠 కిల్లిక్కురుస్సి మంగళాన్ని లక్కిడి అని కూడా అంటారు. 

నీలా (భారతపూజ) నది లక్కిడి దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తుంది. 


💠 కేరళలోని పాలక్కాడ్‌లోని పచ్చని కొండల మధ్య ఉన్న లక్కిడి ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం మాత్రమే కాదు. 

ఈ సుందరమైన పట్టణంలో కిల్లిక్కురిస్సి మహాదేవ దేవాలయం అని పిలువబడే వాస్తు అద్భుతం కూడా ఉన్నది.

సందర్శించే వారందరి నుండి ప్రశంసలను పొందుతున్న దాని అద్భుతమైన చెక్క నిర్మాణాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది.శివునికి అంకితం చేయబడింది.


💠 శ్రీ పరశురాముడు  కేరళలో 108 శివాలయాలు, 108 భగవతి దేవాలయాలు మరియు 108 ధర్మ శాస్తా దేవాలయాలను స్థాపించాడు.

ఈ మహాదేవ ఆలయం అందులో ఒకటి..


💠 గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం- శ్రీ కిల్లిక్కురుస్సి మహాదేవ క్షేత్రం నుండి ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. 

ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు దీనిని శ్రీ శుక బ్రహ్మ ఋషి స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి.


💠 ఆలయ ప్రధాన గర్భగుడి, పశ్చిమం వైపు ఉంది, ఋషి శుక మహర్షిచే ప్రతిష్టించబడిందని నమ్ముతున్న శివలింగం ఉంది. 

ముఖ్యంగా, ఆలయంలోని నంది విగ్రహం ఈశాన్యం వైపు వంగి, దాని ఆధ్యాత్మిక శోభను పెంచుతుంది. గర్భగుడి ప్రక్కనే, ఎడమ మూలలో ఒక గణపతి మూర్తి ఉంటుంది, పార్వతి దేవి, గురువాయూరప్పన్, వనదుర్గ మరియు నాగం వంటి ఇతర ఉప దేవతలు కూడా ఇక్కడ పూజించబడ్డారు.


💠 విశేషమేమిటంటే, ఈ ఆలయం ఉత్సవాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది, ఎందుకంటే శివుడు స్వయంగా దాని ఆవరణలో తపస్సులో నిమగ్నమై ఉన్నాడని నమ్ముతారు.


💠 ఆలయం సాధారణంగా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. 


🔆 పండుగలు:


💠 శివుడికి అంకితం చేయబడిన వార్షిక పండుగ శివరాత్రి, కిల్లిక్కురిస్సి మహాదేవ ఆలయంలో అత్యంత గొప్ప వేడుక. 


💠 గ్రానైట్ లేదా రాతితో నిర్మించిన అనేక దక్షిణ భారత దేవాలయాల మాదిరిగా కాకుండా, కిల్లిక్కురిస్సి మహాదేవ ఒక ప్రత్యేకమైన చెక్క నిర్మాణాన్ని కలిగి ఉంది. క్లిష్టమైన శిల్పాలు గత యుగాల హస్తకళను ప్రదర్శిస్తాయి.


💠 ఈ గ్రామం ప్రసిద్ధ మలయాళ వ్యంగ్య కవి మరియు ఒట్టంతుల్లాల్ కళారూపాన్ని స్థాపించిన కుంచన్ నంబియార్ (రామ పనివాడ) జన్మస్థలం. 

కుంచన్ నంబియార్ జన్మించిన ఇల్లు- కలక్కతు భవనం ఇప్పుడు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. 

ఇక్కడ కుంచన్ నంబియార్ జ్ఞాపకార్థం కుంచన్ స్మారక వాయనశాల- కుంచన్ మెమోరియల్ లైబ్రరీ అనే గ్రంథాలయం కూడా ఉంది. 


💠 పురాణ కూడయాట్టం మరియు చాక్యార్ కూతు కళాకారుడు మరియు ప్రఖ్యాత నాట్యశాస్త్ర పండితుడు నాట్యాచార్య విదుషకరత్నం పద్మశ్రీ గురు మణి మాధవ చాక్యార్ కూడా ఇక్కడ నివసించారు, వీరు అభినయ (నటన) అధికారి.

అతని ఇల్లు కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయానికి సమీపంలో ఉంది. 

ఇది చాక్యార్ యొక్క ప్రముఖ శిష్యులలో ఒకరైన గురు కేలు నాయర్ స్వస్థలం.

ప్రసిద్ధ సంస్కృత పండితుడు కొప్పట్టు అచ్యుత పోతువల్ కూడా ఈ ఆలయానికి సమీపంలో నివసించారు.


💠 పాలక్కాడ్ నుండి 70 కి.మీ.ల దూరంలో ఉంది

కార్తీక పురాణం -12

 _*కార్తీక పురాణం -12 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ద్వాదశి ప్రశంస*

*సాలగ్రామ దానమహిమ*


☘☘☘☘☘☘☘☘☘


*"మహారాజా ! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి , సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"* మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.


కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి , సాయంకాలము శివాలయమునకు గాని , విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి , నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక , మోక్షము కూడా పొందుదురు.


కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున , పూర్ణోపవాసముండి ఆ రాత్రి  విష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి , శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన , కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక , కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి , ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి , దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున , కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని , సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము.


*సాలగ్రామ దానమహిమ*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు , తాననుభవించక , యితరులకు బెట్టక , బీదలకు దానధర్మములు చేయక , ఏల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవిగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక *"పరులద్రవ్యము నెటుల అపహరింతునా !"* యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.


అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు *"అయ్యా ! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా , మీ ఋణము తీర్చుకోగలను"* అని సవినయముగా వేడుకోనెను. ఆ మాటలకు కోమటి మండిపడి *"అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీ కంఠమును నరికి వేయుదును"* అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి , అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక , అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.


ఆ  వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు , నీడకొరకై చెట్లు నాటించుచు , నూతులు , చెరవులు త్రవ్వించుచు , సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి , త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి , విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి , చేతులు జోడించి *"మహానుభావా ! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ   నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు"* అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి *"ఓ ధర్మవిరా ! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రితికరమైన దినము. అరోజున స్నాన , దాన , జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా , జారుడైనా , చోరుడైన , పతివ్రతమైనా , వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి , సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ , ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము"* అని చెప్పెను.  అంతట దర్మవిరుడు *" నారద మునివర్యా ! నేను గోదానము , భూదానము , హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని , అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునా   యని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా ! దాహంగొన్న వానికి దాహం తీరునా ? కాక , యెందులకీ దానము చేయవలయును ? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"* నని నిష్కర్షగా పలికెను.


ధర్మవీరుని అవివేకమునకు విచారించి *"వైశ్యుడా ! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని , యీ దానముతప్ప మరొక మార్గము లేదు"* అని చెప్పి నారదుడు వెడలిపోయాను.


ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు , దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి , మరి మూడు జన్మలందు వానరమై పుట్టి , ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి , పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి , పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టి  ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.


చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగేనా యని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి *"నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక"* యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయి  ఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం , జన్మాంతరమున స్వర్గమున కెగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.


కావున , ఓ జనకా ! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము -* *పన్నెండోవ రోజు పారాయణము సమాప్తము.*


🙏💐🌺🌸🌼🌻🦜🦚🌞🌝

13, నవంబర్ 2024, బుధవారం

గురువారం*🌷 🌹 *14, నవంబరు, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌷 *గురువారం*🌷

🌹 *14, నవంబరు, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి     : త్రయోదశి* ఉ 09.43 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం : గురువారం*(బృహస్పతివాసరే )

*నక్షత్రం  : అశ్విని* రా 12.33 వరకు ఉపరి *భరణి*


*యోగం  : సిద్ధి* ఉ 11.30 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* ఉ 09.43 *గరజి* రా 08.01 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 05.00*

అమృత కాలం : *సా 06.08 - 07.34*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.15*


*వర్జ్యం     : రా 08.59 - 10.25*

*దుర్ముహూర్తం  : ఉ 09.58 - 10.44 మ 02.31 - 03.16*

*రాహు కాలం  : మ 01.17 - 02.42*

గుళికకాళం      : *ఉ 09.01 - 10.27*

యమగండం    : *ఉ 06.11 - 07.36* 

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.11*

సూర్యాస్తమయం :*సా 05.33*

*ప్రయాణశూల  : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.11 - 08.27*

సంగవ కాలం   :*08.27 - 10.44*

మధ్యాహ్న కాలం :*10.44 - 01.00*

అపరాహ్న కాలం :*మ 01.00- 03.16*

*ఆబ్ధికం తిధి  : కార్తీక శుద్ధ చతుర్దశి*

సాయంకాలం :  *సా 03.16 - 05.33*

ప్రదోష కాలం  :  *సా 05.33 - 08.05*

రాత్రి కాలం    :  *రా 08.05 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.30 - 05.21*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏


*శోషణం భవసింధోశ్చ ఙ్ఞాపణం సారసంపదః* |

*గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః* 



      *ఓం  శ్రీ దత్తాత్రేయాయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

కార్తీకపురాణం 13

 కార్తీకపురాణం 13 వ అధ్యాయము

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


🍃🌷కన్యాదాన ఫలం, సువీరచరిత్రము:


🌷కన్యాదాన ఫలము:


తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు, ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకి౦పుము.


కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తా౦బూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన౦దువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకి౦పుము.


🌻సువీర చరిత్రము:


ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగుచుండెను, ఆమె చూచు వారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. 


ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు" నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.


అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.


ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, "ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచి౦పక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరక మనుభవి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశి౦తురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవి౦చును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణి౦చియే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము.


అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగి పోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమా౦టారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦పగలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను" అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.


మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.


అంతటా శ్రుతకీర్తి "నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?" నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మముర్తివి, బుద్దిశాలివి. ప్రాణకోటినంతను సమ౦గా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి "శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభావించుటయేగాక, నీచ జన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. 


నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాల౦కృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము" అని పలికెను.


శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.


కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.


ఓం నమః శివాయ…🙏🙏

జయ జయ జగదంబ శివే*

 *జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*

...............................................................

*శ్రీ మూకశంకర* విరచిత  *మూక పంచశతి*

🔱 *శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన*🔱


▪▪▪▪▪▪▪▪▪▪▪

శ్లోకము:-

*పౌష్టిక కర్మవిపాకం పౌష్పశరం సవిధ సీమ్ని కంపాయాః*

*అద్రాక్షం ఆత్తయౌవనం అభ్యుదయం కంచిత్ అర్ధశశిమౌళేః II 24 ||*

▪▪▪▪▪▪▪▪▪

ప్రతిపదార్థం

కమ్పాయాః = కంపానది యొక్క

సవిధ-సీమ్ని = సమీప ప్రదేశమున

పౌష్ప-శరమ్ = మన్మథునకు సంబంధించిన

పౌష్టిక-కర్మ-విపాకమ్ = పౌష్టిక కర్మల పరిణామమైన

ఆత్త-యౌవనమ్ = యౌవనమునొందిన

కఞ్చిత్ = ఒకానొకదానిని

అర్ధ-శశిమౌలేః = శివునియొక్క

అభ్యుదయమ్ = అభ్యుదయమును

అద్రాక్షమ్ = చూచితిని



*‌భావము:* 

కంపానదీ సమీపమున మన్మధుని పౌష్టిక కర్మల పరిపాకముగా యౌవనము పొందిన అర్ధచంద్రమౌళి యొక్క ఒకానొక అభ్యుదయమని చెప్పదగిన అమ్మవారిని చూచితిని.

*****

*వివరణ*

పౌష్టికకర్మలని, శాంతికర్మలని వైదికకర్మలు రెండువిధములు.వానిలో శాంతికర్మలు ( పూర్వజన్మచంచితమైన దానిని శాంతింపచేసి ఈ శరీరమును కల్పించుట ద్వారా) పాపములను ప్రారబ్ధకర్మల ద్వారా కలిగించునట్టివి. పౌష్టీకములు మంగళములను కలిగించునవి.ఆయుర్వేద శాస్త్రముననూ శరీరపుష్టిని కలిగించు ఔషధముల కర్మలు వాజీకరణములు రోగములను శమింపచేయు ఔషదకర్మలు ఉన్నవి.

ప్రస్తుతం మన్మధుడు కొన్ని పౌష్టిక కర్మలొనరింప తత్పరిపాకమున అమ్మవారికి యౌవనము కలిగినది.ఇప్పుడు దానిచేత తన పూర్వ విరోధి ఐన శివుని గెలువవచ్చని సంతోషించిటకు ఆమె యౌవనము కారణమైనది.ఇప్పుడు తన పుష్ప బాణములకు సాన పెడుతున్నాడు.అమ్మవారి శరీరమంతయూ పుష్పగంధము పుష్పసుకుమారము అనగా అది మన్మధునకు అమ్ములపొది ఐ‌నది. దీనిని చూడగానే శివుడు తన ఓటమిని సంతోషముతో అంగీకరించినాడు.ఇది తన అభ్యుదయముగా భావించినాడు.తాను వియోగకాలమున చేసిన తపమంతయూ ఫలించినది అనుకున్నాడు.నాడు మన్మధుని దహించి సంపాదించిన పాపమును ఇక కడుగుకొనవచ్చని అనుకున్నాడు.పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేసినట్లు పుష్పశరుని ప్రళయకాలభీల పాలనేత్రాగ్ని వృష్టిని కురిపించి కాల్చివేయుట శివునకు ధర్మము కాదు! అనురీతిన వచ్చిన అపకీర్తిని తొలగించుకుని మన్మధసామ్రాజ్యము ఏలుకొనవచ్చు అనుకున్నాడు.

ఇహపరలోకముల కలుగు సౌఖ్యము అభ్యుదయమనబడును.చంద్రమౌళి కామాక్షిని గూర్చి దాంపత్య ధర్మము అవలంబించుటకు వీలును కలిగించునట్టిది అమ్మవారి యౌవనము. కావున దానిని అతడు అభ్యుదయముగా భావించినాడు.

{ఈ శ్లోకమున శివుడు అర్ధశశిమౌళి గా పేర్కొనబడినాడు.}


🙏 *ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ..*🙏