ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
29, సెప్టెంబర్ 2025, సోమవారం
27, సెప్టెంబర్ 2025, శనివారం
పరిమళ ద్రవ్యముల చరిత్ర
ఆయుర్వేదము నందలి భాగమైన పరిమళ వైద్యము గురించి సంపూర్ణ వివరణ -
పరిమళ ద్రవ్యముల చరిత్ర అత్యంత పురాతనమైనది. రమారమి మూడువేల సంవత్సరాల క్రితమే వేదములలో వర్ణింపబడిన " పరోమ" విధానమున పరిమళ పుష్పముల యొక్క మరియు సుగంధద్రవ్యముల యొక్క ప్రస్తావన కలదు. ఋషులు పరిమళభరితమైన ధూపము దేవతలను ఆవాహనకు ఉత్తమ సాధనగా భావించిరి. ఆనాడు హోమధూపమును వాతావరణము నందలి కల్మషము ప్రక్షాళణ చేయుటకు , దుర్గన్ధమును , రోగాసాంక్రమిక క్రిములను పారద్రోలుటకు సాధనాభూతముగా ఉపయోగించేవారు.
వరాహమిహిరుడు తన బృహత్సంహిత నందు పరిమళ ద్రవ్యముల గురించి వివరించెను. ఆనాడు శ్రీగంధం ఎక్కువుగా వాడుక నందు ఉండేది. జాజి , దవనం , మరువం , కస్తూరి , కర్పూరం , కుంకుమపువ్వు మున్నగు వస్తువులు కూడా ఉపయోగించేవారు .
. ప్రముఖ మరాఠ కవి గంగాధరుడు "గంధసార - గంధపాత" అను గ్రంథముల యందు పరిమళ ద్రవ్యముల గురించి తెలుపుచూ వాని తయారీ మరియు వినియోగించే విధానం గురించి వివరించాడు. దాదాపు 1500 సంవత్సరముల నాటి పంచతంత్రమున విష్ణుశర్మ సుగంధద్రవ్యముల వర్తకము , బంగారు వర్తకము కంటే లాభసాటిది అని చెప్పుటను గమనిస్తే ఆకాలము నందు వాటిపై ప్రజలకు గల ఇష్టాన్ని మనం గమనించవచ్చు .
ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ దేశము నందలి కుమ్రాన్ గుహలలో తవ్వకాలు జరిపినపుడు పురాతన శాస్త్రవేత్తలకు ఒక పాతనూనె సీసా కనిపించింది. ఆ సీసాను పరిశోధించినప్పుడు అది 2000 సంవత్సరాల పూర్వమునకు చెందినది అని తేలింది . అప్పటి మహారాజులు పరిమళద్రవ్యముగా ఆ సీసా నందలి తైలమును వాడేవారు అని బయటపడినది. ఇన్ని సంవత్సరాలు గడిచినను ఆ సీసా నందలి పరిమళద్రవ్యము ఘుమఘుమలాడుచుండెను.
ప్రాచీన కాలము నందు భారతదేశము , పర్షియా , ఈజిప్టు సుగంధద్రవ్యముల తయారీలో అగ్రగాములుగా ఉండెను . వారు ఆకులు , పువ్వులు , వ్రేళ్లు దంచి చమురులో నానబెట్టి పరిమళద్రవ్యములు తయారుచేసెడివారు. పరిమళ వస్తువులు రోగనివారణలో ప్రముఖ పాత్ర వహించునని ఆయుర్వేద తంత్రకర్త చరకుడు తన చికిత్సాసారమున తెలిపి గంధము , గోరింట , వట్టి వేళ్లు , తామర , కలువలు మున్నగు వానితో సిద్ధము చేసిన తైలములతో చికిత్స చేయు విధానమును వివరించెను.
"సుఖాంతి' అను పుష్ప పరిమళము నిర్ణీత సమయమున నిత్యం వాసన చూసుట వలన ఉబ్బసం వంటి శ్వాశకోశ వ్యాధులు నయం అగును. చంద్రమోహ పుష్పముల సుగంధము మానసిక వ్యాధులకు విరుగుడుగా పనిచేయును . పవనాలి అనే పుష్పముల సుగందము రక్తపోటుకు విరుగుడుగా పనిచేయును . ఈ పువ్వులన్నియు హిమాలయముల యందే లభించును. కొన్ని రకాల పుష్ప సుగంధములను లోపలికి పీల్చుట చేత తలనొప్పి నుండి గుండెపోటు వరకు అనేక రోగములను నయం చేయవచ్చు .
. ఇప్పుడు మరికొన్ని మూలికా సువాసనల ఉపయోగాలు తెలుసుకుందాము.
* పుదీన -
. కొన్ని ఆకులను నలిపి వాసన చూసిన యెడల అరుచి , అగ్నిమాంద్యము , నోటి దుర్గంధం , శిరోభారం , దగ్గు , జలుబు నశించును. దీనిని కూరలలో , పచ్చళ్లలో వాడినయెడల రుచిని పెంచును.
* కొత్తిమీర -
. దీని వాసన చూచినయెడల వాంతులు అరికట్టును. మనసుకు శాంతముగా ఉండును. తలనొప్పి నివారణ అగును.
* దాల్చినచెక్క -
. శ్రీలంక యందు దీని చెట్లు ఉండును. దీని ఆకులను లేదా చెక్క నుంచి తీసిన తైలము నందు నయుజినాల్ , సిన్నామిక్ , అల్దేహైడ్ , పప్పెన్ , ఆల్కాల్సు , బెంజిల్ బెంజోయెట్ సాపరోర్ , ఫర్ ఫ్యులాల్ ఓనోవ్ మున్నగు రసాయనాలు ఉండును. ఇది వాసన చూసినను లేదా తలకు రాచుకొనుచుండిన యెడల దీర్ఘకాలంగా వేధిస్తున్న తలనొప్పి , జలుబు , పొడిదగ్గు నివారించబడును. కడుపులొకి వాడుచున్న కడుపునొప్పి , కడుపుబ్బరం , అతిసారం , రక్తపిత్తము , తెల్లకుసుమ తగ్గును. పాము కరిచినప్పుడు రక్తం పిండి దీని అరుకు అంటించిన యెడల విషము హరించును .
మత్తెక్కించే సువాసనలు -
* గోరింట పువ్వుల గుత్తులను వాసన చూచుచుండిన లేదా తలకింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .
* వెలగ చెట్టు ఆకు వాసన చూచిన యెడల వాంతులు నిలుచును . తలగడ కింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .
* గసగసాలు ఒక స్పూన్ తీసుకుని నాలుగు చుక్కలు ఆవునెయ్యి వేసి ఒక ఇనప గంటెలో వేయించి పలచటి బట్టలో వేసి వాసన చూస్తున్న యెడల గాడనిద్ర పట్టును .
* దవనం , మరువం , జాజి , జాపత్రి , యాలుకలు , చందనం , కురువేరు వంటి ఔషధ తైలాలు గాడనిద్రను కలుగచేయును .
. పైన చెప్పిన గాడనిద్రను కలుగచేయు యోగాలను నిద్రపట్టక ఇబ్బంది పడువారు తప్పక ఉపయోగించుకొని సమస్యల నుంచి బయటపడవచ్చు.
. సంపూర్ణం
మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
తెలుగు నేల
తెలుగు నేల
అలతి పదమ్ముల నన్నమాచార్యుండు
హరికీర్తనమ్ముల నల్లె నిచట
భద్రాద్రిరాముని ప్రస్తుతి చేసి తా
రమ్యతన్ గీర్తించె రామదాసు
మువ్వగోపాలుపై మురిపెంపు పదములన్
బల్కి క్షేత్రయ్యిట బడసె ముక్తి
స్వరబ్రహ్మ త్యాగయ్య వరలినభక్తితో
దివ్యకీర్తనముల తీర్చె నిచట
వసుధ వరలెడి గాన విద్వాంసులకును
జానపదులకు సంగీతజ్ఞానులకును
భక్తి సంగీత జ్ఞానమ్ము పంచినట్టి
దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగు నేల
శ్రీవేంకటేశ్వర క్షేత్రమ్ము వెలసియు
విశ్వమ్ము నందున వినుతి చెందె
లక్ష్మీనృసింహుని సుక్షేత్రరాజమై
విలసిల్లె యాదాద్రి విభవముగను
భవ్యగోదావరీ పావనతీరాన
భద్రాద్రినిలయము పరిఢవిల్లె
దివ్య ద్వాదశలింగతీర్థమై నటువంటి
శ్రీశైలలింగ మీ క్షితిని వెలసె
సకల హరిహరక్షేత్రాల సంగమంబు
భవ్య పావన వాహినీ ప్రాంతయుతము
హరిత కానన విరిసస్య భరిత మైన
దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగునేల
బసవపురాణమున్ ప్రజల కందించిన
పాల్కురికి కవీంద్రు ప్రాంత మిద్ది
తెలుగుభారతమును తీర్చి దిద్దిన యట్టి
నన్నయ్య యున్నట్టి మన్ను యిద్ది
భారత గ్రంథానపదునైదు పర్వాల
చెప్పిన తిక్కన క్షేత్ర మిద్ది
భాగవతమ్మును భక్తాళి కిచ్చిన
పోతన బుట్టిన పుడమియిద్ది
భారతేతిహాస పురాణ వర్గములును
భవ్య సాహిత్య జటిల ప్రబంధములును
నెలవుగా పొంది దశదిశల్ వెలిగినట్టి
దివ్యమైనట్టి ధాత్రి యీ తెలుగు నేల
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
మనసు వృత్తి**
**మనసు వృత్తి**
👉నా పంధాయే నాకు ముఖ్యం
👉నేను ఏది వినను
👉నాకు విచక్షణ వద్ధు
👉నాకు నిజాయితి అంటే గిట్టదు
👉నేను చెప్పేది ఒకటి, నేను చేసేది ఇంకొకటి
👉మోసం చేయడమే నా వృత్తి
లాభం: పంతాన్ని సాధించుకోవడం
నష్టం: ఎన్నో జన్మలు ఎత్తుతూ తీవ్ర దుఃఖంలో మునిగి పోవడం. ఆత్మకే ద్రోహం చేయడం
**బుద్ధి వృత్తి**
👉నేను వింటాను.
👉నేను వింటున్నాను.
👉 నేను విచక్షణను
👉 నేను నిజాయితీని
👉నేను చెప్పేదే చేస్తాను, నేను చేసిందే చేబుతాను.
👉మోసం చేయడం నా వృత్తి కాదు.
లాభం: మనశ్శాంతి, జన్మరాహిత్యం.
నష్టం: డబ్బు, పదవి, పేరు ప్రతిష్టల మీద మోజు నశించడం
**శరీర వృత్తి**
👉 భానిసలాగ తిరుగడం.
👉అనారోగ్యం మరియు శరీర భాధలు
**ఆత్మ వృత్తి**
👉ఇవన్నింటికీ ఆధారంగా
**నేను ఉన్నాను**
👉నేను ఉన్నాను ఉనికిగా
👉నేను ఉన్నాను శాంతిగా
👉నేను ఉన్నాను అనుభవంగా
👉నేను ఉన్నాను విస్తృతంగా
👉నేను ఉన్నాను దృఢంగా
👉నేను ఉన్నాను విశాలంగా
👉నేను జన్మించలేదు, కాబట్టి నాకు మరణ లేదు.
👉నేను ఉన్నాను ఏ ఆలోచనలకూ అందని అనుభూతిగా అంటుంది.
కర్తవ్యం ఏంటి?
1️⃣ ఎవరిని పట్టుకోవాలి?
ఎవరిని పట్టించుకోవద్ధు?
2️⃣ ఎవరిని నమ్ముకోవాలి?
ఎవరిని నమ్మవద్ధు?
3️⃣ నేను ఎవరిని?
👉ఒక ఉనికినా?
👉మనసునా? బుద్ధినా?
👉శరీరాన్నా?
4️⃣ నేను ఎలా ఉన్నాను?
ఈ విచారణ ద్వారా విచక్షణను సాధించడం, ఈ విచక్షణలో *మనసు* స్థిరపడేలా చేయడమే కర్తవ్యం.
భగవాన్ బోధనల దయ ..🙏🙏
ఈ పద్యం గుర్తుందా
ఈ పద్యం గుర్తుందా
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
అనుగ్రహ భాషణం
శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 ఆధ్యాత్మికత అడుగడుగునా కనిపించే ఈ శరన్నవరాత్రులలో పండిత శ్రేష్ఠులు చెప్పే నాలుగు మంచి మాటలు వినడం కంటే అదృష్టం ఏముంటుంది! ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధకులైన ప్రవచన వేత్త జి. శివప్రసాద శాస్త్రి గారు ప్రత్యేకంగా అందిస్తున్న ఈ అనుగ్రహ భాషణంలో మన ధర్మం ఏమిటో, దానిని ఎలా అనుసరించాలో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం - చతుర్థి - విశాఖ - భృగు వాసరే* (26.09.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
25, సెప్టెంబర్ 2025, గురువారం
చతుర్ధావస్థ
చతుర్ధావస్థ
మోక్షార్ధులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. ప్రతి సాదారణ మానవుడు తన దైననందికే జీవితంలో మూడు అవస్థలలో జీవితాన్ని గడుపుతాడు.కేవలం జ్ఞాని మాత్రం నాలుగవ అవస్థను పొందగలుగుతాడు దానిని తురీయావస్థ లేక సమాధి స్థితి అని అంటారు. ముందుగా ఈ మూడు అవస్థలలో ఆత్మ జీవునితో (మానవునిలో) ఎలా ఉంటుంది.అది చూద్దాము అవి ఏమిటంటే
1) జాగ్రతావస్థ
మనం నిత్యం నిద్రలేచినప్పడి నుండి మరల నిద్రించే వరకు ఈ స్థితిలోనే ఉంటాము జాగ్రత్తావస్థలో ఆత్మా శరీరంలో ఉంది ఈ చరాచర జగత్తుతో సంచరిస్తూ ఉంటుంది. దశ ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు, 5కర్మేంద్రియాలు) తేజోమయంగా (active )గా ఉండి ఐహిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, చర్మం స్పర్శ కలిగి ఉంటుంది. జిహ్వ రుచుల చూస్తూ ఉంటుంది. అంటే దాని అర్ధం అవి అన్ని ఒక్కసారి వాటి పనులు చేస్తాయి అని కాదు. వీటి అవసరం వచ్చినప్పుడు అవి చురుకుగా వాటి పనులు నిర్వహిస్తూ వున్నాయి అన్న మాట. ఒక దృశ్యాన్ని చూడాలంటే కళ్ళు చూడగలవు. అవి చుసిన విషయాన్నీ మనస్సు ద్వారా చెతన్య స్వరూపమైన ఆత్మకు చేరవేయగలవు. అనుకుంటే తాత్కాలికంగా కళ్ళు మూసుకొని కొంత సమయం చూడటం అనేది చేయకుండా ఉండవచ్చు. మరల కావాలంటే కళ్ళు తెరుచుకొని చూడగలవు. అంటే పాటిది మనస్సు నిర్వహించగలదు. అలాగే ముక్కు, చెవి కూడా చేయగలవు. అలాగే కర్మేంద్రియాలు కూడా వాటి వాటి కర్మలను అంటే ఇవి కూడా ఐదు రకాలు:అవి వాక్కు (మాట్లాడటం), పాణి (చేతులు), పాదం (కాళ్లు), పాయువు (మలద్వారం), మరియు ఉపస్థ (అంగం). జ్ఞానేంద్రియాల వలె కాకుండా, కర్మేంద్రియాలు మన పనులు, కదలికలు, మరియు శారీరక కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఈ పది ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఈ అవస్థను జాగ్రదావస్థ అని పేర్కొన్నారు. జాగ్రత్తవస్థలో వున్న ఆత్మ మొదటి పాదంగా తెలియవడుతున్నది దీనికి వైశ్వానరుడు లేక విసుడు అని పేరు ఎందుకంటె ఇక్కడ ఆత్మ విశ్వముతో సంయమం కలిగి ఉన్నందున ఈ పేరు వచ్చింది
2) నిద్రావస్థ లేక సుషుప్తావస్థ
జాగ్రత్తవస్థలో రోజంతా శారీరిక వ్యాపారాలు చేసిన ఆత్మా విశ్రాన్తి తీసుకునే అవస్తే నిద్రావస్థ లేక సుషుప్తావస్థ ఈ స్థితిలో మనస్సు లయమై ఉంటుంది. నిద్రలో చాలామటుకు శరీరం చేష్టలు లేకుండా ఉంటుంది. అంటే ఇంద్రియాలు వాటి పనులు చేయవు. కానీ ఆత్మ మాత్రం జాగృతంగానే ఉంటుంది ఈ స్థితిలో వున్నా ఆత్మ పాదాన్ని ప్రాజ్ఞుడు గా పేర్కొన్నారు.
ఎంతటిపుణ్యమో
శు భో ద యం 🙏
"ఎంతటిపుణ్యమో శబరియెంగిలిఁగొంటివి వింతగాదె నీ
మంతన మరయఁగా,యుడుత మైని కరాగ్రనఖాంచలమ్ములన్
సంతసమందఁజేసితివి;సత్కులజన్మములేమిలెక్క?వే
దాంతముగాదె,నీమహిమ!దాశరధీ కరుణాపయోనిధీ!
- కంచెర్ల గోపన్న.
భగవంతుని లీలలు అనుాహ్యములు.శబరి భిల్లకాంత,పండుముదుసలి.ఆమెయొసగిన యెంగిలి పండ్లను ముదమారగ నారగించి ఆమెకు మోక్షము నొసంగెను.
సేతుబంధనసమయమున ఉడుత చేయు సాయమును పరికించి పులకితుడై దానివీపున తనకరాగ్రముననిమిరెను.కరుణార్ద్రములైన స్వామి చేతిచిన్నెలు ముచ్చటగొలుపు చారలుగా నాజాతికి దఖలు పడినవి.
ఏమిది?స్వామి తనభక్తులపట్ల చూపు కారుణ్యమునకు హద్దులులేవు.చిన్నపెద్దలను తారతమ్యములు లేవని తెలియజెప్పుటగదా?
రామా! నీమహిమ వేదాంతమయ్యా!మాటలకందదు.
స్వస్తి!!!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
నవరాత్రి వేడుకలు
శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹విజయ దశమికి ముందు పది రోజుల పాటు ప్రతి ఇల్లు అమ్మవారి ఆలయంలా మారిపోతుంది. అన్ని ఇళ్లు ఆ జగన్మాత అర్చనలతో కళకళలాడుతూంటాయి. హైదరాబాద్ గాంధీ నగర్ లోని శ్రీమతి దేవులపల్లి దుర్గ గారి మిత్రబృందం నిర్వహించిన నవరాత్రి వేడుకలు ఈ ఎపిసోడ్ స్పెషల్. అమ్మవారి స్తోత్రాలు వీనుల విందుగా ఆలపించారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🌹
