22, మే 2020, శుక్రవారం

ఎమర్జెన్సీ ప్రకటించాలి

కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించాలి 
కరోనా కేసులు మాములుగా వున్నప్పుడు లాక్ డౌన్ చాలా సీరియస్ గా వుంది. లాక్ డౌన్ ఒకదాని తరువాత ఒకటిగా పెంచుకుంటూ పోతున్నప్పుడు కేసుల పెరుగుదల రేటు తదనుగుణంగా వృద్ధి చెందుతూ వున్నది.  కానీ ఇప్పుడు పరిస్థితి చుస్తే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు అంత సీరియస్ గా పట్టించుకుంటున్నట్లు తెలియటంలేదు.  ఇక్కడ తెలంగాణాలో టెస్టులు ఎక్కువగా చేయడంలేదని అభియోగాలు వస్తున్నాయి.  అంతేకాదు కేంద్ర ఆరోగ్య శాఖా కార్యదర్శి ఇక్కడి కార్యదర్సులతో వివరాలు అడిగినట్లు వాట్సాప్ సమాచారం.  ఇది ఎంతవరకు నిజం తెలియదు.  రోజు వాట్సాప్ సమాచారాలు వివిధ రకాలుగా వస్తున్నాయి.  కొన్ని చోట్ల రాజకీయ నాయకులు  పోలీసులపై జులుం చేస్తున్నట్టు వీడియోలు వస్తున్నాయి.  అవి నిజామా కదా అనేది ప్రభుత్వం చెప్పాలి.  ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా రాజకీయనాయకులు పోలీసులపై వత్తిడి చేస్తున్నట్లు చెప్పటంలేదు.  నిజంగా నాయకులు పోలీసులపై వత్తిడి (దౌర్జన్యం)  చేస్తే మరి పోలీసులు నాయకులపై కేసులు పెట్టటానికి ఎందుకు వెనకడుతున్నట్లు తెలియటంలేదు. ప్రస్తుతం భారత్ ప్రభుత్వం కరొనను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా డాక్టర్లమీద కానీ పోలీసులపై కానీ దౌర్జన్యం చేస్తే చాల తీవ్రంగా పరిగణించి కఠినంగా శిక్షించేటట్లు చట్టాలు చేసిన సంగతి మనకు తెలిసిందే,  ఈ నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకులకు  ఎందుకు భయపడుతున్నారు.  మీడియా కూడా కొన్ని విషయాలను ధైర్యం చేసి చూపించట్లేదని వాట్సాప్లో వస్తున్నాయి. .  ఇట్లా ప్రజలలో వివక్షత చూపిస్తే కరోనా కట్టడి చేయటం చాల కష్టం అవుతుంది. కేవలం కొంతమంది జనం లాక్ డౌన్ పాటిస్తే సరిపోదు కరోనా బైట తిరిగే వారు ఎవరైనా కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అందరికి సోకుతుంది.  ఇది సత్యం ఇట్టి స్థితిలో కొంతమంది మీద వివక్షత చూపి లాక్ డౌన్ సడలిస్తే దేశం యావత్తు దాని మూల్యంగా  రేపు తీవ్రంగా బాధ పడవలసి వస్తుంది.
అటు మద్యం దుకాణాలు తెరచి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు  ఒకరకంగా కరోనాని తలుపులు తెరచి ఆహ్వానించినట్లు చేసారు . గ్రీన్ జోన్లలో అన్ని దుకాణాలు తెరవచ్చని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవవచ్చోని  ఆదేశాలు ఇచ్చారు. మరి అందరు ఎంతవరకు సురక్షితంగా వుంటారు అనేది ప్రశ్న. జనాల ప్రాణాలకు ఎవరు భాద్యత వహిస్తారు.
మన దేశంలో వున్న హాస్పిటల్స్ మన జనాభాకు తగినంతగా లేవని మొదటి నుంచి చెపుతున్నారు. ఇక PPT కిట్లు N 95 మాస్కులు, వెంటిలేటర్లు ఏ మాత్రం వున్నాయి అవి ఎంతవరకు మన కరోనా పోరాటంకు దోహదపడుతాయి అన్నది ప్రశ్నర్ధకంగా వున్నది. మనము దేశ ఆర్ధిక వృద్ధిని ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సాదించాలా అని మేధావి వర్గం అంటున్నాయి.  మొన్న మద్యం దుకాణాల వల్ల ఎంతో మంది వాళ్ల అమూల్య ప్రాణాలు పోగొట్టుకున్నారని  మనం వార్తల్లో చూసాం. ఆంద్రప్రదేశ్ కన్నా మన రాష్ట్రములో మద్యం ధర కొంచం తక్కువ అని మన రాష్ట్ర హద్దులలో వున్నా జిల్లాలోకి ఆంధ్రా జనం వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం.  ఇది సరిహద్దులు దాటి రావటం అవుతుంది.  దీనివల్ల కరోనా కట్టడి ఎంతవరకు ఉంటుంది.  అటు మద్యం దుకాణాకారులు వారికి సరిహద్దు ఆవాలు వినియోగదారుల వల్ల ఎక్కువ లాభాలు వస్తూవుంటే వారు ఎందుకు ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తారు అని ప్రజలు అంటున్నారు.  ఇకపోతే 40 రోజుల పైన ఒక్క చుక్క సారా కూడా తాగని మద్యపాన ప్రియులు ఒక్కసారిగా సాగారు డాం గేట్లు తెరచినట్లుగా ప్రవాహంలా దూకి సామాజిక దూరం పాటించకుండా లిక్కర్ కొనటానికి వస్తున్నారు. ఇక  10 వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే యుక్త వయసులో వున్నా పిల్లలు కరోనాకు బాలి కాకుండా కాపాడటం ఎలా.   మొన్న మహబూబునగరు లో out sourcing ఉద్యోగాల నియామకానికి ఎంతమంది గుమికూడి వచ్చారో చూసాం.  అందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చిందా? తెలియదు టెక్ష్ట్స్ చేసారా తెలియదు. వలస కూలీల పరిస్థితి దయనీయంగా వున్నది.  కొంతమంది వారి ఊళ్లకు వెళ్లకుండానే మధ్యలోనే మరణించారు. కొందరు అటు వల్ల ఊరికి పోలేక వున్నచోట ఉండలేక నానా బాధలు పడుతున్నారు.
ఇప్పటి మన భారత దేశ పరిస్థితి ఏమిటంటే పూర్తిగా వ్యాధి వ్యాపించకుండా చేసుకోవటమే అంతకు మించి వేరే గత్యంతరం లేదు.  రోగులకు చికిత్స లేదు అని డాక్టర్లు గంటాపధంగా చెపుతున్నారు. ప్రజలలో ఓపిక నశించి ఇంటినుంచి బైటకు వస్తున్నారు.  అది కేవలం వారి వారి ప్రణాలను పణంగా పెట్టటమే అని ఎన్ని విధాలుగా చెపుతున్నా వినే స్థితిలో ఎవ్వరు లేరు.
అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉమ్మడిగా కఠినంగా లాక్ డౌన్ పొడిగించటం మినహా మనము కరోనా నుండి కాపాడుకోటం వీలు కాదు.  అది ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అని అందరు అంటున్నారు.  ఎన్ని నెలలు ఐనా భరించాలి తప్పదు.
ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఒకేవిధమైన నియమ నిబంధనలతో లాక్ డౌన్ నియమించాలి.  అది కేవలం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పూర్తి దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్కి తీసుకొని ఒకే విధానాన్ని దేశం మొత్తం కఠినంగా అమలు చేయాలి.  కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించక పొతే మునుముందు పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయా ప్రమాదం వుంది.
కాబట్టి మన దేశ ప్రధానమంత్రి గారికి విన్న వించుకునేది ఏమనగా దేశ ప్రజల క్షేమం పరిగణలోకి తీసుకొని వెను వెంటనే  ఎమర్జెన్సీ ప్రకటించి మన దేశాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.
సి. భార్గవ శర్మ న్యాయవాది, హైదరాబాద్.


21, మే 2020, గురువారం

బ్రహ్మ జ్ఞ్యానం



 మనకు ఇంద్రియగోచరమైనది జగత్తు. ఈ జగత్తులో వున్నది ఒకటే అది జ్ఞానం. ఈ జ్ఞానం అనంతమైనది, అద్వితీయమైనది, అపారమైనది. అనన్యమైనది, శాశ్వితమైనది. అందుకే దానిని బ్రహ్మ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం జగత్తులో వున్నా ఇది జగత్తు కాదు జగత్తుకన్నా భిన్నంగా వుండివుంది.   బ్రహ్మ శబ్దం అత్యుత్తమమైనదానికి మాత్రమే వాడుతారు. ఈ ప్రపంచంలో మనుషులను బ్రహ్మజ్ఞ్యాన పరంగా రెండు రకాలుగా విభజింపవచ్చు. 1) జ్ఞానం కలిగినవారు వారిని బ్రహ్మ జ్ఞానులు అంటారు.  2) జ్ఞ్యానం లేనివారు వారిని బ్రహ్మ అజ్ఞానులు అంటారు. ఎప్పుడైతే మనకు లేనిది పొందుతామో ఆ పొందింది కలిగి ఉంటాము. అజ్ఞ్యానం అనేది చీకటి అనుకుంటే జ్ఞానమనే వెలుతురూ ఎప్పుడైతే వస్తుందో అక్కడ అజ్ఞానం అనే తిమిరం పారద్రోలపడుతుంది. తద్వారా జ్ఞానం కలుగుతుంది.  ఇట్లా అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టే వాడే గురువు. 
సాధారణ మానవులు జ్ఞానం అనేది ఈ జగత్తులోనే వున్నదని తానూ చూస్తూవున్న జగత్తులో జ్ఞానాన్ని వెతుకుతారు. నిజానికి ఆ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కాదు కేవలం ఇంద్రియ గోచరమైన జ్ఞానం ఇది అసంపూర్ణం .  ఎందుకంటె ఎవరైతే ఒక విషయం గూర్చి జ్ఞానం పొందుతారో దానికన్నా ఆ విషయం లో ఎక్కువ జ్ఞానం పొందిన ఇంకొకరు వానికి తారస పడ్డప్పుడు తాను పొందిన జ్ఞానం కొంతవరకే అనేది తెలుసుకుంటారు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మానవుడు కూడా ఏ ఒక్క విషయంలోకూడా పరిపూర్ణుడు కాజాలడు కేవలం తానూ కొంత విషయజ్ఞనం మాత్రమే కలిగి ఉంటాడు అన్నది మాత్రం యదార్ధం. 
బ్రహ్మ జ్ఞ్యానం కేవలం సాద్గురువు ద్వారానే పొందగలరు.
సత్యాన్వేషణలో భార్గవ శర్మ 

17, మే 2020, ఆదివారం

దేవాలయాలలో దేముడు ఉంటాడా?

దేవాలయాలలో దేముడు ఉంటాడా? దేవాలయంలోని విగ్రహంలో దేముడు వున్నాడని మనమందరము గుడికి వెళ్లి విగ్రహాన్ని మొక్కు తున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమంటే విగ్రహం రాతితో చేసిందే, అదే విధంగా గుడి మొత్తం రాతితో చేసిందే ఐతే విగ్రహం దేముడు ఎలా ఐయ్యాడు, గుడి మెట్లు దేముడు ఎందుకు కాలేదు.  ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం చెప్పలేక పోటంతో హిందువులకు మన ఆచారాలమీద, సాంప్రదాయాలమీద నమ్మకం సన్నగిల్లుతుంది.
ప్రతి దానిని కూలంకుషంగా పరిశీలిస్తే మనకు ప్రతి హిందూ విధానానికి సమాధానం తెలుస్తుంది.
మీకు ఈ విషయాన్నీ మీకు తెలిసిన ఉపమానంతోటే వివరిస్తాను.  ఈ రోజు మనందరికీ ఫోన్ అంటే తెలియనివారు లేరు, అంతే కాక ఫోన్ వాడనివారు లేరు. కాబట్టి మీకు ఫోనునె  ఉదాహరణగా తీసుకొని ఈ విషయాన్ని వివరిస్తాను.
మనం ఫోన్ చేసిన వారు పెద్దవారు ఐతే ఫోనులో గౌరవంగా నమస్కారం చేసి వినయంగా మాట్లాడుతాము అదే చిన్న వాళ్ళు ఐతే ప్రేమతో మాట్లాడుతాము.  అలాగే మనం ఎవరితో మాట్లాడితే వారు మన ముందరవుంటే ఏరకంగా ప్రవత్తిస్తామో అలానే ప్రవర్తిస్తాము.  నిజానికి మనం మాట్లాడేది ఫోనుతో కాని  అవతలి వ్యక్తితో కాదు.  ఈ విషయం మనందరికీ  తెలుసు. కానీ మనం మాట్లాడిన మాటలు అవతలి వాడు వింటున్నాడని మనకు నమ్మకం.  దానికి ప్రమాణం అవతలి వ్యక్తి నీతో ఫోనులో మాట్లాడటమే. నిజానికి నీ చేతిలో వున్న ఫోన్కి అవతలి వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ మీ ఇద్దరికీ ఫోన్ సంబంధాన్ని కలుపుతున్నది.  అంటే ఫోన్ ఒక సాధనగా మీ మధ్య వున్నది.  మీరు ఒకరికి ఒకరు ఎదురుపడితే ఫోన్లో మాట్లాడుకొనవసరం లేదు.  ఇప్పుడు ఫోన్ నిర్మాణాన్ని పరిశీలిద్దాం.  ఫోన్ ఒక ప్లాస్టిక్ పదార్ధంతో కొన్ని లోహపు తీగలతో మరియు  ఇతర ఎలక్ట్రానిక్ I.C.లతో నిర్మితమైనది.  నీ ఫోనులో వున్న వస్తువులు విడిగా బైట కూడా దొరుకుతాయి కానీ అవి విడివిడిగా ఫోన్ చేసే పని చేయలేవు.  ఆ విడిభాగాలను ఒక సర్క్యూట్ ప్రకారం అమర్చి షోల్డర్స్ చేసి నిర్మించితేనే ఫోన్ తయారు అవుతుంది.  అంతేకాదు ఫోనుకు ఒక సిం కార్డుకూడా ఉండాలి అప్పుడు అది పలుకుతుంది.  ఈ విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు మన హిందు దేవాలయాన్ని ఫోనుతో పోలుద్దాం. దేవాలయం ఒక ప్రత్యేక నిర్మాణం అది ఆగమశాస్త్ర విధానంలో నిర్మిస్తారు.  మానవులు నివసించే గృహాలకి దేవాలయ నిర్మాణానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. గర్భగుడి నిర్మాణం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది.  ఈ నిర్మాణానికి గోపురం ప్రముఖమైనది.  గోపురం కొనికల్ ఆకారంలో వుంది చాలా ఎత్తుగా ఉంటుంది.  దాని మధ్య భాగంలో విగ్రహం ప్రతిష్టిస్తారు.  ఆ విగ్రహంపై ఆకాశంలోని కాస్మిక్ శక్తి పూర్తిగా గోపురంద్వారా ప్రసరించి కేంద్రీకరించబడుతుంది.  కాబట్టి ఎప్పుడైతే భక్తుడు ఆ విగ్రహాన్ని దర్శిస్తాడో విగ్రహంలో వున్న కాస్మిక్ ఎనర్జీ భక్తునిపై రిఫ్లెక్ట్ అవుతుంది.  దత్ ద్వారా భక్తునికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మన ఫోనులో ఉన్నట్లు సిం కార్డు దేవాలయంలోకూడా ఉంటుంది.  దీనినే యంత్రం అంటారు.  ఈ యంత్రం ఆగమశాస్త్ర రీత్యా స్వర్ణ, రజిత, తామ్ర ఫలకాలలో ఏదో ఒక ఫలకం మీద నిర్మించి విగ్రహ ప్రతిష్ట సమయంలో తగు విధంగా పూజించి విగ్రహం క్రింద ప్రతిష్టిస్తారు.  ఆ యంత్రం భక్తునికి భగవంతునికి మధ్య మీ ఫోను కనక్క్షన్ మాదిరి పనిచేస్తుంది.  భక్తుని కోరికలు భగవంతునికి చేరి ఈ విగ్రహం ద్వారా భక్తుని కోరికలు ఈడేరుతాయి. అందుకే భక్తులు అనేక వందల కిలోమీటర్ల దూరమునుండి వచ్చి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు.  ప్రసిద్ధ దేవాలయాలకు భక్తుల రద్దీ రోజు మనం చూస్తున్నాం.
పూజించటం ఎలా. షొడశోపచార పూజ అంటే ఏమిటి మళ్ళి ఇంకోసారి తెలుసుకుందాం.
సనాతన హిందూ ధర్మంలో పూర్వం ప్రజలు పెద్దవాళ్ళు చెప్పింది ఎదురు ప్రశ్న వేయకుండా అనుకరించేవారు.  అందుకే వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మన గ్రహచారం ఏమంటే చాలామంది హిందువులకు హిందూ ధర్మం మీద అవగాహన లేదు.  అది అటుంచి ఇతరులు హిందువులఫై దాడి చేయటానికి వాళ్ళకి తెలిసింది కొంత తెలియనిది కొంత పైత్యం కలిపి ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు.  అది అట్లా ఉంటే కొందరు హిందువులు నాస్తికులుగా మారి హిందూ ధర్మాన్నే ప్రశ్నిస్తున్నారు.  ఇది చాలా విచారించదగ్గ విషయం. అందుకే ప్రతి వారికి హిదు  సంప్రదాయాల విశిష్టత తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ రచనలు సాగిస్తున్నాను.  బుధ జనులు ఈ వివరణలను పరికించి, పరిశీలించి, చేసే సాద్ విమర్శలకు సాదర స్వగతం. వితండ వాదం చేసేవారి విమర్శలు నిషేధం. 

7, మే 2020, గురువారం

మందు బాబు మందు



భార్య రోదన కర్ణ పుటలకు చేరటంలేదు,
పిల్లల ఆక్రోధన మనసుని తాకటం లేదు
ఇంట్లో సరుకులు లేవనే బాధ లేదు,
ఎవరేమనుకుంటారన్న ఆలోచన లేదు
మండల కాలం ఉగ్గపట్టుకొని వున్న
మందు బాబులు బాటిళ్లకోసం బారులుతీరారు
నగర జనులు పరిహసిస్తున్నకాని


6, మే 2020, బుధవారం

తాగండి తూలండి తగిలించుకోండి

   ఆ. ప్ర. లో మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.  అంతే కాదు అక్కడ ఎలాంటి సామజిక దూరం పాటించకుండా ఒకరిమీద ఒకరుగా వుంటూ ఇన్నాళ్లు ఎదురుచూసిన మధురసం పొందటానికి పోటీ పడ్డారు.  ఇది ప్రత్యక్షంగా ప్రతి టి.వి. చానలు చూపించింది.  ఇక కరోనాకు కళ్లెం వేయటం కుదరదు అని అనుకున్నాము.   తెలంగాణలోకూడా సారా పిపాసులకు స్వగతం పలుకుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం శోచనీయం. దేశంలోనే మన రాష్ట్రం కరోనా కట్టడిలో కఠినంగా వర్తిస్తు చాలా వరకు కరోనాను కట్టడి చేసాము అన్న ముఖ్యమంత్రి గారికి మరి సారా తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా అని అనేక వర్గాలు ఉటంకిస్తున్నాయ్.

ఈ పరిస్థితి చుస్తే సారా బాబులు మీరు ఎక్కడికో వెళ్లి తాగక్కరలేదు.  చక్కగా ఇక్కడే తాగండి   తూలండి కరోనాను తగిలించుకోండి మీ కుటుంబాన్ని మీ కాలనీకి  అంటించండి మీకు పూర్తీ స్వేచ్ఛ వుంది.  అని అనాలనిపిస్తుంది. 
ఇక్కడ ఎంతో కట్టుదిట్టం చేస్తేకూడా అటు రాజకీయ నాయకులూ ఇటు కొందరు వున్మాదులు, వారి వారి అధికారాల్ని, మూర్ఖత్వాన్ని చూపుతూ పోలీసులపై, డాక్టర్ల ఫై దాడికి దిగుతున్నారని రోజు మనం ట్.విలో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం డాక్టర్లమీద, ఇతర ఆరోగ్య సిబ్బందిమీద దాడి చేసే వారిమీద కఠిన చెర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తే ఎన్ని కేసులు పెట్టారు అన్నది శోచనీయం. చదువుకున్న, సంస్కారమున్న, అధికారమున్న వారే ఆలా ప్రవర్తిస్తే ఇక చదువు సంధ్య లేని తాగుబోతుల్ని ఆపటం సాధ్యమా. ఈ విషయాన్నీ ప్రభుత్వం గుర్తించాలి. 

దేముడే అన్ని చూసుకుంటాడు. మనకేం కాదని మెట్ట వేదాంతం వల్లిద్దామా. ఆలోచించండి. 

ఇక మనం చేసిది ఏమిలేదు మధుపాన ప్రియో జ్ఞానీ భవ, మధుపాన ప్రియా సంస్కార భావ, మధుపాన ప్రియా ఆరోగ్య భవ  అని కోరుకోటం తప్ప 

సర్వే జానా సుఖినోభవంతు. 
సర్వ సంతు ఆరోగ్య భవతు. 
ఓం శాంతి శాంతి శాంతిః  

5, మే 2020, మంగళవారం

మందు బాబులు కరొనను వ్యాప్తి చేయరా?

ఈ రోజు ఏ T.V చూసినా ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలగూర్చి చర్చిస్తున్నారు.  రాష్ట్ర ప్రబుత్వం మద్యం దుకాణాలను తెరవటం అటు మహిళలోకంలో కల కలం రేకెత్తిస్తుంది.  చాల మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు మద్యానికి అలవాటు పడ్డ వారు ఈ కరోనా పుణ్యమా అని మద్యానికి దూరంగా వున్నారు.  ఇది ఇంట్లో వున్న మహిళలకు ఆనందంగా వుంది. రోజు కూలి చేసుకొనే వారు రోజు ఏదో ఒక చిన్నా చితక వ్యాపారాలు చేసుకొనే వారు మద్యం జోలికి పోకుండా ఉండటంతో వారి వద్ద వున్న డబ్బులు సురక్షితంగా ఉన్నాయని ఇంట్లో ఆడవారు అనుకునే ఆశలు అడియాసలే అయ్యాయి వారి ఆనందం నిప్పుల మీద నీళ్లు పోసినట్లుగా ఈ మద్యం దుకాణాల తెరువు అయ్యిన్ది. దానికి తోడు ఇన్నాళ్ల సారా ఆదాయం పూడ్చుకోటానికా అన్నట్లు ఇప్పుడు మద్యం రేటు 75% పెంపు చేశారన్నది బట్ట తలమీద తాటి కాయ పడ్డట్లు అయ్యిన్ది.  మద్యం రుచి చూడక ఇన్నాళ్లు ఆగిన సారా రాయుళ్లు యెంత ధరైనా పెట్టి తాగాలని కుతూహలపడటంలో తప్పు లేదు. సారా వ్యసనానికి అలవాటు పడ్డవారు వారి కుటుంబ పరిస్థితులు వారి ఆదాయ వ్యయ నిబద్దత కలిగి వుండరు. కాబట్టి వారు ఇంట్లో భార్య నగలు (ఉంటే) అమ్మి అయినా తాగటానికి వెనుకాడరు.  ఇట్లా యెంతోమంది  తమ కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది.  కాబట్టి ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొనైనా ప్రజల ప్రాణాలను కాపాడే దిశలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలని వెంటనే మూసివేస్తే చాల మంచిది.  ఇప్పుడు ఆంధ్రప్రదేషులో కొరోనా విష కోరలు చాపి విజృంబిస్తున్నది.  ఈ తరుణంలో సామాజిక దూరం పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా జనాలు ఎండలో వచ్చి సారా కొనుక్కని అటు వాళ్ళ కుటుంబం ఇటు సమాజానికి హాని కలుగ చేస్తారటంలో అతిశయోక్తి లేదు.  మందు బాబులకు ఒక్కరికి కరోనా సోకినా అది విజృంభించి ఎంతో మంది ప్రాణాలను బలికొంటుందనటం నిజం. 
ఏ రకంగా చుసిన ఈ మద్యపు దుకాణాల తెరపు మాత్రం సభ్య సమాజం హర్షించదగ్గ విషయం కాదు. 
ప్రభుత్వం మరలా అలోచించి వెంటనే మద్యం షాపులు మూయాలని ప్రజలంతా కోరుతున్నారు.  
లిక్కర్ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే ఒక మంచి వనరు కాదని ఎవ్వరు అనరు.  కానీ ప్రజలప్రాణాలు బలిపెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటం యెంత వరకు సమంజసం.  యేది ఏమైనా ఈ సమయంలో  మద్యం దుకాణాలు తెరవటం కరొనాను  తలుపులు తెరచి ఆహ్వానించటం కన్నా వేరు కాదు. 
ఈ విషయంలో మన ప్రియతమ ప్రధాన మంత్రిగారు తక్షణం దేశాన్ని కరోనానుంచి కాపాడే క్రమంలో  దేశం మొత్తంలో మద్యం దుకాణాలను పూర్తిగా కరోనా సమసిపోయే వరకు తెరవకూడదని తెరిస్తే కఠిన శిక్షలు విధిస్తామని ఆర్డినెన్సు తేవాలి. 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసి తెలంగాణ ప్రభుత్వం కుడా మద్యం షాపులు తెరిచే ప్రయత్నం చేస్తే ఆశ్చర్య పడ నవసరం లేదు. 
ఇప్పటికైనా మద్యం దుకాణాలను మూయకపోతే కరోనాను నియంత్రిచటం మన దేశంలో ఎవ్వరి వల్ల కాదు. 
జనాలను చంపి స్మశానముమీద పరిపాలన చేయాలనుకుంటే మాత్రమే మద్యం దుకాణాలను ఇంకా ఇంకా తెరచి, ఇంకా కొత్తవి పెట్టి ఆదాయం పెంచుకోండి అని సామాన్య మహిళలు అంటున్నారు.  

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి కానీ ప్రజలతో వ్యాపారం చేసే దిశలో పని చేయకూడదు. మందు బాబులతో కరోనా వ్యాప్తి చెందదు అని ఏమైనా ఉన్నదా, లేదే కరోనాకు జాతి, మత, కుల, వర్ణ, లింగ బేధం లేదని మనం చూడటం లేదా? 
ఈ విపత్కర పరిస్థితిలో మద్యం షాపులు తెరవటం సమంజసం కాదని మేధావి వర్గం వేనోళ్ల వక్కాణిస్తున్నది. అంతే కాదు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన మన ఆంధ్రప్రదేశ్ మరో ఇటలీ కాగలదు. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 

మహిళలకు విజ్ఞప్తి; అమ్మలారా, అక్కలారా మీరు మీ భర్తలను ఇంటినుండి బైటికి వెళ్లనీయకుండా కట్టడి చేయండి.  మీ మీ భర్తలను సారానుండి కాపాడుకోండి తద్వారా మానవ సమాజాన్ని కాపాడండి. 

సర్వ్ జానా సుఖినోభవంతు. 
ఓం శాంతి శాంతి శాంతిః 

28, ఏప్రిల్ 2020, మంగళవారం

మాస్కులు ధరించటం ఎందుకు.

ఇప్పుడు ప్రపంచమంతా కరొనతో గజ గజ వణుకుతుంది.  ఈ సమయంలో మన ప్రభుత్వం వీధులల్లో తిరిగే వారు విధిగా నోరు, ముక్కు మూసుకునే విధంగా మాస్కులు ధరించాలని అట్లా ధరించని వారిని శిక్షిస్తామని పదే పదే చెప్పటమే కాక కొంతమందికి పోలీసు వారు బుద్ది చెప్పినట్లు మనకు రోజు టీ.వి వార్తలల్లో చూస్తున్నాము.  అది కేవలం ప్రభుత్వం ప్రజలను కాపాడుటకు తీసుకొనే చేర్య అని మనందరికీ తెలుసు.  కానీ మనం టి.వీలో, వాట్సాపులో అనేక మంది ముఖ్యంగా రాజకీయ నాయకులూ, N.G.O లు అనేక సంఘాల వారు పేదవారికి వస్తువులు, కూరగాయలు మొదలైనవి పంపిణి చేస్తున్నారు.  ఇది స్వాగతించదగిన విషయం.  కానీ కొంతమంది ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చే టప్పుడు వారి మూతికి వున్న మాస్కు ఆటంకిగా భవిస్తూ వారికి తెలియకుండానే మాటి మాటికీ ఆ మాస్కును చేతితో తడమడం, లేక కొంతమంది పూర్తిగా మాస్కు తీసి మైకు పట్టుకొని వారి ప్రతిభను చాటుతున్నారు.  వారిని ఉద్దేశించి ఇది వ్రాస్తున్నాను.  మీరు చేసే పనులు నిజానికి సమాజోద్ధరణకే, అందులో రవ్వంతయు సంశయం లేదు కానీ మీకు తెలుపదలచింది ఏమనగా మాస్కులు ధరించటం నిజానికి మనకు అలవాటు లేదు.  కేవలం ఇప్పటి పరిస్థితిని బట్టి ప్రభుత్వ సూచనల మేరకు మనం వీటిని ధరిస్తున్నాము.  దయచేసి రోడ్డుమీదికి వచ్చే వారు ఈ క్రింది సూచనలు పాటించ కోరుతాను.

1) విధిగా మాస్కు ధరించండి.  మాస్కు ధరించటం అంటే ఇంటి దగ్గర కట్టుకున్న మాస్కు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దానిని సవరించటం కానీ ఏచేతితోను తాకటం కానీ, గోక్కోటం కానీ చేయకూడదు.  ఒక వేళ తుమ్ము కానీ, దగ్గు కానీ వస్తే వెంటనే వేగంగా జనాలకు దూరంగా వెళ్లి చెవుల దగ్గరినుండి మాత్రమే మాస్కు తీసి తుమ్ముటం  కానీ, దగ్గటం కానీ చేసి వెంటనే చెవులనుంచి మాస్కు ధరించి జనాలలోకి రండి.  ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు మీద మీ చేయి పడకూడదు.

2) మీరు ఇంటికి వచ్చిన తరువాత మాస్కుని చెవులపైనుండి మాత్రమే అంటే మాస్కుని తాకకుండా తీసి పారవేయ దలిచితే మూత వున్నా చెత్తబుట్టలో మాత్రమే వేయండి.  వస్త్రంతో కుట్టిన మాస్క్ కానీ లేక మీరు చేతి రుమాలు మొఖానికి కట్టుకున్న యెడల అది కుడా చెవులమీదినుండి తీసి వెంటనే సబ్బుతో కానీ డిటర్జెంట్ తోకానీ  ఉతికి ఆరవేసి వెంటనే మీ చేతులు, మొఖం బాగా నురుగు వచ్చే సబ్బుతో కడుక్కోండి.  ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబ సభ్యులను చేతితో తాక వద్దు.

ఈ సూచనలు ప్రతి వక్కరు విధిగా పాటించండి. . 

మీరు ఆరోగ్యంగా వుండండి మీ తోటివారిని ఆరోగ్యంగా ఉండనీయండి. 
సర్వే జానా సుఖినో భవంతు, 
ఓం శాంతి శాంతి శాంతిః 

ఆయుర్వేద, హోమియో వైద్యులకు విజ్ఞప్తి

 ఇప్పుడు మనందరికీ ఒక విషయం తెలుస్తున్నది.  ఈ కోవెడు వైరస్ అనేక రూపాలుగా మారుతున్నది అని.  అంటే దీనికి వాక్సిన్ కనుగొనటం మేధావులకు సవాలుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అనైకమంది శాస్త్రవేత్తలు అనేక విధాలుగా అహర్నిశలు కృషి చేస్తూ ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనటానికి ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు వార్తలవల్ల తెలుస్తున్నది.  కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు విజయవంతం అయినట్లు మనకు  తెలియరాలేదు. మనం ఆశా వాదులం, మేధావుల ప్రయత్నం సఫలం కావాలని మనం నిత్యం దేముళ్ళను ప్రార్ధిస్తున్నాము. కానీ మనకు ఒకవిషయం మాత్రం కనపడుతున్నది అది నిత్యం పెరుగుతూవున్న కరోనా కేసులు.  ఏ రోజుకూడా ఇవాళ ఒక్క కేసుకూడా నమోదు కాలేదు అని చెప్పిన రోజు లేదు.  ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అంతే.  ఈ విధంగా వృద్ధి చెందుతుంటే ఈ మహమ్మారిని ఆపటం ఎవరి తరం, అనే ప్రశ్న ఉద్బవిస్తుంది.  దీనికి అంతం ఎప్పుడు.  ప్రజలంతా ఎప్పటిలాగా జీవనం గడిపే రోజు ఎప్పుడు వస్తుంది. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ అని రోగం తగ్గినవారినుండి సేకరించిన రక్తమునుండి తీసిన ప్లాస్మాను రోగులకు ఇంజక్ట్ చేస్తున్నారు.  ఈ విధానం సఫలం అయినట్లు చెపుతున్నారు.

ఈ ప్లాస్మా థెరపీ లాగానే మరొక విధానం నేను ప్రీతిపాదిస్తున్నాను.  అదేమిటంటే ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రాగానే అతని రక్తం వలసినంత తీసి దాచివుంచి తరువాత అతనికే ఎక్కిస్తే తప్పక రోగి కోలుకుంటాడని నా అభిప్రాయం. యెట్లా అంటే;

రోగ నిర్ధారణ జరిగిన సమయంలో రోగి పూర్తిగా రోగగ్రస్తుడు కాడు.  అతడు ప్రాధమికస్థితిలో కొంత ఆరోగ్యంగా కొంత అనారోగ్యంగా ఉంటాడు.  అతని శరీరం వైరస్తో యుద్ధం ప్రకటించి యాంటీబోడీస్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ యాంటీబోడీస్ కలిగిన రక్తం ఆ రోగినించి సేకరించి దాచిపెట్టాలి.  ఎప్పుడైతే శరీరంలో రక్తం తగిన మోతాదులో తగ్గుతుందో అప్పుడు అతని శరీరం తగ్గిన రక్తం భర్తీ చేయటానికి కొత్త రక్తం ఉత్పత్తి చేస్తుంది.  ఈ స్థితిలో ఆ వ్యక్తికి పండ్ల రసాలు, ఇతర పోషక విలువలు కలిగిం ఆహారపదార్ధాలు తగినంతగా ఇస్తే ఆ రోగి రక్తం త్వరగా ఉత్పత్తి ఆయె శరీరంలో ఉండాల్సిన రక్తం సమకూరుతుంది.  ఆ సమయంలో అతని నుండి సేకరించిన రక్తాన్ని అతనికే డూప్ చేస్తే అతని శరీరంలో రక్తం పెరిగి రక్తంలో వున్నా ఎర్ర రక్తకణాలు ఆక్సీజన్ వేగంగా సరఫరా చేస్తుంది.  అంతకు ముందు రక్తంలో వున్న యాంటీబాడీస్ ప్రస్తుతం వున్న వాటితోపాటు కలసి సమర్ధవంతంగా వైరస్ మీద దాడి చేసి రోగిని పూర్తిగా రోగమునుండి రక్షిస్తుంది.

ఈ విధానం వల్ల లాభాలు; ఏ మనిషి రక్తం తీస్తామో ఆ మనిషికే ఎక్కిస్తాము కాబట్టి ఎలాంటి గ్రూప్ పరీక్షలు చేయనవసరం లేదు. రోగి వ్యాధినిరోధకాలు శరీరంలో ఎక్కువగా చేరుతాయి కాబట్టి రోగి కోలుకోవడానికి ఎక్కువ శాతం తోట్పాడుతాయి. ఈ విష్యం సమర్ధవంతులైయిన వైద్యులు పరిగణలోకి తీసుకొని తగువిధంగా ఈ విధానం అమలు చేస్తే బాగుంటుంది.    

ప్రభుత్వాలు ఈ వ్యాధికి మందులేదు కాబట్టి ఇంట్లోనే ఉండమని లాక్ డౌన్ ప్రకటించాయి.  ప్రజలు కూడా తమని తాము కాపాడుకోవాలని ఇంటికే పరిమితం అయ్యారు.  వారందరు అభినందనీయులు.  కానీ ఎన్నాళ్ళు అనే ప్రశ్నకు జవాబు ఎవ్వరి వద్దా లేదు. కాబట్టి ఈ తరుణంలో కేవలం అల్లోపతి డాక్టర్లే కాకుండా ఇతర సాంప్రదాయ వైద్యులు కుడా నడుం బిగించాలిసిన సమయం.  సాంప్రదాయ వైద్యం కన్నా అల్లోపతి వైద్యం ప్రచుర్యం పొందటానికి కారణాలు రెండు. ఒకటి ఇంజక్షన్ వల్ల మందుని మనిషి రక్తంలోకి నేరుగా పంపించటం తత్వర రోగ నివారణ సత్వరంగా చేయగలగడం. రెండు చెడిపోయిన అవయవాన్ని ఆపరేషన్ చేసి తొలగించటం.  ఈ రెండు సుగుణాల వల్ల అల్లోపతి వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.  కానీ అల్లోపతికన్నా ముందు వివిధ దేశాలలో వివిధ సాంప్రదాయ వైద్య విధానాలు వున్నాయి.  అప్పటి జనులు వాటివల్ల రోగాల బారినుండి కాపాదపడ్డారు.  మన దేశంలో పురాతన వైద్య విధానం ఆయుర్వేదం.  మన దేశంలో ఇంకా హోమియోపతి, యునాని వైద్య విధానాలుకూడా లభ్యమౌ తున్నాయి.  

ఆయురేదం: మన దేశంలో పూరితంగా ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలో వున్నది.  వేల సమస్తరాలు ఎందరో ఋషులు కస్టపడి సృష్టించిన వైద్య విధానం.  ఈ ఆయుర్వేదం. ధన్వంతరి, చెరకుడు మొదలగు మహర్షులు శ్రేమించి నిర్మించిన ఈ విద్య విధానం ఎంతో పురాతనమైనది మాత్రమే కాదు మానవాళికి ఎన్నో రకాల వ్యాదులనుండి కాపాడుతూ వున్నది. పూర్వం ఆపరేషనులు కుడా చేసేవారని మనకు గ్రంధాలూ చెపుతున్నాయి.  ఆ అపూర్వ జ్ఞ్యానసంపదఁ ఎటు పోయింది.   ఇప్పుడు కూడా ఎందరో ఆయుర్వేద దిగ్గజాలు ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. నేను ప్రార్ధించేది ఏమంటే మహానుభావులారా ఇప్పుడు సమయం ఆసన్నమైనది మీ అపూర్వ మేధస్సుతో ఈ కరొనకు మందును తయారు చేయండి. మానవాళిని కాపాడండి.  అనేక రకాల పాషాణాలు, విషాలు మనిషే చావు బతుకుల మధ్య కొట్లాడుకున్నపుడు వాడి మృత్యు వాత నుండి రక్షించినట్లు మన చరిత్ర చెపుతున్నది.  మరి ఇప్పుడు ఈ వైద్యులు ఎందుకు ముందుకు రావటంలేదు.   అయ్యా మీరు ఉపేక్షించకండి రండి ముందుకు రండి ఈ విపత్కర సమయంలో మానవాళికి చేయూతనివ్వండి.  మన దేశాధీశులను వినయపూర్వకంగా ఈ విధానంకూడా ఈ మహమ్మారినుండి జనులు కాపాడటానికి వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
ఈ సందర్భంలో నేను రెండు పద్ధతులు ప్రతిపాదించదలిచాను.
ఒకటి. మన గ్రామీణ ప్రాంతాలలో జ్వరాలు వస్తే కడుపు మీద సూదితో వాతలు పెట్టేవారు.  ఆ వాతలతో జ్వరాలు తగ్గేవి.  అదే మాదిరిగా కరోనా భారిన పడిన రోగుల కడుపు (abdomen)  మీద సూదితో వాటాలు పెడితే రోగం తగ్గవచ్చని భావిస్తున్న.

పని చేసే విధానం. ఎప్పుడైతే మనిషికి తన శరీరం కొంత భాగం కాలుతుందో అప్పుడు శరీర రక్షక విభాగం పనిచేసి ఆ గాయాన్ని నయం చేయటానికి యాంటీబోడీస్ని ఉత్పత్తి చేస్తుంది అట్లా ఉత్పత్తి ఐన యాంటీబాడీస్ ఈ వైరస్ మీద దాడి చేసి రోగాన్ని తగ్గించ వచ్చు. ఈ విధానం వల్ల ఎటువంటి నష్టము రోగికి వేరుగా ఉండదు.  కాక్ పోతే కాలిన గాయాలవల్ల కొంత బాధ పడవలసివుంటుంది.  ప్రాణాలు పోగొట్టుకోటం కన్నా గాయాల బాధలు అనుభవించటం మేలు కదా.

రెండో విధానం: గో మూత్రంతో అనైక రోగాలకు చికిత్స చేయవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెపుతున్నది.  కాబట్టి రోజు 10 మిల్లి లీటర్ల గోమూత్రాన్ని రోగులకు పరిగడుపున ఇస్తే వైరస్ మీద పని చేయవచ్చు.
ఫై రెండు విధానాలను అనుభవజ్ఞులైన వైద్యులు పరిశీలించి వివరించి ప్రభుత్వానికి తెలిపి ఈ కఠోర కరోనా మహారమారి నుండి మానవాళిని రక్షించాలని ప్రార్థిస్తున్నా;

ఇప్పుడు ఏ పద్దతి మంచిదా అని యోచించే సమయం కాదు ఏదో ఒక విధానం,  ప్రయత్నిస్తే తప్పకుండ ఫలితం లభిస్తుంది.  

హోమియోపతి:  జర్మనీ దేశంలో జన్మించిన డాక్టర్ Samuel Hahnemann (1755-1843),  చే ఆవిర్భవించిన  వైద్యం ఈ పద్దతి.  దీని మూల సూత్రం ఏమిటంటే  ఆరోగ్యవంతునికి ఏ మందు ఇస్తే అతనికి ఏరకమైన రోగ లక్షణాలు కనబడతాయో అదే మందు ఆ లక్షణాలు కలిగిం రోగికి ఇస్తే ఆ రోగం నయం అవుతుంది.  ఈ విధానం మనం మన భాషలో చెప్పాలంటే ముల్లుని ముల్లుతోటె తీయాలి అన్నట్లు. అప్పటి  వైద్య విధానానికి వ్యతిరేకంగా ఇది  ఉండటంతో ఆయనను అప్పుడు సమర్ధించలేదు. కాని కాలాంతరంలో ఈ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంతరించుకుంది.  మనదేశంలో కుడా ఈ వైద్యవిధానం బహుళ ప్రదాన్యత పొందింది.  అంతే కాక ఇటీవల జరిపిం ఒక సర్వేలో ఇక్కడ నూటికి 59 మంది ఈ వైద్యవిధానం పట్ల మొగ్గుచూపుతున్నారని తెలిసింది. మన దేశ ఆయుష్ మంత్రిత్వ విభాగం కరోనా రాకుండా arsenicum album 30c ని రోగనిరోధానికి వాడమని చెప్పటమే కాక అనేక హాస్పిటల్సులో ఉచితంగా ఇవ్వటం జరిగింది.  ఇక ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మందు మూడురోజులు వరుసగా వాడిన వారికి ఎవరికైనా కరోనా సోకిందా, లేదా అనే విషయం ఇప్పటివరకు సర్వ్ చేసిన దాఖలాలు లేవు.  ప్రభుత్వం ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని కరోనా రోగులు ఈ మందు రోగం రాకముందు వాడారా, లేదా అని ఆరా తీసి ఒకవేళ ఈ మందు వాడినవారికి కరోనా సోకితే ఈ మందు ప్రభావం వాళ్ళ మీద ఎంతవరకు వున్నది తెలుసుకోవాలి. నిజానికి నాకు తెలిసినంతవరకు హోమియోపతి విధానం ఒకరకంగా వాక్సిన్ లాగానే పని చేస్తుంది. మందు మందుయొక్క పొటెన్షిని సరిగా తెలుసుకొని ఉపయోగిస్తే తప్పకుండ ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది.  ఈ arsenicum album 30c పనిచేస్తే దానిని ఎందుకు వాడటంలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుని ఈ వైద్య విధానాన్ని ఈ కరోనా నివారణకు వినియోగించుకొనే దిశలో ఆలోచన చేస్తే బాగుంటుంది. 

నేను pubmed.gov అను website నుండి సేకరించిన విషయాన్ని యధాతధంగా ఇక్కడా ఇస్తున్నాను. 

Potentized homeopathic drug Arsenicum Album 30C positively modulates protein biomarkers and gene expressions in Saccharomyces cerevisae exposed to arsenate.

Abstract

OBJECTIVE:

This study examines if homeopathic drug Arsenicum Album 30C (Ars Alb 30C) can elicit ameliorative responses in yeast (Saccharomyces cerevisiae) exposed to arsenate.

METHODS:

The yeast S. cerevisiae 699 was cultured in a standard yeast extract peptone dextrose broth medium. It was exposed to the final concentration of 0.15 mmol/L arsenate for two intervals, 1 h and 2 h, respectively. The cell viability was determined along with the assessment of several toxicity biomarkers such as catalase (CAT), superoxide dismutase (SOD), total thiol (GSH) and glucose-6-phosphate dehydrogenase (G6PDH), lipid peroxidation, protein carbonylation and DNA damage. Reactive oxygen species (ROS) accumulation, expressions of relevant stress transcription activators like Yap-1 and Msn 2, and mRNA expression of yeast caspase-1 (Yca-1) were also measured.

RESULTS:

Treatment of arsenate increased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS accumulation and expressions of Yap-1, Msn 2 and Yca-1 and decreased GSH, G6PDH, CAT and SOD. Ars Alb 30C administration decreased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS formation and Msn 2 and Yca-1 expressions and increased cell viability, GSH, G6PDH, CAT and SOD significantly (P<0 .05="" a="" except="" expression.="" for="" in="" increase="" p="" slight="" yap-1="">

CONCLUSION:


Ars Alb 30C triggers ameliorative responses in S. cerevisiae exposed to arsenate.   

ఈ కరోనా వైరస్ నుండి మానవాళిని కాపాడాలన్నదే నా ప్రయత్నం.  నా ఆకాంక్ష నెరవేరాలని నేను విజయం పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం  ప్రార్ధిస్తూ సత్వర నివారణ కావాలని ఆశిస్తున్నా:
సర్వే జనా సుఖినో భవన్త
ఓం శాంతి శాంతి శాంతిః 


27, ఏప్రిల్ 2020, సోమవారం

రోగనిరోధకతకు విటమిన్ మాత్రలు

 రోగనిరోధకతకు విటమిన్ మాత్రలు ఎంతవరకు ఉపయోగం.అనేది ప్రస్తుత సమస్య.  ఇప్పుడు కరోనామహమ్మారి నుండి ఎదుర్కొనే క్రమంలో డాక్టర్లు రోగనిరోధక శక్తిని పెంచుకొనే విషయంలో రోజు విటమిన్ మాత్తర్లు వాడమని సలహా ఇస్తున్నారు.  ఈ క్రమంలో అందరికి అవహగాహన కొరకు విటమనుల గూర్చి ప్రస్తావిస్తున్నాను.  డాక్టర్లు ముఖ్యంగా vit-D, Vit-Bcomplex, Vit-C  లను వాడటానికి సూచిస్తున్న విషయం మనందరికి తెలిసేందే.   ఇప్పుడు విటమనుల గూర్చి తెలుసుకుందాం.  
ముఖ్యంగా విటమినులు అనేవి మన ఆహారంలో లభ్యమైయే పోషకాలు.  నిజానికి మనం పౌష్ఠిక ఆహరం తీసుకుంటే ప్రత్యేకించి విటమినులు విడిగా తీసుకోవలసిన అవసరం లేదు.  కానీ ప్రస్తుత మన ఆహారంలో కావలసినంతగా విటమినులు దొరకనందువల్ల మనం విటమిను మాత్రలు తీసుకోవలసిన పరిస్థితి. 
విటమినుల వాటి solubility ఆధారంగా రెండు రకాలుగా విభజించారు.  అవి 1) నీటిలో కరిగేవి 2) నూనెలలో కరిగేవి.  మొదటి కోవకు చెందినవి Vit-Bcomplex, Vit-C.  ఇందులో Vit-Bcomplex అనునది ఒక విటిమను కాదు ఇది బి విటమినుల సమూహం.  కొన్ని బి విటమినులు ఒకదానికి ఒకటి వేరు చేయటం కుదరదు అందుకే అన్ని విటమినులు కలిపి Vit-Bcomplex గా పిలుస్తారు.  ఇది సాధారణ బలహీనతలను పోగొడుతుంది.  మనం తేనే అన్నంలో,  ఆకు కూరల్లో  ఈ విటమిన్ పుష్కలంగా వున్నది కానీ ప్రస్తుత పరిస్థితులలో మనం దీనిని వలసినంతగా పొందలేక పోతున్నాము.  కారణం ఏమంటే బియ్యం తెల్లగా వుండాలని బియ్యాన్ని ఎక్కువ పట్టు పట్టిస్తాము.  కాబట్టి బియ్యపు ఫై పొరలో వున్న ఈ విటమిన్ తౌడులో పోతుంది.  ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మనం బియ్యాన్ని రెండు, మూడు సార్లు కడిగి అన్నం వండుకుంటాము కాబట్టి ఆ వున్నా కొంచం కూడా బియ్యం కడుగు నీళ్ళల్లో కరిగి పోతున్నది.  కాబట్టి మనం వలసినంత విటమిన్ పొందలేక పోతున్నాము.  మనం కొన్న బియ్యం పురుగు పట్టకూడదని మిల్లు వాళ్ళు బియ్యానికి కొన్ని రసాయనిక పదార్ధాలు కలుపుతారు.  కాబట్టి మనం బియ్యం కడగక తప్పదు. ఇక పొతే ఆకు కూరల విషయానికి వస్తే ఆకుకూరలు మంచిగా వృద్ధి చెందాలని రైతు రసాయనిక ఎరువులు, కూర చీడ పట్టకుండా రసాయనిక విష పదార్ధాలు చిమ్ముతున్నారు.  ఏతావాత తెలిసేది ఏమంటే మనం ఆకుకూరలను శుభ్రంగా కడగక పోతే మనం రసాయనాలను భుజించాలి.  తత్ కారణంగా అనారోగ్యం కొని తెచ్చుకోవాలి.  కాబట్టి ఒక పని మనం చేసి కొంత వరకు పోషకాలను కాపాడుకో వచ్చు.  అది కూర పూర్తిగా కడిగి తరువాత తరగటం. 
ఇక  Vit-C ఇది పుల్లని రుచి కలిగిన పదార్ధాలలో అంటే నిమ్మ, ఉసిరి, మొదలగు వాటిలో ఉంటుంది.  నిజానికి మన ఆయుర్వేదం ఉసిరి తింటే మంచి రోగనిరోధక శక్తి వస్తుందని చెపుతుంది. ఇప్పుడు మనం ఆయుర్వేద చ్యవనప్రాస తింటే మంచిది. 
రోజుకి ఒక Vit-Bcomplex మాత్ర, ఒక Vit-C మాత్ర తీసుకుంటే మన శరీర రోగనిరోధకత పెరిగి రోగాలని తట్టుకొనే శక్తి కలుగు తుంది.  ఈ మాతర్లు పొరపాటున ఎక్కువ తీసుకున్న పెద్దగా ప్రమాదం జరగదు.  ఎందుకంటె మనకు కావలసిన దానికన్నా ఎక్కువ వున్న విటమినులు మూత్రంలో కరిగి పోతాయ్. 
డాక్టర్ల సలహా లేకుండా vit-D మాతర్లు మనం ఇష్టమొచ్చినట్లు తీసుకోకూడదు.  ఈ విటమిన్ నూనెలో కరిగే విటమిన్ కాబట్టి మనం మన శరీరానికి కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే ప్రమాదము.  ఇప్పటి పరిస్థితుల్లో ఈ విటమిన్ ఊపిరితిత్తులకు ఆరోగ్యం చేకూరుస్తుందని డాక్టర్లు చెపుతున్నారు.  కాబట్టి తగు మోతాదుల్లో మాత్రమే ఈ విటమిన్ తీసుకోవాలి.  ఈ విట్మన్ తెబ్లేట్ Vit-A విటమిన్ తో కలసి దొరుకుతాయి.  ఈ రెండు విటమినులుకూడా నూనెలలో కరిగేవే. నిజానికి మనం తీసుకునే డి విటమిన్ మాతర్లు ప్రొవిటమిన్ డి కలిగి ఉంటాయి అంటే విటమిన్ డి ని తయారుచేసే పదార్ధం అంటే మన శరీరంలో వున్న ప్రొవిటమిన్ డి మనం సూర్య కాంతిలో వున్నప్పుడు సూర్య కాంతితో విటమిన్ D గా మార్పు చెందుతుంది.  కాబట్టి మనకు డాక్టర్లు ప్రతి రోజు కొంత టైం ఎండలో ఉండమని చెప్పుతున్నారు.
రోజుకు ఒక Vit-Bcomplex మాత్ర, ఒక Vit-C మాత్ర తీసుకుందాం,  ప్రాతఃకాలంలో ఎండలో ఉందాం ఆరోగ్యంగా ఉందాం.

ఇక్కడ పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం కొరకు మాత్రమే.  డాక్టర్ల సిఫారుసులేకుండా మందులు వాడటం క్షేమం కాదు.

 సర్వ్ జనా సుఖినో భవంతు.

 ఓం శాంతి శాంతి శాంతిః


26, ఏప్రిల్ 2020, ఆదివారం

నాకేం కాదు దేముడు నన్ను కాపాడుతాడు.

   నాకేం కాదు దేముడు నన్ను కాపాడుతాడు అనే భావన చాల మంచిది ఇది ప్రతి మనిషికి ఊరట నిస్తుంది. కానీ కొన్ని సమయాలలో ఇదే ప్రాణాలను హరిస్తుంది కూడా. నేను దైవ భక్తుణ్ణ నన్ను కాపాడటం దేముడి కర్తవ్యం.  ఎందుకంటె నేను రోజు దైవ ప్రార్ధన చేస్తాను.  అని కొందరు మూర్కులు ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ప్రవర్తించి మృత్యువాత పడ్డ  వారిని ఉద్దేశించి ఇది వ్రాస్తున్న.  ఇక్కడ మతం ముఖ్యం కాదు కేవలం నమ్మకం ముఖ్యం.  ప్రతి మనిషికి ఎవరో ఒకరు దేముడు ఉంటాడు.  కానీ కొంతమంది తమ దైవం మాత్రమే ఈ ప్రపంచాన్ని కాపాడుతాడని.  అందరు ఆ దేముడినే కొలవాలనే మూర్ఖపు ఆలోచనలో వుంటారు.  నిజానికి ఈ ప్రపంచం మొత్తానికి ఒకే ఒక దేముడు ఉన్నాడు. ( దేముడు అనే పోస్ట్ చదవగలరు) 

భక్తులని కాపాడటం దేముడి కర్తవ్యమా:  ఈ ప్రశ్నకు మనం రెండు విధాలుగా సమాధాన ఇవ్వొచ్చు ఒకటి కాదు అని రెండు ఔను అని. ఒక ప్రశ్నకు ఒక జవాబు ఉండాలి కానీ రెండు విరుద్ధ జవాబులు ఉంటాయా అని మీరు అడగవచ్చు.  ముందుగా మొదటి జవాబు కాదు అనేదానికి వస్తే. 

దేముడు ఎప్పుడు ఎవ్వరిని కాపాడటం కానీ, లేక శిక్షించటం కానీ చేయడు.  ఈ సంగతి తెలియని కొందరు మూర్ఖులు వారు చెప్పినట్లుగా నడవక పోతే  నరకానికి వెళతారు అని అమాయక మానవులతో చెప్పి వారి పబ్బం గడుపుకుంటున్నారు.  నిజానికి ఆ మూర్కులే చివరకు నరకానికి వెళతారు అన్న యదార్ధం తెలుసుకోలేరు.  ఎలానో చూద్దాం. 

ప్రతి మనిషి రోజు కర్మలు అంటే పనులు చేస్తూ ఉంటాడు.  ఈ కర్మలు రెండు రకాలు ఒకటి సత్కర్మ రెండు దుష్ కర్మ ఈ రెండు ఏమిటో చూద్దాము. 
సత్ కర్మ అంటే మంచి కర్మ ఈ కర్మ చేయటం వలన మంచి కలుగుతుంది.  అంటే ఈ ,మంచి ఎవరికి కలుగుతుంది ఎట్లా కలుగుతుంది చూద్దాం. ఆకలితో వున్న వానికి అన్నం పెట్టారనుకోండి ఆ అన్నం తిన్న వానికి ఆకలి తీరుతుంది.  దాని ద్వారా అతనికి నీ పట్ల కృతజ్ఞతా భావం కలుగుతుంది. అంటే అతని మనస్సు ప్రశాంతతగా నీ పట్ల ఉంటుంది.  దీని ఫలితం మంచి ఫలితం అని అనుకుందాం. ఈ మంచి ఫలితమే పుణ్యం అని అంటారు.  అంటే నీవల్ల ఎదుటి వానికి కలిగిన  మేలు.  ఇతర జీవులకు మేలు చేయటం అని అర్ధం.  

నీవు ఏ కారణం లేకుండా ఒక మనిషిని కానీ, జంతువుని కానీ హింసించావనుకో దానివల్ల అతనికి నీమీద కోపము, ద్వేషము కలుగుతాయి అంటే అతని మనసు నీ కారణంగా క్షోభిస్తుంది.  దీని వల్ల నీకు చెడు ఫలితం వస్తుంది.  అదే పాపం. అంటే ఏది ఎదుటువాడు నీకు చేస్తే నీవు బాధపడతావో అది నీవు ఎదుటివాడికి చేయటం పాపం.  అదే విధంగా నీకు ఎదుటివాడు ఏది చేస్తే నీవు ఆనందపడతావో అది నీవు ఎదుటి వానికి చేయటం పుణ్యం అన్నమాట. 

ప్రతి మనిషి పూర్తిగా పాపాత్ముడు కాడు అదే మాదిరిగా పుణ్యప్తుడు కాడు.  ఎందుకంటె మనం రోజు చేసే కర్మలలో సత్ కర్మలు, దుష్ కర్మలు రెండు ఉంటాయి. అంటే మనకు రోజు కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు మన అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి అన్న మాట.  అంటే మనిషి పాప,పుణ్యాల మిశ్రమం.  అయితే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కక్క విధంగా ఎందుకు వుంటారు అనే సందేహం వస్తుంది.  నిజానికి ఈ పాప పుణ్యాల ఫలితమే ఈ రోజు మనకు వున్న ఈ శరీరం.  అందుకే ఈ శరీరాన్ని ప్రలబ్ద దేహంగా జ్ఞ్యానులు చెపుతారు. 

భక్తుని దేముడు ఎలా కాపాడుతాడు.  దేముడికి ఎవరిమీద ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు.  మనిషి చేసిన పాప పుణ్యాల ఫలితమే తానూ పొందే సుఖ దుఃక్కాలకు కారణం.  కేవలం దైవ భక్తి వలన పుణ్య కార్యాలు చేయాలనే తలపు వస్తుంది.  కానీ తాను చేసిన పాప పుణ్యాల ఫలితం పొందక తప్పదు.  కాబట్టి జీవితాంతం నేను పాప కార్యాలు చేస్తాను కేవలం ఒకసారి ఏదో ఒక మంచిపని చేస్తాను నన్ను ఆ దేముడు రక్షించాలి అని అనుకోటం కేవలం అమాయకత్వం మాత్రమే.  మనం పాప పుణ్యాల డేటాను ఒక బ్యాంక్ అకౌంటుతో పోలుద్దాము .  నీవు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొన్నావు అనుకో అది పాపం.  ఒక వెయ్యే రూపాయలు డిపాజిట్ చేసావనుకో అది పుణ్యం.  ఇప్పుడు నీవు ఒక పది వేలు కావాలని చెక్ ఇచ్చావనుకో ఆ చెక్కు హానర్ కాదు ఎందుకంటె నీకు బ్యాలన్స్ లేదు కాబట్టి.  అంతే కాక నీ వద్దనుండి బ్యాంకు వాళ్ళు 90 వేలు రికవరీ చేస్తారు.  నీ ఆస్థి అమ్మి ఆయన కట్టాలి.  అదే విధంగా నీవు తక్కువ పుణ్యం చేసి దేముడు నిన్ను కాపాడుకుంటాడని అనుకుంటే దేముడు కాపాడాడు సరి కదా నీ బాలన్స్ పాపాన్ని నీవు అనుభవించాలి.  అది ఎట్టి పరిస్థితిలోను తప్పదు.  ఇది తెలియని వాళ్ళు కొందరు  నేను ప్రతి రోజు దేముడిని ఆరాధిస్తాను కాబట్టి నాకు దేముడు ఎప్పుడు తోడుగా ఉంటాడని విర్రవీగుతూ వుంటారు అంతే కాక్ వాళ్ళు ఇతరులు పాపాత్ములుగా భావిస్తుంటారు.  కానీ నిజానికి  వారికీ వారు చేసిన  పాపలు పుణ్యాల మీదే వారి ప్రాప్త ప్రాప్తాలు లభిస్తాయి.  దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది కేవలం పాప రహితులు కేవలం అధిక పుణ్యం చేసిన పుణ్యప్తులు మాత్రమే దైవ కృపకు ప్రాప్తులౌతారు.

దేముడు - పుణ్యప్తులు.
పుణ్యప్తులు అంటే పుణ్య కార్యాలు ఎక్కువగా చేసే వాళ్ళు.  అంటే ఎవరైతే వారి జీవితాన్ని ఒక క్రమశిక్షణగా గడుపుతారో ఎవరైతే వారి జీవితాన్ని ఇతరుల క్షేమంకోసం శ్రమిస్తారో వారు దేముడికి దగ్గరగా వుంటారు.  వారిపై ఆ చేరా చెర జగన్నాధుడు సర్వ వేళల నీడలా వుంటూ వారిని కాపాడుతూ ఉంటాడు.  ఈ భూమి మీద దీర్ఘ కాలం జీవించటం మాత్రమే దైవ కృప అనుకుంటే పొరపాటే అవుతుంది.  ఈ జీవితం మనం చేసిన పాప పుణ్యాలను అనుభవించటానికి వచ్చింది అని మాత్రమే తెలుసుకోవాలి.

షడ్భాగం మనుష్యాణాం సప్తమం దైవ చింతనం. అనే నానుడి ననుసరించి మానవుడు ఆరు విధాలుగా ప్రయత్నం చేసి తానూ ఫలితం పొందని పరిస్థితిలో మాత్రమే ఏడవ భాగం దైవ చింతనం అంటే దేముడి అనుగ్రహం మీద ఆధారపడవలసి ఉంటుంది.  అప్పుడు మాత్రమే దేముడు తప్పకుండా కాపాడుతాడు.

గజేంద్ర మోక్షం: ఈ కధ ఇప్పుటి పరిస్థితికి పూర్తిగా సమన్వయకరణంగా తోడ్పడుతుంది. గజేంద్రుడు తన బలం మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడు.  కానీ తన బలంతో మకరిని ఎదుర్కొనలేక పోయాడు.  వెంటనే అనేక మంది దేముళ్ళను అనేక విధాలుగా ప్రార్ధించాడు.  కానీ లాభాము లేక పోయంది.  చివరికి " లా ఒక్కింతయు లేదు దేర్యమ్ము  విలోలంబాయే   అని నీవే తప్ప ఇతప్పారంబు ఎరుగను అని త్రికరణ శుద్ధిగా శరణాగతి కోరాడు.  అప్పుడు మాత్రమే ఆ దేముడు కరుణించాడు గజేంద్రుని కాపాడాడు.  ప్రస్తుతం కొందరు వివిధ రకాల దుస్తులు ధరించి తాము సాక్షాతూ దేముడి వారసులం అన్నట్లు ప్రవర్తిస్తూ ఇతరులు తమకు దాసులు అని భవిస్తూ బాహ్య డంబాచారాలు పోతూ సామాన్యులను మోసగిస్తున్నామని అనుకుంటున్నారు.  కానీ నిజానికి వారు  వారినే వారు మోసగించుకుంటున్నారు,  వారు ఇతరులను ఉద్దరించటం అటుంచి వారే పాపకూపంలో త్రొక్కబడుతున్నారు. . వారి చేష్టలకు అనుగుణంగా ఫలితాలు అనుభవిస్తారు, అనుభవిస్తున్నారు.  కానీ అది వారు గుర్తించక పోవటం విచారకరం.

గజేంద్రుడు ఏ రకంగా అనేకవిధాలుగా ప్రయత్నించి చివరికి దేముడి కృపకు పాత్రుడు అయినాడో అదే విధంగా మనం ఈ  కరొనను ఎదుర్కొటం కోసం షడ్భాగం అంటే ఆరు రకాలుగా ప్రయత్నించాలి  అవి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమనగా
1) ఇంట్లోనే ఉండటం. 2) చేతులు ముఖం సబ్బుతో మాటి మాటికీ కడుగుకోవటం. 3) ఇతరులకు దూరంగా ఉండటం. 4) తప్పనిసరి ఐతే తప్ప బైటికి వెళ్లకపోటం. 5) ఎవ్వరితో చేతులు కలపక పోవటం. 6) బైటికి వెళితే మాస్కు ధరించటం అనే ఈ ఆరు భాగాల ప్రయత్నం  చేసి ఏడవది ఐన దైవ చింతనం అంటే భగవంతుడిని ప్రార్ధించడం చేస్తే తప్పకుండ దేముడు మనలను కరోనా నుండి కాపాడుతాడు.

కానీ కొందరు నా కేమి కాదు దేముడు నన్ను కాపాడతాడు అని రోడ్డుమీద పని వున్నా లేకున్నాఇష్టమొచ్చినట్లు తిరుగుతూ, వెంట  చిన్న పిల్లలని కూడా తీసుకొని వాళ్లతో పాటు వాళ్ళ ఇంట్లోని 60 సం. ధాటిని వృద్ధులిని, తీసుకొని వెళ్లే వాళ్ళను ఏ దేముడు కాపాడాడు. ఇంకా ఇంట్లో ఏమి తోయటం లేదని కూరల బండి వద్దకు, కిరాణా షాపుల వద్దకు, దేముడి గుడికి వెళ్లే ఆడవారిని ఏదేముడు కాపాడడు వారికి అతి వేగంగా కరోనా సోకె ప్రమాదము వున్నది.
సరదాగా కిరానా షాపుల దగ్గర పాన్ షాపుల దగ్గర నిలుచొని సిగరెట్ తాగే మూర్కులారా ఇకనైనా కళ్ళు తెరవండి ప్రమాదాన్ని గుర్తించండి జాగ్రత్త వహించండి.

దేవానాం మనుష్య రూపేణా; అన్న ఆర్యోక్తి ప్రకారం దేముడు ఎప్పుడు మనిషి రూపంలోనే మనకు సహాయం చేస్తాడు.  అది తెలుసుకోక మనం సాటి మనిషి మాటను లెఖ్ఖ చేయం దాని పర్వయవసాయంగా చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తాము.  మన దేశ ప్రధాని మోడీ గారు మనకు చక్కగా లాక్ డౌన్ ప్రకటించి ఈ మహమ్మారిని అరికట్ట టానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి మన ప్రధాని మోడీగారు మానుషరూపంలో వున్నా దేముడు మనమంతా మోడీ గారికి కృతజ్ఞతలు తెలపాలి.
ఈ విపత్కర పరిస్థితినుండి మనల్ని మనమే కాపాడుకోవాలి.
 తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త
ఓం శాంతి శాంతి శాంతిహి: