3, ఏప్రిల్ 2023, సోమవారం

అజీర్ణం పోగొట్టే ఆయుర్వేద సాంబారు -

 అజీర్ణం పోగొట్టే ఆయుర్వేద సాంబారు - 


  కావలసిన వస్తువులు - 


 * ఇంగువ - 100 గ్రా .


 * మిరియాలు - 100 గ్రా .


 * వాము - 100 గ్రా .


    పైన చెప్పిన వస్తువులు అన్ని కలిపి మెత్తని చూర్ణం గా తయారు చేసుకోవాలి . ఈ చూర్ణం ని పప్పుచారుల్లో , రసంలో , కంద మొదలయిన దుంప కూరల్లో తగినంత వేసుకుంటూ ఉంటే కూరలకు మంచి సువాసన , రుచి ఏర్పడతాయి . 


         దీనిని ఆహారంగా వాడటం వలన సమస్త అజీర్ణ వ్యాధులు హరించి నోటికి రుచి , ఆకలి కలుగుతాయి . గ్యాస్ , తేపులు , కడుపుబ్బరం తగ్గిపోతాయి . శరీరంలోని సమస్త ధాతువులకు పుష్టి కలిగించి ఆరోగ్యం చేకూరుతుంది .


          

Eternal Dharma.

 Swami Chinmayanandaji was a renowned saint. Once, a 'secular' minded journalist, who generally show Hinduism in poor light, vis a vis other religions, asked a question to Swamiji:  


Q: *"Who is the founder of Islam?"*


A: *Prophet Mohammad.*


Q:   *Who is the founder of Christianity?*


A:   *Jesus Christ.*


Q:   *Who is the founder of Hinduism?*


Thinking that Swamiji has no answer,


the lady journalist proceeded:


*"There is no founder and hence, Hinduism is not a religion or Dharma at all."*


A:    *Then, Swamiji said:*


*"You are right.!"*


*Hinduism is not a religion. It is a Science.*


She did not understand that.


Swamiji put some more questions to her.


*Q: "Who is the founder of Physics?"*


*Ans: "No one person."*


*Q:- *Who is the founder of Chemistry?"*


*Ans: "No one person."*


*Q: "Who is the founder of Biology?"*


*Ans: "No single person."*


*"Many many persons, from time to time, contributed to the wealth of knowledge of any Science."*


*Swamiji continued:*


*"Hindu Dharma is a Science, developed over the centuries, contributed by saints and sages for giving right direction to the society by their own research and experiences ."*


*"Islam has only one book -Quran."*


*"Christianity has only one book -Bible."*


*"But for Hinduism, I can take you to a library and show you hundreds of books."*


*"Because, Hinduism is a scientific religion- called Sanatana Dharma -"*


      *" 🙏🏻Eternal Dharma. 🙏🏻"*


 The most accurate definition 

               🌹🙏🏻

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 


*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం గురుభక్తి ప్రదాత్రేనమః*


నెల్లూరు జిల్లా విద్యానగర్ లెక్చరర్ శ్రీ జె. గోవిందప్ప గారి అనుభవం సామాన్యులకు చాలా కాకతాళీయంగా జరిగినట్లు తోచవచ్చు, కానీ *"వెయ్యి గొఱ్ఱెలలో ఉన్నా మన గొఱ్ఱెను కాలు బట్టి లాక్కొస్తానని శ్రీస్వామివారిచ్చిన అభయం* వీరిపట్ల చక్కగా వర్తిస్తుంది. 


1982 వసం॥ నుండి 1997 వసం॥ వరకు ఎప్పుడో వచ్చి వెళ్ళేరటగాని శ్రీ స్వామివారి ఎడల తీవ్రమైన భక్తిభావం కలుగలేదు. ఈ అనుభవం తర్వాత వారికి శ్రీ స్వామివారి పైగల్గిన భక్తిభావమే ఇది శ్రీ స్వామివారి అదృశ్య హస్త ప్రభావమని తెలుస్తుంది.


వారు సాయంకాలం 5 1/2 గం॥లకు తప్పక విద్యానగర్ వెళ్లవలసి ఉంది. నా (రచయిత - గొలగమూడి) దగ్గర సెలవుతీసుకొని వెళ్ళేసరికి సాయంత్రం 4 గం|| అయింది మరి 5 1/2 గం॥ లకు విద్యానగర్ వెళ్ళడమెట్ల?, 4గం॥ 10 ని. వరకు గొలగమూడిలో ఏ వాహన వసతిలేదు. ఏమిచేసినా నీదే భారం స్వామి అనుకుంటూ నిలచియున్న తనముందు ఏ.సి. కారు వచ్చి నిలబడి వస్తారా? అని అడిగారు. ఎక్కి కూర్చున్నారు. 


రెండు కిలోమీటర్లు పోగానే ఎదురుగా వచ్చేలారీ కారు ప్రక్కనున్న అద్దాన్ని పగులగొట్టి పోతుంది. డ్రైవరు కారు వెనక్కు త్రిప్పి పోయి లారీని ఆపాలన్నా ఓనర్ అంగీకరించక ప్రయాణం సాగించారు. మద్యలో ఆ కారు సూళ్ళూరుపేట పోతుందని వారు విద్యానగర్ రోడ్డువరకు రావచ్చని చెప్పారు. అంతే గాక తాను ప్రతిదపా ఎవరైనా భక్తులను ఎక్కించుకుపోతానని ఈ ధపా వారిని మాత్రమే తీసుకుపోతున్నానని చెప్పాడు. 4గం||45ని॥ విద్యానగర్ చీలురోడ్డులో దిగాడు.


అక్కడకు ఒక బస్సు వచ్చి నిలుపకుండానే వెళ్ళాడు. శ్రీ స్వామినిస్మరిస్తూ నిలుచున్నాడు. టీ త్రాగుతున్నాడు. ఇంతలో లారీ వచ్చింది నలుగురు పాసింజర్లను ఎక్కించు కొని వెళ్ళి పోతుంది. టీగ్లాసు నోటి దగ్గరుంది. పదిబారల దూరం వెళ్ళి డ్రైవర్ లారీ నిలిపి -ప్రక్కకు చూచాడు. వీరు తానొస్తున్నట్లు చేత్తో సైగచేసి త్రాగి వెళ్ళి లారీ ఎక్కాడు. సరిగ్గా 5గం|| 30ని||లకే ఇల్లు చేరారు. ఈ ప్రయాణం కేవలం శ్రీ స్వామి కృపగాక మరేమీకాదంటారు గోవిందప్పగారు. ఈ సన్నివేశం ద్వారా వీరి హృదయంలో నాటిన విశ్వాసబీజమే ఇది శ్రీ స్వామి వారిలీల అనేందుకు కారణమని విశ్వసిస్తున్నారు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*

*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 28*



అలానే దాసగణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లామ్ పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధుపుంగవుని దర్శించి, "శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా?" అన్నాడు. "దర్శించవచ్చు. నేను గూడ వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో వున్నాను. ఆయనెంతటివారో ప్రజలు తెలుసుకోవడం లేదు. ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకొంటారు" అన్నారు.

*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


నాకు కొన్ని పరిస్థితులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు ఒకానొక టైమ్ ధృడంగా కల్గింది. ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన వున్నట్టుండి కళ్ళు మూసుకొని కొంచెం సేపు అలా కూర్చున్నారు. కొంత సేపైం తర్వాత నాకేసి అలా చూసేసరికి ఏదో ఒక శక్తి ఆయన కళ్ళల్లోంచి వచ్చి నాలో ప్రవేశించినట్లన్పించింది. "మనిషి చచ్చి పోవాలనుకోవటం ఏమిటి? చచ్చిపోయే బదులు జీవితాన్ని మానవసేవకు అంకితం చేస్తే పోలా! భగవచ్ఛింతనతో గడిపితే పోలా!" అని అన్నారు. ఆ తర్వాత నుంచి నా మనస్సు మారి మళ్ళీ ఆ తలంపే కల్గలేదు. ఇంకోసారి నాకు సాధనలో ఏకాగ్రత కుదరటం లేదు. నేను ఈ విషయం గురించి మాస్టర్ గారికి చెప్పనేలేదు. పాదనమస్కారం చేసుకున్నప్పుడు వెన్ను మీద నిమిరి తల మీద అలా చేయి పెట్టారు. అంతే అప్పట్నించి నాకు సాధనలో ఏకాగ్రత కుదిరింది.


    🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


https://m.facebook.com/story.php?story_fbid=pfbid0c2YXtx39KnzxFW4ksqktjkkCwmZ6CoUpcBhojUcX2c8LYWePiDrdXF78FTsSm526l&id=100024236412713&mibextid=Nif5oz

*గుడి - దైవ దర్శనం

 *గుడి - దైవ దర్శనం* 


ఒక అమ్మాయి గుడికి వెళ్ళి తిరిగి వచ్చింది... దర్శనం బాగా జరిగిందా తల్లీ, అని ఆమె తండ్రి ప్రశ్నించారు.....


కూతురు:  ఇక మీదట నన్ను ఎపుడూ గుడికి వెళ్ళమనకండి నాన్నాగారు... కోపంగా చెప్పింది..

తండ్రి: ఏం జరిగింది తల్లీ?

కూతురు: గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి మొబైల్ ఫోన్లలో మాట్లాడడం, ఫోటోలు తీయడం, భక్తికి సంబంధించినది కాక వేరే విషయాలు చర్చించడం చేస్తున్నారు. కనీసం భజనలు కూడా సరైన పద్దతులలో ఉండడం లేదు . ఎవరిలోను నాకు భక్తి కనిపించలేదు. 

తండ్రి: ( కాసేపు మౌనం పాటించి) సరే.. నువ్వు తుది నిర్ణయం తీసుకొనే ముందు నాదొక  చిన్న కోరిక.. చేస్తావా...?

కూతురు: తప్పకుండా నాన్నగారు.. మీమాట ఎపుడూ కాదనలేదు. చెప్పండి ఏమి చేయాలో....

తండ్రి:  ఈపూట గుడికి ఒక గాజు గ్లాసుతో నిండా నీళ్ళు తీసుకొని వెళ్ళు .. మూడంటే మూడే ప్రదక్షిణలు చేసి రావాలి.. అయితే చిన్న గమనిక.. నీ గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా నీరు తొలకరాదు సుమీ... ఈ పని చేయగలవా.....?

కూతురు:  అలాగే నాన్నగారు. తప్పకుండా చేస్తాను మీకోసం...  అని ఒక గ్లాసుతో నీరు తీసుకొని బయలు దేరింది.. ఒక మూడు గంటల తరువాత ఇంటికి గ్లాసు నీటితో తిరిగి వచ్చింది.. 

కూతురు: ఇదిగో నాన్నగారు.. నేను గుడికి గ్లాసు నీళ్ళతో వెళ్ళి మీరు చెప్పిన విధంగా మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చాను. ఒక్క నీటి చుక్క కూడా తొణకలేదు.. 

తండ్రి మూడు ప్రశ్నలు వేసారు. 

1. నువ్వు ప్రదక్షిణ చేస్తున్నపుడు ఎంతమంది తమ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు.? 


2. ఎంత మంది అనవసర విషయాలు గుడిలో చర్చిస్తున్నారు ?


3. ఎంత మంది అసలు భక్తి అనేది లేకుండా ప్రవర్తించారు?


కూతురు: నేనేలా చెప్పగలను నాన్నగారు.. నాదృష్టి గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా నీరు   క్రింద పడకుండా చూసుకుంటున్నాను కదా.. 

తండ్రి: ఇదేనమ్మా నేను చెప్పదలచుకున్నది. నువ్వు గుడికి వెళ్ళినపుడు నీ దృష్టి భగవంతుని విగ్రహం మీద, నీ ధ్యాస ఆయన కరుణ మీద ఉండాలి. అపుడు నువ్వు అంతఃముఖివై భగవంతుని పొందగలవు. జీవితం వృద్ది చెందడానికి ఈ విధమైన ఏకాగ్రత సాధించాలి. 

కూతురు:  ధన్యురాలిని నాన్నగారు... ఈ రోజు నాకు భగవంతుని గుడి అన్నది ఎందుకు ఏర్పచుకొన్నామో, అంతఃర్ముఖులు అవడం అంటే ఏమిటి  అనే విషయాలపై అవగాహన కలిగించారు....


 శ్రీధర్ శర్మ తోటపల్లి

 శ్రీ సద్గురు పీఠం

వాయిదా వేసేవారికి

 శ్లోకం:☝️

*కర్తుం నియోజితం కార్యం*

  *యస్మాత్కస్మాదనన్తరం |*

*అనంతకాలపర్యంతం*

  *దినం నాయాతి కిఞ్చన ||*


భావం: పనులను వాయిదా వేసేవారికి తమ ధర్మాన్ని నిర్వర్తించే రోజు అనంతమైన కాలం గడచినా ఎప్పటికీ రాదు! యుగాంతము, కల్పాంతము వచ్చినా ఆ పని మరునాడుకు వాయిదా వేయబడుతుంది!🙏

2, ఏప్రిల్ 2023, ఆదివారం

అబ్బాయనుకో

 *ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది చాలా గర్వంగా ఉంది.*


*ఒక గర్భవతైన భార్య,* 

*ఆమె భర్త ఇలా*

*మాట్లాడుకుంటున్నారు..*


*భార్య:* 


ఏం అనుకుంటున్నావ్..?

అబ్బాయి పుడతాడనా ?

అమ్మాయనా..??


*భర్త:*


అబ్బాయనుకో...

వాడికి లెక్కలు

నేర్పుతాను...

ఇద్దరం కలిసి గేమ్స్

ఆడుకుంటాం... 

స్విమ్మింగ్

నేర్పుతా... 

చెట్లెక్కడం

నేర్పుతా... 

అమ్మాయిలతో 

ఎలా మాట్లాడాలో

నేర్పుతా... ఇంకా....


*భార్య:*


చాలు చాలు! 

మరి అమ్మాయి పుడితే..!?


*భర్త:* 


అమ్మాయైతే 

ఏం నేర్పనవసరంలేదు...!

అదే నాకు

నేర్పుతుంది... 


నేనేం తినాలి... 

ఏం తినకూడదు...

ఏం మాట్లాడాలి... 

ఏం మాట్లాడకూడదు... 

నేను ఎలాంటి బట్టలు

వేసుకోవాలి... 


ఒక రకంగా 

మా అమ్మ లాగా

అన్నమాట... 


ఇంకా నేను దానికి

ప్రత్యేకంగా ఏం

చేయకపోయినా 

నన్ను హీరోలా చూసుకుంటుంది... 


నన్నెవరైనా

బాధపెట్టారనుకో, 

వాళ్ళని అస్సలు

క్షమించదు... 

ఎదురు తిరుగుంది... 


భర్త దగ్గర కూడా 

నాగురించి గొప్పగా

చెప్తుంది... 

మా నాన్న నాకోసం 

అది చేసాడు... 

ఇది చేసాడు అనీ... 


*భార్య:*


సో..అమ్మాయైతే ఇవన్నీ

చేస్తుంది... 

అబ్బాయైతే 

చేయడంటారు

అంతేగా..??


*భర్త:*


కాదు..

అబ్బాయైతే ఇవన్నీ

మనల్ని చూసి నేర్చుకుని

చేస్తాడు... 


అమ్మాయికి 

బై బర్త్ వచ్చేస్తాయ్... 


*భార్య:*


అదేం 

శాశ్వతంగా మనతోనే 

ఉండిపోదు కదా..!


*భర్త:*


ఉండదు... 

కానీ మనం దాని గుండెల్లో

ఉండిపోతాం... 


అందుకని 

అది ఎక్కడ ఉంది 

అన్నది సమస్య కాదు..!


Daughters 

are Angles... 

Born with

unconditional 

love and care forever...


అందుకని 

ఆడపిల్లల

తల్లిదండ్రులు

అదృష్టవంతులు...


కూతురంటే కూడికల,

తీసివెతల లెక్క కాదు

నీ వాకిట్లో పెరిగే 

'తులసి మొక్క'... 


కూతురంటే 

దించేసుకొవలసిన 

బరువు కాదు..

నీ ఇంట్లో వెలసిన 

'కల్పతరువు'... 


కూతురంటే 

భద్రంగా చూడవలసిన

గాజు బొమ్మ కాదు... 

నీ కడుపున పుట్టిన 

మరో "అమ్మ"... 


కూతురంటే

కష్టాలకు,కన్నీళ్ళకు

వీలునామా కాదు ...

కల్మషం లేని 

'ప్రేమ' కు చిరునామా...


కళ్యాణమవగానే 

నిన్ను విడిచివెళ్ళినా...

పరిగెత్తుకొస్తుంది నీకు 

ఏ కష్టమెచ్చినా... 


తన ఇంటి పేరు

మార్చుకున్నా

కడదాకా వదులుకోదు

పుట్టింటి పైన ప్రేమను...


కొడుకులా

కాటి వరకు

తోడురాకపోయినా... 

అమ్మ అయి 

నీకు ప్రసాదించగలదు 

మరో జన్మ...


కూతురున్న 

ఏ ఇల్లు అయినా

అవుతుంది.. 

దేవతలు 

కొలువున్న కోవెల... 


*కూతురిని కన్న* 

*ఏ తండ్రి అయినా* 

*గర్వపడాలి యువరాణిని*

 *కన్న మహారాజు లా.*

కాకి - కాలజ్ఞాని'

 ' బలగం సినిమా లో కాకి అనే ఒక పక్షిని మన తెలంగాణా ఆచారంలో భాగంగా చూపించారు...అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది..ఎందుకంటే

----------------------------------------కాకి - కాలజ్ఞాని' అంటారు...


®️వేకువ జామునే '(బ్రహ్మ ముహూర్తంలో)' మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.


®️'కావు కావు' అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు.. ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ 'కావు కావు' అని  అందరికీ గుర్తు చేస్తూ 'బోధిస్తూ'.. అందరినీ తట్టి లేపేది కాకి.


®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న 'అన్ని కాకులకు' సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.


®️శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి 'సంఘటితంగా పోరాటం' చేపట్టేవి కాకులు.


®️ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.


®️ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.


®️సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే.


®️అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా.


®️కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే  'కాకులు దూరని కారడవి' అంటారు.


®️కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.


®️అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.


®️సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక  స్నానమాచరించి బయట ఎగురుతాయి.  అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.


®️దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.


®️భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.


®️మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.


®️ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు.!


®️కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి...!!


®️భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే.  సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్యా ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.

------------------------------

ఇది చదివాక, కాకి జీవనంలో ఇంత  తాత్వికత, ఇంత లోతైన అర్థం ఉందా!!!!! అనిపించింది. వీలైనంతమందికి పంచితే మంచిదేమో !...

ఒక మిత్రుడు నన్ను అడిగాడు....

వేదాలను మించిన శాస్త్రం లేదు.

 శ్లోకం:☝️

*నాస్తి వేదాత్పరం శాస్త్రం*

 *నాస్తి మాతుః పరో గురుః ।*

*నాస్తి దానాత్పరం మిత్రం*

 *ఇహ లోకే పరత్ర చ ll*

    అత్రిస్మృతిః - 148


భావం: వేదాలను మించిన శాస్త్రం లేదు. తల్లిని మించిన గురువు లేదు, దానాన్ని మించిన స్నేహితుడు లేడు; ఇహలోకంలోను పరలోకంలో కూడా!

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 


*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం బోధయజ్ఞాయనమః*


శ్రీ స్వామిభక్తుడు పగడాల దస్తయ్యగారు,  బురదపాళెం ఇలా చెప్తున్నారు.


ఒకరోజు శ్రీస్వామివారు చెప్పారు, "అయ్యానేను అరణ్యంలో మంచి ఆకలితో వస్తున్నాను, ఒకచోట పెద్దామె చద్దియన్నం మూటలు పెట్టుకొని వాళ్ళ ఇలాక మనుషుల కొఱకు ఎదరుచూస్తుంది. నన్ను చూడగానే ఆమె ఆప్రక్కనున్న చెట్టు చాటుకు వెళ్ళింది. నేను మంచి ఆకలితో వున్నాను. కనుక ఒక చద్దిమూట తీసుకొని ప్రక్కనున్న నది ఒడ్డున తినేందుకు వెళ్ళాను. చద్దిమూట విప్పి చేతిలో వుంచుకొని తినేందుకు కలుపబోతున్నాను.


 బ్రహ్మాండముగా గాలి, వాన, ఉరుములు వచ్చి ఆ అన్నమంతా నేలపాలైపోయింది. నేను తినేందుకు ప్రాప్తం లేకుండా పోయింది." ఆనదిలో నీరు త్రాగి ఆకలి తీర్చుకోవలసి వచ్చింది. ఆచద్దిమూటను అడగకుండా, ఆమెకు చెప్పకుండా తీసుకొన్న ఫలితమే ఇలా అయినది". అని సెలవిచ్చారు. ఇది మనందరికీ ఒక చక్కని పాఠమే. *మన అవసరం ఎంత బలీయంగా వున్నా అనుమతి లేనిదే ఇతరుల వస్తువును మనం తాకరాదని అలా తీసుకొన్నా అది మనకు దక్కదని శ్రీ స్వామివారు ఈ లీలద్వారా బోధిస్తున్నారు.*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*

*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 28*

అలానే దాసగణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లామ్ పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధుపుంగవుని దర్శించి, "శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా?" అన్నాడు. "దర్శించవచ్చు. నేను గూడ వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో వున్నాను. ఆయనెంతటివారో ప్రజలు తెలుసుకోవడం లేదు. ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకొంటారు" అన్నారు.

*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఏదైనా మనము చాలా కష్టం పడుచున్నాము అనే భావన ఉన్న వారు ఒక్కసారి మిళారేప చరిత్ర ను చదివిన/విన్నా ముక్తి మార్గము గురు సేవ ఇలాంటివి మనలో  మాటల రూపం లో ఉన్న వా లేక చేతల రూపం దాల్చినవా అని స్పష్టం అవుతుంది.. శాశ్విత ఆనందం పొందే దానిలో మన మనసు ఎంత శిక్షణ పొందు తుందో అర్ధం అవుతుంది...

జై సాయి మాస్టర్🙏🙏🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


  కొద్ది నిమిషాలలో అమ్మ నన్ను పిలిపించారు. నేను వెళ్ళి నమస్కరించగా ఆమె ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ, నా చేతిలో రవ్వకేసరి ప్రసాదం వేసారు. అంతటితో నా కర్తవ్యం స్పష్టమై మనసులో బరువు కొంత తగ్గింది. ప్రసాదం కళ్ళకద్దుకుని అమ్మకు సెలవు చెప్పుకుని వెనుకకు తిరుగగానే ఆమె హిందీలో, "ఏమయ్యా! నీకు కావలసిందేమిటి?" అని మరుక్షణమే తన మాట సర్దుకుంటూ, “నీకేం కావాలి?" అన్నారు. ముక్తి లేక జ్ఞానము కావాలని కోరితే ఆమె ఆశీర్వదిస్తారు. కాని అది ఫలించేది ఎన్నడో ఎవరికి తెలుసు? అనుకుని, నేనామెను మరల దర్శించుకోలేను గదా! అని గుర్తురాగానే నేను వెనక్కు తిరిగి, 'అమ్మా, మీ దర్శనం నాకు మరొక్కసారి కావాలి' అన్నాను. అమ్మ ఒక్క క్షణం ఆలోచనగా నాకేసి చూచి, 'మంచిది, అలాగే లభిస్తుందిలే పో!' అన్నారు. నేను వెంటనే బయల్దేరి స్టేషనుకు వెళ్తున్న మరికొందరితో కలసి బండిలో రైల్వేస్టేషను చేరుకున్నాను.

  

*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

విద్యారంభంలో

 శ్లోకం:☝️

*నమామి శారదాం దేవిం*

  *విద్యారమ్భే సుమంగళాం ।*

*నరస్తస్యాః ప్రసాదేన*

  *పాండిత్యం లభతే సదా ।।*


భావం: విద్యారంభంలో సరస్వతీ దేవికి నమస్కరిస్తున్నాను, ఎందుకంటే మనిషి ఎల్లప్పుడూ ఆమె ఆశీర్వాదంతోనే జ్ఞానవంతుడు అవుతాడు.🙏