12, సెప్టెంబర్ 2020, శనివారం

సనాతన ధర్మం



చాలాకాలం క్రితమే మన పూర్వీకులు మనిషి చావు, పుట్టుకల గురించి, మరణానంతర పరిణామాల్ని గురించి ప్రశ్నించుకొని సమాధానాల్ని వెతుక్కునే ప్రయత్నం చేశారు. అనేక మంది ఋషులు, మునులు, జ్ఞానులు నిరంతరం సత్యాన్వేషణకై తపస్సు చేశారు. వాళ్లు తపస్సమాధిలో ఉన్నప్పుడు అత్యున్నత సత్యాన్ని, ధర్మాన్ని వేదం రూపంలో తెలుసుకున్నారు. తపస్సమాధిలో ఉండగా వాళ్లకు లభించిన జ్ఞానాన్ని వేదాలుగా వ్యవహరిస్తున్నాం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వాళ్లకు అవి పరమాత్ముడి వాణిగా వినిపించాయి కాబట్టి వాటిని శ్రుతులు అన్నారు.

వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో మన ఋషులు ఎంతో కృషి చేసి కొన్ని శాశ్వత సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు విశ్వమంతటికీ అన్ని యుగాల్లోనూ వర్తిస్తాయి. మానవులు ఏయే దశలలో ఎటువంటి నియమాలు పాటించాలి? కుటుంబం, సమాజం, ప్రకృతి, దేశం పట్ల ఎవరి బాధ్యత ఏమిటి? తదితర విషయాల గురించి అన్ని విధాలా ఆలోచించి.. ఎలా వ్యవహరిస్తే ధర్మం నిలబడుతుందో ఆ విధంగా మార్గదర్శనం చేయగలిగిన అద్భుత జీవన విధానాన్ని మన ఋషులు, మునులు రూపొందించారు. సమస్త జగత్తునూ క్షేమంగా ఉంచగల ఈ శాశ్వత సూత్రాలే ధర్మానికి ఆధారంగా నిలిచాయి.
మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ధర్మానికి ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనుక దీన్ని సనాతన ధర్మం అన్నారు. అనాదిగా ఉన్న చైతన్యాన్ని దేవుడని, సనాతనుడనీ పిలుచుకున్నారు. కాబట్టి దీన్ని దైవ ధర్మమని, సనాతన ధర్మమని అన్నారు.
రుషులు మనకు అందించింది కాబట్టి దీన్ని ఆర్ష ధర్మం అని కూడా అన్నారు. అదే విధంగా మనదేశాన్ని హిందూదేశం అని పిలవడం వల్ల మనం అనుసరించే ఈ ధర్మాన్ని హిందూ ధర్మం అన్నారు.



ధారణాద్ధర్మమిత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః
 యస్మాద్ధారణ సంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః
ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి. ప్రజలందరిని ధర్మం ధరిస్తుంది. ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వాడికి సుఖశాంతులు, శాశ్వతకీర్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి. ‘ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం’ అని నారాయణోపనిషత్తు చెబుతోంది. ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ధర్మాన్ని అనుసరించే బలహీనుడు రాజుకన్నా బలవంతుడని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది. అట్టి ధర్మాన్ని విస్మరిస్తే జరిగేది పతనమే.

మానవజీవితానికి పరమ ప్రయోజనమైన మోక్షం.. కేవలం ధర్మంతోనే సాధ్యం. ధర్మబద్ధమైన ఆర్జన (అర్థం), ధర్మబద్ధమైన కామంతోనే మనిషి నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలడు. అందుకే మన పెద్దలు చతుర్విధ పురుషార్థాల్లో ధర్మాన్ని ముందుపెట్టారు. సంపాదన అయినా, కోరికలైనా ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి.. మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః

ఓ మంచికథ!!* *🔮బహుమతి* .



*🔮బహుమతి* ....తప్పకుండా చదవండి.. నాకైతే కళ్ళు చెమర్చాయి..

```
ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.

చిరంజీవి సత్యమూర్తికి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు

డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.

దైవసమానులైన మాస్టారుగారికి,

నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ విద్యార్ది,
సత్యమూర్తి.

అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను```

" ఈ పర్స్ ఎవరిదండీ ? "

సిద్దార్ధ టికెట్ టికెట్ అంటూ ట్రైన్ లో అటు నుండి ఇటు వస్తూ ఉంటే ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది . దానిని పైకి తీశాడు . అందులో కొద్దిపాటి చిల్లర నోట్లు , ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు . ఎవరిదో తెలిపే ఆనమాళ్ళు ఏమీ లేవు . ఎలా తిరిగి ఇవ్వడం ?
 .
 " ఈ పర్స్ ఎవరిదండీ ? " అంటూ అడిగారు
.
అందరూ పర్స్ కేసీ చూశారు . తమ జేబులు తడుముకున్నారు . ఈ విషయం పక్క బే లో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు .
 .
 " మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ? ఏదైనా ఆనమాలు ఏమిటీ ? "
 .
 " అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ " అన్నాడాయన
.
 " అదే ఆనమాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా ! "
 .
అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమె !

 .
 " బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో పెట్టుకున్నాను . "
 .
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భార్య చాలా అందగత్తె . నాకు ఆమె అంటే చాలా ప్రేమ అపుడు ఆమె ఫోటో నా పర్సులో పెట్టుకునే వాడిని .
 .
ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు . వాడంటే నాకు చాలా ఇష్టం . వాడి కోసం ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని . వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని . వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని . వాడే నా లోకం . అపుడు నా పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని . వాడు ఇపుడు అమెరికాలో ఉన్నాడు . నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది . ఇపుడు నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా కృష్ణుడిని పెట్టుకున్నాను . ఆయనే నాకు ఇపుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికి ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో గడుపుతున్నాను . "
 .
 .
సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశాడు .
 .
 .
పక్క స్టేషన్ లో రైలు ఆగింది . సిద్ధార్ధ రైలు దిగి బుక్ స్టాల్ కి వెళ్ళాడు .
 .
 " దేవుడి ఫోటోలు ఏమి ఉన్నాయి పర్సు లో పెట్టుకోడానికి "

ధన్వంతరి



ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.[1]

భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు")- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపు అయి ఉండవచ్చును.

వ్యుత్పత్తి
ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.

భాగవతంలో గాధ
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.

"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు."[2]

కాశీరాజ దివోదాస ధన్వంతరి
భాగవతంలోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది (9.17.4) - ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి). ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడట. అవి [1]

కాయ చికిత్స (Internal Medicine)
కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)
శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Opthalmology)
శల్యతంత్ర (Surgery)
విషతంత్ర (Toxicology)
రసాయన తంత్ర (Geriatrics)
వశీకరణ తంత్ర(The therapy for male sterility, impotency and the promotion of virility)
ఈ (సీనియర్) ధన్వంతరి కాశీరాజు దివోదాస ధన్వంతరికి ముత్తాత అయి ఉండాలి. కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆయుర్వేద గ్రంధాలు ఏవైనా, ముఖ్యంగా శల్య సలాక్య తంత్రాల గురించి, వ్రాశాడో లేదో తెలియడం లేదు. బహుశా "చికిత్స తత్వ విజ్ఞానము", "చికిత్సా దర్శనము" అనేవి ధన్వంతరి దివోదాస రచనలు మరియు "చికిత్సా కౌముది" అనేది కాశీరాజు రచన అయి ఉండవచ్చును. శుశ్రుతుడు రచించిన "శుశ్రుత సంహితము" అనే మనకు లభించే రచన అతని గురువైన కాశీరాజు బోధనలపై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాల గురించి (scientific methodology comprising observation and inductive, deductive and analogical reasoning) చెప్పబడింది. శల్య తంత్ర, శలాక్య తంత్ర అనే రెండు శస్త్ర చికిత్సా విధానాలకు కాశీరాజ దివోదాస ధన్వంతరి ఆద్యుడు అనిపిస్తున్నది. ఇతను క్రీ.పూ.3000 కాలానికి చెందినవాడని ద్వారకానాధ్ అభిప్రాయపడుతున్నాడు కాని అది నిరూపించడం కష్టంగా ఉన్నది.[1]

ఆలయాలు
ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" (Central council for Research in Aurveda and Siddha)లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.

తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్టించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు.

కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్ధనలు చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉన్నది.

కేరళ అష్టవైద్యం
కేరళ లో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో "అష్టవైద్యం" అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్టించారు. కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిసూర్ పెరుంగ్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్‌లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి.

మీరూ మీరూ చూసుకోండి

*ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి!*

"విశ్వనాధ సత్యనారాయణ" వారు స్కూలు టీచరుగా వారి ఊరికి దగ్గరగా ఉన్న గ్రామంలో పని చేస్తుండేవారు. అప్పటి వారి జీతం ఇరవై ఒక్క రూపాయలు. విశ్వనాధ వారు పోషించేది తొమ్మిదిమందిని: తల్లి, తోబుట్టువులు, వారి పిల్లలు, ముగ్గురు తమ్ముళ్ళు. రాబడి తక్కువ. ఒకనాటి రాత్రి వారి అమ్మగారు పార్వతమ్మగారు వచ్చి, “నాన్నా, బియ్యం రేపటికి నిండుకున్నవి. చాట అప్పుపుట్టే తీరు లేదు.” అన్నారు. విశ్వనాధ వారు “సరేలే అమ్మా! “ అన్నారు.

పాపం మరుసటి రోజు స్నానాదికాలు ముగించుకుని బయటకు వెళ్లారు. ఆ రోజుల్లో శని, ఆదివారం రెండూ సెలవుదినాలు. ఉదయం వెళ్లి రాత్రి పదిన్నరకు తిరిగి వచ్చారు. ఆరోజుల్లో బ్రాహ్మణుల ఇళ్ళలో ముందు ఒక నీళ్ళ తొట్టి, దాని మీద ఒక కర్ర తో చేసిన మూత ఉండేది .పెరట్లో మరొక నీళ్ళ తొట్టి మూతతో ఉండేది. బయట నుంచి రాగానే ముందు కాళ్ళు కడుక్కుని ఇంటి లోకి ప్రవేశించటం పద్ధతి . భోజనం అనంతరం పెరట్లో ఉన్న తొట్టి వద్ద కాళ్ళు కడుక్కోటం ఆచారం.
విశ్వనాథవారు వచ్చీ రావటంతోటే పద్ధతి ప్రకారం బయట కాళ్ళు కడుక్కోకుండానే సరాసరి వంటింట్లోకి వెళ్లి చూశారు. పొయ్యిలో పిల్లి లేవలేదు. గొప్ప ఖేదానికి గురయ్యారు.

అప్పుడు పాదప్రక్షాళనం చేసి, ముఖం కడుక్కుని “మా స్వామి“ అనే శతకం వ్రాయటం మొదలు పెట్టారు. 'మా స్వామి' లోని మొదటి రెండు పద్యాలు రామాయణ కల్పవృక్షానికి నాంది.
పది, పదిహేను పద్యాలు వ్రాసిన తర్వాత ఒక పద్యంలో అంటారు,
*“మా నాన్నగారికి, నీకు లావాదేవీలు ఏమున్నాయో నాకు తెలియదు. ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. నన్నిలా కష్ట పెడితే మాత్రం నేను ఊరుకునేదిలేదు. ఆహితాగ్ని పెట్టెలో ఉన్న నీ బంగారు లింగాన్ని తెగనమ్ముతాను. రెండు బస్తాల బియ్యం, దినుసులు తెచ్చుకుంటాను”* అని వ్రాస్తుండగా,

తలుపు తడుతున్న శబ్దం అయింది. తల్లి పార్వతమ్మ గారు తలుపు తెరిచారు. బండి తీసుకుని వచ్చిన వ్యక్తి “అమ్మా, కపిలేశ్వరపురం నుంచి రావి సూరయ్య గారు తమకు ఇవ్వమని రెండు బస్తాల బియ్యం , కందిపప్పు మూట, బెల్లపు బుట్ట, నెయ్యి పంపించారు. ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే ఆ బస్తాలు పంచలో పెడతాను“ అన్నారు. అది విశ్వనాధ వారి భక్తి , నిర్భీతి, వారి కున్న దైవానుగ్రహం!🙏

(శ్రీ విశ్వనాథ వారి జయంతి సందర్భంగా...)

*ఓం నమఃశివాయ*

నక్షత్ర సూచీ లక్షణము

*నక్షత్ర సూచీ లక్షణము-నక్షత్ర సూచీ అనగా ఎవరు:* అవిదిత్వైవ యశ్శాస్త్రం దైవత్వం ప్రపద్యతే|| నక్షత్ర సూచీ స భవేత్సర్వకర్మ బహిష్కృత:|
అగణిత సాంవత్సరిక షడ్గుణ హీనస్తు జగతియో మంత్రీ:|| శాస్త్రవిహీనో వైద్యస్త్ర యశ్చ పురుషాభవంతి యమదూతాః॥

తా. జ్యోతిశ్శాస్త్రమును గురుముఖతః ఎవరు చదువకుండ దైవజ్ఞుడని చెప్పుకుంటారో వానిని నక్షత్ర సూచి అందురు. ఇట్టివాడు సర్వకర్మల యందు అనర్హుడుగ బహిష్కరిం పబడును. గణిత శాస్త్రము తెలియనిదైవజ్ఞుడు, సడ్గుణసంపదలేని మంత్రి, వైద్యశాస్త్రము చదువకుండ వైద్యంచేయువాడు, యీ ముగ్గురు యమదూతలుగ చెప్పబడినాయి.

పండ్లు తినడం

*ఖాళీ కడుపుతో పండ్లు తినడం*

చివరి వరకు చదివి, ఆపై మీ ఇ-జాబితాలోని అందరికీ పంపండి......

డాక్టర్ స్టీఫెన్ మాక్ టెర్మినల్ క్యాన్సర్ రోగులకు *"అన్-ఆర్థోడాక్స్"* పద్దతి ద్వారా చికిత్స చేస్తారు.

చాలా మంది రోగులు ద్వారా మంచి ఫలితాలు సాధించారు.

అతను తన రోగుల అనారోగ్యాలను తొలగించడానికి సౌర శక్తిని ఉపయోగించే ముందు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా శరీరంలో సహజమైన వైద్యం మీద నమ్మకం కలిగిస్తారు.

అతని వ్యాసం చదవండి:

క్యాన్సర్‌ను నయం చేసే వ్యూహాలలో ఇది ఒకటి. క్యాన్సర్‌ను నయం చేయడంలో నా విజయం రేటు 80%.

 క్యాన్సర్ రోగులు మరణించకూడదు. ఇది నా ధ్యేయం.
క్యాన్సర్ నివారణ ఇప్పటికే కనుగొనబడింది - *మనం పండ్లు తినే విధంగా*

 మీరు నమ్ముతున్నారా లేదా అనేది మీరే గమనించండి.



 *పండ్లు తినడం*

 మనమందరం పండ్లు తినడం అంటే కేవలం పండ్లు కొనడం, కత్తిరించడం మరియు మన నోటిలోకి పాప్ చేయడం.

 ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. పండ్లు ఎలా మరియు ఎప్పుడు తినాలో తెలుసుకోవడం ముఖ్యం.

పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటి?

 *భోజనం తర్వాత పండ్లు తినకూడదు*

 *పండ్లు ఖాళీ కడుపుతో మాత్రమే తినాలి*

మీరు ఖాళీ కడుపుతో పండ్లను తింటుంటే, ఇది మీ వ్యవస్థను నిర్విషీకరణ చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది, బరువు తగ్గడం మరియు ఇతర జీవిత కార్యకలాపాలకు మీకు అధిక శక్తిని అందిస్తుంది.

 ఫ్రూట్ చాలా ముఖ్యమైన ఆహారం ._

మీరు రెండు రొట్టె ముక్కలు తరువాత ఒక ముక్క పండు తింటే.....

పండ్ల ముక్క కడుపు ద్వారా నేరుగా ప్రేగులలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, కానీ పండ్ల ముందు తీసుకున్న రొట్టె కారణంగా అలా చేయకుండా నిరోధించబడుతుంది.

ఈలోగా రొట్టె & పండ్లు పులియబెట్టి మొత్తం ఆమ్లం గా మారుతుంది.

పండు కడుపులోని ఆహారం మరియు జీర్ణ రసాలతో సంబంధంలోకి వచ్చిన నిమిషం, ఆహారం మొత్తం ద్రవ్యరాశి చెడిపోవటం ప్రారంభమవుతుంది.

కాబట్టి దయచేసి మీరు పండ్లను *ఖాళీ కడుపుతో * లేదా మీ భోజనానికి ముందు తినండి*

ప్రజలు ఫిర్యాదు చేయడం మీరూ విన్నారు:

నేను పుచ్చకాయ తినే ప్రతిసారీ, నా కడుపు ఉబ్బిపోతుంది, అరటిపండు తిన్నప్పుడు నేను టాయిలెట్‌కు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది.

మీరు ఖాళీ కడుపుతో పండ్లు తింటే అసలు ఇవన్నీ తలెత్తవు.

ఈ పండ్లు ఇతర ఆహారాన్ని ఉంచడంతో కలిపి వాయువును ఉత్పత్తి చేస్తుంది మరియు అందువల్ల మీరు ఉబ్బుతారు!

కళ్ళు కింద నలుపు, బట్టతల, నాడీ విస్ఫోటనం మరియు చీకటి వృత్తాలు వేయడం ఇవన్నీ మీరు ఖాళీ కడుపుతో పండ్లు తీసుకుంటే జరగదు.

నారింజ మరియు నిమ్మకాయ వంటి కొన్ని పండ్లు ఆమ్లమైనవి కావు, ఎందుకంటే అన్ని పండ్లు మన శరీరంలో ఆల్కలీన్ అవుతాయి, ఈ విషయంపై పరిశోధన చేసిన డాక్టర్ హెర్బర్ట్ షెల్టాన్ ప్రకారం.

మీరు పండ్లు తినడానికి సరైన మార్గాన్ని నేర్చుకుంటే, మీకు అందం, దీర్ఘాయువు, ఆరోగ్యం, శక్తి, ఆనందం మరియు సాధారణ బరువు యొక్క రహస్యం ఉంది.

మీరు పండ్ల రసం తాగినప్పుడు - *తాజా పండ్ల రసాన్ని మాత్రమే తాగండి* డబ్బాలు, ప్యాక్‌లు లేదా సీసాల నుండి కాదు.

వేడెక్కిన రసం కూడా తాగవద్దు.

వండిన పండ్లను తినవద్దు ఎందుకంటే మీకు పోషకాలు అస్సలు రావు.మీరు దాని రుచిని మాత్రమే పొందుతారు.
వంట అన్ని విటమిన్లను నాశనం చేస్తుంది.

కానీ, రసం తాగడం కంటే మొత్తం పండు తినడం మంచిది.

మీరు తాజా పండ్ల రసాన్ని తాగాలంటే, నెమ్మదిగా త్రాగాలి, ఎందుకంటే మింగడానికి ముందు మీ లాలాజలంతో కలపాలి.

మీ శరీరాన్ని శుభ్రపరచడానికి లేదా నిర్విషీకరణ చేయడానికి మీరు 3 రోజుల పండ్లనే ఆహారం గా తీసుకోవొచ్చు.

కేవలం 3 రోజులు పండ్లు తినండి మరియు తాజా పండ్ల రసం త్రాగండి.

మీరు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నారో మీ స్నేహితులు చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు!

 *కీవీ పండు:*

 చిన్నది కాని శక్తివంతమైనది.
 ఇది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇ & ఫైబర్ యొక్క మంచి మూలం. దీని విటమిన్ సి కంటెంట్ నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువ.

 *ఆపిల్*

రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుందా?
ఒక ఆపిల్‌లో తక్కువ విటమిన్ సి కంటెంట్ ఉన్నప్పటికీ, ఇందులో యాంటీఆక్సిడెంట్లు & ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి, ఇది విటమిన్ సి యొక్క కార్యాచరణను పెంచుతుంది, తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, గుండెపోటు & స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

 *స్ట్రాబెర్రీ:*

 రక్షిత పండు.
ప్రధాన పండ్లలో స్ట్రాబెర్రీ అత్యధిక యాంటీఆక్సిడెంట్ శక్తిని కలిగి ఉంది మరియు క్యాన్సర్ కలిగించే, రక్తనాళాలు-అడ్డుపడటం మరియు ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.

 *ఆరెంజ్:*

రోజుకు 2-4 నారింజ తీసుకోవడం వల్ల జలుబు దూరంగా ఉండి, కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు, మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు మరియు కరిగించవచ్చు, అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 *పుచ్చకాయ:*

 చక్కని దాహం చల్లార్చు. 92% నీటితో కూడి, ఇది గ్లూటాతియోన్ యొక్క భారీ మోతాదుతో నిండి ఉంటుంది, ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అవి కూడా లైకోపీన్ క్యాన్సర్ ఫైటింగ్ ఆక్సిడెంట్ యొక్క ముఖ్య వనరు. *
పుచ్చకాయలో లభించే ఇతర పోషకాలు విటమిన్ సి & పొటాషియం.

 *జామ & బొప్పాయి :*

విటమిన్ సి కోసం అగ్ర పురస్కారాలు వారి అధిక విటమిన్ సి కంటెంట్ కోసం స్పష్టమైన విజేతలు.

జామలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంది, ఇది మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

బొప్పాయిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది; ఇది మీ కళ్ళకు మంచిది.

భోజనం తర్వాత కోల్డ్ వాటర్ లేదా డ్రింక్స్ తాగడం క్యాన్సర్ కారకం

 మీరు దీన్ని నమ్మగలరా?

చల్లటి నీరు లేదా శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడేవారికి, ఈ వ్యాసం మీకు వర్తిస్తుంది.

భోజనం తర్వాత ఒక కప్పు చల్లటి నీరు లేదా శీతల పానీయాలు కలిగి ఉండటం చాలా బాగుంది అనిపిస్తుంది.

అయితే, చల్లటి నీరు లేదా పానీయాలు మీరు ఇప్పుడే తిన్న జిడ్డుగల పదార్థాన్ని పటిష్టం చేస్తాయి.

 *ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది*

 * ఈ 'బురద' ఆమ్లంతో స్పందించిన తర్వాత, అది విచ్ఛిన్నమవుతుంది మరియు ఘన ఆహారం కంటే వేగంగా ప్రేగు ద్వారా గ్రహించబడుతుంది. *

ఇది పేగును లైన్ చేస్తుంది.

అతి త్వరలో, ఇది క్రొవ్వు గా మారి క్యాన్సర్‌కు దారితీస్తుంది!

భోజనం తర్వాత వేడి సూప్ లేదా వెచ్చని నీరు త్రాగటం మంచిది.

జాగ్రత్తగా ఉండండి మరియు తెలుసుకోండి. మనం మనుగడ సాగించే మంచి అవకాశాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి.

*ప్రముఖ కార్డియాలజిస్ట్*
 ఇలా అంటారు:

ఈ సందేశం వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని 10 మందికి పంపితే, మేము కనీసం ఒక ప్రాణాన్ని అయినా కాపాడుతామని మీరు అనుకోవచ్చు.

కాబట్టి దీన్ని ఆచరిద్దాం....
నలుగురితో పంచుకుందాం....

        *🙏సర్వేజనా సుఖినోభవంతు🙏*

*మీ మిత్రుడు*

**బదరీనాథ్ దేవాలయము**

*దశిక రాము**

**మన సంస్కృతి సాంప్రదాయాలు**




దేవాలయ విశేషాలు
ఓం నమఃశివాయ....ఓం నమఃశివాయ...ఓం నమఃశివాయ..
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామ గోవిందం దధివామనమ్”
పై పది విష్ణునామాలు భక్తితో వందసార్లు జపిస్తే మానవుడు రోగ విముక్తుడగుతాడు. లక్షసార్లు జపిస్తే బంధ విముక్తుడవుతాడు. పదిలక్షసార్లు జపిస్తే గొడ్రాలు సంతానవతి అవుతుంది. కోటిసార్లు జపిస్తే జీవన్ముక్తుడవుతాడు. బదరీనాథ్ (నారాయణక్షేత్రం)లో జపిస్తే సర్వసిద్ధులు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.
బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా లో ఉన్న పంచాయితీ.
చార్ ధామ్(నాలుగు పట్టణాలు)లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ(6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. మహాభారతంలో శివుడు అర్జునినితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- కృష్ణుడు నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్లు వర్ణించ బడింది.
గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తి వంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలీ నట్లూ దానిలో అలకనందానది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం.
బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ వ్యాస విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్‌ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది.
స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మ పురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుఠం గానూ భక్తులచే విశ్వసించ బడుతుంది. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మరియు వేదాంత దీక్షితులు ఇక్కడకు వచ్చి బద్రీనాధుని దర్శించుకుని ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాశారు.
బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పంను తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్థుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.
బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిధిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.
బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.
బద్రీ అంటే రేగుపండు నాధ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాధుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ(అలసట)తీర్చడానికి రేగుచెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.
బద్రీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌కు రెండు రోజుల ప్రయాణదూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్(నాలుగు సౌధములు)లలో ఇది మొదటిది. ఇది ఓడలనుండి సరకు దిగుమతి చేసుకునే రేవులలో ఒకటి. బద్రీనాథ్ పోయే దారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం మీదుగా పోవాలి. శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానిక

ి అనుమతి లభిస్తుంది. బద్రీనాథ్, హేమకుండ్ కు వెళ్ళే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్ధం అధికమై రద్దీగా ఉంటుంది. బద్రీనాధుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబర్‌ల మధ్యకాలం. స్వెట్టర్లు మొదలైన చలిని తట్టుకొనే దుస్తుల అవసరం సంవత్సరమంతా ఉంటుంది. బద్రీనాథ్ మరియు పరిసర పల్లెలను బస్సు మార్గంలో చేరవచ్చు. ఆదిశంకరాచార్యుడు ఉత్తరభారతంలో స్థాపించిన జ్యోతిమఠం బద్రీనాథ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న ఇతర పుక్ష్యక్షేత్రాలు హరిద్వార్ మరియు కేదార్‌నాధ్.
ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తనపుత్రుడైన కుమారస్వామికి వర్ణించాడు.ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని,త్రేతాయుగంలో యోగసిద్దిద అని,ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి.జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటినిజ్ఞానంవలన నశింపచేసే క్షేత్రంకనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.ఇక్కడి రేగుచెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీక్షేత్రమని పిలువబడినదని క్షేత్రపురాణం వివరిస్తుంది.బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని శువుడు కుమారస్వామికి వివరించాడు.ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్ధాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది.ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి.ఈ క్షేత్రంలో అన్ని తీర్ధాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణకథనం.సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి.ద్వాపరయుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్దవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపసు చేయమని ఆదేసించడం వలన యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్దవుడు రక్షింపబడ్డాడు.
అతి సమీపంలోని విమానాశ్రయం డెహరాడూన్‌లో ఉన్న డెహరాడూన్(317కిలో మీటర్లు), సమీపంలోని రైల్వే స్టేషన్ హరిద్వార్ రైల్వే స్టేషన్ (310కిలోమీటర్లు) రిషికేశ్ రైల్వే స్టేషన్ (297) మరియు కోట్‌ద్వార్ రైల్వే స్టేషన్ (327 కిలో మీటర్లు). ప్రతి రోజు ఢిల్లీ, హరిద్వార్ మరియు ఋషికేశ్ లనుండి బస్సు సర్వీసులు (వసతులు) ఉంటాయి. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి కనుక ప్రయాణీకులు జాగ్రత్త వహించడం మంచిది. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం ఉత్తమం. కొంతకాలం క్రితం వరకు ఇక్కడకు ప్రయివేట్ వాహనాలు నిషిద్దం కానీ స్వంత వాహనాలలో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు .
🙏🙏🙏
సేకరణ

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

భర్తృహరిః

🌻🌹शुभोदय🙏सुभाषितम् 🌹🌻

वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैस्सह।
न मूर्खजनसम्पर्कः सुरेन्द्रभवनेष्वपि॥

                                     - भर्तृहरिः

వరం పర్వతదుర్గేషు
భ్రాన్తం వనచరైస్సహ।
న మూర్ఖజనసమ్పర్కః
సురేన్ద్రభవనేష్వపి॥

                                  - భర్తృహరిః

"సకలభోగాలుగల భవనంలో
మూర్ఖులతో సహవాసం చేయడంకంటే ఆటవికులతో కలసి అడవుల్లోనో పర్వతప్రదేశాల్లోనో సంచరించడం ఉత్తమం."


🌷🌻🌹🌸 शुभमस्तु 🌸🌹🌻🌷

అద్భుతమైన చిత్రం

ఎంత అద్భుతమైన చిత్రం కదా
🙏🙏🙏


*ప్రతిరోజూ శ్రీ అన్నపూర్ణా దేవిని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే జీవితంలో అన్నపానీయాలకు లోటుండదు*


శ్రీ అన్నపూర్ణాష్టకం ఎంతో మహిమాన్వితమైన స్తోత్రం, రోజులో కనీసం ఒక్కసారైనా ఈ స్తోత్రం పటించాలి. శ్రీ అన్నపూర్ణా దేవి దేవి అనుగ్రహం వలననే మనకు అన్నపానీయాలు లభిస్తున్నాయి, ఇవే కాక జ్ఞానాన్నీ, వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి. అందుకే తప్పకుండా శ్రీ అన్నపూర్ణాష్టకం భక్తి, శ్రద్ధలతో పటించాలి.

శ్రీ అన్నపూర్ణాష్టకం

నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 1

నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 2

యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 3

కైలాసాచలకందరాలయకరీ - గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ - హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 4

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ - బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ - విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 5

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ - శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ - విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 6

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ - నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 7

దేవీ సర్వవిచిత్రరత్నరచితా - దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ - సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ - కాశీపురధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 8

చంద్రార్కానలకోటికోటిసదృశా - చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ - చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 9

క్షత్రత్రాణకరీ సదా శివకరీ - మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ - విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 10

అన్నపూర్ణే సదాపూర్ణే - శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం - భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ - పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ - స్వదేశో భువనత్రయమ్‌|

ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్‌

*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః*