14, అక్టోబర్ 2021, గురువారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*453వ నామ మంత్రము* 14.10.2021


*ఓం త్రినయనాయై నమః*


సోమసూర్యాగ్నులే తన నేత్రములై భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రినయనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం త్రినయనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లిని తన హృదయమందు దహరాకాశవాసినిగాను, తన మనోనేత్రములందు ఆ పరమేశ్వరిని సోమసూర్యాగ్ని లోచనిగాను వీక్షిస్తూ పరమమానందభరితుడై తరించును.


శివుడు త్రినేత్రుడు. శివాని (అమ్మవారు) త్రినయన. శివశక్త్యైక్యతకు సంకేతము ఇదియే. ఆ పరమేశ్వరునికి త్రికాలములు (భూతభవిష్యద్వర్తమాన కాలములు) త్రినేత్రములయితే అమ్మవారికి సోమసూర్యాగ్నులే త్రినయనములు. ఒక కంట భక్తులను తేజోమూర్తులుగాను, మరొక కంట సుధాస్వరూపులుగాను, ఫాలనేత్రముతో అగ్నిస్వరూపులై శత్రుభయంకరులుగాను మూర్తీభవింపజేయును. 


అమ్మ వారి త్రినయనములలో ఒక నయనము సూర్యుడగుటచే పగటికిని, రెండవ నేత్రము చంద్రుడగుటచే రాత్రికిని, ఫాలనేత్రము సంధ్యాకాలమునకును సంకేతములుగా కూడా భావించవచ్చును. 


శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో నలుబది ఎనిమిదవ శ్లోకంలో చెప్పిన విధానాన్ని పరిశీలిద్దాము:-


*అహః సూతే సవ్య - తవ నయనమర్కాత్మకతయా*


*త్రియామాం వామంతే - సృజతి రజనీ నాయకతయా |*


*తృతీయా - తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః*


*సమాధత్తే సంధ్యాం - దివసనిశయోరంతరచరీమ్ || 48 ||*

 

అమ్మవారి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది

 

జగన్మాతా! సూర్య రూపమైన నీ కుడికన్ను వలన ఈ లోకాలకు పగలు ఏర్పడుతున్నది.చంద్రుని స్వరూపమైన నీ ఎడమ నేత్రం వలన రాత్రి ఏర్పడుతున్నది. అగ్ని రూపమైన, కొద్దిగా వికసించిన సువర్ణ కమలము వంటి నీ నుదుటి పై నున్న మూడవ నేత్రము వలన పగలుకు రాత్రికి మధ్య ఏర్పడు ప్రాతసంధ్య,సాయంసంధ్య అనబడు ఉభయ సంధ్యలు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడు ఈ నాలుగు కాలాలు మాపై నీవు కురిపించు నీ కరుణా కటాక్ష వీక్షణాలే కదా తల్లీ! 


పరమేశ్వరి మూడు నయనములు త్రికాలజ్ఞానములకు సంకేతము. ఆ త్రినయనములలో ఒకటి సృష్టికిని, మరియొకటి స్థితికిని, ఫాలనేత్రము లయమునకును సంకేతములు. 


త్రి అనగా మూడుమార్గములను, నయన అనగా లభింపజేయునది. అనగా జీవుడు ఈ స్థూలదేహమును వీడి పోవునప్ఫుడు దక్షిణమార్గము, ఉత్తరమార్గము, బ్రహ్మమార్గములను చూపును. జీవులకు వారి వారి కర్మఫలములననుసరించి ఏ మార్గమున బోవుటకు అర్హతఉండునో ఆ మార్గమును ఆ పరమేశ్వరి అనుగ్రహింపజేయును గనుక ఆ శ్రీమాత *త్రినయనా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం త్రినయనాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *13.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*14.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారుచతుర్భుజమ్|*


*సుచారుసుందరగ్రీవం సుకపోలం శుచిస్మితమ్॥12766॥*


*14.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*సమానకర్ణవిన్యస్తస్ఫురన్మకరకుండలమ్|*


*హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్సశ్రీనికేతనమ్॥12767॥*


*14.40 (నలుబదియవ శ్లోకము)*


*శంఖచక్రగదాపద్మవనమాలావిభూషితమ్|*


*నూపురైర్విలసత్పాదం కౌస్తుభప్రభయా యుతమ్॥12768॥*


*14.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ద్యుమత్కిరీటకటకకటిసూత్రాంగదాయుతమ్|*


*సర్వాంగసుందరం హృద్యం ప్రసాదసుముఖేక్షణమ్|*


*సుకుమారమభిధ్యాయేత్సర్వాంగేషు మనో దధత్॥12769॥*


ఆ ధ్యాన స్వరూపము ఇట్లుండును. ఆ రూపమునందలి అవయవములు అన్నియును సమాన ప్రమాణములో సౌష్ఠవముగా నుండును. ఆ రూపము ప్రసన్నముగా ఉండును. ముఖము ఆహ్లాదకరమైనది. ఆ మూర్తియందలి నాలుగు బాహువులును, దీర్ఘములు, సుందరములు, గ్రీవము (కంఠము) ఒప్పిదమైనది మనోహరమైనది. కపోలములు దర్శనీయములు, చిఱునవ్వు మిగుల స్వచ్ఛమైనది. సమానములుగానున్న ఆ కర్ణములయందలి కుండలములు మిలమిల తళుకు లీనుచుండును. ఆ శ్యామసుందరుని పట్టుపీతాంబరము మనోజ్ఞము. ఆ దివ్యమూర్తి వక్షస్థలము శ్రీవత్స చిహ్నముతో అలరారుచు, లక్ష్మీదేవికి నిలయమై తేజరిల్లుచుండును. ఆ స్వామి ధరించిన శంఖ, చక్ర, గదా, పద్మ, వనమాలల శోభలు అద్వితీయములు. కాళ్ళయందలి అందెలకాంతులు అద్భుతములు. కంఠమునందలి కౌస్తుభమణి దివ్యకాంతులను విరజిమ్ముచుండును. ఆ మంగళకర రూపమున విలసిల్లుచుండెడి కిరీటము, కంకణములు, కటిసూత్రము, కేయూరములు అపూర్వములై శోభిల్లుచుండును. ముఖకాంతులు, వీక్షణముల వైభవములు అనిర్వచనీయములు.  వేయేల ఆ దివ్యరూపము సర్వాంగసుందరము, హృద్యము, ప్రసన్నము, సుకుమారము. అట్టి మంగళకరరూపమును మనస్సున నిలుపుకొనవలెను.


*14.42 (నలుబది రెండవ శ్లోకము)*


*ఇంద్రియాణీంద్రియార్థేభ్యో మనసాఽఽకృష్య తన్మనః|*


*బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః॥12770॥*


బుద్ధిమంతుడైన పురుషుడు మనస్సుద్వారా ఇంద్రియములను శబ్దాది విషయములనుండి మరల్చవలయును. పిమ్మట బుద్ధి అను సారథి సహాయమున మనస్సును నాయందు లగ్నము చేయవలెను.


*14.43 (నలుబది మూడవ శ్లోకము)*


*తత్సర్వవ్యాపకం చిత్తమాకృష్యైకత్ర ధారయేత్|*


*నాన్యాని చింతయేద్భూయః సుస్మితం భావయేన్ముఖమ్॥12771॥*



అంతట నా పూర్తి విగ్రహమును ధ్యానించుచుండగా, చిత్తమును సర్వాంగములనుండి తొలగించి నెమ్మదిగా ఒకే స్థానమునందు నిలుపవలెను. అందులోనూ వేరే ఇతర అంగముల చింతన చేయక, కేవలము మందహాసముతో కూడి మిగుల శోభలొలికించెడు నా యొక్క ముఖమునే ధ్యానించుచుండవలెను. (అనగా, ఇంతకుముందు సర్వాంగములను ధ్యానించుమని చెప్పబడినది. ఇప్పుడు ఏకాంగమును తలంచుమని చెప్పబడినది. అనగా - సర్వాంగములను ధ్యానముద్వారా చక్కగా తలంచుచు, క్రమముగా ఏకాంగముపై చిత్తమును కేంద్రీకరించి ధ్యానతత్పరుడు కావలెనని భగవంతుడు చెప్పినమాట. కారణమేమన, నిలకడలేని మనస్సును అనుసరించి సర్వాంగములను దర్శించినమీదట ఏకాంగమున నిలిపినచో చిత్తము ఏకాగ్రము కాగలదని సాధకులకు ముఖ్యసూచన చేయబడినది.


*14.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తత్ర లబ్ధపదం చిత్తమాకృష్య వ్యోమ్ని ధారయేత్|*


*తచ్చ త్యక్త్వా మదారోహో న కించిదపి చింతయేత్॥12772॥*


మనస్సును చిఱునవ్వుతో ఒప్ఫుచున్న నా ముఖమునుండి మరల్చి, ఆకాశమునందు నిలుపవలెను. క్రమముగా ఆకాశచింతనమునుగూడ త్యజించి, చిత్తమును నా స్వరూపమునందే స్థిరపరచవలెను. అనంతరము నన్ను దప్ప మరి ఏ ఇతర వస్తువును గూడ స్మరింపరాదు.


*14.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*ఏవం సమాహితమతిర్మామేవాత్మానమాత్మని|*


*విచష్టే మయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతమ్॥12773॥*


ఈ విధముగా చిత్తమును ఏకాగ్రమొనర్చినప్పుడు, ఒక జ్యోతి మరియొక జ్యోతితో చేరి, ఏకమైనట్లు తనలో నన్ను అటులే సర్వాత్మనైన నా యందు చేరియున్నట్లు అనుభవింపుము. ఇట్లు నాయందు ఏకీభావస్థితిని పొందుము.


*14.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*ధ్యానేనేత్థం సుతీవ్రేణ యుంజతో యోగినో మనః|*


*సంయాస్యత్యాశు నిర్వాణం ద్రవ్యజ్ఞానక్రియాభ్రమః॥12774॥*


తీవ్రమైన ధ్యానయోగముద్వారా యోగి తన చిత్తమును నాయందు లగ్నమొనర్చినప్పుడు ద్రవ్యము, జ్ఞానము, క్రియలు మొదలగువాటియొక్క నానాత్వభ్రమ వెంటనే తొలగిపోవును. అనగా అతనికి సకలపదార్థముల రూపముల యందును పరమాత్మనైన నా ఉనికియే గోచరించును. కేవలము పరమాత్మజ్ఞానము మాత్రమే మిగిలియుండును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే చతుర్దశోఽధ్యాయః (14)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి   *భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము* అను పదునాలుగవ అధ్యాయము (14)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

బతుకమ్మ పండుగ

 బతుకమ్మ పండుగ న, లేక నివాళి న....


దసరా పండుగ లో దేవి అవతారాలు.....ఒక రోజు ఒక అలంకారం, ఇంకో రోజు ఇంకో అలంకారం చేసి 9 రోజుల పండుగ చేసు కుంటారు. ముఖ్యముగా చెప్పవలసి వస్తే, స్త్రీ మూర్తి, మహిళ ... ఈమె పకృతి లో ఒక భాగము, ఈమెకు గొప్ప స్థానం ఇవ్వాలని చెబుతుంది. స్త్రీ లేని ది పకృతి లేదు అని చెబుతుంది. ఈ దేవత చాలా powerful అని ...నమ్ముతారు... మనిషి పుట్టిన తరువాత దేవుడు పుట్టాడు అని నమ్మని వారు... ఎవ్వరూ powerful, ఎది వాస్తవము అని కొద్ది సేపు ప్రక్కన పెడితే.....


ముస్లిం ల దండ యాత్ర, గోల్కొండ కోట ముస్లిం ల వశము అయిన తరువాత, ఆ ముస్లిం పాలకులు దొరల పై ఆధార పడ్డారు. ఒక విధముగా చెప్పాలి అంటే, దొరలు ముస్లిం పాలకులను ప్రసన్నం చేసుకున్నారు వారి బలహీనతలను అర్థం చేసుకొని... వారి బలహీనతలను సంతృప్తి పరచి, దొరలు వారికి దగ్గర అయ్యారు. దొరలు ఏన్ని అక్రమాలు, అన్యాయాలు చేసిన పట్టించు కాకుండా వారికే వత్తాసు పలికారు. ప్రజల తో మమేకం కాకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండ, దొరలు చెప్పేది అవాస్తవము, మోసం అని తెలిసి కూడా, దొరలు చెప్పినదే వేదం అని వారికి పెద్ద పీట వేశారు.....ముస్లిం ప్రభువులు తమ చేతి లో కీలు బొమ్మలు అని, దొరలు అగాయిత్యలకు పాల్పడ్డారు కొన్ని వందల ఎండ్లు... అయితే కొందరు మంచి దొరలు కూడా ఉన్నారు, ప్రజలను కన్న బిడ్డల కన్న ఎక్కువగా ప్రేమించారు, వారికి సేవ చేశారు. ఇక్కడ మనం మాటలాడు కోవలసింది ఈ సందర్భం లో తప్పుడు పనులు చేసిన దొరల గురించి....ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకున్న దొరలు చాలా తక్కువ, వందలో ఒక్కరూ ఇద్దరు ఉండవచ్చు....దొంగ దొరలు ప్రజల మాన ప్రాణాలను హరించరు, వారి మాట వినని వారికి నిలువ నీడ లేకుండా చేశారు. అప్పుడు ముఖ్యముగా కుల వృత్తులు ఉన్నాయి.  


 గోల్కొండ రాజులు, ఆ తరువాత నిజం పాలన సాగింది...దొరలు వీరి లో కొందరు అధిక కులస్తులు ఉన్నారు, మరి కొందరు అధిక కులస్తులు కానీ వారు కూడా ఉన్నారు అంటే ఇప్పటి బీసీ లు కొందరు... ప్రజలను చదువు కొనివ్వ లేదు, త్రాగు బోతులను చేశారు, దేవుడు దయ్యం అనే భయం ముసుగులో, మూఢ నమ్మకాలను అలవాటు చేసి, వారిని అంధకారము లో ఉంచి దొరలు వారి పబ్బం గడుపుకున్నరు. 


బడుగు బలహీనవర్గాల అడ పిల్లలను దొర దగ్గర పడుకో బెట్టలనే నియమం ను తయారు చేశారు. ఎడ్డి జనం గుడ్డి జనం ఈ నియమం ను గుడ్డీ గా అమలు చేశారు.

దొర కు బలహీన వర్గాల ప్రజలు అందరూ వంగి వంగి దండలు పెట్టే వారు. దొరల లకు ఎదురు తిరిగిన వారిని తప్పుడు కేసు లల్లో పెట్టీ పోలీస్ (రజకారులతో) కొట్టించేవారు, జైలుకు పంపించే వారు. ఎదురు తిరిగిన ఆడవారిని బలవంతముగా అనుభవించి చంపి వేయించే వారు. హిందూ మతములో దొరల కన్న ముందు ఒక వర్గం పూజారులు ఇంకో వింత ఆచారం పెట్టారు. పెండ్లి అయిన తరువాత మూడు రోజులు పెండ్లి కూతురు ఆ పూజరితో గడపాలని, అత్త గారి ఇంటికి వెళ్లా వలసిన అమ్మాయి, పూజారి ఇంటికి పంపే వారు. బడుగు బలహీనవర్గాల ఆడపిల్ల లకు విలువైన కన్యత్వం ను దూరం చేశారు. ఎందరో కన్నె పిల్లలు దొరల దోపిడీ కి గురి అయ్యారు. ఇది నిత్య కృత్యం అయ్యింది అప్పుడు, ప్రతి ఊరిలో దొరల అమనుషాలకు.  


ఆ విధముగా ప్రాణాలు కోల్పోయిన కొందరు అడ పిల్లల గుర్తుగా, దసరా పండుగ సందర్భంగా గా బతుకమ్మ ను ఏర్పాటు చేశారు. దేవి అమ్మ వారు చాలా powerful అని, ఈ 9 రోజులు బతుకమ్మను పూలతో ఏర్పాటు చేసి దొరల పాలనకు, వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అమ్మాయిలను కాపాడాలని, పాటలు పాడుతూ, మహిళలను చైతన్య వంతులుగా చేయడానికి, సామూహిక బతుకమ్మ ను ఏర్పాటు చేశారు.  


ఒక్కో పువ్వు ను ఒక్కో కన్నె పిల్లగా భావిస్తూ, ఒక్కో రకం పువ్వును పెట్టీ, పువ్వుల నే కన్నె పిల్లలుగా భావిస్తూ, కన్నె పిల్లలను రక్షించాలని, బతుక నివ్వలని, దీన గాథలను వర్ణిస్తూ, ఆడ పిల్లల ను దొరల బారి నుండి రక్షించాలని, వారిని దొరలు వదిలి పెట్టాలని ఈ సందర్భం గా అనేక పాటలు పడుతారు మహిళలు ఆ పూల చుట్టూ తిరుగుతూ.....


గతంలో పాడిన దీన గాథలు ఇప్పుడు ప్రచారం లో లేవు. గౌరీ (పార్వతి దేవి) పేరుతో అనేక పాటలు పాడుతున్నారు. ఇప్పటి పాటలలో దొరల అకృత్యాలు లేవు, అవి అన్నీ కనుమరుగు అయ్యాయి. బతుకమ్మ అంటే అమ్మను బతుక నియండి అని అర్థం. అమ్మ అంటే ఒక స్త్రీ మూర్తి. ఆడ పిల్లలను బతుక నియాండి స్వే చ్చ గా, హుందా తనం గా అని అర్థం. ఈ చరిత్ర ప్రతి తెలంగాణ ఆడ పిల్లకు తెలియాలి. చరిత్ర తెలియ కుండ, ఫిల్మ్ పాటలు పాడితే లాభం లేదు.

గతం లో దొరలు ఆడపిల్ల లను పాడు చేస్తే, ఇప్పుడు మద్యం మత్తులో మానవ మృగాలు ఉన్నాయి. 6 నెలల పిల్లల నుండి 60 ఎండ్లా వారిని వావి వరుసలు మరిచి మాన భంగలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మగ మానవ మృగాల నుండి కాపాడ డానికి ప్రతి ఆడ పిల్ల చైతన్య వంతు రాలు కావడానికి బతుకమ్మ పేరుతో పాటలు పాడి, గతం లో బలి అయిన ఆడ పిల్లలను స్మరిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ బతుకమ్మ ఉద్యమాన్ని చేయాలి.  


అయితే తెలంగాణ బతుకమ్మ దీన గాథలకు , దేవి నవ రాత్రు ల ఆలంకరాలకు, పూజలకు సంబంధం లేదని అంటారు... గౌరీ దేవత అంటే పార్వతి దేవి. పార్వతి దేవి కూడా గత జన్మలో శివుడి ని ప్రేమించి పెండ్లి చేసుకుంటుంది. ప్రేమ పెండ్లి నచ్చని ఆమె తండ్రి, ఆమెను అవమానానికి గురి చేస్తాడు. అవమానాన్ని భరించ లేని పార్వతి అగ్ని గుండం లో పడి ఆత్మ హత్య చేసుకుంది అనే ఒక కథ ప్రచారం లో ఉంది. అంటే యువ మహిళలకు తమకు నచ్చిన వాడిని పెండ్లి చేసుకునే స్వె చ్చ ను ఇవ్వాలి అని ఈ సందర్భం గా గుర్తు చేసుకోవాలి....

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

💐


🌷దైవం.. ధర్మం.. సంస్కృతి.. సంప్రదాయం.. పండుగలు

భారతీయ జనజీవన వారసత్వ సంపద 🌷


🏵️సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ🏵️


🌻ఇప్పటిదాకా బతుకమ్మ పండుగ మూలాలు వెలుగులోకి రాలేదు.🌻 ఈ విషయాన్ని చరిత్రకారులు, సాహితీవేత్తలు ధ్రువీకరించారు.🌹 శతాబ్దాలుగా బతుకమ్మ పండుగపై ఎన్నో జానపద గాథలు, పాటలు తెలంగాణలో ప్రచారంలో ఉన్నాయి.🥀 ఎందరో తెలుగు రీసెర్చ్ స్కాలర్లు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతపై ఎన్నో పరిశోధనలు చేశారు. 🏵️కానీ ఈ పండుగను ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? ఎలా మొదలైంది? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.🌻 ప్రపంచంలోనే ఏకైక పూల పండుగ, స్త్రీల కోసం ఉన్న పండుగ బతుకమ్మే.🌹

కొందరు సాహితీవేత్తలు ఈ పండుగలో జైనమత అడుగుజాడలను, కాకతీయులతో ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. 🏵️కానీ అవి ప్రజామోదం పొందలేదు.🥀 కాకతీయులు కొంతకాలం ఆంధ్ర దేశం అంతటినీ పాలించినా ఈ పండుగ తెలంగాణాకే పరిమితం కావడం అర్థం కాని విషయం.🌻

‘బతుకమ్మ’ చరిత్ర మూలాలు కనుక్కోవాలంటే వెయ్యేళ్ల క్రితం ‘రాజ్యపాలన చేసిన కల్యాణి చాళుక్యుల, చోళుల చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.🌻


🌺బతుకమ్మ చరిత్ర

973లో రాష్ర్టకూటుల సామంతుడైన రెండో తైలపుడు చివరి రాష్ర్టకూటరాజైన ‘కర్కుడు-2’ను ఓడించి స్వతంత్ర కల్యాణీ చాళుక్య రాజ్యం స్థాపించాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం ఇతడి ఆధీనంలో ఉండేది.🌹 ఈ కాలంలోనే వేములవాడ చాళుక్య రాజ్యంలోని వేములవాడ ‘రాజేశ్వరాలయం’ అప్పటికే ప్రసిద్ధి చెందింది. 🌺తెలంగాణ ప్రజల ఇష్ట దైవంగా రాజేశ్వరుడు పూజలు అందుకునేవాడు.🌻 రెండో అరికేసరి(930-55) వేయించిన ‘దానశాసనం’లో ఈ దేవాలయ ప్రసక్తి ఉంది.🌹 వేములవాడ చాళుక్య రాజులు రాష్ర్టకూటుల సామంతులు.🌺 అందువల్ల చోళులు, రాష్ర్టకూటుల మధ్య యుద్ధం జరిగితే వీరు రాష్ర్టకూటుల పక్షం వహించేవారు.🌻 ఈ విధంగా రెండో పరాంతకుడు వేములవాడలోని రాజేశ్వరాలయాన్ని కూడా సందర్శించాడని శాసనాల్లో పేర్కొన్నారు.🌺


🌻చోళుల కాలం నాటి చరిత్ర

రాజేంద్ర చోళుడు వేములవాడ దేవాలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం వేములవాడ రాజేశ్వరుడి(బృహదీశ్వరుడి) మాహాత్మ్యం తెలుసుకుని లింగరూపంలో ఉన్న రాజేశ్వరుణ్ని కంచి నగరానికి తీసుకెళ్లాడు.🌹 తన విజయానికి గుర్తుగా తండ్రి అయిన రాజరాజచోళునికి ఈ లింగాన్ని బహూకరించాడని తెలుస్తోంది. 🌺1006లో ఈ లింగానికి(బృహదీశ్వరుడికి) తంజావూరులో దేవాలయ నిర్మాణం ప్రారంభించాడు.🌻 1010లో లింగ ప్రతిష్ఠాపన చేసి, గోపుర కలశాభిషేకాలు నిర్వహించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతోంది.🌹

రాజరాజచోళుడు బృహదీశ్వరుడికి కృతజ్ఞతా పూర్వకంగా బంగారు కమలాలను సమర్పించాడు. 🥀ఈ బృహదీశ్వరాలయాన్ని వేములవాడ చాళుక్య దేశంపై జరిగిన దండయాత్రలో దోచుకున్న ధనంతో నిర్మించామని తమిళ శాసనాల్లో చోళరాజులు ప్రకటించుకున్నారు.🌺 వేములవాడ భీమన్న గుడిలోని శివలింగం, బృహదీశ్వరాలయంలోని శివలింగం ఒకేలా ఉంటాయి.🏵️ తంజావురులోని బృహదీశ్వరాలయం దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన ‘విమానం’(విమానం అంటే గోపురం లేదా దేవాలయ ద్వారం) ఉన్న దేవాలయం దీన్ని ‘ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.🌹

బతుకమ్మ పండుగకు బృహదీశ్వరాలయం, వేములవాడ రాజన్న ఆలయాలతో సంబంధం ఏమిటి? చోళ, చాళుక్యుల చరిత్రను ఎందుకు ప్రస్తావించామనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.🌺 వేములవాడ నుంచి శివలింగాన్ని దౌర్జన్యంగా తంజావూరుకు తరలించి, అక్కడ గొప్ప దేవాలయం నిర్మించడం చోళులకు గర్వకారణమైన విషయమే కావొచ్చు. కానీ అది తెలంగాణ ప్రజలకు బాధను కలిగించింది.🌻 చోళులు బృహదేశ్వరుడిని తీసుకెళ్లినందుకు నిరసనగా సృష్టికి కారణభూతమైన శక్తిస్వరూపాన్ని బృహతమ్మ (బతుకమ్మ)గా పూజించారు.🏵️ అదే ‘బృహత్’ బృహతమ్మ లేదా బతుకమ్మగా ప్రాచుర్యం పొందింది.🌻


🌷బృహత్ అమ్మ, బ్రతుకమ్మ

బతుకమ్మను బృహతమ్మ రూపాంతరంగా భావిస్తూ తంజావూరు దేవాలయానికి బృహత్ అనే పదం వినియోగించారు. 🌻బృహత్ అనే పదాన్ని బృహతమ్మ (గొప్ప అమ్మ) అనే పేరుతో ఉపయోగించారు.🏵️

‘బృహత్ కథ’ అనే సంస్కృత గ్రంథం భారతీయ ప్రాచీన గాథలకు, అనేక కథలు, కావ్యాలు, నాటకాలకు మూలమైంది. 🌷దీన్ని రచించిన గుణాఢ్యుడు (మెదక్ జిల్లా) తెలంగాణ తొలికవి. బృహత్ కథను పైశాచీ నామంతో రచించాడు. రెండో శతాబ్దంలో ‘పిరంగదై’ పేరుతో తమిళంలోకి కూడా ఈ గ్రంథాన్ని అనువదించారు.🌻 రామాయణం, మహాభారతంతో సమాన ప్రతిపత్తి ఉన్న గొప్ప గ్రంథం ఇది. 🌹అనేక మంది కవులకు ‘బృహత్‌కథ’ కావ్య వస్తువుగా ఉండేది. ప్రాచీనమైన బృహత్‌ధారణ ఉపనిషత్ లేదా బృహదారణ్య ఉపనిషత్ పేరులో కూడా బృహత్ అనే పద వినియోగం కనిపిస్తుంది.🌺 బృహత్ పదాన్నే బృహతమ్మ లేదా బతుకమ్మగా ప్రజలు ఉపయోగించారని భావించాలి.🏵️

బృహతమ్మ(బతుకమ్మ) ఉద్యమం

రాజేంద్రచోళుడు వేములవాడ బృహత్ శివలింగాన్ని తంజావూరుకు తరలించాక తెలంగాణ ప్రజలు తమ ఆక్రోశాన్ని ఒక ఉద్యమంగా మార్చి చోళ రాజులకు తమ నిరసనను తెలిపే ప్రయత్నమే ‘బతుకమ్మ’ సృష్టికి దారితీసింది.🌼 తెలంగాణ నుంచి లింగాకారమైన శివుడు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడున్న పార్వతిని ఊరడించే ప్రయత్నంలో భాగంగా పూలతో(సృష్టి) మేరు పర్వతంలా బతుకమ్మను పేర్చారు. 🏵️దానిపై పసుపు గౌరమ్మను రూపొందించి, దసరా సందర్భంలో తొమ్మిది రోజులు ఆటపాటలతో పదేపదే తలుస్తారు..💐🏵️🌹🌺🌻🌷🌼🌸🥀💐

బ్రతుకుతెరువు

 మన హైదరాబాదు మహానగరంలో బ్రతుకుతెరువు దొరకదు  అనేది లేదు.  పట్టుదల, నిజాయితీ, అంకితభావం వున్నప్రతివారు ఏదో ఒక పని చేసుకొని జీవించవచ్చు. 

వ్యాపారం చేయటం అనేది అనుభవం లేకుండా చేయటం వలన మంచి ఫలితాలను ఇవ్వదు.  చాలావరకు చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు వారికి అనుభవం లేకపోవటం చేత మూసివేయపడుతున్నాయి. ఆలా అని నేను ఎవ్వరిని నిరుత్సహ పరచటం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. ప్రయత్నే  ఫలి. కాకపొతే సరైన మార్గదర్శకత్వం కూడా  ఉండాలి. ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందుగా మనం ఎంచుకున్న వ్యాపారం సమాజంలో ఏరకంగా వున్నది అనేది ముందుగా సర్వే చేసి దానికి నాకు వున్నఅనుభవం ఎంతవరకు పనికి వస్తుంది అనేది అంచనావేసుకొని తరువాత మాత్రమే వ్యాపారం చేయాలి.  ఇలా ఎందుకు నేను చెపుతున్నానంటే నాకు అనుభవం లేకుండా ఒక వ్యాపారం భాగస్వామ్యంతో చేసి గతంలో చేతులు కాల్చుకున్నాను. 

వ్యాపారంకన్నా మీరు ఏ వ్యాపారం చేయదలచుకున్నారో ఆ వ్యాపారం చేసే వారి వద్ద హెల్పరుగా కొన్ని రోజులు పనిచేసి ఆ వ్యాపారం యొక్క మెళకువలు తెలుసుకొని తరువాత మాత్రమే సదరు వ్యాపారం చేస్తే తప్పకుండా విజయం సాధించగలరు.  ఎవ్వరి సలహాలు తీసుకోవద్దు. నేను నా అంతట నేనుగా చేయగలను అనే ధీమా వచ్చిన తరువాతే వ్యాపారం మొదలు పెట్టాలి.  పూర్తిగా అప్పుతీసుకొని వ్యాపారం చేయకూడదు, ఆలా చేస్తే మీ వ్యాపారం వృద్ధిలోకి రాకపోతే మీరు అప్పు తీర్చలేరు. 

ముందుగా నేను ఏ పనిచేయగలను అనేవిషయాన్ని సొంతంగా బేరీజు వేసుకొని తరువాత ఆ పని ఎక్కడ ఉందని విచారించి ముందుగా పనిలో ప్రావిణ్యం సంపాదించుకోవాలి.  మార్కెటు సర్వ్యే చాలా ముఖ్యం. మహిళలు కూడా వ్యాపారం చేయవచ్చు చేయవద్దని నేను అనను.  కాకపొతే వారి పరిమితులు తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టాలి.  ఎందుకంటె ఏదో ఆటోలోనో లేక మోటారుసైకిలు మీద వస్తువులు తీసుకొని దుకాణాలకు అందచేసే అటువంటి వ్యాపారాలు మహిళలు చేయలేరు. 

ప్రస్తుతం చాలా మంది మహిళలు వస్త్రాలకు సంబందించిన వ్యాపారాలు చేస్తున్నారు.  కొందరు ఊరగాయ పచ్చళ్ళ వ్యాపారాలుచేస్తున్నారు. 

కొద్దిపాటి పెట్టుబడితో చేసే వ్యాపారులు అంటే 2-5 లక్షల పెట్టుబడితో చేసేవి కూడా చాలా వున్నాయి.  కాకపొతే వాటికి సంబంధించిన ప్రజ్ఞనాన్ని ముందుగా పొంది వుండి మార్కెట్లో రిటర్న్స్ యెట్లా వున్నాయి, మూలధనం తరువాత వర్కింగ్ క్యాపిటల్ యెంత అవసరం ఉంటుంది, వస్తువులు నాణ్యంగా చేయటానికి కావలసిన మెళుకువలు, ఉత్పత్తి అయిన వస్తువులు సత్వర విక్రయం అయ్యే మార్గాలు మనకు యెంత శాతం లాభం వస్తుంది అనే విషయాలమీద ముందుగా అవగాహన తెచ్చుకోవాలి.  నా సలహా ఏమిటంటే ఎట్టి పరిస్థితిలోను వ్యాపారం చతికిల పడకూడదు.   వృద్ధి క్రమ క్రమంగా ఉండాలి. ఇటువంటి విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే వ్యాపారం మొదలు పెట్టాలి.  

అందరు వ్యాపారం చేయలేరు ఆలా చేయగలిగితే చాలామంది వ్యాపారస్తులు అయ్యేవారు. 

వ్యాపారం జాతకం.  మన జాతకాన్ని బట్టి కూడా వ్యాపారాన్ని ఎంచుకోవటం మంచిది. ముందుగా బుధుడు మనకు వ్యాపారవృద్దికి తోడ్పడుతున్నాడా లేదా, మన జాతకంలో ఏగ్రహం మనకు మంచిగా సహకరిస్తుంది అనేది తెలుసుకుంటే మంచిది.  మీ జాతకంలో శని గ్రాహం మంచిగా వున్నదనుకోండి అప్పుడు ఇనుముకు సంబందించిన వ్యాపారం అంటే హార్డువేర్ మీకు రాణిస్తుంది.  అదే శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటే కళలకు సంబందించిన వ్యాపారం అనుకూలిస్తుంది. అన్ని తెలిసిన   జ్యోతిష్కుల సలహా తీసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. 

కొద్దీ పెట్టుబడితో జీవనం గడుపుతున్నారు. మనం రోజు చూస్తున్నాము కొంతమంది రోజుకు 3-6 వేలు మాత్రమే పెట్టుబడి పెట్టి సాయంత్రానికల్లా రెండు మూడు వేలు లాభం పొందుతున్నారు.  ఆ విషయం మనకు తెలియదు. అవగాహనకోసం నేను గమనించిన కొన్ని ఉదాహరణలు మీకు తెలుపుతున్నాను. 

1) కూరగాయల వ్యాపారం.  ఇది చాలా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం.  ఇందులో ఫలితాలు చాలా బాగా ఉంటాయి. ప్రతివారికి కూరగాయలు రోజు అవసరం ఉంటాయి.  తెల్లవారుజామున మార్కెటుకి వెళ్లి హోలుసెలులో కూరలు తెచ్చి అమ్మితే చాలా లాభం ఉంటుంది. 

ఈ వ్యాపారంలో 300 నుంచి 500 శాతం వరకు లాభం ఉంటుంది.  కాకపొతే ఇందులో కొంత తరుగుదల ఉంటుంది.  అదేమంటే మీరు 10 కిలోలు కొన్న కూరలు మీరు ఒక్కొక్క కిలోగా లేక అరకిలోగా అమ్మితే అది 8 నుంచి 9 కిలోలుగా మాత్రమే విక్రయించ గలరు.  అయినా లాభం బాగా ఉంటుంది. ఇక రెండో విషయం ప్రారంభయంలో ధర ఎక్కువగా చెప్పి కూరలు కొద్దిగా మిగిలిన తరువాత తక్కువ ధరకు అమ్మ వలెను.  ఇలా చేయటం వలన సగటు లాభం మీకు 100-200 శాతం వరకు తగ్గుతుంది అంటే వెరసి మీకు 200-300 శాతం లాభం ఎటుపోదు.  మీరు ఒక 3 వెల పెట్టుబడితో ఒక రోజు వ్యాపారం మొదలుపెడితే సాయంత్రం వరకు హీనపక్షం  మీకు 500 నుంచి 1500 వందల వరకు లాభం కనపడుతుంది. మనం 30 రూపాయలకు కిలో కొనే ఆలుగడ్డలు హోలుసేలులో కిలో 5 రూపాయలకు దొరుకుతాయి అంటే మీరు నమ్ముతారా. 

2)  పండ్ల వ్యాపారం ఈ వ్యాపారం కూడా కూరగాయల వ్యాపారం లాగ చాలా లాభదాయకమైనది. కూరలతో కలిపి కూడా ఈ వ్యాపారం చేయవచ్చు. 

మరిన్ని వ్యాపారాల గూర్చి తరువాత ముచ్చటిద్దాం. 

13, అక్టోబర్ 2021, బుధవారం

అవగాహనా కోసం మాత్రమే*

 *ఒత్తిడి తగ్గడానికి కొన్ని సలహాలు ,అవగాహనా కోసం మాత్రమే*


👉1. ఒక రోజు సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !

👉2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !

👉3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !

👉 4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !

👉 5. కక్ష కన్నా క్షమ గొప్పది 

క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !

👉 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !

👉 7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!

👉 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో !

👉9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !

👉 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !

👉11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో* *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!

👉12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!

13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !

👉 14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో ! 

👉 15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !

👉16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !

👉17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !

👉18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !

👉 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో !

👉 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !

21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!

👉22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !

👉23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !

👉24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !

👉25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.


👉 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .

👉 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు

♦ చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయడం.

♦ ప్రతి రోజు ఒక గంట ఎరోబిక్స్‌కాని, లేదా టి.విలో చూస్తూ డాన్స్‌గాని చేయాలి. వాకింగ్, జాగింగ్, స్విమింగ్‌ వీటిలో ఏదోకటి రోజుకు గంట పాటు చేస్తే మీ గుండె , ఊపిరితిత్తులు, రక్తనాణాలు చాలా ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. శరీరమంతా ఆరోగ్యంగా తయారవుతుంది. వ్యాయామంలో స్ట్రెస్‌ని కలిగించే హార్మోన్లు నశించి, మంచి హార్మోన్లు, ఎండార్ఫిన్స్‌  విడుదలవుతాయి. అవి  ఒత్తిడిని దూరం చేస్తాయి.

♦ టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్, హాకీ లేదా క్రికెట్‌ వంటి ఆటలు కూడా ఆడుతుండాలి.

♦ మీ ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందితో కలిసి వర్క్‌ చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, కాంపిటేటివ్‌ స్పిరిట్‌ పెరుగుతుంది. నాయకత్వపు లక్షణాలు అలవడతా.

♦ ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ  పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం.

♦ ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా  చేయగలిగింది ఉండదని, కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్దిచెప్పుకోవడం.

♦ పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.


గుండెపై దుష్పరిణామాలిలా...

పరోక్షంగా: మనలో ఒత్తిడి పెరిగినప్పుడు అడ్రినాలిన్, కార్టిజోల్‌ వంటి హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి. మనం ఒత్తిడి కారణంగా. ఇవి మన నాడీవ్యవస్థలోనూ, నరాల్లోనూ రసాయనాల (న్యూరోకెమికల్‌) మార్పులకు దోహదం చేస్తాయి. ఆ మార్పుల వల్ల రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌తో పాటు చక్కెర పాళ్లు పెరుగుతాయి.

ధన్యవాదములు 🙏

స్వంత భద్రత కోసం

 * ఆచార్య రజనీష్* ను అతని అనుచరులలో ఒకరు ప్రశ్నించారు.

  * ప్రశ్న * - * దయచేసి ఇళ్ళు మరియు ఆస్తులు దహనం చేయబడినప్పుడు, జిహాదీల ద్వారా హత్యలు జరుగుతున్నప్పుడు మనం ఏమి చేయాలి? మేము హిందూ ముస్లిం సోదరుని బ్రదర్‌హుడ్‌ని ప్రోత్సహించాలా లేదా మన స్వంత భద్రత కోసం ఏదైనా అడుగు వేస్తే, దయచేసి మార్గనిర్దేశం చేయండి.


  * సమాధానం * - * 🙏 మీ ప్రశ్న మీ మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది, మీరు చరిత్ర నుండి ఏమీ నేర్చుకున్నట్లు అనిపించదు. మహ్మద్ గజ్నవి సోమనాథ్ ఆలయంపై దాడి చేసినప్పుడు, సోమనాథ్ ఆ సమయంలో భారతదేశంలో అతి పెద్ద మరియు ధనిక దేవాలయం. ఆ ఆలయంలో పూజించే 1200 మంది హిందూ పూజారులు మేము ధ్యానం, భక్తి, ఆరాధన, పగలు మరియు రాత్రి అని నిమగ్నమై ఉన్నామని అనుకున్నారు. కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అతను రక్షణ కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదు, దీనికి విరుద్ధంగా, తమను తాము రక్షించుకోగల క్షత్రియులు కూడా నిరాకరించారు.

  *ఫలితంగా, మహమూద్ వేలాది మంది నిరాయుధులైన హిందూ పూజారులను చంపాడు, విగ్రహాలు మరియు దేవాలయాలను పగలగొట్టాడు మరియు చాలా సంపద, వజ్రాలు, ఆభరణాలు, బంగారం మరియు వెండిని ఎత్తుకెళ్లాడు.

 దేవుని ధ్యానం మరియు భక్తి ఆరాధన వారిని రక్షించలేకపోయాయి.


 నేడు, వందల సంవత్సరాల తరువాత కూడా, అదే మూర్ఖత్వం కొనసాగుతోంది, మీ గొప్ప వ్యక్తుల జీవితాల నుండి మీరు ఏమీ నేర్చుకున్నట్లు అనిపించదు.


  ధ్యానానికి దుర్మార్గుల హృదయాన్ని మార్చగలిగేంత శక్తి ఉంటే, రామచంద్ర జీ ఎల్లప్పుడూ అతనితో విల్లు మరియు బాణాన్ని ఎందుకు ఉంచాలి. ధ్యాన శక్తితో, అతను రాక్షసులు మరియు రావణుడి హృదయాన్ని మార్చేవాడు, వారిని సుర్-అసుర సోదరులు మరియు సోదరులు అని వివరిస్తాడు మరియు వైరం ముగిసిపోతుంది, కానీ రాముడు కూడా ఎవరికీ వివరించలేదు మరియు రామ్-రావణ యుద్ధం యొక్క నిర్ణయం ఆయుధం ద్వారా కూడా నిర్ణయించబడుతుంది.


  ధ్యానానికి చాలా శక్తి ఉంటే అది ఇతరుల మనస్సును మార్చగలదు. కాబట్టి పూర్ణావతార్ శ్రీ కృష్ణుడు కంస మరియు జరాసంఘను ఎందుకు చంపాలి! అతను వాటిని ధ్యానంతో మాత్రమే మార్చగలడు.


 ధ్యానానికి మరొకరి మనసు మార్చే శక్తి ఉంటే, మహాభారత యుద్ధం ఉండదు, కృష్ణుడు తన ధ్యాన శక్తితో దుర్యోధనుడిని మార్చేవాడు మరియు యుద్ధం నివారించబడేది. కానీ దానికి విరుద్ధంగా, కృష్ణుడు ధ్యానానికి వెళ్లాలనుకున్న అర్జునుడిని ఆపి యుద్ధంలో నిమగ్నమయ్యాడు.


 మహాభారత యుద్ధం చరిత్రలో అతిపెద్ద యుద్ధం, దీనిలో కోటి మందిని ఊచకోత కోశారు, గత 1200 సంవత్సరాలలో భారతదేశంలో ఎంత మంది మహర్షి సాధువులు ఉన్నారు, గోరఖ్ నాథ్ నుండి రైదాస్ మరియు కబీర్ నుండి గురు నానక్ వరకు గురు గోవింద్ సింగ్ వరకు, శక్తి వీరందరి ధ్యానం కూడా ముస్లిం ఆక్రమణదారులు మరియు బ్రిటిషర్లు. ఈ సమయంలో కోట్ల మంది హిందువులను ఊచకోత కోశారు మరియు వారి మతం కత్తి యొక్క కొన వద్ద బలవంతంగా మార్చబడింది.


  వారిని చంపి ఇస్లాం మతంలోకి మార్చారు

  ఆ సాధువుల బోధలు ఆక్రమణదారులను మార్చలేకపోయాయి. గురునానక్ తన మతం యొక్క తత్వశాస్త్రాన్ని ముస్లింలు సులభంగా అర్థం చేసుకునే విధంగా మరియు అతనిని గ్రహించే విధంగా ఇచ్చారు. కానీ అదే గురు సంప్రదాయంలో, గురు గోవింద్ సింగ్ ముస్లింలకు వ్యతిరేకంగా కత్తిని తీసుకోవాల్సి వచ్చింది, హిందూ మతాన్ని కాపాడటానికి, నిరాయుధ సిక్కులు ఆయుధాలను చేపట్టవలసి వచ్చింది.


  ధ్యానం ఒకరి స్వంత చైతన్యాన్ని మార్చగలదని దీని నుండి స్పష్టమవుతుంది.

  కానీ మనం పదార్థాన్ని (భౌతిక శరీరాన్ని) మనమే కాపాడుకోవాలి, దాని కోసం మనం సైన్స్ మరియు టెక్నాలజీ సహాయం తీసుకోవాలి.


 దేశంలోని 70% కంటే ఎక్కువ సమస్యలకు పరిష్కారం.


  * శ్రీకృష్ణ భగవానుడు 5 గ్రామాలు అడిగాడు!

  *దేశ ప్రయోజనాల కోసం మేము 5 చట్టాలను అడుగుతున్నాము !!*


  *సమాన విద్య*

  *ఏకరీతి పౌర స్మృతి*

  *మార్పిడి నియంత్రణ*

  *చొరబాటు నియంత్రణ*

  *జనాభా నియంత్రణ*


 ఈ ఐదు చట్టాలు రాకపోతే, ప్రస్తుతం భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాల వలె సనాతన్ మొత్తం ప్రపంచం మొత్తంలో నాశనమవుతుంది.


  *సేవ్ ఇండియా ఉద్యమం*



  *మన దేశం మరియు మన సోదరీమణులు/ కుమార్తెలను కాపాడే ఉద్యమం*


  మీరు దానిని మరింతగా పంపరని నాకు తెలుసు, చదివిన తర్వాత మీరు దానిని వదిలివేస్తారు. కనీసం ఒక వ్యక్తికి సందేశం పంపమని మీరు చాలా అభ్యర్థించబడ్డారు, ఒకవేళ మీరు కూడా సిగ్గుపడితే, దాన్ని నాకు తిరిగి పంపండి, చైన్ విరిగిపోకూడదు.

  *🚩జై శ్రీ రామ్🏹*...

నేనుహిందువుల యమ రాజును.

 ✋ నేను కాంగ్రేసు ను ✋ *నేనుహిందువుల యమ రాజును.

*21లక్షల హిందువులను చంపిన

తర్వాత కూడా పాక్ కు 65కోట్ల రూపాయలు ఇచ్చాను. *మతప్రాతిపాదికగ పంపకంచేసినప్పటికిని7కోట్లముస్లింలను ఈదేశంలో నేయుంచి వేసాను. 

*హిందువులులేని కాశ్మీరులను తయారు చేసాను. *"సెక్యూలర్"పదాన్ని రాజ్యాంగం లో చేర్చించాను.         

*ఎనిమిది రాష్ట్రాలలో హిందువుల ను అల్ప సంఖ్యకులుగా చేసాను. *AMUలో ముస్లింపదాన్ని చేర్చా ను.  

* BHUలో హిందూ పదాన్ని చేర్చడా నికి వ్యతిరేకించాను.         

*కాశ్మీర్ సమస్యనుజటిలం చేసాను. JKలో చట్టం నందలి సెక్షన్35(A),370లను పెట్టాను.

*పట్టుబడిన 93,000 పాక్ సైనికు లను వదలి పెట్టి,జయించబడిన POKను తిరిగి గిఫ్ట్ గా ఇచ్చేసాను.

*90,000 sq km తో పాటు కైలాశ మానసరోవరంను చైనాకు అప్పగిం చాను.

*JKలో రొహింగ్యాలకు పునరా వాసం కల్పించాను.

*బంగ్లాదేశి ముస్లింలను దేశంలో చొప్పించి,ఓటు బ్యాంక్ పెంచుకు న్నాను.

*NRC ని వ్యతిరేకించాను. 

*దేశ ద్రోహులను రక్షించుట కై రాత్రి రెండు గంటలకు కోర్టును తెరిపించాను. 

*2700 సిఖ్ఖులను హత్య కాండ చేసాను. 

*దూరదర్శన్ "సత్యం శివం సుందరం" లోగో తొలగించి వేసాను.

*కేంద్రీయ నవోదయ విద్యా లయ లోగో నుండి " అసతో మా సత్ గమయ" శ్లోకాన్ని తొలగించి వేసాను.

*"వందేమాతరమ్"ను రాష్ట్ర గానంగా-దేశీయగీతం గా పాడకుండ విరోధించాను. 

*26/11 వెనుక హిందువు ల పాత్ర యుందని చెప్పా ను. 

*నా న్యాయవాదులే దేశాని కి కీడు చేసే గ్యాంగులను మరియు నక్సులైట్ల కేసుల ను వాదించారు.

*దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజా స్వామ్య గొంతును నొక్కి వేసాను.

*"భారత మాతాకీ జై" "వందేమాతరమ్" మొదల గు నినాదాలు ఏ రైలులో లేకుండ చేసాను. 

*1966లో గోరక్షణ కొరకు ఉద్యమిం

చు గోభక్తులైన వందల మంది సాధువు లను గోలీలతో హత్య చేసాను. 

*హజ్ యాత్రకు సబ్సిడి ఇచ్చి,అమర్నాథ్ యాత్రకు టాక్స్ వేసాను.

*సోమనాథ మందిరం నిర్మించుచున్నాడని,సర్ధార్ పటేల్ ను విరోధించాను. 

*సోమనాథ మందిరాన్ని 

ప్రారంభించబోయె రాష్ట్ర పతి డా.రాజేంద్ర ప్రసాద్ ను విరోధించాను. 

*RSSను "ముస్లిం బ్రదర్ హుడ్"లాటి ఉగ్రవాద సంస్థ గా చెప్పాను.

*శ్రీరామున్ని కల్పితంగా చెప్పుతూ అఫిడవేట్ ఇచ్చాను అట్లే రామసేతు విరిచివేసే ప్రయత్నం చేసాను.

*భారత్ కుUNలో లభించే వీటో అధికారం చైనాకు ఇచ్చాను.

*ఒకవేళ మీరందరు (మూర్ఖులు)"సెక్యూలర్ "హిందువులతో కలవండి. అప్పుడు పూర్తి హిందుస్తాన్ 'హిందూముక్త్' తయారు చేసేస్తాను మరియు ఆరోప ము మాత్రం RSSపైనే పడ వేస్తాను.

🕉️1971లో జరిగిన ఒక యథర్థ ఘటన🕉️

ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా యున్నప్పుడు ఫీల్డ్ మార్షల్ మానెక్ శా ఆర్మీ చీఫ్ గా యుండేవారు. అప్పుడు అతడిని ప్రధాన మంత్రి పాకిస్తాన్ పైన ఆక్ర మణ చేయమని ఆదేశించా రు దానికి జవాబుగా మనేక్ శా సైనికులు తయారుగా ఉన్నారు కాని సమయం వచ్చినపుడే యుద్ధం చేస్తా మని జవాబిచ్చారు.కాని ఇందిరాగాంధీ వెంటనే ఆక్రమణ చేయుమని ఆజ్ఞ పించారు కాని,ఆ సమయం రానే వచ్చింది ఆక్రమణ చేసి,కేవలం 13 రోజలలో తూర్పు పాకిస్తాన్ ను బాంగ్లాదేశ్ గా తయారుచేసింది...

ఒక సమయంలో శ్రీ మానిక్ శా ఇందిరాజీ తోఈ విధంగ అన్నారు "నేను మీ రాజకీ య జీవనంలో నేనెప్పుడు 

జోక్యం చేసుకోలేదు అట్లాగే మీరు కూడ ఆర్మీకి సంబం దించిన దానిలో జోక్యం చేసుకోకండి"... కొన్ని రోజు లకు 1971తర్వాత నుండి జనరల్ మాణెక్ శా గారి వేతనం ఆపివేయబడింది... కాని,భారత్ మాత ముద్దు బిడ్డ అయిన శా ఎప్పుడు కూడ తన వేతనం కావాలని కోరుకోలేదు...

25సం.ల తర్వాత ఎప్పుడై తే వారు హాస్పిటల్ ఉన్నరో అప్పుడు ఒకరోజు శ్రీ APJ అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు శా ను కలవడానికి వెళ్లారు...

ఆ సమయం మాటల సందర్భంలో రాష్ట్రపతి గారికి తెలిసిన విషయమే మంటే ఏ వ్యక్తైతే దేశం కొరకు 5-5యుద్ధాలు పోరా డారో అలాటి వారికి 1971 తర్వాత నుండి వేతనమే ఇవ్వడం లేదు...అప్పుడు కలాంగారు తక్షణమే ఉత్తర్వును జారిచేసి, రావలసిన శేష రాశిని(వేతన రాశిని) దాదాపు1.3 కోట్ల రూపాయల కు చెక్ ను మంజూరు చేయించారు....

అలాటి వీర యోద్ధను కూడా ఈ గొప్ప గాంధీ పరివారం వదిలి పెట్టలేదు...

ఇది ఎంతో సిగ్గు పడవలసిన విషయమో!!

10 అక్టోబర్ మహాన్ యోద్ధ శ్రీ మానెక్ శా గారి పుణ్య తిథి💐💐

🇮🇳 జై భారత్-జై ఆర్యావర్త వందే మాతరమ్ 🇮🇳 మూలం హిందీ,తెలుగు అనువాదం:- ఎర్రోఝ్వల దయాకర శర్మ, హిందీ పండిత్,కరినగర్, చరవాణి 9440840457.

శ్రీమద్భాగవతము

 *13.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2290(౨౨౯౦)*


*10.1-1422-వ.*

*10.1-1423-*


*శా. శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో*

*సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల*

*త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ*

*ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.* 🌺



*_భావము: సముద్రుడు రాక్షసుని గురించి వివరించగా వినిన శ్రీకృష్ణుడు శంఖారావం చేయగా, పంచజనుడను ఆ రాక్షసుడు భయపడి, సముద్రములోకి చొచ్చుకుపోయాడు. గురువుగారిపై గల భక్తితో ఆయన కుమారుని వెతకటానికి వచ్చిన శ్రీకృష్ణుడు అగ్నిజ్వాలలవలె ప్రకాశిస్తున్న కాంచనమయమైన బాణములచే ఆ రాక్షసుని పొట్ట చీల్చివేశాడు. కానీ అందులో గురుపుత్రుడు కనిపించలేదు. అయినా ఏ మాత్రము ఆందోళన చెందక గురుదక్షిణ ఎలాగైనా సమర్పించాలని నిశ్చయించాడు._* 🙏



*_Meaning: As the SeaGod informed Sri Krishna about the demon Panchajana, he blew the conch (Sankha). Listening to the reverberating sound of Sankha, Panchajana was terrified and fled deep into the sea. The purpose of Sri Krishna's visit was to find the son of His Guru and in pursuit of His mission, He fired golden arrows blazing like fire. The arrows pierced the stomach of the demon, but Sri krishna could not find the son of His Guru there, in his stomach. He was unperturbed at this unusual development and decided to fulful the wish of His Guru._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215) .*

మహబూబ్ నగర్ జిల్లా టూరిజం

 మహబూబ్ నగర్ జిల్లా టూరిజం సర్క్యూట్ బస్సు ప్రారంభం

_______________________________ 👉మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏ సి బస్సు ప్రారంభం.

👉ఆదివారం మహబూబ్ నగర్ లో బస్సును ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గారు.

👉మన్యంకొండ,పిల్లలమర్రి,కె సి ఆర్ ఎకో అర్బన్ పార్కులు సందర్శించేలా మహబూబ్ నగర్ జిల్లా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు.

👉కేవలం 300/-రూపాయలతో మూడు ప్రదేశాలు చూడవచ్చు.

@5 నుండి 12 సంవత్సరాలలోపు పిల్లలకు టికెట్ 200 /-రూపాయలు మాత్రమే

👉ఈ మొత్తంతోనే మధ్యాహ్న భోజనం,రెండు సార్లు టీ ఇవ్వటం జరుగుతుంది.

👉ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బస్సు బయలుదేరి పై మూడు ప్రదేశాలు సందర్శించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి కలెక్టర్ కార్యాలయానికి చేరుకోనున్న బస్సు

👉 మన్యం కొండలో అతి శీఘ్ర దర్శనంతో పాటు,ఉచిత ప్రసాదం ఇవ్వబడుతుంది.

👉ముందుగా ఆదివారాలు,సెలవు దినాలలో బస్సు నిర్వహణ

👉ఈ టూర్ టిక్కెట్ల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టూరిజం కౌంటర్లో కానీ,లేదా ఫోన్ నెంబర్ 8125351022 ద్వారా సంప్రదించి పొందవచ్చు.

         ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలే కాక ఇతర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని విజ్ఞప్తి.

           జిల్లా పర్యాటక శాఖ    

     అధికారి మహబూబ్ నగర్