19, ఏప్రిల్ 2022, మంగళవారం

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  250 గ్రాములు .


      జీలకర్ర  250 గ్రాములు .


      ధనియాలు  250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


        మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

వార్ధక్యం

 శ్లోకం:☝️

*అపర్యాప్తం హి బాలత్వం*

    *బలాత్పిబతి యవ్వనం |*

*యవ్వనం చ జరా పశ్చాత్*

    *పశ్య కర్కశతాం మిథః ||*

    - యోగ వాసిష్ఠం


భావం: జీవి బాల్యదశలో ఆటల మీద ఆసక్తితో వుండి, వాటి మీద ఆసక్తి ఇంకా తీరకుండా ఉన్న సమయంలోనే, యౌవనం వచ్చి మీదపడి బాల్యాన్ని మింగేస్తోంది. ఈ యౌవనంలో కామోపభోగాల ఆశ ఇంకా తీరకుండానే, వార్ధక్యం మీదపడి యౌవనాన్ని మింగేస్తోంది. చూశావా (వసిష్ఠ) మహర్షీ! ఈ బాల్య, యౌవన, వార్ధక్య దశలే ఒకదాని మీద ఒకటి ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయో ? ఆ తరువాత " *వార్ధకే వర్ధతే స్పృహా* " అని వార్ధక్యంలో అనుభవించే శక్తి ఉండదు కానీ కోరికలు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ వార్ధక్యం మోహాలకీ, శోకాలకీ, వియోగాలకీ, వివాదాలకీ, చింతలకూ, అవమానాలకూ ప్రముఖస్థానంగా ఉంటుందని శ్రీరాముడు నిర్ణయించాడు.🙏

మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. .

 తరతరాలుగా మనం  వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలిపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలి

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి  పెరుగు వేసుకోరాదు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15.  గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ  వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాదు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాదు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చేతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిగిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలి చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా  పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes దరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు  (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి.

       

మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.


మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.


కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !

అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

             ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

        *అదీ .. సంస్కారం !* 

              .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! 

       *అదీ .. నమ్మకం  !* 🙏

             ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

        *అదీ .. ఆచారం !* 🙏

            ..............................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన  అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!* 

           ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

       *అదీ .. పద్ధతి !* 🙏

         ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…!

     *అదీ .. సంస్కృతి!*🙏

       ...........................


సేకరించిన పోస్ట్..

మూడు

 🎻🌹🙏*మూడు ...మూడు ...మూడు ...*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿



💐 *మీ జీవితంలో ముఖ్యమైన ...*

*ఈ మూడు విషయాలలో జాగ్రతగా ఉండు !💐*


1. నిన్ను నీవు పొగడుకొనుట.

2. పరనింద.  3.పరుల దోషాలను ఎంచుట.


💐 *ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో!*💐


1. ఈశ్వర స్మరణ.  2.పరులను గౌరవించుట.

3.నీ లోని దోషాలను కనిపెట్టుట.


💐 *ఈ మూడింటిని ఆచరించు!*💐


1. సత్యము.  2.అహింస.  3. ప్రేమ తత్త్వము.


💐 *ఈ మూడింటికి దూరంగా ఉండు!*💐


1.ఇతరులగురించి చర్చ. 2.వాద వివాదాలు.

3.నాయకత్వం.


💐 *ఈ మూడింటి పట్ల దయతో ఉండు!*💐


1.అబల. 2. పిచ్చి వాడు. 3. దారి తప్పిన వాడు.


💐 *ఈ మూడింటి పట్ల దయతలచ వద్దు*💐


1. పాపము.  2. బద్దకము. 3. స్వేచ్చా ప్రవర్తన.


💐 *ఈ మూడింటిని  నీ వశము చేసుకో!*💐


1.మనసు. 2.కామేంద్రియము. 3.నాలుక.


💐 *ఈ మూడింటి పట్ల మమకారం కలిగి ఉండు!💐*


1.ఈశ్వరుడు. 2.సదాచారము. 3.పేదలు.


💐 *ఈ ముగ్గురి పట్ల వినయం కలిగి ఉండు!*💐


1.తల్లి.  2.తండ్రి. 3.గురువు 


💐 *ఈ మూడింటిని హృదయము యందు ఉంచుకో!💐*


1.దయ.  2.క్షమ. 3. వినయము.


💐 *ఈ మూడు వ్రతాలు పాటించు!*💐


1.పరస్త్రీని మోహించ కుండుట.

2.పర ధనము పట్ల ఆసక్తి లేకుండుట.

3. అసహయులకు సేవ చేయుట.


💐 *ఈ ముగ్గురిని పోషించడం నీ కర్తవ్యం!*💐


1. తల్లిదండ్రులు. 2.భార్య బిడ్డలు.

3.దుఖములో ఉన్నవారు.


💐 *ఈ ముగ్గురి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు!*💐


1.వితంతువు. 2.అనాధలు. 3.నిరాధారులు.


💐 *ఈ మూడింటిని లెక్క చేయవద్దు!*💐


1.ధర్మాన్ని పాటించే సమయంలో కలిగే కష్టాన్ని.

2.పరుల కష్టాన్ని తొలగించేటప్పుడు కలిగే ధన

నష్టాన్ని.

3.రోగికి సేవ చేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని.


💐 *ఈ మూడింటిని మరిచిపో!*💐


1. నీవు ఇతరులకు చేసిన సాయం.

2. ఇతరులు నీకు చేసిన కీడు.

3.డబ్బు , గౌరవం , సాధనల వల్ల సమాజంలో

నీకు కలిగిన ఉన్నత స్థితి.


💐 *ఈ మూడు విధాలుగా మారకు!*💐


1. కృతఘ్నుడు  2. డాంబికుడు. 3. నాస్తికుడు...

🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

గోదానం

 సహస్ర గోదానం చేయుటలో ఉద్దేశ్యమేమిటి ?


ఉత్తరగోగ్రహణము తెలుసు మరి దక్షిణగోగ్రహణ మాటేమిటి ?

..........................................................

షోడశ (16) మహదానాలలో గోదానము ఎంతో విశిష్టమైంది. షోడశదానాలలో గోదానం ఎలా చేయాలో ఎందుకు చేయాలో తెలుసుకొందాము.


రైతు దేశానికి వెన్నెముకైతే, ఆ రైతుకు వెన్నెముక వంటిది గోవు. వ్యవసాయంలో గోసంపదలు లేకుండా పంటలు పండించడం దుస్సాధ్యం. గోసంపదలు ఇచ్చే పాలే లేకపోతే మనిషి దైనందిన మనుగడ ఎంత ధైన్యంగా వుంటుందో ఊహించుకోవచ్చును.

ఏ దేశములనైనా మనిషి మనుగడకు కారణమైతున్న గోవు హిందువులకు పవిత్రమైంది. నిజం చెప్పాలంటే సకల మానవాళికి కూడా ఆరాధ్యమనే చెప్పాలి.


వ్యవసాయాభివృద్ధికి పాడిని పెంపొందించడానికి గోవులు అత్యవసరము. అందుకే అప్పటి రాజులు చక్రవర్తులు భూస్వాములు,ధనవంతులు గోవులను  నిమ్నజాతివారికి, శూద్రలైనవారికి, బ్రాహ్మణులకు, రైతులకు దానంగా ఇచ్చేవారు.


గోదానాన్ని ఎలా చేయాలో  చూద్దాం.


ఒక ఎద్దును వేయిగోవులతో కలపాలి. ఆ వేయి గోవులలో శ్రేష్టమైన 10 ఆవులను ఎంచుకోవాలి. వాటిని మంచి వస్త్రాలతో అలంకరించాలి. కొమ్ములకు బంగారు కుప్పెలను తొడగాలి. కాలి గిట్టలను వెండి ఆభరణాలతో అలంకరించి చప్పరములోనికి తీసుకురావాలి. చప్పరమంటే రాతికూసాలను (స్తంభాల) నాలుగు ప్రక్కలాపాతి, పైన నలుచదరమైన కప్పులను (బండలను) పైకప్పులుగా వేయాలి. చప్పరమంటే శాశ్వతనిర్మాణము. బాటసారులు సేదతీరటానికి దారి కిరువైపులా, పుణ్యాత్ములైనవారు చప్పరాలను నిర్మించి చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు.


అలాంటి చప్పరములో (సత్రము లేదా దద్దలము)  బంగారుతో చేసిన నందికేశ్వరుని నిలపాలి. దాత సర్వ ఔషధాలతో మిళితమైన నీటితో స్నానము చేసి, తడిబట్టలతో విడవకుండా, చేతులలో పూలను వుంచుకొని, గోమహత్మ్యమును స్మరిస్తూ నందికేశ సహిత దశ గోవులను పూజించాలి. నందికేశ్వరుడిని ధర్మదేవతగా పూజించాలి. అలా పూజించిన తరువాత ఆ పూజలను నిర్వహింపచేసిన గురువుకు రెండు ఆవులను నిమ్నులకు 2 ఆవులను, ఎద్దును, మిగిలినవాటిని రైతులకు, బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి.


మిగిలిన 990 గోవులను దేశములోని వ్యవసాయదారులకు, పాలుపెరుగులు వృద్ధిచేసే గొల్లలకు దానంగా ఇవ్వాలి. ఇలా దానంగా ఇవ్వడము వలన గోసంతతి వృద్ధి అవుతుంది. వ్యవసాయాన్ని పాడిని  అభివృద్ధిపథము

వైపు నడిపించడం జరుగుతుంది. దాత కూడా తనకు శివలోక సన్నిధి లభిస్తుందని భావిస్తాడు. గోసంతతి అభివృద్ధి కొరకు వృషభాన్ని దానంగా ఇస్తారు.


ఒకప్పుడు భారతదేశములో  రాజులు ప్రజలు తమకున్న సంపదలలో గోసంపదే గొప్పదని భావించేవారు. ఎంత గోసంపద వుంటే అంతగా ధనవంతులన్నమాట.


గతములో గోవులను  దొంగలించడము వాటిని సంతలలో రైతులకు అమ్ముకోవడము సర్వసామాన్యవిషయము. ఇప్పుడు కూడా వీధులలో నిర్భయంగా తిరుగుతున్న గోజాతిని  అపహరించి కొనుకొంటున్న సంగతి వార్తాపత్రికలలో చూశాము కదా !


పాండవుల అజ్ఞాతవాసాన్ని బట్టబయలు చేయాలన్న సంకల్పముతో దుర్యోధనుడు  రాజన్య, పరివారముతో ఆలోచించాడు. విరాటుని మత్స్య దేశము  సుఖశాంతులతో సుభిక్షంగా వుందని కనుక పాండవులు అక్కడే వుంటారని వారు అభిప్రాయపడ్డారు.


సుశర్మ అనే త్రిగర్తదేశపు రాజు అనేకసార్లు మత్స్యదేశముపై దండయాత్రచేసి కీచక విరాటుల చేతులలో పరాజితుడైనాడు. కీచకుడు గంధర్వుని చేతిలో హతమైనాడు, కనుక విరాటుని గోవులను సంగ్రహిస్తే విరాటుని రక్షించటానికి పాండవులు బయటకు వస్తారని  అప్పుడు వారి జాడను పసిగట్టి మరలా అరణ్యవాసానికి పంపవచ్చునని తెలియచేస్తాడు.


అతని ఆలోచనను  అంగీకరించిన దుర్యోధనుడు విరాటుని గోవులను గ్రహించాలని నిశ్చయించాడు. మొదటగా సుశర్మ దక్షిణదిశగా వెళ్ళి గోగ్రహణం చేస్తాడు. ఇది విన్న విరాటరాజు గోవులను  కాపాడటానికి బయలుదేరాడు.


విరాటుడు చారుల ద్వారా సుశర్మ గోగణాలతో ఎటు వెళుతున్నాడో తెలుసుకుని అటు వైపు తన సేనలను నడిపించాడు. విరాటుని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు తమతమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుని కుమారుడు శంఖుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యాడు.


కంకుభట్టుగా వున్న ధర్మరాజు తన తమ్ములైన వలలుడు ( భీముడు), తామ్రగ్రంధి (నకులుడు), తంత్రీపాలుళ్ళను ( సహదేవుడు) విరాటరాజు వెంట పంపాడు. ఒకానొక సందర్భంలో విరాటుడు, సుశర్మ చేతిలో బంధీగా చిక్కుతాడు. అప్పుడు వలలుడు సుశర్మను ఓడించి బంధిగా చేస్తాడు. ధర్మజుని సోదరులు దక్షిణగోగ్రహాణాన్ని భగ్నము చేస్తారు.


విరాటుడు దక్షిణగోగ్రహణ రక్షణకై వెళ్ళినపుడు దుర్యోధన, దుశ్శాసన, భీష్మ, ద్రోణాదులు ఉత్తరగోగ్రహణం చేస్తారు. బృహన్నల రథసారధిగా ఉత్తరకుమారుడు యుద్ధానికి వెళ్ళడము ఆ తరువాత ఏమి జరిగిందో మనకు తెలుసు.


గోగ్రహణ కాలానికి ఆశ్వయుజ శుక్ల పక్ష అష్టమి తిథి నాటికే పాండవుల అజ్ఞాతవాసము ముగిసింది. ఈ సంగతి తెలుసుకోలేక సుయోధనుడు గోగ్రహణానికి పాల్పడ్డాడు.

............................................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురము

రామలింగడి సమయస్ఫూర్తి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹


*🌷రామలింగడి సమయస్ఫూర్తి!🌷*                       

                🌷🌷🌷

తెనాలి రామలింగడంటే శ్రీకృష్ణదేవరాయలకు చాలా ఇష్టం.


ముఖ్యంగా ఆయన  హాస్య చతురత అంటే మరీనూ. ఎదుటి వారు ఎంతటి ఒత్తిడిలో ఉన్నా సరే... రామలింగడు ఇట్టే నవ్విస్తాడు. అదే సమయంలో కవ్విస్తాడు కూడా! ఎప్పుడన్నా సభకు తెనాలి రాకుంటే, ఆ రోజంతా ఏదో వెలితిగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజు సభను తొందరగానే ముగించేవాడు.


ఇలా ఉండగా ఓ రోజు సభకు తెనాలి రామలింగడు దోషిగా వచ్చాడు. ఆయన మీద రాయలవారికి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చేసింది వేరెవరో కాదు.. రామలింగడి భార్యే! ఏదో విషయమై రామలింగడికి, ఆయన భార్యకు మధ్య మాటామాటా పెరిగి.. చివరికి కోపంతో ఆమె శ్రీకృష్ణదేవరాయల వారికి ఫిర్యాదు చేసింది.


ఈ ఫిర్యాదు స్వీకరించడం వ్యక్తిగతంగా రాయలవారికి ఇష్టంలేదు. అయినా రాజుగా తన విధి తాను నిర్వర్తించాలి కాబట్టి తప్పలేదు. అయిష్టంగానే శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగడిని విచారణకు పిలిపించాడు.


ముందు తెనాలి రామలింగడి భార్య తన వాదనను వినిపించింది. అవన్నీ చిన్న చిన్న విషయాలే. పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. మొత్తం శాంతంగా విన్న రాయలవారు 'నువ్వు ఏమైనా చెప్పుకునేది ఉందా?' అని రామలింగడిని అడిగాడు.

'నా భార్య చెప్పేదంతా నిజం కాదు. నేను నా భార్యను చాలా అపురూపంగా చూసుకుంటాను. తనంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటిపేరులోనే మా వంశం వారికి భార్యంటే ఎంత ఇష్టమో ఉంటుంది' అన్నాడు తెనాలి రామలింగడు. రాయలవారు, సభలో ఉన్నవారు, ఆఖరుకు తెనాలి రామలింగడి భార్య కూడా విస్మయానికి గురయ్యారు.


'అదెలాగో చెప్పగలవా?' అని రాజు మరో ప్రశ్న సంధించాడు. 'తప్పకుండా ప్రభూ..! నా భార్య తేనెలా స్వచ్ఛమైనది, మధురమైనది, శ్రేష్ఠమైనది అనే అర్థం వచ్చేలా మా ఇంటి పేరు తేనె ఆలి. అంటే తేనె వంటి భార్యను కలిగి ఉన్నా అని అర్థం. అదే రానురానూ తెనాలిగా మారింది' అని చెప్పాడు.


ఇది విన్న వెంటనే అప్పటి వరకు కోపంగా ఉన్న తెనాలి రామలింగడి భార్య ముఖంలో చిరునవ్వు, సిగ్గు ప్రత్యక్షమయ్యాయి. ఆమె ముసిముసిగా నవ్వుతూ.. 'మహారాజా! మన్నించండి. నేను నా ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నా' అంది.

సమస్య ఇంత సులువుగా పరిష్కారం కావడంతో శ్రీకృష్ణదేవరాయలు వారిద్దరికీ కానుకలు ఇచ్చి పంపించారు.


ఇంతలో రాయలవారికి ఓ అనుమానం వచ్చింది. మరుసటి రోజు ఉదయం నడకలో.. 'అవును తెనాలి రామలింగా! నీకు అంత లౌక్యం, సమయస్ఫూర్తి ఉన్నాయి కదా... మీ దంపతుల సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చుగా... నా వరకు ఎందుకు తెచ్చినట్లు' అని అడిగాడు.


'మహారాజా! భార్యభర్తల గొడవలు తాటాకు మంటల్లాంటివి. అంతెత్తున ఎగసి, చప్పున చల్లారతాయి. చిన్న చిన్న విషయాలకే ఫిర్యాదుల వరకు వెళ్లొద్దు అని లోకానికి చాటిచెప్పడం కోసమే... సమస్యను మీ వరకు రానిచ్చాను. మన్నించండి' అన్నాడు రామలింగడు. తెనాలి తెలివిని మరోసారి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీకృష్ణదేవరాయలు.

ఏంటండీ ఈ డిమాండ్స్



*ఏంటండీ ఈ డిమాండ్స్❓🤔*

_అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కష్టమై పోతున్నందుకేగా..._


ఇద్దరి మధ్య సంభాషణ ఓసారి చదవండి.😊

వారిరువురి పేర్లు X, Y అనుకుందాం...

📲ఫోన్లో


X : సార్ ఇది Y గారి ఇల్లేనా?

Y : అవును మీరు....?

X : మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలి.

Y : ముందు మా కండిషన్స్ విన్నాక మాట్లాడండి.

X : అది కాదు సర్, మీ అమ్మాయి పెళ్లి?

Y : ఏదైనా సరే ముందు మా కండిషన్స్ విన్నాకే పెళ్లి గురించి మాట్లాడండి.

X : ఏం కండిషన్స్ సర్?

Y : మా అమ్మాయికి 654321 ఉన్న వరుడే కావాలి.

X : అంటే ఏంటి సర్?

Y : 6 అంకెల జీతం... అంటే లక్ష జీతం అయినా ఉండాలి.

    5 లక్షల కారు ఉండాలి, అది కూడా అబ్బాయి పేరుమీదే ఉండాలి.

    4 లక్షలు విలువ చేసే బంగారం అమ్మాయికి వెయ్యాలి.

3 బెడ్ రూములు కలిగిన ఇల్లు ఉండాలి, అది కూడా అబ్బాయి పేరుమీదే ఉండాలి.

2 ట్రిప్పులు అయినా నెలకు బయట తిప్పాలి. 

1 ఒక్కడే కొడుకు అయ్యుండాలి.

X : 🤔🤔🤔🤔🤔

Y : ఇంతే కాదు

అబ్బాయి తల్లితండ్రులు పెళ్లవగానే విడిపోవాలి,

అమ్మాయికి వంట రాదు.. అయినా మీరు అడగకూడదు,

అమ్మాయి ఆలస్యంగా నిద్రలేస్తుంది, 

ఆదివారాలైతే ఇంకా ఆలస్యం.

అవన్నీ మీరు పట్టించుకోకూడదు.

ఇక ఇల్లు & కారు డాక్యుమెంట్స్ మాకు చూపించాలి.

ఆఫీస్ సంబంధిత శాలరీ సర్టిఫికెట్ తీసుకురావాలి.


మా అమ్మాయిని మేము చాలా గారాభంగా పెంచాము,

తను ఇబ్బంది పడకూడదు కదా! అందుకే ఇన్ని జాగ్రత్తలు.

ఇవన్నీ మీకు నచ్చాక అప్పుడు మా అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుదాం.  ఏమంటారు మీరు? 

X : నేను ఏమనాలి సర్???

Y : నువ్వే కదయ్యా మా అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలన్నావు!

X : సర్, నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.

మీ అమ్మాయి మీ వీధిలో ఓ స్కూటర్ గారేజ్ లోని అబ్బాయిని ప్రేమించి 

ఈ రోజు ఉదయం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకుందట.!

మీరు ఒప్పుకోరని,

వారిని విడదీస్తారని

ఆమె ఇప్పుడు మేజర్ అని మిమ్మల్ని ఒప్పించమని మా స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

అందుకే మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలన్నాను.

వచ్చి మాట్లాడండి అని ఫోన్ పెట్టేశాడు.

Y : 😭😭😭😭😭😭


_ఎవరినీ బాధ పెట్టాలని, చులకన చేయాలని కాదండీ._

_అమ్మాయిలకు, అబ్బాయిలిద్దరికి విలువలను నేర్పించి ప్రేమను పంచి పెంచడం లేదండీ..._

_వారు అడగగానే... లేదనకుండా కొనిపెట్టి వాటి విలువలను తెలియకుండా చేసేస్తున్నారు._

_బంధాలతో కలిసి ప్రేమ విలువ నేర్పించడం లేదు._

_ఇకనైనా ఆలోచించండి._

వివిధ కావ్యాల్లో పేర్కొన్న వంటకాల జాబిత

 సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథుడు  వివిధ కావ్యాల్లో పేర్కొన్న వంటకాల జాబితా ఆరుద్ర యిస్తే, అది ఆరు పేజీలొచ్చింది. వాటిలో  పేర్లు కొత్తగా, ఆసక్తికరంగా వున్నవి కొన్ని.


1. ఒలుపు పప్పు 

2. మంచున బిసికిన పంచదారలు

3. బేసము

4.బిడము

5. తోరుండలు

6. పండ్యారము    

7.పూరగము

8. కమ్మని తాలింపు సొజ్జెపిండి

9.తింత్రిణీ కరసోపదేహ దుర్ధురములు

10.జంభీరరసం 

11.తాటిపండు

12.ఇప్పట్లు 

13.గొల్లెడలు

14.అంగారపొలియలు 

15. సారసత్తలు

16.బొత్తరలు

17. మణుగు బూవులు

18.మోరుండలు

19.బిసకిసలయములవరుగులు

20.ఉక్కెర

21.బలుపలు

22.ఇలిమిడి


పై వంటకాలను ఎవరైనా ఎప్పుడైనా విన్నారా.


పై పిండివంటల గురించి నేను విన్నది ఇదిగో. 


1. ఒలుపుపప్పులు


ఒలుపు పప్పులంటే మామూలుగా పొట్టుతీసిన పప్పులైతే వాటిని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన పని లేదు గదా! ఒలుపుపప్పులంటే nuts అయిండొచ్చని నా ఉద్దేశం. ఆ రోజుల్లో ఏ యే నట్స్ లభించేవో తెలీదు. బహుశా ఒల్చిన గుమ్మడిగింజలు, చారపప్పు, బాదం, వేరుసెనగపప్పు లాంటివి అయివుండొచ్ఛు.


2. మంచున పిసికిన పంచదార


ఇది బహుశా ice cream అయి వుండొచ్చు. అంటే పాలు లేకుండా వట్టి రంగువేసిన ఐస్ క్రీం అన్నమాట. పల్లెటూర్లలో పెరిగిన వారికి తెలిసి వుండొచ్చు. విందు అయి చేతులు కడుక్కున్నాక, తాంబూలానికి ముందు యిది యిచ్చేవారేమో!


3. బేసము‌ 


బేసము అంటే బ్రౌను దొర గారు sap  అనే అర్థం యిచ్చాడు. చిన్నప్పుడు యిప్పటిలా అన్నం బిరుసుగా ఉండి మునివేళ్ళతో కలిపేవాళ్ళం కాదు. శుభ్రంగా అరిచెయ్యి తగలేట్లు ముద్దచేసి తినేవాళ్ళం. అప్పుడు గుజ్జువంటిది ఒక పల్ఛటిపొరగా అరిచేతికి అంటుకుని వుండేది. దాన్ని కంచం అంచు మీద గీస్తే వచ్చేదాన్ని 'బేసం' అనేవాళ్ళు. 

మరి, విందుల్లో పెట్టే బేసం ఏంటో! బేసన్ అంటే మన ఇతర భారత భాషలలో సెనగపిండి.  బేసిన్ లడ్డూ పేరిట తెలుగు వాళ్ళూ ఒక పిండివంట చేస్తారు. అలాంటి దేదైనా కావచ్చునేమో మరి.


4.బిడము 


ఇది అట్టుప్పు, a cake of salt, అయిండొచ్చు. ఇప్పుడు స్వగృహా షాపుల్లో అమ్మే 'చెక్కలు' లాంటివి కావచ్చును.


5. తోరుండలు


తెలియదు. ఇదేదో కొత్తగా ఉంది. 


6.పణ్యారము. 


రాయలసీమ వాళ్ళు  'పొంగణాలు', కోస్తా ప్రాంతం వాళ్ళు ' పులిబొంగరాలు' అనే యీ snack ని తమిళులు 'పణ్యారం' అంటారు. శ్రీనాథుడి కాలంలో ఆ పదం తెలుగువాళ్ళు గూడా వాడేవారేమో!


7. పూరగము. తెలియదు. 


8. కమ్మని తాలింపు సొజ్జెపిండి


రవ్వని రాయలసీమలో ' సొజ్జె' అంటారు. ( హిందీ ' సూజీ'). కనుక  'కమ్మని తాలింపు సొజ్జెపిండి' అంటే ఉప్మా అన్నమాట. దీని మరాఠీ counterpart సాంజా.


9.తింత్రిణీక రసోపదేహ దుర్ధురములు


అయ్య బాబోయ్! ఇది తినడం మాట దేవుడెరుగు! బంతిలో కూర్చున్నవాడు యిది కావాలని అడిగేసరికి వడ్డించేవాడు చివరికి వెళ్ళిపోయి వుంటాడు. ఇది పేరులా లేదు

పేరాగ్రాఫులా వుంది. ఏ పులిహోరకో ('తింత్రిణీక రసం' అంటే చింతపండురసం అనే ఒక్కమాట అర్థమయింది లెండి) description లా వుంది.


10. జంబీరరసం


జంబీరం అంటే నిమ్మ. జంబీరరసం అంటే నిమ్మషర్బత్. Welcome drink అయివుంటుంది


11.తాటిపండు


నిజంగా తాటిపండో, లేక ఆ పేరు గల ఏదైనా స్వీటో! నిజంగా తాటిపండైతే శిష్టులకు నిషిద్ధం మరి!!


12.ఇప్పట్లు


 గిరినులు ఇప్పపువ్వుల్ని పిండిలో కలిపి రొట్టెలు చేసుకుంటారట.అవే ఇప్పట్లు కావచ్చు. ఇప్పపూలు   శిష్టులకీ నిషిద్ధం  కాదను కుంటాను.


13. గొల్లెడలు - తెలియదు


14. అంగారపొలియలు


అంగార దొల్లెలు అంటే fried wheat cakes అన్నారు బ్రౌను దొర గారు. అవే యివేమో! 'అంగార' అని ఉంది కనుక నిప్పులమీద కాల్చిన పుల్కాలేమో!


15.సారసత్తలు 


సారసత్తలు అంటే ఉప్పువేసి బియ్యం పిండిని బాగా ఉడికించి, ఉండలుగా చేసి వాటిని ఇడ్లీకుక్కర్లో ఆవిరికి పెట్టి బైటికి తీసి చక్కిలాల్లా ఒత్తుకోవచ్చు.  లేక పోతే పాకంలో వేసుకుని తియ్యగానూ తినొచ్చు. ఇవేనేమో. 


16.బొత్తరలు - తెలీదు


17. మణుగుపూవులు - జంతికలు


18.మోరుండలు


గారెలపిండిని ఉండలుగా చేసి కాల్చి మజ్జిగపులుసులో వేస్తే అవి మోరుండలని  విన్నాను.


19. బిసకిసలయమ్ముల వరుగులు


అన్ని కూరలూ అన్ని seasons లో దొరకవు. అందుకని వాటిని ఉప్పులో నానేసి ఎండబెట్టి అవి దొరకని season లో వేయించుకుని తింటారు. వాటిని ' 'వరుగులు' అంటారు. 'బిసము' అంటే తామర. తామర తూడులు తింటారట. ఆ తామర తూడుల వరుగులే 

'బిసకిసలయమ్ములవరుగులు  


20.ఉక్కెర


చిన్నప్పుడు బియ్యప్పిండిలో పంచదార వేసి ఉడికించి పిల్లలకి పెట్టేవారు. అంటే అది ఆనాటి farex అన్నమాట. దాన్ని 'ఉక్కెర' అనేవారు. పెద్దవాళ్ళ విందుల్లో ఉక్కెర అంటే ఏ హల్వా వంటిదో అయి వుండొచ్చు


21 బలుపలు. -. తెలియదు

22. ఇలిమిడి - తెలియదు. చలిమిడి కావొచ్చేమో


ఇందులో కొన్ని snacks  లా వున్నాయి. కొన్ని breakfast items గూడా(ఇడ్లీ, దోసె లాంటివి) వున్నాయి. అవన్నీ భోజనంలో ఎలా తింటారు అని మనకి అనుమానం రావచ్చు. వాళ్ళు ప్రాతస్సంధ్య, మధ్యాహ్నసంధ్యా అయ్యాక ఏకంగా భోంచేసేవారనుకుంటా. అందుకే అన్నీ అన్నంలోనే!

 

మన తెలుగులో ' నిఘంటు కమిటీ' వంటిదేమైనా వుంటే వాళ్ళు పూనుకుని యీ వివరాలు నిఘంటువుల్లోకి ఎక్కిస్తే మన పూర్వులు ఏం తినేవారో తెలుస్తుంది.వారు ఎంత నాగరికంగా బ్రతికారో అర్థమౌతుంది.


సేకరణ

18, ఏప్రిల్ 2022, సోమవారం

*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.*

 kgm Indraganti sankar 3:

*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.*       >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                       *5. భూత కృత్.*                                                                                    ఇది మూడు అక్షరముల నామము ఈ నామమును మనముచెప్పుకొని భక్తితో స్కరిచేటప్పుడు.                                                            *ఓం భూతకృతే నమః.* అని పలుక వలెను.

                                                              

*భూతకృత్ = సకల భూతముల ను సృజించువాడు.                                                                                         భూతని - కృన్తతి  = సకల భూత ములనునాశనముచేయువాడు.* 

                                                                                           *“భూతాని కరోతి - ఇతిభూతకృ త్” “సర్వాణి భూతానిస్వతంత్రః సృజతి"*                                                               స్వతంత్రముగా, అనగా ఏ విధమైన ఆధారము లేకుండా,సర్వభూతము లను సృజించు పరమాత్ముడే! అని *‘భూతకృత్'* అని శ్రీ భట్టులు వా రు వ్యాఖ్యానించారు.

                                                            రజోగుణముననుసరించి చతుర్ము ఖ బ్రహ్మ రూపమున సకల ప్రాణుల ను సృజించు ఆపరమాత్ముడేతమో గుణమునాశ్రయించి,రుద్రునిరూపం లోసకలప్రాణులనుసంహరించును. (భూతాని - ప్రాణులను, కృష్ణతి - నాశనము చేయును) కనుక కూడ ఆయన *'భూతకృత్'* అని ఈ నా మమునకు అర్ధము చెప్పవచ్చును.


 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                                                                *ఓంనమోభగవతేవాసుదేవాయ.                             ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః.                                                ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః.    (మానవసేవయేమాధవసేవ.)             .      సర్వేషాంశాన్తిర్భవతు.*                       .                                                                      *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*


*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.*       >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                       *6. భూతభృత్.*                                                                                    ఇది నాలుగు అక్షరములనామము ఈ నామమును మనముచెప్పుకొని భక్తితో స్కరిచేటప్పుడు.                                                                                                        *ఓం భూతభృతే నమః.* అని పలుక వలెను.

                                                                             *భూతభృత్ = అన్నిభూతముల ను పోషించువాడు.*                         

                                                                                   చక్రమునకు ఇరుసువలెనుండి,వాని కాధారమై,అంతరాత్మయైమార్గదర్శి గా భగవంతుడు అన్ని భూతముల ను పోషించును.                                                               

ఆదికూర్మముగా మందరగిరినిధరిం చినవాడు,శ్రీ వరాహమూర్తియై భూ మిని ఉద్ధరించినవాడు అయినశ్రీమ హావిష్ణువే *'భూతభృత్'* అనిశ్రీరా ధాకృష్ణశాస్త్రిగారు వివరించినారు.                                                                                                                                                            

పైమూడు నామములు ( *భూతభ వ్య భవత్ప్రభుః;భూతకృత్,భూ తభృత్*)కలిపి - భగవంతుడు సృష్టి, స్థితి,లయములకు,ఆధారమ ని తెలియుచున్నది.                                                                                       కాని ఆయనకుఆది,అంతములేదు. సృష్టికిని,కాలమునకును,భూతము లకును ఆధారము ఆయనే!.                                                                              

                                                                *శింశుమారాత్మనా విష్ణుః భూతా దీ నుర్ధ్యతః స్థితాన్!                                                                                                      దధీశిష తయా లోకాన్ సప్తలోకా న్ అథః స్థితాన్.!!*                                                     

                                                                 శ్రీమహావిష్ణువుశింశుమార(మొసలి) రూపంలో ఊర్ధ్వలోకములను, ఆది శేషునిరూపంలోఅధోలోకాలనుధరిం చియున్నాడు.                                                                                                   లోకాలయొక్క రక్షణ బాధ్యత శ్రీ మ హావిష్ణువుదే!.                                                                                             అందుచేతనే,సత్వగుణము,నాశ్రయించిజీవులన్నిటినీపాలిస్తున్నాడు,పోషిస్తున్నాడు.                                                                                                       కనుక ఆయన *'భూతభృత్'.* భూతభృత్ అన్ని భూతములనుపో షించువాడు *"భూతాని బిభ్రతి ఇ తి భూతభృత్"* అని అర్థము గా  చెప్పుకోనవచ్చును .                           


 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                                                                   *ఓంనమోభగవతేవాసుదేవాయ.                             ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః.                                                ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః.    (మానవసేవయేమాధవసేవ.)             .      సర్వేషాంశాన్తిర్భవతు.*                       .                                                                      *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*

17, ఏప్రిల్ 2022, ఆదివారం

జ్ఞాని - భక్తుడు

 జ్ఞాని - భక్తుడు


ఇద్దరు వ్యక్తులు అడవిలో వెళుతున్నారు. వారికి ఒక పులి ఎదురైంది. వారిలో ఒకరు 'అంతా భగవంతుడే, కాబట్టి ఈ పులి బారి నుండి నన్ను భగవంతుడే కాపాడుతాడు ' అని చేతులు జోడించుకుని నిలబడ్డాడు. మరో వ్యక్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మొదటి వ్యక్తిని కూడా చెట్టు పైకి లాగాడు. ఇంతలో పులి ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. మొదటి వ్యక్తి ' నీకు భగవంతుడు వచ్చి కాపాడుతాడు అని నమ్మకం లేదా? చెట్టు ఎక్కావు, నన్నూ పైకి లాగావు ' అన్నాడు. అందుకు రెండో వ్యక్తి ' ఇంత చిన్న విషయానికి భగవంతుని కష్టపెట్టడం ఎందుకు అని చెట్టు ఎక్కాను' అని అన్నాడు. వీరిలో మొదటి వాడు జ్ఞాని, రెండవ వాడు భక్తుడు.