26, నవంబర్ 2023, ఆదివారం

 *26-11-2023*

*భాను వాసరః ఆది వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి   ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించు కుంటారు.

*వృషభం*

ముఖ్యమైన  వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.  ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.

*మిధునం*

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.

*కర్కాటకం*

సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు  అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి  వ్యవహారాలలో సమస్యలు  అధిగమిస్తా. వృత్తి  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

*సింహం*

కుటుంబ పెద్దల  ఆరోగ్య విషయంలో  శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో  నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు  ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

*కన్య*

దూరపు బంధువుల నుండి  కీలక  విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ  యత్నాలు కొంత కష్టంతో  పూర్తిఅవుతాయి  బందు మిత్రులతో  మాటపట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో   అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. 

*తుల*

కుటుంబ పెద్దలతో  గృహమున సందడిగా గడుపుతారు బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.  భూ క్రయవిక్రయాలలో  విశేషమైన   లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో  హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

*వృశ్చికం*

సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో  ఉన్న  సమస్యలు  అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

*ధనస్సు*

సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఊహించని  సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 

*మకరం*

ముఖ్యమైన  వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  బంధువుల నుండి అందిన  ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ఋణ దాతల  నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

*కుంభం*

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం  దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి  ఒప్పందాలు కుదురుతాయి.  విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి  ఉద్యోగాలలో  సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.

*మీనం*

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో  అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు. 

🕉️

 🕉️🪔 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*సంసారసాగర విశాల కరాళకామ*

*నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య* !

*మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* !!


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం-03_* _


తా॥ 

ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగబడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టినాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

 ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ ..

       తప్పకుండా ఆలోచించాల్సిన అంశాలు ...


ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..  ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా "బలిపశువులు" చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...


       కొంత హిస్టరీలో కి వెళ్దాం... 


30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు. 


డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..


అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..


దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి. 


అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.


ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు.  


కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. 


తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది  ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ  ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. 


మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో  విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు. 


అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు.


మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు.


వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు. 


తర్వాత వాస్తవం లోకి  వెళ్దాం ...


కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది. 


కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో  జాయిన్ చేయడానికి  అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు  కొందరు. 


దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?


ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి. 


మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ?   ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?


అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. 


ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా! అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది. 


కానీ  ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు. 


కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది. 


కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు.వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.


ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం  వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. 


అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా! అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.


మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..? 


వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?


దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...


ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి...  


ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు. 


ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని  రూల్ ఏమి పెట్టలేదు. 


అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.


కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు. 


ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు.  


ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..!  ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!


అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు.  అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది.  


ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది. 


కష్టం చేసుకునే ప్రజల పిల్లలు..  


ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు.. 


ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు. 


వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి  తీసుకెళ్లిపోయారు.


ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశన మయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.  


ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..


ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి. 


పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది. 

‌ 

ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.  


1.సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేక పోవడం


2.విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా  లేకపోవడం.


3.ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి,  సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం


4.ప్రైవేటు విద్యాసంస్థలు సొంతంగా సిలబస్ రూపొందించుకున్నా వారిని అదుపు చేయలేక పోవడం.


5.కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం.. 

‌

ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే విధంగా సిలబస్ లేకపోవడం.

‌

ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి  లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా? ‌రాదు...  


ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...


అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?

‌

అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది... 


ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..  ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.


నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?


ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!


ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ... 


ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. 


నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..


ఎడారిలో పండించండి ...


మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. 


వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.


నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు. 


నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు. 


వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. 


ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం  కేటాయించగల వారై ఉంటారు. 


ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. 


మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..


నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు... 


అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.. 


ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి... 


పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్య లోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి.. 


ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..  


పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు.. 


★నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.


మేము చేర్చుకుంటాం...


★మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..


  మేము రానిస్తాం...


★మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..


మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..


★మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.


మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..


 ★మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.


 మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.


★మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.


ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.


మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.


★మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.


మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించ వలసిందే...


మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.


ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..


మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...


★మీరు కొన్ని వందల పాఠశాలల  బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...


మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... 


అవన్నీ మీకు కూడా తెలుసు...


 వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని  మాట్లాడుతున్న .. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.


అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు.. 


లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి... 


మరి మిగతా వాళ్ల సంగతేంటి..?


మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా.. 


ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.


ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది.. 


అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.


దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.


నిజమే.. అనిపిస్తే ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే (share) అంత మంచి చేసినవారు అవుతారు.


       ఆలస్యమెందుకు... చదివిన వెంటనే ఆ పని మొదలు పెట్టండి మరి....

.....   

👌👌👌👌🙏

 🕉  *మన గుడి : నెం 250*






⚜ గుజరాత్ : గాంధ్వి గ్రామం


⚜ శ్రీ హరసిద్ధిమాత ఆలయం 


💠 మన దేశంలో అనేక దేవతా దేవాలయాలు ఉన్నాయి, వాటికి కొన్ని సంప్రదాయాలు లేదా విశ్వాసాలు ఉన్నాయి. 

మత గ్రంధాల ప్రకారం, తల్లి సతీదేవి శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ ఆమెను శక్తిపీఠంగా పూజిస్తారు. 

హిందూ మతంలో మొత్తం 51 శక్తిపీఠాలు గుర్తించబడ్డాయి. మాతా సతి మోచేయి పడిపోయిన ఉజ్జయినిలో ఉన్న మా హర్సిద్ధి (దేవి హర్సిద్ధి) వీటిలో ఒకటి. 

హరసిద్ధి దేవి రాత్రిపూట ఉజ్జయినిలో మరియు పగటిపూట గుజరాత్‌లోని హర్షద్ మాతా ఆలయంలో నివసిస్తుందని నమ్ముతారు. 

ఈ నమ్మకానికి సంబంధించిన కథ కూడా ప్రాచుర్యం పొందింది. 


💠 గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 48 కి.మీ అసలు ద్వారకకు సమీపంలో, హర్షద్ మాత (హర్సిద్ధి) ఆలయం ఉంది. 

ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్య ఇక్కడి నుంచి పూజలు చేసి అమ్మవారిని ఉజ్జయినికి తీసుకొచ్చాడని ప్రతీతి. అప్పుడు దేవత విక్రమాదిత్యునితో నేను రాత్రిపూట నీ నగరంలోనూ, పగలు ఈ ప్రదేశంలోనూ నివసిస్తాను. 

ఈ కారణంగానే నేటికీ అమ్మవారు పగలు గుజరాత్‌లో, రాత్రి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంటారు.


💠 స్కంద పురాణం ప్రకారం, ఒకప్పుడు చంద మరియు ప్రచండ అనే ఇద్దరు రాక్షసులు కైలాస పర్వతంలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, నంది వారిని అడ్డుకున్నాడు. రాక్షసులు నందిని గాయపరిచారు. దీనిపై శివుడు భగవతి చండీని స్మరించుకున్నాడు. 

శివుని ఆజ్ఞ మేరకు దేవి రాక్షసులిద్దరినీ సంహరించింది. సంతోషించిన మహాదేవుడు, నీవు ఈ రాక్షసులను చంపావు. 

అందుచేత ఈరోజు నుండి నీ పేరు హరసిద్ధి ప్రసిద్ధి చెందుతుంది.


💠 ఇది శ్రీ కృష్ణ భగవానుని ,రాజ విక్రమాదిత్యుని కులదేవి ఆలయం. 

ఆమె అనేక క్షత్రియ , బ్రాహ్మణ , రాజపుత్ర మరియు వైశ్య వర్గాలచే కులదేవిగా పూజించబడుతోంది . 

లోహనాస్ , బ్రహ్మక్షత్రియుల వంశం , గుర్జర్ల హర్సన వంశం , అనేక జైన కులాలు అలాగే పంచరియా వంటి బ్రాహ్మణులు మరియు అనేక ఇతర సంఘాలు కూడా ఆమెను తమ కులదేవిగా పూజిస్తారు. 

ఆమె సముద్రంలో నౌకలకు రక్షకురాలిగా పరిగణించబడుతున్నందున, ఆమెను మత్స్యకారులు మరియు సముద్రంలో ప్రయాణించే ఇతర తెగలు మరియు గుజరాత్ ప్రజలు కూడా మతపరంగా పూజిస్తారు. 


💠 హర్షిధి మాత దేవాలయాన్ని హర్షల్ మాత ఆలయం అని కూడా పిలుస్తారు.

ప్రధాన ఆలయం మొదట సముద్రానికి అభిముఖంగా ఉన్న కొండపై ఉండేది. 

కృష్ణుడు తన జీవితకాలంలో ఆమెను పూజించాడని మరియు అప్పటి నుండి కోయిల దుంగార్ అనే కొండపై నివసిస్తున్నారని చెబుతారు . 

కొండపై ఉన్న అసలు ఆలయాన్ని కృష్ణుడు స్వయంగా నిర్మించాడని చెబుతారు. 


💠 కృష్ణుడు అసురులను మరియు జరాసంధులను ఓడించాలని కోరుకున్నాడు కాబట్టి అతను శక్తి కోసం అంబా మాతను ప్రార్థించాడు. 

దేవత ఆశీస్సులతో కృష్ణుడు అసురులను ఓడించగలిగాడు. ఈ విజయం తరువాత, అతను ఆలయాన్ని నిర్మించాడు. 

జరాసంధుని చంపబడినప్పుడు, యాదవులందరూ అమితానందం పొందారు ( హర్షిత్ ) మరియు వారు ఇక్కడ తమ విజయాన్ని జరుపుకున్నారు. 

అందుకే దీనికి హర్షద్ మాత లేదా హర్సిద్ధి మాత అని పేరు. 

అప్పటి నుండి ఆమె యాదవ్ యొక్క కులదేవిగా పూజించబడుతోంది . 


💠 ఇక్కడి హారతి  చాలా అసాధారణమైనది. దాదాపు 1 గంట ఆర్తి మరియు మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. 

ఆరతి సమయంలో మా హరసిద్ధి ఉంటుందని చెబుతారు. 

ఒక ఉయ్యాల  ఉంది మరియు అమ్మవారు వచ్చిన వెంటనే ఉయ్యాల స్వయంచాలకంగా ఊగడం ప్రారంభమవుతుంది. 



💠 పోర్‌బందర్ నుండి 40 కి.మీ మరియు ద్వారక నుండి 65 కి.మీ దూరం

 *_ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే అవి ఎలానో తెలుసుకుందాం._*


_1 సంపాదిస్తే_

*_income tax_*

_2. అమ్మితే_

*_sales tax_*

_3. ఉత్పత్తి చేస్తే_

*_production tax_*

_4. మార్కెట్‌ చేస్తే_

*_commercial tax_*

_5. సినిమాకి వెళ్తే_

*_entertainment tax_*

_6. వెహికల్‌ కొంటే_

*_life tax_*

_7.  దాన్ని రోడ్‌ పైకి తెస్తే_

*_road tax_*

_8. లాంగ్‌ జర్నీ చేస్తే_

*_toll tax_*

_9. బండిలో పెట్రోల్‌ పోస్తే_

*_fuel surcharge tax_*

_10. భార్య, పిల్లలతో పార్క్‌ కి వెళితే_

*_entry tax_*

_11. ఉద్యోగం చేస్తే_

*_professional tax_*

_12. వ్యాపారం చేస్తే_

*_trade tax_*

_13. బట్టలు కొంటే_

*_vat tax_*

_14. కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే_

*_service tax_*

_15. ఆస్థి పై_

*_property tax_*

_16. చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే__*swachh bharat charge_*

_17. సబ్బు కొంటే-_*customer charge_*

_18. ఒక వస్తువు కొంటె-tax,_

_19. దాన్ని వినియోగిస్తే-tax,_

_20. దాన్ని రిపేరు చేపిస్తే-tax,

_21.దాన్ని లెక్కల్లో చూపిస్తే-tax,_

_22. సంపాదించింది ఖర్చుపెడితే-tax_

_23. మొత్తం మీద మనిషి జన్మిస్తే-tax,_

_24. మనిషి సంపాదిస్తే-tax,_

_25. మనిషి సంతోషిస్తే_-tax_

_26. మనిషి మరణిస్తే-tax._


*_ఇలా పలు రకాల టాక్స్' లతో మనిషి పుట్టి పెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగాభావించుకుంటున్నారు అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే........_*


_Note_ :- బీరు బిర్యానీ డబ్బులకు ఓట్లు అమ్ముకునే చదువురాని గ్రామీణ ఓటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు? విద్యావంతులైన నిరుద్యోగ యువత కదలాలి... రిటైర్డ్ ఎంప్లాయిస్, మంచి ఆశించే ప్రతి ఒక్కరూ కదలాలి.

ఇది కరెక్టు అనుకుంటే మీ గ్రూపుల లో పంపండి

అందరిలో చైతన్యం తీసుకురండి ఓటు విలువ తెలియజేయండి తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.


*ఈ సందర్భంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయిద్దాం. *ఓటరు* అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడడానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు ఒక ఓటరుగా,నా కర్తవ్యమైన *"ఓటును"* శ్రద్ధతో, అంతఃకరణ శుద్దితో, భయంగాని,పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా, నోటుకు,మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి *ఓటు* హక్కును వినియోగించుకుంటానని మన *భారత రాజ్యాంగం* మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. *జైహింద్.*  *సర్వేజనా సుఖినోభవంతు*                                             🤝🙏✊🙏  *పెద్దినేని  వేంకట చౌదరి*

 శ్లోకం:☝️

  *యజ్జాగ్రతో దూరముదైతి దైవం*

     *తదు సుప్తస్య తథైవైతి l*

  *దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం*

     *తన్మే మనః శివసంకల్పమస్తు ll*

   - శివసంకల్పోపనిషత్ / సంకల్ప సూక్తమ్


భావం: జ్యోతి స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థలో బయటకు వెళ్లి, నిద్రావస్థలో అంతర్ముఖమౌతుంది. అనంత దూరాలకు వెళ్లేదీ, యావత్ప్రపంచానికి ప్రకాశమైనది, అద్వితీయమైన ఆ ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించుగాక!

     మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పము ఉండాలి. అన్య మనస్కంగా పని మొదలుపెడితే నెరవేరదు. ఆ సంకల్పము కూడా సత్సంకల్పమై యుండాలి. అలా (శుభ) సంకల్పం కలగాలన్న కోరికతో పఠించేదే యీ సూక్తము.🙏

 ఈ రోజు పంచాంగం 26.11.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: చతుర్థశి తిధి  భాను వాసర: భరణి నక్షత్రం పరిఘ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.


చతుర్థశి మధ్యాహ్నం 03:56 వరకు.

భరణి  మధ్యాహ్నం 02:07 వరకు.

సూర్యోదయం : 06:31

సూర్యాస్తమయం : 05:35

వర్జ్యం : రాత్రి 01:52 నుండి 03:26 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:06 నుండి 04:51 వరకు.


రాహుకాలం : సాయంత్రం  04:30  నుండి 06:00 వరకు.


యమగండం : మధ్యాహ్నం  12:00 నుండి 01:30 వరకు


శుభోదయ:, నమస్కార:

Slim tyre


 

Sahassaaram


 

Largest hindu temples