*సుభాషితం*
*--------------*
🌺
*ఏకః క్షమావతాం దోషో*
*ద్వితీయో నోపపద్యతే ౹*
*యదేన క్షమయా యుక్త*
*మశక్తం మాన్యతే జనః ౹౹*. 🌺
*భావం : సహనం ఉన్నవారిలో ఒక దోషం ఉంది. ప్రజలు తమ వైపే ఆశక్తులు అని భావిస్తారు. ఇది కాకుండా వారిలో ఏ దోషం ఉండదు.*
🌺✍🏽
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
*సుభాషితం*
*--------------*
🌺
*ఏకః క్షమావతాం దోషో*
*ద్వితీయో నోపపద్యతే ౹*
*యదేన క్షమయా యుక్త*
*మశక్తం మాన్యతే జనః ౹౹*. 🌺
*భావం : సహనం ఉన్నవారిలో ఒక దోషం ఉంది. ప్రజలు తమ వైపే ఆశక్తులు అని భావిస్తారు. ఇది కాకుండా వారిలో ఏ దోషం ఉండదు.*
🌺✍🏽
_*🕉️నేటి సుభాషితము🕉️*_
_*జలబిందు నిపాతేన*_
_*క్రమశః పూర్యతే ఘటః|*_
_*స హేతుః సర్వ విద్యానాం*_
_*ధర్మస్య చ ధనస్య చ||*_
*భావము:ఒక్కొక్క నీటిబొట్టు పడటం వల్ల క్రమంగా కుండ నిండుతుంది. అలాగే, అన్ని విద్యలు, ధర్మము, ధనము కొద్దికొద్దిగా ఆర్జన చేస్తే సంపూర్ణమౌతాయి.*
*📖 మన ఇతిహాసాలు 📓*
*బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది.* అవి
బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది. అవి 1. ఋగ్వేదము2. సామ వేదము3. యజుర్వేదము4. అధర్వణ వేదము వీటి నుండి 1. సంహితాలు దీని నుండి కర్మ కాండ 2. అరణ్యకాలు వీటినుండి జ్ఞాన కాండ3. ఉపనిషత్తులు వీటినుండి ఉపాసన కాండ అలాగే పై మూడింటినుండి 1. ఉపవేదాలు - ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ, శిల్ప మొదలగున్నవిన్నూ.....2. వేదాంగాలు - శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్ప, జ్యోతిషం ఏర్పడ్డాయి. 3. ధర్శనాలు - వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత మ్దలగున్నవి ఏర్పడ్డాయి. 4. శాస్త్రాలు - నీతి, స్మృతి మొదలగున్నవి ఏర్పడ్డాయి. 5. ఆగమాలు - ఇందులో శైవ, శక్త మరియు వైశ్ణవాలూ అలాగే 6. పురాణాలు- అష్టాదశ పురాణాలు ఐ విధముగా వేదాలను సామాన్య మానవుడికి సులభముగా అర్ధమగు రీతిలో అమరిక చేయడం జరిగిన్ది. ఇక జ్యోతిషాన్ని కూడా కొన్ని శాఖలుగా విభజించడం జరిగినది.అవి 1. ప్రశ్నా శాస్త్రము, 2. హస్త రేఖా శాస్త్రము, 3. సంఖ్యా శాస్త్రము, 4. పాచికలు, 5. గవ్వలు, 6. ముఖము చూచి చెప్పుట, 7. చిలుక జ్యోతిషము మొదలగు శాఖలు
శ్రీభారత్ వీక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🌹మన సీతమ్మ కథ.. సీతాదేవి చరిత్రను కళ్లకు కట్టినట్టు పరిచయం చేసే సీరియల్. సీతాయాశ్చరితం మహత్ అనే పరిశోధనా గ్రంథం రచించిన ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు ఎంతో రసరమ్యంగా అందిస్తున్న మనోహరమైన కథనం ఇది. అసలు సీత ఎవరు? వాల్మీకి రామాయణంలోను, మరికొన్ని రామాయణాల్లోను సీతమ్మను ఎంత ఉదాత్తంగా చిత్రీకరించారో వినండి. సీతమ్మ భారతీయుల ఆడపడుచు. భారతీయుల హృదయం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
: కొడుకే మోక్షకారకుడా?
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై/
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్/
బడసెన్: పుత్రులులేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్/
చెడునే మోక్షపదంబపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!
కాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి;
భావము:-లోకంలో జీవనభ్రాంతిలోమునిగిన జనం "అపుత్రస్య గతిర్నాస్తి"-యను వాక్యము నూతగొని సంసారమగ్నులై మోక్షపథమునకు దూరమగుచున్నారు.యదార్ధమునకు సంతానము మోకషపదమునకు సహకారమనుట యసత్యము.
ధృతరాష్ట్రునకు నూర్గురు కుమారులుగలిగిరి వారివలన అతనికి గలిగిన సద్గతులెవ్వి?
ఆజన్మబ్రహ్మచారియైన శుకునకు సంతతిలేకపోవుటచేకలిగిన దుర్గతులేవి?
సంతతి లేకుండుట మోక్షపదమునకు అవరోధము యెంతమాత్రముకాదు.అదియొకభ్రమ!
కేవలమూ పరమేశ్వరానుగ్రహమే సద్గతికి మూలము.
స్వస్తి!🙏
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *రెండొవ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *సాంఖ్య యోగము*
. *శ్లోకము 03*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*క్లైబ్యం మా స్మ గమః పార్థ*
*నైతత్త్వయ్యుపపద్యతే ।*
*క్షుద్రం హృదయ దౌర్బల్యం*
*త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।।*
*భావము:*
ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.
*వివరణ:*
జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహించుతూ అర్జునుడి అంతర్గత శక్తిని పెంపోదిస్తున్నాడు.
ఆర్జునుడిని, ప్రిథ (కుంతీ దేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంభోదించడం వలన అతనికి తన తల్లి కుంతీ దేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించటంచేత, అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఈ విధంగా, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. తన ఉన్నతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశపడవద్దని అర్జునుడికి, శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల ఆర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంభోదిస్తున్నాడు, తన క్షత్రియ ధర్మమయిన కర్తవ్యాన్ని విస్మరించాలనే ఆలోచనే, ఆ శత్రువు.
అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్త భ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తాడు. దీని మూల కారణం మానసిక బలహీనత. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన, ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
. *🌹వేమన పద్యములు🌹*
. *అర్థము - తాత్పర్యము*
. *Part - 12*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*💥వేమన పద్యాలు-- 31*
*అంతరంగమందు నద్వైతమే యుండు*
*బాహ్యమందు ద్వైత భావముండు*
*యట్లుకాక తత్త్వ మలవడ నేరదు*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹తాత్పర్యము --*
తత్త్వం తెలియాలంటే ద్వైత భ్రాంతి వీడాలి.
జీవాత్మ పరమాత్మలను వేరుగా చూడరాదు.
అభేద బ్రహ్మ బోధము కావాలి.
*💥వేమన పద్యాలు -- 32*
*అంతరంగ మెరుగ హరుడౌను గురుడౌను*
*యంతరంగ మెరుగ నలవికాదు*
*యంతరంగ మెరుగ నతడెపో శివుడయా*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹తాత్పర్యము --*
ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే అది ఆ శివునికొక్కడికే శక్యము , ఎదుటి వాని మనసుననున్నది గ్రహించినవాడే శివస్వరూపుడౌతాడు.
*💥వేమన పద్యాలు -- 33*
*అంతరంగ హృదయమందగా సాధించి*
*చింత లూడబెరికి చిక్కుపడక*
*వింతజూచి మెలగి విజ్ఞాన మందరా*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹తాత్పర్యము --*
ఏ చీకూ చింతా లేకుండా , చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించి జ్ఞానమును పొందవలెను.
సత్ప్రవర్తునుడై మెలగవలెను.
*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి*
*సర్వేజనా సుఖినోభవంతు*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *151వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*కేతుగ్రహ మహిమ - 1*
*"పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ! రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !!”*
నిర్వికల్పానంద చేతులు జోడించి ప్రార్థించాడు.
*“గురువుగారూ... 'పలాశపుష్పం' అంటే...”* సదానందుడు ప్రారంభించాడు.
*"మోదుగు పువ్వు నాయనా ! కేతువు వర్ణం మోదుగు పువ్వులాగా ఎర్రగా ఉంటుంది ! ఇతర గ్రహాలకు లాగే నవగ్రహాలలో నవమగ్రహమైన కేతువుకూ అనేక కారకత్వాలున్నాయి. వాటిలో మహత్తరమైన కారకత్వం ఒకటుంది. అదే మోక్షకారకత్వం ! మానవుడికి జనన మరణ చక్రం నుండి విముక్తి అనే 'ముక్తి' లభించాలంటే కేతుగ్రహ శుభవీక్షణ చాలా ముఖ్యం. ఆయన దయలేని కారణంగా విశ్వప్రయత్నం చేసినప్పటికీ . మోక్షాన్ని , అంటే స్వర్గాన్ని అందుకోలేకపోయిన పురాణ పురుషుడి గాథ చెప్పుకుందాం !”* నిర్వికల్పానంద ఉపోద్ఘాతం ముగించి , శిష్యుల వైపు ప్రసన్నంగా చూశాడు.
విమలానందుడూ , చిదానందుడూ , సదానందుడూ , శివానందుడూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు.
*“ఇందాక మనం హరిశ్చంద్రుడి కథ చెప్పుకున్నాం. ఆయన తండ్రి ఎవరో తెలుసా ? సత్యవ్రత మహారాజు ! ఆయన మనకు 'త్రిశంకుడు'గా తెలుసు !”*
*"సత్యవ్రత మహారాజుకు 'త్రిశంకుడు' అనే పేరు ఎందుకు వచ్చింది , గురువుగారూ ?"*
*"వశిష్ఠ మహర్షి శాపం వల్ల ఆయన త్రిశంకుడయ్యాడు. 'త్రిశంకుడు' అంటే మూడు పాపాలు చేసినవాడు అని అర్థం...”*
*"ఆ మూడు పాపాలు ఏవి , గురువుగారూ ?”* సదానందుడు అడిగాడు.
*“యుక్తవయస్సులో ఉన్నప్పుడు సత్యవ్రతుడు వివాహవేదిక మీద నుండి మంగళ సూత్రధారణ జరిగే ముందు , ఒక వధువును ఎత్తుకు వెళ్ళిపోయాడు. అది ఒక పాపం !”*
*"ఆ నేరానికి శిక్షగా ఆయన తండ్రి అయిన త్రయ్యారుణ చక్రవర్తి సత్యవ్రతునికి రాజ్య బహిష్కార శిక్ష విధించాడు. కన్నతండ్రి ఆగ్రహానికి గురి అవడం రెండవ పాపం.”*
*"దేశం వదిలి అరణ్యాలలో జంతువులను వేటాడి తింటూ నికృష్టమైన జీవనం సాగిస్తున్న సత్యవ్రతుడు , ఒకనాడు వశిష్ఠ హోమధేనువైన నందినిని చంపి , ఆ గోవు మాంసం ఆరగించాడు. గోమాంస భక్షణ మూడవ పాపం ! మూడు పాపాల కారణంగా - అంటే 'త్రిశంకల' కారణంగా అతన్ని 'త్రిశంకుడు'గా వ్యవహరించబడమని శపించాడు వశిష్ఠ మహర్షి. ఆనాటి నుండి సత్యవ్రతుడు త్రిశంకుడుగా ప్రఖ్యాతుడయ్యాడు !"* నిర్వికల్పానంద వివరించాడు.
*"ఒక్కగానొక్క కొడుకుని అరణ్యాల పాలు చేసినందుకు విచారించి త్రిశంకుడి తండ్రి త్రయ్యారుణ చక్రవర్తి అతన్ని రాజధానికి పిలిపించి , రాజుగా అభిషేకించాడు. చాలా ఏళ్ళ పాటు రాజ్యపాలన చేసిన త్రిశంకు చక్రవర్తికి జీవితం మీద విరక్తి కలిగింది. మరణించకుండా స్వర్గం చేరి , తద్వారా మోక్షాన్ని పొందాలన్న సంకల్పం బలంగా కలిగింది ఆయనకు. కులగురువైన వశిష్ఠ మహర్షితో ఆ విషయం గురించి చర్చించాడు...”* నిర్వికల్పానంద కథనం కొనసాగిస్తున్నాడు...
★★★★★★★★★★★★★★★★
*"గురుదేవా ! జీవితంతో విసిగిపోయాను ! రాజ్య పాలనతో అలసిపోయాను. ఈ జీవితం పట్లా , అధికారం పట్లా విరక్తి పుట్టింది...”*
*“ఈ వయసులో అది సహజమే త్రిశంకూ !”* వశిష్ఠమహర్షి చిరునవ్వుతో అన్నాడు. *“హరిశ్చంద్రుడు పెద్దవాడయ్యాడు కద ! అతన్ని రాజుగా అభిషేకించి , నివృత్తి జీవితం గడుపు !"*
*"నా ఉద్దేశం నివృత్తి జీవితం గడపడం కాదు. నాలో మోక్షేచ్ఛ బలంగా ఉంది. నేను స్వర్గానికి వెళ్ళాలి గురుదేవా !”*
వశిష్ఠుడు చిన్నగా నవ్వాడు. *“అది మన చేతుల్లో లేదు త్రిశంకూ ! స్వర్గమో , నరకమో - మనిషి మరణిస్తే గానీ తేలదు. మరణం మన చేతిలో లేదు. స్వర్గవాస కాంక్షతోనే ఆత్మహత్య ద్వారా మరణిస్తే నరకం తప్పదు !”*
*"గురుదేవా ! దయచేసి నన్ను చెప్పనివ్వండి ! నేను మరణించకుండానే , ఈ శరీరంతోనే నేరుగా స్వర్గానికి వెళ్ళాలి !"*
వశిష్ఠ మహర్షి నిర్ఘాతంపోతూ చూశాడు. త్రిశంకుడికి మతి భ్రమించిందా ?! *"త్రిశంకూ , ఒక సత్యం చెప్తాను విను ! సశరీరంగా స్వర్గానికి చేరే వ్యవహారం అలా ఉంచుదాం ! ఒకవేళ నీకు సమీప భవిష్యత్తులో సహజ మరణం సంభవించినప్పటికీ నీకు స్వర్గవాసమూ , మోక్షమూ లభించే అవకాశం లేదు...”*
*"గురుదేవా !"*
*"ఎందుకో తెలుసా ? మోక్షకారకుడైన కేతుగ్రహదేవత నీకు అనుకూలంగా లేడు ! కేతువు వక్రంగా వీక్షిస్తే , మోక్షం సిద్ధించదు !"*
త్రిశంకు చక్రవర్తి వశిష్ఠుడి వైపు రెప్పవేయకుండా , తీక్షణంగా చూశాడు. *"గ్రహచారాన్నీ , అదృష్టాన్నీ మరిచిపోండి. గురుదేవా ! నన్ను బొందితో స్వర్గానికి పంపించే మహత్తర సంకల్పంతో అద్వితీయమైన మహాయాగం చేయండి. మీరు అందుకు సమర్థులని నాకు తెలుసు. మా వంశానికి చెందిన వైవస్వత మనుమహారాజుకు యజ్ఞాచరణంతో సంతతి కలిగేలా చేశారు మీరు !"*
*"అది వేరు , త్రిశంకు ! నీ కోరిక అసాధారణమైంది ! ఆచరణ సాధ్యం కానిది ! నిజం చెప్పాలంటే నీది ఆశ కాదు ; వ్యామోహం - విపరీతమైన వ్యామోహం !"* వశిష్ఠ మహర్షి నిష్కర్షగా అన్నాడు.
*"నా విపరీత వ్యామోహాన్ని ఆశగా , ఆశయంగా పరివర్తింపజేయండి ! సశరీర స్వర్గయానానికీ , మోక్షానికీ అవసరమైన యాగం చేయండి !"* త్రిశంకుడు గంభీరంగా అన్నాడు.
*"ఆజ్ఞాపిస్తున్నావా , రాజా ?"*
*"అర్థించాను ; అభ్యర్థించాను ! ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను !"*
*"నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నాను !”*
*"గురుదేవా !"*
*"మళ్ళీ చెప్తున్నాను త్రిశంకూ ! మోక్షకారక గ్రహం నీకు అనుకూలంగా లేదు ! క్రతువు విజయవంతం కాదు ! సఫలం కాదు ! ఫలించని క్రతువుని ఈ వశిష్ఠుడు చేయడు !"*
తీక్షణంగా చూస్తున్న త్రిశంకుడి చూపుల్ని పట్టించుకోకుండా వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయాడు.
★★★★★★★★★★★★★★★★
ఆశ్రమ ప్రాంగణంలో అరుగు మీద కూర్చున్న విశ్వామిత్ర మహర్షి పాదాలకు ప్రణామం చేశాడు త్రిశంకు చక్రవర్తి.
*"ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు !"* విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు.
*"సమయోచితమైన దీవెన అనుగ్రహించారు ! కులగురువైన వశిష్ఠుడి నిరాదరణను రుచి చూసి , అవమాన భారంతో మీ సన్నిధికి వచ్చాను"* త్రిశంకుడు బరువుగా అన్నాడు.
*"ఏం జరిగింది , సత్యవ్రతా ?"* విశ్వామిత్ర మహర్షి అనునయంగా అడిగాడు. *"శాప రూపంలో ఆ వశిష్ఠుడు నీకు బహూకరించిన నామధేయంతో నిన్ను ఈ విశ్వామిత్రుడు సంబోధించడు !"*
*"ధన్యుణ్ణి ! రాజ్యాధికారం మీదా , జీవితం మీదా విరక్తి పెచ్చరిల్లిన కారణంగా , తగిన మహాయాగం చేసి , నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించి , ఆ విధంగా మోక్షం ఇప్పించమని ఆ వశిష్ఠ మహర్షిని అర్థించాను. ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించాడు !"* త్రిశంకుడి కంఠంలో ఆవేశం గంటలా ధ్వనించింది.
*"కారణం ?"*
*“మోక్షకారకుడైన కేతువు నన్ను వక్రంగా చూస్తున్నాడట !"* త్రిశంకుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.
విశ్వామిత్రుడు గొల్లున నవ్వాడు. *"చేయగలిగిన చేవ ఉన్న వ్యక్తిని అడగాలి , సత్యవ్రతా నువ్వు ! ఆ వశిష్ఠుడు ఎంత ? అతగాడి తపోబలమెంత ? బ్రహ్మర్షి అన్న అహంకారం ఒక్కటే - ఆ వశిష్ఠుడు కాని , వశిష్ఠుడి బలం ! హోమాగ్నిని పుట్టించలేని వాడు 'సమిథలు పచ్చివి' అన్నట్టు తన చేతగానితనాన్ని గ్రహచారానికి ఆపాదించాడు !"*
*"గురుదేవా... నా కోరిక మీరే తీర్చాలి !"* త్రిశంకు ప్రాధేయపూర్వకంగా అన్నాడు. *"సత్యవ్రతా ! సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన మేధావి మాత్రమే , 'మహర్షి' మాత్రమే నిన్ను సశరీరంగా స్వర్గానికి సాగనంపగలడు ! నీ కోరిక నేను తీరుస్తాను ! ఆ వశిష్ఠుడి కళ్ళు తెరిపిస్తాను !"* విశ్వామిత్రుడు సగర్వంగా అన్నాడు.
*"గురుదేవా ! మీరు అంగీకరించారు ! సశరీర స్వర్గ ప్రవేశంలో నాకింక అనుమానమే లేదు !"* త్రిశంకుడు ఆనందంగా అన్నాడు.
*"యజ్ఞ నిర్వహణకు సన్నద్ధం చేయించు. ముందుగా బ్రహ్మవాదులైన ఋషులను ఆహ్వానించు. నేను స్వయంగా యాజకత్వం వహించి యజ్ఞం చేయిస్తాను !”* విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు.
త్రిశంకు చక్రవర్తి కృతజ్ఞతా పూర్వకంగా విశ్వామిత్రుడికి పాదాభివందనం చేశాడు. *"సశరీర స్వర్గ ప్రాప్తిరస్తు !”* దీవించాడు విశ్వామిత్రుడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
**తృతీయ స్కంధము*
*వర వైకుంఠము సారసాకరము; దివ్యస్వర్ణ శాలాంక గో*
*పుర హర్మ్యావృత మైన తద్భవన మంభోజంబు; తన్మంది రాం*
*తర విభ్రాజిత భోగి గర్ణిక; దదుద్యద్భోగ పర్యంకమం*
*దిరవొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్.*
వైకుంఠం చాలా మేలైనపురం. అది ఒక పద్మాల కొలను అనుకొంటే అందులోని పసిడి గోపురాలతో కూడిన మేడల మధ్యనున్న శ్రీ మహావిష్ణువు ఉండే భవనం ఒక గొప్ప పద్మంలాగా ఉన్నది. ఆ భవనం లోపల విరాజిల్లుతున్న ఆదిశేషుడు, విష్ణువునకు సెజ్జగానుండి పద్మంలోని దుద్దులాగా కానవస్తున్నాడు. పైకి చక్కగా ఎత్తిపట్టి ఉన్న ఆ శేషుని తలలనే పానుపు మీద మాధవుడు మకరందాన్ని తనివితీరా గ్రోలటానికి వచ్చిన తుమ్మెదలాగా కనపడుతున్నాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
// *శ్లోకం* //
*ఆత్మపత్న్యాచ కలహో*,
*మిథ్యానిందా పరస్త్రీయామ్*!
*స్వజనే ప్రేమ హీనత్వం*,
*అశ్లీలం సర్వదా నృణామ్* !!
/- *_సంస్కృత సూక్తి సుధ_* /-
భావము - *భార్యతో పోట్లాడటం, ఏ పాపమూ ఎరుగని స్త్రీపై నిందలు మోపడం, తల్లి,తండ్రి మొదలైన తనవారిపై ప్రేమ లేకుండా ఉండటం*-- ఇవి వ్యక్తిని *సుజనుడు* గా నిలపవు.
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *రెండొవ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *సాంఖ్య యోగము*
. *శ్లోకము 03*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*క్లైబ్యం మా స్మ గమః పార్థ*
*నైతత్త్వయ్యుపపద్యతే ।*
*క్షుద్రం హృదయ దౌర్బల్యం*
*త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।।*
*భావము:*
ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.
*వివరణ:*
జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహించుతూ అర్జునుడి అంతర్గత శక్తిని పెంపోదిస్తున్నాడు.
ఆర్జునుడిని, ప్రిథ (కుంతీ దేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంభోదించడం వలన అతనికి తన తల్లి కుంతీ దేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించటంచేత, అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఈ విధంగా, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. తన ఉన్నతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశపడవద్దని అర్జునుడికి, శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల ఆర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంభోదిస్తున్నాడు, తన క్షత్రియ ధర్మమయిన కర్తవ్యాన్ని విస్మరించాలనే ఆలోచనే, ఆ శత్రువు.
అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్త భ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తాడు. దీని మూల కారణం మానసిక బలహీనత. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన, ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹