14, జులై 2024, ఆదివారం

గరిమెళ్ళ సత్యనారాయణ

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

14.07.2024 ఆదివారం.



గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి


*వీరి గళానికి తెల్లదొరలే హడలెత్తిపోయారు.. అతనెవరో మీకు తెలుసా..*


స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ (జూలై 14, 1893 - డిసెంబర్ 18, 1952) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన ' మా కొద్దీ తెల్ల దొరతనం .... " పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. 


1915వ సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించి, గాంధీజీ ఒకసారి జాతీయ గీతాల కవుల సమావేశాన్ని నిర్వహించారు. ఆహ్వానితుల్లో గరిమెళ్ళ కూడా ఒకరు. వచ్చిన కవులు తమ గీతాల్ని వరుసగా వినిపించసాగారు. గరిమెళ్ళ తనవంతు వచ్చాక “మా కొద్దీ తెల్ల దొరతనం” అంటూ పై గీతాలన్నీ ఆలపించి, దానికి బహుమతి ఒక సంవత్సరం జైలు శిక్ష అని చెప్పారు. గాంధీజీ పాటను విని ఆశ్చర్యచకితులై అదే బాణీలో పాటలు వ్రాయమని మిగతా కవులకు సలహా ఇచ్చారట.


ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

కాలమున కతీతులుయనగాలేరునిలన్

 కాలమె పరమావధి, నిధి

కాలమె జీవన విధియని గమనించు నదే

కాలము పెంచును చంపును

కాలమున కతీతులుయనగాలేరునిలన్

మానవ జన్మకు సార్థకత

 *మానవ జన్మకు సార్థకత ఏమిటి???*


మనకు వచ్చే మృత్యువు అనేది ఫోటోగ్రాఫర్ లాంటిది కాదు, మనం రెడీగా ఉన్నపుడు మాత్రమే తీసుకుపోవడానికి!

అది నిత్యం మనతోనే ఉంటున్నది....

 సమయం వచ్చినపుడు దాని పని అది చక్కగా చేసుకుపోతుంది. 

'నావి' అనుకున్న ఈ సంపదలు, భూములు, భవనాలు, భార్య బిడ్డలు, బంధుమిత్రులు ఎవరూ కూడా మనలను మృత్యువు నుండి కాపాడలేరు. 

ఇవేవీ మనతో వచ్చేవి కావు కూడా , కనుక వీరి నిమిత్తం మనం మంచిని విడువకూడదు, చెడుపైపు మరలకూడదు...

నేడు మనం చేసిన ప్రతీ తప్పుకు మరణాంతరం దేవుని ముందు ఒంటరిగా నిలబడి సమాదానం చెప్పవలసి ఉంటుంది...

నేడు మనం చేసుకున్న పుణ్య, పాప కర్మలే అప్పటి మన సాక్ష్యాలు... 

కనుక నిజముగా ఆత్మోద్ధారణ కోరుకొనువారు పాప ఫలితాలనిచ్చే హింసాది పాపకర్మలకు దూరముగా ఉండాలి. 

పుణ్య ఫలితాలను ఇచ్చే పరోపకారాలు, మాధవసేవగా సర్వప్రాణిసేవ సమాజ సేవలు చేస్తుండాలి, మనోశుద్ధి కొరకు భగవంతుని స్మరిస్తుండాలి. ఎందరెందరో మహనీయులు తరించిన. మార్గాన్ని అనుసరించాలి


భగవంతుడు చూపిన మార్గంలో నడచుకోవడము వలనే జన్మకు సార్థకత చేకూరుతుందన్న సత్యంను గ్రహించి ఆ దివ్యమార్గంలో నడచుకోవాలి...


               *_శ్రీ సద్గురు పీఠం  శుభమస్తు_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

నీ తీరు మార్చుకో

 నా చిన్నప్పుడు విజయవాడ దుర్గ గుడిలో ప్రతి శుక్రవారం రాత్రి పవళింపు సేవ జరిగేది..మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళేది..కాసేపు పూజ చూసాక నేను అక్కడ ఉన్న నా ఈడు పిల్లలతో ఆడుకుని ఇంటికి వచ్చేవాడిని..మా అమ్మ అక్కడ ఇచ్చిన ప్రసాదం ఇంటికి తెచ్చి రాత్రి అట్టి పెట్టి పొద్దున్న లేచాక స్నానం చేయగానే దానిని తినిపించేది..ఇవాళ అలా కనీసం వారానికి ఒక సారి అన్నా పిల్లలను గుడికి తెచ్చే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? గుడిలో వారానికి ఒక సారి అన్నా ఏదో ఒక వైదిక కార్యక్రమం చేసి భక్తులు సామూహికంగా కలిసే అవకాశం ఏర్పడుతోందా?.. హిందూ ధర్మానికి ఆపద వేరే వాళ్ళ వల్లే కాదు..మన సంస్కృతి ని మనం సరిగాఆచరణ చేయని మూలంగా కూడా వస్తుంది..ఇది సరిదిద్దుకోకుండా ఏవేవో రాలీలు,కేసులు అంటే ఉపయోగం ఏముంటుంది?..నీ తీరు మార్చుకో నేడు.. లోకం ఎలా మారుతుందో చూడు..👌👌

తెలుగు భాషావిర్భావము

 🙏తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏

సంస్కృత సాహిత్య విషయాలతోపాటు తెలుగు భాషా చరిత్ర కూడా తెలుసుకొని ఇద్దరు తల్లులను సేవిద్దాము.

             మొదటి భాగము 

తెలుగు మాట్లాడేవారు వారిని తెలుగు వారు అని అంటారు తెలుగుకు పాత రూపాలు తెనుంగు తెలింగా, తెనుగు అనునవి.

తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు.

శాసనాలను పరిశీలించిన అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఒ అను నెనిమిది మాత్రమే గానవచ్చును.'ఐ'కి బదులు అయి 'ఔ'కు బదులు అవు, అగు అనునవి వాడబడుచుండెను. శకము 898 నాటి, అనుమల శాసనములో 'ఐన' అని ఐ వాడబడెను. 'ఔ'అక్షరము యొక్క ఉపయోగము కనిపించదు. హల్లులలో వర్గాక్షరములందు అల్ప ప్రాణములు, అనునాసికములగు ఙ,ఞా,ణ,న,మ,లు విశేషముగ గానవచ్చును. య,ర,ల,వ,శ,,స,హ,ళ.వర్ణములు వాడుకయందుండెను. కాగా అందుశకట రేఫము ఒకటి.ఇది ఇప్పటివరకు వాడబడుచున్నను ప్రస్తుతము దాని ఉపయోగము తగ్గిపోవు చున్నది.సుమారు క్రీస్తు పదవశతాబ్ది అంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాసించువఱకు శాసనములందు 'ఱ'అనురూపమున వ్రాయబడు అక్షరముండెడిది.ఇది బండి 'ఱ' లోని అడ్డుగీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు,వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అదిక్రమముగా కొన్నిచోట్ల 'డ'గాను,కొన్ని చోట్ల 'ళ'గాను,మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి.ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లు న్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగా శాసనములనుబట్టి తెలియుచున్నది.అది 'చోఱ' 'పదములలో(ఱలో లోపలి గీత తొలగించగా మిగిలిన అక్షరము దాన్ని డ్జ గా పలికే వారు ఈ వ్యాసములో ఎక్కడ ఱ వ్రాసినను బండి ర గా పలక కూడదు డ్జ గా పలకాలి పూర్తి సంయుక్తము గా కాకుండా కొంచెం తేలికగా పలకాలి ఈ విషయం మరచిపోవద్దు ) 'చోఱ ( చోడ్జ గా పలకాలి కన్నడిగుల వల్లనే డ్జ అని పలకాలని ఉచ్చారణ తెలిసింది ఈ అక్షరం కన్నడం లో ఎక్కువ కాలము ఉంది.)p అనే పదం చోడ' లేక 'చోళ' అనియు;'నోఱంబ' పదములో 'నోళంబ' అనియు,ఱెందలూరు అనుచోట దెందులూరు గాను, క్టిన్ద అనునది క్రిన్ద(క్రింద) గాను 'ఱ' క్ఱొచె'అనుపదము 'క్రొచ్చె';వ్ర్ ​కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువు లందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాళైప్పళం'(=అరటిపండు) వంటి పదము లలో వాడబడుచున్నదని కొందరు భావించారు.తెలుగు శాసనములలో చొఱ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది. కనుక 'ఱ' ( బండి ర కాదు డ్జ) అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృత ములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది.

 అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు అని చరిత్రకారులు పేర్కొన్నారు . పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది అని తెలుస్తోంది

                          సశేషం .

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

గో రక్షణ అవసరం

 🙏🐂🙏🐂🙏

🔯 గోవుల మధ్యలో గోవుల కాపరిగా ఉండటం వలన పోతులూరి వీర బ్రహ్మం గారికి , భవిష్యత్తు తెలిసి కాలజ్ఞానం రాశారు.🐂


🔯 గంగిగోవు పాలు గరిటడైనను చాలు అని గోవు మహత్యం గుర్తించిన వేమన ఒక గొప్ప యోగి అయ్యాడు.🐂


🔯 గోవధ నిషేధం, గో రక్షణ , స్వతంత్రం కన్నా గొప్పదని చెప్పిన గాంధీ ఒక మహాత్ముడు అయ్యాడు.🐂


🔯 అవు మాంసం తో తుపాకీలు చేస్తున్నారని తెలిసి, మొట్టమొదటిగా సిపాయిలతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలుపెట్టాడు మంగళ్ పాండే.🐂


🔯 అవుల శాల లో జీవిస్తూ జీవిత పరమార్థం తెలుసుకొని ఒక గొప్ప గురువు అయ్యాడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.🐂


🔯 సాక్షాత్తు మహా విష్ణువు , గోవుల మధ్య శ్రీ కృష్ణుడి అవతారం ఎత్తి గీత ను బోధించాడు.🐂


🔯  తిరుమల వేంకటేశ్వరుడు, పుట్టలో తపస్సు చేసుకొంటూ గోవు పాలు తాగి కలియుగ దైవంగా వెలిశాడు.🐂


🐂🕉️🐂 గో రక్షణ అవసరం గుర్తిస్తే గొప్ప జీవితం అనుభవిస్తాము.


👎 గో భక్షణ కు సహకరిస్తే అధహ్ పాతాళానికి చేరుతాం.


🐂జై గోమాత🐂

ముఖ్యమైన విషయాలు.

 🙏🌟🌟🌟🙏


* ముఖ్యమైన విషయాలు...*


*పూజ* :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన*:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం*:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం*:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం*:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష*:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం* :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం*:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.


*ఆసనం*:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం*:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం*:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 


అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.


*అక్షతలు*:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం*:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.

మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.


(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.


*ధూపం:*- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.


*దీపం*:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. 

పూజగది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం  -‌ అష్టమి  - చిత్ర -‌‌ బాను వాసరే* (14.07.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కృష్ణానదిని కాపాడుకునేందుకు

 పద్యం:☝️

*తీరంబందు విసర్జనల్‌ సలుపు ఈ దీన ప్రజాకోటికిన్‌*

*దారిద్య్రంబున్‌ బాపు శుభ్రతను విద్యా గంధమున్‌ గూర్చుచున్‌*

*సారంబే నవ సుఖజీవనంబునిడి శ్రీచైతన్యంబున్‌ గూర్చుమా?*

*వేరేదారిక లేదు వీరలకు నీవె దిక్కు కృష్ణానదీ*

-కృష్ణానది శతకం

-జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 


కృష్ణానదిని కాపాడుకునేందుకు సూచనలను ఈ పద్య రూపంలో పెట్టారు.

భావం: నీటిలో ప్లాస్టిక్కులు వేయవద్దని, మల మూత్రాలను విసర్జించరాదని, ఇలాంటి తప్పిదాలు చేసేవారిని కృష్ణవేణీ నది కరుణించి వారికి సద్బుద్ధిని ప్రసాదించి నదులను శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచేటట్లు చేయాలి.🙏

పంచాంగం 14.07.2024 Sunday.

 ఈ రోజు పంచాంగం 14.07.2024 Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష  అష్టమి తిధి భాను వాసర: చిత్ర  నక్షత్రం శివ యోగ: బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి సాయంత్రం 05:22 వరకు .

చిత్ర  రాత్రి 10:00 వరకు.


సూర్యోదయం : 05:53

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : తెల్లవారుఝామున 04:09 నుండి ఉదయం 05:57 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 05:06 నుండి 05:58 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 02:54 నుండి 04:41 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార: