27, నవంబర్ 2025, గురువారం

ఉదయాన్నే కాఫీ*

  

*మన ఆరోగ్యం…!


           *ఉదయాన్నే కాఫీ*

               ➖➖➖✍️


```

చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. 


అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా? 


ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగడం లేదా రోజంతా ఎక్కువగా కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.


కాఫీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. 


వీటిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 


కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి...```



*కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు:*


*నిద్రలేమి:```

కాఫీ తాగడం వల్ల నిద్రలేమి వస్తుంది. ఎందుకంటే కాఫీలో కెఫీన్‌ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్య మరియు నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి.```


*అసిడిటీ సమస్య:```

కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఎవరైనా ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే, అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.


కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది.


కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధి వస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగేవారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు 35 శాతం ఎక్కువగా ఉన్నాయని ఒక పరిశోధనలో తేలింది.```


*రక్తపోటును పెంచుతుంది:```

అధిక రక్తపోటు ఫిర్యాదులు ఉన్నవారు కాఫీని త్రాగకూడదు. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది.```


*గర్భిణీ స్త్రీలు త్రాగకూడదు:```

గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కాఫీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.```


*క్యాన్సర్ వచ్చే అవకాశాలు:```

కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి కాఫీని ఎక్కువగా తీసుకోకూడదు. కాఫీ రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే త్రాగాలి.

```

*నరాలను బలహీనపరుస్తుంది:```

కాఫీలో కెఫీన్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది నరాలను బలహీనపరుస్తుంది. దీని కారణంగా కండరాలలో నొప్పి యొక్క ఫిర్యాదు ఉంది.```


*గుండెపోటు ప్రమాదం పెరిగింది:```

కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య మొదలవుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.✍️```

Dont..start our day .. with coffee... but, water.💦సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సుభాషితమ్

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో 𝕝𝕝    *సుసూక్ష్మేణాపి రంధ్రేణ* 

            *ప్రవిశ్యాభ్యంతరం రిపుః* l

            *నాశయేచ్చ శనైఃపశ్చాత్* 

            *ప్లవం సలిల పూరవత్* ll 


తా𝕝𝕝 *చిన్న భద్రతా లోపం ఉన్నా కూడా దేశంలోకి శత్రువులు చొరబడి ఇబ్బంది పెడతారు.... చిన్న చిల్లు ఉన్నా కూడా నిదానంగా పడవ నీట మునిగి పోతుంది కదా?*


ఆ.వె.

*సందునివ్వ చాలు శత్రువులకిలను*

*కూలిపోవు భద్ర కోట కూడ* l 

*చిన్నదైననేమి చిల్లొక్కటుండిన*

*పడవ నీట మునుగు పగిదిగాను* ll


✍️💐🌹🌸🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ 

శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే (13)


దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ 

బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే (14)


అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమని చెబుతారు

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా వుండడం. కల్లాకపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మచర్యదీక్షనూ, అహింసావ్రతాన్నీ అవలంబించడం –వీటిని శరీరంతో చేసే తపస్సని చెబుతారు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ఎర్రి బాగులు నాన్న కథ!

  "ఆయన సింహం లాంటోడే "..

 ఎర్రి బాగులు నాన్న కథ! 


సింహం !

అడవికి రారాజు !

మగ సింహం ... సింహాల గుంపుకు {pride } రక్షకుడు . 

మిగతా గుంపుల సింహాల నుంచి తన కుటుంబాన్ని కాపాడుతుంది . 

సింహమంటే అడవిలో భయపడని జంతువుండదు .

సింహం ... ఠీవి , రాజసం,  డాబు,  దర్పం అన్నీ ఒక వయసు వరకే !

"వాడు కుక్క చావు చచ్చాడు "అంటారు .

 అంటే కుక్క..  చివరి రోజులు దయనీయంగా ఉంటాయని అర్థం .

మీకు తెలుసా ?

సింహం చివరి రోజులు ఇంతకన్నా దయనీయం .

జింక లాంటి  గడ్డిమేసే జంతువుల పని ఒక విధంగా హ్యాపీ . 

ముసలి  వయసు వచ్చినా ... లేవలేక పోయినా చుట్టూరా గడ్డి ఉంటుంది .

 కడుపు నింపు కోవచ్చు .

"ముసలి జింక పరుగెత్త లేదు . పులి,  సింహం లాంటి వాటికి ఆహారమయిపోతుంది!"  అనుకొంటున్నారా ?

ఆగండి.. ఆ పాయింట్ కొస్తా!


వృద్ధ సింహం !

పళ్ళు బలహీనం .. కండరాలు బలహీనం !

వేటాడ లేదు . 


ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు .

" నీ పని అయిపొయింది .. నువ్వు చేసేది ఏమీ లేదు .. పెత్తనం చాలు .. ఇక దయ చెయ్యి .. "అని ఆ గుంపులో నాయకత్వం కోసం తహతహ  లాడుతున్న యువ మగసింహాలు వృద్ధ సింహాన్ని బయటకు గెంటేస్తాయి .

నిన్నటి రాజసమే .. తన పెత్తనమే .. అంటే పురుషాధిక్యతే ..  నేడు తన పాలిట శాపం అయ్యింది . 

అధికారం పోయింది. 

కుటుంబం దూరం అయ్యింది . 

శరీరం సహకరించదు . 

వేటాడే శక్తి లేదు .

ఒంటరి జీవితం .

 నిన్నటి దాక జగమంత కుటుంబం .. నేడు ఏకాకి జీవితం .


"వృద్ధ జింక పైకి సింహాలు  పులులు  వచ్చి చంపుతాయి" అన్నారు కదా ?

అది హ్యాపీ ఎండింగ్ ! 

గొంతు కొరికి చంపడం వల్ల రెండు నిముషాల్లో ప్రాణం పోతుంది .


అడవికి రారాజు ..  సింహం చావు... ఎలా ఉంటుందో తెలుసా ?

వేటాడితే కానీ కడుపు నిండదు . 

వేటాడే ఓపిక లేదు .

 ఆకలి తో నీరసించి లేవ లేక పడుకొనుంటే...  హైనాలు  దాడి    చేస్తాయి .

 లైవ్ గా ...  పీక్కు  తింటాయి . 

ప్రాణం పోదు .. వెనుక నుంచి  హైనాలు .. కండరాల్ని పీక్కుని తింటున్నాయి . 

విపరీతమయిన నొప్పి...  బాధ .. 

నిన్నటి దాక తాను లేస్తే జంతువులు ఆమడ దూరం పారిపోయేవి . ఇప్పుడు బతికుండగానే పీక్కుని తింటున్నాయి .

భరించలేని టార్చర్ . ... వెనుక వైపు .. పక్క వైపు .. కండరాలు పోతున్నాయి . 

వెధవ ప్రాణం  పోదు .

 ప్రాణం పోవడం...  ఎంతటి బ్లెస్సింగ్ ! 

అరగంట ... గంట...  టార్చర్...  తరువాత .. చివరకు ఎండింగ్ . పెయిన్ ఫుల్ ఎండింగ్ . 

అడవికి రాజు లైఫ్ .. డెత్ ఇది . 


 రాజుల ప్రాణాలు ఇలాగే పోతాయేమో .. యుద్ధ భూమిలో  .. శత్రువుల చేతికి చిక్కితే .... అయ్యో పాపం !

జనాల సింపతికి కూడా నోచుకోకుండా పోయారు .. .. 

చేసిన పాపాలకు శిక్ష అనుకోవాలా ? 

 బూమిపైనే నరకం చవి చూసి అసువులు బాసిన వారెందరో  ! 

"ఒకే వైపే చూడు .. రెండో వైపు చూడకు" అని సమాజం .   


 .. పాపం... నాన్న   సింహంలాంటోడే !

తాగుబోతు .. పెళ్ళాన్ని కొట్టే టైపు..  నాన్నల గురించి కాదు . 

అలాంటి వారు శాడిస్ట్ లు .


పురుషాధిక్య సమాజానికి చెందిన.. సగటు నాన్న కథ .. వ్యధ ..  గుండెతో చదవండి . 


ఉద్యోగం .. వ్యాపారం .. సంపాదన . .. కుటుంబానికి తానే పెద్దదిక్కు .


బాధ కలిగితే అమ్మ ఏడుస్తుంది . 

ఎంతో కొంత మేర ఉపశమనం పొందుతుంది ...  కన్నబిడ్డల సానుభూతిని కూడా !


నాన్న  ఏడవడు. 

"ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు " అంటుంది పురుషాధిక్య సమాజం   .

 బేలతనం చూపడం అంటే ఎంత నామోషీ !

అందుకే నాన్న ఏడవడు. 

బాధల్ని ఎవరికీ చెప్పుకోడు. 

"మగాడికి బాధలేంట్రా?" అంటుంది సమాజం . 

అందుకే కష్టాన్ని గుండెలో దాచుకొంటాడు . 

ఎర్రి గుండె .. 

ఎంతని భరిస్తుంది ?   

అందుకే ఎప్పుడో పుసిక్కున ఆగిపోతుంది . 

నాన్నలకే పక్షవాతమొస్తుంది .

అమ్మలకు రావాలని కాదు . 

నాన్నలకే ఎందుకొస్తుంది ?అని సమాజం అడగదు. తెలుసుకోదు . పవర్ ఉన్నోడికి సానుభూతి దక్కదు . 


"నాన్న ముక్కోపి .. అమ్మ ప్రేమకు ప్రతి రూపం"

 . సగటు కుటుంబం లో పిల్లల ఆలోచన ఇది .

 తాను ఎవరి కోసం కష్టపడుతున్నాడో వారి ప్రేమ కూడా పొందలేని దోర్భగ్యం ..నాన్నది ! 


అమ్మ అడిగితే ఇస్తుంది . 

నాన్న .. ఎవరూ అడగక పోయినా ఇస్తాడు .

నిన్నటి పురుషాధిక్య సమాజం లో అన్నీ తానై కుటుంబానికి సర్వం  సమకూర్చేవాడు . 

ఏడిస్తే    ఒంటి   నీరు వృధా అయిపోతుందని దాన్ని కూడా చెమట నీరుగా మార్చి ... రేయి పగలు ఖర్చు పెట్టి ... బతుకు బండికి ఇంధనం సమకూర్చిన వాడు నాన్న . 

అమ్మను కు ప్రేమ  దక్కింది.. కృతజ్ఞత చిక్కింది . 

మరి పిచ్చి నాన్నకో ?? 


నిన్నటి నాన్న లు ఎంతో కొంత అదృష్టవంతులు .

 వృద్ధాప్యం లో ఉమ్మడి కుటుంబం ఉండేది . 


మరి నేటి నాన్నలు ?


నేటి నాన్న { 50 - 70 }:


పాపం సింహం బతుకు . 


వృద్ధాప్యం మీదబడిన...

 1. అమ్మ వింటేజ్ కారు .

 2. నాన్న స్క్రాప్ .


పట్టణంలో..  అమెరికా లో..  కొడుకులు..  కూతుళ్లు ..

"ఇంట్లో అమ్మ ఉంటే ఎంత హాయి .

వంట పని .. ఇంటి పని .. పిల్లల పని .. ఇద్దరు ముగ్గురు పని మనుషులు...  ఉన్నటు లెక్క .. 

అమ్మకు ఆహ్వానం " 


ఫ్లైట్ ఎక్కి అమెరికా కు పోయిన నాన్న నెలలో తిరిగొస్తాడు . 

అమ్మ ఆరు నెలలయినా అక్కడ హ్యాపీ గా ఉండిపోతుంది .


తప్పు పిల్లలది కాదు .. నాన్నదే ..    పురుషాదిక్యదే!   !


పెళ్లయిన కొత్తలో పెళ్ళాం పై పెత్తనం చేసేవాడు .

    "తాను  చెప్పినట్టే వినాలి . తనకు సపర్యలు చెయ్యాలి .

ఆడది ..   తన ఇంటికొచ్చింది .. తనపై ఆధారపడి బతుకుతోంది .. తానే రాజు .. తానే మాస్టర్ "అని అనుకునేవాడు .

ప్రకృతి ధర్మమో ...  కాలం   తెచ్చిన మార్పో!

యాభై అరవై కి వచ్చేటప్పటికి పెళ్ళాం లేకుండా నిముషం కూడా బతక లేని స్థితికి వచ్చేస్తాడు .. నాన్న .


వంట పనితో ... ఇంటి పని తో ఇల్లే స్వర్గం గా బతికింది అమ్మ . 

బోర్ ఫీల్ కాకుండా బతికేస్తుంది ఆమ్మ. 

బోర్ అనేది ఆమె డిక్షనరీ లో లేదు . 

ఆమె పనికి రిటైర్మెంట్ లేదు . 

చేసినత కాలం చేసినంత పని . 

పురుషుడు ఎంతటి అమాయకుడు .. అరవై ఏళ్లకు ఊడి పోయే ఉద్యోగాన్ని చూసి ఎంత మురిసి పోయాడు...   మిడిసి పడ్డాడు ?!! 


 లాక్ డౌన్ కాలం లో అత్యంత సఫర్ అయినవాడు నాన్న . 

ఇది ఎవరూ అర్థం చేసుకోలేక పోయిన కోణం .


 రిటైర్ అయిన నాన్న బతుకు దయనీయం .

 నిన్నటి దాక ఆఫీస్ లో తన డాబు ...  దర్పం . 

రోజంతా బిజీ . 

ఇప్పుడు పట్టించుకొనే వారు లేరు .

 రోజు గడవదు . 

పెళ్లానికేమి.!. హ్యాపీగా కాలం గడిపేస్తుంది .

తనకు నిన్నటి రోజుల విలువ లేదు అని గ్రహించడమే పెద్ద మానసిక పోటు. 

చిన్న ఉద్యోగస్తుడైతే ఫరవాలేదు . 

పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయినవాళ్లు సంగతి ?

ఎంత చెట్టుకు అంత తుఫాను పోటు ! 


నిన్నటి దాక  అప్పోయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూసే వారు . ఇప్పుడు ఇంట్లో బోర్ కొట్టి ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు . ఒక్కో సారి బ్లాక్ చేస్తున్నారు . 


హత విధి!  పురుషాధిక్య నాన్న కు ఎంతటి సైకలాజికల్ దెబ్బ !


తప్పు నీదే ! 

అరవై దాటాక కూడా .. కండలు ఉడిగి..  ఆదాయం అడుగంటాక కూడా ఇంకా నీ పెత్తనం ఏంటి ముసలోడా ?

నిన్నటి దాక .. చేసావ్ . సరే ..

 పెళ్ళాం వెర్రి బాగులది .

ఇప్పుడు కూతురు ఇంటికి పోయి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా ?

కూతురుకి నువ్వంటే అమిత ప్రేమ . 

కానీ ఆమెకో కుటుంబం ఉంది. ... నీలాగా కాకపోయినా ఎంతో కొంత పురుషాధిక్యత కలిగిన అల్లుడు ఉన్నాడు అక్కడ . పైగా కూతురికి జాబ్ .. అర్థం చేసుకోలేవు . ఇమడ లేవు . నెల తిరక్క ముందే ఇండియా కొచ్చేస్తావ్ .


కూతురు దగ్గరయినా నెల ఉంటావు .

 కొడుకు అయితే వారమే !

కొడుకు .. నీ ప్రతి రూపం మరి ...  బిజీ . 

కోడలు . వేరే ఇంటి బిడ్డ !


పోనీ ఒకటి చెప్పు !

కూతురో,  కొడుకో,  అల్లుడో,  కోడలో.. జాలి చూపితే సహిస్తావా ?

నరనరాల్లో పురుషాధిక్యత . 

dominant  నేచర్ ! 


ఏంటేంటి ?

నీ పెళ్ళాం నీ పై   ఆధార  పడి బతికిందా ?

బళ్ళు...  ఎప్ప్పుడో ఓడలయినాయి.. ఎర్రోడా ! 

 

ఇప్పుడు పెళ్ళాం లేకుండా నిముషం బతకలేవు .

 తిట్టడం కోసమయినా ఆమె ఉండాలి . 

మంచి నీళ్లు ఇవ్వడం మొదలు .. ప్లేట్ లో   అన్నం  పెట్టె దాక ఆమె ఉండాల్సిందే .

 అరే పిచ్చోడా .. ఆమెకు     ముట్లు  ఉడిగాక..   ఆమెకు నువ్వు .. నీకు తెలియకుండానే అమ్మ స్థానం ఇచ్చేసావ్ .

 అవును ఇప్పుడు నీ భార్య నీకు అమ్మ .

 వృద్ధాప్యం లో నువ్వు చంటి   పిల్లాడు  అయిపోయావు .


నీ నరనరాల్లో పురుషాధిక్యత...  నీకు తెలియకుండా ఎంత కరుడు కట్టుకొని పోయిదంటే..." నువ్వు లేకుండా నేను బతకలేను .. నువ్వు పొతే నేను నటుడు రంగనాథ్ అయిపోతాను" అని చెప్పలేని స్థితి నీది .

ఆమెకు   ఇదేమైనా కొత్తా?

ఎప్పుడో నీ కోసం .. తన పుట్టింటిని వదలి వచ్చింది .

 కొత్త ప్లేస్ లో కొత్త వాతావరణం లో ఇమిడి పోవడం ఆమెకు అప్పుడే అబ్బింది . 

ఇల్లే ఆమెకు ప్రపంచం . 

హ్యాపీ గా కూతురు ఇంట్లో కొడుకు ఇంట్లో సెటిల్  అయ్యిపోతుంది .

నువ్వు లేకుండా ఆమె బతకగలదు. 

ఆమె లేకుండా నువ్వు బతకలేవు .

ఇంకేమి పిండాకూడు మగపెత్తనం ? 

ముళ్ల కిరీటం ! 


 గతంలోనే బతకాలి అనేది నీ కోరిక . 

టైం ఫ్రీజ్ అయిపోవాలంటే ఎలా ముసలోడా ?

నీ సొంత ఇంట్లోనే ఉండాలి . పెళ్ళాం చేత సపర్యలు చేయించుకోవాలి . దాని పై పెత్తనం చెయ్యాలి ..అంటే ఎలా ?

కాలం మారింది . 

ఆమె మారింది .

 నీకు మాత్రం అడ్పాటేషన్ skills  రాదు . 

పురుషాధిక్యత రానివ్వదు. 


నువ్వు సింహం లాంటోడే .

 అలాగే పెత్తనం చేస్తూ బతికావ్ .

 ఇప్పుడు ముసలి సింహం లాగే నీ బతుకు . 

ఎమోషనల్ బ్రేక్ డౌన్ . 

కూతురు ఇంట్లో ఉండలేవు .. కొడుకు ఇంట్లో ఉండలేవు .. వృద్ధాశ్రమానికి పోలేవు .. అదొక నామోషీ ..

 ఇన్నాళ్లు నిన్ను అర్థం చేసుకొన్న నీ భార్య .. పాపం ఆమె మాత్రం ఎన్ని రోజులు భరిస్తుంది .?

కొడుకుతో కూతురితో బతకొద్దా? 

మనవళ్లు మానవరాండ్రు .. నీ దగ్గరికి వస్తే అయిదు నిమషాలు.. ఆమెతో అయితే రోజంతా గడుపుతారు . 

అందరికీ దూరం  అయ్యావు .

 గతాన్ని తిరిగి తేలేవు.. 

వర్తమానాన్ని ఒప్పుకోలేవు. 

ఏమి బతుకు రా సామీ !


అంతేలే .. నువ్వేమి చేయగలవు ?? 

కాలం మారింది . ఉమ్మడి కుటుంబాలు పోయాయి . 


అమెరికా లో ... ఆస్ట్రేలియా లో పిలల్లు .   వాళ్ళ  బతుకులు వాళ్ళు బతకొద్దా ?

ఊళ్ళో నుంచి ఉద్యోగం కోసం నువ్వు ఆ రోజుల్లో టౌన్ కు రాలేదా ?


 బాధ ను గుండెల్లో దాచుకోకయ్యా!

"అమ్మా.. తల్లీ.. పురుషాధిక్యత  ముళ్ల  కిరీటం .. నాన్నను అర్థం చేసుకున్నోరు లేరు ".. అని  చెప్పు ..

"  పురుషాధిక్యత వద్దు రా..  నా బంగారు తండ్రి" అని కొడుక్కి కూడా చెప్పు .. 

డీప్ స్టేట్ గాళ్ళు పురుషాధిక్యత పేరు చెప్పి పెళ్లిళ్లు కాకుండా యువజనం బ్రెయిన్ వాష్ చేస్తున్నారు .


 సింహం అడవికి రారాజే .


 తన దర్పం .. దాష్టీకాలకి అది...  ఇదే జన్మలో కష్టాలు అనుభవించి కుక్క చావు .. కాదు కాదు .. సింహం చావు చస్తుంది .

 సింహాన్ని అర్థం చేసుకొన్న సమాజం ... నాన్న ను అర్థం చేసుకోదు. పురుషాధిక్య నాన్న చచ్చిపోయాడు . 

మిగిలిన వాళ్ళు కూడా చచ్చి పోతారు . 

బాధ కరమయిన చివరి రోజులు అనుభవించి పోతారు . 

అర్థం చేసుకోండి తల్లులూ .. ఈ సింహం  బతుకొద్దు తండ్రులూ!


చివరిగా ఒక మాట !

అమ్మా.. కొంతమంది మహిళలు పురుషాధిక్యత కింద నలిగి పోయిన మాట వాస్తవం . 

మీ బతుకులో .. మీ భర్త తాగుబోతు .. తిరుగుపోతు అయివుండొచ్చు . వాడిని భరించల్లేక మీరు దూరం జరిగి హాయిగా బతుకుతుండవచ్చు . అక్కడి దాక మీకు హాట్స్ ఆఫ్ .

 కానీ సోషల్ మీడియా దొరికిందని మీకు    కాలక్షేపం   కోసమో .. ఫెమినిస్ట్ అని పేరు కోసమో ..

...  మొత్తం పురుష జాతి పై విషం చల్లుతూ పోస్ట్ లు పెట్టి యువత మనస్సు కకావికలం చెయ్యొద్దు ...

...  సమాజం అనే నౌకకు చిల్లి పెట్టొద్దు . 

మీ నాన్న మగాడే . మీ కొడుకు మగాడే .

స్త్రీ.. పురుషుడు కలిస్తేనే జీవితం . సమాజం .

పచ్చటి కాపురాల్లో నిప్పులు పొయ్యొద్దు .

ఐదు వారాల అద్భుత వ్రతం, ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం.

 శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే ఐదు వారాల అద్భుత వ్రతం, ఈ మార్గశిర లక్ష్మీవార  వ్రతం.


* మార్గశిరమాసం గురువారము లక్ష్మీదేవి పూజ.. అప్పులూ.. కష్టాలు తీరుతాయి..! *


మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన మార్గశిరమాసం కొనసాగుతుంది. ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పండితులు చెబుతున్నారు. 


మార్గశిర మాసం కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.


మార్గశిర మాసంలో ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసంలో లక్ష్మీ పూజ చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వ్రతం చేస్తే ఆర్థికంగా బలపడతారని పండితులు చెబుతున్నారు.


ఈ ఏడాది ( 2025) మార్గశిర మాసం మొదటి గురువారం నవంబర్​ 27 వ తేది వచ్చింది. గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.


*🌴 మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం 🌴*


ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారూ ఇళ్ళను గోమయం (ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4 వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో..


మహర్షి ! ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు.


గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది*. "లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు."


నారదుడు: మహనీయా!  ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి" అనగా.... పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు.


ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో *స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. 


విష్ణుమూర్తి కూడా ఆ వెనకాతలే పయనమై భూలోకానికి వచ్చి, ఒక ముసలి బ్రహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ . ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి? అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ,  అమ్మా ! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.


మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో , బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం.


*🌻 పఠించ వలసిన మంత్రాలు 🌻*


ఓంశ్రీమహాలక్ష్మ్యై నమః.. అనే లక్ష్మీ మంత్రం 108 సార్లు. 

ఓంశ్రీమహాలక్ష్మీవిద్మహే... విష్ణుపత్న్యైచాధీమహి ...తన్నోలక్ష్మీ ప్రచోదయాత్..లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించండి.


లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. 


రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచి పెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి,  పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.


ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి, పొయ్యి బూడిద తీయకపోయిన, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి చిమ్మదో, అంట్లుకడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది.


అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు, నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట, ఆశుభ్రప్రదేశాలలో తిరగడం, అత్తమామాలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ, ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసంధర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్యా , సంక్రాంతి (ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది) తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి (నరకానికి) పోతుంది.


జ్ఞానంతో స్త్రీ,  పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధ పదార్ధములను తినకుండా, నక్తం (ఒంటిపూట, ఒకపొద్దు) ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది.

https://whatsapp.com/channel/0029Vb6FSig60eBmzyf6qs44



ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని(ముఖం పెట్టి) భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవంయందు, బ్రాహ్మణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి , పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది. అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి వివరించి, ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.


ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి , ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి , లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది


ఓ భక్తురాలా ! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో , ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది. అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు.

స్వస్తి.. మీ సురేష్

రైలు ప్రయాణంలో*

 *నేను రైలు ప్రయాణంలో* 

*ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది*.


*దానిని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు ఒక *కృష్ణుడిఫోటో* *తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు*.

*ఎలా తిరిగి ఇవ్వడం*?

*ఈ పర్స్ ఎవరిదండీ? అంటూ అడిగా, అక్కడ ఉన్నవాల్లలో అందరూ పర్స్ కేసి చూశారు*, *తమ జేబులు తడుముకున్నారు*.


*ఇంతలో పక్కబెర్తులో కూర్చుని *భగవద్గీత* *చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు*.

*మీ పర్సు అని నమ్మకం ఏమిటీ? ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన*. 

*ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా!" అని అడిగాను*.

*అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే*.


*బాబూ..! అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం, అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను*.

*కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది*. *అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను*.


*నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని*.


*ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు*. *వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని*.

*వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని. వాడే నా లోకం*. *అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు*.


*నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది*.

*కొడుకు నన్ను మరచిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇపుడు తోడు*.


*నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు*.

*నా విచారానికి ఓదారుస్తాడు*.

*నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను*. *ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను*.


*భగవద్గీత* *చదువుతుంటే* *స్వయంగా ఆ జగద్గురువే నాతో* *మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప*, *శాశ్వతమైన పరమసత్యం* 

*ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను*. *జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ *బ్రహ్మవిద్యపై* *శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో*, *కనీసం నూటికి 90 మందికిపైగా* *ఇప్పటికీ దేవుని ఉవాచపై* *శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు* 

*ఆ పెద్దాయన*.


*ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి*.

*నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా*.

*పక్క స్టేషనులో రైలు ఆగింది, నేను దిగవలసినది అక్కడే*. *రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి*. *బయటకు రాగానే ఎదురుగా గోడపై*

*భగవద్గీత చదవండి,*

*శ్రీ కృష్ణుని నిజభావం తెలుసుకొనండి"* *అని వ్రాసి ఉన్న బోర్డు చూసి, దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను*. *ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని, మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు. గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను*.

*సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను. అతను దగ్గరకు వచ్చి *"భగవద్గీత"* *నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది ' క్షమించాలి అన్నాడు*. 

*ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి, ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి, ఆటోని పిలిచాను*. *ఆ పెద్దాయన చెప్పింది నిజమే., భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది*.

 

*భగవంతుడు తప్ప మనల్ని కాపాడేవాడే లేడు...* *నిత్యం మనకు ఎన్ని పనులు వున్నా భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు. ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే! మనకు జీవితమంతా తోడుగా ఉండి.. నడిపిస్తాడు.

                        🙏

డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

 పత్రికా ప్రకటన 

తిరుమల, 2025 నవంబర్ 26


డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు


డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.


- డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి.

- డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.

- డిసెంబర్ 5న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

- డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.

- డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.

- డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొర.

- డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, శ్రీవారి స్వర్ణ రథోత్సవం.

- డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.

--------------------------------

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.



అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః ।

అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ।। 18 ।।



ప్రతిపదార్థ: 



అంత-వంతః — అంతము కలిగిఉన్న (నశించిపోయేవి); ఇమే — ఇవి; దేహాః — భౌతిక శరీరాలు; నిత్యస్య — ఎప్పటికీ ఉండే; ఉక్తాః — చెప్పబడినవి; శరీరిణః — దేహమునందున్న జీవాత్మ; అనాశినః — నాశరహితమైనది; అప్రమేయస్య — అపరిమితమైన, కొలవశక్యము కాని; తస్మాత్ — కాబట్టి; యుధ్యస్వ — యుద్ధం చేయుము; భారత — భరత వంశీయుడా, అర్జునా.



తాత్పర్యము :


ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యముకానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.


 వివరణ:


స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారయినదే. మట్టియే కూరగాయలుగా, ఫలములుగా, ధాన్యముగా, పప్పుదినుసులుగా, మరియు గడ్డిగా మారుతుంది. ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి. మనము మనుష్యులము ఈ ఖాద్య పదార్థములన్నీ భుజించగా, అవి మన శరీరముగా మారుతాయి. కాబట్టి, శరీరము మట్టితో తయారయ్యిందని అనటంలో అతిశయోక్తి లేదు.


మరణ సమయంలో, ఆత్మ వెళ్ళిపోయిన తరువాత, శరీరము మూడు రకాలుగా అంతమవ్వచ్చు. క్రిమి, విద్, లేదా భస్మ. అది కాల్చివేయబడితే, అప్పుడు అది భస్మముగా మారి మట్టిగా అయిపోతుంది. లేదా, అది పాతి పెట్టబడితే, అప్పుడు క్రిమికీటకాలు దాన్ని తిని మళ్లీ మట్టిగా మారుస్తాయి. లేదా అది నదిలో విసిరి వేయబడవచ్చు, అప్పుడు నీటి (సముద్ర) ప్రాణులు దాన్ని తమ ఆహారంగా చేసుకుని వ్యర్థంగా విసర్జిస్తాయి, అది చిట్టచివరికి సముద్రగర్భంలోని మట్టిలో కలిసి పోతుంది.


ఈ ప్రకారంగా, జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనగుతుంది. అది ఖాద్య పదార్థాలుగా మారుతుంది, శరీరాలు ఆ ఖాద్య పదార్థాలతో తయారవుతాయి, మరల, ఈ శరీరాలు తిరిగి మట్టి లోనికే చేరుతాయి. బైబిలు ఇలా పేర్కొంటుంది: ‘నీవు మట్టియే గనుక, నీవు తిరిగి మట్టిలోనికే తిరిగి చేరుకుందువు’ (For dust thou are, and unto dust thou shalt return. - Genesis 3:19). ఈ వాక్యం భౌతిక శరీరాన్ని ఉద్దేశించినది. శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, ‘ఆ భౌతిక శరీరంలోన, నిత్యమైన, నాశరహితమైన అస్తిత్వం ఒకటి ఉన్నది, అది మట్టితో చేయబడలేదు. అదే దివ్య జీవాత్మ, నిజమైన నేను’

27నవంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌷గురువారం🌷*

 *🌹27నవంబర్2025🌹*     

    *దృగ్గణిత పంచాంగం*                  


           *స్వస్తి శ్రీ విశ్వావసు*

           *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : సప్తమి* ‌రా 12.29 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ధనిష్ఠ* రా 02.32 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : ధ్రువ* మ 12.43 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం  : గరజి* మ 12.20 *వణజి* రా 12.29 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 08.00 - 10.00 & 11.00 - 12.00 సా 04.00 - 06.30* 

అమృత కాలం  : *సా 03.42 - 05.22*

అభిజిత్ కాలం  : *ప 11.33 - 12.18*

*వర్జ్యం    : శేషం ఉ 07.22 వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 10.03 - 10.48 మ 02.33 - 03.18*

*రాహు కాలం   : మ 01.19 - 02.44*

గుళికకాళం      : *ఉ 09.06 - 10.31*

యమగండం    : *ఉ 06.18 - 07.42*

సూర్యరాశి : *వృశ్చికం*                   

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 06.28*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.18 - 08.33*

సంగవ కాలం         :     *08.33 - 10.48*

మధ్యాహ్న కాలం    :    *10.48 - 01.03*

అపరాహ్న కాలం    : *మ 01.03 - 03.18*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ సప్తమి*

సాయంకాలం        :*సా 03.18 - 05.33*

ప్రదోష కాలం         :  *సా 05.33 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.30*

నిశీధి కాలం          :*రా 11.30 - 12.21*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.36 - 05.27*

*****************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*#ఓం శ్రీ గురు దత్తాయ నమః*


*దత్త విద్యాఢ్యలక్ష్మీశ* 

*దత్త స్వాత్మస్వరూపిణే*

*గుణనిర్గుణరూపాయ*  

*దత్తాత్రేయ నమోఽస్తుతే*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - సప్తమి - ధనిష్ట -‌‌ గురు వాసరే* (27.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*