ఆనందోబ్రహ్మ
శా॥
ఆనందమ్మది లౌకికమ్ము కన నిత్యమ్మౌచు నిల్వంగరా
దానందమ్మన శాశ్వతమ్మయిన బ్రహ్మానందమేయౌనుబో
ఆనందామృతసాగరీలహరు లాస్వాదించ సంతృప్తియౌ
నానందింత మమందసుందరమహానందముం బొందగన్
*~శ్రీశర్మద*
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
ఆనందోబ్రహ్మ
శా॥
ఆనందమ్మది లౌకికమ్ము కన నిత్యమ్మౌచు నిల్వంగరా
దానందమ్మన శాశ్వతమ్మయిన బ్రహ్మానందమేయౌనుబో
ఆనందామృతసాగరీలహరు లాస్వాదించ సంతృప్తియౌ
నానందింత మమందసుందరమహానందముం బొందగన్
*~శ్రీశర్మద*
🔔 *తీర్థ యాత్ర*🔔
*ద్వివింశతి తీర్థాలు*
*రామేశ్వరంలో శ్రీ రామనాథస్వామి ఆలయంలోని 22 తీర్థాల (బావుల) పేర్లు, కథ, ప్రత్యేకత, ఆధ్యాత్మిక ఫలితాలు, స్నానం క్రమం సహా వివరాలు అత్యంత లోతుగా తెలుసుకుందాం*.
*రామేశ్వరం 22 బావులు – పూర్తి వివరణ*
*22 బావుల ఉద్భవం – పురాణం*
రామాయణంలో రాముడు రావణవధ అనంతరం రామేశ్వరం లో శివలింగ ప్రతిష్ట చేసి పూజించాడు.
శివపూజ కోసం దివ్య తీర్థాలు కావాలి. రాముని భక్తి చూసిన సముద్ర దేవుడు ఒకే రాత్రిలో 22 పవిత్ర తీర్థాలు ఉద్భవింపజేశాడు. ప్రతీ బావిలోని నీరు రుచి, ఉష్ణత, గుణం వేరుగా ఉండటమే దాని వైభవం.
రామేశ్వరం 22 బావుల పేర్లు మరియు ప్రత్యేకతలు
1. మహాలక్ష్మీ తీర్థం
ధన-సంపద ప్రసాదం.
మనసు శుద్ధి, దారిద్ర్య నివారణ.
2.సావిత్రీ తీర్థం
వాక్పటిమ, విద్య, మానసిక శక్తి.
ప్రవచనం, గానం, అధ్యయనంలో పురోగతి.
3. గాయత్రీ తీర్థం
పాపక్షయము.
జపసిద్ధి, మానసిక ప్రశాంతత.
4. సరస్వతీ తీర్థం
విద్య, కళలలో అభివృద్ధి.
మాట, జ్ఞానం పవిత్రమవుతుంది.
5. సేతు మాధవ తీర్థం
రామసేతు వైభవానికి సూచకం.
కుటుంబ సమైక్యత, శుభకార్య సిధ్ధి.
6. గంధమాధన తీర్థం
దేహ పవిత్రత.
శరీర సంబంధ వ్యాధి నివారణ, శాంతి.
7. గవాక్ష తీర్థం
శివదర్శనం సులభం అవుతుంది.
గ్రహదోష నివారణ.
8. నల తీర్థం
నల మహర్షి కృప.
వివాహ యోగం, కుటుంబ ఐక్యత.
9. నీల తీర్థం
ధైర్యం, శౌర్యం పెరుగుతాయి.
10. శంఖ తీర్థం
విష్ణుప్రసాదం.
సంపూర్ణ శాంతి, భయ నివారణ.
11. చక్ర తీర్థం
సుదర్శన చక్ర శక్తి.
పాప నాశనం, కష్ట నివారణ.
12. బ్రహ్మ హతీ విమో చన తీర్థం
బ్రహ్మ హత్యా దోషం కూడా భస్మం అవుతుంది.
సృష్టి శక్తి.
కొత్త ప్రారంభాలు విజయవంతం.
13. శివ తీర్థం
పరమ శివానుగ్రహం.
రోగాలు, అపశకునాలు శాంతిస్తాయి.
https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B
14. సూర్య తీర్థం
పుణ్యఫలం, ఆరోగ్యం, ఓజస్సు.
శరీర కాంతి.
15. చంద్ర తీర్థం
మానసిక శాంతి.
మనసు నిలకడ, కోప నివారణ.
16. గంగా తీర్థం
అఖండ పాప పరిహారం.
జీవితంలో శుభప్రవాహం.
17. యమునా తీర్థం
దారిద్ర్య నిర్మూలనం.
శాంతి, సౌమ్యత.
18. గోదావరి తీర్థం
శక్తి ప్రసాదం.
దీర్ఘాయుష్షు.
19. సరస్వతీ తీర్థం (మరొక రూపం)
సంస్కార శుద్ధి.
కర్మ సిద్ధి.
20. నర్మదా తీర్థం
శక్తిమంత జలశుద్ధి.
రుణవిమోచనం.
21. సింధు తీర్థం
ప్రభావశీలత, బలసంపత్తి.
విఘ్న నాశనం.
22. కోటి తీర్థం
త్రిభువన శక్తి.
*అన్ని బావుల సారాంశంగా పుణ్యఫలం ఇస్తుంది.*
*ఇదే 22వ మరియు అత్యంత శక్తివంతమైన బావి.*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
ఒక నీతి కధ. ఓపిక తో చదవండి
‘‘ఏమండీ, రాత్రి మామయ్యగారు ఫోన్ చేశారు- మీరెప్పుడొస్తారని.
మీరేమో నా సెల్ నంబరు ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వచ్చు కదా’’
హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని.
ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్‌లో తల దూర్చిన భర్తతో ‘‘ఏంటండీ, ఏం మాట్లాడరు... ఏమాలోచించారు,
వాళ్ళ విషయం గురించి. ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్ చేస్తూనే ఉంటారు.
వూరికే నాన్చక ఏదో ఒకటి తేల్చండి’’ అంది.
ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయి ఉంది తను.
పేపర్‌లో నుంచి తల పైకెత్తి ‘‘ఇందులో తేల్చేదేముందోయ్, అమ్మా నాన్నా ‘ఇక ఆ పల్లెటూళ్ళొ ఒంటరిగా ఉండలేం, ఇక్కడకు వచ్చేస్తా’మంటున్నారు,
అంతేకదా! పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి.
వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటీ’’ అన్నాడు.
అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు ‘
‘ఏంటీ, తాతయ్య, నానమ్మ ఇక్కడకే వచ్చేస్తున్నారా, భలేభలే!
తాతయ్య కథలు చాలా బాగా చెపుతాడు.
నానమ్మయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది.
ఇంక రోజూ మేం తాతయ్యా నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ’’ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. ‘‘చాల్లే నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం’’ అని భర్త వైపు తిరిగి,
‘‘ఏంటండీ రానిచ్చేది, ఇక్కడ మనమెలా ఉంటున్నాం, మీ అమ్మా నాన్నా ఎలా ఉంటారు?
ఆ పల్లెటూరి మాటలూ, చేతలూ ఎలా ఉంటాయో మీకు తెలుసుగా! మనింటికి పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తారు.
వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు. పోయినసారి మనింట్లో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజరుగారి భార్య ఏమందో తెలుసా... ‘
ఈవిడ మీ అత్తగారా! నేను మీ వంటమనిషనుకున్నాను’ అంది.
నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళొనే ఉండమనండి.
కావాల్సినంతమంది పనివాళ్ళని పెడదాం. లేదూ ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్‌హోమ్‌లోనైనా చేర్పించండి.
డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకానీ, ఇక్కడకు మాత్రం తీసుకొస్తానని అనకండి’’ అంది.
ఆమె మాటలు పూర్తి అయ్యీ కాకముందే ‘‘ఇక ఆపుతావా నీ గోల.
ఏంటీ, మాట్లాడితే మా అమ్మానాన్నలను పల్లెటూరివాళ్ళంటావు. అలాగైతే నేనూ పల్లెటూరివాణ్ణేగా,
నువ్వు మాత్రం పల్లెటూరిదానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వూ మీ అన్నా అక్కడ చదువు వెలగబెట్టారు.
మీ అమ్మానాన్నా పల్లెటూరివాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళుమాత్రం ఎలా ఉన్నారు?
మీ అన్నయ్యకు ఉద్యోగమొచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్ళటంతో కొంచెం సిటీలైఫ్ వాళ్ళకి అలవాటైంది.
నేనే ఇన్ని రోజులూ అశ్రద్ధ చేశాను. మావాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది. మా అమ్మేదో మొహమాటానికి ‘ఇప్పుడే మీ దగ్గరకెందుకులేరా! రేపు చేసుకోగలిగే ఓపిక లేనిరోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా’ అన్నదని, ‘
ఔను అత్తయ్యగారూ, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు- తొందరేముందీ! పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు, ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్ళలో ఉండలేరు.
మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా! మన సొంతిల్లయితే ఏ సమస్యా ఉండదు’ అంటూ వాళ్ళని రానీకుండా అడ్డుపుల్ల వేశావు.
ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు.
ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా!
అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వేదో వాళ్ళకి బండచాకిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు.
పైగా ఓల్డేజ్‌హోమ్‌లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్నకొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా.
రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందువుగానీలే ఓల్డేజ్‌హోమ్‌లో’’ అంటూ లేచి వెళ్ళి షర్ట్ వేసుకుని బయటికెళ్ళిపోయాడు కోపంగా.
భర్త తన మాట కాదనటంతో ఏం చేయాలో అర్థంకాలేదామెకి.
ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది.
పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు.
అత్తగారూ, మామగారూ మంచివాళ్ళే కానీ, కలిసుంటే తప్పక తేడాలొస్తాయనీ తగవులౌతాయనీ భయం.
తన క్లోజ్‌ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే, గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయమింకా బలపడింది.
చివరికి పల్లెటూరివాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు.
పైగా భర్తకి కూడా అమ్మానాన్నలంటే ఒకింత ప్రేమ ఎక్కువే.
కొడుకు ఇల్లు కట్టేటప్పుడూ ఇతరత్రా అవసరాలపుడూ అతను అడగకుండానే డబ్బులూ బంగారం అంతా ఇచ్చేశారు.
అప్పుడప్పుడూ వచ్చి నాల్రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.
తెల్లారిపొద్దున లేచి తయారవుతున్న భర్తను ‘ఎక్కడికి’ అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ‘ఆయనే చెపుతార్లే’ అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది.
కాఫీ అందుకుని ‘‘రజనీ, నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు, ఇంటి గురించీ మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మానాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను’’ అంటూ, ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకెళ్ళిపోయాడు.
ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది.
కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది.
వెంటనే సెల్ తీసుకుని అన్నకు ఫోన్ చేసింది. ఆమె అన్న వినోద్ నాలుగైదు సిటీలలో జాబ్ చేసి, చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు.
వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ వెళ్ళటానికి కుదరలేదు.
అమ్మానాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్‌లో వెళ్ళాలని అనుకుంటోంది. ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది- వినోద్ ఫోన్ తీయలేదు.
అమ్మావాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్ లేదు. అన్నయ్య ఫోన్‌లోనుండే మాట్లాడతారు. ‘ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా’ అంటే, ‘అదంతా మాకు తెలియదమ్మా. ఇక్కడ అంతా హిందీ కదా... అన్నయ్య ఉన్నాడుగా అంటుంది.’
ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్యే! ఫోనెత్తగానే ‘‘రజనీ, నేను వేరేచోట మీటింగ్‌లో ఉన్నారా.
సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను. ఉంటాను’’ అంటూ హడావుడిగా పెట్టేశాడు.
'అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే’ అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకి తయారుచేయటానికి లేచింది.
సాయంత్రమయింది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక, వాళ్ళకి స్నాక్స్ పెట్టి, పాలు ఇచ్చి, టీవీ దగ్గర కూర్చుంది.
రాత్రి ఎనిమిది గంటలైంది. మాధవవాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకుని ‘‘బాగున్నారా అత్తయ్యగారూ, ఆరోగ్యం బాగుందా మామయ్యగారూ’’ అంది రజని- తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా.
పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘తాతయ్యా, నానమ్మా’’ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు.
అమ్మా నాన్నా వచ్చినపుడు భార్య ‘ఏ మూడ్‌లో, ఎలా ఉంటుందో’ అని భయపడుతున్న మాధవ తేలికగా వూపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు.
అత్తమామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్‌రూమ్‌లో గీజర్ ఆన్ చేసింది. ‘‘అత్తయ్యగారూ, మీరూ మామయ్యగారూ స్నానం చేసి రండి. ఈలోపు నేను భోజనాలు రెడీ చెస్తాను’’ అంది.
‘‘అలాగేనమ్మా. మేము వస్తాములే, నువ్వెళ్ళి పనిచూసుకో’’ అంది మాధవ తల్లి సీతమ్మ.
అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి, పడుకునేసరికి పదకొండయింది.
తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్‌బెల్ అదే పనిగా మోగుతోంది.
‘ఈ టైములో ఎవరై ఉంటారబ్బా’ అనుకుంటూ నిద్రకళ్ళతో వచ్చి తలుపు తీసింది.
ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే, ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది.
ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా ‘‘బాగున్నారా మామయ్యగారూ, అత్తయ్యగారూ’’ అంటూ వారిని పలకరించి, ‘‘ముందు లోపలికి రండి, చలిగా ఉంది’’ అని, ‘‘ఏంటలాగే నిలబడిపోయావు రజనీ, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకీ నాన్నగారికీ కాఫీ కలిపి తీసుకురా త్వరగా’’ అన్నాడు.
‘‘రా అమ్మా, రండి నాన్నా’’ అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కనపెట్టి, తలుపులు మూసి కిచెన్‌లోకి వెళ్ళింది.
పెoదలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్‌బెల్ మోతకి లేచి హాల్లోకి వచ్చారు.
అందరి పలకరింపులయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.
‘వీళ్ళేంటి ఇంత సడెన్‌గా వచ్చారు. మా అమ్మా నాన్నా విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్‌చేసి పిలిపించి ఉంటుందా?’-
అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ.
కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది.
మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారతనికి.
ఇదివరకున్న సంతోషం, కళా, కాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించటంలేదు. అతనికన్నా ముందుగానే, తల్లిదండ్రులను చూసిన మరునిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోని తేడాని గమనించేసింది రజని.
ఎంతైనా కూతురు గదా!
‘‘వదినగారూ, అంత దూరంనుండి మీ ఇద్దరే వచ్చారా!’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.
‘‘లేదొదినగారూ, మాతో వినోద్ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట. వెళ్తున్నానన్నాడు.
‘మేమూ వస్తాంరా, అమ్మాయి దగ్గరికి’ అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి, వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాడు’’ అంది.
‘‘అన్నయ్య వచ్చాడా... అయితే ఇక్కడకి రాడటనా?’’ కోపంగా అంది రజని.
‘‘లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆరోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురమూ’’ అంది రజని తల్లి సావిత్రమ్మ.
‘‘అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క పదిరోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు, అన్నయ్యను రానీ, నేనడుగుతాను’’ అంది.
‘‘వద్దమ్మా, అడగొద్దు. అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళమూ మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా... అందుకని వెళతాంలే’’ అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి, ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి.
మాధవ, పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది.
అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి, కాసేపు మాట్లాడి వచ్చేసింది.
ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడూ తరవాత కూడా వాళ్ళ నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకూ కుదరలేదు.
రాత్రి భోజనాలయిన తరవాత మాధవ, పిల్లలు- అత్తమామల గదిలోకెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకెళ్ళింది.
తల్లి ఒక్కతే ఉంది. ‘‘నాన్న ఏరమ్మా?’’ అంది.
‘‘మీ అత్తయ్యగారి గదిలోకెళ్ళారమ్మా. అబ్బాయీ పిల్లలూ కూడా అక్కడే ఉన్నారుగా- మాట్లాడుతున్నారు.’’
సరే, నాన్న లేకపోయినా ఫరవాలేదులే అనుకుని ‘‘అమ్మా, నువ్వూ నాన్నా అలా ఉన్నారేంటి?
ఉదయం నుండీ ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా’’ అంది.
కూతురలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి.
కొంతసేపటికి ‘‘ఏం చెప్పను తల్లీ, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక.
ఇప్పుడు, ఇన్నాళ్ళకి- మీ వదినకి మేమూ మా మాటలూ చేతలూ నచ్చటం లేదు.
ఇంటికి పెద్దపెద్ద ఆఫీసర్లూ కలెక్టర్లూ వస్తారట. పార్టీలు జరుగుతాయట.
వాళ్ళల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో, ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది.
ఆరునెలలక్రితం మమ్మల్ని ఓల్డేజ్‌హోమ్‌లో చేర్పించారు.
అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటే,
ఇప్పుడు వాడు పనిమీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటపుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్‌లో వదిలేసి,
వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు.
చూడమ్మా రజనీ, ఎంతో ఆశతో బిడ్డల్ని కనీ,
మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచీ పెద్దచేసి, చదివించి,
వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు.
పెళ్ళిచేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ,
కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులయినా.
కానీ, కొడుక్కి పెళ్ళిచేసి, కొడుకుని కోడలి చేతికప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి,
తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధా వేదనా ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది.
వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు.
‘మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు’ అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులయినా ఎలా తట్టుకోగలరు’’
అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.
‘‘మీ అన్నలాగా డబ్బున్నవాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసి పోతున్నారు.
డబ్బులేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ ఖర్మానికి రోడ్లమీద వదిలేసి పోతున్నారు.
పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పనిచేసుకుని బతుకీడుస్తున్నారు.
పని చేయగలిగే శక్తి లేనివాళ్ళు పనిచేయలేక,
తిండిలేక,
అడుక్కోవటానికి ముఖం చెల్లక, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లీ!
కొంతమంది, కొంతమందేంటి... చాలామంది కోడళ్ళు ‘అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటివారే కదా’ అని అనుకోకపోవటమే.
అందుకే, ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది.
అక్కడ మేం బతికున్నాం అంటే, ఉన్నాం అంతే!
మా మనసులెంత కుమిలిపోతున్నాయో నీ అన్నావదినలకు అక్కరలేదు.
మాకు ఈ శిక్ష ఎందుకుపడిందో తెలీదు కానీ,
మేమనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా’’ అంటూ,
మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి.
తల్లి మాటలకు రజనీకి చెంపమీద ఛెళ్ళున చరిచినట్లనిపించింది అంత బాధలోనూ.
‘‘వూరుకోమ్మా, వూరుకో... అన్నయ్యిలా చేయడమేమిటి? వాడొచ్చాక నేను మాట్లాడతాను’’ అంది ఏడుస్తూ.
తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది.
దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, ‘‘మీ అత్తయ్యగారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది.
వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోగానీ, నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది.
నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు’’ అంది.
తల్లి మాటలకు గిల్టీగా ఫీలయింది రజని.
ఇంకానయం, తను అన్నతోగానీ, తల్లితోగానీ మాట్లాడకపోవటమే మంచిదయిందనుకుంది.
అంతలో మాధవ పిలవటంతో, ‘‘సరే, పడుకోండమ్మా, పొద్దుపోయింది’’ అంటూ వెళ్ళిపోయింది.
మూడోరోజు ఉదయం వినోద్ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది.
అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకూ అలాగే జరిగిపోయింది.
సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక, వినోద్- తల్లితో ‘‘అమ్మా, ఇక బయలుదేరుదాం. ఎనిమిది గంటలకు ట్రైన్ ఉంది’’ అన్నాడు.
అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది.
అంతలో మాధవ గొంతు సవరించుకుని ‘‘చూడు వినోద్, ఇకనుండి
అత్తయ్యగారూ మామయ్యగారూ మా ఇంట్లో, మా దగ్గరే ఉంటారు’’ అన్నాడు.
అతని మాటకు వినోద్, రజనీ, అత్తమామలూ విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి వూహించని పరిణామం.
‘‘అదికాదు బావా!’’ అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్.
‘‘ఇంకేం చెప్పకు, నీవక్కడకు తీసుకెళ్ళినా, హోమ్‌లోనే కదా వాళ్ళుండేది.
ఇక్కడుంటే కూతురి దగ్గరున్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి.
ఇంటికి పెద్దదిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్.
అమ్మానాన్నలంటే మనమెప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం.
పెద్దవారితో కలిసి ఉండాలి,
వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి.
అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి.
ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి.
ఇప్పుడు నువ్వు మీ అమ్మానాన్నలని చేసినట్లే, రేపు నీ కొడుకులు నిన్ను చేయరా!
దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థంకాదులే.
నేనేమీ కోపంగా చెప్పటం లేదు వినోద్. వాళ్ళిక్కడుంటే వాళ్ళకీ మనశ్శాంతిగా ఉంటుంది.
మాకూ ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది.
మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక నువ్వేం ఆలోచించక బయల్దేరు’’ అన్నాడు.
వినోద్ తల దించుకుని వెళ్ళిపోయాడు.
మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి.
అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
గదిలోకి వెళ్ళటంతోనే మాధవ పాదాలమీద వాలిపోయింది రజని.
‘‘ఏయ్ ఏంటిదీ, లే, లే...’’ అంటున్న అతనితో-
‘‘ఇన్నాళ్ళూ మీతో కలిసి కాపురంచేసి కూడా మీ మనసు అర్థంచేసుకోలేకపోయానండీ.
అత్తయ్యా వాళ్ళవిషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను.
నన్ను క్షమించండి.
మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయం ఇచ్చారు.
మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను’’ అంది ఏడుస్తూ.
‘‘పిచ్చి రజనీ, నాకు మా అమ్మానాన్నా, మీ అమ్మానాన్నా వేరుకాదు.
ఆరోజు మీ అమ్మ నీతో చెప్పినపుడే మీ నాన్నగారు మాకు చెప్పారు.
అప్పుడే అమ్మానాన్నా నేనూ ఇలా నిర్ణయించుకున్నాం.
నిన్ను సర్‌ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు.
ఏదో చిరాకులో మాట్లాడతావుగానీ నీ మనసెలాంటిదో నాకు తెలీదా’’ అన్నాడు.
అతనికి తనపైగల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీలైంది.
హాల్లోకొచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు.
వెళ్ళి వాళ్ళ పాదాలకి దణ్ణం పెట్టుకుంది. తరవాత తల్లికీ తండ్రికీ కూడా.
‘‘ఇదేంటమ్మా, ఇప్పుడెందుకూ...’’ అని అడిగిన వాళ్ళకు,
ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ‘ఈటీవీ శుభమస్తు’లో చెప్పారండీ’’ అంది.
‘మా కోడలెంత బంగారం’ అని అత్తమామలూ, ‘కూతురెంత పద్ధతికలదో’ అని తల్లిదండ్రులూ మురిసిపోతుంటే,
గదిలోనుండి అది చూసిన మాధవ- రజని తెలివికి నవ్వుకున్నాడు..
ఇప్పుడు మనం ఏదయితే చేస్తామో అదే చివరకి మనకి జరుగుతోంది..
దయచేసి అర్థం చేసుకోగలరు.
మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకుందాం..
మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తునిదాం..
శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹
ప్రతి మనిషి లోను .. అతడు సామాన్యుడైనా, సంపన్నుడైనా అతడిలో దాన గుణం తప్పనిసరిగా ఉండాలి. దాన గుణం లేనివాడు దానవుడవుతాడు. దానగుణం లేకపోయిన శ్వేత మహారాజుకు ఏం జరిగిందో.. అగస్త్యుడు శ్రీరాముడికి చెప్పిన ఈ కథలో వినండి. మన పురాణ కథలు శీర్షిక కింద ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అందిస్తున్న 8 వి కథ. అన్నీ క్రమం తప్పకుండా పూర్తిగా వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి. శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*🌞ఆదివారం 14 డిసెంబర్ 2025🌞*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
7️⃣4️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*74 వ రోజు*
*వన పర్వము ప్రథమాశ్వాసము*
*అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట*```
వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది.
అర్జునుడు కిరాతునితో “నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా?” అన్నాడు.
ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా” అన్నాడు శివుడు.
అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ లేదు. అర్జునునకు ఆశ్చర్యం వేసింది “ఇతను సామాన్యుడు కాదు”దేవేంద్రుడైనా పరమ శివుడైనా అయి ఉండాలి" అనుకున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి" అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు వేసే బాణములనన్నీ శివుడు పర్వతం శిలావర్షాన్ని స్వీకరించి నట్లు స్వీకరించాడు. అక్షయ తూణీరాలలోని బాణాలు అన్నీ అయిపోయాయి. గాండీవం తీసుకుని కొట్టగా అతని చేతిలోని గాండీవం అదృశ్యం అయింది. ఖడ్గం తీసుకొని శివుని శిరస్సుపై బలమంతా ప్రయోగించి కొట్టగా ఖడ్గం ముక్కలై పోయింది. చెట్లతోనూ శిలలతోను యుద్ధం చేశాడు. అన్నిటిని శివుడు తనలోనికి తీసుకున్నాడు. ఇక పిడికిళ్ళతో శంకరుడిని కొట్టనారంభించాడు. కిరాతార్జునులిరువురు భయంకరంగా ద్వంద యుద్ధం చేయసాగారు. కొంతసేపటికి అర్జునుడు శివుని దెబ్బలకు తాళలేని మూర్చబోయాడు. కాసేపటికి తేరుకుని రక్తసిక్తమైన తన శరీరమును చూసుకొని మట్టితో శివలింగమును చేసి పుష్పములు, మాలలతో పూజించాడు. అప్పుడు పార్ధివ లింగంపై తను పూజించిన మాల కిరాతుని శిరస్సుపై కనిపించింది. ఆశ్చర్యపోయిన అర్జునుడు కిరాతకుడే శివుడని గ్రహించి కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. "పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు" అన్నాడు.
అంత నిజ రూపంలో ప్రత్యక్షమైన శివుడు “అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి. ఇదిగో నీ గాండీవం. ఇంకా ఏదైనా వరం కోరుకో" అన్నాడు.
అర్జునుడు “త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు" అన్నాడు.
ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి మంత్ర,ధ్యాన,జప,హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం, సంధానం, మోక్షణము
సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు.
శివుడు అర్జునుడితో “అర్జునా! ఈ పాశుపతాన్ని ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు" అని చెప్పి అంతర్ధానం అయ్యాడు.
పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు వచ్చాడు. "అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము” అన్నాడు ఇంద్రుడు.
యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేసారు.
అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹15డిసెంబర్2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం సఫలైకాదశి*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - కృష్ణపక్షం*
*తిథి : ఏకాదశి* రా 09.19 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : సోమవారం* ( ఇందువాసరే )
*నక్షత్రం : చిత్త* ఉ 11.08 వరకు ఉపరి *స్వాతి*
*యోగం : శోభన* మ 12.30 వరకు ఉపరి *అతిగండ*
*కరణం : బవ* ఉ 08.03 *బాలువ* రా 09.19 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.30 - 07.30 & 11.00 - 12.00*
అమృత కాలం : *రా 04.15 - 06.03 తె వరకు*
అభిజిత్ కాలం : *ప 11.40 - 12.25*
*వర్జ్యం : సా 05.27 - 07.15*
*దుర్ముహూర్తం : మ 12.25 - 01.10 & 02.39 - 03.23*
*రాహు కాలం : ఉ 07.52 - 09.15*
గుళికకాళం : *మ 01.26 - 02.50*
యమగండం : *ఉ 10.39 - 12.03*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *తుల*
సూర్యోదయం :*ఉ 06.38*
సూర్యాస్తమయం :*సా 05.44*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.28 - 08.42*
సంగవ కాలం : *08.42 - 10.56*
మధ్యాహ్న కాలం : *10.56 - 01.10*
అపరాహ్న కాలం : *మ 01.10 - 03.23*
*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ ఏకాదశి*
సాయంకాలం : *సా 03.23 - 05.37*
ప్రదోష కాలం : *సా 05.37 - 08.12*
రాత్రి కాలం :*రా 08.12 - 11.37*
నిశీధి కాలం :*రా 11.37 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.46 - 05.37*
<><><><><><><><><><><><><><>
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*క్షంతవ్యో మేఽపరాధః శివ*
*శివ శివ భో శ్రీమహాదేవ శంభో*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
ఈ రోజు పంచాంగం 15.12.2025 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష ఏకాదశి తిథి ఇందు వాసర చిత్ర నకత్రం శోభన యోగః బవ తదుపరి బాలవ కరణం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శ్రాద్ధ తిథి: ఏకాదశి
నమస్కారః , శుభోదయం
*పార్వతీ పరమేశ్వరులు,కుటుంబంలో చండీశ్వరుడికి అయిదవ స్థానం ఇచ్చిన శంకరుడు అరుణాచలం లో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, తో పాటు చండీశ్వరుడు ని ఊరేగింపుగా తీసుకువెళతారు,* ఈ రోజు చండీశ్వరుడికి గురించి తెలుసుకుందాము.
✨💗ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటిని విడిచిపెట్టి కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచెలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.
ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారుచేసి సైకతప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. ఆటను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతని అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయిందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి. క్రిందపడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకతలింగంలోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మాకుటుంబంలో అయిదవవాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇకనుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతీ నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడి లాగే ఆయన కూడా. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు. మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.
ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి. మనదేశం అంతటి భాగ్యవంతమయిన దేశం. *ఓం నమో చండీశ్వరాయ నమః*🙏🪷🙇♂️
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - ఏకాదశి - చిత్ర - ఇందు వాసరే* (15.12.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*