13, ఫిబ్రవరి 2021, శనివారం

Sathsangh


 

చక్కిటి ఉపన్యాసం


 

మన మహర్షులు -21

 మన మహర్షులు -21


 తండి మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



 పూర్వం తండి అనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు. అతడు బ్రహ్మచర్యం తీసుకుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి, జ్ఞాని, మహర్షి అయ్యాడు.


సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.


తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో 'ఓ పరమేశ్వరా యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి, ప్రధానమైనవాడని భావించి, పురుషుడని పూజచేసి, అధిష్ఠాన దేవతని అర్చన చేసి, ఈశ్వరుడని ఎంచి ఊహిస్తారో అతడే నువ్వు నువ్వు ఆజుడివి, అనాదినిధనుడివి, విభుడివి, ఈశానుడివి, అత్యంతసుఖివి, అనఘుడివి నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను' అన్నాడు


పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక 'పరమేశ్వరా ! కామ క్రోధాలు నువ్వే, ఊర్ధ్వ అధోభాగాలు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వే, నిత్యానందుడవు, పరమపదమవు, దేహకర్తవు, దేహభర్తవు, దేహివి, ప్రాణుగతివి అన్నీ నువ్వే జనన మరణాలు కలిగించేది నువ్వే, దిక్కులు, యుగాలు, అయనాలు నువ్వే. రాత్రి పగలు చెవులు, కళ్ళుగా, పక్షాలు శిరస్సుగా, మాసాలు భుజాలుగా, సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండి వున్నావు,,'


ఈ విధంగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 'వత్సా నువ్వు తేజశాలివి, కీర్తిమంతుడివి, జ్ఞానివి, ఋషుల్లో గొప్పవాడివి అవుతావు. నీకేం కావాలో' అడగమన్నాడు


ఈశ్వరా! నీ దయకంటే నాకు కావలసింది ఏమీ లేదు. ఎప్పుడూ నాకు నీ పాదాల

దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు -తండి మహర్షి .


తర్వాత తండి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.


ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్ర నామాలు చెప్పమని అడిగాడు .


ఇంతకు ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు. వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో వున్న వాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు.


 భూలోక వాసుల కోసం తండి వెయ్యి నామాలు భూలోకంలోకి తెచ్చాడు. దీన్నే 'తండి కృత శివసహస్రనామస్తోత్రం' అన్నారు 


ఇది సర్వమంగళములను సమకూర్చునది. సర్వకల్మషములను నశింపజేయునది. బ్రహ్మలకు బ్రహ్మ, పరులకు బరుడు, తేజములకు దేజము, తపములకు దపము, శాంతములకు శాంతము, ద్యుతలకు ద్యుతి, దాంతులకు దాంతుడు, ధీమంతులకు దీ, దేవతలకు దేవత, మహర్షులకు యజ్ఞములకు యజ్ఞము, శివులకు శివుడు, రుద్రులకు రుద్రుడు, యోగులకు యోగి, కారణములకు గారణము, నగు హరుని అష్టోత్తర సహస్రనామములు:


ఇలా తండిమహర్షి శివ సహస్రనామ స్తోత్రమును తెలియజేసెను. వీనిని జపించినవారు సర్వకామ్య సంసిద్ధిగాంచి ముక్తులగుదురు.

 

 దీని వివరాలు మహాభారతంలోని  అనుశాసనిక పర్వం లో లభ్యమవుతాయి.


ఋషులు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. కాని వాళ్ళకి కావల్సింది ఏమీ ఉండదు. ముక్తి తప్ప...🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

భగవంతుడితో

 🛕🦚 *knvr* 🦚🛕

********************

       *శుభోదయం* 

         *శనివారం*

******************** 


ఒక రోజు రాత్రి కలలో, భగవంతుడితో, నరేంద్ర  సముద్రపు ఒడ్డున నడుస్తున్నట్టు .

అప్పటిదాకా తన  జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రతి సంఘటన లో చూస్తే నాలుగు అడుగులు కనిపించాయి. రెండు అడుగులు తనవి , రెండు అడుగులు భగవంతుడివి.

కానీ ఆఖరి సంఘటన లో చాలా కష్టమైన సమయం లో చూస్తే, రెండు అడుగులే కనిపించాయి. అప్పుడు నరేంద్రకు  ఆశ్చర్యం అనిపించి

భగవంతుడిని ఇలా అడిగాడు , స్వామీ; “మీరు అన్నారు కదా, ఒక్కసారి నా భక్తుడి చేయి పట్టుకుంటే చివరిదాకా వదలిపెట్టను అని, మరి కష్టమైన సమయం లో ఎందుకు రెండు అడుగులే కనిపిస్తున్నాయి. మీరు నన్ను ఒంటరిగా వదిలేసారా ??”

దానికి భగవంతుడు ఇలా సమాధానం చెప్పారు ” నా ప్రియమైన భక్తురాలా, కష్టసమయం లో నువ్వు చూసిన రెండు అడుగులు నావే. ఆ సమయంలో నేను నిన్ను ఎత్తు కున్నాను. నేను నిన్ను ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడుతూనే ఉంటాను.”

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️



 *నీతి:* 

భగవంతుడి పై ప్రేమ, నమ్మకం, భక్తి మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. భగవంతుడు కష్టముల  నుంచి మనము బయట పడడానికి మనము బయట పడే మార్గాన్ని చూపిస్తాడు , అంతే  కాకుండా అతి కష్టమైన పరిస్థితిలో, ఆయన మనతో పాటే ఉంటూ మన కూడా కుడా నడుస్తారు

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

మొగలిచెర్ల

 *నియమం లో మార్పు..*


ప్రతి శుక్రవారం నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది..అర్చకస్వాములు సిబ్బందీ అందరూ ఇందులో పాల్గొంటారు..అందుబాటులో ఉన్న భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు..శ్రీ స్వామివారి సమాధి ని శుభ్రం చేయడం..అదీ తమ స్వ హస్తాలతో చేయడం అరుదైన అవకాశం గా భక్తులు భావిస్తారు..ఇది ప్రతివారం జరిగే ఒక తప్పనిసరి కార్యక్రమం..ఒక శుక్రవారం నాడు జరిగిన సంఘటన ఈరోజు వివరిస్తాను..


ఆరోజు ఉదయం ఎనిమిది గంటల వేళ..కార్లో దంపతులిద్దరు వచ్చారు..సరిగ్గా ఆ సమయానికి స్వామివారి మందిరం శుభ్రం చేయడానికి అర్చకస్వాములు సమాయత్తం అవుతున్నారు..ఈ దంపతులు మందిర ప్రాంగణం లోకి రావడం చూసి.."ఎవరో దూర ప్రాంతం నుంచి వచ్చినట్లు వున్నారు..వీళ్లకు అర్చన జరిపించి..వీళ్ళు దర్శనం చేసుకున్న తరువాత మనం ఆలయం శుద్ధి చేసుకుందాము.." అని అర్చకస్వాములే ఒక నిర్ణయం తీసుకొని..వేచి వున్నారు..ఆ దంపతులు మందిరం లోకి వచ్చి.."మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము..నిన్న రాత్రి మేము ఇక్కడకు వచ్చి నిద్ర చేయాలని అనుకున్నాము..కానీ మా పనుల వత్తిడి వల్ల మేము హైదరాబాద్ లో బైలుదేరడమే ఆలస్యం అయింది..అందుకని రాత్రి కందుకూరులో మా బంధువుల వద్ద ఆగిపోయి..ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని ఇక్కడకు వచ్చాము..స్వామివారి సమాధి దర్శనం చేసుకునే అవకాశం కల్పించండి.." అన్నారు.."లోపలికి వెళ్లి దర్శనం చేసుకోండి..అర్చక స్వాములు కూడా మీకోసమే వేచి వున్నారు..మీరు త్వరగా దర్శనం చేసుకుంటే..ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి.." అని చెప్పాను.."మేమూ త్వరగా వెళ్ళాలి..ఈరోజు శుక్రవారం కదా.." అని అన్నారు..అలా ఎందుకు అన్నారో అప్పుడు అర్ధం కాలేదు..


దంపతులిద్దరూ లోపలికి వెళ్లారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకులకు తమ శిరస్సు ఆనించి కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు..ఆ తరువాత బైటకు వచ్చారు..స్వామివారి ఉత్సవ మూర్తి ముందు నిలబడ్డారు.."మీ గోత్రం తెలుపండి.." అని పూజారి గారు అడిగారు..ఆ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."పంతులు గారూ..మేము ముస్లిం వాళ్ళము..మాకు గోత్రం ఉండదు..నాపేరు ఖాజావలి..ఈమె నా భార్య రజియా..మా పేర్ల తోనే అర్చన చేయండి.." అన్నారు..పూజారిగారు అర్చన చేశారు..ఆ దంపతులు శుక్రవారం త్వరగా వెళ్ళాలి అని ఎందుకు అన్నారో అప్పుడు అర్ధమైంది..నమాజు చేసుకోవడానికి అని అనుకున్నాను..


ఆ దంపతులు ఇవతలికి వచ్చి..వాళ్లలో వాళ్ళు ఉర్దూ లో ఏదో మాట్లాడుకున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.. "అయ్యా..ఇందాక మీరు మాతో మాట్లాడినప్పుడు..ఆలయం శుభ్రం చేసే కార్యక్రమం అన్నారు..ఇప్పుడు ఈ మందిరం అంతా శుభ్రం చేస్తారా..? " అని ఆ భర్త అడిగాడు.."అవును.." అన్నాను.."మేము కూడా పాల్గొనవచ్చా..?" అన్నాడు.."గర్భాలయం లో ఉన్న స్వామివారి సమాధి శుభ్రం చేయడానికి స్త్రీలను అనుమతించము..బైట ప్రాంగణం అంతా శుద్ధి చేసే పనిలో స్త్రీలు కూడా పాల్గొనవచ్చు..స్వామివారి పూజా కార్యక్రమానికి వాడే వస్తువులను కడిగి పెట్టడం వంటి పనులు స్త్రీలు చేయవచ్చు.." అని చెప్పాను...వెంటనే ఖాజావలి తన చొక్కా విప్పేసి, తన భార్య చేతికి ఇచ్చాడు..ఆరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం లో ఆ ముస్లిం దంపతులు అత్యంత భక్తితో పాల్గొన్నారు..


స్వామివారి మందిరం శుభ్రం చేయడం..ఆపై స్వామివారి సమాధి వద్ద అభిషేకము నిర్వహించి..హారతి ఇవ్వడం జరిగిపోయింది...


"అయ్యగారూ..మాకు చాలా ఆనందంగా వుందండీ..స్వామివారికి నేరుగా సేవ చేసుకున్నంత సంతోషంగా ఉంది..మీరు.. మీ సిబ్బంది..మీ పూజారులు..ఎవ్వరూ మమ్మల్ని వేరుగా చూడలేదు..ప్రతి శుక్రవారం ఎన్ని పనులున్నా..నేను నమాజు చేయడం తప్పనిసరి..అటువంటిది ఈరోజు ఈ భాగ్యం కలిగింది..మాకూ మీతో సమానంగా అవకాశం ఇచ్చారు..ఇక మీదట మేము తరచూ ఈ గుడికి వస్తాము..వెళ్ళొస్తాము.." అని ఖాజావలి చెప్పాడు.."మంచిది.." అన్నాను...ఈలోపల అతని భార్య తన సంచీ లోంచి గోధుమ వర్ణం తో ఉన్న శాలువాను తీసింది.."అయ్యగారూ..ఈ శాలువాను స్వామివారి సమాధి మీద పరుస్తారా..? దీనిని హైదరాబాద్ లో ఇక్కడకు వచ్చేముందు కొన్నాము.." అన్నది..నా ప్రక్కనే నిలబడి ఉన్న పూజారిగారు ఆ శాలువాను చేతిలో తీసుకొని.."అమ్మా..స్వామివారి సమాధి పై పరుస్తాము..కాకుంటే..ఈరోజు కాదు..ఈసారి సమాధి కి అభిషేకం చేసిన తరువాత పరుస్తాము.." అని చెప్పారు.."చాలా సంతోషం.." అన్నారు ఆ దంపతులు..ఆ తరువాత వాళ్లిద్దరూ హైదరాబాద్ కు వెళ్లిపోయారు..


ఆ దంపతుల కు అత్యంత అరుదైన అవకాశాన్ని స్వామివారు కల్పించి నట్లుగా  తోచింది..నిజానికి వాళ్ళు గురువారం నాడే స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని అనుకున్నారు..కానీ వాళ్లకు శుక్రవారం నాడు ఆ భాగ్యం కలిగిస్తూ..నమాజు చేసే నియమాన్ని మారుస్తూ..దానితో పాటు తన సేవ చేసుకునే అదృష్టాన్ని కూడా కల్పించారు..ఆ దంపతుల మనస్సులో మతం కన్నా అతీతమైన భక్తిని స్థిరీకరించారు..


ఒక్కొక్కరి మనస్సులో ఒక్కొక్క అనుభవాన్ని పొందుపరుస్తారు స్వామివారు అని మరోసారి ఋజువుఅయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

జాబాలి మహర్షి

 మన మహర్షులు - 20


 జాబాలి మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


జాబాలి మహర్షి వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలో కనిపించే ఒక గొప్ప పాత్ర. 


త్రేతాయుగంలో జాబాల అనే ఒక బ్రాహ్మణ వనిత  మృకండు మహర్షిని కొన్ని సంవత్సరాల పాటు తీవ్రంగా శుశ్రూష చేసింది. తన తపస్సు నిర్విఘ్నంగా సాగినందుకు సంతోషించి మహర్షి గొప్ప ప్రజ్ఞాశాలి, సర్వవేదాలను అభ్యసించిన వేదవేత్త, గొప్ప తపస్సంపన్నుడు అయిన కుమారుడు జన్మిస్తాడని వరం ఇచ్చాడు. అలా వరప్రభావంతో జనించిన కుమారునికి జాబాలి అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 


జాబాలికి యుక్త వయస్సు రాగానే అతని తల్లి గౌతమ గోత్రీకుడైన  హరిద్రుమతుడు అనే గురువు గారి వద్ద విద్యాభ్యాసం కోసం అప్పగించింది. 


అతనికి ఉపనయనం చేయగోరి గురువు పూజాసంకల్పం కోసం కులగోత్రాలను అడుగగా అవి తనకు తెలియవని సమాధానం ఇస్తాడు. 


మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుని రావల్సిందిగా గురువు ఆదేశిస్తాడు.


కుమారుని సందేహాన్ని విన్న తల్లి తనకు భర్త లేడని, దాసీ వృత్తినే స్వీకరించి అనేక ప్రదేశాలలో తిరగానని, ఒక మహర్షి ఆశీర్వాదం కారణంగా నువ్వు పుత్రునిగా లభించావని తెలుపుతుంది. 


తిరుగి తన వద్దకు తిరిగి వచ్చిన జాబాలి జన్మ కథను దివ్య దృష్టితో తెలుసుకున్న హరిద్రుమతుడు అతడు కారణజన్ముడని తెలుసుకుని ఉపనయనంతో పాటు గాయత్రీ మంత్రోపదేశం చేస్తాడు.


అంతేగాక నాటి నుండి అతని పేరును సత్యకామజాబాలిగా మారుస్తాడు.


బ్రహ్మ విద్యను అభ్యసించేందుకు తగిన అర్హత కోసం అతనిని గోసేవ చేసుకొమ్మని గురువు ఆదేశిస్తాడు.


 సత్యసంధత, గురుభక్తి అచంచలమైన భక్తి విశ్వాసాలతో జాబాలి అహర్నిశలు గో సేవ చేసుకుంటూ ఉండేవాడు.


 అతని భక్తి తత్పరత, సేవాదృక్పధాలకు మెచ్చి వాయుదేవుడు వృషభరూపంలో వచ్చి మంత్రోపదేశం చేసాడు.


 అనంతరం గోవుల రూపంలో ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, బృహస్పతులు వచ్చి జాబాలికి బ్రహ్మోపదేశం, వేదాలు , ఉపనిషత్తులను ఉపదేశించడం వలన జాబాలి బ్రహ్మ జ్ఞాన సంపన్నుడయ్యాడు.


 ఆత్మసాక్షాత్కారం పొందిన జాబాలి గురువు ఆదేశం మేరకు ఒక ఆశ్రమం నిర్మించుకుని నిత్యం వేదపారాయణ, సత్గంధపఠన, గురుధ్యానము నందే నిమగ్నుడయ్యేవాడు.


గురుధ్యానం, గురునామం జపించనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. జాబాలి గురుభక్తికి మెచ్చి హరిద్రుమతుడు స్వయంగా శిష్యుని ఆశ్రమానికి వచ్చి సర్వవేదసారం, బ్రహ్మజ్ఞానం ఉపదేశించి తన సర్వ తప్పశ్శక్తిని ధారపోస్తాడు. 


కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల పవిత్ర రపదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఘోరతపస్సు ఆచరించాడు.


ఆయన ఆశ్రమ ప్రాంతాన్ని జాబాలి తీర్థం అని పిలుస్తారు.


 అశేష భక్త జనావళి తమ గృహ, నక్షత్ర దోషాలను పరిష్కరించుకునేందుకు జాబాలి తీర్థం దర్శించుకుని అక్కడే ఉన్న వినాయక, ఆంజనేయ స్వామి మూర్తులను పూజించుకుంటారు. 


అనంతర కాలంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో జాబాలి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి, ఆ స్వామి అనుగ్రహంతో పరతత్వ రహస్యాలను గ్రహించారు.


అనంతరం బ్రహ్మజ్ఞాన సాధనకు తనను ఆశ్రయించిన పిప్పలాద మహర్షికి సకల వేద సారాన్ని బోధించాడు. వీరిద్దరి నడుమ సాగిన సంవాదం జాబాల్యుపనిషత్తు పేరిట సుప్రసిద్ధం అయింది.


 రామాయణంలో అయోధ్యకాండలో తండ్రి ఆజ్ఞను అనుసరించి అడవులకు బయలుదేరుతుండగా జాబాలి మహర్షి అక్కడి వచ్చి తన వాక్పటిమ, తర్కం, అపారమైన శ్రస్తసంపదను రామునితో వాదనకు దిగి అతనిని అడవులకు వెళ్లకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు.


ఆ వాదనలో ఎన్నో తత్వ రహస్యాలు, వేదవిజ్ఞానం, బ్రహ్మసూత్రాలు వచ్చి వినేవారికి సంపూర్ణ జ్ఞానోదయం అవుతుంది.


 అయితే చివరకు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్లే యోచనలో ఎంతో పరమార్ధం ఉందన్న విషయం తపశ్శక్తి ద్వారా గ్రహించి తన వాదనను ఉపసంహరించుకుంటాడు.


 జాబాలి ఎంతో కాలం దశరథునికి ముఖ్య సలహా దారునిగా ఉంటూ ప్రజాసంక్షేమమే ధ్యేంగా సత్యం, ధర్మం, న్యాయం, అహింసలనీ నాలుగు పునాదులపై కోసల దేశంలో సుపరిపాలనను సాగించేందుకు కృషి చేసాడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

పిండోపనిషత్తు

 *-*"పిండోపనిషత్తు'**-

======+++×+++======

మనిషి ౼

మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు. ఆమాసికాల రహస్యం ఇదే*!

 *మాసికాలు ఎందుకు పెట్టాలి?*

*అన్ని మాసికాలు పెట్టాలా?*

*కొన్ని మానేయవచ్చా?*


 వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు మన మహోన్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*


*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు "పిండోపనిషత్తు".  ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్య, నైమిత్తిక, కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.*


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం,దేహి గురించి వివరాలు చెప్పాడు.


*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 


*ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*.


*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళ్లిపోతాడో.... పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్లిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞులు కూడా అంగీకరించినదే.*


*ముందుగా గాలి వెళ్లిపోతుంది. అనగా  ఊపిరి ఆగిపోతుంది. దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్లిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహా ఆకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్లిపోయే విధానం.*


*నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* 


*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళ్లిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.*


*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్లిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్లిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*


*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*


*దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్లిపోతుంది.*


*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*


*సపిండీకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి, ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటాడు. పితృదేవతా స్థానం పొందుతాడు అని అర్థం.*


*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనాశరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు, మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*


*వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అంటారు.*


*దీని తరువాత మాంసం, చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*


**మూడో పిండం వలన బుద్ధి (మెదడు) కలుగుతుంది. **


*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*


*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 


*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.*


*ఆయుఃప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* 


*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*


*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 


*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*


*ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్ణ శరీరం పిండాల వలన కలుగుతుంది.* 


*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.* ఇది పుత్రుడి ముఖ్య కర్తవ్యం.

 

*నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*


*వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని "పిండోపనిషత్తు" చెప్పింది. మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*


*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*


*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*


*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*


*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* 


*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించిన వారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*


*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 


*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*


*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*


ఇవి మన పురాణాలు,    ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.....   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.*


*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజనం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మనకు మరింతగా సకల సంపదలు  ఇస్తారు.*


పిండాలు ప్రేతాలకు వెళ్తాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ "పిండోపనిషత్తు". 


*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహా సాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే.... అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి?  అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు.... పితృదేవతానందం వలన కలుగుతాయి.  


వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 


ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితృదేవతలకు  ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.  ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.


ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 


మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. *మాతృదేవోభవ*

            *పితృదేవోభవ*

_*మాఘ పురాణం*_ _*1 వ అధ్యాయము*_

 _*మాఘ పురాణం*_ _*1 వ అధ్యాయము*_


       *శుక్రవారం*

*ఫిబ్రవరి 12, 2021*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*మాఘమాస మహిమ*



☘☘☘☘☘☘☘☘



*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*


           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.

రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*


దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను. 


🌹🌷🌼🛕🔔🌼🌷🌹


  🙏🙏 *సేకరణ*🙏🙏

మాఘమాస

 _*మాఘమాస స్నాన సంకల్పము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శ్లో.  శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

      ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

      సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘేతుయత్ కృతం |

      నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||

       మకరస్ధేరవౌ మాఘే మాఘేవాయే శుభేక్షణే |

      ప్రయాగస్నాన మాత్రేణ ప్రయాంతి హరిమందిరం ||

      ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటి ఫలప్రదం |

      సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్య ఫలప్రదం ||


ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే , ఉత్తరాయనే, శశిరఋతౌ , మాఘమాసే , ...పక్షే , ....తిధౌ  ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శుభతిదౌ , శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ , స్థైర్య , విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం , ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం , గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం , ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు , జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం , సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం , కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం , సర్వపాపక్షయార్ధం , ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మకరంగతేరవౌ మహాపవిత్ర మాఘమాస ప్రాతః స్నానం కరిష్యే.


*☘సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము☘*


గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశ తైరపి

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||

పిప్పలాదాత్సముత్సన్నే కృతే లోకాభయంకరి

మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||

అంబత్వద్దర్శనామ్మక్తిరజానే స్నానజంఫలం

స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||

విశ్వేశం మాధవందుంఢిం దండపాణీం చ భైరవం

వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||

అతితీక్షమహాకాయ కల్సాంత దహనోపమ

భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||

త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా

యాచి తోదేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||

యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః

సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||

నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా

విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||

భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ

ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే

స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||

సమస్త జగదాధార శంఖచక్ర గదాధర

దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||

నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే

నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||


స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ , ప్రవాహానికి యెదురుగా , వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి , తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి , తరువాత మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / దేవాలయాన దైవమును అర్చించాలి.


*☘దానమంత్రం☘*


ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్సయార్థం , శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం / నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.


*☘దాన పరిగ్రహణ మంత్రం☘*


ఓం ఇదం , ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర , ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.


*☘పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం

     విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ||

     యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః

     తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ ||

     లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః

     యేషా విందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

     అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ

     ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్షణౌ ||

     సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా

     గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||

శ్లో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్

     విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||

     లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యమ్

     వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథమ్ ||

శ్లో. ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం

     శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||


*☘పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్

     అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||

     వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం

     తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||

     బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం

     ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||

     కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ

     విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||

శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః

     గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

శ్లో. కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ

     దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||

శ్లో. సర్వేద సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః

     సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||

శ్లో. అపుత్రాః పుత్రిణస్సంతు పౌత్రిణః

     అధనస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||


*☘పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

     అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||


శ్లో. వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం

     వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాంపతిం ||

     వందే సూర్యశశంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం

     వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||


శ్లో. తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా

     నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||

     దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ

     నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయానాపూర్ణేశ్వరీ ||


శ్లో. భవానీ శంకరానందే శ్రద్దా విశ్వాసరూపిణి

     యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||

     ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం

     ఋగ్వేదాది చతుష్ట్యంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||

     నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం

     అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||


*☘పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం

     సాంబం స్తామిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||

     సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే

     సాంబస్యామ చరోస్మ్యహం మమరతిహ్ సాంబే పరబ్రహ్మణి ||


శ్లో. ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యావకేళి కలకంఠీం

     ఆగమవిపిన మయారీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||

     సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే

     సాంభస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||


శ్లో. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక

     మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||

     వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం

     ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం

     సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||


శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః

     గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నితంలోకా స్స్మస్తాస్సుఖినోభవంతు ||


🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹

మాఘపురాణం

 _*మాఘపురాణం లోని 30 అధ్యాయములు*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


1. మాఘ మాస మహిమ


2. శివుడు పార్వతికి  మాఘమాస మహిమలు చెప్పుట


3. గురు పుత్రికా కథ


4. సుమిత్రుని కథ


5. కుక్కకు మిముక్తి

కలుగుట


6. కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ


7. లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము


8. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట


9. గంగా జలం మహిమ


10. ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృతాంతము


11. భీముని ఏకాదశి వ్రతము


12. శుద్ర దంపతుల కథ


13. సుశీలుని కథ


14. విపుని పుత్రప్రాప్తి


15. జ్ఞాన శర్మ కథ - (మాఘ పూర్ణిమ)


16. విద్యాధర పుత్రిక కథ


17. ఇంద్రునికి కలిగిన శాపము


18. ఇంద్రునికి శాపవిముక్తి


19. మునుల వాగ్వాదము


20. శివ బ్రహ్మల వివాదము


21. శివ స్తుతి


22. క్షీరసాగర మధనము


23. నారదుని దౌత్యము - దేవతల దైన్యము


24. శ్రీమన్నారాయణుని అనుగ్రహము - తులసి మహాత్త్యము


25. కళింగ కిరాతుడు - మిత్రుల కథ


26. పుణ్యక్షేత్రాలలో నదిస్నానము


27. సులక్షణ మహారాజు కథ


28. క్రూర (రా) కథ


29. మృగశృంగుని కథ


30. మార్కండేయుని వృత్తాంతము


🌹🌷🙏🛕🙏🛕🌷🌹