26, మార్చి 2022, శనివారం

సుబ్రహ్మణ్యస్వామి

 ఈ గుడిలో ప్రార్థన చేస్తే చదువులో రాణిస్తారు!




పార్వతీపరమేశ్వరుల రెండో తనయుడు సుబ్రహ్మణ్యస్వామి. 

ఆయనే దేవతలకు సేనాధిపతి. మురుగన్‌ పేరుతో సుబ్రమణ్యస్వామిని పిలుస్తారు. సూరపద్ముడినే రాక్షసుని ఈయన సంహరించాడు. సూరపద్ముడితో యుద్ధం కోసం కుమారస్వామి పలు రణ శిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. అవి పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం.


తిరుత్తణి, పళముదిరి కొలయ్‌. సూరపద్ముడి సంహారం అనంతరం స్వామి తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకుని, శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. అందుకే అన్ని మురుగన్‌ ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధ ఉత్సవం జరుగుతుంది. 


ఆ రోజున వేయి కిలోల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు. 

ఇక్కడ స్వామివారి వాహనంగా మయూరం స్థానంలో ఏనుగు ఉంటుంది. 


దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది.


 సుబ్రహ్మణ్యస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించి ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడు.


ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే ముఖ్యమైన పండుగ సమయాల్లోనే ఈ చందనాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉంటాడు. ఇవి నాలుగు వేదాల పరిరక్షణకే అని తెలుస్తోంది. భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి.


 ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం.


అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు స్వామివారిని కొలుస్తూ ఇక్కడే తనువు చాలించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారు. ఆ ప్రసాదం తినగానే ముత్తుస్వామి నోరు పవిత్రమై ఆశుధారగా గానం చేశాడు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి అందజేశాడట.

సంగీతము

 శ్లోకం:☝️

*కావ్యాలాపాశ్చ యే కేచిత్*

    *గీతాని సకలాని చ |*

*శబ్దమూర్తి ధరైస్యైతే*

    *విష్ణోరంశా మహాత్మనః ||*

    - విష్ణుపురాణం


భావం: ఏ కొంచెం రాగాలాపన చేసినా, కృతిలోని భాగమును లేక గీతమును పూర్తిగా ఆలపించినా వారు విష్ణు అంశయైన సంగీతమును ధారణ చేయువారు, నాదోపాసకులు కనుక వారు మహాత్ములు. సంగీతము భగవదంశమని  విష్ణుపురాణం చెబుతోంది.🙏

అష్ట దిక్కుల గాలులు

 అష్ట దిక్కుల గాలులు  -  లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు  - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు  . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు  - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు  - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు  - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు  - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు  - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు   - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

25, మార్చి 2022, శుక్రవారం

ఆర్తిని

 ఆర్తిని!

అదే దాహార్తిని!

తీర్చాలంటే!

నీరు కావాలి!

విద్యుత్ కావాలంటే!

నీరు కావాలి!

పైరు పండాలంటే!

నీరు కావాలి!

బువ్వ బు క్కాలంటే!

నీరు కావాలి!

పరి శుభ్రతను పాటింఛాలంటే!

అది మనిషి కై నా!

పశువు కై నా!

పక్షి కైన!

మనం కట్టే !

బట్టల కై నా!

నీరు కావాలి!

అందుకే!

నీటి విలువను గురుతెరగాలి!

బొట్టు బొట్టు నీటినీ ఒడిసి పడుతూ!

భావి తరాలకు జల సిరిని పంచాలి!

అందుకొరకు!

ధన మూల మి దమ్ జగత్!

జల మూల మి దమ్ జగత్!

అన్న నినాదంతో నేడే

మనమంతా పురోగమించాలి!

మితంగా నీటిని వాడుతూ!

మానవత తో!

మహనీయత నూ ప్రదర్శించాలి!


ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631877





సువిశాల విశ్వంలో

 " పవిత్ర పృధ్విపై స్థిరీకృతమైన ప్రకృతి ప్రసాదిత నిత్య సుచైతన్య సన్మైత్రీ  భావన "                                                       సువిశాల విశ్వంలో అనాదిగా నెలకొన్న జీవకారుణ్యతా మార్గం ! చరాచర జీవజాలం, అనునిత్యం ఒండొరులకు తోడూనీడగా వర్తించే ప్రధాన భూమిక ! సృష్టి రహస్యమైన " విశ్వ మానవాళి ప్రత్యేక ఆవిర్భావ సముచిత జీవన గమనం " ! సహజ సిద్ధమైన ప్రత్యేకతలతో సృష్టి ఆరంభంలో ఆవిర్భవించిన మహోన్నత ఓషధీ సంపద ! సకల జీవ సురక్షా విధమైన పరమ పవిత్ర వేద ధర్మ నిర్దేశిత సన్మార్గ, సుహృద్భావ నిత్య చైతన్య జీవన ప్రణాళిక ! విశ్వ మానవాళి అహర్నిశలూ చేయవలసిన సకల జీవజాతి సన్మార్గ పరిరక్షణ ! తమ నిత్య జీవన పయనంలో చూపాల్సిన సకల జీవ సంరక్షణా మార్గ సత్ చింతనాత్మక సహృదయ పవిత్ర దార్శనికత ! అనుమానావమానలకు తావు లేని, ఈర్ష్యా ద్వేష భావాలు కానరాని సక్రమ ప్రశాంత నిత్య సుచైతన్య దృక్పథ జీవన పంథా ! " బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే నిత్య సత్య సుచైతన్య స్ఫూర్తిమంతమైన సత్ చింతనాత్మక జీవన విధానం ! సన్మైత్రీ భావనాత్మక జీవకారుణ్యతా సన్మార్గ జీవన ప్రణాళిక, ప్రస్తుత నిత్య జీవన గమనంలో విశ్వ మానవాళి మనోఫలకంపై  ముఖ్య భూమికై నిలవాల్సిన తరుణమిది !                                          " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ! "                                                 " సహనా వవతు ! సహనౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వి నావధీతమస్తు ! మా విద్విషావహై ! "                                                      " ఓం శాంతి శాంతి శాంతిః "                                                        రచన :                                                     గుళ్లపల్లి ఆంజనేయులు

జనార్దనుని రూపంలోను

 శ్లోకం:☝️

   *జనం జనేన జనితా*

*జనం పాతి జనేన యః |*

   *జనం జనేన హరతే*

*తం దేవం భజ సాంప్రతమ్‌ ||*

    - దేవీ భాగవతం 


భావం: ఈ జనాన్ని జనముచేత పుట్టించి, జనముచేత రక్షించి, జనముచేత చంపునట్టి భగవంతుని నీవు ఇపుడు భజింపుము. మన ప్రారబ్ధము, ప్రస్తుత కర్మ మనల్ని జనం రూపంలోను, జనార్దనుని రూపంలోను నడిపిస్తున్నాయి అని భావం.🙏

స్నేహితులకు

*_ఏ డాక్టర్లు ఇవ్వలేని... ఏ ఫార్మా కంపెనీ తయారు చేయలేని అతిగొప్ప మందేమిటంటే......_*
*~~~~~~👌👌👌 ~~~~~~*
*గుంటూరులో సెటిల్ అయిన రిటైర్డ్ ఆఫీసర్ రాజారావుకి ఆరోగ్యం బాగో లేదని హాస్పిటల్ కి తీసుకెళితే,  ఆ డాక్టర్ మెడికల్ షాప్ లో దొరకని "ఫ్రెండ్షిప్" అనే మందు రాశాడు, అది చూసి ఆయన పిల్లలు అవాక్కయితె డాక్టర్ చెప్పాడు.*

*మీ నాన్న గారు రిటైర్ అయ్యాక మీరందరూ ఆయన్ని మీ ఇంటికి పెదరాయుడుని చేసేసి నోటికి ప్లాస్టరు వేసేసారు.* 

*ప్రతీ మనిషిలో ఒక కోతి ఉంటుంది,  దాని పేరే "స్నేహితుడు,"*
*దాన్ని కట్టేస్తే కంటి మీద కునుకూ,  మోహం మీద నవ్వూ, కడుపుకు ఆకలి,  కాళ్లకు నీరసం లాంటి అన్ని రోగాలు వస్తాయి. అని హిత బోధ చేశాడు, అందరికీ.*

*వాళ్ల అబ్బాయిలు ఆయన చదివిన స్కూల్, కాలేజీ వివరాలతో  Facebook లో Account  ఓపెన్ చేశారు.* 

*దాంతో ఆయన ఇప్పుడు ఫోన్లో బిజీ బిజీ, ఎప్పుడూ ముసిముసి నవ్వులు, నెలకోసారి ఏదొక వంకపెట్టి ఊరెళ్లి స్నేహితులతో సిట్టింగులు*
 
*ఇంక ఆయనకి డాక్టర్ అవసరం రానేలేదు... ఎప్పటికీని. అప్పటి నుండి ఆ ఇంట్లో వాళ్లకి ఈయనతో ఏ టెన్షనూ లేదు.*

_అందుకే  అంటున్నారు...._ 
 *న మిత్రం న సౌఖ్యం!*
(మిత్రులు లేకపోతే సుఖం ఉండదు.) 

🙏 _ప్రాణ స్నేహితులకు అంకితం_ 🙏

పంపుసెట్టు

 నీటి ఎద్దడి – పంపుసెట్టు


అది సూర్యుడు ప్రచండంగా ఉన్న ఎండాకాలం. పల్లెల్లో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. నదులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. చాలా ఇళ్ళల్లో బావులు కూడా ఎండిపోయాయి. ఉన్న నీళ్ళనే ఊరివారందరూ పంచుకుంటున్నారు. 


అలాంటి ఒక నీటి ఎద్దడి ఉన్న గ్రామప్రజల అభ్యర్థన మేరకు మహాస్వామి వారు వచ్చి ప్రజలకు దర్శనం ఇస్తున్నారు. ఆ ఊర్లోని పేద-ధనిక, మంచివారు-చెడ్డవారు, విధ్వాంసుడు-అవివేకి అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్వామివారి దర్శనానికి వచ్చారు. 


బాగా వయసుమళ్ళిన ఒక ముసలాయన స్వామి వారి దర్శనానికి వచ్చాడు. అక్కడ ఉన్న వారందరూ అతనికి దారిచ్చి, ఎంతో గౌరవంతో మహాస్వామి వారి దర్శనానికి సహకరించారు. బహుశా అతను ఆ గ్రామ పెద్ద కావచ్చు. 


అతను స్వామివారికి నమస్కరించి నిలుచున్నాడు. 


మహాస్వామి వారు అతణ్ణి “నీ వయసెంత?” అని అడిగారు. 


”నాకా? చాలా ముసలివాణ్ణి. ఎనభైరెండేళ్ళు” అని ముసలాయన బదులిచ్చాడు.


”అంతా బగున్నదా? సంతోషంగా ఉన్నావా?” అని అడిగారు స్వామివారు. 

”లేదు, సామి. నాకు సంతోషానికి తావెక్కడ? మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. నేను చెప్పినది ఎవరూ వినరు? ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. ప్రాణం ఉంది కాబట్టి బతుకుతున్నాను” అని నిర్వేదంగా చెప్పాడు. ”ఐతే చాలా బాధలో ఉన్నానంటావ్”

“అవును సామి. . .”


“నువ్వు సంతోషంగా ఉండడానికి మార్గం చూపిస్తే దాన్ని పాటిస్తావా?” అని అడిగారు స్వామి వారు. ”చెప్పండి సామి” ఆత్రుతతో అడిగాడు ఆ ముసలాయన. 


”మీ తోటలో ఉన్న పంపుసెట్టుకి ముళ్ళకంచె వేసావు, ఎవరూ ఒక్క చుక్క కూడా నీళ్ళు తీసుకోరాదని. తాగడానికి, వండుకోవడానికి నీరు లేక ఇక్కడి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. నీవు నీ పంపుసెట్టు ద్వారా నీటిని నీ పొలాలకి పంటలకి మాత్రమే వాడుకుంటున్నావు. నీ ఆస్తి, నీ కుటుంబం వల్ల నీకు సంతోషం లేదని అంటున్నావు. ఆ పంపుసెట్టు చుట్టూ పెట్టిన కంచెను తొలగించు. అందరూ ఆ నీళ్ళను తీసుకోవడానికి వదులు. అందరూ ఆ నీళ్ళను వాడుకోనివ్వు. వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీస్సుల వల్ల నీకు సంతోషం లభిస్తుంది” అని చెప్పారు. 


ఇదంతా విన్న తరువాత ఆ ముసలాయన కళ్ళల్లో నుండి నీరు ధారాపాతంగా కారుతున్నాయి. 


పరమాచార్య స్వామివారి మాటలను విన్న ఆ గ్రామప్రజలు ఆశ్చర్యపోయారు. ”ఆ ముసలాయన పొలంలో పంపుసెట్టు ఉన్న విషయం గురించి స్వామివారికి ఎవరూ చెప్పలేదు. ఎవరూ నీళ్ళు తీసుకోరాదని దానికి వేసిన కంచె గురించి చెప్పలేదు. ఎవరైనా తీసుకోవడానికి వెళ్తే ఆ ముసలాడు గొడవకు వచ్చేవాడని కూడా ఎవరూ చెప్పలేదు” పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల వారి నీటి సమస్యకు పరిష్కారం లభిస్తే చాలు అని ప్రార్థించారు. 


పరమాచార్య స్వామివారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఇద్దరు యువకులు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఆ ముసలాయన పంపుసెట్టు చుట్టూ ఉన్న కంచెను తీసేసాడు” అని చెప్పారు. 


ఆరోజునుండి ఆక్కడి నీరు ఊరుమొత్తం పొంగింది. 


పంపుసెట్టుకి కంచె తీసివేసి ఊరి వారందరికి ఆ నీరు పంచడం వల్ల ఆ ముసలాయనకు కూడా సంతోషం ఉప్పొంగింది. 


పరమాచార్య స్వామివారి కరుణ అపారమైనది. వారి కరుణ వారి దయ ఎండిపోని జీవనదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

24, మార్చి 2022, గురువారం

భగవంతుడు గుణాతీతుడు

 భగవంతుడు గుణాతీతుడు 

ద్వయత ప్రపంచంలో వున్న మనం త్రిగుణాలలో ఏదో ఒక గుణం కలిగి అరిషడ్వార్గానికి బానిసలుగా వుంటూ సంసార జీవనం గడుపుతున్నాము. సంసారులైనవారు కూడా సంసారం మోక్షసాధనకు ఉపయోగకరంగా మలచుకోవటానికి వారు వారి మనస్సుని నియంత్రించుకొని సదా పరబ్రహ్మ్మములోనే చరిస్తూ మోక్షాన్ని పొందిన మహానుభావులు ఎందరో అందులకు నిదర్శనం జనక మహారాజు. అనాదిగా వున్న  మన వేదాంత గ్రంధాలను అంటే ఉపనిషత్తులను పరిశీలిస్తే మనకు గోచరించేది ఒక్కటే అదే పరబ్రహ్మ అంతేకాని ఇంకొకటి లేదు.  ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విధంగా మానవులమైన మనం పరమాత్మలో ఎలావిలీనం (మోక్షం) కావాలో తెలియచేస్తుంది. ఉపనిషత్తులు అన్నిమతాలవారికి అంటే హిందూ ధర్మాన్ని ఆచారాయించే అద్వేతులకు , విశిష్ఠద్వితులకు, ద్విఎతులకు అందరికి ఉన్నవి ఒక్కటే. ఆయా మతాచారులు వారి, వారి జ్ఞ్యానంతో ఎలాంటి విభేదాలు చేశారు కానీ బ్రహ్మ ఒక్కటే అన్నది అందరికి ఆమోదయోగ్యం. అదే సత్యం. 

సంసారులు తమ దైనందిక జీవనవ్యాపారాలలో పది భగవంతుని కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు కనుక పూర్తిగా ఆ భగవంతునికొరకు జీవితాన్ని సమర్పించుకోవటానికి ఏర్పడిన ఆశ్రమం "సన్యాస ఆశ్రమం" సన్యాస ఆశ్రమ ప్రధాంధర్మం సత్వగుణ వంతులు కావటము. ద్వితీయం అరిషడ్వార్గానికి దూరంగా ఉండటం. వారు దాంపత్య జీవితానికి సంబందించిన కొన్ని పదాలను నోటితో ఉచ్చరించటానిని కూడా మన ధర్మం నిషేదించింది. కామ, క్రోధ, మధ, మాత్సర్యాలకు తావివ్వకుండా పూర్తిగా జీవితాన్ని భగవంతుని కొరకే అర్పణ చేయటం సన్యాసధర్మం. అంతేకాక కేవలము ఒక సంవత్సరములో నాలుగు నెలలు మినహా మిగిలిన ఎనిమిది నెలలు కేవలము పాదచారులై బిక్షలో దొరికినది మాత్రమే భుజిస్తూ, గృహస్తుల ఇండ్లకు వెళ్లకుండా కేవలం దేవాలయాలలో మాత్రమే వసిస్తూ సమాజానికి ధర్మబోధ చేస్తూ జీవనం జీవనం గడపాలి. 

సన్యాసికి స్త్రీల పట్ల మోహము, కామము ఉండకూడదు, అంతేకాక ఏ విషయవాంఛలపై కూడా మొహం ఉండకూడదు. పూర్తిగా శిరస్సు ముండనం చేసుకొని (గుండు చేసుకొని) ఉండాలి. శిఖ (పిలక ) ఉండకూడదు. అదే సంసారి శిఖ (పిలక) లేకుండా పూర్తిగా ముండనం (గుండు) చేసుకోకూడదు చివరికి తిరుపతికి వెళ్లినా కూడా సంసారికి పూర్తీ ముండనం నిషిద్ధం. 

సన్యాస జీవనం సంసారిక జీవనం కన్నా మిగుల కఠినతరం. ఇప్పటి సన్యాసులుగా చెప్పుకొనే సన్యాసులు ఎంతవరకు సన్యాసులుగా వున్నారో అన్నది వారి విజ్ఞతకే తెలియాలి. 

భగవంతుడు త్రిగుణాతీతుడు, రూపం లేని వాడు, కాలంలో లేనివాడు. అటువంటి భగవంతుని సామాన్యమైన మానవులు తేలికగా అర్ధం చేసుకొనేటందుకు మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలతో మనలోని మానసిక స్థిరత్వాన్ని చేకూర్చటానికి మన మహర్షులు ఏర్పాటు చేశారు. నిజానికి త్రిమూర్తులు కూడా ఆ పరబ్రహ్మయే మనిషి జ్ఞ్యానిగా మారినప్పుడు ఆ స్థితిని పొందుతాడు. పరబ్రహ్మ జ్ఞ్యానం లేని మిడిమిడి జ్ఞ్యానవంతులు త్రిమూర్తులను విడివిడిగా చూడటమే కాకుండా వారిలో ఒకరు గొప్ప ఇంకొకరు కారని చెపుతూ మానవులకు గల సహజ సిద్ద స్వభావాలైన అరిషడ్వార్గాలను వారికి కూడా ఆపాదించటం ఎంతవరకు సమంజసము విజ్ఞులు యోచించాలి. 

బాధాకరమైన విషయం ఏమిటంటే సర్వ సంఘపరిత్యాగినని ప్రకటిస్తూ ఆశ్రమాలను నడిపే స్వామీజీలు త్రిమూర్తులను వారి పత్నులను సాధారణ దంపతులుగా భవిస్తూ విమర్శించటం విచారకరం. మిత్రులారా మన హిందూ ధర్మంలో శివ కేశవ బేధం లేదు. దేముళ్ళకు కూడా మనకు ఉన్ననీచ స్వభావాలను అంటకట్టటము అత్యంత పాపహేతువు అవుతుంది. అందునా సన్యసించినట్లు ప్రకటించే వారలు కూడా. 

ఇప్పటి సన్యసించిన సత్పురుషులకు  నేను విన్నవించుకునేది ఒకటే మహానుభావులారా మీకు చేతనయితే పరబ్రహ్మ తత్వాన్ని ప్రభోదించి సాధారణ మానవులకు జ్ఞ్యాన బిక్ష పెట్టండి. లేకుంటే విభేదాలు కలగకుండా మీరు నమ్మిందే ప్రచారం  చేయండి. సన్యాసులు రాజకీయనాయకుల ప్రాబల్యానికి పాకులాడటం చాలా చాల శోచనీయం. మీరు కేవలం బ్రహ్మత్వాన్ని చేరుకోవటానికి ప్రయత్నించాలి కానీ బాహ్య పటాటోపానికి కాదు కదా. 

బ్రహ్మ ఒక్కటే రెండవది లేదు (ఏకమేవ అద్వితీయం బ్రహ్మ')అందరమూ మన మన సహజ స్వభావాలను త్యజించి ఆ పరబ్రహ్మలో లీనం అవ్వటానికి కృషి చేద్దాం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

 

ఇంజక్షన్ప్రాచీన విధానం -

 ఆయుర్వేదం నందు ఇంజక్షన్ ద్వారా వైద్యం చేసే ప్రాచీన విధానం  - 


           మన ప్రాచీన ఆయుర్వేదం నందు ఔషధాలను నోటి ద్వారా కాకుండా ఒక సూది ద్వారా లొపలికి ఇచ్చే వైద్య విధానం ఒకటి ఉన్నది. కొన్ని పరిస్థితులలో రోగి నోటి ద్వారా ఔషధాన్ని గ్రహించలేకున్నప్పుడు అనగా అపస్మారము , మూర్చ , సన్నిపాతము , పాముకాటు , మెదడు వ్యాధి , యాక్సిడెంట్స్ , మెదడు ని తినే ensplosis ఉన్మాదము వంటి వ్యాధుల యందు , స్మృతి లేని పరిస్థితుల యందు (COMA) రోగి రక్తం నందు ఔషధము ను ప్రవేశింప చేయుట . 1906 వ సంవత్సరంలో మద్రాస్ గవర్నర్ గా ఉన్న జార్జ్ ఏప్రెల్ గారు భారతీయ మెడికల్ అసోసియేషన్ ముందు ఉపన్యాసం ఇస్తూ " టీకా "( వాక్సినేషన్) మరియు ఇంజక్షన్ విధానం మున్నగు పద్ధతులు డాక్టర్ జన్నర్ మహాశయుని కంటే పూర్వమే భారతీయులు వైదిక యుగము నుండియే టీకా విధానం వాడుచున్నారు అని డాక్టర్ కర్నల్ గారు నిరూపించారు అని సూచించిరి. డాక్టర్ కర్నల్ గారు ఋగ్వేదం , యజుర్వేదం , అధర్వణ వేదం నందలి ఒక మంత్రం ఈ విధంగా తెలియచేసారు .


   మస్త్వాజ్జః ప్రసర్పఖంగా మంగం పరుశ్పరూహ్ 

   తతో యక్షం వివాద్య స ఉగ్రో మధ్యమ శిఖి 


        దీనిలో " ప్రసర్పన్ " " ప్రవిశ్యా " " అంతః " శిరాముఖ వ్యాపనోచి అంజనా గల శీలద్రవ్యం అంగ ప్రత్యంగం లో ప్రవేశించుగాక . ఈ భావమునే వైజ్ఞానికులు తెలుపుతున్న వాక్సినేషన్ మరియు ఇంజక్షన్ పద్దతులను తెలుపుతుంది.  ఈ సూచీ విధానం గురించి ఈ క్రింది గ్రంథాలలో వివరణ కనిపిస్తుంది. 


        *  ధన్వంతరి సంహిత.

      

        *  రస కామధేనువు.


        *  రసరాజ వసంతము.


        *  బృహన్నిఘంటు రత్నాకరం .


        *  రసేంద్ర చింతామణి.


        *  యోగ చింతామణి.


        *  రసప్రకాశ సుధాకరము .


        *  శారంజ్గాధర సంహిత.


        *  బృహత్ యోగ తరంగిణి.


        *  రససైకత , కామ్కా ఉల్లాసం . 


           రక్త భేషజ విధానం అనగా ఔషద విశేషమును రక్తం నందు ప్రవేశింప చేసి వ్యాధిని నిర్మూలించే విధానం . మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను .


 *  సన్నిపాత ( typoid ) రోగి సృహ తప్పి పళ్ళు బిగించుకు పొయిన దశలో ఔషధమును నోటి నుండి గాని ముక్కుపుటము నుండి కాని లొపలికి పంపుటకు వీలుకాని దశలో కపాలమును పదునైన కత్తితో చీరి సిద్ధ ఔషధములు ను సూదిమొనకు వచ్చినంత మాత్రమే అందులో వేసి రుద్ది రక్తంతో కలిసిన వెంటనే మస్తిష్క నాడీకేంద్రం చేతనం పొంది వారు లేచి మాట్లాడతారు.


 *  తేలు కుట్టిన వెంటనే ఆ విషం పైకి ఎక్కకుండా గట్టిగా బిగించి కట్టి కుట్టినచోట బ్లేడుతో కాని కత్తితో కాని చీరినప్పుడు రక్తంతో పాటు విషం కూడా కారిపోవును . రక్తం తీయలేని వారు పొటాషియం పర్మాన్గానేట్ ఆ చోట వేసి చింతపండు నీటిలో తడిపి ఆ గుజ్జుని దానిపైన వేసిన కుతకుతమని పొంగి విషముని కాల్చివేయును. లేదా తెల్ల ఉల్లిగడ్డ మెత్తగా దంచి దానిపై వేసి కట్టు కట్టాలి. లేదా ఉత్తరేణి ఆకు రసముని గంటె లొ వేసి ఆవిరి పట్టేది.


 *  ప్రాచీన కాలంలో కొన్ని రకాల చెట్ల పసర్లుని సూదులు గుంపుగా కట్టి మొండి కీళ్ల నొప్పుల పైన ముసలివాళ్లు పచ్చ పోడిపించుకునే వారు . అడివి జాతుల యందు ఈ విధానం ఇప్పటికి అలవాటు ఉంది. 


 *  పాము కరిచినప్పుడు రావిఆకులు తో చికిత్స చేస్తారు . రావిఆకుల చిన్న మండ తీసుకొచ్చి ఆకులు తుంచిన పాలు వచ్చును. పాము కాటువేసిన వ్యక్తి యెక్క రెండు చేతులు వెనకకి విరిచి కట్టి పాలుకారే ఆకు యెక్క తోడిమని కదలకుండా ఒక చెవ్వు రంధ్రములో కొంతవరకే దూర్చవలెను . చెవిలొ కర్ణ బేరికి తగలకుండా ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. రెండొవ ఆకు తోడిమని మరొక చెవి రంద్రములో జాగ్రత్త వహించవలెను. అలా ఆకులని దూర్చగానే రోగి మూర్చ నుండి లేచి భాధతో కేక వేయును.అతనికి పూర్తిగా విషం దిగినదా లేదా అని తెలుసుకొనుటకు వేపాకు రోగిచే నమిలి తినిపించవలెను . పూర్తిగా చేదు ఉన్నట్లయితే విషం దిగిపోయినట్లు గుర్తించవలెను. లేనిచో మరియొక సారి చేయవలెను . 


 * తేనెటీగల కొండిలోని విషముతో కూడా వైద్యం చేయవచ్చు . శరీరాంగములు లో పొట్ట ఊది నీరు నిండి మెరుస్తూ ఉంటుంది. దానిలో పూర్తిగా నీరు నిండి ఉంటుంది. దీనినే జలోదరం అంటారు. ఇది చాలా కష్టసాద్యం అయిన వ్యాధి . శరీరం పై చర్మం మైనం లాగా అయిపొతుంది. మూత్ర పిండాలు పనిచేయవు . అట్టి సందర్భాలలో ఈ చికిత్స అధ్బుతంగా పనిచేస్తుంది . ఇది ప్రయోగించగానే మూత్రం అధికంగా వచ్చి శరీరం అంతా నీరు వాపు దిగి పొతుంది. 


               చిన్నపిల్లలకు వచ్చు మెదడు క్షయ లొ పిల్లవాడు తెలియకుండానే పడిపోతాడు. తల అటుఇటు కదల్చ లేడు కేకలు పెడతాడు. లేచి పడతాడు , తలనొప్పితో ఏడుస్తాడు , శరీరం ఒక పార్శ్వం చచ్చు పడుతుంది. పక్షఘాతం అర్ద భాగం లొ కొట్టుకుంటాడు , కండ్లు తిరుగుతూ దృష్టి ఉండదు. నాడి వేగముగా కొట్టుకుంటుంది. మూత్రం తక్కువై మెదడులో నీరు చేరుట చేత తెలివిహీనుడు అగును. అట్టివారికి ఈ మందు పనిచేయును . 


  తేనెటీగల కొండి చికిత్సా విధానం  - 


         తేనెటీగల కొండి విషాన్ని ప్రత్యేకమైన సిరంజి ద్వారా చర్మము క్రింద ఇంజెక్ట్ చేస్తారు . మనకు కావలసినప్పుడు ప్రకృతి సిద్ధముగా తేనెటీగలు వచ్చి ఆయాభాగముల యందు కుట్టవు.కావున ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ విషమును సేకరించి ఈ సూచి చికిత్స ద్వారా పంపుదురు. దీనివలన బ్లడ్ ప్రెషర్ , గుండె , చర్మవ్యాదులు , కీళ్ళనొప్పులు , ముద్ద కీళ్ళనొప్పులు , ఉదరవాతం , గాయాలు మున్నగునవి నివారించ బడును.


  పైన చెప్పిన అరుదైన గ్రంథాలలో ఉన్న కొంత సమాచారాన్ని నేను రాసిన గ్రంథాలలో సంపూర్ణంగా వివరించాను . 


          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034