ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
23, నవంబర్ 2023, గురువారం
🌸 *రామాయణములో మనము తెలుసుకొన వలసిన విషయాలు* 🌸
"""ఉపాయము లేని వాడిని ఊరి నుండి వెళ్లగొట్టమని" సామెత.""
అదేమిటి ఉపాయాలు తెలియకపోతే ఉరినుండి వెలి వేసేస్తారా? అంటే ఉపాయాలు తెలియని వాడు ఊరికి పనికిరాని వాడని అర్థము. ఊరికి ఉపకారము చేయలేని వాడు ఊళ్లో ఉన్నా లేక పోయినా ఊరికేమి లాభము. అందుకే అందరు వాడిని వెలి వేయడానికైనా సరే సిద్దపడతారు కనుక కనీసము ముఖ్యమైన ఆరు ఉపాయాలన్నా తెలుసుకొమ్మని రామాయణము మనలని హెచ్చరిస్తున్నది.ఏమిటి ఆ ఆరు ఉపాయాలు.
రామాయణము అరణ్యకాండములో చెప్పబడ్డ ఆరు ఉపాయాలు గమనించుకుందాము.
"" షడ్యుక్తయః"" (ఆరు ఉపాయములు),
""సంధివిగ్రహయానాసన ద్వైధీభావ సమాశ్రయాః.-షడ్యుక్తయః,""
శత్రువులతో ఒడంబడిక చేసుకొనుట సంధి,
రిపు విరోధము విగ్రహము,
అదనుచూసుకొని శత్రువుమీదకి దండెత్తుట యానము,
అనుకూలమైన కాలము కొరకు నిరీక్షించుట ఆసనము,
బలవంతులు బలహీనులైన శత్రువులిద్దరితోను మాటలతో మంచిగా వ్యవహరించుట ద్వైధీభావము,
బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము.
రామలక్ష్మణులు కబంధుని దేహమునకు అగ్నిసంస్కారములు ఒనర్చిన పిమ్మట కబంధుడు దివ్య దేహముతో బయటకు వచ్చి సీతాదేవిని తిరిగి పొందుటకు రామలక్ష్మణులకు ఈ ఆరు ఉపాయములు చెప్పుతూ వాటి గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు.
"" రామా! షడ్యుక్తయో లోకే
యాభిః సర్వం విమృశ్యతే,
పరిమృష్టో దశాంతేన
దశభాగేన సేవతే."""(72-18),
ఓ రామచంద్రప్రభూ! లోకములో ఎవ్వరికైనా సరే సర్వ కార్యములు సాధ్యము కావాలంటే ఆరు ఉపాయములు గలవు.అవి పాటిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అవే సంధి,విగ్రహము,యానము,ఆసనము,ద్వైధీభావముమరియు సమాశ్రయము ఈ ఆరింటిని ఆకళింపు చేసుకొని""సమాశ్రయము""ద్వారా (సుగ్రీవుని ఆశ్రయించి) సీతాన్వేషణలో విజయము సాధించమని హితవు చేస్తాడు.
కబందుని సూచనమేరకు రాముడు సుగ్రీవుని కలిసి అగ్నిసాక్షిగా అతనితో మైత్రి సల్పి సమాశ్రయమనే ఉపాయనము ద్వారా సీతామాత ను రావణచెర నుండి విడిపించుకుటాడు.
ఈ కలియుగములో మనందరికి అనుకోకుండగానో, గ్రహపాటువల్లనో అనేకవిధములైన సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమయములో సాధకులు అధైర్యపడకుండ రామాయణములో చెప్పబడ్డ ఈ ఆరు ఉపాయములను గుర్తు తెచ్చుకొని వాటిద్వారా లభ్దిపొందగలగటమే రామాయణ పారాయణ మనకి ప్రసాదించే అతి పెద్ వరమని గ్రహించుకోవాలి.
“””””””””హరయేనమ: శ్రీకృష్ణాయనమ:”””””””””
మనుషుల్లో మూడు రకాల వాళ్లుంటారు. ఐహిక సుఖం కోరుకునేవారు, పరం చాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు. పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్లు సాధన చేసినా, తపస్సు చేసినా ఋషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతమూ ఉండాలి. ఈ జీవితంలో చేసే అవిరళ కృషీ ఉండాలి.
భారతీయ దార్శనికక్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోను కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. జీవితంలోని అన్ని లోపాలను సవరించి, దుఃఖాలనుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. అప్పుడే శాశ్వతానందపథం గోచరిస్తుంది. అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శినికులు ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి. మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. మోక్షానికి బౌద్ధం 'నిర్వాణం' అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. జైనమతమూ మోక్ష సిద్ధాంతాన్నే చరమ లక్ష్యంగా భావిస్తుంది. మోక్షప్రాప్తికి సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శనం, సమ్యక్ చరిత్ర ఆవశ్యకమని చెబుతుంది.
మోక్షం నిరానందస్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానమంటే ఆత్మను శరీరం, మనసు ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణ, మనన, నిధి ధ్యాసలవల్ల కలుగుతుంది. ఇవే మోక్షమార్గాలు. మోక్షం కోరుకునే జాతిలో ఏ అరిష్టమూ, అశుభమూ చోటు చేసుకోలేదు. విశ్వశాంతికి అటువంటి జాతే సర్వదా సహకరిస్తుంది.
సాంఖ్య-యోగ దర్శనాలను అనుసరించి మోక్షమంటే కైవల్యం. దుఃఖం నుంచి సర్వులకూ విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధచైతన్యావస్థ. ఈ స్థితి జ్ఞానంవల్లనే సిద్ధిస్తుంది. మోక్షసాధనాల్లో సర్వోత్కృమైన సాధనం భక్తే. భక్తి వల్లనే అంతర్యామి అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యమిస్తుంది. విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది.
స్థూలంగా మోక్షం అంటే సమర్పణభావం. ఇది అంత సులువు కాదు. అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి. అత్యంత ప్రియతముణ్ని ఆత్మసమర్పణ చేసుకొమ్మంటాడు వాసుదేవుడు. ఆ ప్రియతముడే అర్జునుడు.
అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు. జడుడు, మహాపాపి. పాపానికైనా, పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే కద! అందుచేత సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్షప్రాప్తికి శరీరారోగ్య పరిరక్షణ అత్యావశ్యకం, అనివార్యం.
'ఇది నాది' అనుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. 'ఇది నాది కాదు' అనుకుంటే మోక్షార్హుడవుతాడు. సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియచాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమ తత్వజ్ఞానం అవగాహన కాదు. త్రికరణ శుద్ధిగా పవిత్రుణ్ని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. దాన్ని ఆచరణతో సమన్వయపరచుకోవాలి. దాన్ని జీవనలక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం. ప్రాణ, మానమోహాలు వీడి, మమతాను బంధాలు త్యజించి, ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి, జితేంద్రియుడై, ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. ఆ అలౌకిక దర్శనానుభూతే మోక్షం!
ఋషి భృంగి*
*కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో ఋషి భృంగి*
శివపురాణం ప్రకారం, ఋషి భృంగి భగవానుడు శివునికి అత్యంత భక్తుడు, కానీ పార్వతీమాతను పూజించేవాడు కాదు. తన ఆరాధనలో భాగంగా పరిగణించడానికి నిరాకరించాడు.
ఋషి బృంగి యొక్క రోజువారీ ఆచారంలో కైలాస పర్వతం వద్ద శివుని రోజు పూజించేవాడు తన పూజ ముగింపులో అతను ఎల్లప్పుడూ శివుని ప్రదక్షిణ (ప్రదక్షిణ) చేసేవాడు. పార్వతిదేవిని పూజించేవాడు కాదు. ప్రదక్షిణ చేసేవాడు కాదు. ఒకరోజు ఈ పూజలో భాగం కావాలని పార్వతిమాత శివునికి పక్కనే కూర్చుంది. ఋషి భృంగి దీనిని గమనించి తనను తాను తేనెటీగగా మార్చుకుని శివుని చుట్టూ మూడుసార్లు మాత్రమే తిరిగాడు.
పార్వతీదేవి కోపించి, భృంగిలోని తన స్త్రీ శక్తి అంతా లేకుండా పోవాలని శపించింది. రక్తమాంసాలతో కూడిన తన స్త్రీ శక్తిని కోల్పోయి, భృంగి అస్థిపంజర జీవిగా మారిపోయాడు. ఈ కారణంగానే చాలా చిత్రాలలో భృంగి అస్థిపంజరం వలె చిత్రీకరించబడింది. శాపం తర్వాత భృంగి తట్టుకోలేనంత బలహీనంగా తయారయ్యాడు. భృంగి దీనస్థితికి చలించిన శివుడు తను నిలబడటం కోసం 3వ పాదం ఇచ్చాడు. అందుకే భృంగిని ఎల్లప్పుడూ మూడు కాళ్లతో చిత్రీకరిస్తారు.
అయినా భృంగి మారలేదు, భృంగికి గుణపాఠం చెప్పడానికి పార్వతిదేవి తన నుండి విడదీయరానిది అనే విషయాన్ని తెలపడం కోసం , శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని ధరించాడు భృంగి తన రోజువారీ పూజ కోసం కైలాసం వచ్చినప్పుడు . అయితే భృంగి తాను శివుడిని మాత్రమే పూజిస్తానని చాలా దృఢంగా భావించాడు, అతను తనను తాను ఈగగా మార్చుకున్నాడు అర్ధనారీశ్వరుని మధ్యలో రంధ్రం చేయడం ప్రారంభించాడు, తద్వారా అతను శివ భాగం చుట్టూ మాత్రమే తిరిగాడానికి.
అతని అచంచల భక్తికి ఆశ్చర్యపోయిన పార్వతి దేవి భృంగి యొక్క మొండితనాన్ని అంగీకరించి అతనిని ఆశీర్వదించింది.
హర హర మహాదేవ 🙏

