13, నవంబర్ 2024, బుధవారం

బుధవారం*🪷 🌷 *13, నవంబరు, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🪷 *బుధవారం*🪷

🌷 *13, నవంబరు, 2024*🌷

       *దృగ్గణిత పంచాంగం*


          *ఈనాటి పర్వం* 

   *క్షీరాబ్ధి/చిలుకు ద్వాదశి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి     : ద్వాదశి* మ 01.01 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం : బుధవారం*(సౌమ్యవాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 03.11 తె వరకు ఉపరి *అశ్విని*


*యోగం  : వజ్ర* మ 03.26 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : బాలువ* మ 01.01 *కౌలువ* రా 11.23 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.00 - 08.00 మ 12.30 - 02.30*

అమృత కాలం  : *రా 01.02 - 02.28*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం         : సా 04.26 - 05.52*

*దుర్ముహూర్తం : ప 11.29 - 12.14*

*రాహు కాలం   : ప 11.52 - 01.17*

గుళికకాళం      : *ఉ 10.26 - 11.52* 

యమగండం    : *ఉ 07.36 - 09.01* 

సూర్యరాశి : *తుల*

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 06.10* 

సూర్యాస్తమయం :*సా 05.33*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.10 - 08.26*

సంగవ కాలం   :*08.26 - 10.43*

మధ్యాహ్న కాలం :*10.43 - 01.00*

అపరాహ్న కాలం : *మ 01.00 - 03.17*

*ఆబ్ధికం తిధి : కార్తీక శుద్ధ త్రయోదశి*

సాయంకాలం  :  *సా 03.17 - 05.33*

ప్రదోష కాలం  :  *సా 05.33 - 08.05*

రాత్రి కాలం     :  *రా 08.05 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.30 - 05.20*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం*🪷


*ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |*

*మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||*

    

🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

🌹🍃🌿🪷🪷🌿🍃🌹

12, నవంబర్ 2024, మంగళవారం

73. " మహాదర్శనము

 73. " మహాదర్శనము "--డెబ్భై మూడవ భాగము--వారికీ సద్గతి అయినది.


73.  డెబ్భై మూడవ భాగము --వారికీ సద్గతి అయినది. 



         భగవానులకు ఆ దినము సభ అర్పించిన కానుక సుమారు పది లక్షలకు పైనే ఐంది. రాజు అదంతా తీసుకొని వెళ్ళి రాజ భండారములో ఉంచి , భగవానుల ఆజ్ఞ ప్రకారము ఉపయోగించవలెను అని ఆదేశించినారు. భగవానులు తల్లిదండ్రులూ , పత్నీ శిష్యులతో పాటూ ఇంటికి వచ్చినారు. రాజు , దేశాధిపతులూ , విద్వాంసులూ భగవానుల వెనకే వచ్చి వారిని ఇంటికి చేర్చి , వారి అనుమతితో వెనుతిరిగినారు. అందరికీ ఉత్సవమే ఉత్సవము. ఒక జీవము మాత్రము మంటకు చిక్కిన అరిటాకువలె ముఖము మాడిపోగా భగవానుల వెనకే ఇంటిలోపలికి వచ్చింది. మైత్రేయీ , కాత్యాయనీ , ఆలంబిని ఆమెను విశ్వాసముతో ఆహ్వానించినారు. ఆమెకు భగవానులను చూస్తే ఎక్కడలేని ఏడుపూ వచ్చింది. దెబ్బతిని వెక్కుతూ ఏడ్చు పాప వలె గోడుమని ఏడ్చింది. అందరికీ ఆశ్చర్యమే ఆశ్చర్యము. గార్గి ఏడ్చుటను కాదు , ఆమె నిస్తేజమగుటను కూడా ఎవరూ చూచియుండలేదు. అదీకాక, భగవానులు ఆమెను నిండు సభలో భగవతి అని పిలచినారు. మరి ఆమె దుఃఖమునకు కారణమేమి ? 


          ఇంటివారందరూ అనునయించినారు. దేవరాతుడు అభిమానముతో , ’ ఎందుకమ్మా ? ఏమయినది ? " అని విచారించినారు. భగవానులు మాత్రము , ఏమీ మాట్లాడక , శాంతముగా ఉన్నారు. చివరికి కొంతసేపు ఏడ్చిన తరువాత , గార్గి , భగవానుల పాదములపైన పడింది. ఏడుపు మధ్యలోనే ఏమో చెప్పబోతుంది , అలాగే ఇంకా కొంత సేపయింది. 


          చివరికి భగవానులు , ’ ఏమైందని భగవతి ఇంతగా ఏడుస్తున్నారు ? "అన్నారు. వారి శబ్దమును వినగానే మేఘములు తొలగగా ప్రకాశించిన సూర్యుని వలె భగవతి ఏడుపు నిలచిపోయినది. 


         ఆమె కాత్యాయని తెచ్చిచ్చిన నీటితో ముఖమూ , కాళ్ళు చేతులూ కడుక్కొని శుద్ధాచమనము చేసి కూర్చున్నది. అదే సమయములో మిగిలినవారు కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధాచమనము చేసి కూర్చున్నారు. దేవరాతుడు ఆసనములో కూర్చున్న తరువాత భగవానులు కూడా కూర్చొని భగవతిని విచారించినారు.


భగవతికి ఏడుపు ఆగిపోయింది. అయినా శోకపు వేడిమి ఆరలేదు. ఆమె అడిగినారు, " విదగ్ధుల గతి యేమైనది ?"


         భగవానులు నిట్టూర్చి అన్నారు: " వారు వచ్చినపుడు వేదికపైన వారికి నేను చూపిన గౌరవము చూసి , వారిని చూచి నేను బెదరిపోయి అలాగ చేస్తున్నాననుకున్నారు. అప్పుడే ఆదిత్య అగ్ని వాయువులు కోపగించినారు. అప్పుడు నేను శాంతింపజేసినాను. అనంతరము శాకల్యులు దేవతల విచారము నెత్తినారు. మనము కంటికి కనపడరు అన్న కారణము చేత దేవతలు లేరు అనుకుంటాము , భగవతీ.  కానీ , వారు పరోక్షప్రియులు. కనిపించని చేయిగా ఉండి అన్ని పనులనూ చేయిస్తారు. దేవతా విభూతి సంకోచములను అడుగుతున్నట్లల్లా దేవతల రుద్ర రూపమైన తేజస్సు అక్కడ సంభృతమగుతూ వచ్చింది. ( ఆవహించుటకు సిద్ధముగా , పెరుగుతూ వచ్చినది ). ప్రాణపు వికాసములను గురించి చెప్పునపుడు విదగ్ధుల లోనున్న ప్రాణము విద్రుతమైనది (  కరగి, తగ్గినది ) దానిని తిరిగి తనలోపలికి ఆకర్షణ చేసుకోనీ యని నేను దిక్కుల విచారమునెత్తినాను. వారు గమనింపలేదు. చివరికి అన్నిటినీ సరిపరచు ఔపనిషదిక పురుషుని విచారము నెత్తినాను. అప్పుడు కూడా వారు దానిని అందుకోలేదు. అంతవరకూ సంభృతమయిన తేజస్సు ప్రకటమైనది. దానికి వారు ఆహుతి అయినారు. "


        గార్గి ఆ వేళకు శాంతురాలై ఉండినది. అన్నది , " భగవాన్ , అసలే పార్థివ దేహము , చాలదన్నట్టు జరా జీర్ణమయినది. ఎప్పుడైనా పోవలసినదే. పోయింది. దానికోసము నేను వ్యథ పడుట లేదు. అయితే , వారికి సద్గతి అయినదో లేదో ? అన్నదే నా వ్యథ. " 


" తమ వ్యథ సాధువైనది . అయితే తమరెందుకు ఆలోచించలేదు ? దేవతల కోపానికి పాత్రులైనవారికి సద్గతి ఎక్కడిది ? "


        భగవతి అది విని దుఃఖమును తట్టుకోలేకపోయినది. " భగవాన్ , కాపాడవలెను. విదగ్ధులకు దుర్గతి పట్టకూడదు. కాపాడవలెను. " అని గోడుపెట్టింది." కావలెనన్న , ఈ జన్మలో నేను ఆర్జించిన పుణ్యమునంతా ఇచ్చివేస్తాను. వారికి బ్రహ్మజ్ఞులకు కలుగు సద్గతి కలగవలెను " 


         భగవానుల హృదయము పసిపిల్లవాడి వంటిది. ఎప్పుడూ ఆనందముతో నిండి రసార్ద్రముగానే ఉండును. అది భగవతి గోడును విని కరగక ఎలాఉండును ? అన్నారు :" భగవతీ , ఇప్పుడు వారికి దొరకు దుర్గతి కూడా బహుకాలముండదు. ఆ దుర్గతియొక్క స్వరూపమేమో తెలుసా ? శరీరమే తాననుకొని , శరీరమునకగు బాధలన్నిటినీ తనవనుకొని , సుఖ దుఃఖానుభవము పొందును. దుఃఖానుభవమునకై వేరే లోకమున్నది. అది నరకము. ఇదంతా మీకు తెలుసు. కావాలంటే ఇక్కడే ఉండి దానిని చూడవచ్చును. అక్కడ కొంతకాలము విదగ్ధులు ఉండవలసినది. అయితే మీరు అడ్డువచ్చినారు. వారికి సద్గతి కావలెనంటిరి. తప్పకుండా కానీ. అందరి ఆత్మ ఒకటే అన్నట్టయితే , మనము అది తెలిసినవారమైతే , మన ఆత్మే అయిన విదగ్ధుల ఆత్మ ఎందుకు లేని భ్రాంతికి లోనై నలగవలెను ? బ్రహ్మ లోకము సదా ఆత్మదర్శనమగు లోకము. అక్కడికి వెళ్ళువాడు అక్కడే శాశ్వతముగా ఆత్మదర్శనము వలన బ్రహ్మానందమును పొందుతూ ఉంటారు. చివరికి బ్రహ్మలో తృప్తి పొంది బ్రహ్మమును పొందును. ఇంతయితే చాలుకదా ? "


         భగవతి భగవానుల వచనములను విన్నది. ఆమెకు సంతోషమయినది. విదగ్ధులకు నరకవాసము తప్పి, శాశ్వతమైన బ్రహ్మలోకము దొరికినది కదా అన్న సంతోషముతో భగవానులకు నమస్కారము చేసి , " అట్లయిన చాలు. వారు మా గురువులు. దానికోసమే ఇంత కష్టమును పొందినాను, క్షమించవలెను " అన్నది. భగవానులు నవ్వి , " ఇటువంటి సూటి చర్చ మాకు వద్దనిపించలేదు " అన్నారు. 


         భారమైన హృదయముతో సంకట పడుతూ వచ్చిన భగవతి లఘువైన హృదయముతో బయలు దేరింది. భగవానులు ఆమెను నిలిపి , " వరమును అడిగి పొందినవారు ప్రతిగా ఒక వరమును ఇచ్చి కదా వెళ్లవలసినది ? " అన్నారు. బయల్వెడలిన ఆమె, ’ పరిపూర్ణ బ్రహ్మయై , ఆప్త కాములైన వారు వరమును అడిగితే , బెల్లపు గణపతికి బెల్లమే నివేదన అన్నట్టవుతుంది , అంతే కదా ? ఈ ముఖముతో అడుగుతారు , ఇంకొక ముఖముతో ఇస్తారు. దానికేమి ? తప్పకుండా " అన్నది. 


         భగవానులు గంభీరముగా అన్నారు :" ఇక మీదట భగవతి ఎప్పుడూ కూడా దేహోహం భ్రాంతికి లోనుకాకుండా ఆత్మాహం మతి తో వర్తించవలెను. ఈ వరమును ఇవ్వవలెను " 


         భగవతి కళ్ళు  ఆనందముతో హర్షించగా అన్నారు : " ఇది తమరు ఇచ్చిన వరమా ? అడిగిన వరమా ? దేవతలు ఇచ్చినది సుఖమునకూ కావచ్చు, దుఃఖమునకూ కావచ్చును. అయితే సాధువులు ఇచ్చునది ఎల్లపుడూ సుఖమునకే అవుతుంది అని విన్నాను. ఇప్పుడు అది నిజమయినది. ఇది నిజంగా వరమే. ఎప్పుడూ ఇలాగే ఉండునట్లు అనుగ్రహించండి " అని నమస్కారము చేసినది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

Janardhana Sharma

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*193 వ రోజు*

*అర్జునుడు ద్రోణునితో తలపడుట*

అర్జునుడు నవ్వి " ఉత్తరకుమారా! భయం వలదు నేనున్నాను నిర్భయంగా రధాన్ని ద్రోణుని వైపు మళ్ళించు ఎర్రని గుర్రాలు పూన్చిన రధాన్ని అధిరోహించి వారే ద్రోణుడు, నాకు గురువు నాకు హితుడు బహు శస్తాస్త్ర కోవిధుడు రాజ ధర్మంగా ఇప్పుడు నేను ఆయనతో పోరాడవలసి వచ్చినది " అన్నాడు. ఉత్తరుడు అలాగే చేసాడు. అర్జునుడు గురువును చూసి " గురుదేవా! నమస్కారం. అడవులలో పన్నేండేళ్ళు , అజ్ఞాతంలో ఒక ఏడు గడిపి ఎన్నో బాధలు పడ్డాము. ఇది మంచి తరుణం అని ఎంచి మీ ముందుకు వచ్చాను. నా మీద కోపగించకండి ముందుగా మీ పై బాణప్రయోగం చేయలేను ముందుగా మీరే నాపై బాణప్రయోగం చెయ్యండి " అని వేడుకున్నాడు. అతని మాటలకు సంతోషపడి ద్రోణుడు అర్జునినిపై పది బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వేసాడు. ఇప్పుడు అర్జునినికి ద్రోణుడికి ద్వంధ యుద్ధం ఆరంభమైంది. అతిరధులు, అస్త్రకోవిదులు, పరాక్రమోపేతులైన వీరి యుద్ధాన్ని కౌరవ సేనలు కుతూహలంతో చూస్తున్నాయి. ద్రోణుని అస్త్రాలను సమర్ధంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. కురుసేనను తనుమాడుతున్న అర్జునిని చూసి ద్రోణుడు ఆశ్చర్య చకితు డౌతున్నాడు. కురు సేనలు తరిగి పోతున్నాయి. అర్జునిని గెలవడం అసాధ్యమని అనుకున్నాడు. అర్జునుడు ద్రోణుని శరీరాన్ని, కేతనాన్ని, సారథిని ఒక్క సారిగా బాణాలతో కొట్టాడు. కురు సైన్యాలు హాహాకారాలు చేసాయి. తండ్రి పరిస్థితి చూసి అశ్వథ్థామ అతనికి సాయం వచ్చాడు.*


*అశ్వథ్థామ కృపాచార్యులతో అర్జునిని యుద్ధం*


అశ్వథ్థామ విల్లందుకుని అర్జునిని గాండీవంలోని అల్లెత్రాటిని కొట్టాడు. అల్లెత్రాటిని బిగిస్తున్న అర్జునినిపై అశ్వథ్థామ ఎనిమిది బాణాలు ప్రయోగం చేసాడు. అర్జునుడు అల్లెత్రాటిని బిగించి అశ్వథ్థామ బాణాలను మధ్యలోనే త్రుంచాడు. అశ్వథ్థామపై అర్జునుడు శరపరంర సంధించాడు. అశ్వథామకు అర్జునిలా అక్షయతుణీరం లేదు కనుక అర్జునిపై బాణ ప్రయోగం చేయలేక పోయాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వథ్థామకు సాయంగా వచ్చాడు. అర్జునుడు కృపాచార్యునిపై బాణప్రయోగం చేసాడు. కృపాచార్యుడు విజృంభించి అర్జునుని కపిధ్వజాన్ని కొట్టి జయధ్వానాలు చేసాడు. అర్జునుడు కోపించి కృపాచార్యుని రథాన్ని విరగకొట్టి, గుర్రాలను చంపాడు. విరధుడైన కృపాచార్యుడు ధైర్యంగా శక్తి ఆయుధాన్ని అర్జునినిపై విసిరాడు. అర్జునుడు శక్తి ఆయుధాన్ని ముక్కలు చేసాడు. కృపుడు చేసేది లేక కత్తి డాలు తీసుకుని అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపుని కత్తి విరిచాడు. కృపుడు అశ్వథ్థామ రథం ఎక్కాడు*


*కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట*


కృపాచార్యునికి పట్టిన గతి చూసి కురు సేనలు భీష్ముని వెనుక చేరాయి. ఇది చూసి వృషసేనుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు బల్లెం తీసుకుని వృషసేనుని విల్లు విరిచి అతని గూడెలపయి పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు పారి పోయాడు. పక్కనే ఉన్న దుర్ముఖుడు, వివిశంతి, దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని ఒక్క సారిగా అర్జునిని చుట్టుముట్టారు. అర్జునుడు వారి రథాలను, విల్లును విరిచాడు. అర్జునిని ధాటికి తాళ లేక వారంతా పారి పోయారు. అర్జునుడు " ఉత్తర కుమారా ! ఇక మా తాత గారైన భీష్ముడు మాత్రమే మిగిలి ఉన్నాడు. తాళవృక్ష కేతనమున్న భీష్ముని వైపు రధాన్ని పోనిమ్ము " అన్నాడు. ఉత్తరుడు భీష్ముని వైపు రథం పోనిచ్చాడు. అర్జునుని చూసి భీష్ముడు శంఖం పూరించాడు. రెండు వృషభముల వలె వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. భీష్ముడు బాణాలతో కపిధ్వజాన్ని, దాని వెంట ఉన్న భూతములను, రథసారథిని కొట్టాడు. ఆ బాణముల్సన్నిటిని మధ్యలోనే అర్జునుడు తుంచేసాడు. అర్జునుడు తన బాణాలతో భీష్ముని కప్పాడు. అర్జునుడు వేసే ప్రతి బాణాన్ని భీష్ముడు తునాతునకలు చేసాడు. అర్జునుడు తన అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తుంటే వారు బాగున్నాయి ఇంకా చూపించు అన్నట్లుంది వారి యుద్ధం. అర్జునుడు కోపించి తాత విల్లు విరుగకొట్టాడు. తాతగారికి కోపం వచ్చి మనుమడిపై శరపరంపరను కురిపించారు. అర్జునుడు తాతగారి బాణాలను అన్నీ తుంచి భీష్ముని ఆయన రథాన్ని, సారథిని, గుర్రాలను కొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకునే లోపు అర్జునుడు భీష్ముని గుండెలపై కొట్టాడు. భీష్ముడు రథంపై సోలి పోయాడు. సారథి రథాన్ని పక్కకు తొలిగించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

27. క్షేమేశ్వర (సోమేశ్వర) ఘాట్

 27. క్షేమేశ్వర (సోమేశ్వర) ఘాట్

గతంలో నాలా ఘాట్ అని పిలిచేవారు, నేడు మనం చూస్తున్న ఘాట్ 18వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. కుమారస్వామి అనుచరులు 1962లో ఇక్కడ ఒక మఠాన్ని నిర్మించారు మరియు కేశమేశ్వర మరియు క్షేమక గణాల పుణ్యక్షేత్రాలను కూడా సృష్టించారు. నేడు పొరుగు ప్రాంతంలో బెంగాలీ నివాసితులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.🙏

26. చౌకీ (కోవ్కీ) ఘాట్

 26. చౌకీ (కోవ్కీ) ఘాట్

1790లో నిర్మించబడింది మరియు దీనిని బౌద్ధ ఘాట్ అని కూడా పిలుస్తారు, ఇది మెట్ల పైభాగంలో ఉన్న భారీ పిపాలా చెట్టు (ఫికస్ రెలిజియోసా) కు ప్రసిద్ధి చెందింది, ఇది రాతి నాగుల యొక్క విస్తారమైన శ్రేణిని ఆశ్రయిస్తుంది. ఈ చెట్టుకు సమీపంలో రుక్మాంగేశ్వరుని మందిరం ఉంది మరియు కొంచెం దూరంలో నాగ కుప (లేదా "పాము బావి") ఉంది. ఈ ఘాట్ సమీపంలో నివాసం ఉండే చాకలి కులస్తుల ప్రాబల్యం కారణంగా, ప్లాట్‌ఫారమ్‌లు, ఇనుప రెయిలింగ్ మరియు మెట్ల కట్టలను కూడా బట్టలు ఆరబెట్టడానికి ఉపయోగిస్తారు.

25. కేదార్ ఘాట్

 25. కేదార్ ఘాట్

గౌరీ కేదారేశ్వరాలయానికి నిలయమైన కేదార్ ఘాట్, వారణాసిలోని ఐదు పవిత్ర ఘాట్‌లలో ఒకటి. దశాశ్వమేధం, పంచగంగ, మణికర్ణిక మరియు ఆది కేశవ ఇతర నాలుగు ప్రధాన ఘాట్‌లు. 

కాశీ భారతదేశ భక్తికి మండలమని విశ్వసించినట్లే, కేదారాన్ని కాశీ-కేదార్ ఖండం యొక్క మండలమని నమ్ముతారు.



కేదార్ ఘాట్ స్కంద పురాణంలోని కేదార ఖండంలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు పురాతన గ్రంథాలచే నియమించబడిన పద్నాలుగు ముఖ్యమైన లింగాలలో ఒకటైన కేదారేశ్వర లింగానికి నిలయం. కేదార్ యొక్క అసలు ఆలయం గొప్ప గంగా ఒడ్డున హిమాలయాలలో ఉంది, కాశీలో దీనిని సృష్టించే ముందు శివుడు అక్కడ లింగాన్ని ఎలా స్థాపించాడో పురాణ గ్రంథాలు వివరిస్తాయి. కొంతమంది పండితులు ఈ ఆలయం యొక్క మూలాలు నగరంలోని అసలు విశ్వనాథ దేవాలయం కంటే ఎక్కువ కాలం నాటివని నమ్ముతారు.

16వ శతాబ్దం చివరలో దత్తాత్రేయ భక్తుడైన కుమారస్వామి కేదారేశ్వర ఆలయానికి అనుబంధంగా ఒక మఠాన్ని నిర్మించాడు. ఇక్కడ కనుగొనబడిన మరియు సుమారుగా క్రీ.శ. 1100 నాటి ఒక గహదవల శాసనం ఒకప్పుడు ఇక్కడికి సమీపంలో ఉన్న స్వప్నేశ్వర ఘాట్ గురించి ప్రస్తావించింది,.

ఈ కేదార్ ముందు పైపులు గౌరీకుండ్ అనే కుండము గలదు

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*193 వ రోజు*

*అర్జునుడు ద్రోణునితో తలపడుట*

అర్జునుడు నవ్వి " ఉత్తరకుమారా! భయం వలదు నేనున్నాను నిర్భయంగా రధాన్ని ద్రోణుని వైపు మళ్ళించు ఎర్రని గుర్రాలు పూన్చిన రధాన్ని అధిరోహించి వారే ద్రోణుడు, నాకు గురువు నాకు హితుడు బహు శస్తాస్త్ర కోవిధుడు రాజ ధర్మంగా ఇప్పుడు నేను ఆయనతో పోరాడవలసి వచ్చినది " అన్నాడు. ఉత్తరుడు అలాగే చేసాడు. అర్జునుడు గురువును చూసి " గురుదేవా! నమస్కారం. అడవులలో పన్నేండేళ్ళు , అజ్ఞాతంలో ఒక ఏడు గడిపి ఎన్నో బాధలు పడ్డాము. ఇది మంచి తరుణం అని ఎంచి మీ ముందుకు వచ్చాను. నా మీద కోపగించకండి ముందుగా మీ పై బాణప్రయోగం చేయలేను ముందుగా మీరే నాపై బాణప్రయోగం చెయ్యండి " అని వేడుకున్నాడు. అతని మాటలకు సంతోషపడి ద్రోణుడు అర్జునినిపై పది బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వేసాడు. ఇప్పుడు అర్జునినికి ద్రోణుడికి ద్వంధ యుద్ధం ఆరంభమైంది. అతిరధులు, అస్త్రకోవిదులు, పరాక్రమోపేతులైన వీరి యుద్ధాన్ని కౌరవ సేనలు కుతూహలంతో చూస్తున్నాయి. ద్రోణుని అస్త్రాలను సమర్ధంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. కురుసేనను తనుమాడుతున్న అర్జునిని చూసి ద్రోణుడు ఆశ్చర్య చకితు డౌతున్నాడు. కురు సేనలు తరిగి పోతున్నాయి. అర్జునిని గెలవడం అసాధ్యమని అనుకున్నాడు. అర్జునుడు ద్రోణుని శరీరాన్ని, కేతనాన్ని, సారథిని ఒక్క సారిగా బాణాలతో కొట్టాడు. కురు సైన్యాలు హాహాకారాలు చేసాయి. తండ్రి పరిస్థితి చూసి అశ్వథ్థామ అతనికి సాయం వచ్చాడు.*


*అశ్వథ్థామ కృపాచార్యులతో అర్జునిని యుద్ధం*


అశ్వథ్థామ విల్లందుకుని అర్జునిని గాండీవంలోని అల్లెత్రాటిని కొట్టాడు. అల్లెత్రాటిని బిగిస్తున్న అర్జునినిపై అశ్వథ్థామ ఎనిమిది బాణాలు ప్రయోగం చేసాడు. అర్జునుడు అల్లెత్రాటిని బిగించి అశ్వథ్థామ బాణాలను మధ్యలోనే త్రుంచాడు. అశ్వథ్థామపై అర్జునుడు శరపరంర సంధించాడు. అశ్వథామకు అర్జునిలా అక్షయతుణీరం లేదు కనుక అర్జునిపై బాణ ప్రయోగం చేయలేక పోయాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వథ్థామకు సాయంగా వచ్చాడు. అర్జునుడు కృపాచార్యునిపై బాణప్రయోగం చేసాడు. కృపాచార్యుడు విజృంభించి అర్జునుని కపిధ్వజాన్ని కొట్టి జయధ్వానాలు చేసాడు. అర్జునుడు కోపించి కృపాచార్యుని రథాన్ని విరగకొట్టి, గుర్రాలను చంపాడు. విరధుడైన కృపాచార్యుడు ధైర్యంగా శక్తి ఆయుధాన్ని అర్జునినిపై విసిరాడు. అర్జునుడు శక్తి ఆయుధాన్ని ముక్కలు చేసాడు. కృపుడు చేసేది లేక కత్తి డాలు తీసుకుని అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపుని కత్తి విరిచాడు. కృపుడు అశ్వథ్థామ రథం ఎక్కాడు*


*కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట*


కృపాచార్యునికి పట్టిన గతి చూసి కురు సేనలు భీష్ముని వెనుక చేరాయి. ఇది చూసి వృషసేనుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు బల్లెం తీసుకుని వృషసేనుని విల్లు విరిచి అతని గూడెలపయి పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు పారి పోయాడు. పక్కనే ఉన్న దుర్ముఖుడు, వివిశంతి, దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని ఒక్క సారిగా అర్జునిని చుట్టుముట్టారు. అర్జునుడు వారి రథాలను, విల్లును విరిచాడు. అర్జునిని ధాటికి తాళ లేక వారంతా పారి పోయారు. అర్జునుడు " ఉత్తర కుమారా ! ఇక మా తాత గారైన భీష్ముడు మాత్రమే మిగిలి ఉన్నాడు. తాళవృక్ష కేతనమున్న భీష్ముని వైపు రధాన్ని పోనిమ్ము " అన్నాడు. ఉత్తరుడు భీష్ముని వైపు రథం పోనిచ్చాడు. అర్జునుని చూసి భీష్ముడు శంఖం పూరించాడు. రెండు వృషభముల వలె వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. భీష్ముడు బాణాలతో కపిధ్వజాన్ని, దాని వెంట ఉన్న భూతములను, రథసారథిని కొట్టాడు. ఆ బాణముల్సన్నిటిని మధ్యలోనే అర్జునుడు తుంచేసాడు. అర్జునుడు తన బాణాలతో భీష్ముని కప్పాడు. అర్జునుడు వేసే ప్రతి బాణాన్ని భీష్ముడు తునాతునకలు చేసాడు. అర్జునుడు తన అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తుంటే వారు బాగున్నాయి ఇంకా చూపించు అన్నట్లుంది వారి యుద్ధం. అర్జునుడు కోపించి తాత విల్లు విరుగకొట్టాడు. తాతగారికి కోపం వచ్చి మనుమడిపై శరపరంపరను కురిపించారు. అర్జునుడు తాతగారి బాణాలను అన్నీ తుంచి భీష్ముని ఆయన రథాన్ని, సారథిని, గుర్రాలను కొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకునే లోపు అర్జునుడు భీష్ముని గుండెలపై కొట్టాడు. భీష్ముడు రథంపై సోలి పోయాడు. సారథి రథాన్ని పక్కకు తొలిగించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

10-01-గీతా మకరందము

 10-01-గీతా మకరందము

    విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ దశమోఽధ్యాయః 

పదియవ అధ్యాయము 

విభూతియోగః

విభూతియోగము 


శ్రీ  భగవానువాచ :- 

భూయ ఏవ మహాబాహో 

శ్రుణు మే పరమం వచః | 

యత్తేఽహం ప్రీయమాణాయ 

వక్ష్యామి హితకామ్యయా || 


తా:- శ్రీ భగవానుడు చెప్పెను - గొప్ప బాహువులుగల ఓ అర్జునా! (నా మాటలు విని) సంతసించుచున్న నీకు హితమును గలుగజేయు నుద్దేశముతో మరల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవుచున్నానో, దానిని వినుము. 

  

వ్యాఖ్య:- గురువాక్యములను శిష్యుడు ఆసక్తితో శ్రవణముచేయుచు ప్రీతిని కనబఱచునపుడు గురువునకు ఉత్సాహము జనించి కరుణతో ఇంకను ఎంతయో మహత్తరమగు బోధను గావించును. కనుకనే శ్రద్ధ అవసరము. అశ్రద్ధతో వినినది విననిదానితో సమానము, ఇచ్చినది ఇవ్వని దానితో సమానము*. అర్జునుడు భగవంతుని వాక్యములను అత్యంతశ్రద్ధతో నాలకించుచు అమృతపానము చేయుచున్నవాని చందమున గీతోపదేశ శ్రవణమున పరమప్రీతి వ్యక్తముచేయుచుండెను. కనుకనే ‘ప్రీయమాణాయ’ (ప్రీతినిబొందుచున్న) అని చెప్పబడెను. శ్రీకృష్ణునిబోధ అర్జునుని బాధను పోగొట్టుచుండెను. అందువలననే అర్జునునకు భగవద్వాక్యములందు ప్రీతి మెండగుచుండెను. ఇదియంతయు గ్రహించి శ్రీకృష్ణమూర్తి ఉత్సాహభరితుడై ఇట్టి శ్రద్ధాళువగు శిష్యునకు ఇంకను భగవత్తత్త్వమును గూర్చి బోధించిన బాగుండునని తలంచి మఱల బోధను ఉపక్రమించుచున్నారు. అందుచే ‘భూయః’ (మఱల) అని చెప్పబడెను. పరమార్థవిద్యను మఱల మఱల శ్రవణముచేయుచు, శ్రవణమొనర్చినదానిని మననము చేయుచు, నిదిధ్యాసనము, గావించుచుండిన, అది లెస్సగ జీర్ణము కాగలదు. పూర్వము చెప్పినదానిని తిరిగి భగవానుడు చెప్పనారంభించుట కిదియును కారణమైయున్నది. అర్జునున కిట్టి పౌనఃపున్యవిచారణచే,  అతిశయశ్రవణాదులచే దైవతత్త్వము బాగుగ హృదయస్థము కాగలదను అభిప్రాయముచే నిట్లు చెప్పినదానినే మఱల చెప్పుట సంభవించుచున్నది. 

    ‘హితకామ్యయా’ - శ్రద్ధాళువగు శిష్యునకు గురువు హితమొనర్పదలంచును. అన్నిటికంటె గొప్పహితము బంధవిముక్తియే. అయ్యది ప్రాపంచికపదార్థప్రదానముచే ఎన్నటికిని కలుగనేరదు. ఆధ్యాత్మిక జ్ఞానదానముచేతనే కలుగగలదు. అందువలన అర్జునునకు ఆత్యంతికహితము చేకూర్చదలంచి భగవానుడు తత్త్వబోధ గావింపనుపక్రమించిరి. 

        ‘పరమం వచః’ - అని చెప్పుటవలన శ్రీకృష్ణమూర్తి చెప్పబోవువాక్యములు సామాన్యములైనవి కావనియు జీవుని హృదయస్థమగు అనాది అజ్ఞానాంధకారమును తొలగింపగలవి యనియు స్పష్టమగుచున్నవి. కావున విజ్ఞుడగువాడు తనజీవితమును వ్యర్థములగు ప్రాపంచికవాక్యములను వినుటయందే గడిపివేయక సంసారతరణోపాయములను తెలుపునట్టి ఇట్టి పరమవాక్యములను, పరమార్థజ్ఞానమును వినవలెను. 

     

ప్ర:- శ్రీకృష్ణమూర్తి చెప్పబోవునవి యెట్టి వాక్యములు?

ఉ:- సర్వశ్రేష్ఠములైన వాక్యములు. 

ప్ర:- శ్రీకృష్ణు డర్జునునకు పరమార్థజ్ఞానమును మఱల ఏల బోధింపనెంచెను?

ఉ:- భగవద్వాక్యములందు అర్జునుడు పరమాసక్తిని కనబఱచెను. అందుచే  నతనికి హిత మొనర్పదలంచి అట్లు చెప్పదొడంగెను.   

ప్ర:- ప్రపంచములో అన్ని హితకార్యములకంటె గొప్పది యేది ? 

ఉ:- పరమార్థవిద్యావితరణము. 

-----------------------------

*అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్, అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ.   (17-28) 

---------------------------

పంచాంగం

 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌷పంచాంగం🌷

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 12 - 11 - 2024,

వారం ... భౌమవాసరే ( మంగళవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం,

శరదృతువు,

కార్తీక మాసం,

శుక్ల పక్షం,


తిథి : ఏకాదశి మ12.21 వరకు,

నక్షత్రం : ఉత్తరాభాద్ర తె3.26 వరకు,

యోగం : హర్షణం సా5.32 వరకు,

కరణం : భద్ర మ12.21 వరకు,

                తదుపరి బవ రా11.11 వరకు,


వర్జ్యం : మ2.00 - 3.29,

దుర్ముహూర్తము : ఉ8.20 - 9.05,

                              మరల రా10.27 - 11.18,

అమృతకాలం : రా10.57 - 12.26,

రాహుకాలం : మ3.00 - 4.30,

యమగండం : ఉ9.00 - 10.30,

సూర్యరాశి : తుల,

చంద్రరాశి : మీనం,

సూర్యోదయం : 6.05,

సూర్యాస్తమయం: 5.23,

        

               *_నేటి విశేషం_*


*కార్తీక శుద్ధ ఏకాదశి.. భోదన ఏకాదశి ... ఉత్థాన ఏకాదశి..*

కార్తీక శుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి.. దేవ - ప్రబోధిని ఏకాదశి , ఉత్థాన ఏకాదశి అని పేర్లు. 


ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి..

ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. 

దీనినే హరి - భోధిని ఏకాదశి అని కూడా అంటారు...


తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. 


మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి , అంపశయ్య మీద శయనించాడు...


ఈ రోజున ఉపవాసం ఉండి , విష్ణువును పూజించి , రాత్రి జాగరన చేసి , మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి , పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.  


_ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది._

   ఈ ఏకాదశి పాపాలను హరిస్తుందని చెబుతారు...

1000 అశ్వమేధ యాగాలు , 

100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో , అలాగ ఒక జీవుడు , తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది.. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం అని చెబుతారు...


ఈ రోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా , అది మేరు పర్వతానికి సమానమైన 

పుణ్య ఫలితం ఇస్తుందని పురాణ కథనం...


ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని పురాణ కథలు వున్నాయి,

ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం , సంపదలు , ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపపరిహారం జరుగుతుంది. 

పుణ్యక్షేత్ర దర్శనాలు , యజ్ఞయాగాలు , వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం...ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.


ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. 


బీదలకు వస్త్రదానం చేయడం వలన , పండ్లు , దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయట,


ఈ రోజున బ్రహ్మాది దేవతలు , యక్షులు , కిన్నెరులు , కింపురుషులు , మహర్షులు , సిద్దులు , యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ , భజనలతోనూ..హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు 

శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో..వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని 

ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి.


              *_🌷శుభమస్తు🌷_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

శ్రీ జయ దుర్గా పరమేశ్వరి ఆలయం

 🕉 మన గుడి : నెం 928



⚜ కర్నాటక  : కన్నార్పడి_ ఉడిపి 


⚜ శ్రీ జయ దుర్గా పరమేశ్వరి ఆలయం



💠 కర్ణాటక తీరప్రాంతం పవిత్రమైన దేవాలయాలకు ప్రసిద్ధి.  

ప్రత్యేకించి "రజత పీఠం"గా పిలువబడే ఉడిపి నగరాన్ని దేవతా కేంద్రంగా పరిగణిస్తారు.


💠 కన్నార్‌పడి జయదుర్గా పరమేశ్వరి దేవాలయం 66వ జాతీయ రహదారి పక్కన 150 గజాల దూరంలో ఉంది. 

 ఆలయానికి సమీపంలో కణ్వ పుష్కరణి కూడా ఉంది.


💠 పట్టణంలో 'కన్నర' అని పిలువబడే బ్రాహ్మణ కుటుంబం నివసించిన తర్వాత "కన్నారపడి" అనే పేరు ఆచరణలోకి వచ్చింది.


💠 చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు ఉద్యావర అని పిలవబడేది అప్పుడు ఉదయపుర అని పిలువబడింది. 

 దీనిని అప్పటి అలుపా రాజవంశం రాజులు పరిపాలించారని పరిశోధనలు చెబుతున్నాయి. 

అందుకే శ్రీ జయదుర్గాపరమేశ్వరి ఆలయం ఈ రాజులచే నిర్వహించబడుతుందని నమ్ముతారు. 



💠 పౌరాణిక చరిత్ర ప్రకారం, పురాతన కాలంలో ఆలయం ముందు ఉన్న చిన్న సరస్సు సమీపంలో పూజా ఆచారాలు చేస్తూ కణ్వ ముని నివసించేవారు. 

ఒక తెల్లవారుజామున శ్రీ దేవి అతని కలలో కనిపించింది, తానే జయదుర్గేనని మరియు అతని సేవ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది.  

ఋషి ఉదయం మేల్కొన్నప్పుడు, నిన్న రాత్రి తన కలలో కనిపించిన శ్రీ దేవి ముఖాన్ని పోలిన విగ్రహం కనిపించింది. 

 ఆ విధంగా మహర్షి తన కర్మలు చేసిన ప్రదేశాన్ని కన్నారపడి అని, సరస్సు కణ్వ పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది. 

 

💠 ఒకప్పుడు ఈ ఆలయాన్ని బ్రాహ్మణ కుటుంబం నిర్వహించేది.  ఈ వంశంని కణ్వరాయ, కన్నారాయ, మొదలైన పేర్లతో పిలుస్తారు. 

ఈ సంఘానికి చెందిన శంకర్ కణ్వరాయ తన భార్య యాత్ర జ్ఞాపకార్థం దేవి యొక్క బలి మూర్తిని సమర్పించాడు. 

 ఆలయం వద్ద లభించిన శాసనాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు.  

ఈ శాసనం 16-17 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు.


💠 ఇక్కడ జయదుర్గా దేవి తలపై చంద్రుడిని ధరించి, మూడు కళ్ళు, నాలుగు చేతులతో వరుసగా శంఖ, చక్ర, కృపాణ మరియు అగ్నిశాఖను పట్టుకుని, నిలబడి, సింహంపై ఉంటుంది.


💠 దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలు ఒకదానిలో ఒకటిగా ఉండటం వలన ఈ విగ్రహం ప్రత్యేకమైనది.


💠 ఉడిపిలోని నాలుగు ముఖ్యమైన దుర్గామాత ఆలయాలలో ఇది ఒకటి మరియు ఇది స్కంద పురాణంలో పేర్కొనబడింది.  

ఆమె వాహనం, సింహం, దీపం పైన కూడా చూడవచ్చు.   

ఆలయ ప్రాంగణంలోని పవిత్ర చెరువును కణ్వ పుష్కరణి అంటారు.  

ఈ క్షేత్రం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. 


💠 ఈ పుణ్యక్షేత్రం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా భావిస్తున్నారు. 

ఆలయ నిర్మాణం ఇతర తీరప్రాంత కర్ణాటక దేవాలయాల మాదిరిగానే ఉంటుంది. గర్భగుడిని నల్ల గ్రానైట్ ఉపయోగించి నిర్మించారు. 

ఆలయ లోపలి ప్రాంగణంలో తీర్థ మండపం ఉంది.


💠 ఆలయ పరిసరాలలో దక్షిణం వైపున నందికేశ్వరుడు, పడమర వైపు రక్తేశ్వరి, నాగదేవరు మరియు బ్రహ్మస్థానం మరియు తూర్పు వైపున కల్లుకుట్టిగ మరియు క్షేత్రపాలాలు ఉన్నాయి.  

తూర్పు భాగంలో 'కణ్వ పుష్కరణి' ఉంది. 


💠 ఒకసారి శ్రీ సోదే మఠానికి చెందిన శ్రీ వాదిరాజ స్వామీజీ ఆలయాన్ని సందర్శించినప్పుడు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.  

ఎంతో పులకించిపోయిన స్వామీజీ, జయదుర్గామాతను స్తుతిస్తూ స్వయంభువుగా స్వరపరిచిన భక్తిగీతాన్ని ఇప్పుడు "శ్రీ దుర్గాస్తవ"గా ప్రసిద్ది చెందింది.

భక్తులు అమ్మవారికి నైవేద్యంగా మల్లెపూలు, పట్టుచీరలు ఇవ్వడం ఇక్కడ ఆచారం. 


💠 ఇక్కడ అత్యంత ముఖ్యమైన పండుగ 9 రోజుల నవరాత్రి పండుగ.  

అక్షయ తృతీయ తర్వాత మూడవ రోజు వార్షిక ఆలయ పండుగను ఏటా జరుపుకుంటారు.


💠 ఆలయంలో పూజించబడే ముఖ్యమైన అనుబంధ దేవతలు గణేశుడు, సుబ్రహ్మణ్యుడు మరియు శాస్తా.


💠 ఆలయ పూజ మరియు దర్శన సమయాలు

ఉదయం పూజ సమయం - 5:30 AM నుండి 12:30 PM వరకు

సాయంత్రం దర్శనం మరియు పూజ సమయం - 4:00 PM నుండి 8:30 PM వరకు

ఒక రోజులో ముఖ్యమైన పూజలు

ఉష పూజ : ఉదయం 6 నుండి 6:30 వరకు

మహా పూజ : 10:30 నుండి 11:30 వరకు

రాత్రి పూజ : సాయంత్రం 7 నుండి 7:30 వరకు


 💠 ఉడిపికి నైరుతి దిశలో 5 కి.మీ దూరంలో జాతీయ రహదారి 66కి సమీపంలో ఉంది.


రచన

©️ Santosh Kumar