8, నవంబర్ 2020, ఆదివారం

హిందూ







 

త్రికరణశుద్ధి

 _*🧠🗣️👐త్రికరణశుద్ధి - త్రికరణాలు*_ 

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*_1. 🧠మనసా (మన ఆలోచన, సంకల్పం)._*


*_2. 🗣️వాచా (వాక్కు ద్వారా, చెప్పినటువంటిది)._*


*_3.👐 కర్మణా (కర్మ, చేతల ద్వారా)._*



*_మనలో చాలామందికి మనస్సులో ఒక సంకల్పం ఉంటుంది. అది ఎదుటివారి మెప్పు కోసమో, లేక మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా మరొక కారణం చేత అనుకున్నది చెప్పలేక, చెప్పిన పని చెయ్యలేము. మనస్సు అనుకున్న విషయం నాలుక ద్వారా చెప్పలేము, చెప్పినది ఆచరించలేము. అది ఏదో ఒక దానిని  ఆలోచించి,  మాట్లాడి,  చేసెయ్యడం కాదు. ధార్మికమైన, శాస్త్ర ఆమోదయోగ్యమైన, అందరికీ ఉపయోగపడేకర్మ ఉండాలని శాస్త్రం చెబుతుంది. అదే త్రికరణశుద్ధి._*



*_త్రికరణశుద్దిగా చేసే పనులను "దేవుడుమెచ్చును లోకము మెచ్చును” కాని తప్పుడు పనులు చేస్తే "దేవుడు క్షమించడు లోకము క్షమించదు" అని పెద్దలు ఏనాడో చెప్పారు._*



*_కొన్నిసార్లు తప్పు చేస్తున్నామని మనకు తెలిసినా ఎవరు చూడటం లేదు కదా అనుకుని పొరపాటు చేస్తుంటాం. ఎవరు చూసినా చూడక పోయినా మనలోని అంతరాత్మగా మెలిగే భగవంతునికి అన్నీ తెలుస్తాయి మన మనస్సులో విషయం మరొకరికి తెలియకపోవచ్చు కానీ మన సంకల్పాలన్నీ చదవగలిగిన దేవునికి ఇది తెలిసి ఉండదా. తప్పకుండా తెలుస్తుంది దానికి తగిన ఫలం సిద్ధం చేసి ఉంచుతాడు, మనం దానిని అనుభవించ వలసిందే తప్పదు._*



*_ఒకసారి ఓ గురువుగారు తన శిష్యుడిని పరీక్షించ తలచి మిగతా శిష్యులకు ఓ పండు ఇచ్చి ఎవ్వరికీ తెలియకుండా తినమని వారి గురువుగారు చెప్పగా, అతడు చాలా సేపు ప్రయత్నం చేసి పండుతో తిరిగి వచ్చి గురుదేవా మనుషులు లేని ప్రాంతం ఉంది కాని దేవుడు లేని ప్రదేశం కానీ, అంతరాత్మ చూడని చోటు కానీ తనకు కనబడ లేదని చెప్పగా గురువుగారు ఎంతో సంతోషించి ఆశీర్వదించారు._*



*_ఎవరి మెప్పుకోసమో కాదు కదా మనం చేసే కర్మ. అది మనకోసమే కదా. అనుకున్నది చెప్పి, చెప్పిన సత్కర్మ చెయ్యడం అభ్యాసం మీద కానీ రాదు. అన్నీ మంచి ఆలోచనలే వస్తే వాటిని ఆచరించడంలో మనం జాప్యం చెయ్యకుండా భగవంతుని ఆజ్ఞ అనుకుని ఆచరించడమే శ్రేయస్కరం._*



*_ఒక చిన్న లౌకిక ఉదాహరణ తీసుకుందాం. చిన్నప్పుడు కిడ్డీ బ్యాంకులు అని చిన్న  బొమ్మలను అందరూ చూసి ఉంటారు. ఆ బొమ్మ క్రింద భాగంలో అంకెల చట్రాలు మూడు ఉంటాయి. సరైన అంకెల కలయిక ఇవ్వనిదే ఆ మూత తెరవబడదు. పైన ఒక చిన్న రంధ్రం నుండి మనం పైసలు లోపలకు వేస్తాము. చివరన అవసరమైనప్పుడు ఆ అంకెల కలయిక సరిగ్గా ఇచ్చి దానిలో డబ్బులు తీసుకోవడానికి వీలు ఉంటుంది. మనం కూడా మన చిట్టాలో చేసుకున్నంత పుణ్యం కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాచుకుంటూ ఉంటాము. దైవానుగ్రహాన్ని ఆ కిడ్డీ బ్యాంకులో దాచుకున్నట్టు మనం ప్రోది చేసుకుంటూ ఉంటాము. అటువంటి అనుగ్రహ డిబ్బీలో ఒక చట్రం మానసిక, ఒక చట్రం వాచిక, ఒక చట్రం కాయిక కర్మలు. ఎప్పుడైతే ఈమూడు సరిగ్గా సరిపోతాయో అప్పుడు పుణ్యం అనే గని తెరువబడి దైవానుగ్రహం అనే సుధాధార మనమీద వర్షిస్తుంది._*



*_మనం పాపాలు కూడా ఈ మానసిక, వాచిక, కాయిక కర్మల ద్వారా ఆచరిస్తాము. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం మానసిక పాపం, ఒకడికి చెడు కలగాలని దూషించడం వాచిక పాపం, చేతల ద్వారా చేసే పాపం కాయిక పాపం._*

 


*_ఇంతేకాదు ఆ పాపాలు శారీరక మరియు మానసిక సంఘర్షణకులోను చేసి ప్రశాంతతను ఇవ్వదు. సరికదా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది. కానీ ఇవి హాని కలిగించే పాపాలు కావున వీటిని త్యజించి మనలో ఎల్లప్పుడూ కేవలం సుకర్మలు మాత్రమే శుద్ధిగా జరిపించాలని త్రికరణశుద్ధిగా ఆ భగవంతుని వేడుకుంటూ ఉండాలి !_*



*_త్రికరణాలు శుద్ధిగా ఉన్నప్పుడు.... ఆ శుద్ధమైన పరికరమనే శరీరం కలిగిన వ్యక్తుల ద్వారా ఆ పరమాత్మ  చైతన్యమే వ్యక్తమవుతుంది!_*


🕉🌞🌎🌙🌟🚩

*ORAC అంటే ఏమిటి

 *ORAC అంటే ఏమిటి?*

🍒🥕🥔🌿🌱🍈🍍


*ORAC ఆక్సిజన్ రాడికల్

శోషణ సామర్థ్యం.

అధిక ORAC, మంచిది

యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యం

రక్తం & ఊపిరితిత్తుల ఆక్సిజన్ సామర్థ్యం. భవిష్యత్తులో మన మనుగడ ఉంటుంది.జీవితంలో మన రోగనిరోధక శక్తి ఆధారంగా సుగంధ ద్రవ్యాలు మనకు ఎందుకు ముఖ్యమైనవి?*


🌶️🌰🍓🍐🍏🥑🥒🍅

ఆక్సిజన్ రాడికల్

శోషణ సామర్థ్యం కలిగిన విలువలు.


*లవంగం: 314,446 ORAC

దాల్చినచెక్క: 267,537 ORAC

పసుపు: 102,700 ORAC

కోకో: 80,933 ORAC

జీలకర్ర: 76,800 ORAC

పార్స్లీ: 74,349 ORAC

తులసి: 67,553 ORAC

థైమ్:27,426 ORAC

అల్లం: 28,811 ORAC*


*అల్లం, తులసి, పసుపు కనీసం

అధిక ORAC విలువలు ఉన్నాయి. ఎలాఅవి ప్రభావవంతమవుతాయి.

రక్తం యొక్క ఆక్సిజెన్ క్యారింగ్ సామర్ధ్యం కావచ్చుసహజంగా ఉపయోగించడం మెరుగుపడిందిఫ్రూట్స్, వెజిటబుల్స్, స్పైసెస్,

హెర్బ్స్. అధికంగా ఉంది.*


ఆక్సిజెన్ రాడికల్ అబ్సోర్బెన్స్

సామర్థ్యం:

🍅🥒🥑🍏🍐🍓🌰🌶️🍍🍈🌱🌿🥔🥕🍒🥜


*నివారణలు: క్యాన్సర్లు, న్యూరో -డీజెనరేటివ్ డిసార్డర్స్,డయాబెట్స్, & చాలా క్రోనిక్ షరతులు

ప్రకృతి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.*


*అధిక ORAC ఆహారాలు మరియు పోషకాలు ఐరన్, విటమిన్ సి, జింక్,

ఒమేగా 3, మెగ్నీషియం మరియు

విటమిన్ డి మన శరీరాన్ని పెంచడానికి సహాయపడుతుందిరక్షణ విధానం. తులసి కాకుండా, అల్లం, మిరియాలు, పసుపు, దాల్చినచెక్క. లవంగం ...

బ్రాహ్మి, అశ్వగంధ,

శాతవారీ, ములేతి,

అర్జునరిష్టం, పిప్పరమెంటు,

కొత్తిమీర, జీలకర్ర నలుపు

విత్తనాలు దృష్టిని ఆకర్షిస్తున్నాయిశాస్త్రవేత్తలు.*


*కాబట్టి, ఇది ఏదైనా టీకా కంటే ఎక్కువస్వీయ రోగనిరోధక శక్తి అవసరం.ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా.80% వైరస్ పాజిటివ్ నుండిరోగులకు ఎటువంటి లక్షణాలు లేవు. 130 కోట్ల జనాభాను

అసాధ్యం. ప్రతిరోజూ 1,000,000 పరీక్షించినా పరీక్షించడానికి సంవత్సరాలు పట్టవచ్చు.

మన భవిష్యత్తు మనది.రోగనిరోధక శక్తి, లోపలికి ఇంటెల్ లాగానేకంప్యూటర్లు, అంతర్నిర్మితంగా ఉండాలి.లోపల రోగనిరోధక శక్తి!

అందుకే కిచెన్ లోనిమసాలా డబ్బా అతిపెద్దదిమొత్తం కుటుంబానికి ఫార్మసీ. ఎక్కువ మందికి భాగస్వామ్యం చేయండి. శరీరానికి మంచి ఆహారం ఇవ్వండి.ఉత్తమ ఆరోగ్యాన్నికి మంచి ఆహారం ముక్యం

ఒక్క విషయం

 ఒకే ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఎలాంటి సందేహాలు లేకుండా నిర్మొహమాటంగా చేసేయ్! చుట్టూ ఉండే మనుషుల మొహాలు వైపు అస్సలు చూడకు.. అసహ్యపు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని నిన్ను వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. నీ లైఫ్ నీది.. నీ కష్టం నీది, ఎవడో నిన్ను ఒప్పుకునేది ఏంటి? ఎవడో నిన్ను జడ్జ్ చేసేదేంటి? ఒకే ఒక్క చూపు చూడు.. అది మొహం మీద లాగి కొట్టినట్లుండాలి. రెండోసారి నీ లైఫ్ గురించి, నీ నిర్ణయాల గురించి మాట్లాడటానికి నోరు పెగలకూడదు.


ఇక్కడ ఎవడి లైఫ్‌లో వాడు వందల చిల్లులు పెట్టుక్కుని, మళ్లీ ఆదర్శమూర్తుల్లా "అది చేయొద్దు, ఇది చేయొచ్చు, అది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు" అంటూ వెధవ పోజులు కొడతారు. "అన్నా నేను ఈ పని చేస్తున్నాను, ఇది కరెక్టేనా" అని ఇంకొకడిని అడిగావే అనుకో.. అతి కొద్దిమంది మాత్రమే భుజం తట్టి ప్రోత్సహిస్తారు. 99 శాతం మంది "అదీ.. పెద్ద వర్కౌవుట్ అవ్వదనిపిస్తోంది" అంటూ వంద వంకలు చెబుతారు.


ఈ జనాభా అంతా మేడిపండులా లోపల్లోపల కుళ్లిపోయారు. పైకి మాత్రమే తెల్లటి ఖద్దరు షర్ట్‌లు, బ్లేజర్లు, గుభాళించి కొట్టే పెర్‌ఫ్యూమ్‌లూ! మైండ్ రీడ్ చేస్తే కంపు కొడుతుంది. సో ఇక్కడ ఎవడూ లేడనుకుని దీక్షగా నీ పని నువ్వు చేసుకో.. కచ్చితంగా విజయం సాధిస్తావు. అప్పుడు ఎగబడి నీ దగ్గరకు వచ్చి రాసుకు పూసుకు తిరుగుతారు.

*శిక్ష*

 *శిక్ష*    


ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు  


15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు 


ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు 


అక్కడ పేకాట పడుచుపిల్లల్తో ఆటలు నేర్చుకున్నాడు. 


దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.


20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.


అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.


దొంగ ఎన్ని రోజులో దొరలాగా తిరగలేడు కదా...


ఒకరోజు దొరికిపోయాడు.


మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.


మళ్ళీ ఎన్ని అప్పీళ్లు పెట్టుకున్న అవన్నీ కొట్టేసి ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ రోజును చెప్పేసారు


చివరగా అతని కోరిక ఏమని అడగగా


 తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు  


అతని కోరిక మేరకు వారిని పిలిపించారు  


కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులైన ప్రేమిస్తారు  


పోలీసులు లాయర్లు సాక్షులు అందరూ మోసం చేసి నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు తల్లి తండ్రులు 


అప్పుడు అతను వారు కాదు *నా మరణానికి కారణం మీరే అని చెప్పాడు* 


 నా పదేళ్ల వయసులో అల్లరి చేసినందుకు ఉపాధ్యాయుడు మండలించాడని చెప్పగానే బంధువులతో కలిసి టీచర్ ని తిడుతూ కొట్టి అతన్ని నిందించారు. 14 ఏళ్ల వయసు లో హోమ్ వర్క్ చేయకుండా, చదవకుండా ఉపాధ్యాయుని గేలి చేసి తిట్టనందుకు ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొడితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను వెనకేసుకు వచ్చారు.

అమ్మాయిల్ని ఏడిపించానని ఎందరో చెప్పినా నన్ను మందలించి తప్పు అని చెప్పలేదు.


అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం 


ఈరోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు 


 చిన్నప్పుడు తప్పు చేయగానే ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు  


చిన్న తప్పులే కదా అని *వెనుకేసుకురాకండి* అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..

పిల్లల్ని చిన్నతనంలోనే మంచిమార్గం లోకి తీసుకురావాలి.. లేదంటే వారు పెద్దయ్యాక తల్లిదండ్రులను కూడా వారి అవసరాల కోసం ,డబ్బుకోసం హత్యలకి వెనుకాడరు.. 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

పెంపకం సింగ్










 

తప్పక మౌనం

 "ఈ.  క్రింది  పనులు చేయునప్పుడు  మీరు తప్పక మౌనం పాటించాలి." (సేకరణ: భాగవతం నుండి సమర్పణ:- "మజుందార్, బెంగళూర్".            1)"యజ్ఞంలో చేయుటకు కూర్చుని ప్రారంభించిన తర్వాత  సదరు వ్యక్తి మాట్లాడరాదు.             2) "స్నానము చేయునప్పుడు మాట్లాడరాదు. (ఆ  సంకల్ప ఫలము "వరుణుడు"  పట్టుకుని పోవును.).              3)"దేవతార్చన" ప్రారంభించిన తరువాత  పూర్తి అగు వరకు ఎవరితో మాట్లాడరాదు (శ్రీ శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు "మూల రాముడి పూజ" చేయునప్పుడు  మాట్లాడుట ఎవరైనా చూసినారా!).               4)

పిల్లలుమనదగ్గరఏంనేర్చుకుంటారు

 పిల్లలుమనదగ్గరఏంనేర్చుకుంటారు..


విమర్శించే_వాతావరణంలో_పెరిగితే..

ఖండించడం నేర్చికుంటారు..!!


ద్వేషంతో_చూసే_వాతావరణంలో_పెరిగితే..

పొట్లాడడం అలవరచు కుంటారు..!!


గుర్తింపు_పొందే_వాతావరణంలో_పెరిగితే..

మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు..!!


స్నేహ_పూరితమైన_వాతావరణంలో_పెరిగితే..

నివసించే ప్రపంచం గొప్పదని భావిస్తారు..!!


నిష్కల్మషంగా_ఉండే_వాతావరణంలో_పెరిగితే..

వారు మానసిక ప్రశాంతతో జీవిస్తారు..!!


స్వచ్ఛమైన_విశ్వాసంగల_స్థితిలో_పెరిగితే..

వివేచనను అలవరచు కుంటారు..!!


అయ్యో_పాపం_అనే_స్థితిలో_పెరిగితే..

తమపై తాము జాలి పడుతుంటారు..!!


భయంతో_పెరిగితే..అభద్రతకు లోనవుతారు..!!


ఎగతాళి_చేస్తే..సిగ్గుతో కుసించి పోతారు..!!


అసూయతో_చూస్తే...

ఈర్ష్య స్వభావాన్ని అలవరచు కుంటారు..!!


నిరుత్సాహ_పరిస్తే..

ఆత్మ విస్వాశాన్ని అలవరచు కుంటారు..!!


ప్రసంసిస్తే... అభినందించడం నేర్చుకుంటారు..!!


భద్రత_ఉండే_స్థితిలో_ఉంటే..

తమపై,తమ చుట్టూ ఉన్న వారిపై విశ్వాసం పెంపొందించు కుంటారు..!!


ప్రేమ_అభిమానాల_మధ్య_పెరిగితే..

పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు..!!

టిఫిన్ ప్రియులకు

 🔴▬▬▬ஜ💲ஜ▬▬▬🔴


*టిఫిన్ ప్రియులకు ఘుమఘుమలాడే మృష్టాన్న కథనం.!*


*ఈ కథా రచయిత "కృష్ణోదయ" ప్రతి ఫలహారాన్ని తాను స్వయంగా తిని, అనుభవించినంత లైవ్లీ గా కథనాన్ని వండి... మనకి నోరూరించేస్తున్నారు.!*


*మన చిన్న నాటి ప్రాచీన పెంకుటిళ్ళ హోటళ్ళ నుండి.. నేటి ప్రముఖ హోటళ్ళుగా రూపాంతరం చెందిన భిన్న సంస్కృతుల, నోరూరించే తరగని రుచుల కథాకమామిషు చదివితే చాలు.. తిన్నంత సంతృప్తి చెంది, అది తీరక.. గుంటూరుకి టికెట్ బుక్ చేసుకుంటారు కూడా.!*


*మరి, పదండి..*

*గుంటూరుకి ఓ టూరేద్దాం.!*💲👇



*"గుంటూరు (బ్రాడీపేట, అరండల్ పేట) వారి టిఫిన్స్ వైభవం"*

_రచన: కృష్ణోదయ_


సాయి విలాస్ ఒక్కగది పెంకుటింట్లో నడిచేది.. రెండు ఇడ్లి 7 పైసలు మాత్రమే.. పచ్చడి కొంచెం పల్చన చేసేవాడుగానీ రుచిగా శుచిగా ఉండేది.. 


రెండు వీధులు అవతలికి వెళితే అరండల్ పేట 4వ లైను ఒకటో అడ్డ రోడ్డు మూలమీద చిన్న పెంకుటింట్లో ఉండేది లక్ష్మీ విలాస్.. **ఓనర్ మునుస్వామి.. మనిషి నల్లటి నలుపు, తెల్లటి పైజామా లాల్చీ వేసుకుని, జుట్టు పైకి దువ్వుకుని, వీధి గుమ్మంలో గల్లాపెట్టె దగ్గర దేవుడికి అగ్గరుబత్తి హారతి పడుతూ కనిపించేవాడు పొద్దున్నే ఐదున్నరకి.. వెనకనున్న వంటగదిలోంచి సాంబార్ వాసన ఘుమ ఘుమా రోడ్డుమీదకు కొడుతుండేది.. మేము ట్యూషన్ కి వెళుతున్న వాళ్ళం సాంబార్ వాసనకి అప్రయత్నంగా తలతిప్పి మునుస్వామి దర్శనం చేసుకునేవాళ్ళం.. సాంబార్ వాసనకి జివ్హ చవులూరుతుంటే, ముందు రాత్రే అమ్మని బతిమాలి బామాలి తీసుకున్న పది పైసలు పదిలంగా జేబులో ఉన్నాయని ధృవ పరుచుకుని, ముందుకు కదిలేవాళ్ళం..  


ఏడు గంటలకి ట్యూషన్ నుంచి తిరిగివచ్చే సమయానికి లక్ష్మీ విలాస్ కిటకిటలాడుతూ ఉండేది.. నా ప్రియతమ సర్వర్ ఎక్కడున్నాడో చూసి అక్క టేబుల్ ఖాళీ అయ్యేవరకు ఆగి బైఠాయించేవాణ్ణి.. ప్రియతమ అని ఎందుకన్నానంటే నాకేం కావాలో వాడికి తెలుసు, ఏమీ చెప్పక్కరలేదు, అడగక్కరలేదు.. రెండు నిముషాల్లో పొగలుకక్కుతున్న ఇడ్లి సాంబార్ నా ముందుకు వచ్చేది.. ప్లేట్ నిండా సాంబార్, అందులో పప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు తేలుతూ నయనానందం కలిగిస్తే, ఘుమఘుమలకి ఘ్రాణ శక్తి రెట్టింపై, లాలాజలం బైటికి కారిపోయేదంటే నమ్మండి.. ఎక్కడ అయిపోతుందోనని నెమ్మదినెమ్మదిగా ఒక్కొక్క చెంచా పూర్తిగా ఆస్వాదిస్తూ ఒక్క ఇడ్లీతో ప్లేటు సాంబార్ లాగించేసి విజయవంతంగా అటుఇటు చూస్తుండగానే నా ప్రియతమ మళ్ళీ సాంబార్ తెచ్చి ప్లేట్ నింపేవాడు.. సాంబార్ ఆఖరిబొట్టు వరకు తృప్తిగా లాగించేసి తేన్చుకుంటూ గల్లాపెట్టెమీద పది పైసలు పెడితే, రెండు పైసలు తిరిగిఇస్తూ సాంబార్ బాగుందా బాబూ అని అడిగేవాడు మునుస్వామి మల్లెపూవులాగా నవ్వుతూ.. నిజం చెప్పొద్దూ నాకు సిగ్గేసేది ఆబగా తినేశానని.. మా ఎదురింటి అనంత్ కి మునుస్వామి ఇడ్లి కారప్పొడి అంటే ప్రాణం.. అరటి ఆకులో రెండిడ్లీలు కారప్పొడి వేసి ఆ రెంటి మీద సువాసనలు వెదజల్లే నెయ్యి చేతికి ఎముక లేకుండా పోసి అదాటున కొబ్బరి పచ్చడి ఇచ్చేవాడు.. అనంత్ వాటిని క్షణాల్లో గుటకాయస్వాహా చేసి మళ్ళీతే అనేవాడు.. క్షణాల్లో ఇడ్లి మాయమయినా అరటి ఆకు నల్లగా మాడిపోతే మేము ఆశ్చర్యంగా చూసేవాళ్ళం.. సత్తు ప్లేటులో పెడితేనేం ఏం రుచి ఏం రుచి, లక్షి విలాస్ లో ఇడ్లి తినకపోతే బతుకు దండగరా అనేవాడు అనంత్.. 


మరో పదిఅడుగులు ముందుకు వేస్తే డాబా ఇంట్లో గీతా కేఫ్.. ఇందులో కూడా జనం కిటకిటలాడుతూ అన్ని రకాల టిఫిన్స్ లాగించేస్తారుగానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పూరీ.. ఒక్కో పూరీ సైజులో ప్లేట్ కి సరిపడా ఉండేది.. బూరల్లాగా ఉబ్బిన రెండు పూరీలు కింద పడిపోకుండా నాట్యమాడుతూ సర్వర్ తీసుకొస్తుంటే అబ్బురంగా చూసేవాళ్ళం.. దానితో పాటు ఇచ్చే బంగాళాదుంప కూర చూడటానికి దుంప ఉల్లి పసుపేసి ముద్దకొట్టినట్టు ఉండేది.. చూడ్డానికి అబ్బే అనిపించినా నోట్లోపెట్టుకుంటే మాత్రం అంతా విష్ణుమాయ, స్వర్గానికి బెత్తెడు దూరంలో సజీవంగా నిలబడేవాళ్ళం.. ఇక పూరీని ముట్టుకోవాలంటే కొంచెం సందేహించేవాళ్ళం.. బుస్సుమని వదిలే ఆవిరికి వేళ్ళు కాలేవి.. భద్రం భద్రం అంటూ తినటానికి ఉపక్రమించేవాళ్ళం.. పూరీ ఉల్లిపొరలాగా పొరలు పొరలు ఒచ్చేది.. నోట్లో పెట్టుకుంటే నమిలే శ్రమ లేకుండా యిట్టె కరగిపోయేది.. ఇంతుందేమిటి అని చూడగానే అనిపించినా తినేశాక అప్పుడే అయిపోయిందా అని కించిత్తు నొచ్చుకునేవాళ్ళం .. 


మరో నాలుగడుగులు ముందుకి వేస్తే మెయిన్ రోడ్ జంక్షన్.. ప్రఖ్యాత శంకర విలాస్ జంక్షన్.. శంకర విలాస్ పేరు వింటేనే పొట్టలో కరకరలాడుతుంది.. అన్ని టిఫిన్స్ చాలా బావుంటాయని వేనోళ్ళ పొగడబడ్డ హోటల్.. గుంటూరు హోటల్స్ కి శంకర విలాస్ క్రికెట్ ఆటకి కపిల్ దేవ్ లాంటిది.. అదేంటి అనకండి.. భారత్ కి క్రికెట్ ఆటలో గెలుపు రుచి చూపించినవాడు కపిల్.. అదృష్టం మీద ఆధారపడకు, నిన్ను నువ్వు నమ్ముకో, కష్టపడి పనిచేయి, పోరాడితే విజయంనీదే అనే స్ఫూర్తిని కలిగించిన వాడు కపిల్.. బ్రిడ్జికి ఇవతల ఊరు విస్తరిస్తున్న రోజుల్లో ఒక పెంకుటింట్లో మొదలైంది శంకర విలాస్.. రుచికి శుచికి పెట్టింది పేరు.. కొద్దిరోజుల్లోనే శంకర విలాస్ టిఫిన్స్ కి మారు పేరు అయింది .. మునిసిపాలిటీవారితో నిమిత్తం లేకుండా ఆ కూడలి శంకర విలాస్ కూడలి ఐంది.. వ్యాపారాన్ని విస్తరించే దిశగా పెంకుటిని డాబా ఇల్లుగా మార్చేశారు.. హోటల్ చాలా మంచి వ్యాపారం అనేంతగా ఎదిగిపోయింది శంకర విలాస్.. చుట్టుపక్కల కొత్త కొత్త హోటల్స్ పెట్టేరుగానీ శంకర విలాస్ కి దీటుగా నాణ్యత లేకపోతె మనలేమని ప్రతిఒక్క హోటల్ నాణ్యతపై శ్రద్ధపెట్టేది.. అంచేత బోలెడన్ని హోటల్స్ యమ రుచిగా టిఫిన్స్ అందించేవి మొదలయ్యాయి.. అందుకే అన్నాను Sankara Vilas is trend setter like Kapil in cricket.. శంకర విలాస్ విస్తరించి విస్తరించి మూడు నక్షత్రాల హోటల్ ఐంది ఇప్పుడు.. తిరణాల జరుగుతోందా అన్నంత మంది జనం ఉండేవారు శంకర విలాస్ ముందు.. అదిచూసి పక్కనే సెంట్రల్ కేఫ్ మొదలైంది.. శంకర విలాస్ లో ఖాళీ లేక తొందర పనిలో ఉన్నవాళ్లు పక్కనే మొదలైన సెంట్రల్ కేఫ్ కి వెళ్ళేవాళ్ళు.. నాణ్యత బానేవున్నా యాజమాన్యం బాగాలేక సెంట్రల్ కేఫ్ మూత పడింది.. 


శంకర విలాస్ కి ఫర్లాంగ్ దూరంలో మెయిన్ రోడ్ మీద బ్రిడ్జి ఎదురుగా లక్ష్మి థియేటర్ పక్కన ఉన్నది ఆనంద భవన్.. శంకర విలాస్ కన్నా పాతది అంటారు కొందరు.. కామోసు అని లోపలకి వెళ్ళగానే అనిపిస్తుంది.. నల్ల టేకుతో చేసిన రెట్టింపు సైజు కుర్చీలు బల్లలు నిగనిగలాడుతూ, చూడగానే పురావస్తుశాలకి రాలేదుగదా అనిపిస్తాయి.. రెండు కుర్చీలు దగ్గరికి జరిపితే ఒక మనిషి హాయిగా పడుకోవచ్చు.. కుర్చీమీద వెనక్కివాలి కూర్చుంటే బల్ల చేతికి అందదు.. టిఫిన్ తినాలంటే ముందుకి కూర్చోవాల్సిందే.. ఏది కావాలని అడిగినా క్షణాలమీద వచ్చేస్తుంది ఒక్క మూడు ముక్కల అట్టు తప్ప.. ఆర్డర్ ఇవ్వగానే మూడుముక్కలు అని పొలికేక పెట్టేవాడు సర్వర్.. లోపలికివెళ్ళి చెప్పేంత టైంలేదు మరి.. లోపల దోశమాస్టర్ పోలికేకలు లెక్కపెట్టుకుంటూ దోశలు వేసేవాడు.. అంతగా ఇష్టపడేవారు ఆనందభవన్ మూడుముక్కల పెసరట్టుని.. అట్టుని మూడుభాగాలుగా విభజించి ఒక్కో భాగంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం అద్ది, కూసింత నెయ్యి తగిలించి దోరగా కాల్చేవాడు.. వేడివేడి అట్టు అల్లం పచ్చడితో లాగిస్తూ ఆ యమహా రుచికి కారణం గురజాలనుంచి తెప్పించిన పెసలు అని ఒకరు, అతి సన్నగా తరిగిన అద్దింపు అని ఒకరు, కాదుకాదు ప్రత్యేకంగా కాచిన శుద్ధ నెయ్యి అని ఒకరు వాదించుకునేవారు.. చివరికి ఏదీ తేలక ఏ నలుడో భీముడో శాపవశాన ఆనంద భవన్ దోశమాస్టర్ గ పుట్టివుంటాడని తేల్చేశేవారు.. తృప్తిగా తిని నిలువెత్తు కౌంటర్ బల్ల వెనకున్న మనిషిని వెతుక్కుని, బిల్లు చెల్లించి ఆనందో బ్రహ్మ అనుకుంటూ బయటపడేవాళ్లు.. టిఫిన్స్ గోలలో పడి మర్చిపోయానండోయ్.. ఆనంద భవన్ అరిటాకు భోజనానికి చాలా ప్రసిద్ధి.. అంతంత పెద్ద బల్లలు వేసింది అందుకే కాబోలు..!


బ్రిడ్జికి ఇవతలివైపు కాంతిలాల్ అనే రాజస్థానీ బలరాం హోటల్ నిర్వహించేవాడు.. ఇక్కడ ఉత్తరాది మిఠాయిలు, పూరి, చపాతీ మరియు చాయ్ మాత్రమే దొరికేవి.. శేషమహల్, రంగ మహల్ సినిమాహాల్స్ కి అనుకుని ఉండేది బలరాం.. ఇక్కడ పగటి వ్యాపారం తక్కువ, సాయంత్రం అవగానే కిక్కిరిసిపోయేది.. సినిమాకి వెళ్లేవాళ్లు ఇక్కడ టీ తాగకుండా పోరు.. సినిమా జనాన్ని తీసేస్తే మిగిలినవాళ్లు చపాతీ కోసం అర్రులు చాచేవారు.. నిజానికి ఆ ఆరాటం చపాతీకోసం కాదు దానితోపాటు ఇచ్చే కుర్మా కోసం.. నూనెలో దేవుతూ ఎర్రగా ఉండే కుర్మా.. అందులో చిన్నచిన్న తెల్లటి కూరముక్కలు ఏమిటో తెలిసేవి కాదుకానీ తినటానికి చాలా బాగుండేవి.. కుర్మా ఉత్తరాది వంటకం.. బలరాం కుర్మా వండటంలో మాస్టర్స్ చేసివుండాలి.. ఒక్క కుర్మాతోనే దశాబ్దాలుతరబడి వ్యాపారం నడిపాడు..!


అరండల్ పేట 7వలైన్ మెయిన్ రోడ్ మీద స్వాగత్ హోటల్.. ఉల్లిదోసె తినాలంటే ఇక్కడే.. దోశలోపల సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనె నిండుగా ఉండేవి.. చూడగానే అబ్బా ఇంత నూనె కొట్టేడే అనిపిస్తుందిగానీ తిన్నాక ఏమీ ఇబ్బంది ఉండేదికాదు.. దోశ ఉల్లి కలగలిపిన సువాసన గమ్మత్తుగా ఉండేది.. దోశతో పాటు చింతపండు పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉండేవి.. ఏం వేసి చేసేవాడోగానీ చింతపండు పచ్చడి మళ్లీమళ్లీ అడిగి వేయించుకునేవారు.. ఉల్లిదోశకి మారుపేరు స్వాగత్ అంటే అతిశయోక్తికాదు..!


మసాలాదోశ తినాలనిపిస్తే బ్రాడీపేట 4వ లైన్ 5వ అడ్డరోడ్డునున్న మైసూర్ కేఫ్ కి దారి తీయాల్సిందే.. శంకర నారాయణ అనే కన్నడం అతను ఈహోటల్ నడిపేవాడు.. మెయిన్ రోడ్డుకి దూరంగా రద్దీలేనిచోట హోటల్ నడపాలంటే ధైర్యం కావాలి.. ఆ ధైర్యాన్ని దేశ విఖ్యాత రవి ట్యుటోరియల్ కాలేజీ పక్కనే చోటు సంపాదించి కూడకూడగట్టిఉంటాడు .. కొంచెం కర్ణాటక పద్ధతిలో ఉండే టిఫిన్స్ త్వరలోనే జనరంజకమయ్యాయి .. మసాలా దోశ చట్నీ విడివిడిగా తింటే అంత గొప్పగాలేవే అనిపిస్తుంది.. కలిపితింటే అమోఘమైన రుచి.. మసాలా కూర పూర్తి కర్ణాటక పద్ధతిలో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం దాల్చిన పొడి వేసి చేస్తారు.. టిఫిన్ తిన్నాక కాఫీ తాగకుండా బయటికి వెళ్ల లేం కదా..! 


*అదీ.. గుంటూరు వారి టిఫన్ & భోజనం మహాత్యం.!*😃

ధార్మికగీత - 74*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత - 74*

                                     *****

        *శ్లో:- భోజనాత్ పూర్వభాగే చ ౹*

               *భోజనాత్ పరత స్తథా ౹*

               *క్షణే క్షణే మతి ర్భిన్నా ౹*

               *ధర్మస్య త్వరితా గతిః ౹౹*

                                      *****

*భా:- "చంచలం హి మనః కృష్ణ !" అని పదే పదే అంటాడు శ్రీ కృష్ణ పరమాత్మ. నిరంతర మథన శీలత గలది మనసు. మనిషిని స్థిరంగా ఉండ నీయదు. పైగా బొమ్మలాట ఆడిస్తుంటుంది. భోజనానికి కూర్చునే ముందు ధర్మపరముగా అది చేయాలి, ఇది చేయాలి అని మన మనసు తహతహ లాడుతుంది. బాగా ఉత్సాహంతో ఉవ్విళ్లూరుతుంది. భోజనం చేయడం పూర్తికాగానే అలా చేస్తే లాభమా! ఇలా చేస్తే లాభమా! మరోలా చేస్తే లాభాలాభాలు ఎలా ఉంటాయి? అనే మీమాంసతో అంతర్మథనం చేస్తుంది. మన మొక్కరం చేయనంత మాత్రాన నష్టమేమీ లేదు అని నిర్ణయిస్తుంది. ఈ విధంగా క్షణ క్షణానికి చిత్రాతి చిత్రంగా ఆలోచన మారుస్తూ, చివరికి కించిత్తు దానము కాని, ధర్మము కాని చేయనీయదు. మన మానసిక పరిస్థితి ఇలా ఉంటుందని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనసు ధర్మం చేయాలని సంకల్పించగానే ఇక బుద్ధిని ఆశ్రయించాలి. వెంటనే ఇక "ఆలస్యం అమృతం విషం" అనే స్ఫూర్తితో, దాన ధర్మాలు త్వరగా చేయాలి.ఒక చేతితో చేసింది మరో చేతికి తెలియకూడదు. నీ వెంట నీవు నమ్ముకున్నవారెవరూ తోడు రారని గ్రహించాలి. దానధర్మాలే పుణ్యరూపంలో నిన్ను అనుసరించి, అడుగడుగునా రక్షిస్తాయని సారాంశము. "ధర్మో రక్షతి రక్షతః" అనే పెద్దలమాట చద్దిమూట అని గుర్తించి వర్తించాలి*.

                                    *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲