13, డిసెంబర్ 2025, శనివారం

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹

క్రియతే అనేన ఇతి కర్మ - చేయబడేది ఏదైనా కర్మయే. కర్మ అనేది సంస్కృత పదం. అది 'కృ' అనే ధాతువు నుంచి వచ్చింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరికంగా కాని చేసినది. పూర్తయిన పనిని కర్మ అని, జరుగుతున్న పనిని క్రియ అని అంటారు.

అలాగే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన విషయంలో మూడు విభాగాలు ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే చేయువాడు, క్రియ అంటే చేయబడుతున్న కార్యం, కర్మ అంటే చేయబడిన కర్మ యొక్క ఫలం. కర్త, క్రియ లేకపోతే కర్మ ఉండదు. నేను చేస్తున్నాను అనే భావనతో, ఆథ్యాత్మ నిష్ఠగా ఇంద్రియాల చేత, అంటే శబ్ద (వినడం), స్పర్శ (తాకడం), రూప (చూడటం), రస (రుచి చూడతం), గంధాలతో (వాసన చూడటం) చేసే వ్యాపరమే కర్మ. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక మనస్సుతో చేసేది కూడా కర్మయే అవుతుంది.

అలాగే కర్మలను మూడు రకాలు చేస్తుంటాము. కాయిక (శరీరంతో చేసేవి), వాచిక (మాటల ద్వారా), మానసిక (మనస్సుతో) చేసే కర్మలు. ఈ మనస్సు, వాక్కు, కాయాలనే త్రికరణములు అంటారు. 

త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం కూడా మెచ్చుతుంది.

కర్మకు కులమతాలు, ప్రాంత, లింగ భేదాలు లేవు. ఈ లోకంలో అందరు కర్మలు చేస్తారు, ఫలం అనుభవిస్తారు. ఇది మన కళ్లకు కనిపిస్తూనే ఉంది.

అలాగే కర్మలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి చేయడం. ఇది బాహ్య స్వరూపం లేదా దృశ్య స్వరూపం. రెండు దాచడం. ఇది అంతర్గత స్వరూపం లేదా అదృశ్య స్వరూపం. మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. ఇది కర్మ ఫలానుభవం అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభ వించటం

ఈ ప్రపంచంలోని ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకు లోబడి కర్మలను చేయాల్సి ఉంటుంది అంటారు కృష్ణ పరమాత్మ.

కర్మ అంటే పని లేదా కార్యము లేదా క్రియ అని చెప్పేది సులభమైన అర్ధం. కానీ కార్యకారణ నియతితో నడిచే ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదం అన్వయమవుతుంది. కార్యం అంటే ఫలము/ ప్రయోజనము (Effect). కారణమంటే ఆ ఫలానికి గల హేతువు/ కారణము (Cause). విశ్వచైతన్యం ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడిపిస్తుంది.

పాపకార్యమైనా, పుణ్యకార్యమైనా దాన్ని కర్మ అనే అంటారు. సత్ఫలితాన్నిచ్చే కర్మను సత్కర్మ అని, దుష్ఫలితాన్ని (చెడు ఫలాన్ని) ఇచ్చే కర్మను దుష్కర్మ అని అంటారు.

అవశ్యమను భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభమ్ ......

చేసిన పని మంచిదైనా, చెడ్డదైనా, దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరాలని శాస్త్రవాక్కు. చేసిన కర్మకు ఫలితం అనుభవించకుండా తప్పించుకోనుట అసాధ్యం. అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అయితే ఒక కర్మ (పని) చేసినప్పుడు, అవి ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు. అవి 1) ఆగామి కర్మలు, 2) సంచిత కర్మలు, 3)ప్రారబ్ధ కర్మలు 

అంటే ఒక విత్తనం వేసినప్పుడు, అది మొక్కయై, చెట్టు గా మారి, మొగ్గ వేసి, పువ్వు పూసి, పిందే గా మారి, కాయ (పచ్చి) గా రూపాంతరం చెంది, అనుభవించేందుకు సిద్ధం అవుతుంది, అంటే పక్వానికి వస్తుంది, పండుతుంది. అలా మనం చేసిన కర్మ పక్వానికి (కర్మ పండడానికి) పట్టే సమయం బట్టి వాటిని పై మూడింటిగా విభాగం చేశారు.

1- ఆగామి కర్మ - మనం చేసే కొన్ని పనులకు వెంటనే, ఇప్పటికిప్పుడే ఫలం లభిస్తుంది. వాటిని ఆగామి కర్మలు అంటాము. ఉదాహరణకు దాహం వేస్తే, నీరు త్రాగుతాం. నీరు త్రాగడం కర్మ అయితే, దాహం తీరడం ఆ కర్మ యొక్క ఫలం. అలాగే ఆకలి తీరుచుకోవడానికి భోజనం చేస్తాము. భోజనం అనే కర్మ, ఆకలిని తీర్చి, అనగా తగిన ఫలాన్ని వెంటనే ఇచ్చి, అక్కడితో శాంతిస్తోంది. ఇది ఆగామి కర్మ.

ఆవేశాలు అదుపు తప్పినప్పుడు, ఒకరిపై చేయి చేసుకుంటాము, నాలుగు తిడతాము. అవతలి వాడు సమర్ధుడైతే తిరిగి నాలుగు తంతాడు, బాగా వాయించి వదిలిపెడతాడు. అది అగామి కర్మ.

ఆగమి కర్మలు అంటే ఈ జన్మలో చేసిన కర్మకు ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడమన్నమాట.

2- సంచిత కర్మ - కొన్ని కర్మలు (పనులు) వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చేస్తే, ఇంకెప్పుడో ఫలం అనుభవిస్తాము. అంటే ఫలం అనుభవించే వరకు అవి మనలని వెంటాడుతూనే ఉంటాయి. అంటే అవి కూడబెట్టబడి (సంచితం) చేయబడి ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే సమయం వచ్చే వరకు అవి సంచీలో భద్రంగా ఉంటాయన్నమాట.

ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే, మనం ఒకరిపై చేయి చేసుకున్నా, లేక నాలుగు తిట్టినా, అవతలి వ్యక్తి వెంటనే ప్రతిచర్యకు దిగకపోవచ్చు. కానీ అది మనస్సులోనే పెట్టుకునే, తగిన సమయం కోసం వేచి చూస్తాడు. సమయం వచ్చినప్పుడు, ఇంతకంటే గట్టి దెబ్బ కొడతాడు. అది ఎప్పుడనేది తెలియదు. అది సంచిత కర్మ. 

ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, మనం ఈ రోజు ఒక విత్తనం వేసి, నీరు పోస్తే, అది ఒకనాటిగా చెట్టు అయ్యి, పండ్లు కాసి, మనకు అందిస్తుంది. అక్కడ విత్తనం వేయగానే పండు (ఫలం) రావట్లేదు. దానికి కొంత సమయం పడుతున్నది. అది సంచిత కర్మ.

ఈ సంచిత కర్మలకు ఫలాలన్నీ ఈ జన్మలోనే లభిస్తాయని లేదు. అది కాలచక్రంలో ఏ జన్మ లోనో లభించవచ్చు. 

అంటే ఇంతకముందు లేదా ఈ జన్మలో చేసి- తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మలలో నుండి, ఆ జనంలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించిన కర్మలు పోను, మిగిలిన కూడబెట్టబడిన కర్మలను, అదే విధంగా, ఇంతకముందు అనేక జన్మలలో జీవుడు చేసిన కర్మల నుండి ఖర్చైనవి మినహా, ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటారే, అలా నిజంగా అవి వెనకేసుకుంటామో లేదో గానీ, కర్మ అనే సంచీలో అనేక జన్మల కర్మలను పోగు చేసుకుని, జీవుడు జన్మల పరంపరను పొందుతుంటాడు. వాటిని సంచిత కర్మలు అంటారు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా, ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి వెళ్ళకుండా అతడితోనే ప్రయాణిస్తుంటాయి. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి.

  వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి. 

నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు.  కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా  లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం. 

కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు. 

అదే విధంగా అనేక షాపులు కిరాణా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 

ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు , కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంతే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. 

పూజా సామానులు.  

అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉదుబత్తులు , ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతల పేర్లు  కాకుండా దేవుళ్ళ బొమ్మలు  ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్న అట్ట డబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు నచ్చిన  వస్తువో  జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు. 

మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడటం లో మీ వంతు  కృషి  చేయగలరు. 

కాశి ఆలయ చరిత్ర*

  *కాశి ఆలయ చరిత్ర*

👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 

👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*

👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*

👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*

👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*

👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు*

👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*

👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*

👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*

👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*

👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*

👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*

👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*

👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*

👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*

👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*

👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*

👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*

👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*

👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 

👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*

👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*

👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*

👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*

👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*

👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*

👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*

👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*

🙏 *ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా ఫార్వర్డ్ చేయగలరు.*🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ।। 21 ।।

ప్రతిపదార్థ: 

వేద — తెలుసుకున్న; అవినాశినం — నాశము కానిది; నిత్యం — నిత్యమైనది; యః — ఎవరైతే; ఏనమ్ — ఇది; అజమ్ — జన్మ లేనిది; అవ్యయమ్ — మార్పుచెందనిది; కథం — ఎట్లా; సః — అది; పురుషః — వ్యక్తి; పార్థః — పార్థా; కం — ఎవరిని; ఘాతయతి — చంపే కారణం; హంతి — చంపును; కమ్ — ఎవరిని.

తాత్పర్యము :

ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?

 వివరణ:

ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ, మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచి వేస్తుంది. ఆ స్థితిలో, మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు, అన్నీ పనులు చేస్తూనే వున్నా, వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్తగా భావించుకొని, అహంకార రహితముగా, బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.

తిరుమల ఆలయంలో

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *శుభ ధనుర్మాసం….*

*తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై.*🙏

శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.

*1. ఆండాళ్ అని ఎవరికి పేరు?    

     = గోదాదేవి.

2. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.

3. ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= ‘భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే’ మంచిరోజు.

4. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

   = శ్రీ విష్ణు చిత్తులు.(పెరియాళ్వార్)

5. ఆళ్వారులు ఎంతమంది?

      = 12మంది.

6. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

     = భూదేవి.

7. గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

   = తమిళ భాష.

8. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

  = నాలాయిర్ దివ్యప్రబంధము.

9. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

      = 108.

10. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

    = శ్రీవిల్లిపుత్తూరు.

11. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

   = దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.

12. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

    = 196 అడుగులు.

13. ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.

14. శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.

15. శ్రీవిష్ణుచిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)

16. పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.

17. తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.

18. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.

19. శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని

20. తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.

21. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.

22. కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.

23. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)

24. ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.

25. తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.

26. ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.

27. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.

28. మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.

29. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).

30. ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.

31. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.

32. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.

33. పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.

34. విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.

35. విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.

36. తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.

37. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).

38. తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.

39. గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.

*40. తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.

*41. కీచుకీచుమని అరిచే ‘ఏ’ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.

*42. తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.

*43. మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?

= పక్షులు.

*44. ఎనిమిదవ పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

= నమ్మళ్వారు.

*45. పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

= శిరువీడు.

*46. భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.

*47. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

= కుంభకోణం.

*48. పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= ప్రీతి వ్రతం.

*49. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వార్.

*50. పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

= శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.

*51. పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

= బకాసుర వధ.

*52. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

= త్యాగం.

*53. శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుప్పాణి.

*54. తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

= భగవద్రామానుజులు.

*55. తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

= నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు!’

*56. శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

= అహంకారమును హతమార్చుట.

*57. పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

= దాస్య వ్రతము.

*58. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

= నందగోపుని (భగవానుని అందించారు కనుక)

*59. కోయిల్ అనగా ఏమి?

= కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.

*60. నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

= దాన గుణము.

*61. గోపికలు ‘ఎంబెరుమాన్’(మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

= నందుడు.

*62. భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమంగై యాళ్వారు. 

*63. గోపికలు తమ వంశమునకు .!మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

= యశోద.

*64. ‘శెంపొర్కజలడి’ -ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

= బలరాముడు. 

*65. నీళాదేవి ఎవరు?

= కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.

*66. యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.

*67. భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

= పేయాళ్వారు.

*68. ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

= ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.

*69. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

= 18 వ పాశురం.

*70. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

= 18వ పాశురం.

*71. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

= కువలయాపీడము.

*72. అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.

*73. గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

= అద్దము, విసనకఱ్ఱ.

*74. తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

= కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.

*75. ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

= మృగరాజగు సింహము.

*76. ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

= అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.

*77. పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

= సర్వగంథః -సర్వవిధ పరిమళములు.

*78. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

= సింహ గర్జన.

*79. కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

= మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.

*80. కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

= వెలగ చెట్టు.

*81. ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= భోగవ్రతము.

*82. ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

= శ్రీవిల్లిపుత్తూరు.

*83. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

= పాంచజన్యము.

*84. ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన ‘కూడార్’ ఎవరు?

= సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.

*85. ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

= కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)

*86. భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

= గోవింద.

*87. భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.

*88. కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

= సూర్యునికి, కాంతికి గల సంబంధము.

*89. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

= ఆవుల వెనుక.

*90. ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

= 27 వ పాశురం.

*91. పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

= శ్రీకృష్ణునివి.

*92. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

= దాసుని లక్షణములు.

*93. ‘అజాయమానః’ (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

= ‘బహుధా విజాయతే’(అనేక విధములుగా పుట్టుచున్నాడు)

*94. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము(విష్ణువనే ఓడ)

*95. పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.

*96. ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.

*97. ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.

*98. వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.

*99. ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.

*100. ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= ‘తిజ్గళ్ తిరుముగత్తు’- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.

*101. గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.

*102. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

‘అణి పుదువై’ ఈ జగత్తుకే మణివంటిది.

*103. శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.

*104. గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

*105. తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.

*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎ🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.

*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.

*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్.

ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!వరి పేరు?

= గోదాదేవి.

*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.

*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్.

ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!

మనగురించి ఇతరుల ముందు

  పరోక్షే కార్యహన్తారం ప్రత్యక్షే ప్రియవాదినమ్ | 

వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్ || 

మనగురించి ఇతరుల ముందు బాగా మాట్లాడి రహస్యంగా ఇబ్బంది పెట్టే స్నేహితుడు, లోపల విషంతో నిండి ఉన్న పాలకుండలా నమ్మదగనివాడు కాదు. అటువంటి స్నేహితులతో స్నేహం విడిచి పెట్టవలెను.

ఓం జపిస్తే

  *🌹 రోజూ ఓం జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిత్య ఓం జప ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు 🌹*

*ఓం అనేది కేవలం పదం, శబ్ధం మాత్రమే కాదు అంటున్నారు పండితులు. ఇది విశ్వం యొక్క కంపనం, ఇది ప్రతి దానికీ ఆధారమైన నాడీ. ఓం అని జపించినప్పుడు ఓ.. ఊ.. మ్.. (ఏ, యూ, ఎమ్) అనే మూడు శబ్ధాలను ఉచ్చరించడం వలన మీ మనస్సు తేలిక అవుతుంది.*

*అందుకే చాలా మంది ప్రతి రోజూ ఓం అని జపిస్తుంటారు. అయితే ఇలా రోజూ ఓం అని జపించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాగా, ఓం జపించడం వలన ఇది ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.*

*ఓం అనే పదాన్ని జపించడం వలన ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శ్వాస నెమ్మదిస్తుంది. దీని వలన నాడి వ్యవస్థ చల్లబడి, మీరు ఒత్తిడి నుంచి బయటపడి, ఉద్రిక్తత అనేది మీ లోనుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు.*

*ఓం అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వలన ఇది మీ భావోద్వేగ స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా జపించడం వలన మీ భావోద్వేగాలు సమతుల్యం అవుతాయి, మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. అలాగే, ఇది మీ దృష్టిని మెరుగు పరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.*

*ఓం అనే జపం చేయడం వలన ఇది మీ ఉచ్ఛ్వాసాన్ని బయటకు వదులుతుంది. దీని వలన ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. ఆక్సిజన్ బాగా ప్రవహించి, శరీరం లోతైన స్థాయిలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. మీ మనసు తేలిక పడుతుంది. దీని వలన మీ శ్వాస మెరుగు పడుతుంది.*

*ఇది మనసుకు, చాలా హాయినిస్తుంది. అదే విధంగా మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. అయితే దీనిని జపించడం ఎలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కానీ దీని కోసం ఎలాంటి శిక్షణ లేకుండా, కేవలం నిశ్శబ్ద వాతావరణంలో సౌకర్యంగా, నిటారుగా కూర్చొని, జపించాలి అని నిపుణులు చెబుతారు.*

🌹 🌹 🌹 🌹 🌹

*

ఇతరుల ఆస్తిని

  పరవిత్తజిహీర్షయా ప్రవృత్త: 

పిశనస్తు స్వయమేవ నాశమేతి |   

సులభ: శలభస్య కిం న వాహ:  

పృథుదీపగ్రసనాయ జృంభితస్య ||

ఇతరుల ఆస్తిని దొంగిలించాలనుకునే అపవాది స్వయంగా నాశనం అవుతాడు. ప్రపంచ దీపాన్ని మింగడానికి బయలుదేరిన చిమ్మట (మిడత) కాలిపోక ఉండగలదా

....విశ్వగుణాదర్శమ్

అద్భుతమైన కథ

 ఒక అద్భుతమైన కథ

' అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు'...

                     🔸🔸🔸🔸🔸

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని *[ Ego ]* నింపాయి...

ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి 'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!" అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను*... కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు* 

అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు...

మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది'... 

ఇక తనవల్ల కాదని వచ్చినదారినే వెళ్ళి పోవాలనుకొని వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది...

 'అంతే '...

 'మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ! ఈ దేవత... అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో ' ... ఏది ? ఎక్కడుంది తప్పు... చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు' అనేసాడు...

అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు! ' ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది'..అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది' ...

'మనం పెంచుకొనే అహంభావం *[ Ego ]* 

అంత ప్రమాదకరమైనది...

'అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం' ...

'మీరు గమనించారా ?'

''అహంభావం' అనే పదం లోంచి 'అహం ' తీసేస్తే మిగిలేది ' భావం ' అంటే ' అర్థం' అర్థమైతే అనర్థం జరగదు" ...

సేకరణ ... మంచిగా రాశారు...

ఇంత బాగా రాసినవారికి 

🙏🙏🙏🙏

యెనుముల

🙏🙏🙏🙏

13.12.2025, శనివారం

  జై శ్రీమన్నారాయణ 

13.12.2025, శనివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:నవమి రా7.27 వరకు

వారం:స్థిరవాసరే (శనివారం)

నక్షత్రం:ఉత్తర ఉ9.32 వరకు

యోగం:ఆయుష్మాన్ మ3.14 వరకు

కరణం:తైతుల ఉ7.09 వరకు

తదుపరి గరజి రా7.27 వరకు

వర్జ్యం:సా6.26 - 8.08

దుర్ముహూర్తము:ఉ6.25 - 7.52

అమృతకాలం:తె4.37 - 6.19

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం: 6.25

సూర్యాస్తమయం:5.24  

*

*ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ధనుర్మాసం*

*ఇంకా మూడు రోజుల్లో..*

*మనం ఏర్పర్చుకున్న కర్మ బంధం అనేది ఒక దీపానికి పట్టిన మసి వలే మన యొక్క అసలు స్థితిని గుర్తించవీలులేనట్టుగా అంటి ఉంది. మనకంటూ ఒక ఆనంద స్థితి ఉందని మరచిపోయాం. దాని వల్లే ఎన్నో క్లేషాలు పొందుతూ ఉన్నాం. భగవంతుడు మనల్ని తనంత ఆనంద స్థితికి చేర్చాలని అనుకుంటాడు. మనల్ని ఉద్ధరించడానికై భగవంతుడు ఎన్నోసార్లు అవతరించాడు. మనం ఉన్న ఈ కలియుగానికి భుజం భుజం రాసుకొనేంత చేరువలో ఉన్న ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు. రామావతారంలో మాదిరిగాకాక తను కేవలం మానవుడిని అనే హద్దు అనేది లేకుండా దేవుడిగానే వచ్చాడు శ్రీకృష్ణావతారంలో. ఎన్నో లీలలు ప్రదర్శించాడు, ఎన్నో ఉపదేశాలు చేసాడు. మనల్ని బాగు చేద్దాం అని కొండంత ఆశతో వచ్చాడు, కానీ మనం మనమే తప్ప మనలో మార్పు అనేది లేదు. ఎండకు ఎండం. వానకు తడవం. గాలికి చెదరం. అట్లాంటి మన ప్రవృత్తికి విసిగి ఉన్న పరమాత్మని మనల్ని ఒక చోటికి చేర్చింది అమ్మ గోదాదేవి. సమస్త వేదాల సారం అని పిలవబడే తిరుప్పావైని భగవంతుణ్ణి చేరే మెట్ల మాదిరిగా అందించింది. ముప్పైపాటల తిరుప్పావైని ధనుర్మాస వ్రతంగా మనకు అందించింది. ఆమె పాడిన పాటల్లో తను ఉన్నాడు. ఆమె పాటలకు శ్రీరంగనాథుడే చలించి గోదాదేవిని తనవద్దకు రప్పించుకొని వివాహమాడాడు. మనకోసం తనను తానే సమర్పించుకుంది అమ్మ గోదాదేవి. ఆమెను స్వీకరించాడు అంటే, ఆమె మాటలని ఒప్పుకున్నట్లే కదా! ఆమె పాడిన పాటల్ని మనం పాడగలిగితే చాలు...*