ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, సెప్టెంబర్ 2020, ఆదివారం
స్వక్షేత్ర షడ్గ్రహ యోగం- ఒక విశ్లేషణ
https://www.facebook.com/100002175249614/posts/3227714113977732/?sfnsn=wiwspwa&extid=bqJIErYtgiMbHdsa&d=w&vh=i
శివామృతలహరి
శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
శా||
వందే యంచు భజింతు నిన్ను వరదా!వ్యాళాధిరాట్కుండలా !
సందేహింపకు లోనికిం జొరగ నిస్పారోసరక్షేత్రమీ
డెందంబంచు ; రచింతు నీకిచట తండ్రీ ! కోటికైలాసముల్
చిందన్ వేడెద నీ కృపామృత మొగిన్ శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం ;( నాకు అర్ధమైన వరకు)
భక్తులందరికీ వరములిచ్చి బ్రోచే నాగభూషణా! వందే అని నిన్ను ఎల్లప్పుడూ భజించుకుంటూ ఉంటానయ్యా!
నా హృదయం ఒక పనికి మాలిన క్షేత్రం అని సందేహించకుండా నా లోనికి రావయ్యా ఇక్కడ నీకోసం కోటి కైలాసాలను రచిస్తాను.
నీ కృప అనే అమృతాన్ని కొంచెం నా మీద చిలకరించమని నిన్ను వేడుకుంటున్నా నయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

నిబద్ధత
ఒక దృఢసంకల్పానికో, మంచి మాటకో, సిద్ధాంతానికో కట్టుబడి ఉండటమే ‘నిబద్ధత’. మనో వాక్కాయకర్మలతో నిరంతరం ఆ సత్సంకల్పాన్ని ఆచరించడం నిమగ్నం కావడమే నిబద్ధత అనిపించుకుంటుంది.
ప్రతి మనిషీ ఏదో ఒక విషయంలోనో, కొన్ని విషయాల్లోనో నిబద్ధుడై ఉంటాడు. అప్పుడే ఆయా పనుల్లో విజయం సాధించగలుగుతాడు. ఆధ్యాత్మిక సంపన్నులెవ్వరూ తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనలను అతిక్రమించరు. విస్మరించరు. నిబద్ధులైనవారికి ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా తోడుంటుంది. వారికెప్పుడూ నిరాశా నిస్పృహలు కలగవు. పైగా అంతర్యామికి అధీనులై ఆత్మ సమర్పణ భావంతో, సర్వదా చైతన్యమూర్తులై ఉంటారు. నారాయణుడే వారికి నమ్మకం. నారాయణ శరణాగతే వారి ఆశయం.
నిబద్ధత లేనివాడి మనసు చాంచల్యమనే బలహీనతకు బానిసైపోతుంది. అటువంటివాణ్ని కామక్రోధాది అరిషడ్వర్గాలు ఆవరించి అధఃపాతాళానికి తొక్కేస్తాయి. వాడు భూమికి భారమై చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.
ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం కవచం లేకుండా యుద్ధానికి వెళ్లడంలాంటిది. ఒక సత్సంకల్పం, దాన్ని ఆచరించే ప్రణాళిక, ఆచరణలో ఏకాగ్రత, సాధన... మనిషిని అసలైన నిబద్ధుడిగా నిలబెడతాయి. బాధలు అనే మదపుటేనుగును సైతం లొంగదీసుకునే అంకుశమే నిబద్ధత. సత్సంకల్పం మీద నమ్మకం లేనివాడు, దానికి కట్టుబడనివాడు సమస్యల్ని అధిగమించలేడు. నిజాయతీపరుడు, నిబద్ధతతో జీవించగలిగితే ఆధ్యాత్మికంగా ఉచ్చదశకు చేరుకోగలుగుతాడు. పదిమందికీ దిశానిర్దేశం చేయగలుగుతాడు. ఏ ఓటమైనా అతడి ముందు చేతులు కట్టుకు నిలబడుతుంది. నిబద్ధత లేని జీవన విధానం జీనులేని గుర్రంలాంటిది. జీవితమన్నాక ఎన్నో ఒడుదొడుకులు వస్తుంటాయి. అవరోధాలు కలుగుతాయి. బాధలు ఎదురవుతాయి. అవన్నీ భగవంతుడు పంపిన దూతలనుకొని, వాటిని గౌరవించాలి, భరించాలి, సహించాలి. స్థితప్రజ్ఞుడు నిబద్ధతతో సుఖ దుఃఖాలను, విజయాలను, విఘ్నాలను సమానంగానే చూస్తాడు, అనుభవిస్తాడు. సుఖాన్నిచ్చే వస్తువు దగ్గర ఉన్నా లేకపోయినా, తేడా అనేది తెలీదు నిబద్ధుడైనవాడికి. అటువంటివాడు పరమాత్మకు అత్యంత ప్రియుడు, ఆత్మీయుడు. సత్కార్యం పట్ల శ్రద్ధ, ప్రేమ ఉన్నవాడిని ఏ మనో వికారమూ ప్రలోభపెట్టలేదు. సామాన్య మానవుడు దుఃఖంలో వెనక్కి, కష్టంలో అన్ని వైపులా, భక్తిలో పైకి చూస్తాడు. నిబద్ధత కలవాడు ఏ దశలోనైనా పై దిశకే చూస్తాడు. అంటే ఈశ్వరుడి వైపు చూస్తాడన్నమాట!
పురాణేతిహాసాల్లో చాలా పాత్రల్లో మనకు ఈ నిబద్ధత కనిపిస్తుంది. ధర్మానికి నిబద్ధుడు శ్రీరాముడు. భ్రాతృ భక్తికి నిబద్ధులైనవారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. దాస్య భక్తికి కట్టుబడినవాడు హనుమ. స్వామిభక్తికి లోనైనవాడు కర్ణుడు. బ్రహ్మచర్య దీక్షకు జీవితాన్ని ధారపోసినవాడు భీష్ముడు. సత్యానికి జీవితం అంకితం చేసిన మహనీయుడు హరిశ్చంద్రుడు. దానగుణానికి ప్రసిద్ధి చెందినవారు శిబి, దధీచి, బలి. సాధ్వీమణులంతా పతిసేవా పరాయణత్వంతో ఆదర్శమూర్తులైనారు. ప్రేమ, వాత్సల్యం, బంధానుబంధాలు, సత్సాంగత్యం, గురుభక్తి, అహింస, పరోపకార చింతన, నిస్వార్థం, నిరహంకారం, జ్ఞానతృష్ణ... నిబద్ధుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. అతడిలో ఏ దుర్లక్షణం ప్రవేశించినా కుండెడు తేనెలో విషపు చుక్క వేసినట్లే. ఇందుకు రావణుడే ప్రత్యక్ష తార్కాణం. నిరంతర సాధన, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల సత్సంకల్ప సాధనకు పట్టుగొమ్మలు. అవే జాతి ప్రగతికి, దేశ భవితకు అసలైన సొమ్ములు.
నాటక పద్యం తెలుసుకుందాం.
.
శ్రీమాన్ తిరుపతి వేంకట కవిమహాశయుల రచించిన పాండవోద్యోగ నాటకంలోని
ద్వారక దృశ్యం లో ఉన్న అర్జున భూమిక యొక్క పద్యాలు
అర్థ తాత్పర్యాలతో, ఆపుదల విశేషాలతో, గురువుల ఆశీస్సులు వల్ల చర్చించుకున్నాము, తెలుసుకున్నాము. అర్జున భూమిక ధరించే వృత్తి, ఔత్సాహిక కళాకారులకు
ఈ విశ్లేషణ, వివరణ ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నాను.
ఈ వివరణల విశ్లేషణల గురించి అనగా,దీనిని ముందుకు తీసుకు వెళ్ళటం కోసం ఇంకా ఎక్కువగా అందరికీ ఉపయోగపడే విధంగా మీ మీ సూచనలను అభిప్రాయాలను తెలియజేయ వలసినదిగా హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. లోపాలు ఉంటే సరి చేసుకుంటాను.
గుణాలు ఉంటే వృద్ధి చేసుకుంటాను.
పద్య నాటకం లోని పద్యాల సౌందర్యం గురించి
, అవి వృత్తి ఔత్సాహిక కళాకారులకు ఉపయోగపడటం కోసమే
ఈ నా ప్రయత్నం. దయతో స్పందించ మనవి...... 🙏🏻💐🙏🏻

అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత
అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, ఈ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు
ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "
దీపావళీ వేళ అష్టలక్ష్మీ స్తోత్ర విశేషం, మహత్యం.. కష్టాల నుంచి విముక్తి దిశగా
అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి.
ధాన్య లక్ష్మి :- ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.. అంతే కాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్న.. అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే!
ధైర్య లక్ష్మి :- కొంతమంది ఎన్నీ కష్టాలు .. ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు..
మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ
పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే.. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.
గజలక్ష్మి :- ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.. లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు
సంతాన లక్ష్మీ :- ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.
విజయ లక్ష్మీ :- పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే!
ధనలక్ష్మి :- భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.
విద్యాలక్ష్మి :- పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!
అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట..షోడశ అంటే 16.. ఇప్పుడు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం...
1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం
6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం
12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం,
14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః.
అష్టలక్ష్మీ స్తోత్రం:-
ఆదిలక్ష్మి :-
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||
ధాన్యలక్ష్మి:-
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||
ధైర్యలక్ష్మి:-
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||
గజలక్ష్మి:-
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||
సంతానలక్ష్మి:-
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||
విజయలక్ష్మి:-
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||
విద్యాలక్ష్మి:-
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||
ధనలక్ష్మి:-
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||
ఫలశృతి:-
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||
శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్
కనుక దేవున్ని కొలిచే ప్రతి ఒక్కరూ నిత్యం ఈ స్తోత్రం చదవడం వలన పై ప్రయోజనాలు కొన్ననైనా పొందవచ్చు. అలాగే జాతక రిత్యా శుక్ర గ్రహ ప్రీతి కొరకు, దోష నివారణకు కూడా ఇది చదవవచ్చు.. దీని వలన భార్య భర్తల మధ్య సఖ్యత, సుఖాలు లభిస్తాయి. ఇంట్లో శ్రీ చక్రం ఉన్న వారు దానికి దగ్గర ఈ అష్ట లక్ష్ముల ఫొటో పెట్టి ఇది చదవడం మరింత వేగంగా ఫలించేలా చేస్తుంది.. అలాగే క్షీరాన్నము లేక పాల కోవా నివేదన చెప్పబడుతోంది. లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు.. ఐశ్వర్య మస్తు.. !
*సర్వేజనా సుఖినో భవంతు శుభంభుయాత్, లోకాసమస్తా సుఖినోభవంతు.*

గ్రహ కూటమి – అపోహ దాని నివృత్తి*
*13.09.2020 ఆదివారం నాడు ఏర్పడు గ్రహ కూటమి – అపోహ దాని నివృత్తి*
నాకు ఒక మిత్రుడు క్రింది మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ వివరణ అడిగారు:
1850 నుండీ 2250 మధ్య ఒక్కసారి మాత్రమే రాబోతున్న అద్భుతమైన ఘడియలు:
13/09/2020 ఆదివారం ఉదయాన 11:00 నుండీ 11:45 మధ్య:
లగ్నం - అనూరాధ 2 - వృశ్చిక
రవి - సింహం - భావం10 - స్వక్షేత్రం
చంద్ర - కర్క - భావం 9 - స్వక్షేత్రం
కుజ - మేష - భావం 6 - స్వక్షేత్రం
బుధ - కన్య - భావం11 - ఉచ్ఛ
గురు - ధను - భావం 2 - స్వక్షేత్రం
శుక్ర - కర్క - భావం 9 - శత్రు
శని - మకర - భావం 3 - స్వక్షేత్రం
రాహు - మిధున - భావం 8 - సమ
కేతు - ధను - భావం 2 - సమ
జిల్లేడు ఆకుపై గోధుమలు ఉంచి, ప్రమిదలో దీపారాధన చేసి, దైవారాధనలో నిమగ్నమై ఈ అద్భుతమైన ఘడియలు సఫలీకృతం చేసుకోగలరు!
ఇదీ ఆ మెసేజ్. ఇప్పుడు ఈ మెసేజ్ వైరల్ అయ్యింది. మన మీడియా ఎంత అభివృద్ధి చెందిందంటే, చెప్పేవారు ఎవరో, వారి అర్హత ఏమిటో, ఇవేమీ లేకుండానే వారి సందేశాలు వైరల్ అవుతున్నాయి. దీన్ని సమీక్షిద్దాము:
13.09.2020 నాడు ఉదయం 10.45 నుండి 6 గ్రహాలు వాటి స్వక్షేత్రాలలో ఉంటున్నాయి. నిజానికి ఈ యోగం గొప్పదే. అరుదుగా వస్తుంది కూడాను. ఇట్టి యోగాలను *‘రాజ యోగాలు’* అని అంటారు. ఏ రాజయోగ మైనా సఫలీకృతం కావడానికి గాను *‘రాజయోగ భంగ’* యోగాలు ఉండరాదు. ఇది జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం. ఈ గ్రహ కూటమిలో ఒక్క బుధుడు మినహా మిగిలిన గ్రహాలన్నీ కూడా పాపగ్రహ ప్రభావంలో ఉన్నాయి. శుక్ర చన్ద్ర భ లను శని సప్తమ స్థానంలో ప్రభావితం చేస్తున్నాడు. గురు భ కేతువు మరియు రాహువుల ప్రభావంలో ఉన్నాడు. కావున ఇట్టి యోగము నిర్వీర్యమగు చున్నది. కొంత వరకు లేదా స్వల్ప ప్రమాణంలో మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, కాని ఎంతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. పాప గ్రహ ప్రభావంలో ఉన్న శుభ గ్రహాలు అద్భుతమైన ఫలితాలను ఏనాడు ఇవ్వవు. శని ఫలితాన్ని మందగిస్తాడు, రాహువు అనిశ్చితిని ఇస్తాడు.
*ఇక రెండవ అంశం* – ఈ గ్రహ కూటమి వృశ్చిక లగ్న వశాత్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ప్రచారం జరుగుచున్నది. ముహూర్తం నిర్ణయానికి గాను, ప్రస్తుత సమయంలో శుభ ముహూర్తాలు లేవు. ఈ ముహూర్తం సాధారణ పనులకు మాత్రమే పనికి వస్తుంది. ఎందుకంటే ఇవి *‘మహాలయ పక్షాలు’*. మహాలయ పక్షాలలో పితృ తర్పణాల మినహా ఇతర శుభ కార్యాలు ఉండవు. కావున ఈ ముహూర్తం సాధారణ పనులకు మినహాయించి ఇతర పనులకు పనికి రాదు. ఈ విధంగా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చక్కని గ్రహ యోగాలు వస్తాయి, కాని అవి వచ్చిన సమయం, కాలం ప్రధానమైనది. *ఆ సమయం శుభ ముహుర్తాలకు పనికి రానిది అయిన ఎడల వాటి వలన ప్రయోజనం ఉండదు*.
ఈ సమయంలో ‘జిల్లేడు ఆకుపై గోధుమలు ఉంచి, ప్రమిదలో దీపారాధన చేసి, దైవారాధనలో నిమగ్నమై ఈ అద్భుతమైన ఘడియలు సఫలీకృతం చేసుకోగలరు!’ అనే ప్రచారం జరుగుతుంది. సంపూర్ణ భక్తి, నిబద్ధత, శ్రద్ధ మరియు అంకిత భావం తో భగవానుడిని ధ్యానం చేస్తే, ఆయన ఎప్పుడైనా అనుగ్రహిస్తాడు. కామ్యాపేక్ష తో చేసే పూజలు, భక్తి, ధ్యానం ఇత్యాదివి అర్హతకు అనుగుణంగా మాత్రమే ఫలితాలను ఇస్తాయి. కావున వృశ్చిక లగ్నంలోనే కాదు, ఏ లగ్నంలో అయినా భక్తితో భగవంతుడిని పూజించ వచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. భగవంతుడి పూజకు, ధ్యానం చేసుకోవడానికి ‘ఫలానా సమయాలలోనే పూజించండి – అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి’ అని అనడం మూర్ఖత్వం. ఇది ముహూర్త శాస్త్రానికి వర్తిస్తుంది కాని భక్తికి వర్తించదు. భక్తికి ముహూర్త శాస్త్రానికి సంబంధం లేదు. ఏదో ప్రత్యేకమైన పూజ, వ్రతం మరియు క్రతువు ఇత్యాదివి చేసేటపుడు దుర్ముహూర్తాలు లేకుండా చూసి ప్రారంభించడం సాంప్రదాయం. ఇది నమ్మకం. ‘వృశ్చిక లగ్నంలో చేయండి సఫలీకృతం చేసుకోండి’ అని అనడం పొరపాటు. *అర్హత లేని భక్తుడికి సఫలీకృతం కాదు. అర్హత ఉన్నవాడు ఎప్పుడు చేసినా సఫలీకృతం అవుతుంది. అర్హత లేని వాడికి, సంకల్పిత కార్యం సిద్ధించక పోవుట వలన శాస్త్రం పై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కావున భగవంతుడి పూజకు భక్తి శ్రద్ధలు ప్రధానమైనవి అని గ్రహించ గలరు.*
*ప్రస్తుత గ్రహ యోగాలు ప్రపంచానికి చాలా ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. ఈ యోగ ప్రభావం గురు భ కుంభ రాశిలో ప్రవేశించు వరకు కూడా ఇదే విధంగా ఉంటాయి. కాని సెప్టెంబర్ 23 నాడు రాహువు వృషభ రాశిలో ప్రవేశించిన మొదలు కొంత ఉపశమనం లభించే అవకాశం మాత్రమే కలదు. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో భగవానుడిని ప్రార్థించడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. లోక రక్షకుడు ఆ భగవానుడు ఒక్కడే. అనవసరమైన ప్రచారాల ప్రభావంలో పడి సమయం వృధా చేసుకోకండి. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో భగవానుడిని ప్రార్థించండి.*
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति
https://www.srigayatrivedavision.com/
ప్రమాదం
ఉభయ 👪 కుశలోపరి 🇬🇺🇩 🇲🇴🇷🇳🇮🇳🇬
భోజనంలో విషం పెడితే
ఎంత ప్రమాదమో
చెవిలో విషయం పడితే కూడా
అంతే ప్రమాదం
తినే భోజనం గురించి
ఎంత జాగ్రత్తగా ఉంటామో
వినే మాటల గురించి కూడా
అంతే జాగ్రత్తగా ఉండాలి
కొన్నిసార్లు మన చెవులు
గ్రహించే మాటల వలన
మన స్వభావం మారిపోవచ్చు
అందుకే వీలైనంత వరకూ
మంచి మాటలు వింటూ ఉండండి
మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా
వారి మాటల్లో మంచిని మాత్రమే
గ్రహించండి
చాడీలు చెప్పేవారికి మాత్రం
దూరముండండి
ఎందుకంటే రేపు మీ గురించి
ఇంకొకరికి చెడుగా చెబుతారు..!!
భోజనంలో విషం పెడితే
ఎంత ప్రమాదమో
చెవిలో విషయం పడితే కూడా
అంతే ప్రమాదం
తినే భోజనం గురించి
ఎంత జాగ్రత్తగా ఉంటామో
వినే మాటల గురించి కూడా
అంతే జాగ్రత్తగా ఉండాలి
కొన్నిసార్లు మన చెవులు
గ్రహించే మాటల వలన
మన స్వభావం మారిపోవచ్చు
అందుకే వీలైనంత వరకూ
మంచి మాటలు వింటూ ఉండండి
మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా
వారి మాటల్లో మంచిని మాత్రమే
గ్రహించండి
చాడీలు చెప్పేవారికి మాత్రం
దూరముండండి
ఎందుకంటే రేపు మీ గురించి
ఇంకొకరికి చెడుగా చెబుతారు..!!
*సూర్యుని రూపాలు.*
*🌞సూర్యుని ద్వాదశమూర్తులు.🌞*
*సూర్యుని రూపాలు.*
1. ఇంద్రుడు :
స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.
2. ధాత :
ప్రజాపతియై భూతములను సృష్టించాడు.
3. పర్జన్యుడు:
తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.
4 త్వష్ట :
ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
5. పూష :
ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.
6. అర్యముడు :
దేవతారూపంలో వుంటాడు.
7. భగుడు :
ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.
8. వివస్వంతుడు :
ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.
9.విష్ణువు :
శత్రువులను నాశనం చేస్తాడు.
10.అంశుమంతుడు :
గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
11. వరుణుడు :
జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.
12. మిత్రుడు :
లోకాాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.
*🌞శుభ సూర్యోదయం🌞*

"సూర్య శతకము"
*మయూర కవి విరచిత "సూర్య శతకము" గురించి......*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*సూర్యుడు.. సప్తశ్వారూఢుడు.* ఆయనకు సంబంధించిన రహస్యాలను శతకరూపంలో రచించారు మన పూర్వీకులు..అలాంటి రచనల్లో ప్రధానమైనది *మయూరశతకం.*
దక్షిణ భారత దేశంలో పల్లవ రాజుల కాలంలో, *మయూర మహాకవి విరచిత సూర్య శతకంలో.......*
*ప్రభా వర్ణనం (1-43)*
*అశ్వ వర్ణనం (44-49)*
*అనూరు వర్ణనం (50-61)*
*రథ వర్ణనం (62-72)*
*మండల వర్ణనం (73-80)*
*రవి వర్ణనం (81-100)*
అనే విభాగాలున్నాయి.
ఇందులోని వర్ణనలు, అత్యంత సుందరాలు. కల్పనాచమత్కృతి అమోఘం. అర్థవంతంగా ఉన్నాయి.
ఆ చిత్రభానుని కిరణాలను వివిధ రీతుల వర్ణిస్తూ, *"అవి కిరణాలు కావు. ఆ పద్మ బాంధవుని పవిత్ర పాదాలు. ఆ కిరణలు శుభములకు ఆవిష్కరణలు. ప్రకృతికి అలంకారాలు. చాలా శక్తిమంతాలు. భక్తి భరితాలు. వీటి స్వభావం చాలా చిత్రంగా వుంటుంది. ఇవి అతి సుకుమారమైనవి. అతి కఠినమైనవీ కూడా! పద్మాల హృదయాలలో చేరి ఆనందం అందించి చక్కిలిగిలి పెడతాయి. పర్వత పాషాణ చిత్రాలలో ప్రవేశించి, చైతన్యాన్ని అందిస్తాయి."*
ఇలా మొదలై పోను పోనూ అభివ్యక్తిలో చిక్కదనం ఇనుమడిస్తూ ఇనుమడిస్తూ, సూర్యునికీ శ్రీమన్నారాయాణునికీ అభేదం సూచించేంత వరకూ వెళ్ళటం - నిజంగా అద్భుతం.
సూర్యుడెలా వున్నాడు? ప్రకృతికి బంగారు భూషణం వలె, పద్మరాగ మణి వలె, ఆకాశమనే నీలి కలువపై పసుపు వన్నె పుప్పొడివలె, కాలపన్నగ శిరముపై – మహారత్నము వలె, విశ్వసుందరి కంఠాన మెరుస్తున్న శుభకర మంగళసూత్రము వలె కాంతులు ప్రతిఫలింపగా, మంగళకరముగా సూర్యమండలం కనిపిస్తున్నదనటం – మయూరకవి అపూర్వ కల్పనాచాతురికి పరాకాష్ట!
ఇంతేనా?...
‘ఆదిత్య దీప్తి అఖిల ప్రపంచానికి రక్షణ కవచం. రవిమండలం - మహాయోగీశ్వరులకు ముక్తి మార్గం చూపించే అఖండ దీప్తి. కడుపులో పెనుమంటలు పెట్టుకుని, లోకం కోసం ప్రాణికోటికి చాలినంత వరకే కాంతిని వారి వుపయోగం కోసం ప్రసారం చేసె ఆదిత్యుని యేమని కీర్తించగలం? మహాత్ముల రచనలు అద్భుతం.
*సూర్య సార్వ భౌమత్వాన్ని ప్రతిపాదించిన మయూరుడు, ఫల శృతిలో, యీ తన శతకాన్ని భక్తి శ్రద్ధలతో పాఠం చేసిన వారు సర్వ పాపాలనుంచీ విముక్తులవటమే కాక, వారికి ఆరోగ్యం, సత్కవిత్వం, అతులనీయమైన బలం, విద్య, ఐశ్వర్యం, సంపదలూ - అన్నీ సూర్య ప్రసాదాలుగా లభిస్తాయని ఘంటాపథంగా మయూర శతకం పేర్కొన్నది.*
*సేకరణ*

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)