4, డిసెంబర్ 2020, శుక్రవారం

సౌందర్య లహరి శ్లోకము - 5

  *దశిక రాము**


సౌందర్య లహరి శ్లోకము - 5


( **శ్రీ శంకర భగవత్పాద విరచితము** )


( **శ్రీ లలితాంబికాయైనమః** )


**హరిస్త్వామారాధ్య**

**ప్రణతజనసౌభాగ్యజననీం**


**పురా నారీ భూత్వా**


**పురరిపుమపి క్షోభమనయత్।**


**స్మరోఽపి త్వాం నత్వా**


**రతినయనలేహ్యేన వపుషా**


**మునీనామప్యన్తః**


**ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥**


అమ్మా! భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు. మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు. 


జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.

భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి. 


బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.


మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.


మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ? దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.


నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు. మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు. 


శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.


🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

హిందూ ధర్మం - 5

  **దశిక రాము**

హిందూ ధర్మం - 5



(మనకూ ఇతర మతాలకు ఉన్న తేడా)


ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా చెప్తే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంధాలు చదవండి, మీకే అర్ధమవుంది, ఎవరి దృక్పధం విశాలమో, ఎవరు అందరి గురించి ఆలోచించారో మీకే స్పష్టమవుతుంది. కానీ ఈ ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని అనుభూతి చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పదంలో భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. ఎవరో దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అది నమ్మాలి అని ధర్మం చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గం చూపిస్తుంది, భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క ఈ ధర్మానికి మాత్రమే చెల్లింది.


ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని ప్రత్యక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం భోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పలేదు. అవసరమైతే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, శాస్త్రగ్రంధాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అన్ని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు.


ఇవన్నీ మనకూ, ఇతర మతాలకు ఉన్న తేడా. ఇక మన ధర్మం గురించి తెలుసుకుందాం.


**ధర్మో రక్షతి రక్షితః*

“సింగినాదం - జీలకర్ర*

  “సింగినాదం - జీలకర్ర*

కొన్ని సందర్భాల్లో 

మనకు తెలియకుండానే 

తెలుగులో కొన్ని నానుడులు 

 అసంకల్పితంగా 

 అనేస్తూ ఉంటాము....


కాని వాటి వెనుక 

ఉన్న అసలు 

అర్ధం చాలామంది కి 

తెలియదు...


ఈ రోజు 

సింగినాదం జీలకర్ర 

అనే నానుడి వెనుక 

దాగి ఉన్న అంతరార్ధం 

 తెలుసుకుందాం....


ఒకప్పుడు 

ఓ రాజ్యంలో 

జీలకర్రకు 

విపరీతమైన 

కొరత ఏర్పడింది...


ప్రజలందరూ 

జీలకర్ర లేక చాలా

ఇబ్బందులు పడ్డారు..


ఇదే అదనుగా 

వ్యాపారస్తులు 

ఇతర దేశాల నుండి 

జీలకర్రను దిగుమతి 

చేసుకుని ఎక్కువ రేట్లకు 

అమ్మడం మొదలు పెట్టారు....


ఈ విషయమై ప్రజలందరూ 

తమ గోడును రాజు గారికి 

 విన్నవించుకున్నారు...


అప్పుడు రాజు గారు 

మంత్రివర్గం తో 

అత్యవసర సమావేశం 

ఏర్పాటు చేసి 

విదేశాలనుండి ఓడల 

మీద జీలకర్రను తెప్పించి 

 మధ్యవర్తుల ప్రమేయం 

లేకుండా డైరెక్ట్ గా ప్రజలకు 

అమ్మే ఏర్పాటు చేశారు...


అయితే జీలకర్ర తో 

కూడిన ఓడ...

రేవుకు చేరుకున్నవెంటనే 

ఆ విషయం ప్రజలకు 

 తెలియచేయడానికి 

ఓ ఏర్పాటు చేశారు...


అదే శృంగ నాదం...


శృంగ నాదం

అంటే ఒక సంగీత 

వాయిద్య పరికరం... 


ఒక విధంగా ఇది 

బాకాను పోలి ఉంటుంది....

ఓడ, రేవుకు చేరగానే 

శృంగనాదం గట్టిగా ఊదడం 

ద్వారా ప్రజలకు ఆ విషయాన్ని 

 తెలియ చేసెడి వారు...


ప్రజలు వెంటనే 

ఓడ రేవుకు చేరుకుని 

డైరెక్ట్ గా జీలకర్రను 

కొనుక్కునే వారు...


మధ్య దళారుల 

ప్రమేయం 

లేక పోవడంతో 

జీలకర్ర తక్కువ 

రేటుకి లభించి ప్రజలు 

 ఆనందించారు...


ఇక అసలు 

విషయానికి వస్తాను...


జీలకర్ర లేకపోవడం వల్ల 

జనజీవనం అస్త వ్యస్తం 

అయ్యే అంత పరిస్థితి 

 ఏమి ఉండదు...


అయినా రాజు గారు 

దానికి అధిక ప్రాధాన్యాన్ని 

ఇచ్చి లేనిపోని హడావిడి చేశారు...


అందుకే అప్పటి నుండి 

ఎవరైనా అనవసర 

విషయాలకు అధిక 

ప్రాధాన్యాన్ని ఇస్తే 


ఆ చేశావులే 

శృంగానాదం జీలకర్ర 

అనడం పరిపాటి అయినది...


కాలక్రమంలో 

శృంగానాదం 

కాస్త సింగినాదం గా 

మారి....


సింగినాదం జీలకర్ర గా 

మారింది...


ఈ విషయం చెప్పడానికి 

నేను ఇంత మేటర్ ను 

తెలుగులో తయారు చేసి 

మీకు 

పోస్ట్ చేయడం అంత 

అవసరం అంటారా...


*సింగినాదం* 

*జీలకర్ర కాకపోతేను....*😊

సెక్యులర్ హిందువులు

  _*తెలుగు రాష్ట్రాల్లో హిందువులు*_

సెక్యులర్ హిందువులు

 73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.

👉_*భారత్_టుడే_సర్వేలో_వెల్లడి*_

👉అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువుల

👉ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు👇👇👇

1.అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు

2. అన్ని మతాల సారం ఒక్కటే వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా

3.అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అంటాడు వీడు అన్ని గ్రంధాలు చదివినట్లు

4.వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తిచూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు

5.వాడు మన మతాన్ని తిడితే వాడిపాపాన వాడిపోతాడు అనడం

6.క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనడం

7. క్రైస్తవుల ఇంటికి ప్రాద్దనకు కి వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు

8 హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు

9.హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు, ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని.

10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు(ఉదా, కృష్టుడికి 16 వేలమంది భార్యలు ).

11. స్వార్ధం తో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.

12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూమతాన్ని దూషించి మతం మారిపోతారు.

13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైం ని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయిమతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

ఈ సెక్యులర్ హిందువులు 

(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి 

నిజం తెలుసుకోండి 

👉🇮🇳🙏🕉 గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో.మేలుకోండి హిందువులారా!లేకపోతే కొన్నిరోజుల,కొన్నిఏళ్ళతర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే పరిస్థితి దాపురిస్తుంది.ఇది మీరు అంగీకరిస్తారా?అంగీకరిస్తే మీ మీ గ్రూపులకు పంపగలరని సవినయముగా ప్రార్థిస్తూ


సేకరణ.....

ముఖ్యమైన విషయం*

 *దయచేసి చాలా ముఖ్యమైన విషయం*


మీకు తెలిసిన దగ్గరి బంధువుల లేదా మీ స్నేహితుల సర్కిల్‌లో ఎవరైనా కరోనా సోకడం వలన (కోవిడ్ -19) లేదా మరేదైన కారణం వల్ల మరణించినట్లయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 01-04-2020 నుండి నేటి వరకు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ ఎంట్రీ కావాలని బ్యాంకును అడగండి.


 ఎంట్రీ చూసి రూ.12/- లేదా రూ.330/- డెబిట్ అయివుండవచ్చు గుర్తించండి,.


 బ్యాంకుకు వెళ్లి బీమా కోసం క్లైమ్ చేయండి.


మీ అందరికీ నా వినయపూర్వకమైన అభ్యర్థన 

ఏమిటంటే, మీ చుట్టూ ఇలాంటి కేసులు జరిగితే, మరణం తరువాత ఖాతాను మూసివేసిన కుటుంబాలకు వెంటనే తెలియజేయండి.ఆ కాలంలో ప్రీమియం డెబిట్ చేయబడివుంటే ఆ కుటుంబానికి భీమా సొమ్ము అందుతుంది. 


 2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు తక్కువ ప్రీమియంతో రెండు బీమా పథకాలను అందించింది:


 *ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) రూ.330*


*ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్‌బివై)రూ.12 లతో బీమా 2 లక్షల రూపాయలు*


మనలో చాలామంది ఈ ఫారమ్‌ను నింపివుండవచ్చు. ప్రీమియం వారి ఖాతా నుండి 31/05 న డెబిట్ చేయబడిఉంటుంది.


*మొదట, ఈ సందేశాన్ని అన్ని బ్యాంక్ ఖాతాదారులకు పంపించండి.*


 రూ. 2,00,000 / అనేది మాత్రం చిన్న మొత్తం కాదు.!

*ధార్మికగీత - 29*

 *ధార్మికగీత - 29*            

         *శ్లో:- హరే ర్నామ హరే ర్నామ ౹*

                 *హరే ర్నామైవ కేవలం ౹*

                 *కలౌ నాస్త్యేవ నాస్త్యేవ ౹*

                 *నాస్త్యేవ గతి రన్యథా ౹౹*

                                     *****

*భా:- కృత త్రేతా ద్వాపర యుగాలలో ఋషులు, మహర్షులు, రాజర్షులు మునులు, యోగులు, రాజులు శమ దమాలు, నియమనిష్ఠలు కలిగి దీక్షాదక్షతలతో యజ్ఞాలు, యాగాలు చేసి భగవానుని ప్రసన్నం, ప్రత్యక్షం చేసుకున్నారు. ఆధునికత, సాంకేతికత, యాంత్రికత, హేతుకత వెల్లివిరిస్తున్న కలియుగంలో అవి అసాధ్యము కనుక కేవలము "భగవన్నామసంకీర్తన" కన్న వేరే దారి లేదు. రామ, హరి, కృష్ణ, శివ అనే రెండక్షరాల నామామృతగానం మనసారా, నోరారాచేస్తే, మానవాళి పాపాలు, తాపాలు, పాతకాలు, మహాపాతకాలు పూర్తిగా హరించుకుపోతాయి. "రా" అనగానే నోటి నుండి పాపాలు బయటికి వెళితే, అవి తిరిగి మన చెంతకు రాకుండా "మ" కవాటంలా పెదవులు మూసివేస్తుందనే కవి చమత్కారము అక్షరసత్యము. ముమ్మాటికి దైవనామమే మనకు శ్రీరామరక్ష. మనమే కాదు మన మనసులు, పరిసరాలు, వాతావరణము, , ఊరూ వాడా అన్ని నగర సంకీర్తనలో భగవన్నామగానామృత దివ్యతరంగాలతో పునీతమవుతాయి. " నామస్మరణాత్ అన్యోపాయం నహి నహి" అని రూఢిగా చెప్పబడింది. కాన మనం ప్రతి పనిని భగవదర్పణ భావంతో చేయగలగాలి. మనోవాక్కాయాలను భగవచ్చింతనలో నిమగ్నం చేయాలి*.

                                  *****

                    *సమర్పణ : పీసపాటి*

ఏకదండి_ద్విదండి_త్రిదండి

ఏకదండి_ద్విదండి_త్రిదండి 

#ప్ర: యతీశ్వరులుచేతిలో కర్ర ఎందుకు పట్టుకుంటారు?

 వారు ఏం బోధిస్తారు? #ఏకదండి_ద్విదండి_త్రిదండి అంటే ఏమిటి?


#జ: యతీశ్వరులు (చేతిలో వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా పొడవాటి కర్రలు ఎళ్లవేళలా పట్టుకుంటారు.

ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. 

గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, యతీశ్వరులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. (దండి అనగా కర్ర అని అర్థము)

ఒక కర్రను (ఏకదండి ) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు (ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా బ్రహ్మ ఆత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బ్రతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్దాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.

రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని 'ద్విదండి స్వాములు ', 'జీయరు'లని అంటారు వీరందరూ వైష్ణవ భక్తులే. వీరు దేవుడు వేరు జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.

మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి ( త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతమును బోధిస్తారు (రామానుజాచార్యులు). శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యములని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ,

జీవుడు ఆజ్ఞానముతో సంసార బంధమున చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారికి భగవంతుని అణుగ్రహం వలన అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము నారాయణ సాన్నిధ్యము, మోక్షము పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్దాంతాన్ని బోధిస్తారు.....

🙏🙏🙏🙏


ధనప్రాప్తి

 ధనప్రాప్తి

లక్ష్మీ కటాక్షం కలగాలంటే నిత్యం ఈక్రింది శ్లోకాన్ని 

56 సార్లు జపించాలి.

"సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే

శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే"

బంగారపు..లేదా వెండి లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి.

లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్యప్రాప్తి.

ఆఫీసులో..వ్యాపారసంస్థలో తూర్పుముఖంగా

కూర్చుంటే ధనప్రాప్తి.

పన్నీరుతో కొత్త తెల్లనివస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆవస్త్రంతో వత్తులుచేసి శుక్రవారం ఆవునేతితో 

మూడువత్తులతో దీపారాధన చేస్తే సకలసంపదలు కలుగుతాయి.

గురువారం ఐదు పత్తివత్తులతో ఆవునేతితో 

దీపారాధన చేస్తే అఖండఐశ్వర్యం లభిస్తుంది.

శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు — శ్రీదేవీభాగవతము.

ప్రతిరోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కరుణిస్తుంది.

కమలసప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖమాసాలలో శుక్లసప్తమి నాడు శ్రీమత్స్యపురాణంలో చెప్పిన

ప్రకారము చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి.


కనకధారాస్తవము ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపారసంపద చేకూరుతుంది.


శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో(కర్పూరం,కస్తూరి, పుణుగు,జవ్వాది,అగరు,పన్నీరు, అత్తరు,శ్రీగంధం) పూజిస్తే కీర్తి,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.


కొత్త సంవత్సరంతర్వాత అనగా ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడంద్వారా 

ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.

జాతకరీత్యా ఉన్నదోషాలు తొలగిపోతాయి.

శ్రీ సూక్తము నిత్యం పఠించిన ధనప్రాప్తి కలుగుతుంది.



*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.

*9494550355*

కపోతేశ్వరాలయం* - చేజెర్ల

 కపోతేశ్వరాలయం* - చేజెర్ల

**మన సంస్కృతి సాంప్రదాయాలు*


మహారాష్ట్రలోని "తేర్" మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని చేజెర్ల - రెండు స్థలాలలోను ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు తరువాత హైందవ శైవాలయాలుగా మార్చబడ్డవి. చేజెర్లలోని శైవాలయాన్ని "కపోతేశ్వరాలయం" అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరంనుండి ఉద్భవించిందని స్థల పురాణ గాధ. శిబికి, కపోతానికి (పావురానికి) ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాధ, ఒక బౌద్ధ గాధ ఉన్నాయి.


*స్థల పురాణం*


మహాభారతంలోని కధ - మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొని కాష్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపో దీక్షనాచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు. తమ్ముళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షింపదలచారు. శివుడు ఒక వేటగాని వలెను, బ్రహ్మ అతని బాణం లాగాను, విష్ణువు ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు. వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు జొచ్చింది. శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు.అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.


*బౌద్ధ జాతక కధ* -


శిబిజాతకం కధ ప్రకారం శిబి చక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. అవసన సతకం కధ ఈ శిబిజాతక కధనూ, మహాభారత కధనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కధ తరచు కనిపిస్తుంటుంది. అమరావతిలోను, నాగార్జున కొండ ఈ జాతక కధకు సంబంధించిన శిల్పాలున్నాయి.

ఆలయం నిర్మాణం గ్రామానికి వాయువ్య దిశగా ఉన్న ఈ కపోతీశ్వరాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. తూర్పున ఉన్న ఒకే ఒకద్వారం పైన ఒక చిన్న గోపురం ఉంది. ఈ గోపురం అలంకరణలు లేకుండా సాదాగా ఉంది. స్తంభాలు, ద్వార బంధాలు కంచిలోని పల్లవ దేవాలయాలను పోలి చదరపు శీర్షభాగాలు కలిగి ఉన్నాయి. ఆలయం వెలుపల దక్షిణం వైపు ఒక పెద్ద boab చెట్టు ఉండేది. దాని కాండం వ్యాసం 56 అడుగులు ఉండేది. లోపల తొర్రగా ఉండేది. ఈ చెట్టు 1917లో కూలిపోయింది. దేవాలయంలో "నగర, వెసర, ద్రవిడ" నిర్మాణ రీతులు మిళితమై ఉన్నాయి. చైత్యగృహం ప్రధాన చైత్యంపై కట్టినందున ఈ ఆలయ నిర్మాణాన్ని వాస్తుశాస్త్రంలో "హస్తిప్రస్త" (ఏనుగు వీపు) విధానం అంటారు. ముందుగా బౌద్ధ చైత్యం అయిన దానిని హిందువుల పూజా విధానానికి అనువుగా మలచారు.


ప్రాకారం లోపల అనేక చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ప్రవేశ గోపురానికి ఎదురుగా ఒక చిన్న మంటపము, ధ్వజ స్తంభము ఉన్నాయి. ఆవరణ దక్షిణాన ఆరు, పశ్చిమాన రెండు, ఉత్తరాన నాలుగు చిన్న మందిరాలున్నాయి. ఇవి కాకుండా రాళ్ళలో తొలిచిన అనేక చిన్న గుడులున్నాయి. రెండు రాతి పలకాలమీద ఒక్కొక్క దానిమీద వెయ్యి చొప్పున శివలింగాలున్నాయి. ఒక పాలరాతి ఫలకంపై పద్మహస్తుడైన సూర్యుని శిల్పం ఉంది. ప్రధాన ఆలయానికి వాయువ్యాన సప్తమాతృకల శిల్పం, ప్రస్తుతం బాగా శిధిలమైనది, ఉంది. కపోతేశ్వరస్వామి గర్భగుడి ముందు ఒక చిన్న నంది మంటపం ఉంది. దాని వెనుక ఒక సన్నని దీర్ఘ చతురస్రాకారపు మంటపానికి ముందు వైపు రెండు, వెనుకవైపు నాలుగు స్తంభాలున్నాయి. ఆ నాలుగు స్తంభాల మధ్య ద్వారం ఉంది. ఈ నాలుగు స్తంభాలపై పద్మాలు చెక్కబడి ఉన్నాయి. వాటి వెనుక చదరంగా ఉన్న ముఖమంటపం ఇరువైపులా తూర్పు-పశ్చిమ దిశలలో వరుసలో స్తంభాలు, వాటిమధ్య ద్వారపాలకుల ప్రతిమలు ఉన్నాయి. ఈ మంటపం ఉత్తర-పశ్చిమ దిశలోని గోడలు గర్భగుడిని కలుస్తాయి. గర్భగుడి అసలు చైత్యగృహం అయి ఉండవచ్చును. గర్భగృహం ఇరువైపులా ఉన్న మూడేసి స్తంభాలపైన రాతి దూలాల కప్పు ఉంది. చదరపు వేదికపైన ఉన్న కపోతేశ్వరలింగం తలలేని శరీరాకృతిలో అనిపిస్తుంది. లింగం పై ప్రక్కల రెండు రంధ్రాలున్నాయి. కుడిప్రక్కనున్న రంధ్రంలో ఒక పాత్రకు సరిపడా జలం మాత్రం పడుతుంది. మరొక రంధ్రంలో ఎంత నీరు పోసినా గాని తిరిగిరాదు. (లోపల ఏదో సొరంగంలోకి వెళుతూ ఉండవచ్చును). అన్ని శివాలయాలలోను సాధారణంగా అభిషేక జలం బయటకు పోవడానికి గర్భగుడి ఉత్తర దిశలో ఒక మార్గం ఉంటుంది. కాని ఈ ఆలయంలో అలా లేదు. గర్భగుడి గోడల బయటి ప్రక్క అలంకరణలు లేకుండా సాదాగా ఉంటాయి. గోడపైన ఒక పావురాయి బొమ్మ మాత్రం ఉంటుంది. ఆ పై నిర్మాణంలో "పట్ట, త్రిపట్ట, గళ, పట్ట, త్రిపట్ట, గళ" భాగాలున్నాయి. వాటి పైన గుర్రపుడెక్క ఆకారంలో శిఖరం ఉంది. శిఖరం పైన కలశం లేదు. శిఖరం ముందుభాగంలో సింహలత అందులో ఒక మాలాకోష్టంలో క్రింది భాగాన ఆసీన దేవతా మూర్తి, ఆ పైన నందిని ఆరోహించిన ఫార్వతీ పరమేశ్వరులు ఉన్నారు.


*శాసనాలు*


శివానందలహరి 5 వ శ్లోకం

 శివానందలహరి    5 వ శ్లోకం

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

అవతారిక:

ఓరీ పిచ్చి వాడా! అల్పమైన ఫలితములను ఇచ్చే దేవతలతో నీకు

ఏమిపని ? వీళ్ళు ఎప్పుడో ఫలితములు ఇస్తారట. వాళ్ళిచ్చే ఫలితం

కూడా, మన కళ్ళకు కనపడదు. ఇంతకన్నా ఒక రాజును ఆశ్రయింౘవౘ్చును

కదా ! రాజులైతే ప్రత్యక్షంగా నే ఫలితములు ఇస్తారు. దేవతలను ఆశ్రయింౘడం

కంటే, రాజులను ఆశ్రయింౘడం మేలు అనే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని

శంకరులు ఈ శ్లోకం వ్రాశారు. రాజులను కొలిచి వారిని మెప్పించగల నేర్పు

తనవద్ద లేదనీ ఈశ్వరుడేతన్ను కాపాడాలనీ, శంకరులు ఈ శ్లోకం లో 

ప్రార్థించారు.


శ్లో: 5


**స్మృతౌ శాస్త్రే వైద్యే**


**శకున కవితా గాన ఫణితౌ**


**పురాణే మంత్రేవా**


**స్తుతినటన హాస్యేష్వచతురః**


**కథంరాజ్నాం ప్రీతిర్భవతి మయి కో‌ హోం పశుపతే**


**పశుంమాం సర్వజ్ఞ!**


**ప్రథిత కృపయా పాలయ విభో !!**


పదవిభాగం:

స్మృతౌ , శాస్త్రే, వైద్యే _ శకునకవితాగానఫణితౌ _ పురాణే _ మంత్రే _ 

వా _ స్తుతి నటన హస్యేషు _ అచతురః _ కొంచెం _ రాజ్నాం _ ప్రీతిః _ 

భవతి _ మయి _ కః _ అహం _ పశుపతే _ పశుమ్ _ మామ్ _ సర్వజ్ఞ _ 

ప్రథితకృపయా _ పాలయ _ విభో.

తాత్పర్యం:

సర్వజ్ఞుడైన ఓ ఈశ్వరా! మనుస్మృతి వంటి స్మృతుల యందు గానీ,

తర్కవ్యాకరణములవంటి శాస్త్ర ములయందుగానీ, వైద్యము నందుగానీ,

శకునములు చెప్పుట యందుగానీ, కవిత్వమును అల్లుటయందుగానీ,

సంగీతమును పాడుటయందుగానీ,సభల్లో వాగ్వాదము చేసే వాచా

విష్కరణము నందుగానీ, పురాణకాలక్షేపము చేయుటయందు గానీ,

మంత్ర ప్రయోగమునందుగానీ, ఇతరులను స్తుతి చేయుటయందు గానీ,

నాట్యమునందుగానీ,హాస్య ప్రసంగము నందుగానీ నాకు నేర్పు లేదు. 

అటువంటి నాయందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది. వారిని 

సంతోష పెట్టేందుకు అసలు నేను ఎవరిని ? నేను ఎంతటివాడను?

శ్రుతి, స్మృతి పురాణేతిహాసము లందు ప్రసిద్ధుడవైన ఓ ప్రభూ!

నేను పశువును, నీవు పశుపతివి. కాబట్టి నన్ను దయతో కాపాడు.

వివరణ:

శంకరులు కరుణాస్వరూపులు మనవంటి అల్పజ్నులకు భగవంతుని

ముందు నిలబడి ఎలా ప్రార్థన చేసికోవాలో కూడా తెలియదని , గుర్తించి

వారు ఈ స్తోత్రమును మనకందించారు. కాబట్టి " పశువు" నని మనం

భగవంతుని ముందు చెప్పుకోవాలని మనకు చెప్పడంకోసమే, వారు ఇలా

వ్రాశారని మనం గర్తింౘాలి.

అదీగాక రాజులు కొంచం గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళు కూడా పశువులే కదా!

ఒకవైపు పాశాలను త్రెంౘుకోవాలని మనం అనుకుంటూ,మనకంటే పెద్ద 

పశువులైన రాజులను మనం ఆశ్రయింౘడం అంటే పాశాలను మరింతగా

బంధింౘుకోవడమే కదా! కనుక, తనకు ఆ రాజులు ఇచ్చే ధనకనకాదులపై

ఆసక్తి లేదని శంకరులు చెప్పారు.

ధూర్జటి మహాకవి కూడా తన " కాళహస్తీశ్వర శతకము" లో ఇలానే 

చెప్పారు. ౘూడండి___

" రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు,వారిచ్చు నం

భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా

బీజంబుల్, తదపేక్ష ౘాలుఁ, బరితృప్తింబొందితిన్,జ్నానల

క్ష్మీ జాగృత్పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా !"

ఏ విద్యలలోనూ,నేర్పులేని తనను, రాజులు ఆదరింపరని, అన్నీతెలిసిన

ప్రభువైన ఈశ్వరుడే తనను రక్షింౘాలని, రక్షింౘమని, శంకరులు ఈశ్వరుణ్ణి

కోరారు.

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**