24, మార్చి 2022, గురువారం

ఏ కులం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన ఓ చమత్కార సంభాషణ.* 

                 🌷🌷🌷

విలేఖరి: సార్ మీది ఏ కులం????

నేను: ఏ వయస్సు లో...

విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???

నేను: వుంటుంది

బాల్యంలో బాలకులం

యవ్వనంలో యువకులం

వృద్ధాప్యంలో పండుటాకులం

రాలిపోయే ఎండుటాకులం


విలేఖరి: అది కాదు మామూలుగా మీది ఏ కులం???

నేను: 

ఎవరూ లేకుంటే ఏకాకులం

 ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం

  పెళ్లి అయ్యాక సంసారికులం

  కానప్పుడు బ్రహ్మచారికులం


విలేఖరి: అది కాదండీ కమ్మ కాపు ఆలా మీది  ఏ కులం

నేను : 

ధనముంటే దనికులం 

లేకుంటే బీదకులం

 దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం

 నమ్మకుంటే నాస్తికులం


విలేఖరి: మీకు ఆసలు కులం లేదా????

నేను: ఎందుకు లేదు

ప్రయాణిస్తే ప్రయాణికులం

యాత్రలు చేస్తే యాత్రికులం

మాయలు చేస్తే మాంత్రికులం

ఉపన్యసిస్తే ఉపన్యాసకులం

హాస్యం పండిస్తే విధూషకులం

పాడితే గాయకులం

సభలో ఉంటే సభికులం

సినిమా హాల్లొ ప్రేక్షకులం

టీవీ ల ముందు వీక్షకులం


విలేఖరి: మీరు ఎక్కడ చదివారు????

నేను:

చదివింది గురుకులం 

      అభ్యసిస్తే అభ్యాసకులం 

      బోధిస్తే బోధకులం

      వృత్తిరీత్యా అధ్యాపకులం

      పత్రికల పాఠకులం

      నేర్పించే శిక్షకులం

విలేఖరి: అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు????

నేను:

నాగరికత నేర్పిన నాగరికులం జాతకాలునమ్మేఅమాయకులం

మూఢత్వంపోని మూర్ఖులం


విలేఖరి: అసలు మీ వయస్సు ఎంతండి బాబు????

నేను:

కొందరికి పూర్వీకులం

మరికొందరికి సమకాలికులం

 ప్రస్తుత వర్తమానికులం


విలేఖరి: అసలు మీది ఏ దేశం???

నేను: 

భరత జాతి వంశీకులం

భావి భారత రథసారథికులం...


విలేఖరి: మీకు దణ్ణం రా బాబు ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగను...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆవకాయ

 ఆహా ఆవకాయ*


ఉత్పలమాల:
రంగులు సంతరించె మహిళాకరసన్నుత రంగరింపుతో
నంగన జూపు ప్రేముడి యహా! యని మెప్పులు కుమ్మరించగా
చొంగలు కార్చగా జనులు సొంపగు సద్రుచి రుచ్యమై వెసన్
భంగిమ నావకాయ పలు వాయల మెక్కగ బిల్చుచుండెగా!
*~శ్రీశర్మద* 

సేవావృత్తిచే

  🪔 *ॐ卐 _-|¦|శుభోదయమ్-సుభాషితమ్|¦|-_ ॐ卐*💎


శ్లో𝕝𝕝 వరం వనం వరం భైక్ష్యం 

వరం భారోపజీవనమ్।

వరం వ్యాధిర్మనుష్యాణాం

నాధికారేణ సమ్పదః॥


*మహాసుభాషితరత్నావళీ* 


తా|| అరణ్యనివాసం, భిక్షాభోజనం, బరువులుమోసి జీవించడం, వ్యాధిచే బాధింపబడడం అయినా శ్రేష్ఠమేగానీ? 


*సేవావృత్తిచే వచ్చే సంపద వద్దు*..... 

అనగా సేవావృత్తి అత్యంత నీచమైనది అని అర్థం.....

22, మార్చి 2022, మంగళవారం

భ్రష్టమవుతాయి

 శ్లోకం

*********/

శ్లో: నిర్మర్యాదస్తుపురుషః పాపాచార సమన్వితః ॥ మానం నలభతేసత్సు భిన్న చారిత్ర దర్శనః ॥


తాత్పర్యము : ఎవరు ధర్మ - వేద పద్ధతులను వదలివేస్తారో వారు పాపకర్మల్లో పడి కొట్టుకుపోతారు. ఆచార విచారాలు భ్రష్టమవుతాయి. అతను చివరికి సజ్జనులలోనూ ఎన్నడూ గౌరవింపబడడు......


*శ్రీరామాయణ రత్నాకరము*

కళ్యాణ మండపంలో

 *అన్నవరం క్షేత్రం లో రత్నగిరిపై, స్వామి వారి సన్నిధిలో, పెళ్లి చేసుకోబోయే వధూవరులకు శుభవార్త.* పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ *లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు.* ఈ కళ్యాణ మండపంలో *ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు.*

ఇది పేద,మరియు మధ్య తరగతుల వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. *అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు.* ఈ మండపంలో *ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు. పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.*


పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా *సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు.* ఈ కళ్యాణ వేదికను ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా.. వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.

*ఏసీ కళ్యాన మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి. వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది.ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.*

                       ఇట్లు మీ

 *అవధానుల శ్రీనివాస శాస్త్రి*

                🙏🙏🙏🙏

సత్యాలు - ధర్మఆచారములు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు*


100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

. 

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

. 

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. 


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు

SRIRAMANA MAHARSHI At the Age of Sixteen

 DEATH EXPERIENCE OF BHAGAVAN SRIRAMANA MAHARSHI At the Age of Sixteen


PAMANA MANARSNI realized the self te wos a las of aktos, attached to took a ak step and nowhed the gok MANARSNI himself described how this happened.


"It was to weeks tekee ert Asapal fe that the great che ne p It was quite auxk I was attig alve ba on the fest fix of my un home 1 mokk at any times and on that there we the word with my health but a masters violent fee of death overhe There was nothing state of health to atte axt 1 okt not try to soste it as to find out alsout w masayf the t eta goly to de' and tegen theday what to e assit R. Itky not sur te e te avut a doctora ay akse on I felt that I fod to aste the pobok there and thens


The ask of the fear of death drove my b I to yoelf mentally without actually family the word: Now death com what see it? Whet laitthat Indy Thin Ang And at ose dethed the wxxxce of death by with my #ffs INugh od bet in and beated a come so as to ghe greater reality to the holy booth and kept my lipe that the wo Twoe any other word d de utensx Will then I to yer this y


to dosk. It will be careled stiff to the burning around and there burnt and reduced to ashes. But with the death of this body am I dead in the body 17 It la ellent and hert til I feel the full force of my personality and even the vole of the 'T' within me apart from it. So I am spirit transcending the boobs The bob dles but the apleit that transcende it cannot be touched by death. That means I am the deathtosa mpielt. All this was not doll thought It flashed thesh me viokity an living truth which I pesolved directly almost without thought process


Two something very real, the only real thing my present state, and all the conecious activity connected with my body was centred on that T. From that moment onwards the 'T' or Self used attention on Itinelf by a powerful solation foon of death had windshed once and for all.


Abeption in the Belf continued unteolien from that the on. Othes thoughts might come and go the the veke nten of mue, but the continued Be the eximental se note that underlies and Noude with all the other notes. Whether the body weeped in baking, reading anything else. Tsabit contred on Previous to that criola I ception of my Self and was not acter to Ib. 1 feltre peseptible os et een in, much less ang inclination


case that no assicsil) escapaso to chvell pormenorbby in it."


Copied from the wall of ramansramam


21, మార్చి 2022, సోమవారం

పునర్జన్మ

 సనాతన ధర్మం - పునర్జన్మ


ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు. 


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు. 


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు. 


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు. 


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు. 


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు. 


స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు. 


”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు. 


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం ||


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గ్రహించగలరనుకుంటాను

 *♦️శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు ... వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారు ... అంటూ విషప్రచారం చేస్తున్నారు.♦️*

*👽 వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ దురాక్రమణ దారులు చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే - మాక్స్ ముల్లర్ మానస పుత్రులు, పాశాంఢ ఎడారి మత మార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది రైస్ బ్యాగ్గాళ్ళు, మొండిగాళ్ళు, ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ గాళ్ళు "మా వంటి శూద్రులను (author of this article)" హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 👽👇*


*♦️అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...???*


*వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???*


*(RK)*


*✅ పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహా కావ్యాన్ని రచించిన బోయవాడు అయిన రత్నాకర పూర్వ నామం కలిగిన వాల్మీకి మహర్షుల వారు శూద్రుడు కాదా...???*


*✅ మత్స్య గ్రంధికి జన్మించి పంచమ వేదం శ్రీమద్ భగవద్గీత, మహా భారతం వంటి పరమ పవిత్ర సనాతన గ్రంధాలను లిఖించిన కల్పి అనే పూర్వ నామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా...?? ఆయనను నారాయణుడి అంశగా, విశ్వ గురువుగా గౌరవించుకోవడం లేదా...? ఆయన జయంతి రోజును గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము కదా...!*

*✅ శూద్రునిగా పుట్టి దస్య కుమారుడు అయినా వేద జ్ఞానాన్ని ఆర్జించి రుషి అయి ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణమును రచించిన ఆత్రేయ ఋషి వారు శూద్రుడు కాదా...???*

*✅ పుట్టుకతో శూద్రునిగా జూదగానికి పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋగ్వేదంలో గొప్ప గొప్ప పరిశోధనలు చేసి, ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతి గాంచిన ఐలశు ఋషి వారు శూద్రుడు కాదా...???*


*✅ శూద్రురాలికి పుట్టిన జాబల కుమారుడైన సత్యాకాం వేద సారాలను గ్రహించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, సత్యానికి నిలువెత్తు గుర్తుగా, వినయం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారినే మెప్పించి, గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచి యజర్వేదం అందలి కొంత భాగానికి కర్తయైన సత్యాకాం, జాబల మహర్షుల వారు శూద్రుడు కాదా..???*

*✅ శూద్రురాలికి పుట్టినా కూడా వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మర్షి మాతంగి మహర్షుల వారు శూద్రుడు కాదా. ??మాతంగి మహర్షుల వారి గురుంచి శ్రీమద్ రామాయణంలోనూ, మహా భారతం అనుశాసనిక పర్వములో ప్రస్తావనలు ఉంటాయి...!*

*✅ పుట్టుకతో శూద్రురాలి కుమారుడైనా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతి గాంచిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు.ఇతడు శూద్రుడు కాదా.???*


*✅ పుట్టుకతో శూద్రుడు అయిన వత్సుడు గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషివత్స గా ప్రఖ్యాతిగాంచలేదా...? వీరు శూద్రుడు కాదా...??? Ref:-(ఆత్రేయ బ్రాహ్మణము - 2.19)*

*✅ శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి, బ్రహ్మ జ్ఞానంతో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందిన "కవష ఐలుషుడు" శూద్రుడు కాదా...???*

*✅ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడు శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మకి మాతృ ప్రేమని పంచాడు !! సాక్షాత్తు దేవుడే అన్నీ వర్ణాల యంధు జన్మించి అన్నీ వర్ణలని పావనం చేశాడు !!! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు..*


*✅ మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్న జాతివాడుగా భావించబడే పల్లెకారుడు (మత్స్యకారుడు) గుహుడికి దక్కింది. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీ రాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది..? మరి గుహుడు శూద్రుడు కాదా...???*

*✅ అద్భుతమైన వేద జ్ఞానంతో, సుమధుర గానంతో సాక్ష్యాత్ ఆ శ్రీరామచంద్రుల వారికే తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శబరి శూద్రురాలు కాదా...???*


*✅ స్వయంగా కవి పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగి విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి, తెలుగు ప్రబంధ కవి, ఆంధ్ర భోజుడిగా ప్రఖ్యాతుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు వారు శూద్రుడు కాదా...???*

*✅ అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన, ముర అనే శూద్ర మహిళకు జన్మించినా వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞత, మేధస్సు, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, శౌర్యం కలిగి, వ్యూహ నిపుణత, పట్టిన పట్టు విడువని వాడుగా అఖండ భారతాన్ని అప్రతిహతంగా పరిపాలించిన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు సామ్రాట్ చంద్రగుప్త మౌర్య శూద్రుడు కాదా...???*

*✅ మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివృత్తికి చెందినవాడు. మరి ఆయన శూద్రుడు కాదా...???*


*✅ విశ్వ కర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాయీ బ్రాహ్మణులు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వీరిలో అనేక లక్షల మంది వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి పౌరోహిత్యం చేస్తున్నారు. మరి వీరందరూ శూద్రులు కాదా...???*

*✅ వేద కాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగా మారి, తన వంటి మిగిలిన శూద్రులకు వేదపాండిత్యాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పంచి జనశృతి పౌత్రయణ జరిపిన రైక్వ ఋషి వారు శూద్రుడు కాదా...???*


*✅ కుమ్మరి వృత్తి చేసేవారి కుటుంబంలో జన్మించినా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో, భక్తితో, సుమధుర గానంతో సాక్ష్యాత్ పండురంగడినే ముగ్దుడ్ని చేసిన భక్త తుకారాం శూద్రుడు కాదా...? ఆయన ముని బహినాభాయ్ కు గురువుగా వ్యవహరించారు.*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా మారిన ఋషి నారాయణగురు వారు శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన కబీర్_దాస్ శూద్రుడు కాదా...??? కబీర్ దాస్ సూరత్ గోపాల్, జగుదాస్ వంటి జన్మతః బ్రాహ్మణులు అయిన పండితులకు గురువుగా ఉన్నారు...!*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు లక్ష్మణ్ సేన్ కు రాజగురువుగా ఎనలేని సేవలు అందించిన ఋషి ధోయి శూద్రుడు కాదా...???*

*✅ శూద్రునిగా పుట్టినా కూడా కళంగినథార్ శిష్యరికంలో వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో బంగారం తయారీపని చేసే తమిళ బోగర్ చైనా దేశం వెళ్లి హిందూ ధర్మ ప్రచారం చేశారు. మరి ఈయన శూద్రుడు కాదా...???*

*✅ మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో 63 శైవ నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "ఆదిపట్టన్" శూద్రుడు కాదా...???*

*✅ కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "అచ్యుతానంద" శూద్రుడు కాదా...???*

*✅ చర్మ కారుల వృత్తి చేసే కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ప్రఖ్యాతి చెందిన తమిళనాడు "అలగై" శూద్రుడు కాదా...???*   

*✅ కళింగ రాజ్యాన కాటికాపరి వృత్తి చేసేవారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "బలరాం దాస్" శూద్రుడు కాదా...???*     

*✅ కళింగ రాజ్యాన మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా వెలుగొందిన "భీమ దిబారా" శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ఋషి రవిదాస్ శూద్రుడు కాదా...??? ఋషి రవిదాస్ మీరాభాయ్, చిత్తోర్ ఘడ్ మహారాణి జలి, పాటికి మహారాణి మైనమతి లకు రాజగురువుగా విశేష సేవలు అందించారు...!*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ముని నామ్ దేవ్ శూద్రుడు కాదా...???*

*✅ శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చోఖ మేళ" శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన "సంత్ కణ్హోపుత్ర" శూద్రుడు కాదా...???* 

*✅ " మహారాజు కవార్ధ" రాజ గురువు వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన శూద్రుడైన "గురు బాలాక్ దాస్" ...!*

*✅ జష్పూర్ యువరాజు రాజ్ కుమార్ దిలీప్ సింగ్ రాజ గురువు శూద్రుడైన "గురు రామేశ్వర్ ప్రసాద్ గాధర".!*

*✅ సాక్ష్యాత్ ఆది శంకరాచార్యుల వారు గురువుగా స్వీకరించి, తలవంచి నమస్కారం పెట్టింది కాటికాపరి అయిన ఒక శూద్రునికి, ఆ సందర్భంలో లిఖించేదే మనిష పంచక...!*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సంత్ ఘాసిదాస్" శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన తమిళులకు ఆరాధ్యుడు అయిన, 63 శైవ నాయనార్లలో ఒకరైన "తిరు వల్లువార్" శూద్రుడు కాదా...???*


*✅ జన్మతః శుచికారునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "వఖ్న" శూద్రుడు కాదా...???*  

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గురు విఠల్ రాంజీ షిండే" శూద్రుడు కాదా...???*

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "సోయరా భాయ్"శూద్రురాలు కాదా...??*


*✅ మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెంది శివ, వైష్ణవ బేధాలను రూపుమాపిన "శోభి రామ్" శూద్రుడు కాదా...???*  


*✅ పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "పిపాల్ దాస్" ఆయన కుమారుడు "శర్వణ దాస్" శూద్రులు కాదా...???*  

*✅ పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "రామదాసు" శూద్రుడు కాదా...???*  

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "పరశురాం" శూద్రుడు కాదా...???*


*✅ పంజాబ్ లో రజక వృత్తి చేయువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "నామ్ దేవ్" శూద్రుడు కాదా...???*  

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "మోహిని దేవి" శూద్రురాలు కాదా...??*


*✅ తమిళనాట వీధులు శుభ్రం చేయు వారి కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ముని బాణన్" శూద్రుడు కాదా.?*

*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బహిరామ్ చోఖమేల" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "బాలక్ దాస్" శూద్రుడు కాదా.??*

*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బంకా మహర్" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "భాగు" శూద్రుడు కాదా.??*

*✅ ఉత్తర భారత దేశంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బీర్ భాన్" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చన్నయ్య" శూద్రుడు కాదా.??*    

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చిక్కయ్య" శూద్రుడు కాదా.??*  


*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చొఖ మేల" శూద్రుడు కాదా.??*   

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "దామాజీ పంత్"శూద్రుడు కాదా.??* 

   

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "దేవి దాస్"శూద్రుడు కాదా.??*    


*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ధాన్నా"శూద్రుడు కాదా.??* 

   

*✅ మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ఘసి దాస్"శూద్రుడు కాదా.??*   

 

*✅ ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "గోపాలానంద్ మహరాజ్ " శూద్రుడు కాదా.?? ఈయన ఆర్య సమాజ్ లో కీలక సభ్యునిగా సేవలు అందిస్తూ బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేయబడ్డ అనేక వందల మంది హిందువులను ఘర్ వాపసీ చేసి, హిందూధర్మంలోకి తీసుకువచ్చారు... ఈయన అనేక భక్తి పాటలు, పద్యాలు రాసి, గానం చేశారు...!*


*✅ ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలో పుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సాధు జీతౌ జీత్ బహదూర్" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "కరమమేలం" శూద్రుడు కాదా.??*

*✅ జన్మతః శూద్రులుగా జన్మించినా కూడా వేద జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని సముపార్జించి ఋషులుగా, మునులుగా ప్రఖ్యాతి చెందిన...-👇*


🔯 సమ్ఖ్యాక (శుచికార వృత్తి) 

🔯 అగస్త్య (వేట వృత్తి)

🔯 దుర్వాస (cobbler)

🔯 దాధిచి (lock smith)

🔯 కశ్యప (blacksmith)

🔯 రామాజా (copper smith)

🔯 కౌండిల్య (barber)

🔯 గోరా (గ్రామీణ పౌరోహిత్యుడు)

🔯 చోఖా (గోసంరక్షకుడు)

🔯 సావత (గ్రాసం తొలగించు వృత్తి)

🔯 కబీర్ (Weaver garments)

🔯 రోహిదాస్ (Colored hide )

🔯 సజనా (మాంస అమ్మకం)

🔯 నరహరి (Melted gold)

🔯 జనాభాయ్ (గో వ్యర్ధల సేకరణ వృత్తి)..


*✅ మరి వీరందరూ వేదాలు నేర్చుకుని ఋషివర్యులుగా,మునులుగా ఖ్యాతి గడించిన వారు. వీరు శూద్రులు కాదా...???*


*✅ ఇలా చెప్పుకుంటే పోతే అనేక లక్షల మంది శూద్ర హిందువులు వేదాలు చదివి, బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందారు, పొందుతూ హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తున్నారు...!*

*🔹 వేదాలలో కూడా ఇదే చెప్పారు.*


జన్మనా జాయతే శూద్రః

కర్మణా జాయతే ద్విజః

వేద జ్ఞానేషు విప్రాణాం

బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః


*🔹 (ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు)*


*✅ అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం). వేదం నేర్చిన వారే విప్రులు, బ్రహ్మ జ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా "వేద విధులతో సంచరించక, దేవతలను పూజించక, వివేకములు లేక, కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.*


"జన్మనా జాయతే శూద్రః,

సంస్కారాద్ది్విజ ఉచ్యతే!

వేదపాఠీ భవేద్వ్దిప్రః,

బ్రహ్మ జానాతి బ్రాహ్మణః!!


*✅ ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్ద విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు. ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.*


వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః

శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం

క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"

(ఇది మను ధర్మ శాస్త్రం 10-65 మంత్రం.)

*✅ భావం : బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రహ్మణుడే యగును. శూద్ర గుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదే విధంగా క్షత్రియ జాతి, వైశ్య జాతి కూడా కేవలం గుణ, కర్మాచరణల వలననే యేర్పడును.*


అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషమ్I

షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రంశత్ క్షత్రియస్యచII

భ్రాహ్మణస్య చతుః షష్ఠిః వూర్ణం వా అపి శతం భవేత్I

ద్విగుణావా చతుః షష్ఠిః తద్ధోషగుణః విద్ధి సఃII


*♦️ దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8 రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. శిక్షల విషయంలో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన మీరు గ్రహించగలరనుకుంటాను.!*

*🔹 ఇక హిందూ ధర్మంలో వేదాలు, శాస్త్రాలు అభ్యసించి బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందుతున్న శూద్ర హిందువుల గురుంచి రెండవభాగంలో సవివరంగా తెలియ జేస్తాను.*


- *✍️ Rajender (RK), Sarpanch Velmakanna- 9849390054 ✍️*

16, మార్చి 2022, బుధవారం

పడవ యుండవలసిందే

 శ్లోకం:☝️

*నావార్ధీ హి భవేత్తావత్*

    *యావత్పారం న గచ్ఛతి |*

*ఉత్తీర్ణే తు సరిత్పారే*

    *నావయా కిం ప్రయోజనమ్ ||*


భావం: ఎంతవరకు నది ఆవల చేరదో, అంతవరకు నదిని దాటుటకై పడవ యుండవలసిందే. ఏరు దాటిన మీద ఆ నావ ఉపయోగం లేదు.