22, జనవరి 2024, సోమవారం

శ్రీ రామ ప్రతిష్ఠా మహోత్సవo

 శ్రీ రామ ప్రతిష్ఠా మహోత్సవ శుభాకాంక్షలు, శుభోదయం.

🌷🙏🌷🙏🌷🙏🌷🙏

ఉత్పలమాల

చేతనమొందె నీ ధరణి శ్రీ రఘు వీరుని గాంచు వేడ్క, వి

న్నూతన దీప్తి పొందుచు ననూహ్యపు రీతిని నేడు నింగిలో

జ్యోతిపథంబు నంతటను శోభల జిమ్మెను రామ నామమే,

జాతి చరిత్ర యందు నిది స్వర్ణయుగంబుకు శోభ కృత్ గదా.🙏🙏


🙏🌷🙏🌷


ఉత్పలమాల

రామ రసాయనంబు భవ లాలస మాపెడు సాధనంబిదే,

నామము జీవితంబుకు పునాదిగ జేసుకు సాగుడందరున్,

నీమము లేదు, కావలెను నీరజ నేత్రుని ధ్యానమే హృదిన్,

సేమము నిచ్చు నెల్లరకు శ్రేయము తారక నామమే సదా.🙏🙏


🙏🌷🙏🌷


ఉత్పలమాల

మానవ జీవితంబునకు మార్గము జూపెను రామ చంద్రుడే,

పూనిక తోడ సత్యమును భూషగ దాల్చెను ధర్మ శస్త్రుడై,

కానల కేగె లోకమును కావగ సాధుల, వ్రేయ దుష్టులన్,

మానవ జాతి కంతకు ప్రమాణము జూపెను లోక పూజ్యుడై,

తాను నృపాలుడై నిలిపె ధారుణి యంతయు రామ రాజ్యమే.🙏🙏


🙏🌷🙏🌷


చంపకమాల

జగదభి రాము సాటి సరి శాసకుడెందును లేడు నేటికిన్,

నగధరు డొచ్చె ధాత్రి కరుణాంబుధి శ్రీరఘు రాము రూపమై,

జగమున నిన్ని కావ్యముల శాశ్వత మైనది రామ గాథయే,

యుగములు దాటి పోయినను యుర్విని యున్నది రామ నామమే.🙏🙏


🙏🌷🙏🌷

శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 🙏🙏🙏

శ్రీ రామ జయ రామ జయ జయ రామ   🙏🙏🙏  

శ్రీ రామ జయం     🙏🙏🙏

🙏🌷🙏🌷

అవధూతల దర్శనం..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అవధూతల దర్శనం..*


నెల్లూరు నుంచి శ్రీ చంద్రశేఖర్ గారు అదే మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుని..మందిరం లోని ప్రధాన మంటపం చుట్టూరా ప్రదక్షిణం చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకొని..కొద్దిసేపు మంటపంలో కూర్చున్నారు..చంద్రశేఖర్ గారి మనసులో ఒక కోరిక కలిగింది..అడగాలా?..వద్దా?..అనే సందేహం లో కొంచెం సేపు మథనపడి.. చివరకు..


"ప్రసాద్ గారూ..మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?.."అన్నారు..


"మందిరానికి సంబంధించినది ఏదైనా సరే..నిరభ్యంతరంగా అడగండి.." అన్నాను..


"శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొచ్చి..ఇక్కడ..ఈ మందిరం వద్ద ఒక ప్రక్కన పెట్టాలని కోరిక కలిగిందండీ..మీరు అనుమతి ఇస్తే..శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తాను.." అన్నారు..


"ఎటువంటి ఇబ్బందీ లేదు..మీరు చూస్తున్నారు కదా..నైరుతి మూలలో శ్రీ సాయిబాబా మందిరం ఉన్నది..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన తరువాత..శ్రీ సాయిబాబా ను కూడా దర్శించుకుంటున్నారు..అలాగే శ్రీ వెంకయ్య స్వామి వారి పటం వుంటే..ఆ స్వామికి నమస్కరించుకుంటారు..గొలగమూడి లో ఉన్న వెంకయ్య స్వామి వారిని కూడా అవధూత పరంపర లోనే పరిగణిస్తున్నారు కదా..నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదండీ.." అన్నాను..


చంద్రశేఖర్ గారు ఎంతో సంతోషం తో .."ఈసారి వచ్చేటప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తానండీ..ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.." అని చెప్పి..నెల్లూరు వెళ్లిపోయారు..


రెండు నెలలు గడిచాయి..ఒకరోజు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రం ఒక్కటే కాకుండా..ఇతర అవధూతల చిత్రాలు కూడా తీసుకురావాలని నాకు స్వప్నంలో ఆదేశం వచ్చిందండీ..శ్రీ దత్తాత్రేయస్వామి వారి గర్భ గుడి వెలుపల గోడ మీద నాలుగు వైపులా కొలతలు తీసుకొని..అందుకు తగ్గట్టుగా అవధూతల పటాలు చేయించి..తీసుకొస్తాను..రేపుదయం వస్తున్నాను..నాతో పాటు నెల్లూరు లోని సత్యం స్థూడియో యజమాని గారు కూడా వస్తున్నారు.." అన్నారు..తీరా చూస్తే..ఆ సత్యం గారు మాకు దూరపు బంధువు..దత్త భక్తుడూ..


అనుకున్న విధంగానే ప్రక్కరోజు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రధాన మంటపం చుట్టూరా కొలతలు తీసుకొని వెళ్లిపోయారు..మళ్లీ రెండు నెలల పాటు ఎటువంటి కబురూ లేదు..


ఆ తరువాత ఒక ఆదివారం నాడు..

శ్రీ దత్తాత్రేయ (త్రిమూర్తి స్వరూపుడు)

శ్రీ పాద శ్రీ వల్లభులు..

శ్రీ నృసింహ సరస్వతి..

శ్రీ స్వామీ సమర్ధ..

శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్

శ్రీ సాయిబాబా..

శ్రీ వెంకయ్య స్వామి..


వీటన్నింటి తో పాటు..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు..


మొత్తం ఎనిమిది చిత్రపటాలు.. పెద్ద సైజువి తీసుకొని వచ్చి..మంటపం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం అమర్చారు..


"చిత్రమేమిటంటే..అందరు అవధూతల చిత్రపటాలు తయారయ్యేదాకా..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రపటం పూర్తి కాకపోవడం..అందరి తో కలిసే శ్రీ వెంకయ్య స్వామి వారు మొగలిచెర్ల స్వామివారి దగ్గరకు రావడం.."


మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు..పై అవధూతలందరి దర్శనము అవుతుంది..


ఒక్క వెంకయ్య స్వామి వారి పటాన్ని మాత్రం పెట్టుకోవడానికి అనుమతి కోరిన చంద్రశేఖర్ గారు..శ్రీ స్వామివారి ఆదేశం తో అందరు అవధూతల చిత్రపటాలూ తీసుకొచ్చారు..తనకూ ఇతర అవధూతలకూ బేధమే లేదని శ్రీ స్వామివారు పరోక్షంగా సూచించారు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

21, జనవరి 2024, ఆదివారం

Led


 

Panchanag


 

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*తృతీయ స్కంధము*


*శ్రీమహిత వినుత దివిజస్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు స్థేమ! వినిర్జితభార్గవ రామ! దశాననవిరామ! రఘుకులరామా!*


వాక్కుల సంపదలతో దేవతలు గుంపులు గుంపులుగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ కీర్తి చిట్టచివరి అంచులకు చేరినట్టిది. రాజులందరూ తారలు అనుకొంటే నీవు వారిలో చంద్రుడవు బంగారుకొండవలె సుస్థిరంగా నిలువగలవాడవు. ఇరవైయొక్క పర్యాయాలు రాజులనందరినీ ఊచకోతకోసిన పరశురాముడు నీచేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. పదితలల పెద్దరక్కసుడు రావణుడు నీతో పోరాడి ఘోరమైన చావు చచ్చాడు. స్వామీ! రఘువంశం నీవలన గొప్పమహిమను, అందచందాలనూ పొందింది. స్వామీ! అట్టి నీవు నాకవిత్వాన్ని ఆలకించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి, స్వామీ!


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

Train break


 

Finger attachment


 

విశ్వకవి వేమన జయంతి*

 *విశ్వకవి వేమన జయంతి* సందర్భంగా శుభాకాంక్షలు.                                *వేమన పౌండేషన్ ..‌* అనంతపురము కేంద్రంగా వేమన విషయంగా  కృషి చేస్తూ వస్తుంది.అనేక కార్యక్రమాలు చేపట్టింది. మా ముందు మరింత బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో వేమన పౌండేషన్ కు మీవంతు సహకారం కోరుతున్నాం.                                          

                  @@@

      - వేమన పౌండేషన్ కార్యక్రమాల కోసం మీకు తోచిన సహాయసహకారాలు అందిచడం.                

      - వేమన పౌండేషన్ లో సభ్యులుగా చేరి భాగస్వామ్యులవడం. ఆయా ప్రాంతాలలో బాధ్యతలు తీసుకోవడం.  

      - వేమన 10 పుస్తకాలను 750 రుపాయలకు తీసుకొని పాఠశాలలకు, గ్రంథాలయాలకు ఇవ్వడం. 

     - ప్రతి సంవత్సరం మాకు వచ్చే ప్రతి  విరాళాలు, వ్యయాలను సభ్యుల ముందుంచుతాం.

    ....ధన్యవాదాలతో.....  

            వివరాలకు...

      @ *వేమన పౌండేషన్,*  

  అనంతపురము, 9963917187

జనవరి 22న సెలవు

 💐 *జనవరి 22న సెలవు ప్రకటించాల్సిందే👍* 

💐 *హిందువులుగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు  అయోధ్య రామయ్య పండుగకు సెలవు అడగలేకపోవడమేమిటి* 


 💐 అయోధ్య రామయ్య తన ఇంటికి చేరుకుంటున్న శుభవేళ 👍

💐500 సంవత్సరాల నాటి నూరుకోట్ల  హిందువులకల నెరవేరిన శుభవేళ

 💐

 ఇది సగటు హిందూ ఉద్యోగి సంవేదన

💐  చిన్న విషయానికి కలెక్టరేట్ల ముట్టడి మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించే ఉద్యోగ సంఘాలనాయకులు నోర్లు  ఎందుకు మూగబోయాయి..

💐 *కమ్యూనిస్టులకు హిందువుల పండుగలు అక్కర్లేదా.* 

💐 సాక్షాత్తు అయోధ్య రామయ్య పండుగనే వ్యతిరేకించడమేమిటి.

💐 *ప్రతి హిందువు ఉద్యోగి ఎందుకు ఈ సమయంలో మౌనంగా ఉన్నారు.* 

💐 ప్రతి విషయానికి సింహాల్లాగా గర్జించే ఈ ఉద్యోగ సంఘాల నాయకులకు ఇప్పుడు ఏమైంది.

💐ఎవరికి భయపడుతున్నారు...

💐 అన్ని రకాల ఉద్యోగ సంఘాలు నాయకులు కమ్యూనిస్టులలో ఇరుక్కొని పోవడమే కదా.

💐 *ఇంతగా హిందుత్వాన్ని వ్యతిరేకించే సంఘాల్లో మనం కొనసాగడం అవసరమా.* 

💐 హిందువుల పై ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే  మీ జిల్లాస్థాయి, మీ రాష్ట్రస్థాయిలో ఉండే నాయకులతో మాట్లాడి సెలవులిమ్మని డిమాండ్ చేయండి పేపర్ ప్రకటనలు ఇవ్వండి ఎందుకు మౌనంగా ఉంటారు.

💐 *కమ్యూనిస్టులు స్వాతంత్రం రాక ముందు నుండి హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.* 

 💐పేరుకు సీతారాం ఏచూరి.

 ఈయన పేరులో  సీతమ్మ, రామయ్య ఇద్దరు ఉన్నారు

💐 కానీ తను అయోధ్య రామయ్య కార్యక్రమానికి రానే రాను,అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కరాకండిగా చెప్పి ఉన్నారు.

💐 *కాబట్టి కమ్యూనిస్టుల గొడుగు కింద ఉన్నన్నాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు.* 

💐 అందులో భాగమే ఈరోజు జనవరి 22న సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి అయోధ్య రామ మందిరం లోనికి వెళుతున్న శుభవేళ హిందువులుగా ఉండి సెలవు అడగలేని దుస్థితి.

 💐వాస్తవాలు వినేటప్పుడు కొంతమందికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.కానీ ధర్మం వైపు అడుగు వేయాలని విన్నపం 🙏

💐 ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే అయోధ్య బాల రాముడు తన ఇంటికి చేరుకుంటున్న శుభవేళ ఇది మనందరికీ పెద్ద పండుగ. కాబట్టి దీన్ని సాధించే వరకు మనం అందరం ఉద్యమించాలి ఎటువంటి సంఘాలతో సంబంధం లేదు👍 ఒక హిందువుగా ఆలోచించి ఉద్యమించి నెరవేర్చుకుందాం  👍

💐 ఈ స్టేట్మెంట్ లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి.

ధర్మం అని అనిపిస్తే ధర్మం వైపు ప్రయాణించండి.జైశ్రీరామ్ 👍🙏

విశ్వనాథ సీత*

 శు భో ద యం 🙏


*విశ్వనాథ సీత*


కల్పవృక్షంలో విశ్వనాథ వర్ణించిన అశోక వనంలో సీత సీతారామాద్వైతానికి ప్రతీక! 


*అశోక వనంలో సీత*!! 

             

                  

కల్పన అంటే ఊహ. ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్కోణం. మనందరికీ తెలిసున్న విషయాల గురించి మనకి తెలీని ఒక కొత్త అంశాన్ని ఆవిష్కరించ గలగడమే కల్పనా చాతుర్యం. ఉదాహరణకి అశోకవనంలో సీతాదేవిని వర్ణించే యీ పద్యం చూడండి :


ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా

పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే

హాకృతి, సర్వ దేహమున యందును రాఘవవంశమౌళి ధ

ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై


సీతాదేవి ఎలా ఉందీ అంటే, ఆమె ఆకారం రామచంద్రుని విరహానికి రూపంలా ఉందట. కనుబొమలేమో రాముని విల్లులా ఉన్నాయి. రాముని కరుణ కన్నులలో మూర్తికట్టింది. జడేమో రాముని శరీరకాంతితో మెఱుస్తోంది.


రామాయణ కల్పవృక్షం

సీతాదేవి శరీరమంతా కూడా రఘువంశ చంద్రుడైన రాముని ధర్మం రూపుకట్టినట్టుగా ఉంది. ఆ కూర్చున్న విధానమేమో రాముని ప్రతిజ్ఞ మూర్తీభవించినట్టుగా ఉందట! ఎంత ఉదాత్తమైన ఊహ యిది! అంత ఎడబాటులో కూడా ఎప్పుడూ ఆ సీతారాములు కలిసే ఉన్నారన్న ఆలోచన గొప్పది. కనుబొమలని ధనుస్సుతో పోల్చడం మామూలే. అలాగే కురుల సౌందర్యాన్ని చెప్పడానికి వాటి నల్లని నిగనిగలు వర్ణించడమూ సామాన్యమే. కాని వాటిని సీత విషయంలో రాముని విల్లుగా, రాముని శరీర కాంతిగా అభివర్ణించడం అసామాన్యం. బాహ్య రూపంతో మొదలుపెట్టి, చివరికి ఆమె శరీరమంతా రాముని ధర్మానికి ప్రతిరూపంలా ఉందనడం, ఆమె కూర్చున్న తీరులో రాముని ప్రతిజ్ఞ కనిపిస్తోందనడం సాధారణ కవులు చెయ్యలేని ఊహ. ఇది సీతారాముల అద్వైతాన్ని నిరూపించే పద్యం. కల్పవృక్షం నిండా ఇలాంటి ఊహలే. అవి ఎంత విచిత్రంగా ఉంటాయో అంత సముచితంగా ఉంటాయి. అంత ఉదాత్తంగా ఉంటాయి.