10, ఆగస్టు 2024, శనివారం

దేవాలయాలు - పూజలు 6*.

 *దేవాలయాలు - పూజలు 6*.


సభ్యులకు నమస్కారములు.


భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన కర్తగా ఉండుటనే దీక్షగా పొందిన వారు, భావించిన వారు మాత్రమే అర్చకులు. అర్చకుల సంస్కారము దైవ కార్యముల యందు శ్రద్ధ, నిమగ్నత, విశిష్టత వలన భగవంతుడు అర్చకులకు సన్నిహితుడవుతాడు. అర్చక వ్యవస్థలో గూడా రెండు విధానాలు.

 1) అనువంశిక అర్చకులు 

2) వేతన అర్చకులు.


దేవాలయాలు ప్రజలందరికీ చెందిన కేంద్రీకృతమైన వ్యవస్థ కాబట్టి దేవాలయాలలో దైవ సంబంధిత విషయాలే గాకుండా లౌకిక వ్యవహారాలు గూడా ఉండుట పరిపాటి. దైవ సంబంధమైన కార్యక్రమాలు అర్చకులు నిర్వర్తించాలి, లౌకిక సంబంధమైన వ్యవహారాలపై ధర్మ కర్తలు, పాలక మండలి అజమాయిషీ ఉంటుంది, ఇది సాధారణ కట్టుబాటు. 


గర్భాలయములోనికి, సాధారణ పరిస్థితులలో అర్చక స్వాములకు తప్ప ఇతరులు  అనగా...ధర్మకర్తలు, పాలక మండలి సభ్యులు, సామాజిక పెద్దలు  మరియు ప్రభుత్వ అధికారులు ప్రవేశించరాదు. అర్చక కుటుంబాలు తయారు చేసిన వంటకాలు తప్ప ఇతరుల వంటకాలను భగవంతునికి ఆరగింపుగా(నైవేద్యం )ఉంచరాదు. భక్తుల వంటకాలను  భగవత్ ఆరగింపుకు అనుమతించ రాదు. *ధర్మ స్మూక్షము ప్రకారము గడప దాటిన వంటకాలు భగవత్ నివేదనకు పనికి రావు*. 


*గర్భ గుడిలోనికి అన్యులు ప్రవేశించుట, అన్య వంటకాలు భగవంతునికి సమర్పించుట దోష భూయిష్టమే గాక దేవాలయ ప్రాభవము తగ్గుతుంది*.  వేయేల,  అర్చక స్వాములు తమ గుణ గణములు, పూజాదికాలలో చూపే శ్రద్ధ వలన మాత్రమే గర్భ గుడిలో ఉన్న  భగవన్ మూర్తి, శిల లేదా ప్రతిమ దైవత్వానికి శక్తి సమకూరుస్తాడు. *దేవాలయ మరియు పూజా నిర్వహణలు ఆషామాషి వ్యవహారము కాదు*.


*మాన్యులు విజ్ఞప్తి*

*దేవాలయాలు - పూజలు* అను విషయంపై ధారా వాహిక రచనా వ్యాసంగం బహు సున్నితమే గాక బహు విస్తృతము, క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు...ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.


ధన్యవాదములు.

*(సశేషము)*!*

ఆత్మ స్వయం...ప్రకాశమానము !*

 *ఆత్మ స్వయం...ప్రకాశమానము !*


*ఆత్మ స్వయం ప్రకాశమానము. దానిని మనకు తోచినట్లు భావించకూడదు. ఆత్మను వేరే విధంగా భావించడమే బంధము. ఆత్మకు చీకటి వెలుగులు వుండవు. కేవలము తేజోమయమై వుంటుంది అనే ఆ భావనే బంధాలను తొలగిస్తుంది. ఆత్మ తనకుతానే అఖండ ప్రకాశమై భాసిస్తూ వుంటుంది. అలాంటి ఆత్మానుసంధానమైన దేహము, భక్తి రూపధ్యానముచే పరిపక్వమై 'సమాధి' అనబడే నిరతిశయానంద మోక్షగతి చేకూరుస్తుంది.*


*మహాత్ములు' స్వానుభవ సంధానశక్తి వలననే మోక్షము పొందడం సాధ్యము' అని చెప్పారు. అలాకాకుండా, నేను అనే తద్బోధ నాశనము కానంతవరకు, మాయావృక్షము నీడలోనే సాధకుడు వుంటున్నాడు. ఒకసారి తద్బోధ తొలగగానే, మాయావృక్షము వేరుతెగిన వృక్షమువలె నశించును.* 

ఏ మార్గమును అనగా భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గములలో దేనిని అభ్యసించినను, అహంకారము నాశనము చేసుకునే సులభమైన మార్గమును ఎంచుకోవాలి.*


*'దేహమునే నేను అనుకోవడం' పంచకోశ మాత్రమైన మూడు దేహములను ఉద్దేశించి చెప్పినట్లు అవుతుంది. ఆ ఒక్కభావము తొలగిపోతే, మిగిలిన దేహభావనలు తమంతతామే తొలగిపోతాయి. అందువలన, నేను అనే తలంపుతో పరమేశ్వరునికి

*ఆత్మతో అనుసంధానము చేసి, నిశ్చలంగా వుండడమే, శ్రేష్టమైన సాధన. ఇదే వేదాంతము చేప్పే ఆఖరి సిద్ధాంతం.*


*02. మనస్సు*

*మన హిందూ శాస్త్రములు చెప్పే విధానం ప్రకారం, మనము భుజించే ఆహారమే, సూక్ష్మరూపంలో ఘనీభవించి, రాగ ద్వేష కామ క్రోధాలచే వృద్ధిచెంది, మనస్సు బుద్ధి చిత్తము, అహంకారము అనే అంత:కరణ సముదాయముగా యేర్పడి, మనస్సు అనే ఏకవచన నామముతో గ్రహించబడుతుంది. ఏ విషయమైనా చెయ్యాలని అనిపించడం, చేసే విధంగా నిశ్చయించు కోవడం, మొదలైన ధర్మాలు మనస్సుకే చెప్పబడతాయి.*ఆదిత్యయోగీ*


*ఒక పదార్ధము తిన తగినదేనా అని భావన చేయడం మనోరూప సంకల్పవృత్తి. అది మంచిదే అని భుజింప దగినదే అని భావించుట బుద్ధిరూప నిశ్చయవృత్తి. అలాగే, ఈ మనస్సే సర్వ తత్మాత్మక జీవేశ్వర జగద్రూపమై వుండడం చేత, ఎప్పుడైతే ఆ మనస్సు అసలైన జ్ఞానమును సంపాదించి, ఆత్మాకారమును చెందుతుందో, అప్పుడే సమస్తము బ్రహ్మమే అనే కైవల్య ప్రాప్తి కలుగుతుంది..*

.

ఇంద్రియ నిగ్రహం.ఆధ్యాత్మిక ప్రస్థానం


                  కర్మ

                         

      

           "ఇంద్రియాలని నిగ్రహించాలి" అని అనుకున్నప్పుడే. అసలు అవి మన అదుపు లో ఉండటం లేదు అనే విషయం అవగాహనకు వస్తుంది..


    ఒక "మాట " మాట్లాడిన తరువాత " నా వాక్కు అదుపు లో ఉంటే ఎంత బాగుండేదిఅనుకుంటాము...


      ముఖ్యంగా నింద విమర్శ హేళన గా ఎదుటి వారు మాట్లాడిమెప్పుడు మన మనస్సు ఎంతో గాయ పడుతుంది. అదే పని మనం చేసినప్పుడు .ఎందుకు ఈ విషయం జ్ఞాపకం రాదో. 


      బహుశా చాలా తెలివిగా ఇంకొళ్ళ తప్పులు చెప్పామని అనుకుంటాము. ఇది ఎంత దుష్కర్మ అవుతుందో, 


      అది ఒకనాడు మన కి తిరిగి రాబోతోందని .గ్రహించము. కర్మ ఫలం చాలా విశేషం గా మనపై పని చేసి, ఇలా వాక్కు దుర్వినియోగం చేయడం మహా పాపం అనే విషయాన్ని మన జీవాత్మకి నేర్పుతుంది.


     అలాగే రుచి కోసం ఆకాలం లో మధుర పదార్ధాల ని తినడంమానవుడి లక్షణం..అయిదుఇంద్రియాలు 

ఇలాగే నిత్యం ఒక సుఖాన్ని భోగాన్ని కోరుతూ ఉంటాయి..

       


      ఆధ్యాత్మిక ప్రస్థానం లో వేగం గా ప్రయాణించాలని తపించే వారు ముందు ఈ విషయాన్ని గమనించి వీటిని నిగ్రహించాలి.

ఇలా కాక పోతే, వారు సాధించిన తపశ్శక్తి కానీ ఇంద్రియాలపై పొందిన కొద్దీ పట్టు సడలి పోతుంది.


     .ప్రతి ఒక్కరి లోను ఎంతో శక్తి 

దాగి ఉందనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి..మనం కేవలం డబ్బు అనవసరం గా ఖర్చు కాకూడదని మాత్రమే అనుకుంటాము.ఆదిత్యయోగీ.


   వాస్తవానికి లౌకికమైన ధనం కన్నా జన్మ జన్మ లకి వెంట వచ్చే ఈ తపోధనం ఇంకా ఎన్నో రెట్లు గొప్పది .

          

    యోగాభ్యాసం చేసే వారు ఈ విషయం ఎప్పుడు మరిచి పోరు..

           


        బ్రహ్మ నారదుడికి శ్రీ మహావిష్ణువు

అవతారాల గురించి వివరిస్తూ. నర నారాయణుల అవతారం .వారి తపశ్శక్తి మహిమ , వారి నిగ్రహాన్ని ప్రస్తుతించాడని

పరీక్షిత్తుకు శుక మహర్షి ఇలా బోధించాడు.


       " ధర్మానికి రూపమైన ధర్ముడికి, దక్షుడి

కుమార్తె అయిన మూర్తి యందు. నర నారాయణులు. జన్మించారు..


 "అనఘులు బదరీ వనమున, వినుత తపోవృత్తి నుండ, విబుదాధిపుడున్

మనమున నిజ పద హానికి , ఘనముగ 

జింతించి దివిజ కాంతామణులన్ "

        

      ఆ పరమ పావనులైన ఋషులు బదరికా వనానికి వెళ్లి నిశ్చల తపస్సు లో నిమగ్నమయ్యారు. వారి తపస్సు ఫలిస్తే తన పదవికి ఎక్కడ ముప్పు కలుగుతుందో అని ఇంద్రుడు మనస్సు లో ఎంతో చింతించి, తన అప్సరస లందరినీ పిలిపించాడు...


    నర నారాయణుల తపస్సుకి విఘ్నం కలిగించమని చెప్పి పంపాడు..వారు. మన్మధ సేన లా మహోత్సాహం తో. బదరికా వనానికి చేరుకున్నారు.

      

" నర నారాయణులున్న చోటికి మరున్నారీ సమూహంబు భా


స్వర లీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారగా ..


పరిహసోక్తుల నాట పాటల చరింపం జూచి నిశ్చింతతన్ 


భరిత ధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.."


     ఆ అప్సరసలు ఆతపోప్రాంగణానికి 

సవిలాసంగా దిగివచ్చారు.సౌందర్యాల తీరు ,కళా నైపుణ్యాల సౌరూ అద్భుతం గా ప్రకాశించేటట్లు , పరిహాసాలతో ఆటలాడుతూ , పాటలు పాడుతూ అక్కడ విహరించారు..


     ఆ అప్సరసలని నర నారాయణులు గమనించారు..కానీ ఏ మాత్రం చలించ లేదు.కామానికి లోను 

కాలేదు. నిశ్చింతులై, నిర్మొహులై ధ్యానం లో మహా తపస్సు లో లీనమై పోయారు.


" క్రోధము తమ తపములకు , బాధక మగు టేరిగి దివిజ భామ ల పై న

మేధాత్మకు లొ క యింతయు , క్రోధము దేరై రి సత్త్వ గుణ యుతు లగుటన్ "


         క్రోధం తమ తపస్సులకి లోపం కలిగిస్తుందని, తపశ్శక్తిని క్షీణింప చేస్తుందనే సత్యం తెలిసిన ఆ సత్త్వ సంపన్నులు, బుద్ధిమంతులు మహర్షులు అయిన నరనారాయణులు ఆ అప్సరస లపై క్రోధం చూప లేదు.ఆదిత్యయోగీ.


" నారాయణుడ ప్పుడు దన యూరువు 

వెస జీర , నందు నుద యించెను బెం

పారంగ నూర్వశీ ముఖ , నారీ జన కోటి దివిజ నారులు మెచ్చన్ "


         అప్పుడు నారాయణుడు వెంటనే తన యూరు ( తొడ) భాగాన్ని చీరాడు. అతని తొడ లోనుండి అమర కాంతలు మెచ్చేటట్లు ఊర్వశి మొదలైన అప్సరః స్త్రీ గణం ఉద్భవించింది...

      

    నారాయణుడి ఊరువు లో నుండి

జన్మించింది కాబట్టి ఆమె " ఊర్వశి అనే 

పేరు తో కీర్తి పొందింది..ఇంద్రుడు పంపగా వచ్చిన దేవతా స్త్రీలు , ఈ ఊర్వశి. ఆమె తో పాటు జనించిన ఇతర సౌందర్య రాసులైన స్త్రీ ల హావ భావాలు , వినోద విహారాలు చూసి సిగ్గు తో తల దించుకున్నారు. 

       

    నర నారాయణులు కామాన్నీ గెలిచారు. క్రోధాన్నీ జయించారు...

ఆధ్యాత్మిక ప్రస్థానం లో మనకు ఇవి మహోన్నత మార్గ దర్శకాలు...

.

1...మనిషికి గొప్ప సంపద జ్ఞానం ( మంచితనం )

 2...గొప్ప ఆయుధం ఓపిక

3...గొప్ప రక్షణ నిజాయితీ

4...మంచి ఔషధం చిరునవ్వు

    


1... మనిషి గొప్ప సంపద జ్ఞానం ... ఇదైతే నిజమే నేను నమ్ముతాను .... డబ్బు ఇప్పుడు ఉంటుందో రేపు వెళ్ళిపోతుంది మన దగ్గర ఉంటుందని కచ్చితంగా చెప్పలేం.... అది జ్ఞానం అయితే మనం పెంచుకునే కొద్ది పెరుగుతుంది కాబట్టి అది సంపదలాగా పెరుగుతూనే ఉంటుంది


2... గొప్ప ఆయుధం ఓపిక...ఇది నూటికి నూరుపాలు నిజం... ఓపికతో ఏదైనా సాధించవచ్చు అని నేను కూడా నమ్మాను... కానీ ఆ ఓపిక కూడా ఒకసారి మనకి విరక్తిగా అనిపిస్తుంది... మనం అనుకున్నది జరగకపోతే ఓపిక అనేది నశిస్తాది అలాంటప్పుడు కొంచెం సహనం కూడా తోడైతే అప్పుడు ఓపిక ఆయుధంగా పనిచేస్తది


3...గొప్ప రక్షణ నిజాయితీ...yes ఇది నూటికి 100% నిజం.. ఎందుకంటే పేరులోనే ఉంది గొప్ప రక్షణ నిజాయితీ.... ఈ పనిలో అయినా నిజాయితీగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నిజాయితీ ఒక బలం ఇస్తుంది మనుషులు ఏదైనా సాధించవచ్చు....


4...మంచి ఔషధం చిరునవ్వు.... ఎంత కష్టమొచ్చిన చిరునవ్వుతో స్వీకరించాలి అంటారు... ఇది చాలా కష్టం నాకు తెలిసి... కష్టం వచ్చినప్పుడు చిరునవ్వు నవ్వడమే మరచిపోతారు...ఎందుకంటే మనసులో నుండి చిరునవ్వు బయటకు రావాలి అప్పుడే ఔషధంగా పనిచేస్తుంది చిరునవ్వు..*

.

9, ఆగస్టు 2024, శుక్రవారం

Panchaag


 

నవ విధ భక్తి మార్గాల్లో

 ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. 

"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య

"నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు

 ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది. 

"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. 

బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు.భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. 

"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు.అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. 

నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది. 

అప్పుడు బండోడు అన్నాడు, ".గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.. అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పదిరోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు. 

భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది ! 


*నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి.విన్నా చాలు!

మహిళల పండుగ నెల

 https://youtu.be/OeLhIhKJVss?si=SpM9h3ufYr6G1C9r

శ్రీభారత్ వీక్షకులకు శ్రావణమాస శుభాకాంక్షలు 🌹 శ్రావణ మాసం అంటేనే మహిళల పండుగ నెల. నోములు, వ్రతాలు, పూజలు, తాంబూలాలు, వాయినాలు.. సందడే సందడి. కార్తీక మాసంలో ఆలయాల్లో సందడి ఎక్కువైతే, శ్రావణంలో ఇళ్లలో కూడా సందడి కనిపిస్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లలో ఈ సందడి కనిపించడం మంచి పరిణామం అంటున్నారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. మన సంస్కృతి మన తర్వాత తరాలకు అందాలంటే మనం మన ఆచార వ్యవహారాలు మరువకూడదంటున్నారు నీరజ గారు. నిజమే కదా! అందరం పాటిద్దాం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

మూగబోయింది

 *👉🏾ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య ?!అని అడిగాడు.* 

 *అప్పుడు  పాలు..........* 


 *ఈశ్వరా !!* 

 *నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట.* 


 *అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి...* 


 *ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు.* 

 *పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు.,* 

పెరుగుని చిలికి చల్ల ని చేస్తే* *పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు.* 

 *అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో  నెలలు తరబడి బ్రతుకుతావు.* 

 *ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..*


 *ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా ?! లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు..* 


 *దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం  అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది... అలా ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో ప్రగతి పథంలో పయనించాలి..అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది...


 * ☘️☘️

భోజనమునకు ఉపయోగించదగిన

 భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు - 


 * బంగారు పాత్ర యందు భోజనము మంగళప్రదమైనది . జఠరాగ్ని వృద్ది చెందును .వీర్యవృద్ధి కలుగచేయును . మంచి చూపును ఇచ్చును . పైత్యవికారాలను అణుచును . శరీరానికి గొప్ప మేలు చేయును . 


 * వెండిపాత్ర యందు భుజించిన పిత్తం ఎక్కువగును . శ్లేష్మాన్ని హరించును . వాతాన్ని చేయును . అరుచి ( ఏమి తిన్నా రుచి లేకుండా ఉండు సమస్య ) పోగొట్టును . శరీరానికి కాంతిని ఇచ్చును . వెండి ప్లేట్ మధ్యలో బంగారముతో తాపడం చేయించి అందులో భుజించుట కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును . 


 * కంచు పాత్రలో భుజించిన రక్తపైత్యము హరించును . హృదయానికి బలాన్ని ఇచ్చును . బుద్ధిని పెంచును . శరీరము నందు జఠరాగ్ని పెంచును . శరీరానికి కాంతిని కలుగచేయును . ఎముకల వృద్ది అగుటకు తోడ్పడును . ఎముకల బలానికి సహాయపడును . 


 * స్టెయిన్ లెస్ స్టీల్ , ఇనుము పాత్ర యందు భుజించిన శోధన ( Asitis ) , పాండురోగము ( Anemia ) సమస్యలను పోగొట్టును . కామిల వ్యాధి ( కామెర్లు ) నివారణ అగును . వీర్యవృద్ధి , జఠరాగ్ని పెంచును . ఈ పాత్రలను శుభ్రపరుచుట సులభము . 


 * అల్యూమినియం పాత్ర యందు వండుట మరియు భోజనం చేయుట అత్యంత ప్రమాదకరం . ఈ పాత్రల యందు వండు సమయము నందు దీని యందలి విషము కొంచం కొంచం వండిన ఆహారాల యందు కలిసి రక్తదోషాలు ఏర్పడి చర్మరోగాలు వచ్చుటయే కాక , జఠరాగ్ని మందగించి శరీరము విషతుల్యమై అనేక రోగాలు సంప్రాప్తించును . 


 ఆకు విస్తర్ల యందు భోజనం చేయుట వలన ఉపయోగాలు - 


 * అరటి ఆకు యందు భోజనము మిక్కిలి పరిశుభ్రముగా ఉండును . వాతాన్ని హరించును . బలము , ఆరోగ్యము వృద్ధిచెందును . శరీరకాంతి , సంభోగశక్తి పెంపొందించును . ఆకలిని మరియు దంతకాంతిని కలిగించును . పైత్యమును శాంతిప చేయును . శ్లేష్మవికారాలు , వొళ్ళు నొప్పులు తగ్గును . శరీరము నందలి క్రిములు నాశనం అగును . ఉదరము నందలి పుండ్లు ( peptic ulcers ) తగ్గించును . 


 * మోదుగ ఆకు విస్తరి యందు భుజించుట వలన గుల్మరోగము ,మహోదరము , క్రిమిరోగము , రక్తసంబంధ రోగములు , పిత్తరోగములు నివారణ అగును . బుద్దిని పెంచును . మోదుగ చంద్ర సంబంధ వృక్షము . చంద్రుడు మనః కారకుడు అందుచే ఈ విస్తరి యందు భుజించటం చేత సాత్విక గుణములు కలుగును . 


 * మర్రి ఆకుల విస్తరి యందు భుజించటం వలన క్రిమిరోగ నివారణ అగును. వ్రణములు , పైత్యం పొగొట్టును . కుష్ఠు రోగమును హరించును . నేత్రదోష నివారణ చేయును . వీర్యవృద్ధి కలిగించును . 


 * రావి ఆకు విస్తరి యందు భుజించిన పిత్తము , శ్లేష్మము నివారణ అగును . అగ్నివృద్ధి కలిగించును . జననేంద్రియ దోషములు నివారణ అగును . విద్యార్జనకు కావలసిన ఆసక్తిని కలుగచేయును . 


 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది , పిత్తహర గుణములు ఉండును . 


 * తామర ఆకు విస్తరి యందు భుజించిన విషహరముగా ఉండును . సరస్సులో ఉన్న ఆకు భుజించుటకు పనికిరాదని " అహ్నిక ప్రకాశం" అను గ్రంథములో ఉన్నది . 


 * వక్కపెట్ట భోజనమునకు వాడుట కొన్ని ప్రదేశాలలో ఉన్నది. తిన్నతరువాత పళ్ళెము వలే కడిగి మరలా భుజించటం కూడా ఉన్నది . ఇది అగ్నివృద్ది చేయును . దీని నుంచి వాతపిత్తరోగములు హరించును . 


   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -

 వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -


   మనకి వేపచెట్టు ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా మాత్రమే తెలుసు. కాని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను చాలా పురాతన గ్రంథాలు పరిశోధించి మరియు నాయొక్క సొంత అనుభవాలు కలిపి మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియచేయబోయే విషయాలను జాగ్రత్తగా దాచుకోగలరు.


 * ఎంతోకాలంగా ఉండి మానని మొండి కురుపులకు వేపాకు నూరి కట్టిన అవి చాలా తొందరగా నయం అగును.


 * వేపాకు చిగురు ప్రతిరోజు ప్రాతఃకాలం నందు సేవించుచున్న రక్తం శుద్ధి అయ్యి శరీరం పైన ఉండు నల్లటి మచ్చలు ముఖ్యంగా ముఖంపైన ఉండు మచ్చలు తొలగిపోవును .


 * వేపచిగురు ప్రతినిత్యం పరగడుపున భుజించువారికి కొంతకాలానికి చేదుగా కాక తియ్యగా అనిపించును. వారికి పాము కరిచినను విషం ఎక్కదు.


 * వేపచెక్క గంధంని శరీరంపై పూసుకొనిన చర్మంపై వచ్చు చర్మవ్యాధులు హరించును. శరీరం పేలినట్లు ఉండటం, దురద, శోభి , మంగు, తామర వంటి చర్మవ్యాధులు హరించును .


 * ముదురు వేపచెట్టు యొక్క వేరు చూర్ణం కొద్దిమోతాదుగా లోపలికి పుచ్చుకొనిన రక్తంని శుభ్రపరచును. శరీరానికి పుష్టి కలిగించును. జ్వరమును పారద్రోలును , క్రిములను నాశనం చేయును .


 * వేపచెక్క చూర్ణం పసిపిల్లలకు ఇచ్చినచో కడుపులో ఉండు ఏలికపాములు , నులిపురుగులను సమర్ధవంతంగా నాశనం చేయును .


 * వేపచెక్క చూర్ణం పెద్దవారు సేవించిన అజీర్ణం వలన కలుగు జ్వరం తగ్గును.


 * వేపచెట్టు వేరు , బెరడు, ఆకు , ఈనే, పువ్వు, పిందె , కాయ, పండు, కల్లు , జిగురు ఇవి అన్నియు పలువిధములైన రుగ్మతలను నశింపచేయగలవు .


 * వేపాకు , పువ్వు శరీరం యొక్క తత్వమును మంచిస్థితికి మార్చి జీర్ణశక్తిని వృద్ధిపరచును.


 * వేపాకు రసం సేవించటం వలన జ్వరము, అజీర్తి, బలహీనం, పాండువు, క్రిమిరోగం, గండమాల , వ్రణములు, కుష్టు మొదలైనవి నశించును.


 * వేపాకు వడబెట్టి తలకు కట్టిన నరముల సంబంధం వలన వచ్చు "న్యూరాల్జియా"అను తలనొప్పి తగ్గును.


 * వేపాకు వడబెట్టి తలకు కట్టిన తలలోని పేలు , ఈపి , చుండ్రు నశించును.


 * చీముకారు పుండ్లకు వేపాకు నూరి ముద్దచేసి కట్టిన వాటిని మిగిల్చి మానునట్లు చేయును .


 * వేప బెరడు , వేప ఈనెల కషాయం , రోజుమార్చి రోజు వచ్చు జ్వరం నశించును.


 * వేపాకు ఆముదంతో వెచ్చచేసి కీళ్లవాపులకు కట్టిన తగ్గును.


 * లేతవేప చెట్టు నుంచి తీయబడిన కల్లు తియ్యగా ఉండును.దీన్ని పులియబెట్టి సేవించిన ఆమాశయ సంబంధమైన అజీర్తిని , క్రిములను పోగొట్టి మంచి ఆకలిని కలిగించును.


 * వేప కల్లు క్షయ, కుష్టు మొదలయిన అసాధ్యరోగాలను కూడా తగ్గించును .


 * వేప విత్తనాల నూనె చేదుగా ఉండును. ఈ నూనె లొపలికి సేవించిన వాతము హరించి ఉద్రేకమును పుట్టించును. అనగా వేడిని పెంచును.


 * ఈ వేపనూనె చర్మవ్యాధులను, క్రిమిజాడ్యములకు, మూలవ్యాధిని , మూత్రవ్యాధిని తగ్గించును .


 * వేపనూనె , ఆవనూనె, కొబ్బరినూనె సమభాగములాగా తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పులకు , వాపులకు , తలనొప్పికి ఉపయోగించవచ్చు.


 * పురిటి ఇంటి యందు వేపచమురుతో దీపం పెట్టిన శిశువులకు బాలగ్రహాది పీడలు కలగవు అని హిందువులకు గాఢమైన నమ్మకం.


 * వేప బంక పై పూతగా ఉపయోగించుట వలన సడలిపోయిన నరములు బిగువుగా అగును.


 * వేపాకు కషాయాంతో పుండ్లు కడిగిన త్వరగా మానును.


 * వేపచెట్టు గాలి ప్రతినిత్యం తగులుచున్న మశూచి,కలరా వంటి వ్యాధులు దరిచేరవు.


 * నూరు సంవత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు పట్టేంతగా తొర్రని తొలచి అందులో సుమారు ఒక కిలో బియ్యమును అన్నంగా వండి వేడి తగ్గక ముందే ఆ తొర్రలో వేసి ఆ వేపచెట్టు పచ్చికఱ్ఱతోనే ఆ తొర్ర మూసేవిధంగా బిరడాలా చేసి బిగించి లొపలికి గాలిపోకుండా పైన ఆవుపేడను పూసి మూసివేయవలను . ఒక సంవత్సరం పాటు అలా ఉంచి ఆఖరు దినమున ఆ అన్నమును తీసిన ఎర్రగా మారిపోయి ఉండును.దానిని బాగా ఎండించి పూటకు రెండు నుంచి 3 గ్రాముల చొప్పున రెండుపూటలా 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నశించును.


 * వేపాకు మోతాదు మించి ఎక్కువుగా తినినచో మత్తు, మైకం, వాంతులు , విరేచనాలు అగును . కావున 4 నుంచి 5 ఆకుల వరకు తినవచ్చు.


  

         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సూరి మరణం లేక బండిరా పల్లకీ

 సూరి మరణం లేక బండిరా పల్లకీ 

ఈ పేరే చిత్రంగా ఉంది కదూ ? తెలుగు వ్యాకరణం చదువుకోని యువకులకు సూరి పేరు పరిచితమైనది కాకపోవచ్చు.కాని స్కూల్లోనో కాలేజీలోనో తెలుగు పాఠ్యాంశంగా చదువుకున్న వారికి చిన్నయ సూరి పేరు తెలిసే ఉంటుంది.చిన్నయ సూరి గారి ఇంటి పేరు పరవస్తు వారు.ఈయన చాలాకాలం క్రిందట (పందొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో) మద్రాసులో కాలేజీలో తెలుగు అథ్యాపకులుగా పని చేసేవారు. ఈయన రచించినదే తెలుగు బాల వ్యాకరణం. తెలుగులో ఆది కవి నన్నయగారు ఆంద్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. అదే మన మొదటి వ్యాకరణ గ్రంథం. అందుకే ఆయన వాగను శాసనుడయ్యాడు. ఆ తరువాత తెలుగు లో మరికొన్ని వ్యాకరణ గ్రంథాలు రాక పోలేదు గాని వాటన్నిటిలోకీ నవ్యాతి నవ్యమైనది పేరు పడ్డదీ మన చిన్నయసూరి గారి బాల వ్యాకరణమే.దాదాపు ఒక వంద సంవత్సరాలుగా మన తెలుగు పండితులందరి మన్ననలు పొంది నేటికీ మన తెలుగు గ్రాంథిక భాషను శాసిస్తున్నది ఈయన గారి వ్యాకరణమే.శ్రీ గిడుగు మున్నగు భాషా సంస్కర్తల పుణ్యాన మన తెలుగు వచనం ఈ గ్రాంథికాన్ని తోసిరాజని శిష్ట వ్యావహారికాన్ని తలకెత్తుకుని మన నెత్తిన పాలు పోసింది. లేక పోతే ఈ నాటికీ కృతక భాషలో రచనలు చదవ లేక యాతన పడేవారము. సరే ఇప్పటికి సూరి అంటే ఎవరో ఆయన వ్రాసిన వ్యాకరణమేదో తెలిసింది కదా? తాను శాసించిన తెలుగు గ్రాంథికము ఎలా ఉండాలో తెలుపడానికన్నట్లు ఆయన నీతి చంద్రిక పంచతంత్రము అనబడే రెండు గ్రంథాలను వెలువరించాడు. వాటిలో ఉన్నవి బహు చక్కని నీతి కథలే అయినా ఆ భాష మనం మాట్లాడుకునే తెలుగు భాషలా ఉండక ఏదోలా ఉంటుంది.సామాన్యులెవరికీ అర్థం కాదు. అవే కాదు గ్రాంథిక భాష లోని ఏ రచనైనా ఏ కొద్ది మంది పండితులకో అర్థ మౌతుంది కాని సామాన్య ప్రజానీకానికి కొరుకుడు పడదు. ఇటువంటి పరిస్థితుల్లో గిడుగు వారు సారథ్యం వహించగా తెలుగు దేశాన వ్యావహారిక భాషా ఉద్యమం రూపు దిద్దుకుంది.కొందరు ఛాందస పండితులు అడుగడుగునా అడ్డు తగిలినా జన బాహుళ్యం ఆమోదాన్ని పొంది తెలుగు వచనం గ్రాంథికాన్ని వీడి చక్కని వ్యావహారిక బాషను అక్కున చేర్చుకుంది.అయితే అది అంత సులువుగా జరగ లేదు.ఎంతో మంది కృషి ఫలితమిది. వీరిలో ఆంద్ర విశారద శ్రీ తాపీ ధర్మారావుగారు కూడా ఒకరు. వీరు పండితులు.భాషావేత్త.తెలుగులో చేమకూర వెంకట కవి కావ్యం విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వ్రాసిన వారు. వీరు మొదట్లో గ్రాంథిక వాదులైనా గిడుగు పండితుని వాదనలోని స్వారస్యాన్ని గ్రహించి వ్యావహారిక భాషా వాదియై ఉద్యమం తోడ్పాటుకై ఎన్నో వ్యాసాలను వ్రాసి ప్రచురించారు. వాటిలో కొన్ని 1936 ప్రాంతంలో ప్రజామత పత్రికలో ధారా వాహికగా ప్రచురించబడ్డాయి. వాటిలోని కొన్నిటి సంకలనమే కొత్త పాళీ అనే పేరుతో 1955 ప్రాతంలో ముద్రింపబడి ఐదారు ముద్రణలకు నోచుకుంది.ఇదిగో ఈ పుస్తకంలోనే ఆయన వ్రాసిన సూరి మరణం లేక బండిరా పల్లకీ అనే ప్రహసనం చోటు చేసుకుంది.కేవలం నాలుగు రంగాలుగా విభజించి వ్రాయబడ్డ ఈ ప్రహసనం సూరి గారు అనారోగ్యంతో మంచాన పడి ఉండి గడియో క్షణమో అని ఉండగా ప్రారంభమౌతుంది.అక్కడ ఆయన విధవరాలైన కూతురూ మరో ఇద్దరు శిష్యులూ మాత్రం ఉంటారు.వైద్యుడు వచ్చి చూసి ఏమీ చెప్పకుండానే వెళ్లి పోతాడు.మరి కొద్ది సేపటికే సూరి గారు కన్ను మూస్తారు. నక్షత్రం మంచిది కాదని సూరి పార్థివ దేహాన్ని ఇంటి బయట అరుగు మీదకి చేరుస్తారు.అక్కడ చేరిన వారెవరూ పెద్దగా విలపించినట్లు తోచదు. వారిలో వారు మాట్లాడుకుంటూ ఉండగా మూర్తి అనే ఆయన సూరి గట్టివాడే కాని పాఠాలు చెప్పేటప్పుడు అరసున్నల గురించి బండిరాల గురించి తమను కాల్చుకు తినే వాడని ఒక ఉదాహరణ చెబుతాడు. చెరువులో ఏ “ర” ఉందని ఆయన అడిగి ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చేప్ప లేక పోగా ఓ కుర్రాడు బండరాయుంటుందని అన్నాడుట. సూరిగారు శాబాసని వాడిని మెచ్చుకున్నారుట. ఆ అబ్బాయి అన్నది బండి’ఱా’యని కాదని బండరాయని పిల్లలందరూ గోల చేసారట. సూరి మరణించాక అందరూ “కతిపయ దివసములు గతించిన యనంతరంబ” అని కృతకంగా కాకుండా “కొన్నాళ్లు గడిచేక” అని అందరికీ అర్థమయేలాగ వ్రాసుకుంటారన్నమాట అనుకుంటారు. అక్కడ చేరిన వారు ఇటువంటి సరదా మాటలాడుకుంటూ సూరి మరణించిన రోజు నిజంగా తెలుగు జాతికి శుభ దినమని అందుచేత తామేదైనా చిరకాలం గుర్తుండి పోయే కార్యక్రమమేదైనా చేయాలని నిశ్చయించుకుంటారు .నాలుగో రంగంలో వారి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది. వారిలో ఒకరైన రావుగారి ఇంటివద్ద బండి రా ఆకారంలో ఒక పల్లకీని ఏర్పాటు చేసి దానిలో సూరి ఆకారం గల బొమ్మనోకదానిని తయారు చేసి తీసుకు వచ్చి దానిలో పడుక్కోబెడతారు.అది అసలు సూరిగారు కాదు కదా? అన్నవారితో అది సూరిగారి రూపాంతరమనీ రూపాంతరాలు సూరిగారి వ్యాకరణ సమ్మతమేననీ సమర్థించుకుంటారు. ఆ పల్లకీ బండిఱా ఆకారంలో (బొమ్మ చూడండి)తయారు చేయబడి ఉంటుంది.దానికి వారు శకట రేఫ పల్యంకిక అనీ అర్థాను స్వారాల అనంత శయనం అనీ ముద్దు పేర్లు పెట్టుకుంటారు. పల్లకీ బండిరా రూపంలో ఉండడమే కాదు దానికి మీదని చంద్ర వంకల వంటివి తగిలించి ఉంచారు. అవి అర్థాను స్వారాలట.కర్ర మీదనున్న కట్లు నుగాగమాలూ టుగాగమాలూ అనీ ముందున్నవి ఆదేశాలనీ వెనకున్నవి ఆగమాలనీ అంతా వ్యాకరణ పరిభాషలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.

“సూరి మరణము చూడగా రండి జనులార మీరు

దారి పొడుగున వేడ్క చూడండి||

సూరి మరణముతోనె బంధాల్ పారిపోయె, వ్రాత కోతలు

 తేరుకుని దేశానికున్నతి తెచ్చు నిశ్చయమింక మీదట ||సూరి|| 

అని పాడుకుంటూ భజన చేసుకుంటూ పల్లకీని ఊరేగిస్తూ ముందుకు సాగుతారు.

ఇదీ బండిరా పల్లకీ కథ.ఈ బండి రా లేక శకటరేఫ తెలుగు రచనల్లో ఎప్పుడో కనిపించకుండా పోయింది.మన తెలుగు పెద్ద బాల శిక్ష గ్రంథంలో అక్షర మాలలో ఈ శకటరేఫ (బండిరా) ఉండదు చూడండి. కొంత మంది ఇంకా ఛాందసంగా దాన్నివారి రచనల్ల ప్రయోగిస్తూ ఉండవచ్చు. తప్పేమీ లేదు.అది వారి ఇష్టం. కాని మనం గుర్తించ వలసిన విషయం ఏమిటంటే ‘ర’ ‘ఱ’ ల ఉచ్చారణలో భేదం తగ్గిపోయింది .ఆ రోజుల్లోనే శకటరేఫా నిర్ణయ కుఠారము వంటి గ్రంథాలు వెలుడ్డాయంటే వాటి సరైన నిర్ణయం తెలియక ఎన్ని తర్జన భర్జనలు జరిగాయో తెలుస్తుంది. కొందరిప్పటికీ అనవచ్చు కొన్ని పదాల్లో రేఫ ఉంటే ఒక అర్థం శకట రేఫ ఉంటే ఇంకొక అర్థం వస్తాయని అందువల్ల అది కొన సాగ వలసిందేనని.ఈ బండిరా అరసున్నల నిష్ప్రయోజకత్వం గురించి విపులంగా మరో పోస్టులో వ్రాస్తాను. సెలవు.

సైన్స్ పుట్టింది

 హిందుత్వం నుంచి సైన్స్ పుట్టింది అనటానికి ఎన్నో ఉదాహరణలు...!!!

1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం. 

2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.

3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*

పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..

4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక,ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..

5. 🌞🌝ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి *సూపర్ నాచురల్ ప్రొటెక్షన్* తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..

 6. 🌞🌞. అగ్ని నుంచి వచ్చే *తేజస్సు* తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..

7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి = ఘటోత్కచుడు..

8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి 

👉🏻gender transformation.

 9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..

10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..

👉🏻ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?

👉🏻ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా *లక్షల సంవత్సరాల క్రితమే* మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?

👉🏻ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు,.కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?

       

ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..

      

కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము*. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని *existency ఉండి తీరుతుంది..

     

ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, *అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం*, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..

👉🏻భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా?

      

👉🏻భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)


👉🏻భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)


👉🏻ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)


👉🏻విద్యుత్* మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)


👉🏻విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)


👉🏻భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే


👉🏻గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన


వాల్మీకి మహర్షి మనవాడే


👉🏻రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు


👉🏻కాస్మోలజీ చెప్పిన కపిలుడు


👉🏻అణువులు గురించి వివరించిన కణాదుడు


👉🏻DNA గురించి చెప్పిన బోధిధర్మ

👉🏻మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి


👉🏻మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు


👉🏻సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని


ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు...!!!


*సేకరణ*