2, నవంబర్ 2020, సోమవారం

హిమనగంబు


 హిమనగంబు

౼౼౼౼౼౼౼౼

మేఘసందేశమన్ మేటికావ్యమ్మునం ౼

       దలకాపురింజేరు హారిగతుల,

స ఋతుసంహార విశ్వార్ఘ్య కావ్యార్చిని

      షడ్రుతు వైభవాస్వాద్యగతుల,

స్వాదు కుమారసంభవకావ్య రసధార

      పార్వతీశులు సల్పు ప్రణయగతుల,

రఘువంశసత్కావ్య రాజిత రాజన్య

      శౌర్య పరాక్రమ శ్లాఘ్యగతుల,


కవికులగురువె కవిబుధుల్ చవులనొంద

రమ్య కల్పనారీతుల ప్రాభవముగ

సల్పు యోచనారసగంగపొల్పులిడియె

నింపు సొంపుల రారాజు హిమనగంబు.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవ

 హిమనగంబు

౼౼౼౼౼౼౼౼

మేఘసందేశమన్ మేటికావ్యమ్మునం ౼

       దలకాపురింజేరు హారిగతుల,

స ఋతుసంహార విశ్వార్ఘ్య కావ్యార్చిని

      షడ్రుతు వైభవాస్వాద్యగతుల,

స్వాదు కుమారసంభవకావ్య రసధార

      పార్వతీశులు సల్పు ప్రణయగతుల,

రఘువంశసత్కావ్య రాజిత రాజన్య

      శౌర్య పరాక్రమ శ్లాఘ్యగతుల,


కవికులగురువె కవిబుధుల్ చవులనొంద

రమ్య కల్పనారీతుల ప్రాభవముగ

సల్పు యోచనారసగంగపొల్పులిడియె

నింపు సొంపుల రారాజు హిమనగంబు.


రాయప్రోలు సీతారామశర్మ,భీమవరం.

శ్లోకం – 37:*

 *శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*

*శ్రీ సద్గురు పరమాత్మనే నమః – సర్వమహర్షిభ్యోనమః*

*జగద్గురు ఛారిటబుల్ ట్రస్ట్*

*9494970459*

*ఓం శ్రీ లలితాంబికాయై నమః*

*సౌందర్య లహరి – సాధన*

*ప్రథమ భాగః – ఆనంద లహరి*


*శ్లోకం – 37:*


*విశుద్ధౌతే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

*శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్!*

*యయౌ కాంత్యా యాంత్యా శశికిరణసారూప్యసరణేః*

*విధూతాంతర్ద్వాంతా విలసతి చకోరీవ జగతీ ||37||*


*ప్రతిపదార్థము :*


*తే* = నీ యొక్క;

*విశుద్ధా* = విశుద్ధ చక్రంలో;

*శుద్ధ స్ఫటిక విశదం* = దివ్యంగా ప్రకాశించే మణిలా నిర్మలమైన;

*వ్యోమజనకం* = ఆకాశతత్త్వం జనించడానికి ఆధారభూతుడై లేదా మనః ప్రభావ వికసితుడై;

*శివం* = శివ త్తావాన్ని;

*దేవీం అపి* = భగవతి రూపాన్ని;

*సేవే* = ఉపాసిస్తాను;

*యయోః* = ఏ శివ - శివాణీల నుండైతే;

*యాంత్యా* = వస్తోందో;

*(అట్టి) శశికిరణ సారూప్య సరణేః* = చంద్రకిరణరూప మార్గాల యొక్క;

*కాంత్యాః* = ప్రకాశంతో;

*జగతీ* = ముల్లోకాలూకూడ;

*విధూతాంతః ధ్వాంతా* = లోలోపల అంధకారం ఆవరిస్తున్న చోట దాన్ని తరుమునో;

*విలసిత* = చకోరిలా ప్రకాశిస్తున్నది.


*తాత్పర్యము / భావము:*


*శుద్ధ ఆకాశ తత్త్వమైన దేవీ భగవతి - భగవానుల యొక్క విశుద్ధ చక్రాధిష్ఠానస్తుతి ఇది. అమ్మా ! దోషం ఎంత మాత్రం లేని దివ్య స్ఫటిక విలసితుడైన వాడు - ఆకాశం ఉత్పాదనలో హేతువైన వాడు పతి అయిన సదాశివుడు. అట్టి శుద్ద స్ఫటిక మూర్తినీ - అంతే స్థాయిలో సమానురాలివైన నిన్ను నేను ఆరాధిస్తున్నాను. శివాణీ శివాత్మకాలైన మీ నుండి వచ్చే చంద్ర కిరణాలతో సాటి వచ్చే మీ వైభవం గల కాంతులు, ముల్లోకాలలోని అజ్ఞానం అనే చీకటిని పోకాల్చే వెన్నెల వెలుగులనడానికి సందేహంలేదు. చంద్రునికై వేచి ఉండే చకోరపక్షి, ఆ వెన్నెల త్రాగి ఎలా సంతృప్తి చెందుతుందో, మీ దివ్య దీధితుల చేత లోకం అలా కాగలదు.*


*ఉపాసన :*


*రోజుకి వెయ్యిసార్లు చొప్పున నీటిమీద పై యంత్రాన్ని వ్రాస్తూ - వెయ్యిసార్లు మంత్రోచ్ఛారణ చేయాలి. బెల్లంపాయసం, అరటిపండ్లు కొబ్బరి కాయలు నివేదించాలి. బ్రహ్మ మనలోని రాక్షసత్వం దుర్లక్షణాలు మొదలైన వాటిని నిర్మూలించేందుకు ఆ మంత్రజలం అద్భుతంగా పనిచేస్తుంది.*


*విశుద్ధౌతే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

*శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్!*

*యయౌ కాంత్యా యాంత్యా శశికిరణసారూప్యసరణేః*

*విధూతాంతర్ద్వాంతా విలసతి చకోరీవ జగతీ ||37||*


💐💐💐💐💐💐💐💐💐

*తృతీయ శ్రీమద్భాగవతసప్తాహం*

*ప్రవచనకర్త*

*బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు*

*December 10th to 16th, 2020*

*December 17th – రుక్మిణీకృష్ణుల కల్యాణము*

*KUKATPALLY, HYDERABAD*

💐💐💐💐💐💐💐💐💐

*JAGADGURU CHARITABLE TRUST*

*AXIS BANK CURRENT Account* 

*No.: 919020035877535*

*IFS Code: UTIB0000702*

💐💐💐💐💐💐💐💐💐

*Google Pay / Paytm / PhonePe**

*9494970459 / 8793824603*

💐💐💐💐💐💐💐💐💐

*srijagadgurutrust@gmail.com*

*www.srijagadguru.com*

*Phone : 040-48546039*

💐💐💐💐💐💐💐💐💐


*విశుద్ధౌతే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

*శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్!*

*యయౌ కాంత్యా యాంత్యా శశికిరణసారూప్యసరణేః*

*విధూతాంతర్ద్వాంతా విలసతి చకోరీవ జగతీ ||37||*


💐💐💐💐💐💐💐💐💐

మిడిసి పాటు*

 *మిడిసి పాటు*


పొలాల సమీపంలో ఇల్లు కట్టుకుని, ఏపనీ చేయక పని చేసేవారిని ఎగతాళి చేస్తూ సునాయాసంగా జీవించ సాగింది సురభి అనే నక్క.


ఓరోజు కూతురి పెళ్ళి చూపులు అబ్బాయి అమ్మా అబ్బ వచ్చారు. వారికి వెంట్రకాయలతో విందు చేసింది. పండి పోయారు. అమ్మాయిని కూడా నచ్చారు.

"అబ్బాయి ఏం పనిచేస్తుంటాడు?"

"మా వాడు మంచి రైతు. ధాన్యం పండించి అందరికీ అన్నం పెట్టి దేశానికి వెన్నెముక  అన్నదాత  రైతేరాజు అనే బిరుదులు అందుకున్నాడు."

"ఏం రైతులేవయ్యా! ఆరుగాలం కష్టపడి పండించి, అమ్ముకునే సమయంలో దిక్కుతోచక కూటినీళ్ళకు అమ్ముకునే వాడు. మాకవసరం లేదు.

ప్రభుత్వ ఉద్యోగులకయితే, పుట్టినా పోయినా తుమ్మినా దగ్గినా శెలవు లు ఇస్తారు."

మారుమాటాడక వెనుతిరిగింది రైతుకుటుంబం.


ఓరోజు ఏం పాలుపోక  రాజుగారైన పులి దగ్గరకు పోయింది సురభి.

"ఏం సురభి ఇలా వచ్చావు?"

"అందరూ పనులు చేసుకుంటున్నారు. నాతో మాట్లాడేటందుకు ఒక్కరూ లేరు నీ వైతే తీరికగా ఉంటావని వచ్చాను."

అయ్యో!రామా! నాకుమాత్రం తీరికెక్కడుంది? నేనుకూడా వేటకు బయలు దేరబోతున్నాను."

"మీరూ పనిచేసి మేమూ పనిచేస్తే మీ గొప్పేముంది?

" ఏం చేద్దాం మాతల రాత పనిచేయాలని వుంటే తప్పదు గదా"!


చూసేదానికి గంభీరంగా కనిపిస్తారు లోపలంతా లొట్టే ఎందుకొచ్చానురా "తలబాదుకుంటూ ఇల్లు చేరుకుంది.


సాయంత్రం వేళ పొలాల వైపుకు వేటకు బయలు దేరింది సురభి.

 బొరియలలో తోక పోనించి తిప్పుతుంది అదేదో వింతని తోక పట్టుకుని బయటకు వస్తుంది. దాన్ని తీసుకుని బుట్టలో వేసుకుంటుంది.

అలాచేస్తూ చేస్తూ ఒక బొరియలో తోకపెట్టి తిప్పింది. తోకపట్టుకుని పాము బయటకు వచ్చి కసితీరా కరిచింది.

చచ్చానురా దేవుడాయని ఏడుస్తూ వస్తున్నది. అంతలో పులి కనిపించింది. జరిగింది చెప్పింది. రాజవైద్యులను పిలిపించి మందు వేయించాడు. కొంత సేపటికి నొప్పి తగ్గింది.


" క్షమించండి మహారాజా! మీ స్థాయి ఏమిటో తెలుసుకోలేక ఆనాడు ఏవేవో వాగాను అది మనసులో పెట్టుకోక నాప్రాణం కాపాడారు"అంటూ కాళ్ళ మీద పడింది.


మరునాడు రైతు కుటుంబాన్ని పిలిపించి "పండించి అందరికీ అన్నం పెడుతున్నారు మీరు లేనిదే మానవ మనుగడే లేదు నా అజ్ఞానాన్ని మన్నించండి." అని  రైతు కొడుకు నకు కూతురునిచ్చి వైభవంగా పెళ్ళి జరిపించింది సురభి.

✍🏻జంజం కోదండ రామయ్య

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

ప్రహల్లాద


: "రాజు కు ఉండవలసిన ముఖ్య లక్షణములు".  ,1)" శీల సదాచార సంపన్నుడై, ఉండాలి.   ,2)" బ్రాహ్మణ ప్రియుడై" ఉండాలి.                     ,3)"ఆర్తజన రక్షణ, శాశ్వత, తాత్కాలిక, ధన విషయమై భద్రత, 4)"ధర్మ మర్యాద", "ధర్మ అర్థాలకు" పూచి దారుడి  గా ఉండాలి.

 "ప్రహల్లాద"   ప్రముఖుల పూర్వజన్మ  గాథ:-. పూర్వము బ్రహ్మమానస పుత్రులకు సనక -సనందన-- సనత్కుమార-- సనత్కు జాతులను నలుగురు మునీశ్వరులు స్వేచ్ఛగా సర్వ లోకము లా సంచరించుచు శ్వేత ద్వీపముల ఉన్న,  ప్రద్యుమ్న దేవుని దర్శనమునకు  విచ్చేసి రి.  అంత ప్రద్యుమ్న దేవుని ద్వార పాలకులకు జయ విజయులు  ఆ ముని వర్యులతో  స్వామి!  మీకు ఇది సమయము కాదు.  కొలది కాలము ఆ  అరుగుపై  విశ్రాంతి గై కొండని విన్నవించిరి.   భగవత్ ప్రేరితమైన  సనకాదులు  కోపంతో  శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన మమ్ము మీరు నిరోధించితిరి.    పాన మీరు సర్వ లోక కంటకులైన రాక్షసులుగా  పుట్టు డని శపించను.       అంతటా సాత్విక శ్రేష్టులు అయినా జయవిజయులు ఓ ముని పుంగవులారా?   మీరు అచ్యుతుని ప్రేరణ చేత మమ్ము శపించి తిరి.     కావున శ్రీహరి అనుగ్రహమునకు మీరు పాత్రులగుతూ మా అనుగుణముగా జన్మించుడని పలికిరి.  అంత మాయ విష్ణు లై  తాము గావించిన నీచ కార్యమునకు సనకాదులు సిగ్గుపడి ద్వార పాలకులకు పాదాభివందనం చేసి దుఃఖించిరి.   అట్టి సమయమున శ్రీ పుండరీకాక్షుడు అచ్చటకు విచ్చేయ ఇరు పక్షముల వారు జరిగిన విషయమును పూసగుచ్చినట్లు వివరించిరి.   అంతట శ్రీకాంతుడు  ఓ సనకా!  తొలుత జయ విజయాలకు మీరే శాపము పెట్టి తిరి.  కాన జయవిజయుల జన్మలకు అనుగుణముగా మూడు జన్మలు మీరు పొందవలసి ఉన్నారు.   మొదటి జన్మలో ప్రహ్లాదుడు వై  పుట్టు ము.   రెండవ జన్మలో విభీషణుడు వై జన్మించు,  మూడవ జన్మలో సహదేవుడు వై  సంభవించము.   ఈ మూడు జన్మలందు తత్వ జ్ఞానమును, భగవద్భక్తిని, భగవత్ తత్వము ను ప్రబోధించి  భాగవత గ్రే సరుడు ప్రసిద్ధి నందు ము అని పల్కి,. సనందన- సనత్కుమార, సనత్ జాతులను వీక్షించి మీరు ముగ్గురూ సనకుడు ఇచ్చిన శాపం మూలకు ఆమోదము చూపిరి.   కావున జయ విజయాలకు కలుగు ధర్మాలలో మొదటి జన్మ మందు మాత్రమే వారి జన్మలకు అనుగుణముగా జర్మించవలసి ఉన్నారు.  అని ఆదేశించి, జయవిజయుల ఉద్దేశించి నేను సదా భక్త పరాధీనుడు అగుటవలన నా భక్తుల నెప్పుడు మీరు నిరోధించ రాదు.   సనకాదులు నాకు అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తులు.   వారిని మీరు అవమానించి రి గా న వారి శాప కారణముగా మీరు భువిలో రాక్షసులు గా జన్మించవలసిన ఉన్నారు.   మీరు నిరంతరము నా సేవా సక్తులగు  సంపన్నులు.    కావున మిత్ర తత్వముతో 7 జన్మల కు గాని శత్రుత్వము తో 3 జన్మలలో గాని  నా సన్నిధికి తిరిగి రాగలరు.  ఇందు మేక్ ఏది ఇష్టమో తెలియపరచండి పలుకగా జయవిజయులు స్వామి దీర్ఘకాలము మీ దర్శన భాగ్యం లేక మే మెట్లు జీవింప గలము?     కావున శత్రుత్వము తోనే వర్తించి మూడు జన్మల కే నీ సన్నిధికి మేము చేరునట్లు అనుగ్రహింపుము అని ప్రార్ధింప భక్తవత్సలుడైన పరమాత్మ అందులకు అంగీకరించెను.       అది కారణముగా జయవిజయులు మొదటి జన్మలో హిరణ్యాక్ష kashyapa- ఎర

శ్రీ లలితాష్టకం

 *శ్రీ ఆది శంకరాచార్య విరచితం శ్రీ లలితాష్టకం*


*1)శరణాగత పరిపాలిని కరుణాయితధిషణే!*


*కరుణారస పరిపూరిత నయనాంబుజ చలనే!!*


*అరుణాంబుజ సద్వశీకృత మణినూపురచరణే !*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!* 




*2)కమలాయత తటివాసిని కమలావతి సహజే!*


*కమలా శతపరిభావిత నయనాంబుజ చలనే!*


*కమలాసన ముబాశాసన భవశాసన వినుతే!*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!*




*3)భవకానన గతమానుష పదవీకృత చరణే!*


*భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే!*


*అవనీధర వరకార్ముక మదవల్లవ లతికే!*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!*




*4)మదిరాలస గతమానుష మదవారణ గమనే!*


*విలసత్సూబానవశాబక విలసత్కర కమలే*


*రదనచ్చవి వరనిర్జిత నవమౌక్తిక నికరే*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!*




*5)బలసూదన మణిరంజిత పదపంకజ కమలే!*


*అంబుజ వరవాహన బహుఖేదిత సుఖదే!*


*అళిసంకుల నిభకుంతల విలసశ్చశి శకలే!*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!*




*6)అధరీకురురిపుసంహృతి మతికోకిల వచనే!*


*మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే!*


*అధునాసుర వనితాశత పరిభావిత చరణే!*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!*




*7)శకలీకృత దురితేఖిల జగతామపి శివదే!*


*శివమానస పరిమోహన మణినూపుర నినదే!*


*సకలాగమ శిరసాపిచ బహుతోషిత మహిమే!*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!*




*8)శమనాంతక హృదయాంబుజ తరుణారుణ కిరణే !*


*శమయాఖిల దురితానపి బహుమానయ పూర్ణే !*


*అమలీకురు ధిషణామపి బహుసంశయ దళనే !*


*అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం !!

భాస్కరా

 [02/11, 10:40 am] Bhargava Sarma: ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్‌

దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే

ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే?

తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా! 21

ఉ. ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం

పొప్పుచు నుండుఁగాక యది యొప్పని రూపుమాయుఁగా

నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్‌

దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా! 22

ఉ. ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకు\న్‌ సమగ్రతా

భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం

యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే

లాగు ఘటించు! సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా! 23

ఉ. ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ

జూడగఁ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం

గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే

సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా! 24

ఉ. ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్‌

జాలు, ననేక మార్గముల సన్నుతికెక్క నదెట్లొకో యనన్‌

రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్‌

వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద భాస్కరా! 25

ఉ. ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ

జక్క నొనర్పఁ; గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటలం

జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్‌

మొక్కపడంగఁ జేసి తుదముట్టఁడె యొక్కకిరీటి భాస్కరా! 26

ఉ. కట్టడ దప్పి తాము చెడు కార్యముఁ జేయుచు నుండిరేని దోఁ

బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం

దొట్టిన రావణాసురునితో నెడఁబాసి విభీషణాఖ్యుఁ డా

పట్టున రాముఁ జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా! 27

ఉ. కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి యే గతం

బెట్టునొ పెట్టినయట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ

గట్టుక వ్రేలు��

[02/11, 10:42 am] Bhargava Sarma: ఉ. కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ

డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి

ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా

నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా! 31

ఉ. కామిత వస్తుసంపదలు గల్గు ఫలం బొరు లాసపడ్డచో

నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫలమున్నఁ బోయినన్‌

బ్రామికపడ్డ; లోకులకుఁ బండగ నే మది యెండి పోవఁగా

నేమి ఫలంబు చేఁదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా! 32

ఉ. కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం

దూఱిన నెంతవారలకుఁ; దొల్లి పరీక్షితు శాపభీతుఁడై

వారిధి నొప్పు నుప్పరిగ పైఁ బదిలంబుగ దాఁగి యుండినం

గ్రూరభుజంగ దంతహతిఁ గూలడె లోకులెఱుంగ భాస్కరా! 33

చ. కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే

కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్‌

గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం

పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా! 34

ఉ. క్రూర మనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్‌

వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీజలో

దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే

క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా! 35

ఉ. గిట్టుట కేడఁ గట్టడ లిఖించిన నచ్చటఁ గాని యెండుచోఁ

బుట్టదు చావు; జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁగా

ల్గట్టిన శూద్రకున్‌ భ్రమలఁ గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా

పట్టునఁ గొంచు మఱ్ఱికడఁ బ్రాణము దీసెగదయ్య! భాస్కరా! 36

చ. ఘనబలసత్త్వ మచ్చుపడఁ గల్గిన వానికి హాని లేనిచోఁ

దనదగు సత్త్వమే చెరచుఁ దన్ను; నదెట్లన నీరు మిక్కిలిన్‌

గినుక వసించినన్‌ జెఱువు కట్టకు సత్వము చాలకున్నచోఁ

గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె భాస్కరా! 37

చ. ఘనుఁడగు నట్టివాఁడు నిజకార్య సముద్ధరణార్థమై మహిం

బనివడి యల్పమానవునిఁ బ్రార్థనఁ జేయుట తప్పుగాదుగా;

యనఘతఁ గృష్ణజన్మమున న

[02/11, 10:42 am] Bhargava Sarma: చక్కఁదలంపఁగా విధివశంబున నల్పుని చేతనైనఁ దా;

జిక్కి యవస్థలం బొరలుఁ జెప్పఁగరాని మహాబలాఢ్యుఁడున్‌

మిక్కిలి సత్త్వ సంపదల మీఱిన గంధగజంబు మావటీఁ

డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదె యోర్చి భాస్కరా! 41

చ. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;

బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! 42

ఉ. చాలఁ బవిత్రవంశమున సంజనితుండగునేని యెట్టి దు

శ్శీలునినైనఁ దత్కుల విశేషముచే నొక పుణ్యుఁడెంతయుం

దాలిమి నుద్ధరించును; సుధానిధిఁ బుట్టగఁగాదె శంభుఁడా

హాలాహలానలంబు గళమందు ధరించుట పూని భాస్కరా! 43

ఉ. చేరి బలాధిపుం డెరిఁగి చెప్పిన కార్యము చేయకుండినన్‌

బారము ముట్టలేఁడొక నెపంబున దాఁజెడు నెట్టి ధన్యుఁడున్‌

బోరక పాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టుమన్న కం

సారిని గాకుచేసి చెడఁడాయెనె కౌరవభర్త భాస్కరా! 44

ఉ. చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పునఁ గప్పిపుచ్చి తా

మూసిన యంతటన్‌ బయలు ముట్టక యుండ దదెట్లు; రాగిపైఁ

బూసిన బంగరుం జెదరిపోవఁ గడంగిన నాఁడు నాటికిన్‌

దాసిన రాగి గానఁబడ దా జనులెల్ల రెఱుంగ భాస్కరా! 45

చ. తగిలి మదంబుచే నెదిరిఁ దన్ను నెఱుంగక దొడ్డవానితో

బగఁగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతెగాక తా

నెగడి జయింపనేరఁడది నిక్కము తప్పదు; ధాత్రిలోపలన్‌

దెగి యొక కొండతో దగరు ఢీకొని తాఁకిన నేమి భాస్కరా! 46

చ. తడవగ రాదు దుష్టగుణుఁ దత్వ మెఱుంగక యెవ్వరైన నా

చెడుగుణ మిట్లు వల్వదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుఁడై

కడుఁ దెఁగఁ జూచుఁగా; మఱుగఁ గాగిన తైలము నీటిబొట్టుపై

బడునెడ నాక్షణంబెగసి భగ్గున మండక యున్నె భాస్కరా! 47

చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా

ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే

లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రో�

[02/11, 10:43 am] Bhargava Sarma: . తాలిమితోఁడ గూరిమిఁ గృతఘ్నునకెయ్యెడ నుత్తమోత్తముల్‌

మేలొనరించినన్‌ గుణము మిక్కిలి కీడగుఁ, బాముపిల్లకున్‌

బాలిడి పెంచిన న్విషము పాయఁగ నేర్చునె దాని కోఱలం

జాలఁగ నంతకంత కొక చాయను, హెచ్చును గాక భాస్కరా! 51

చ. తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకిఁ జేకొనన్‌

వలయు నటైన దిద్దుకొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం

గలగదు; ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు చేత నద్దముం

గలిగినఁ జక్కఁ జేసికొనుఁ గాదె నరుండది చూచి భాస్కరా! 52

ఉ. దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే

లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు ప్ర

త్యక్షము; వాగులున్‌ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే

అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! 53

ఉ. దానపరోపకారగుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్‌

లేని వివేకశూన్యునకు లేములు వచ్చినవేల సంపదల్‌

పూనినవేళ నొక్కసరి పోలును; జీఁకున కర్థరాత్రియం

దైననదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా! 54

ఉ. దానము సేయఁ గోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో

నైనఁ బరోపకారమునకై యొక దిక్కునఁ దెచ్చి యైన నీఁ

బూనును; మేఘుడంబుధికిఁ బోయి జలంబులఁ దెచ్చి యీయఁడే

వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా! 55

ఉ. దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్‌

దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్‌,

దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ

గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా! 56

చ. నడవక చిక్కిలేమి యగునాఁడు నిజోదర పోషణార్థమై

యడిగి భుజించుటల్‌ నరుల కారయ వ్యంగ్యముకాదు; పాండవుల్‌

గడు బలశాలులేవురు నఖండవిభూతిఁ దొలంగి భైక్ష్యముల్‌

గుడువరె యేకచక్రపురిఁ గుంతియుఁ దారొకచోట భాస్కరా! 57

చ. నుడువుల నేర్పు చాలని మనుష్యుఁడెఱుంగక తప్పనాడినం

గడుఁ గృపతోఁ జెలంగుదురు కాని యదల్పరు తజ్ఞులెల్లఁ; ద

ప్పటడుగులు వెట్టుచు న్నడుచునప్పుడు బాలుని ముద్దు చేయఁగా

ద�

[02/11, 10:44 am] Bhargava Sarma: పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁ డొక్కడు

ద్ధండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి యెగ్గగున్‌;

కొండొకకోతిఁ జెట్టు కొనకొమ్మల నుండగ, గ్రింద గండ భే

రుండ మదేభ సింహనికురంబములుండవె చేరి భాస్కరా! 61

ఉ. పట్టుగ నిక్కుచున్‌ మదముఁ బట్టి మహాత్ములఁ దూలనాడినం

బట్టిన కార్యముల్‌ చెడును బ్రాణమువోవు నిరర్థదోషముల్‌

పుట్టు, మహేశుఁ గాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞ తంత్రముల్‌

ముట్టక పోయి దక్షునికి మోసము వచ్చెఁగదయ్య భాస్కరా! 62

చ. పరహితమైన కార్య మతిభారము తోడిదియైనఁ బూను స

త్పురుషుఁడు లోకముల్పొగడఁ బూర్వమునందొక ఱాలవర్షమున్‌

గురియఁగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై

గిరినొక కేల నెత్తెనట కృష్ణుఁడు ఛత్రము భాతి భాస్కరా! 63

చ. పలుచని హీనమానవుఁడు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం

బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణప్రపూర్ణుఁడ

ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగ నెట్లన; వెల్తికుండఁ దా

దొలకుచునుండుఁ గాని మఱితొల్కునె నిండుఘటంబు భాస్కరా! 64

చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలె పల్కుఁ గఠోరవాక్యముల్‌

బలుకఁడొకానొకప్పుడు నవి పల్కినన్‌ఁ గీడును గాదు నిక్కమే;

చలువకు వచ్చి మేఘుఁడొక జాడను దా వడగండ్ల రాల్చినన్‌

శిలలగు నోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా! 65

ఉ. పాపపుఁ ద్రోవవాని కొకపట్టున మేను వికాసమొందినన్‌

లోపల దుర్గుణంబె ప్రబలుం గద! నమ్మగఁ గూడ దాతనిన్‌;

బాపటకాయకున్‌ నునుపు పైపయి గల్గినఁ గల్గుగాక యే

రూపున దానిలోఁగల విరుద్ధపుఁ జేదు నశించు భాస్కరా! 66

ఉ. పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టిమానవుం

డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వరెచ్చటం

దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పమువాడి వాసనా

హీనత నొంది యున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా! 67

ఉ. పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్‌

దూరములైన వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతు లె

ట్లారయ; గొగ��

[02/11, 10:45 am] Bhargava Sarma: ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో

నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు; రదెట్లు చంద్రికా

విలసనమైనఁ దా మనుభవింపఁ జకోరము లాసఁ జేరవే

చలువ గలట్టివాఁడగుటఁ జందురు నెంతయుఁ గోరి భాస్కరా! 71

ఉ. బంధుర సద్గుణాఖ్యుఁ డొక పట్టున లంపట నొందియైన దు

స్సంధిఁ దలంపఁ డన్యులకుఁ జాల హితం బొనరించుఁ గాక, శ్రీ

గంధపుఁ జెక్క రాగిలిచుఁ గాదె శరీరుల కుత్సవార్థమై

గంధములాత్మఁ బుట్టఁ దఱుఁగంబడి యుండుటలెల్ల భాస్కరా! 72

చ. బలము దొలంగు కాలమునఁ బ్రాభవసంపదలెంత ధన్యుఁడున్‌

నిలుపుకొనంగనోపఁ; డది నిశ్చయ మర్జునుఁడీశ్వరాదులం

గెలిచినవాఁడు బోయలకు గీడ్పడి చూచుచుఁ గృష్ణభార్యలు

బలువుర నీయఁడే నిలువఁ బట్ట సమర్థుఁడు గాక భాస్కరా! 73

చ. బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే

బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై

జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా

బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! 74

ఉ. బల్లిదుఁడైన సత్ప్రభువు పాయక యుండినఁగాని రచ్చలోఁ

జిల్లరవారు నూఱుగురు సేరినఁ దేజము గల్గదెయ్యెడన్‌

జల్లని చందురుండెడసి సన్నపుఁ జుక్కలు కోటియున్న

జిల్లునె వెన్నెలల్‌ జగము జీఁకటులన్నియుఁ బాయ భాస్కరా! 75

చ. భుజబల శౌర్యవంతులగు పుత్త్రుల గాంచిన వారి కెయ్యెడన్‌

నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్‌

విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా

గజమును దెచ్చి తల్లి వ్రతకార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా! 76

ఉ. భూనుతులైన దేవతలు పూర్వము కొందఱు వావివర్తనల్‌

మాని చరింపరో యనుచు మానవులట్ల చరింపఁబోల; దం

భోనిధులన్నియుం దనదు పుక్కిటఁ బట్టె నగస్త్యుఁడంచు నా

పూనిక కెవ్వఁడోపు నది పూర్వమహత్త్వము సుమ్ము భాస్కరా! 77

ఉ. భూపతి కాత్మబుద్ధి మది బుట్టనిచోఁట బ్రధానులెంత ప్ర

జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము; కార్య�

[02/11, 10:45 am] Bhargava Sarma: మదిఁ దను నాసపడ్డయెడ మంచిగుణోన్నతుఁడెట్టి హీనునిన్‌

వదలఁడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుఁగా;

త్రిదశ విమానమధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్‌

మొదల నిడండె ధర్మజుఁడు మూఁగి సురావళి చూడ భాస్కరా! 81

ఉ. మాటల కోర్వజాలఁ డభిమానసమగ్రుఁడు ప్రాణహానియౌ

చోటులనైనఁ దానెదురు చూచుచునుండుఁ; గొలంకు లోపల

న్నీట మునింగినప్పు డతి నీచము లాడిన రాజరాజు పో

రాట మొనర్చి నేలఁబడఁడాయెనె భీముని చేత భాస్కరా! 82

ఉ. మానవనాథుఁ డాత్మరిపు మర్మ మెఱింగినవాని నేలినం

గాని జయింపలేఁ డరులఁ; గార్ముకదక్షుఁడు రామభద్రుఁ డా

దానవనాయకున్‌ గెలువఁ దా నెటులోపుఁ దదీయ నాభికా

పానసుధ న్విభీషణుఁడు తార్కొని చెప్పకయున్న భాస్కరా! 83

ఉ. మానవుఁ డాత్మకిష్టమగు మంచిప్రయోజన మాచరించుచోఁ

గానక యల్పుఁడొక్కఁ డది గాదని పల్కిన వాని పల్కుకై

మానగఁజూడఁడా పని సమంచిత భోజనవేళ నీఁగ కా

లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా! 84

ఉ. మానిని చెప్పు నెట్లెఱుకమాలిన వాఁడటు చేసినన్‌ మహా

హాని ఘటించు నే ఘనునికైన నసంశయ ముర్విపైఁ గృపా

హీనతఁ బల్కినన్‌; దశరథేశ్వరుఁ డంగన మాటకై గుణాం

భోనిధి రాముఁ బాసి చనిపోవఁడె శోకముతోడ భాస్కరా! 85

చ. మునుపొనరించు పాతక మమోఘము జీవులకెల్లఁ బూని యా

వెనుకటి జన్మమం దనుభవింపక తీఱదు; రాఘవుండు వా

లిని బడనేసి తా మగుడ లీల యదూద్భవుఁడై కిరాతుచే

వినిశిత బాణపాతమున వీడ్కొనఁడే తన మేను భాస్కరా! 86

ఉ. రాకొమరుల్‌ రసజ్ఞునిఁ దిరంబుగ మన్నన నుంచినట్లు భూ

లోకమునందు మూఢుఁ దమ లోపలనుంపరు; నిక్కమే కదా!

చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక పెంతురే

కాకము నెవ్వరైన శుభకారణ సన్మునిసేవ్య భాస్కరా! 87

ఉ. లోకములోన దుర్జనుల లోఁతు నెఱుంగక చేరరాదు సు

శ్లోకుఁడు చేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్‌

కోకిలఁ గన్నచోట గుమికూడి యసహ్యపుఁ గూతలార్చుచుం

గాకులు తన్నవే తఱిమి కాయము తల్లడమంద భాస్కర�

[02/11, 10:46 am] Bhargava Sarma: వట్టుచుఁ దండ్రి యత్యధమ వర్తనుఁడైననుగాని వానికిం

బుట్టిన పుత్త్రకుండు తన పుణ్యవశంబున దొడ్డధన్యుఁడౌ;

నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయుఁ గొంచెము దానఁబుట్టునా

చెట్టు మహోన్నతత్వమును జెందదె శాఖలనిండి భాస్కరా! 91

చ. వలనుగఁ గానలందుఁ బ్రతివర్షమునం బులి నాలుగైదు పి

ల్లలఁ గను దూడనొక్కటి నిలం గను ధేనువు రెండుమూఁడు నేఁ

డుల కటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం

దలు గడువృద్ధిఁ జెందవె యధర్మము ధర్మముఁ దెల్ప భాస్కరా! 92

చ. వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయఁబడ్డచోఁ

గొలదియెఁ గాని యెక్కువలు గూడవు; తమ్ములపాకు లోపలం

గలసిన సున్నమించుకయ కాక మఱించుక యెక్కువైనచో

నలుగడఁ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుక పొక్కక యున్నె భాస్కరా! 93

ఉ. వానికి విద్యచేత సిరివచ్చె నటంచును విద్య నేర్వఁగాఁ

బూనినఁ బూనుఁగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం

బూనఁగ నెవ్వఁడోపు; సరిపో చెవి పెంచును గాకదృష్టతా

హీనుఁడు కర్ణభూషణము లెట్లు గడింపఁగనోపు? భాస్కరా! 94

ఉ. సంతత పుణ్యశాలి నొక జాడను సంపద వాసిపోయి తా

నంతటఁ బోక నెట్టుకొని యప్పటియట్ల వసించియుండు; మా

సాంతమునందుఁ జందురుని నన్నికళల్‌ పెడఁబాసి పోయినం

గాంతి వహింపఁడటోటు? తిరుగంబడి దేహమునిండ భాస్కరా! 95

చ. సకలజన ప్రియత్వము నిజంబుగఁ గల్గిన పుణ్యశాలి కొ

క్కొకయెడ నాపదైనఁ దడవుండదు వేగమె పాసిపోవుగా;

యకలుషమూర్తియైన యమృతాంశుఁడు రాహువు తన్ను మ్రింగినం

డకటక మాని యుండఁడె! దృఢస్థితి నెప్పటియట్ల భాస్కరా! 96

చ. సన్నుత కార్యదక్షుఁడొక చాయ నిజప్రభ యప్రకాశమై

యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్త్వసం

పన్నుఁడు భీముఁడా ద్విజుల ప్రాణము కాఁవడె యేకచక్రమం

దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! 97

చ. సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణ మొక్కవేళ యం

దొరసిన నిటు నీకుఁ దగునో యని చెప్పిన మాన నేర్చుగా

బురద యొకించుకంత తముఁ బొందిన వేళలఁ జిల్లవిత��

[02/11, 10:47 am] Bhargava Sarma: స్థానముఁ దప్పివచ్చునెడఁ దానెటువంటి బలాఢ్యుఁడున్‌ నిజ

స్థానికుఁడైన యల్పుని కతంబున నైనను మోసపోవుఁగా;

కానల లోపలన్‌ వెడలి గంధగజం బొకనాఁడు నీటిలోఁ

గానక చొచ్చినన్‌ మొసలి కాటుకు లోఁబడదటోటు భాస్కరా! 101

చ. సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలం బగున్‌

నెఱిగుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్‌

వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం

గురిసినఁగాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా! 102

చ. సిరివలెనేని సింహగుహ చెంత వసించినఁ జాలు సింహముల్‌

కరుల వధింపఁగా నచటఁ గల్గును దంతచయంబు ముత్యముల్‌

హరువుగ నక్కబొక్క కడ నాశ్రయమందిన నేమి గల్గెడుం

గొరిసెలు దూడతోఁకలును గొమ్ములు నెమ్ములుఁగాక భాస్కరా! 103

చ. స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్క ము

ష్కరుఁ డతినీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం

గొఱఁత వహింపఁడయ్యెడ; నకుంఠిత పూర్ణసుధాపయోధిలో

నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి కొఱంత భాస్కరా! 104

చ. స్ఫురతర కీర్తిమంతులగు పుత్త్రుల గాంచినఁగాక మూఢము

ష్కరులఁ గనంగఁ దేజములు గల్గవుగా; మణికీలితాంగుళా

భరణము లంగుళంబుల శుభస్థితిఁ బెట్టినఁగాక గాజు టుం

గరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య? భాస్కరా! 105

ఉ. సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో

మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్నిహోత్రుఁడౌ

నే నిజభోజ్యముల్‌ గుడుచు నేనియుఁ బుష్టి వహించు లేనిఁనా

డూని విభూతిలోనడఁగి యుండఁడె తేజము తప్పి భాస్కరా! 106

ఉ. హాళి నిజప్రబుద్ధి తిరమైన విధంబునఁ బెట్టుబుద్ధులా

వేళలకంతె కాని మఱి వెన్కకు నిల్వవు; హేమకాంతి యె

న్నాళులకుండుఁ గాని యొకనాడు పదంపడి సానఁ బట్టినన్‌

దాళియు నుండునే యినుప తాటకఁ జాయలు పోక భాస్కరా! 107

ఉ. హీనకులంబునందు జనియించినవారికి సద్గుణంబు లె

న్నేనియుఁ గల్గియున్న నొక నేరము చెందకపోదు; పద్మముల్‌

భూనుతిఁ గాంచియు\న్‌ బురదఁ

[02/11, 10:48 am] Bhargava Sarma: శ్రీగల భాగ్యశాలి కడఁజేరఁగ వత్తురు తారు దారె దూ

రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను

ద్యోగము చేసి; రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్‌

సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత! మద్గురుమూర్తి! భాస్కరా! 1

ఉ. అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే

భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు! వివేకియైన సా

రంగధరుం బదంబులు కరంబులు గోయఁగ జేసెఁ దొల్లి చి

త్రాంగి యనేకముల్‌ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా! 2

ఉ. అక్కరపాటు వచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి

న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ

యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలున్‌

దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా! 3

చ. అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లోభవర్తియై

కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె

య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్‌

గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా! 4

చ. అతిగుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేకయుండినన్‌

మితముగఁ గాని కల్మిగల మీఁదట నైన భుజింపఁడింపుగా

సతమని నమ్ము దేహమును సంపద; నేఱులు నిండి పాఱినన్‌

గతుకఁగ జూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా! 5

చ. అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్‌

గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్‌

మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే

పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా! 6

చ. అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో

మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే

యనువునైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో

నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా! 7

చ. అలఘుగుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుండొకఁ డిష్టుఁడై తనున్‌

వలచి యొకించు కేమిడినవానికి మిక్కిలి మేలుచేయుఁగా;

తెలిసి కుచేలుఁ డొక్క కొణిదెం డడుకుల్‌ దనకిచ్చినన్‌ మహ

[02/11, 10:49 am] Bhargava Sarma: ఆరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్న్‌

గౌరవమొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే

కూరదదెట్లు; హత్తుగడ గూడునె; చూడఁ బదాఱువన్నె బం

గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా! 11

ఉ. ఈ క్షితినర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం

రక్షకుఁడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందుఁ; జంద్రికా

పేక్షఁ జెలంగి చంద్రుఁడుదయించు విధంబునకై చకోరపుం

బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా! 12

ఉ. ఈ జగమందు దా మనుజుఁడెంత మహాత్మకుఁడైన దైవమా

తేజము తప్పఁ జూచు నెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా

రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁ గాయలాకులున్‌

భోజనమై తగన్వనికిఁ బోయి చరింపఁడె మున్ను భాస్కరా! 13

చ. ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా

క్పరుషత జూపినన్‌ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం

బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ

స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! 14

చ. ఉరుగుణవంతుఁడొడ్లు తనకొం డపకారము చేయునప్పుడుం

బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడుఁ జేయగా నెఱు

గఁడు; నిక్కమేకద యదెట్లన? గవ్వముఁ బట్టి యంతయుం

దరువఁగఁ జొచ్చినం బెరుగుతాలిమి నీయదె వెన్న? భాస్కరా! 15

చ. ఉరుబలశాలి నంచుఁ దను నొల్లని యన్య [పతివ్రతాంగనా

సురతము గోరెనేని కడసుమ్మది భూతికిఁ బ్రాణహాని యౌ;

శిరములు గూల రాఘవునిచే దశకంఠుఁడు ద్రుంగిపోవఁడే

యెఱుఁగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా! 16

ఉ. ఊరక వచ్చుఁ బాటు పడకుండిననైన ఫలం బదృష్ట మే

పారఁగఁ గల్గువానికిఁ బ్రయాసము నొందిన దేవదానవుల్‌

వారలటుండఁగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెఁ గాదె సృం

గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా! 17

ఉ. ఊరక సజ్జనుండొదిఁగి యుండిననైన దురాత్మకుండు ని

ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;

చీరలు నూరుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ

జేరి చినింగిపోఁ గొఱుకు �

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

దిశానిర్దేశం!.


"ఇక్కడ కొన్నాళ్లపాటు ఉండాలని వచ్చానండీ..నేను చేసే సాధన కొరకు ఈ ప్రదేశం సరైనదని అనిపిస్తున్నది..పైగా ఇక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి వారు తన తపోసాధన చేసారు.. ఆ ప్రభావం ఈ క్షేత్రం లో ఉన్నది.." అన్నాడా పాతికేళ్ల వయసున్న యువకుడు..


అతనిని అంతకు ముందెన్నడూ చూడలేదు..ఒక కాషాయ వస్త్రాన్ని పంచె లాగా కట్టుకొని వున్నాడు..అదే రంగు చొక్కా ఉన్నది కానీ..దానిని ధరించకుండా భుజం మీద వేసుకొని వున్నాడు..నేను అతని గురించి వివరాలు ఆడిగేలోపలే..


"నేను ఇక్కడికి వచ్చి మూడురోజులవుతున్నది..ఉదయాన్నే శ్రీ స్వామివారి ప్రభాత హారతి సమయం లో మందిరం లోకి వచ్చి దర్శనం చేసుకొని..శివాలయం వద్ద చెట్ల క్రింద ధ్యానం చేసుకుంటున్నాను..నిన్నటి నుంచీ మనసులో బలంగా అనిపిస్తున్నది..ఇక్కడే కొన్నాళ్ల పాటు వుండి సాధన కొనసాగించాలని..మీరు అనుమతి ఇస్తే..కొనసాగిస్తాను.." అన్నాడు..


"ముందుగా మీ వివరాలు తెలుపండి..మీకు సౌకర్యం గా వుంటే..మీ సాధనను ఇక్కడ కొనసాగించండి..మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతుంది. అక్కడకు వెళ్లి ఆహారం తీసుకోవచ్చు..కానీ..ఒక్కమాట..మీ సాధన కు మేము ఎటువంటి ఇబ్బందీ కలిగించము..మీరు కూడా మందిర వ్యవస్థలో తలదూర్చ వద్దు.." అని చెప్పాను..


అతనిది కందుకూరు..పేరు.. నాగరాజు..కులరీత్యా యాదవులు..తల్లిదండ్రులు వున్నారు..సుమారు ఐదారేళ్ళ నుంచీ ఇతను ధ్యానం అనీ..సాధన..తపస్సు అనీ తిరుగుతున్నాడు..ఇంకా ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడలేదు అని చెప్పాడు..ఆ గురి కుదిరేదాకా ఇక్కడ ఉండాలని అతని భావన..


ఒక వారం రోజులపాటు అతనిని దగ్గరగా గమనించాను..రోజులో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడు..ఏదో ఒక సమయంలో భోజనం చేస్తున్నాడు..కానీ మరో రెండు రోజులు గడిచేసరికి..మెల్లిగా అతని చుట్టూ మనుషులు మూగడం ప్రారంభం అయింది..ప్రశ్నలు అడగడం..అతని చేత తమ జాతకాలు చూపించుకోవడం మొదలైంది..అతనూ తన సాధన ధ్యానం వదిలేసి..ఈ ప్రాపంచిక వ్యవహారాలలో కూరుకు పోతున్నాడు..


శ్రీ స్వామివారు జీవించి ఉన్న రోజులలో సాధకుల గురించి ఒక మాట చెప్పేవారు.."సాధన.. ధ్యానం..చేస్తూఉన్నప్పుడు.. కొంత కాలానికి ఆ సాధకుడి కి కొన్ని చిత్కళ లు స్వాధీనం అవుతాయి..వాటి మాయలో పడిపోయి..ఆ శక్తులను లౌకిక వ్యవహారాలకు ఉపోయోగిస్తే..తాత్కాలిక భోగాలు సమకూరుతాయి..ఆ భోగాలకు అలవాటు పడితే..ఇక ఆ సాధకుడి లక్ష్యం దెబ్బతిని..అతనొక సాధారణ మాంత్రికుడిగా మిగిలిపోతాడు.. దైవాన్ని చేరుకోలేడు.. ఇది ప్రకృతి కల్పించే మాయ పొర..ఆ వలలో పడకుండా వుండే వాడే నిజమైన అవధూత..నిజమైన సాధకుడు.." అని..ఆ మాటలు గుర్తుకొచ్చాయి..


నాలుగు రోజులు గడిచిన తరువాత..నా దగ్గరకు వచ్చాడు.."నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది.."అన్నాడు..అతని ముఖం లో ఏదో తెలియని బాధ కనబడుతున్నది..కళ్ళమ్మట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి..


"ఏమైంది?" అన్నాను..


"శ్రీ స్వామివారు స్వప్నం లో కనబడి..నన్ను గట్టిగా హెచ్చరించారు..నేను నడుస్తున్న దారి గమ్యం లేనిదనీ..దారి తప్పి తిరుగుతున్నాననీ..చెప్పారు..లేచి చూసాను..ఎవ్వరూ కనబడలేదు..కానీ ఆలోచిస్తే..ఈ మధ్య నేను చేసిన కొన్ని పనులు..నా సాధన కు ఉపయోగపడేవి కాదనిపించింది..నేనూ తప్పు చేశాను..కొందరి బాధలు పోగొడుతున్నాను అని భ్రమించాను..కానీ నేను అధోగతికి పోతున్నానని గ్రహించలేదు.." అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.."మా గురువు గారి దగ్గరకు వెళుతున్నాను..ఆయన హిమాలయాల్లో వుంటారు..ఆయన పాదాలు పట్టుకోమని స్వామివారు గట్టిగా ఆదేశించారు..వెళ్ళొస్తాను..మీకు చెప్పి వెళదామని వచ్చాను.."అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు..పశ్చాత్తాపం అతనిని దహించివేస్తున్నది..


ఆ తరువాత అతను మందిరం వద్ద నుంచి వెళ్ళిపోయాడు..కొన్నాళ్లపాటు తన గురువుగారి వద్ద వున్నాడు..ప్రస్తుతం ఆశ్రమ నిర్మించుకునే సన్నాహాల్లో వున్నాడు..మొత్తానికి శ్రీ స్వామివారు తనకు సరైన మార్గాన్ని చూపారని వినమ్రంగా చెప్పుకుంటాడు..


ఆ రకంగా నాగరాజు అనబడే ఒక సాధకుడికి స్వామివారు దిశానిర్దేశం చేసారు..అతని జీవితానికో గమ్యాన్ని నిర్దేశించారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

1, నవంబర్ 2020, ఆదివారం

మహాకాళి అమ్మవారికి భోజనం

 #మహాకాళి అమ్మవారికి భోజనం పెడుతూ లోకాన్నే మర్చిపోయే అంత భక్తి #రామకృష్ణ_పరమహంస సొంతం!!

ప్రపంచమంతటా #మోంకేశ్వరిజంపై ఆధ్యాత్మిక పరిశోధనలు జరుగుతున్నప్పుడు, భారతదేశంలో #రామకృష్ణ_పరమహంస వంటి సాధువు కాళి విగ్రహంతో సంభాషిస్తూ గంటలు గడిపేవారు ...... ప్రారంభ రోజుల్లో ప్రజలు అతన్ని పిచ్చిగా భావించారు కాని నెమ్మదిగా ప్రజలు అర్థం చేసుకున్నారు  రామకృష్ణ ఇది వంటకం లో ఇది తగ్గింది అని చెప్పడం ..కాళీ వంటలను తినడం అతని సాధారణ దినచర్య ..!  అతను ఒక ప్లేట్లో భోజనం తో ఆలయం లోకి ప్రవేశించినప్పుడు, అతను ఎప్పుడు బయటకు వెళ్ళాలో కూడా తెలియదు అంతలా అమ్మవారితో సంభాశిస్తూ ఈ లోకాన్ని మర్చిపోయేవాడు  .. 

ఒక రోజు అతని భార్య #శారద అతనిని వెతుక్కుంటూ ఆలయానికి వెళ్ళారు ....... 

భక్తులు వెళ్ళిపోయారు మరియు పరమహంస వారు లోపల కాళీ మాతకు ఆహారం అందిస్తున్నారు.. ఆలయం తలుపు పగుళ్ల నుండి వారు లోపలికి చూస్తే వారు ఆశ్చర్యపోయారు ..

సాక్షాత్ మహాకాళి రామకృష్ణ చేతుల నుండి ఆహారం తీసుకుంటున్నారు ..!  

ఆ రోజు నుండి శారద జీవితం మారిపోయింది ..!

వేలాది సంవత్సరాల క్రితం నుండే హిందువుల విగ్రహాలలో ప్రాణాలు పొసే విజ్ఞానం నాకు తెలుసు ......

శ్రద్ధ యొక్క అదృశ్య గొప్ప శాస్త్రం,మంత్ర శాస్త్రం,తంత్ర శాస్త్రం హిందూ విగ్రహాలను ఇప్పటి వరకు సజీవంగా ఉంచింది ..!

లక్ష్మణ్ శర్మ గారికి నివాళులతో అంకితం...

పరశురామ్ పరశురామ్

అన్నదానం

 🙏అన్నదానం🙏


పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. 'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. 


లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు. 


అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' 


ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. 


ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. 


ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. 


ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. 


గుమాస్తా చదవడం ప్రారంభించాడు. 


1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!


2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 


3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?


అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు. 


సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. 


ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 


1వ వాడు: అన్నదాతా సుఖీభవ!


2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి. 


3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి. 


దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. 💥అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు💥. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.


🙏 అన్నదానప్రభువే శరణం అయ్యప్ప🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఈ క్రింది సమాచారమును మీ అన్ని సమూహాలలో పోస్ట్ చేయాలని మనవి. త్వరలోనే మామిడి, నేరేడు, పనస వంటి పండ్లు మనకు దొరుకుతాయి.మీరు ఆ పండ్లు తిన్న తరువాత గింజలను పడేయవద్దు. గింజలను కడిగి మీ బైక్/కార్/సైకిల్ లో తీసుకొని వెళ్ళండి. మీరు ప్రయాణము చేస్తున్నప్పుడు హైవే చుట్టుపక్కల కానీ ఖాళీస్థలాల్లో ఈ గింజల్ని విసరండి లేదా చల్లండి. వచ్చే వర్షా కాలంలో అవి సులభంగా మొలకెత్తు తాయి. ఈ ప్రయత్నం తో మనం ఒక్కొక్కరం ఒక చెట్టు పెంచకల్గినా ప్రపంచాన్నీ కాపాడుకోనే ప్రయత్నము సఫలమవుతుంది. సతారా, రత్నగిరి (మహారాష్ట్ర) ప్రాంతాలలో ఈ పథకం ప్రవేశ పెట్టారు. ఇతర రాష్ట్రాల,జిల్లాల ప్రజలను కూడా ఇది పాటించమని విన్నపాలు చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఈ అద్భుతమైన ప్రణాళికలో పాల్గొని ప్రకృతి సంరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. మీరందరూ కూడా దీనిలో పాల్గొని మీవంతు కృషి చేస్తే మన ముందు తరాల వారికి మేలు చేసిన వాళ్ళమవుతాము.


 "వృక్షో రక్షతి రక్షితః ".


  ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ అందచేయండి🌱🌵🌾🌿🌱🌱🌱🌱🌱🌲🌳🌴🌴🌴🌴🌴


  🌹సర్వేజనా సుఖినోభవంతు 🌹

కీ.కం

 *కీ.కం.*


ఉదయం కళ్లు తెరుస్తూనే ఫోన్ చేత్తో పట్టుకుని వంటింట్లోకి వెళ్ళి పాలు స్టౌ మీద పెట్టి ఫేస్ బుక్ ఓపెన్ చేశాను.రెండు మూడు శుభోదయాలు,గుడ్ మార్నింగులూ, ముందు రోజు రాత్రి చూడని గుడ్నైట్లూ చూస్తుండగా నాకంట్లో పడి నన్నాకర్షించింది,


’చెయ్యి ఇయ్యి' గ్రూపులో ఒకావిడ పెట్టిన పోస్టు.


గబగబా ముఖం కడుక్కుని వచ్చి కాఫీ కలుపుకుని, మెల్లగా తాగుతూ పెరటి గుమ్మం మీద కూర్చుని మళ్లీ ఆ పోస్ట్ తీశాను. 


అప్పటికే పన్నెండు పదమూడు లైకులూ,

లవ్వులూ,

వావ్,

👌👌యువ్వార్ గ్రేట్,

👏👏👏

అంటూ నాలుగైదు కామెంట్లు కూడా వచ్చేశాయి.


ఇంతోటి పాతచీరా ముష్టి దానికి ఇస్తూ తీసి పెట్టిన ఫోటోకి వస్తున్న రెస్పాన్స్ చూసిన నా మనసులో ఏదో అసూయతో కూడిన బాధ.


అమాంతం కీర్తి కండూతి(కీ.కం.)తో,నేను కూడా ఏదో ఒక మంచి పని చేసేసి ఫేస్ బుక్ లో పెట్టేసి బోలెడు కీర్తి సంపాదించెయ్యాలని మనసులోనే శపధం చేసేసుకొన్నాను.


రోజంతా అదే ధ్యాస.

ఏం చెయ్యాలీ,ఎలా,ఎలా? అని.


ఆఖరికి ఒక ఆలోచన వచ్చింది.


నాలుగు వీధుల అవతల ఉన్న కామాక్షీ పీఠానికి అనుసంధానం అయిన అనాధాశ్రమం గుర్తు కొచ్చింది.


అక్కడి పిల్లలకు ఏమైనా ఇవ్వాలని అనుకున్నాను.ఏమిచ్చినా ఫోటోల్లో ఘనంగా కనిపించేలా ఉండాలని అనుకున్నాను.

 

ఒకసారి అక్కడికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి ఏంచేసేదీ ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందనిపించింది.


ఆ సాయంత్రమే అక్కడికి వెళ్లి కామాక్షీ దేవిని దర్శించుకుని,ఆశ్రమ నిర్వాహకులను కలి‌సి వివరాలు కనుక్కున్నాను.


వారు పిల్లలకు వస్తురూపంలో ఏ సహాయాన్ని అనుమతించమనీ, 


చెయ్యాలనుకుంటే వారి చదువు ఖర్చు ఇవ్వ వచ్చుననీ


లేక ఆ పిల్లలలో ఎవరినైనా ఎంచుకుని ఆ పిల్లలకు పద్ధెనిమిది సంవత్సరాలొచ్చే వరకూ ఆశ్రమంలో వారికయ్యే ఖర్చు మొత్తం భరించ వచ్చనీ


లేక ప్రభుత్వ అనుమతులతో ఎవరినైనా దత్తత కూడా తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్లవచ్చుననీ చెప్పారు.


అవన్నీ వింటూనే ఏదో కీ.కం.తో వచ్చాను గానీ నాకు అవన్నీ ఎలా సాధ్యం అనుకుంటూ,


నేను అంత పెద్ద సహాయం చేయలేననీ,ఏదైనా చిన్న మొత్తంలో అయ్యేది చెప్పాలనీ అడిగాను.


గుడిలో రోజూ జరిగే  అన్నదానానికి ఒకరికి వందరూపాయల చొప్పున ఎంత మొత్తం అయినా ఇవ్వవచ్చుననీ,భక్తులతో పాటు ఆశ్రమంలో ఉండే పిల్లలు కూడా అదే తింటారనీ చెప్పారు.


మన సంతృప్తి కోసం వడ్డనలో పాల్గొన వచ్చని కూడా చెప్పారు.అది విన్న నేను మనసులోనే ఎగిరి గంతేశాను.


ఆశ్రమంలో మొత్తం ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారుట.ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో పెట్టడానికి పదిమంది పిల్లలు చాలనుకొని, ఆ మర్నాడు మా కుటుంబం తరఫున పదిమంది పిల్లలకు భోజనాలు పెట్టమని,మేము వచ్చి,డబ్బు కట్టి,వడ్డిస్తామనీ చెప్పి ఇంటికి వచ్చాను.


దాంతో నేను నా  ఫేస్ బుక్ వాల్ మీద,

’చెయ్యి ఇయ్యి'గ్రూపులోనూ కూడా పెట్టిన ఫోటోలను చూసి లెక్కలేనన్ని లైకులూ, వందలాది ఫ్రెండ్ రిక్వెస్ట్ లువచ్చేసినట్లూ,వేలాది మంది ఫాలో అయిపోతున్నట్లూ ఊహించుకొంటూ గాల్లో తేలిపోతూ అతికష్టం మీద ఆ రోజు గడిపాను.


ఆ విషయం చెప్పి మావారిని కూడా ఆశ్రమానికి రమ్మన్నాను.మంచిపని చేస్తున్నావని మెచ్చుకొంటూనే తనకు మర్నాడు ఆఫీసులో తప్పనిసరిగా ఎటెండ్ అవ్వాల్సిన మీటింగు ఉందనీ,మా అబ్బాయిని తీసుకొని వెళ్లమనీ చెప్పారు.


మా అబ్బాయిని రమ్మంటే వాడు,

"అమ్మా, ఇలాంటి వాటికి మనం వెళ్లక్కర్లేదు.


మనం మనీ ఆన్లైన్లో కట్టెయ్యచ్చు.


అన్నీ వాళ్లే చూసుకుంటారు" అన్నాడు.


దాంతో నేను,"అది కాదురా, భోజనాలు మనం పెడుతున్నామని వాళ్లకు తెలియద్దూ?",అన్నాను.


"ఎందుకు తెలియాలి?


ఓన్లీ హెల్ప్ షుడ్ రీచ్ ద నీడీ.


అయినా మనం అలా వెళ్లి వడ్డిస్తుంటే ,ఆ పిల్లల ఇగో కూడా హర్టవుతుంది.


నేను చూడు లాస్ట్ మంత్ ,మా కాలేజి ఎన్.ఎస్.ఎస్.వాళ్లకి నా పోకెట్ మనీ నుంచి ఎనిమిది వందలు కట్టాను.అది నీకు కూడా చెప్పలేదు నేను.


హెల్ప్ ముఖ్యం కానీ ఎవరు చేశారో కాదు కదా", అనడంతో , 


నేను వాళ్లకు డబ్బు కట్టడంలో అసలు ఉద్దేశ్యం వాడికి చెప్పలేక ,


"నీకేం తెలీదురా.మనం ఇచ్చిన డబ్బు సద్వినియోగం అవుతోందో లేదో చూసుకోకుండా గుడ్డిగా దానాలు చేస్తూ పోతామా?"అని,


చివరికి డ్రైవరును తీసుకుని ఒక్కతినీ బయల్దేరాను.


నేను ఆశ్రమానికి చేరేసరికే భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


కంటి చివరనించి గమనించాను.ఐదుగురు భక్తులు టేబుల్స్ దగ్గర కూర్చుని ఉన్నారు.


పిల్లలంతా కంచం,గ్లాసు పట్టుకొని వరుసలో నిలబడి ఉన్నారు.


నేను గబగబా ఆఫీసుకి వెళ్లి వెయ్యిరూపాయలూ కట్టేసి హాల్లో వడ్డన జరిగే చోటికి చేరుకున్నాను.


అప్పటికే వడ్డన మొదలు పెట్టిన ఆయా చేతిలోంచి గరిట తీసుకొని వడ్డనకు ఉపక్రమించాను.


అంతకు ముందే నేను, వీలయినన్ని ఎక్కువ ఫోటోలు తీయాలనీ,

అలాగే కాస్త దూరం నుంచి తీస్తే చాలామంది కవర్ అవుతారనీ చెప్పి,

ప్రతీ ఫోటోలోను నన్ను ఏఏ యాంగిల్సులో ఎలా కవర్ చెయ్యాలో తగిన సూచనలు ఇచ్చి,

నా ఫోను కూడా డ్రైవరుకు ఇచ్చి ఉండడంతో, 


మధ్య మధ్యలో చిరునవ్వుతో ఆ పిల్లలను పలకరిస్తూన్నట్లు నటిస్తూ,

నా పట్టు చీర జరీ అంచు సర్దుకుంటూ పోజులిస్తున్నాను.


డ్రైవర్ టకటకా పాతిక ముప్పై వరకూ ఫోటోలు తీసేశాడు.


ఈ లోగా నాచేత డబ్బు కట్టించుకున్న ఆ ఆశ్రమపు సెక్రటరీ మా డ్రైవరు దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడి ఆ ఫోటోలు చూస్తూండడం గమనించిన నేను బేక్ గ్రౌండ్లో నన్ను కవర్ చేస్తూ,ఆయనకి కూడా రెండు మూడు ఫోటోలు తియ్యమని డ్రైవరుకు సైగ చేశాను.


అది అర్థం చేసుకొన్న డ్రైవరు  ఆయన్ని అడుగుతున్నాడు కానీ,ఆయన వద్దు వద్దంటూ మొహమాటపడి అక్కడినుంచి వెళ్లిపోయారు.


'ఏవిటో, అమాయకుడు,ఒప్పుకుంటే ఫోటోలో నాతో బాటు ఆయన్ని కూడా వేలాది మంది ఫేస్ బుక్ లో చూసేవారు.ఏం చేస్తాం,పోనీ', అనుకున్నాను.


ఈలోగా అక్కడ భోజనాలు చేస్తున్న భక్తులలో సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక జంట నన్నే చూస్తూండడం  గమనించిన నేను,


"ఏం ఫర్వాలేదు,మొహమాట పడకుండా కడుపునిండా తినండి"అని,


మీరు తింటున్న భోజనంలో కూడా నేను కట్టిన వెయ్యి రూపాయల్లో కొంత భాగం ఉంది అనుకుంటూ,


కించిత్తు గర్వంగా భావిస్తూ,

అలిసిపోయినట్లు చూస్తూ,


పక్కనే పెట్టుకున్న నా హేండ్ బాగ్ లోనుంచి రుమాలు తీసి సుతారంగా పెదవులమీద ,మెడ దగ్గర పట్టిన చెమట అద్దుకున్నాను.


ఎలాఅయితేనేం  అన్నదానకార్యక్రమం ముగిసింది.


సెక్రటరీ నన్నూ,డ్రెవరునూ కూడా భోజనం చేయమని చెప్పాడు.


మనసులో'ఛీ, ఇక్కడ నేనెలా తింటాను'అనుకుంటూనే,పైకి మాత్రం,


"ఇంటికి గెస్ట్స్ లంచ్ కి వస్తున్నారు సర్",అని సున్నితంగా చెప్పి తప్పించుకుని,


అక్కడే మెట్టు మీద డ్రైవరు చేత కారులోంచి తెప్పించుకున్న టర్కీ టవల్  పరచుకొని కూర్చుని,డ్రైవరు చేతిలోంచి నా ఫోన్ తీసుకుని గబగబా ఫోటోల కోసం వెదికాను.


ఆశ్చర్యం! ఒక్క ఫోటో కూడా లేదు.


డ్రైవర్ మెల్లగా భయపడుతూ, "ఆ సెక్రటరీ గారు పిల్లలకు ఫోటోలు తీయకూడదు,అంటూ డిలీట్ చేయించేశారమ్మా,

అక్కడికీ నేను మా అమ్మగారు పదిమందికి అన్నం పెడుతున్నారని,

మీరు చెప్పినట్లే రెండు మూడైనా ఫోటోలు అయినా ఉంచమని కూడా చెప్పాను,కానీ రూల్స్ ఒప్పుకోవన్నారమ్మా" అన్నాడు.


ఆనుకున్నదొకటీ,అయ్యిందొకటీ కావడంతో,ఖంగు తిన్న నేను ఛర్రున లేచి విసురుగా కారు వైపు నడుస్తున్నాను.


నాలుగడుగులు వేసేసరికి వెనకనుండి ఎవరో నా చీర కొంగు లాగుతున్నారనింపించి, వెనక్కి చూశాను.


అంతకు ముందు భోజనాల దగ్గర కనపడ్డ ఒక పిల్ల. 


కుడిచేతి చూపుడు వేలు బొటన వేలు కలిపి నాకొంగు లాగుతోంది.


నల్లటి దాని ముఖంలో మెరుస్తున్న తెల్లటి కళ్లు.


జారిపోతున్న స్కర్టుని ఎడంచేత్తో పైకి లాక్కుంటూ,నేను వెనక్కి చూడ్డంతో మరోసారి గట్టిగా నా చీర కొంగు లాగింది.


దాంతో నా పైటకు పెట్టుకున్న పిన్ను ఊడిపోయి పైట చెంగు పర్రున చిరిగింది. 


అంతే విసురుగా వెనక్కి తిరిగి, అసలే వెయ్యి రూపాయలు కట్టి, ఫోటోలు తీసుకుని ఫేస్ బుక్ లో పెడదామని వస్తే అంతా చెడిపోవడమే కాక,


డబ్బు కూడా వృధా అయిందని చిరాకుగా ఉన్న నేను,


ఈ పిల్ల వల్ల పద్ధెనిమిది వేల ఖరీదైన  చీర కూడా చిరగడంతో,


'ఛీచీ,ఎవరు కని పారేశారో,అనాథ వెధవలు' అనుకుంటూ అప్రయత్నంగా ఛెళ్లున దాని చెంప మీద ఒకటి వేశాను.


దాని తెల్లటి కళ్లు ఎర్రబారి కన్నీళ్లు జలజలా రాలుతుండగా వెనక్కి తిరిగి ఆశ్రమంలోకి పరుగెత్తింది.


నేను ఇంక వెనక్కి తిరిగి చూడకుండా,విసురుగా కారెక్కేసి,"పోనీ",అన్నాను.


           *****


మర్నాడు ఆశ్రమం నుంచి ఫోను.నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటూ.


'ఫోటోలు తీసుకునేందుకు అయ్యుంటుంది.

ఆ సెక్రటరీ గాడు బోడి పెత్తనం చెలాయించాడు గానీ,

తర్వాత ఆ సంగతి తెలిసి ఆశ్రమం ప్రెసిడెంట్ ఇంత గడ్డి పెట్టి ఉంటాడు.

పిలవక ఏంచేస్తారు.

ఆశ్రమాలకీ,ధర్మసత్రాలకీ ఎవరైనా వంద రూపాయలిస్తే గొప్ప ఈరోజుల్లో.


అలాంటిది నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను.

అంత డబ్బూ కట్టి ఒక ఫోటో అయినా తీసుకోనివ్వకపోతే,


ఎవడిస్తాడు వీళ్లందరినీ మేపడానికి విరాళాలూ?డబ్బులు ఊరికే వస్తాయా?',

అనుకుంటూ ఉత్సాహంగా బయల్దేరాను.


ముందురోజు జరిగిన దాని గురించి డ్రైవరు ఏమనుకున్నాడో అనిపించి నష్ట నివారణ చర్యగా,"చూశావా రాంబాబూ,నిన్న ఆ సెక్రటరీ తనకే రూల్స్ అన్నీ తెలుసన్నట్లు గొప్పగా  మాట్లాడి,నీచేత ఫోటోలు డిలీట్ చేయించేశాడా?

ఇవాళ చూడు,వాళ్లే మళ్లీ పిలిచారు",అన్నాను.


ఆశ్రమం చేరి లోపలికి ప్రవేశించిన నా దృష్టి,అక్కడ ఆఫీసు ముందు ఉన్న బోర్డు మీద పడింది.


'నిన్న దీన్ని చూడలేదే నేను?' అనుకుంటూ ఆ బోర్డు మీద వ్రాసి ఉన్న విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు చదువుతున్నాను.


అందులో కొందరు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చి ఉండడంతో బహుశా నా పేరు కూడా ఆ బోర్డు మీద వ్రాస్తారేమో అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో లోపలికి నడిచాను.


ముందురోజు నాకు వడ్డనలో సహాయం చేసిన ఆయా,  ఆశ్రమం ఆఫీసు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చింది.


ఆనీళ్లు తాగి,అక్కడే ఒక కుర్చీలో ముఖం మరో వైపుకు తిప్పుకొని కూర్చున్న సెక్రటరీని గమనించి,


'రూల్సు,రూల్సంటూ చాలా ఎక్కువ చేశాడుగా, ఇప్పుడు తెలిసి వచ్చినట్లుంది',

అనుకుంటూ ఉండగా,


అక్కడ ఉన్న నలుగురిలో ఒక పెద్దాయన

"చూడమ్మా, ఒక పూట మా ఆశ్రమంలో ఉన్న పదిమంది పిల్లల ఆకలి తీర్చిన అన్న పూర్ణ మీరు".


ఈ మాట విన్న నా మనసులోని కీ.కం.నా కళ్లలోకి మెరుపు రూపంలో తన్నుకొచ్చింది.


ఆయన కొనసాగిస్తున్నారు.

"మా ఆశ్రమపు దాతల పట్ల మాకు చాలా గౌరవం.మిమ్మల్ని అవమానించాలని కాదు కానీ నిన్న జరిగినది మీరు తెలుసుకుంటే బాగుంటుందనిపించి పిలిపించాను.

శ్రమ తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు.

ఇది చూడండి", అంటూండగా అక్కడ  కూర్చుని ఉన్న వారంతా,సెక్రటరీతో సహా ఒక్కొక్కరుగా లేచి బయటికి వెళ్లి పోయారు.


ఆయన ఆశ్రమం ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల రికార్డును అదే గదిలో ఉన్న స్క్రీన్ మీద చూపించడం మొదలు పెట్టారు.


సీసీ టీవీలో దృశ్యాలను ఒక్కొక్కటిగా చూస్తున్న నాకు చివరికొచ్చేసరికి


అక్కడే నేలలో పాతుకు పోతే బాగుండునని పిస్తోంది.


అపరాధ భావంతో తల ఎత్తలేక పోతున్నాను.


ఆ దృశ్యాలన్నీ నా మనసులో మళ్లీ మళ్లీ తిరుగుతున్నాయి.


ముందురోజు వడ్డన దగ్గర నేను హేండ్ బేగులోంచి రుమాలు తీసినపుడు దానితో బాటు కింద పడిపోయిన పది రూపాయల నోటును,


తర్వాత ఆడుకుంటూ చూసిన ఆ పిల్ల దాన్ని నాకివ్వాలని, పరుగెత్తుకుంటూ వచ్చి కారెక్క బోతున్న నా కొంగు లాగడం,


తర్వాత నేను చేసిన పని,


అది చూసి ,కళ్లనీళ్లతో ఆశ్రమంలోకి పరుగెడుతున్న ఆ పిల్లని,ఎత్తుకుని  ఆఫీసులోకి తీసుకొని వెళుతున్న ఆ భక్తుల జంటలోని అమ్మాయి,


ఒకదాని వెంట ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నాయి.


ఆ పిల్ల కుడి చేతిలో మడత పెట్టి, మూడు వేళ్లతో నొక్కి పెట్టి   తెచ్చిన,నా పది రూపాయల నోటు కారు పార్కింగ్ లోనే,తన చేతిలోంచి జారి పడిపోయింది.


ఆయన,

"ఇంకా మీరు తెలుసుకోవలసినది,ఆ పిల్ల మూగది,అందుకే మిమ్మల్ని పిలవలేక చీర కొంగు లాగింది.


మరో విషయం ఆ పిల్లని ఎత్తుకొని తీసుకు వచ్చిన అమ్మాయి ఈ ఆశ్రమంలోనే పెరిగింది.


మీలాంటి మరొకరి దయతో చదువుకొని విదేశాల్లో డాక్టరుగా పనిచేస్తోంది.


నిన్ననే ఆమె భర్తతో కలిసి వచ్చి ఈ ఆశ్రమానికి ఇరవై లక్షల విరాళం ఇచ్చింది.


ఇద్దరు పిల్లలని దత్తత తీసుకొందుకు గవర్నమెంటుకు అప్లై కూడా చేశారు.ఆ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు నెలరోజులు ఇక్కడే ఉంటుంది. 


మనవల్ల అవసరంలో ఉన్నవారికి ఏదైనా ఉపకారం జరగాలి కాని,మనకోసం వారిని ఉపయోగించుకోవాలనుకోడం మంచిది కాదు..."అంటూ


ఆయన ఇంకా ఏవేవో చెబుతున్నారు.


నా కళ్లలో నీళ్లు.


నన్నెవరో కట్టేసినట్లు కుర్చీలోంచి లేవలేక పోతున్నాను.


'తల్లీ కామాక్షీ,నాకు క్షమాపణ అడిగే శక్తినియ్యి'.అనుకుంటూ లేచి రెండు చేతులూ జోడించి అస్పష్టంగా,


"క్షమించండి సార్" అంటూ,నాలో ఉన్న కీ.కం ని అడుగడుగుకీ పాతాళంలోకి తొక్కేస్తూ, బయటికి వస్తుంటే ఒక పక్క,


ఆ వెయ్యి రూపాయల విరాళాలు ఇచ్చిన దాతల పేర్ల పక్కనే 1980 అనే సంవత్సరం కూడా వ్రాసి ఉండడం కనిపించింది. 


'నలభై సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు అంటే?... ఈరోజు…?'అనుకుంటూ,


తల వంచుకుని  బయల్దేరిన నాకు ఆశ్రమపు  తోటలోని మొక్కల మధ్యనుంచి కల్మషం లేని రెండు తెల్లటి కళ్లు,ఒక నల్లటి బుల్లి చేయి టాటా చెబుతున్నాయి.నా చెయ్యి కూడా అప్రయత్నంగా ఊగుతోంది.


- _వేటూరి పద్మ_