4, డిసెంబర్ 2020, శుక్రవారం

ధ్యానం సంబంధ 42 పుస్తకాలు(PDF)

  *రాజ యోగం/యోగ/ధ్యానం సంబంధ 42 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

42 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/rajayogam-pdf


               (OR)

           

కుండలినీ యోగ రహస్యము www.freegurukul.org/g/RajaYogam-1


యోగసర్వస్వము www.freegurukul.org/g/RajaYogam-2


ధ్యాన యోగం www.freegurukul.org/g/RajaYogam-3


యోగదర్శనము-పతంజలి యోగ సూత్రములు www.freegurukul.org/g/RajaYogam-4


పతంజలి యోగ సూత్రములు www.freegurukul.org/g/RajaYogam-5


ధ్యాన పద్ధతి www.freegurukul.org/g/RajaYogam-6


శ్వాస ధ్యానము www.freegurukul.org/g/RajaYogam-7


యోగాతత్త్వదర్శనము-1 www.freegurukul.org/g/RajaYogam-8


యోగాతత్త్వదర్శనము-2 www.freegurukul.org/g/RajaYogam-9


హఠ యోగ ప్రదీపిక www.freegurukul.org/g/RajaYogam-10


యోగ సర్వస్వము www.freegurukul.org/g/RajaYogam-11


యోగాసనాలు www.freegurukul.org/g/RajaYogam-12


శ్రీ విద్యా రహస్యము www.freegurukul.org/g/RajaYogam-13


యోగ వ్యాయామ విద్య www.freegurukul.org/g/RajaYogam-14


మాస్టర్ c.v.v గారి ఎలక్ట్రానిక్ యోగం www.freegurukul.org/g/RajaYogam-15


యోగా www.freegurukul.org/g/RajaYogam-16


శ్రీ కుండలినీ యోగశక్తి రహస్యము www.freegurukul.org/g/RajaYogam-17


యోగాసనములు యోగవిద్య www.freegurukul.org/g/RajaYogam-18


యోగ సాధన www.freegurukul.org/g/RajaYogam-19


యోగ - సత్య దర్శనము www.freegurukul.org/g/RajaYogam-20


జపము - ధ్యానము www.freegurukul.org/g/RajaYogam-21


పతంజలి యోగదర్శనము www.freegurukul.org/g/RajaYogam-22


ధ్యాన పుష్పం www.freegurukul.org/g/RajaYogam-23


యోగ ప్రసంగములు -పతంజలి యోగ సూత్రములు-3 www.freegurukul.org/g/RajaYogam-24


ప్రాణ శక్తి అమూల్యమైన విభూతి www.freegurukul.org/g/RajaYogam-25


జ్ఞాన నిధి www.freegurukul.org/g/RajaYogam-26


ధ్యానం www.freegurukul.org/g/RajaYogam-27


ధ్యానం www.freegurukul.org/g/RajaYogam-28


ప్రాణాయామము www.freegurukul.org/g/RajaYogam-29


తారకామృత పరమహంస ప్రభోదిని www.freegurukul.org/g/RajaYogam-30


ధ్యాన మార్గము www.freegurukul.org/g/RajaYogam-31


ధ్యానం చేసేది కాదు - జరిగేది www.freegurukul.org/g/RajaYogam-32


ధ్యాన పద్ధతి www.freegurukul.org/g/RajaYogam-33


ధ్యానం www.freegurukul.org/g/RajaYogam-34


యోగాసనములు-1 www.freegurukul.org/g/RajaYogam-35


యోగ www.freegurukul.org/g/RajaYogam-36


యోగాసన ప్రదీపిక www.freegurukul.org/g/RajaYogam-37


యోగాబ్యాసం www.freegurukul.org/g/RajaYogam-38


యోగ సాధన www.freegurukul.org/g/RajaYogam-39


యోగాసనములు యోగశక్తి www.freegurukul.org/g/RajaYogam-40


యోగ సంకలనము-హఠ రాజ భక్తి యోగం www.freegurukul.org/g/RajaYogam-41


యోగాభ్యాస దర్పణము www.freegurukul.org/g/RajaYogam-42



రాజ యోగం/యోగ/ధ్యానం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

*భళారే ... తెలుగు!*

 తెలుగు భాషకు గల శక్తిని వెల్లడిస్తూ ఏల్చూరి మురళీధరరావు గారు ఈ క్రింది వాక్యాన్ని ప్రకటించారు:   


“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,

రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!


పై వాక్యంలో 26 అక్షరవృద్ధి దళాలున్నాయి. మొదటి దళం ఒక అక్షరం, రెండవ దళం రెండక్షరాలు, మూడవ దళం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ దళం ఇరవై ఆరు అక్షరాలతో అక్షరవృద్ధిక్రమంలో కూర్పబడి ఉన్నాయి. 


1. ఏ

2. మంచి

3. కవైనా

4. విశ్వనాథ

5. గ్రంథావళిని

6. చదవకపోతే

7. కవిత్వరచనలో

8. పద్యనిర్మాణశక్తికి,

9. సద్గుణాలంకారవ్యక్తికి,

10. రసోచితశబ్దార్థయుక్తికి,

11. సుమకోమలభావభావనకు,

12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,

13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,

14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,

15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,

16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,

17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,

18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,

19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,

20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,

21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,

22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,

23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,

24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,

25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,

26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!  


తెలుగు భాషాభిమానుల ఆసక్తి కారణంగా ఈ వాక్యం అచిరకాలంలోనే ఫేస్ బుక్ లోనూ, అంతర్జాలంలోనూ, వాట్సాప్ మాధ్యమం ద్వారానూ, వివిధ పత్రికలలోనూ పాతికవేలకు పైగా పర్యాయాలు సంచరిస్తుండటం విశేషం!


*భళారే ... తెలుగు!*

An Amazing Sentence in English

 An Amazing Sentence in English


Remarkable indeed! The person who made this sentence must be a GENIUS in English vocabulary.


"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness.''

ఈ వాక్యంలో ఇరవై పదాలున్నాయి. ఒకటవ పదంలో ఒక అక్షరం, రెండవ పదంలో రెండు అక్షరాలు, మూడవ పదంలో మూడు అక్షరాలు, ఈ విధంగా అక్షరవృద్ధిక్రమంలో ఇరవయ్యవ పదంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి. 

దశావతారం

 

గుండ్రాయి

 గుండ్రాయి..


ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. 

"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య

"నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు.

 ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది. 

"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. 

బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో నీళ్ళు నిలబడవు కదా. 

అలాగే తీసుకొచ్చాడు.భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. 

"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు.అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. 

నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది. 

అప్పుడు బండోడు అన్నాడు... "ఒసేయ్.. గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే... కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రం పడిందికదా.. 

అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పదిరోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది" అన్నాడు. 

భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది. 


🌹నవ విధ భక్తి మార్గాల్లో "శ్రవణం" ఒకటి.

ధార్మికగీత -99*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత -99*

                                     *****

          *శ్లో:- శనై:  పంథా:  శనై:  కంథా: ౹*

                 *శనై: పర్వత లంఘనమ్ ౹*

                 *శనై ర్విద్యా  శనై ర్విత్తమ్ ౹*

                 *పంచైతాని    శనై:   శనై: ౹౹*

                                         *****

*భా:- లోకంలో చూడగానే, లేదా తలచుకోగానే, లేదా హాం ఫట్ అని  మంత్రించగానే  పనులు పూర్తిచేయగల శక్తి దేవతల్లోనో, రాక్షసుల్లోనో  ఉంటుంది. మానవ మాత్రులకు ఆ శక్తి యుక్తులు లేవు. క్రమపద్ధతిలో, నెమ్మది నెమ్మదిగా చేయవలసిందే. ఎలా?  1. "పంథా:" :- (ప్రయాణము). ఒక వ్యక్తి  దారివెంట ప్రయాణం చేయాలంటే అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవవలసిందే. వాహనమేదైనా, వేగ మేపాటి దైనా, ప్రతి కిలోమీటరు లెక్కలోకి రాలసినదే గదా! కళ్ళు మూసుకోగానే ఇక్కడివారము అక్కడ తేలము గదా! 2."కంథా:" :-( బొంత). పాత చీరలను, ధోవతులను బొంతగా  రూపుదిద్దాలంటే  సూదితో ఒక క్రమపద్ధతిలో వరుసలుగా నెమ్మదిగా, నేర్పుతో  కళాత్మకంగా కుట్టవలసిందే. వేరే మార్గం లేదు గదా! 3."పర్వతారోహణము":- ఆరోహకులు కొండల్ని ఎక్కాలంటే నెమ్మదిగా , జాగ్రత్తగా , కాలు జారకుండా ఒక్కో మెట్టుగా ఆసరా చేసుకుంటూ శిఖరాగ్రానికి ఎగప్రాకాలి.గమ్యం చేరుకోవాలి. ప్రవరునిలా పసరు పూసుకొని కొండపైకి తేలిపోలేము గదా! 4. "విద్య" :- శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, కళాత్మక విద్య యేదైనా ప్రణాళికాబద్ధంగా, క్రమంగా, సావధానంగా క్షణం క్షణంగా, అక్షర మక్షరంగా అభ్యసించవలసిందే కాని, తెల్లవారేలోపు PHD పట్టా పూర్తిచేయలేముగదా! 5."విత్తము":- చేసే పని యేదైనా అహర్నిశలు కష్టపడి, సర్వశక్తులు ఒడ్డి, అడుగడుగునా అప్రమత్తంగా పురోగమించేవాడికే  ధనార్జన సాధ్యపడుతుంది. ఒక్క సారిగా ఎవ్వడు కుబేరుడు కాలేడు  గదా! కాన పైన చెప్పబడిన 5 విషయాలలో నెమ్మది నెమ్మదిగా, క్రమశిక్షణతో, క్రమపధ్ధతితో  కార్యసాధన సాధించాలే కాని, మంత్ర తంత్రాలతో మానవునికి  త్రుటిలో   సాధ్యపడేవి కావని సారాంశము*.

                                   ***** 

                    *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము



భక్త వరదుడైన పరమాత్మ యారీతి 

యంబరంబునుండి యనగ వినియు 

సాధు దుహిత యంత సంభ్రమ మొందియు  

కదిలె పరుగు తోడ సదన మునకు        156



అంత నా కళావతియును యచట నున్న 

దివ్య మైన ప్రసాదంబు తినిన పిదప 

సత్యదేవుని మనమందు తలుచు కొనుచు 

కదలి వచ్చెను వెనుకకు కడలి కడకు   157



అప్పుడే సత్య దేవుని యాజ్ఞ వలన 

పడవ సంద్రంబు నుండియు పైకి లేచె 

చూచి యల్లుని నౌకలో సుఖముగుంట 

పొంగె సాధువు యాతనిపుత్రి యపుడు   158



కాంతుండు యారీతి కడలి నుండియు రాగ 

           సతి కళావతి యంత సంత సిల్లె 

తండ్రితో పలికెను తరలంగ గృహముకు 

           సత్యదేవుని జూడ సత్వరంబు 

అంతట సాధువు యానందమొందియు 

           శ్రీసత్యవ్రతమట చేయ దలచె 

యదివిని యందఱు యానంద డెందాన 

          పలికిరి సరియంచు భక్తి తోడ 


సాధు వంతట యత్యంత సంబరమున 

బంధు మిత్రుల తోడను పరిజనులతొ 

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

భక్తితో జేసె  నచ్చటే పరవశమున      159


దివ్యమైన ప్రసాదంబు తీర్థజలము 

యందఱికి భక్తి తోడను యంద జేసి 

సతియు కూతురు యల్లుడు సంపదలతొ 

సంతసంబున వెడలెను సదనమునకు   160


నాటి నుండియు వణిజుండు నయముగాను 

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

దివ్య పౌర్ణమి సంక్రాంతి దినములందు 

సకల విధ్యుక్త రీతిన సల్పుచుండె       161


బ్రతికి నన్నాళ్లు యారీతి వ్రతము జేసి 

పొందె సుఖశాంతి సంపదల్ పుడమి పైన 

అవ్య యానంద సౌఖ్యంబు లనుభవించి 

సాధు వంత్యంబునం జేరె సత్యపురము "   162


సూతు డారీతి సాధువు పూతచరిత 

శౌనకాదిగ గల్గిన సంయములకు 

తీరుగా భక్తి తోడను తెలియ పరచ 

తన్మయత్వంబునను వారు సంతసిలిరి     163


                 నాల్గవ అధ్యాయము 

                        సమాప్తము 

                                           సశేషము…..


✍️ గోపాలుని మధుసూదన రావు🙏

సందేహము పడకూడదు

 *🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴 " ఈ సకల చరాచర జగత్తులో మీరు నమ్మదగిన,  ఆశ్రయించవలసినది భగవంతుడినే . మీరు తెలుసుకోవలసినది ఏదైనా ఉందంటే అది భగవత్ తత్వమే. భగవంతుడు మీకు అత్యంత సన్నిహితుడు, నిజ బంధువు. మీరు చిత్తుద్ధితో చేసే ప్రార్థనలను ఎన్నటికీ వృథా పోనియడు. అయితే దీనికి కొంచం సమయం పడుతుంది .అంతవరకు మీరు సహనము వహించాలి. విశ్వాసము విడువకూడదు. ఈ ఆలస్యం కూడానూ మీకు మంచినే చేస్తుంది తప్ప కీడు చేయలేదు. మీరు మీ భారమును దేవునిపై వేసినపుడు సందేహము పడకూడదు. చీకటి ఉన్నచోట వెలుగు ఏ విధముగా ఉండదో అలానే సందేహం ఉన్నచోట దేవుని ఆశీర్వాదములు కలుగలేవు. కనుక దైవమును విశ్వసించండి. ప్రేమించండి, ప్రార్థించండి, ఆశ్రయించండి. సందేహ పడకండి. మీ సకల  భారము ఆయనే స్వయంగా చూసుకుంటాడన్న నిశ్చయంతో ఉండండి. భయము చెందకండి.. "🌴_*

పరమార్ధం ఆవిర్భవిస్తోంది

 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!


పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.!


భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!


సహజీవనాన్ని సంసారమంటున్నారు.!


గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!


డూప్ ల పోరాటాన్నిహీరోయిజం అంటున్నారు.!


పదవుల పోరాటాన్నిప్రజాస్వామ్యమంటున్నారు


అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!


ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!


సరదాలను సంస్కృతి అంటున్నారు.!


భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!


కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!


ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!


మందు పోయిస్తేనే...మిత్రుడు అంటున్నారు.!


కట్నం తెస్తేనే...భార్య అంటున్నారు.!


సొమ్ములు తెస్తేనే...సంసారం అంటున్నారు.!


కాసులు తెస్తేనే...కాపురం అంటున్నారు.!


అవినీతి చేయకపోతే... అసమర్ధుడంటున్నారు.!


అక్రమాలు చేయకపోతే... అమాయకుడంటున్నారు.!


అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చినవాడంటున్నారు.!


నిజం పలికితే...బ్రతక నేర్వని వాడంటున్నారు.!


న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!


అన్యాయంగా బ్రతికితే...ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!


అన్యాయాన్ని ఎదిరిస్తే...అతనికెందుకు అంటున్నారు.!


నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!


మాయకమ్మిన జీవితాన్నిశాశ్వతమనుకుంటున్నారు.!


మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!


పరిస్థితులకనుగుణంగా..పాత అర్ధం చెరిగిపోయి

ప్రయోజనాలకు అండగా...పరమార్ధం ఆవిర్భవిస్తోంది!


స్వార్ధకాంక్షాణుగుణంగా విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది!

. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 34  / Sri Devi Mahatyam - Durga Saptasati - 34 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 10*

*🌻. శుంభ వధ - 1 🌻*


1-3. ఋషి పలికెను : ప్రాణసమానుడైన తమ్ముడు నిశుంభుడు వధింపబడడం, సైన్యం రూపుమాప బడడం చూసి శుంభుడు క్రోధంతో ఇట్లనెను : "ఓ దుర్గా! బలగర్వంతో క్రొవ్విన నీవు ఆ గర్వాన్ని (నా వద్ద) చూపకు, ఎంత గొప్పదానవని అనుకున్నా నీవు ఇతరుల బలంపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు.


4-5. దేవి పలికెను : నేను ఈ లోకంలో ఒంటరి దాననే అయి ఉన్నాను. నేను కాక మటెవ్వరు ఉన్నారు? ఓ దుష్టుడా! నాశకులైన వీరు నాలోనికి ప్రవేశించడాన్ని చూడు.


6. అంతట బ్రహ్మాణి మొదలైనవారు (మాతృకలు) అందరూ దేవి శరీరంలో లీనమయ్యారు. అంబిక ఒక్కరిత మాత్రమే ఉంది.


7–8. అంతట దేవి పలికెను : నా శక్తిచే నేనిక్కడ నా నుండి వ్యక్తమైన రూపాల నన్నింటిని నేను మళ్ళీ ఉపసంహరించుకున్నాను. నేను ఒక్కదానిని మాత్రమే నిలిచివున్నాను. యుద్ధంలో స్థిరంగా ఉండు.


9-10. ఋషి పలికెను : ఆ ఇరువురికీ (దేవీశుంభులకు) ఘోర యుద్ధం ప్రారంభించారు. దేవాసురులందరూ చూస్తున్నారు.


11. బాణవర్షం కురిపిస్తూ, వాడి శస్త్రాలను, దారుణాస్త్రాలను ప్రయోగించుకుంటూ, వారిరువురూ మళ్ళీ సర్వలోక భయంకరంగా యద్ధం చేసారు.


12. అంబిక వందల కొద్దీ వేసిన దివ్యాస్త్రాలను ఆ రక్కసుల తేడు వాటికి మారుదెబ్బవైయగల అస్త్రాలతో త్రుంచివేసాడు.


13. అతడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భయంకరంగా హుంకరించడం మొదలైన కార్యాలచే పరమేశ్వరి అవలీలగా ఖండించింది.


14. అంతట ఆ రాక్షసుడు వందల కొద్దీ బాణాలతో దేవిని కప్పివేసాడు. దేవి కినుక పూని తన బాణాలతో అతని వింటిని ఛేదించింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹