11, ఫిబ్రవరి 2025, మంగళవారం

RSS అంటే

 RSS అంటే ఏమిటి???

ఇందులోనే ఎందుకు చేరాలి🤔???



ఆర్ఎస్ఎస్ అంటే నవభారత నిర్మాణానికి పునాది వేసి, విదేశీ శక్తులకు లొంగకుండా, స్వధర్మాన్ని అవలంబిస్తు, అంతర్గత శత్రువులను అధిగమిస్తు, ప్రపంచానికి భారతదేశ శక్తిని పరిచయం చేస్తు, దేశ గౌరవ ప్రతిష్టలకు రక్షణగా నిలబడుతు... 100 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ.


👉 ఒక ఏడాది పాటు ప్రతిరోజు శాఖకు వెళితే... 👇 ఈ క్రింది విషయాలు (లక్షణాలు) మీకు పుష్కలంగా లభిస్తాయి.


1. ఆదర్శవంతమైన వ్యక్తులను పరిచయం చేస్తుంది.

2. అద్భుతమైన స్నేహితులను అందిస్తుంది.

3. భయం & బిడియం పోతాయి.

4. ఉత్తమ క్రమశిక్షణ ప్రారంభించబడుతుంది.

5. అందర్నీ కలుపుకుపోయే స్వభావం ఏర్పడుతుంది.

6. నిస్వార్ధమైన సేవ అలవడుతుంది.

7. దేశభక్తి పెంపొందుతుంది.

8. "నాది" అని కాకుండా "మనది" అనే స్వభావం ఏర్పడుతుంది.

9. జాతీయ భావాలను పెంపొందిస్తుంది.

10. నాయకత్వ లక్షణాలను ఇనుమడింపజేస్తుంది.

11. నీ బలం ఏమిటో.. నీకు ప్రతిబింబిస్తుంది.

12. ఆదర్శవంతమైన నిజ చరిత్రను తెలియజేస్తుంది.

13. సమాజానికి నీ అవసరం ఏమిటో గుర్తిస్తుంది.

14. నీకు బలాన్నిస్తూ.. సమాజంలో శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది.

15. అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.

16. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైన ఆలోచనలు స్పురిస్తాయి.

17. ఓర్పు, నేర్పుతో పాటు పట్టుదల అలవడతాయి.

18. సంవత్సరం తర్వాత నిన్ను నీకు పరిచయం చేస్తుంది.

19. నిన్ను,  "నీవేమిటో" నిరూపించుకోగలిగే సరియైన వేదిక ఆర్ ఎస్ ఎస్

20. చివరగా ఈ జన్మకు సార్ధకత ఏమిటో అవకతమవుతుంది.


ముఖ్య గమనిక:


👉 ప్రస్తుత సమాజంలో.. ఒక ఉన్నతమైన, ఆదర్శమైన వ్యక్తిగా ఎదగడానికి ☝️ పై లక్షణాలు... ఇక్కడ తప్ప., మార్కెట్లో ఎక్కడ లభ్యం కావు... గుర్తుంచుకోండి ఆత్మ స్వరూపులార!🙏🏻!!


సర్వేజనా సుఖినోభవంతు,

ఓం శాంతి శాంతి శాంతిః,

భారత్ మాతాకీ జై,

జైహింద్.🚩

శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే

గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః (11)


న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః 

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ (12)


అర్జునా.. దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతునావు. చచ్చిపోయినవాళ్ళ గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు. నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో కూడా వుంటాము.

🏵️ఆపదకి సంపద నచ్చదు..

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏            🏵️ఆపదకి సంపద నచ్చదు..సంపదకు బంధం నచ్చదు..బందానికి బాధ నచ్చదు.. బాధకు బ్రతుకు నచ్చదు.. బ్రతుకుకి చావు నచ్చదు.. చావుకి పుట్టుక నచ్చదు.. కానీ మనిషి అయిన తరువాత అన్నీ అనుభవించాలి🏵️ఏ ప్రాణిని చంపకూడదు..ఆ ప్రాణి లోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి.. అలాగే దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతీ మనిషి మంచివాడే..మన మనసులో అత్యంత విలువైన స్థానాన్ని మనమే జీవితం అనుకునే వాళ్లకు మాత్రమే ఇవ్వాలి.. లేకపోతే ఆది విలువ లేనిదై పోతుంది🏵️విలువ లేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంటిలో పడి విలవిల లాడేలా చేస్తుంది.. అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా చాలా సార్లు వారి మాటలతో బాధ పెడతారు..సంబంధాలను కొనసాగించడానికి కొన్ని సార్లు అంధులుగా,కొన్ని సార్లు చెవిటిగా, మరికొన్ని సార్లు మూగగా ఉండవలసి వస్తుంది🏵️🏵️మీ  *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్  D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం..

 🎻🌹🙏శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం.. చిత్తూరు జిల్లా..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿 శ్రీరాముని ప్రధమభక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణములతో ముడిపడిన పురాతన మరియు ప్రశస్తమైన ఆలయములలో అర్ధగిరి ఆంజనేయుని ఆలయం ప్రధమంగా చెప్పబడుతునది. 


🌸ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన కాణిపాకం స్వయంభూః వరసిద్ధి వినాయకుడు ఆలయం నుండి 13 కి.మీ దూరంలో ఉంది. అరగొండ అను గ్రామమువద్ద కొండపై అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది  


🌹పురాణ కథ చరిత్ర 🌹


🌿 ఈ అర్థగిరి క్షేత్ర ఆవిర్భావం వెనక కమనీయమైన, రసరమణీయమైన రామాయణగాథ చరిత్రగా చెప్పబడుతుంది. అదేమిటంటే త్రేతాయుగ కాలంలో రామ-రావణుల మధ్య సంగ్రామం జరుగుతుండగా, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చబోతాడు. 


🌸లక్ష్మణుడిని మేలుకొలపడానికి సంజీవిని అనే ఔషధం  అవసరమైంది. 

అంతే, సంజీవిని తీసుకురావడానికి శ్రీరామభక్తుడైన  ఆంజనేయుడు 'జైశ్రీరామ్' అంటూ వాయు వేగంతో ఆకాశంలోకి లంఘించాడు. 


🌿సంజీవని ఆ పర్వతంపై ఎక్కడుందో కనుగొనలేక పర్వతాన్నే ఏకంగా పెకలించి, తన అరచేతులపై తీసుకుని వస్తుండగా, ఔషదులతో కూడిన ద్రోణగిరి పర్వతమును తీసుకొనివచ్చు ఆంజనేయుని చూచిన శ్రీరాముని సోదరుడైన భరతుడు చీకటిసమయం ఆగుటవలన తమకు హానిచేయుటకు రాక్షసులు పర్వతము తెచ్చుచున్నారని భావించి హనుమంతునిపై బాణము వేయగా ద్రోణగిరి పర్వతములో  సగభాగం విరిగి పెళ పెళరావంతో నేలమీద పడింది.


🌸ఆ కొండ పడిన ప్రాంతమే అర్థగిరి. 

ఆ ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది.

ఆ గ్రామమే అరకొండగా, కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని ఎందరో భాగవతుల కథనం, స్థలపురాణం.


🌿ఇక్కడ స్వామి  ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు. మిగతా ఆలయములలో వలె కాక ఈ ఆలయములో విలక్షణముగా హనుమంతుని విగ్రహం ఉత్తరంవైపు ఉంటుంది.. ఆలయప్రాంగణంలో కల కోనేటినీటిలో దివ్యఔషధగుణాలు ఉన్నాయని విశ్వాసం.


🌸అందువలన ఈ కోనేటిని  సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. కోనేటినందలి నీటిని తమ శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో అతి ముఖ్యమైనదిగా పరిగణించబడు ఈపురాతన ఆలయానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామిని భక్తితో ప్రార్థిస్తారు.


🌿పౌర్ణమిరోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు. అందువలన పౌర్ణమిరోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడు సౌమ్యుడు. భక్తులు తమలపాకులు మరియు తులసిదళములతో కూర్చిన దండలను స్వామికి అలంకరించడానికి సమర్పించవచ్చు. 


🌸ఆంజనేయుడు 'శ్రీరామ జయం' అనే పవిత్ర పదాలతో కూర్చినదండతో అమిత ఆనందం పొందుతాడు. భక్తులు ఆంజనేయుడు ఇష్టపడే శ్రీరామనామం జపించడంద్వారా శ్రీరాముని మరియు ఆంజనేయుని ఒకేసారి తృప్తిపరచవచ్చు.  


🌿ఆలయము ఉదయం 5 గం నుండి మధ్యాహ్నం 1-30 వరకు తిరిగి 2 గం.నుండి 8-00 వరకు తెరచిఉంటుంది.


🌹 మహిమాన్వితమైన  “సంజీవరాయ పుష్కరిణీ” (కొలను) : 


 🌸ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి  ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందుతూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. క్షేత్రం, పుష్కరిణీలు త్రేతాయుగం నాటివైనా, గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలున్న ఈ క్షేత్రంలో ఎందరో యోగులూ, మహర్షులు తపస్సు చేసిన గుహలు మనకు విస్మయాన్ని కలిగిస్తాయి. 


🌿వనమూలికల ప్రభావంచే సహజంగా ఉద్భవించిన సంజీవరాయ పుష్కరిణీ తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాక మనో వాంఛలు కూడా నెరవేరుతున్నాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. 


🌸ప్రతి నెలా పవిత్రమైన పౌర్ణమి రోజున విశేష పూజలు, భజనలు, హరికథలతో క్షేత్ర, భక్తి పారవశ్యంతో హోరెత్తుతూ భక్తాదులను విశేషంగా ఆలరిస్తోంది.


🌿ఇప్పటికినీ సుదూర ప్రాంతములనుండి భక్తులు ఇచటగల కొనేరునుండి ఔషదగుణములున్న నీరు సేకరించుటకు వచ్చేదరు. ఈప్రాంతం పరిసరములలోని ఇతర ప్రదేశాలన్నిటిలోనూ ఈ కొలనునందు మాత్రమే నీరు తీయగాఉంటుంది. 

ఈ పర్వతంనందలి మట్టి అనేక ఔషధగుణములు కలిగి అన్ని రకాల చర్మ రుగ్మతలను పోగొడుతుందని నమ్మకం. 


🌸కొలనులోని నీరు పర్వతమునందలి వివిధ మార్గములనుండి అనేక ఔషదమొక్కలను తాకుచూ ప్రవహించి ఈకొలనును చేరుతుంది.  మృతసంజీవనీ ఔషధపుమొక్క ఇచ్ఛటి కొనేరునందు పడినదని ఈ కోనేటికి చేరునీరు వేలసంవత్సరాలు గడచినను,ఇప్పటికీ మానవజాతికి సంక్రమించు దాదాపు అన్ని వ్యాధులను నయం చేయగల ఔషధ నాణ్యతను కలిగి ఉంది అని నమ్మకం. 


🌿టి.బి., ఆస్తమా, క్యాన్సర్ మరియు  కీళ్లనొప్పులు వంటి తీవ్రమైన వ్యాధులను నయంచేసే శక్తి దీనికి ఉందని ప్రసిద్ధి. ఈ నీరు బద్ధకం, అలసట మరియు శారీరక రుగ్మతలు పోగొట్టి  శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం .


🌸పుష్కరిణిలోని నీటిని భక్తులు 40 రోజులపాటు సేవించి, పక్కనే ఉన్న ఆంజనేయస్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం... స్వస్తి..🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మాఘ పురాణం🏞️ - 13 వ అధ్యాయము*_

 _*🔱మాఘ పురాణం🏞️ - 13 వ అధ్యాయము*_ 


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*🌅🛕📚TVBC📚🛕🌅*

************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚


*రాజా ! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను , ఉన్నతములగు వృక్షములతోను , పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి అవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.*


కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ ! నీవెవరవు ? నీకీ పరిస్థితియేమి ? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా ! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను , ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన , దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క , గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన , నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.


సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా ! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే , వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.


సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని , కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక , పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నొంది పుణ్యలోకముల నందుదురు. 


స్నానము యేడు విధములు. అవి ,


*🏞️మంత్రములను చదువుచు చేయు స్నానము , మంత్రస్నానము.*


*🏞️మట్టిని రాచుకొని చేయు స్నానము , మృత్తికాస్నానము.*


*🏞️భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము , ఆగ్నేయస్నానము.*


*🏞️గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము , వాయవ్యస్నానము.*


*🏞️నదులు , చెరువులు మున్నగువానిలో చేయు స్నానము , వరుణ స్నానము.*


*🏞️ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము , దివ్యస్నానము.*


*🏞️మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము , మానసస్నానము.*


*🏞️ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు , వృద్ధులు , రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును , జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.*


*🏞️స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము , ఉమ్ము , ఆవలింత , మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని , పసుపు , కుంకుమ , ఫలములు , పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట , జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి , ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను , ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను , నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును , పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.*


*🏞️స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని , గంగను , దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా , యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి , ఏకాదశి , శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును.*


 అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను , దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును , పూజాదులను నిర్వహించెను.


 *🏞️స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.*

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*


*🌈స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః*

     *🌎గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం *🪐లోకాఃసమస్తాఃసుఖినోభవంతు*||*

🕉️🌎🕉️🌎🕉️🌎🕉️

*🌈సర్వేజనాః సుఖినోభవంతు*

🙏🌼🙏🌼🙏🌼🙏

*శుభమ్ భూయాత్*

తిరువంచికులం మహదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 1017


⚜ కేరళ  : కొడంగల్లూర్‌ - త్రిస్సూర్


⚜ తిరువంచికులం మహదేవ ఆలయం



💠 భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో కొడంగల్లూర్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయంలో  శివుడునీ మహాదేవుడిగానూ, అతని భార్య పార్వతిని ఉమాదేవిగానూ పూజిస్తారు. ఈ ఆలయంలో 33 ఉప దేవతలు ఉన్నాయి


💠 కేరళ సంప్రదాయ పురాణ రాజు చేరమాన్ పెరుమాళ్ ఈ ఆలయ ప్రాంగణం నుండి తన సహచరుడైన శైవ సన్యాసి సుందరమూర్తి నాయనార్‌తో కలిసి 'కైలాసానికి' వెళ్లినట్లు నమ్ముతారు. 


💠 ఈ దేవాలయం పండుగ రోజులలో మినహా అన్ని రోజులలో ఉదయం 4 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4- నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. 

ఆలయంలో 4 రోజువారీ ఆచారాలు మరియు 3 వార్షిక ఉత్సవాలు జరుగుతాయి, వీటిలో 8 రోజుల మహాశివరాత్రి ఉత్సవాలు మలయాళ నెల కుంభం ( ఫిబ్రవరి - మార్చి ) అత్యంత ప్రముఖమైనవి. 


🔆 చరిత్ర


💠 కేరళలో ఉన్న ఏకైక తేవారం పాదల్ పెట్ర శివస్థలం ఇదే. నలుగురు శైవ ఆచార్యులలో ఒకరైన సుందర మూర్తి నాయనార్ (తమిళంలో సుందరార్ అని కూడా పిలుస్తారు) పాడిన తేవారం శ్లోకాలలో ఈ ఆలయం చరిత్రలో పురాతన ప్రస్తావనను కలిగి ఉంది . ఆలయ ప్రాంగణంలో సుందర మూర్తి నాయనార్ మరియు చేరమాన్ పెరుమాళ్ నాయనార్ చిత్రాలను కూడా చూడవచ్చు. 


💠 ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన శివాలయాలలో ఒకటి , ఇక్కడ శివుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడని చెబుతారు. 

ఇక్కడ నుండి, సుందర మూర్తి నాయనార్ ఆది స్వాతి రోజున (జూలై/ఆగస్టు) శివుడు పంపిన తెల్ల ఏనుగుపై కూర్చొని కైలాసానికి చేరుకున్నారు. అతనిని సెరమాన్ పెరుమాళ్ నాయనార్ గుర్రంపై అనుసరించారు. కైలాసానికి వెళ్ళేటప్పుడు, సుందర మూర్తి నాయనార్ ఒక పాధిగం పాడారు, దానిని అతని అభ్యర్థన మేరకు తిరువంచికులం తిరిగి పంపారు. ఈ ఆలయం తమిళనాడులోని చిదంబరం దేవాలయంతో ముడిపడి ఉంది .


💠 విష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు తన తల్లి రేణుకను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని పూజించిన ఆలయం ఇది అని నమ్ముతారు 


💠 తిరువంచికుళం శివాలయం అనేక దండయాత్రలను చూసింది. 

మైసూర్ టిప్పు సుల్తాన్ సైన్యం మరియు డచ్ వారి దండయాత్ర సమయంలో ఇది పూర్తిగా ధ్వంసమైంది.

టిప్పు సుల్తాన్ మైసూర్‌ను దక్షిణ దిశగా విస్తరిస్తున్నప్పుడు తిరువంచికులం శివాలయానికి తీవ్ర నష్టం కలిగించాడు. అతని సైనికులు 18వ శతాబ్దం ప్రారంభంలో ఆలయం నుండి విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు మరియు దాని శిల్పాలను ధ్వంసం చేశారు.


💠 చేరా వంశానికి చెందిన గొప్ప రాజు చేరమాన్ పెరుమాళ్ తిరువంచికులం శివాలయాన్ని నిర్మించి 1801లో పునరుద్ధరించాడు.


💠 ప్రధాన పూజా విగ్రహం, శివలింగం, దక్షిణ భారతదేశంలోని శివునికి అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన చిదంబరం ఆలయం నుండి తీసుకురాబడిందని నమ్ముతారు.


💠 తిరువంచికుళం శివాలయం యొక్క వాస్తుశిల్పం మూడు అంతస్తుల ద్వార గోపురం తిరువంచికుళం శివాలయానికి తూర్పు వైపున, ఆలయానికి భక్తుల ప్రవేశ ద్వారం. 

సందర్శకులు ఆలయ ప్రవేశ ద్వారం ఎడమ వైపున శివుడు మరియు పార్వతి రాతి చెక్కడం చూడవచ్చు. 


💠 గర్భగుడి, ముఖ మండపం మరియు నమస్కార మండపం రాగి రేకుతో కప్పబడి ఉంటాయి.

 16 స్తంభాలతో కూడిన నమస్కార మండపం ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఇది గర్భగుడి ముందు ఉన్నది.


💠 గర్భగుడిలో తూర్పు దిశలో స్వయంభూ లింగం ఉంది. 

ఇది 4 అంగుళాల పొడవు, 12 అంగుళాల వ్యాసం మరియు అర్ధ వృత్తాకార రూపంలో ఉంటుంది.


💠 తిరువంచికులం శివాలయంలో కేరళలో అత్యధిక సంఖ్యలో ఉప దేవతలు ఉన్నారు. 

మహాదేవుడు ఇక్కడ వివిధ రూపాలలో వర్ణించబడ్డాడు.

అరుదైన ఈ ఆలయంలో శివపార్వతుల విగ్రహాలను వేర్వేరుగా వేర్వేరు గర్భాలయాల్లో ఉంచారు.


💠 వినాయకుడు, చేరమాన్ పెరుమాళ్, సుందరమూర్తి నాయనార్, అయ్యప్ప, సతీదేవి, దుర్గాదేవి, సప్తమాతృక్కల్, నంది, హనుమాన్, నాగరాజ, నాగయక్షి, విష్ణువులకు ఇక్కడ ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. భక్తులు నందిని (శివుని వాహనం) తాకడానికి అనుమతించబడరు మరియు పూజారులు దానిని శుభ్రపరచడానికి మాత్రమే తాకగలరు. 


💠 ఆలయ పూజారులు పండుగల సమయంలో మరియు రోజువారీగా పూజ (ఆచారాలు) నిర్వహిస్తారు. ఆలయ ఆచారాలు రోజుకు నాలుగు సార్లు జరుగుతాయి; ఉదయం 8:00 గంటలకు కాళశాంతి , 12:00 గంటలకు ఉచ్చికాలం మరియు సాయంత్రం 6:00 గంటలకు సాయరక్షాయ్ సోమవారం మరియు శుక్రవారం వంటి వారోత్సవాలు, ప్రదోషం వంటి పక్షం ఆచారాలు మరియు అమావాస్య వంటి మాస పండుగలు ఉన్నాయి. , కిరుతిగై , పౌర్ణమి మరియు శతుర్థి . 

మలయాళ నెల ఎడవం (మే - జూన్)లో జరిగే బ్రహ్మోత్సవం ఈ దేవాలయంలో జరిగే అతి ముఖ్యమైన పండుగ.


💠 ఈ నగరం కొచ్చి (35 కి.మీ), త్రిస్సూర్ (38 కి.మీ) మరియు గురువాయూర్ (45 కి.మీ)


రచన

©️ Santosh Kumar

13-23-గీతా మకరందము

 13-23-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఉపద్రష్టానుమన్తా  చ 

భర్తా భోక్తా మహేశ్వరః | 

పరమాత్మేతి చాప్యుక్తో 

దేహేఽస్మిన్ పురుషః పరః || 


తాత్పర్యము:- పురుషుడు (ఆత్మ) ఈ శరీరమందున్నప్పటికిని శరీరముకంటె వేఱైనవాడును, సాక్షి భూతుడును, అనుమతించువాడును, భరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును (గొప్పప్రభువు, నియామకుడును), పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- 'ఉపద్రష్టా’ యజ్ఞమునందు 'ఉపద్రష్ట’ అనువాడు సాక్షిమాత్రుడుగ నుండును. అట్లే ఆత్మ శరీరమందున్నను 'పరః’ - శరీరముకంటె వేఱుగ, పరముగనున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగ వెలయుచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగ అట్టి పరమాత్మస్వరూపుడే యనియు దేహేంద్రియాదులుకాదనియు లెస్సగ భావనచేయవలెను.

‘మహేశ్వరః, పరమాత్మా దేహేఽస్మిన్’ - అని చెప్పబడినందువలన జగన్నాథుడైన పరమేశ్వరుడు, పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ భగవానుడు జీవునకు అతిసమీపమున నుండుటవలన ప్రయత్నముచే సులభముగ పొందగలడు. వారికై దూరదూరములందు ప్రయాసపడి వెతుకనక్కఱ లేదు. మఱియు శిక్షించువాడు, శాసించువాడు, (ఈశ్వరుడు) చెంతనేయుండుట వలన పాపులివ్విషయమును గమనించి పాపకృత్యము లెవ్వియు చేయకనుండవలెను.


'పరః' - అని చెప్పుటవలన ఆత్మ దేహముతో, ఉపాధితో, సంబంధములేక దానికి పరముగా వేఱుగ, అతీతముగ నున్నదని తెలియుచున్నది.

 ‘పరః పురుషః’ - అను పదములకు పరమపురుషుడు, పరమాత్మ అనియు అర్థము చెప్పవచ్చును.


ప్రశ్న:- పరమాత్మ యెట్టివాడు?

ఉత్తరము:- (1) శరీరమందున్నను, శరీరముకంటె వేఱుగనున్నవాడును, (2) సాక్షిభూతుడును, (3)అనుమతించువాడును, (4) భరించువాడును, (5) అనుభవించువాడును, (6) గొప్పనియామకుడును, (పరమేశ్వరుడును) అయియున్నాడు.

తిరుమల సర్వస్వం-146*

 తిరుమల సర్వస్వం-146* 

   

           *తొండమాన్ చక్రవర్తి -1*


 *తొండమాన్ చక్రవర్తి* 


 మనం వివిధ ప్రకరణాలలో ఇంతవరకూ ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు పద్మావతీపరిణయం లో ముఖ్య భూమిక వహించటం; శ్రీనివాసుని ఆనతిపై ఆనందనిలయం నిర్మాణం కావించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు శాశ్వతంగా తిరుమల క్షేత్రం మీద కొలువై ఉండటానికి కారణభూతుడు అవ్వటం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అయితే, ఈ భక్తశిఖామణికి ఎంతో విశిష్టమైన వృత్తాంతం ఉంది.


 *శ్రీతీర్థం – భూతీర్థం* 


 కృతయుగంలో ముల్లోక పర్యటనలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతుడై భూలోకానికేతెంచిన శ్రీమహావిష్ణువు, ఆనాడు క్రీడాద్రిగా పిలువబడే, నేటి వెంకటాద్రి పర్వతం పైనున్న ప్రకృతి సోయగానికి ముగ్ధుడై కొంతకాలం అక్కడే విహరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువుకు కావలసిన భోజనాదుల నిమిత్తం, ఆ పర్వతశిఖరంపై దేవేరులిద్దరూ చెరొక తీర్థాన్ని (బావులను) ఏర్పాటు చేశారు. శ్రీదేవి ఏర్పరచిన తీర్థం *'శ్రీతీర్థం"* గానూ, అలాగే భూదేవి ద్వారా ఏర్పాటు చేయబడ్డ తీర్థం *"భూతీర్థం"* గానూ ప్రసిద్ధికెక్కాయి. కాలాంతరాన, కలియుగారంభం నాటికి ఈ రెండు తీర్థాలు శిథిలమై పోయాయి. తన ప్రియసఖుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ తీర్థాలను ఎంతగానో ఇష్టపడే విష్ణుమూర్తి, వాటిని ఎలాగైనా పునరుద్ధరింప చేయాలని సంకల్పించి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడు.


 *సద్భాహ్మణుడు - శూద్ర భక్తుడు* 


 ఇదిలా ఉండగా, కలియుగారంభం నందు చోళరాజ్యంలోని హరిద్రానదీ తీరాన ఉన్న కృష్ణ క్షేత్రమనే గ్రామంలో, శ్రీకృష్ణునికి పరమభక్తుడైన వైఖానసుడనే సద్ర్బహ్మణుడు భగవత్సాక్షాత్కారం కోసం కఠోరమైన తపమాచరించాడు. అతని నిష్ఠాగరిష్టతకు ప్రీతి చెందిన శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోవలసిందిగా ఆదేశించాడు. అందుకు వైఖానసుడు భౌతిక సంపదలను కోరుకోకుండా; తనకు మోక్షాన్ని ప్రసాదించమని, ఎల్లవేళల శ్రీకృష్ణుని రూపంలో తన పూజలు స్వీకరించమని కోరుకున్నాడు. 


‌ అతని నిస్వార్థభక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, తాను వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసునిగా స్వయంవ్యక్తమై ఉన్నానని; అతను కోరుకున్నట్లే నిత్యము ఆ శ్రీనివాసుణ్ణి సేవించి తరించవచ్చునని వరమిచ్చాడు. అంతే గాకుండా ఇకనుండి వైఖానసుడే *"గోపీనాథుని"* గా ప్రసిద్ధి కెక్కుతాడని; అతనికి *"రంగదాసు"* అనే శూద్రభక్తునితో పరిచయం ఏర్పడుతుందని; కృతయుగంలో వేంకటాద్రిపై *"శంఖరాజు"* అనే భక్తునిచే నిర్మించబడిన విమానగోపురం కలిగిన తన ఆలయం శిథిలమవ్వగా, అందున్న విగ్రహం సమీపంలోనే ఉన్న ఒక చింతచెట్టు క్రింద ఉన్నట్టి పుట్టలో పడిఉన్నదని; వారిరువురూ (వైఖానసుడు, రంగదాసు) కలసి ఆ విగ్రహాన్ని పుట్టలో నుండి బయటకు తెచ్చి, ఒక వైభవోపేతమైన దేవాలయాన్ని నిర్మించి, అందులో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, నిత్యము పూజాదికాలు జరుపవలసిందని కూడా శెలవిచ్చాడు. 


‌ తదనంతరం, భగవదాజ్ఞ మేరకు వెంకటాద్రి పర్వతానికి బయలుదేరిన గోపీనాథునికి మార్గమధ్యంలో రంగదాసు కలువగా; ఇరువురూ కలసి సువర్ణముఖీ నదిలో స్నానమాచరించి, సమీపంలోనే ఉన్న శుకపురి (నేటి తిరుచానూరు) అనే పుణ్యక్షేత్రం లోని శ్రీకృష్ణ బలరాముల ఆలయాన్ని దర్శించుకుని, వేంకటాచలానికి తరలి వెళ్ళారు.


 *శ్రీనివాసుని సేవలో భక్తద్వయం* 


‌ శ్రీవారి ఆనతి మేరకు వెంకట పర్వతాన్ని చేరుకున్న భక్తులిరువురు స్వామి పుష్కరిణియందు స్నానమాచరించి; పుష్కరిణికి దక్షిణాన ఉన్న చింతచెట్టు క్రింది పుట్టను త్రవ్వి, అందులో నిక్షిప్తమైయున్న, దివ్య తేజస్సు ఉట్టిపడే, సాలగ్రామశిలా నిర్మితమైన స్వామివారి మూర్తిని వెలికి తీసి; ఎంతో కాలంగా పుట్టకు నీడనిచ్చిన చింతచెట్టును, శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన చంపక వృక్షాన్ని మాత్రమే ఉంచి; ఇతర వృక్షాలను, తుప్పలను, బండరాళ్లను తొలగించి; ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. విగ్రహం చుట్టూ అందుబాటులో ఉన్న బండశిలలతో కుడ్యాలను నిర్మించి, రెల్లుగడ్డితో పైకప్పు నేర్పరచి శ్రీవారికి తాత్కాలిక వసతి కల్పించారు.


 ప్రతిరోజూ శ్రీనివాసునికి గోపీనాథుడు పూజాదికాలు సమర్పించుకునేవాడు. పూజకు కావలసిన పుష్పాలను సమయానికి సమకూర్చే బాధ్యతను వహించిన రంగదాసు, పూదోటను పెంచటం కోసం ఆ సమీపంలోనే రెండు బావులను కూడా నిర్మించాడు. భగవత్సంకల్పంతో ఆ బావులు నిర్మించబడ్డ ప్రదేశంలోనే శ్రీదేవి భూదేవిలచే ఎప్పుడో నిర్మించబడి శిథిలమై పోయిన శ్రీతీర్థం, భూతీర్థం బహిర్గత మయ్యాయి. శ్రీతీర్థం నందలి పవిత్ర జలాలను గోపీనాథుడు శ్రీవారి వంటలకు, అభిషేకార్చనాదుల నిమిత్తం ఉపయోగించేవాడు. అదే నేడు విమానప్రదక్షిణ ప్రాకారంలో ఉన్న *"బంగారుబావి".*


[ రేపటి భాగంలో... *రంగదాసు మరుజన్మ* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

పద్యానువాదము

 🪷 శుభోదయం 🪷

     శ్లోకానికి పద్యానువాదము 


> శ్లో॥ ఇంద్రియాణాంహి చరతాం యన్మనోఽనువిధీయతే!

> తదస్యహరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి!! 


> భావం: ఎలాగైతే బలమైన వీచేగాలి నీటిలో నావను దాని దిశనుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏఒక్క ఇంద్రియముపైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించివేస్తుంది. **గీత02:67**

=======================

అనువాదపద్యం:

*ఇంద్రియములపైన నిష్టమ్ము గలిగిన*

*మనసుకూడ నట్లె మారిపోవు* 

*ప్రతిభ క్షయమునంది పరిఢవిల్లగబోదు*

*నౌక గాలివెంట నడచినట్లు*

~"కవితాభారతి" 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - చతుర్ధశి - పుష్యమి -‌‌ భౌమ వాసరే* (11.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*