9, ఫిబ్రవరి 2026, సోమవారం

నక్షత్రం: పుబ్బ / పూర్వఫల్గుణి

  🌹🌷💫⭐🛕⭐💫🌷🌹

*ఆదివారం 8 ఫిబ్రవరి 2026*


             *నక్షత్ర స్తోత్ర మాలిక*                  

               *11 వ రోజు*

*నక్షత్రం: పుబ్బ / పూర్వఫల్గుణి* *(Pubba / Purva Phalguni)*


*అధిపతి: శుక్రుడు (Shukra)*


   *ఆరాధించాల్సిన దైవం* 

    *మహాలక్ష్మి / భగుడు*


​పుబ్బ నక్షత్ర జాతకులు మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కోరుకునే వారు, ఐశ్వర్య ప్రాప్తి కోసం పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం:


*​🙏 శ్రీ కనకధారా స్తోత్రం 🙏*


​*వందే వందారు మందార మిందిరా నందకందళమ్।*

*అమందానంద సందోహ బంధురం సింధురకన్యకామ్॥1॥*


​*అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ*

*భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్।*

*అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా*

*మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 2 ॥*


​*ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః*

*ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ।*

*మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా*

*సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః ॥ 3 ॥*


​*విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం*

*ఆనంద హేతు రధికం మురవిద్విషోఽపి।*

*ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధం*

*ఇందీవరోదర సహోదర మిందిరాయాః॥ 4 ॥*


​*దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం*

*అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే ।*

*దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం*

*నారాయణ ప్రణయినీ నయనారువాహః||5॥*


​*సంపత్కరాణి సకలేంద్రియ నందనాని*

*సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి ।*

*త్వద్వందనాని దురితాహరణోద్యతాని*

*మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 6 ॥*


​*కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః।*

*అవలోకయ మామకించనం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 7 ॥*


​*స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం*

*త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।*

*గుణాధికా గురుతరభాగ్యభాగినో భవంతీ తే భువి బుధభావితాశయాః॥8॥*


​॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత శ్రీ కనకధారా స్తోత్రం సంపూర్ణమ్ ॥


              ​*విశేషం*


పుబ్బ నక్షత్రం రోజున ఈ స్తోత్రాన్ని పఠించి, లక్ష్మీదేవికి పాయసం లేదా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితం ఉంటుంది.```


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

09ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

*🌹09ఫిబ్రవరి2026🌹*      

  *దృగ్గణిత పంచాంగం* 

               

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : అష్టమి* ‌పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : విశాఖ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*యోగం : వృద్ధి* రా 12.52 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : బాలువ* సా 06.12 వరకు *కౌలువ* పూర్తిగా రాత్రంతా

*సాధారణ శుభ సమయాలు*

           *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *రా 10.04 - 11.51*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.45*

*వర్జ్యం    : ప 11.19 - 01.06*

*దుర్ముహూర్తం  : మ 12.44 - 01.31 & 03.03 - 03.49*

*రాహు కాలం   : ఉ 08.02 - 09.29*

గుళికకాళం      : *మ 01.48 - 03.15*

యమగండం    : *ఉ 10.55 - 12.22*

సూర్యరాశి : *మకరం*                       

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.46*

సూర్యాస్తమయం :*సా 06.15*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.36- 08.54*

సంగవ కాలం      :*08.54 - 11.13*

మధ్యాహ్న కాలం  :*11.13 - 01.31*

అపరాహ్న కాలం  :*మ01.31- 03.49*

*ఆబ్ధికం తిధి :మాఘ బహుళ అష్టమి*

సాయంకాలం    :*సా03.49- 06.08*

ప్రదోష కాలం      :*సా 06.08- 08.37*

రాత్రి కాలం           :*రా 08.37- 11.57*

నిశీధి కాలం        :*రా 11.57- 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.56 - 05.46*

******************************

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*పౌరోహిత్యం రజనిచరితం* 

*గ్రామణీత్వం నియోగో*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

మాఘ పురాణం - 22వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷సోమవారం 9 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 22వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *9వ తేదీ సోమవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు* 


మాఘ పురాణం  ఇరవైరెండవ అధ్యాయంలో, జహ్నుడు ఏకాదశి వ్రతం మహాత్మ్యం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గృత్నృమదుడు పౌరాణిక ఘటనమైన క్షీరసాగర మథనాన్ని వివరించాడు. 

సముద్రంలోని అమృతాన్ని పొందేందుకు దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని మథన దండంగా, వాసుకిని కవ్వంగా ఉపయోగించి క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారు. 

మథన ఫలితంగా లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవ వంటి అద్భుతమైన ఐశ్వర్యాలు లభించాయి. కానీ, తరువాత పుట్టుకొచ్చిన భయంకరమైన విషాన్ని శంకరుడు తన కంఠంలో దాచి, లోకాలను కాపాడాడు.

అమృతం కోసం మరింత తీవ్రంగా సాగిన మథనంలో, మోహిని అవతారంఎత్తిన విష్ణుమూర్తి మాయాజాలంతో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. అసుర గురువు శుక్రాచార్యుడి మాయతో రాక్షసులు దానిని అపహరించ ప్రయత్నించగా, సూర్యచంద్రుల సూచన మేరకు విష్ణువు రాహు-కేతువుల తలలను నరికి అమృతాన్ని విడిపించాడు. దేవతలు అమృతం సేవించి మృత్యుంజయాలు కాగా, రాక్షసులు మోసపోయారు. ఈ కథ ద్వారా, క్షీరసాగర మథనంలో ఎదురైన కష్టాలు, విష్ణుమూర్తి యొక్క అవతార మహిమలను వివరించి, ఏకాదశి వ్రతం యొక్క ఫలాన్ని గృత్నృమదుడు జహ్నునికి తెలియజేశాడు. 

ఏకాదశి వ్రతాన్ని పాటించడం దేవతలకు అమృతం లాగా ఫలిస్తుందని, పుణ్యలోకాలను చేరుస్తుందని, దాని మహిమ అశ్వమేధ యాగాలకు సమానమని వివరించాడు…


*క్షీర సాగర మధనము*```


గృత్నృమద మహాముని జహ్ను మునితో నిట్లనెను. “జహ్ను మునివర్యా! వినుము, అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలము నందు తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై ఇంద్ర పదవి నందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలసి పారాయణం చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను.


జహ్ను ముని “గృత్నృమద మహామునీ తిధులు అనేకములు ఉండగా ఏకాదశి అన్నిటి కంటె శుభ ప్రదమైనది యెట్లయ్యెను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతము ఓక్కటే ఇచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము” అని అడిగెను. 


గృత్నృమద మహాముని యిట్లనెను.. “పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రత కథను చెప్పెదను వినుము.. “పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను, సర్పరాజు వాసుకిని కవ్వపు త్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడు వరుసలుగ కట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.

వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసన అగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. 

మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. 

దేవ దానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడి వద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి..

“దేవ దానవులు చేసిన శివస్తుతి“

```

*నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే*

*నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే॥*


*నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ*

*నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే॥*


*త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక*

*త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే॥*


*త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే*

*అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః॥*


*హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే*

*మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల॥*


*పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్*```


అని భయ పీడితులైన దేవ దానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడు ఆ విషమును మ్రింగి తన కంఠమున నిలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి ఏర్పడినది. 

విష భయము తొలగిపోవుటచే నిశ్చిం తులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. 

ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావి యగు శ్రీమహావిష్ణువు మోహిని రూపమునందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి..“దేవతలారా,దానవులారా!” యని మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవ దానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.


ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను. దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొక వైపునను కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహ వ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్న వైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు నెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకి ఇంపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవళితోను, హస్త కంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవ దానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి కొసరి వడ్డించుచుండెను. 


దేవ దానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.```


*“రాహు కేతువుల వివరణ“*```


రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల యందు అమృత పానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధన జనిత శ్రమను ఇంకను  వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవ రూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. 


మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. ఈ

రాక్షసులు అమృతమును ఆత్రముగ త్రాగుటతో ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. 


వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి.


చంద్రుడు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ యిట్లుఅయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగారని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.


చక్రముచే నరకబడి  చావు బ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగా యున్నది. మాగతి యేమి? మాకు ఆహారము ఏదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. 


శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలముల యందు సూర్యుని, చంద్రుడిని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. 

ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశము ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగా మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. 


కొంత కాలము గడిచెను. సత్యజిత్తను శూద్రుడు ఒకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీ దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.

ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వవలెనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడుగకుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.


పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమునకెగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేద్రుడును ‘నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తి కలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతి దినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకు ఏమి చేయవలెనో తోచలేదు. పుష్ప చోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజ తరువాతి నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల మరియు లోపల అంతటను చల్లెను.

యక్షుడు యధా పూర్వముగ పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచటి నుండి పోలేక పోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని ‘ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతి దినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెను. 


యక్షుడును ‘నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసితిని. కాని బుధ్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు ఏమియు మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడు అయిన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో ఉండెను.

```

*మాఘపురాణం ఇరవై రెండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

నేర్చుకుంటాము

 *🔔శుభోదయం🔱Goodmorning 🔔*

     

        *_తెలుసుకోవాలని ముందుకు వెళితే చాలా నేర్చుకుంటాము._*

          *_అంతా తెలుసని ఆగిపోతే చాలా కోల్పోతాము._*


శుభ సోమవారం 🕉️Happy Monday.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - విశాఖ -‌‌ ఇందు వాసరే* (09.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆదిశంకరులు

 ఆదిశంకరులు కేవలం సిద్ధాంతం చెప్పి వెళ్లిపోలేదు. ధర్మ రక్షణ కోసం దేశానికి నాలుగు దిక్కులందు 4 మఠాలను (పీఠాలను) స్థాపించి, ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి "మఠామ్నాయ మహానుశాసనము" అనే గ్రంథమే సాక్ష్యం. దానికి సంబంధించిన పూర్తి శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి:


1. తూర్పు దిక్కు (పూరీ - గోవర్ధన పీఠం):

శ్లోకం:

"పూర్వస్యాం దిశి వైశాఖే కాళికా పీఠముచ్యతే |

జగన్నాథః ప్రభుర్దేవో భోగవారో వనస్థలీ ||

ఋగ్వేద శాఖా కథితా హి తత్ర ధర్మస్య వృద్ధిః |

మహావాక్యం చ "ప్రజ్ఞానం బ్రహ్మ" అస్మిన్ పీఠే ప్రతిష్ఠితమ్ ||"

వివరణ: ఆది శంకరులు తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి, దానికి పద్మపాదాచార్యుల వారిని పీఠాధిపతిగా నియమించారు.

వేదం: ఋగ్వేదం | మహావాక్యం: *"ప్రజ్ఞానం బ్రహ్మా"*


2. దక్షిణ దిక్కు (శృంగేరి - శారదా పీఠం):

శ్లోకం:

"దక్షిణే శృంగేరీ పీఠం శక్తిః శ్రీ శారదా భవేత్ |

వరాహో దేవతా తత్ర రామక్షేత్రముదాహృతమ్ ||

యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనమ్ |

"అహం బ్రహ్మాఽస్మి" వాక్యం చ తత్రైవ పరికీర్తితమ్ ||"

వివరణ: దక్షిణాన శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి, పీఠాధిపతిగా సాక్షాత్తు సురేశ్వరాచార్యుల వారిని నియమించారు.

వేదం: యజుర్వేదం | మహావాక్యం: *"అహం బ్రహ్మాఽస్మి"*


3. పశ్చిమ దిక్కు (ద్వారక - శారదా మఠం):

శ్లోకం:

"పశ్చిమాయాం శారదామఠః కీటవారః సముదాహృతః |

తీర్థం చ గోమతీ ప్రోక్తం ద్వారకాక్షేత్రముచ్యతే ||

సామవేదో బ్రహ్మరూపః తత్ర ధర్మముదాహృతమ్ |

"తత్త్వమసి" మహావాక్యం తత్రైవ పరికీర్తితమ్ ||"

వివరణ: పడమర ద్వారకా పీఠాన్ని స్థాపించి, పీఠాధిపతిగా హస్తామలకాచార్యుల వారిని నియమించారు.

వేదం: సామవేదం | మహావాక్యం: *"తత్త్వమసి"*


4. ఉత్తర దిక్కు (బదరి - జ్యోతిర్మఠం):

శ్లోకం:

"ఉత్తరే జ్యోతిర్మఠం చ బదరికాశ్రమ ముచ్యతే |

నారాయణః ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తికా ||

అథర్వణ వేద వాక్యాని తత్ర స్వీకురుతే సదా |

"అయమాత్మా బ్రహ్మా" వాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితమ్ ||"

వివరణ: ఉత్తరాన జ్యోతిర్మఠాన్ని స్థాపించి, తోటకాచార్యుల వారికి బాధ్యత ఇచ్చారు.

వేదం: అథర్వణ వేదం | మహావాక్యం: *"అయమాత్మా బ్రహ్మా"*

8, ఫిబ్రవరి 2026, ఆదివారం

పంచాంగం



సత్యవ్రతుడు

  



                 *సత్యవ్రతుడు*

                  ➖➖➖✍️

```

కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవఝామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా 

స్త్రీమూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.


ఆయన ఆమెను ఆపి, గౌరవంగా “ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?” అని అడిగాడు.


“రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు” అన్నది ఆమె.


మహారాజు “తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు” అని ఆమెను సాగనంపాడు.


ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. “అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?” అని అడిగాడు రాజు, ఆయనను.


“రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు” అన్నాడు ఆ దివ్య పురుషుడు.


“సంతోషంగా వెళ్లండి” అని సాగనంపాడు మహారాజు.


అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. “తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?” అడిగాడు రాజు.


“రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు” అన్నది ఆ దేవతామూర్తి.


“సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు.” అన్నాడు రాజు.


ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు “స్వామీ! మీరెవ్వరు?" అని.


“రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు” అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.


‘ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. “తల్లీ! నువ్వెవ్వరు?” అని అడిగాడు సత్యవ్రతుడు.


“రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.


రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి “తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు తల్లీ!” అన్నాడు.


సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; 


చూడగా, ఆమె ధనలక్ష్మి! “ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.


“అవును సత్యవ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను” అన్నది ధనలక్ష్మి.


అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.


మళ్లీ రాజ్యం కళకళలాడింది.


ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. 


అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. 


ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే! సందేహం లేదు!!✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..........!!

  దేవునికీ సమర్చీంచే

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..........!!

1.దేవునికి జాజి పూలు..అర్పించి 

ప్రసాదం స్వీకరిస్తే .. 

మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి 

మంచి గుణం వస్తుంది .

ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి


2.దేవునికి సంపెంగ పూలు అర్పించి..

ప్రసాదం స్వీకరిస్తే .. 

మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు .

శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది


3.పారిజాత పువ్వుని అర్పిస్తే ....

కాల సర్ప దోషం నివారించబడి 

మనస్సుకు శాంతి లబిస్తుంది.


4.రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ...

ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం 

మీదే అవుతుంది.


5.మొగలి పువ్వును అర్పిస్తే .....

అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి.


6.లక్కీ పువ్వుతో పూజిస్తే .... 

భార్య పిల్లలతో కలహాలు లేకుండా

సంతోషంగా ఉంటారు.


7.పద్మం లేదా కమలంతో పూజిస్తే .....

సమస్త దారిద్ర నివారణ.

శ్రీమంతులు అవుతారు.


8. మల్లి పువ్వుతో పూజిస్తే ......

అన్ని రోగాలు నయం అవుతాయి .

ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.


9.గన్నేరు పూలతో పూజిస్తే..

కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.


10.కల్హార పుష్పం తో పూజిస్తే ...

అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి 

ఆకర్షణ పెరుగుతుంది.


11.పాటలీ పుష్పంతో పూజ చేస్తే ..

వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.


12.కంద పుష్పంతో పూజ చేస్తే ....

ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.


13.తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే ...

దేవునిఫై భక్తి అధికం అవుతుంది.


14.నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే ... జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది.


15.కణగాలే పుస్ఫం ...దీనితో దేవునికి పూజ చేస్తే.. మనస్సును పట్టి పీడిస్తున్న భయం , భీతి తొలగిపోతాయి 

గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .

విద్య ప్రాప్తి సిద్దిస్తుంది .

దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే 

దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది.


16.అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే .... జేవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి


17.నల్ల కలువ పుష్పాలతో శ్రీ శన్నైచ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి


18.పాదరి పుష్పంతో పూజ చేస్తే ... 

అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.


19.మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే..

అన్ని పాపాలు తొలగిపోతాయి.


20.పున్నాగ పుష్పం... ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి అయిన.. ,

శ్రీ గోపాల కృష్ణదేవునికి పూజ చేస్తే 

మగ సంతానం కలుగుతుంది .


21.వకుళ పుష్పం ... శ్రీ భూవరాహ స్వామికి ,

శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.


22.ఉత్ఫల పుష్పం ...జీవితంలో చాల కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం 

మహాలక్ష్మి సహస్ర నామం పఠించి..

ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే..

జీవితంలో చాలా అభివృద్ధి చెoదుతారు.


23. తెల్లని జీల్లేడు పువ్వుతో ... గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.


24.ద్రోణ పుష్పం ... ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే..శత్రువుల నాశనo , మిత్రలాభం అవుతుంది. 

అధికారం ప్రాప్తిస్తుంది.


25. భందూక పుష్పం ... ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం .శుక్రవారం పూజ చేస్తే..

బంధువులు క్షేమంగా ఉంటారు.


26.అగసి పువ్వుతో .... దేవికి పూజ చేస్తే..

పాపాలు తొలగిపోతాయి.


27.సురభి పుష్పం ... శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది.


28.పొద్దు తిరుగుడు పుష్పంతో పూజ చేస్తే .... పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తె అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.

మాఘమాసం సప్తమి ఆదివారం

  **మాఘమాసం సప్తమి ఆదివారం

భాను సప్తమి ఈ రోజు**


 ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు.

ఇది చాలా గొప్ప యోగం, సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే...మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం,రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు , ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి.మూడవది ఒంటికి , తలకు నూనె పెట్టుకోరాదు. నాల్గవది ఉల్లి , వెల్లుల్లి , మద్యము , మాంసాహారానికి దూరంగా ఉండాలి.ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు.ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా , వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది.

 అవివాహితులకు వివాహమవుతుంది, సంతానం కలుగుతుంది, మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు. ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది , గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానం , దానము , జపము , హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక , ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని , దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినేసప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతాస్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినేన వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి...

భావం:-🌷తినకూడని పదార్ధాలు , మద్యము , మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు.ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది.స్త్రీ సమాగమము , తైలం రాసుకోనుట , మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం , వ్యాధి , దారిద్ర్యం ఉండదు , వారు సరాసరి సూర్యలోకనికి వెళతారు.ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు.

కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.

ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం , ఆదిత్య హృదయం , సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం.

సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను , ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు ఇది అందరికీ తెలిసినదే ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది

ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః🙏🌻


ద్వాదశ ఆదిత్యుల నామాలు (Sri Aditya Dwadasa Namavali): 

ఓం ఆదిత్యాయ నమః - అదితి పుత్రుడు

ఓం దివాకరాయ నమః - పగటి వెలుగును ప్రసాదించేవాడు

ఓం భాస్కరాయ నమః - ప్రకాశించేవాడు/కాంతినిచ్చేవాడు

ఓం ప్రభాకరాయ నమః - కాంతిని కలిగించేవాడు

ఓం సహస్రాంశవే నమః - వేయి కిరణాలు కలిగినవాడు

ఓం త్రిలోచనాయ నమః - మూడు నేత్రములు (వేదాలు) కలిగినవాడు

ఓం హరిదశ్వాయ నమః - ఆకుపచ్చని గుర్రాలు కలిగినవాడు

ఓం విభావసవే నమః - కాంతికి మూలమైనవాడు

ఓం సూర్యాయ నమః - సకల జగత్తును ప్రేరేపించేవాడు

ఓం పూష్ణే నమః - పోషించేవాడు/పోషకుడు

ఓం రవయే నమః - ప్రకాశించేవాడు

ఓం శుక్రాయ నమః - శుభకరుడు/శుద్ధుడు