4, మార్చి 2026, బుధవారం

నిత్యుడు,సర్వగతుడు

 శ్రీరామ (101)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏



" నిత్యుడు,సర్వగతుడు, స్థిర రూపుడు,చలించని వాడు,ఆద్యంతములు లేక ఎల్లప్పుడూ ఉండేవాడు అనే శబ్దములతో వర్ణింపబడిన ఆత్మను నేను "

(నిత్యస్సర్వగతస్స్థాణు రచలో౽యం సనాతనః)


జాగ్రదవస్థలో ఈ శరీరం ఎండ, చలి, వర్షము, మొదలైన వాటిని తట్టుకుంటూ,

నానా రకాల వ్యాధులు,గాయములు, మొదలైన ఋగ్మతలతో సతమతమవుతున్నది.

అనేక ఆర్థిక, కుటుంబ, వృత్తి వ్యాపార సమస్యలతో మనస్సు అతలాకుతలమవుతున్నది.


కానీ సుషుప్త్యవస్థలో ఈ శారీరక, మానసిక బాధలన్నీ ఏమైనాయి ?

అన్నీ మరచిపోయి జీవుడు హాయిగా నిద్రపోతున్నాడు.


శ్లో//సుప్తే౽హమి న దృశ్యన్తే దుఃఖ దోష ప్రవృత్తయః/

అత స్తస్యైవ సంసారో న మే సంసర్తృ సాక్షిణః//


(అహంకారం నిద్రావస్థ చెందగా,

దుఃఖం గాని,రాగ,ద్వేషాది ప్రవృత్తి గాని ఆ సుషుప్తిలో లేవు.

కాబట్టి ఈ సంసారమంతా "అహంకారానిదే", నాది కాదు.

నాదైతే ఈ సంసార బాధలు, బాధ్యతలు సుషుప్త్యవస్థలో కూడా ఉండాలి.

అవి లేవు. కానీ అప్పుడు కూడా నేను ఉన్నాను.

 కాబట్టి " నేను " అనగా అహంకారానికి సాక్షిగా ఉన్న ఆత్మ స్వరూపుడను అని సిద్ధిస్తోంది.

ఆత్మస్వరూపుడనైన నాకు ఎటువంటి సంసార బంధములు లేవు).


అయితే ఈ అహంకారం తొలిగేదెలా ?


అహంకారమునకు "రుద్రుడు" అధిష్ఠాన దేవత.

ఆ రుద్రుని జప, హోమ, అర్చనాదులతో ప్రసన్నుని చేసుకుంటే అహంకారం తొలగి జీవుడు తన సచ్చిదానంద స్వరూపం తెలుసుకోవడం అనే మోక్షస్థితిని పొందుతాడు.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

4-3-'26.

కామెంట్‌లు లేవు: