1, జూన్ 2021, మంగళవారం

సీతాశోక వినాశకః

 *సీతాశోక వినాశకః*


Trauma Care & Deppression Counselling అని రెండు విషయాలు Matrimonial counselling లో భాగంగా  నేర్చుకోవలసి వచ్చింది. ఆ subjects psychology లో భాగం. Psychology books అఖ్ఖర లేదు. Books ఉన్నా అందులో theory ఉంటుంది.  Commonsence ఉపయోగించి  Practice మీద నేర్చుకో వచ్చు. 


బాధల లో ఉన్న వాళ్ళ తో మాట్లాడేటప్పుడు వీడు మనలను వెక్కిరించ డానికి రాలేదు. బాధను పంచుకో డానికి వచ్చాడు బాధను తీర్చ డానికి సహాయ పడతాడు, అని నమ్మకం కలిగించాలి.  ఈ నమ్మకం లేకపోతే counselling ఫలించదు. ఈనమ్మకం కలగాలి అంటే empathitic listening & sympathy talking రెండూ చెయ్యాలి. ఇందులో మాట్లాడటం కంటే వినడం ఎక్కువగా చెయ్యాలి. Counseller మీద నమ్మకం కలిగాక patient  కు hope create చెయ్యాలి.  ముందుగా patient  అప్పుడున్న  condition సరిగా asess చేసుకోవాలి. కొద్దిపోరపాటు చేసినా counselling చెడి, అనుకోని దుష్పరిణామాలు కలుగుతాయి.  Negative నుంచి positive thinking లోకి రప్పించాలి. అంతా అయిన తరవాత relapse కాకుండా self help training ఇవ్వాలి.   ఇవన్నీ అనుభవం తో నే నేర్చుకోవాలి. 


రామాయణం లో హనుమ సీతతో మాట్లాడిన పద్ధతి కాస్త శ్రద్ధగా గమనిస్తే వేరే ఏ అనుభవం లేకుండానే ఇందాక అనుకున్న subject అర్థమౌతుంది. 


మొదటగా హనుమ సీతకు తనమీద నమ్మకం కలిగించు కోడానికి తనలో తను అన్ని విధాలా తర్కించు కొని సీతకు ఇష్టమైన రామకథా గానం చేస్తాడు. నువ్వెవరు అని అడగడానికి తన మనసులో ఆమె పట్ల ఎంత గౌరవ మున్నది తెలిసే టట్లు ప్రశ్నలు వేస్తాడు. ఆ మాటల మాధుర్యం ఎలాటిదంటే సీతకు నమ్మకం పూర్తి గా కలగ కున్నా బిగుసుకో కుండా relaxed గా మాట్లాడుతుంది. ఇక్కడికి హనుమ  rapo create చేసాడు. ఇది counselling లో 1st stage. 


ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తనమీద నమ్మకం కలిగించు కుంటారు. హనుమ మీద సీతకు నమ్మకం కలిగాక  తరవాత హనుమ అంగుళీయకం ఇస్తాడు.  35 సర్గ 85 & 88 శ్లోకాలు చూడండి. అంగుళీయకం చూపించి నమ్మకం కలిగించు కోలేదు. 36 వ సర్గ లో 3 వ శ్లోకం అంగుళీయక ప్రదానం. అంగుళీయకం లేకున్నా ఆంజనేయుడి మాటలను బట్టి సీత ఆయనను ముందే నమ్మింది. 


బాలరామాయణం దగ్గర నుంచి అన్నిచోట్లా అందరూ రాముడిని వాగ్విదాం వర అని పిలుస్తారు. ఆ రాముడే కిష్కిందాకాండ లో ఆంజనేయుడి మాట నేర్పుకు ఫిదా అయ్యి తెగ మెచ్చు కుంటాడు. అందుకే హనుమను సాంత్వవాది అని సుందరకాండ 27 వ సర్గ 53 వ శ్లోకం లో వాల్మీకి వర్ణిస్తారు. కేవలం పొందికగా మాట్లాడడం తోనే ఆయన పనులు సాధించు కుంటారు. 


సీతకు తగిన మాటలు చెప్పి ఉత్సాహ పరుస్తాడు.  తరవాత సీతకు hope create చెయ్యడం. సముద్రాన్ని లంఘించడం మిగతా వానరులకు చేత కాదని తెలిసి కూడా ఆమెకోసం అబద్ధం చెపుతాడు. రాముడి ప్రేమ గురించి ఆమె కోసం ఆయన తపించడం గురించి చెప్పి అవిడకున్న సందేహాలన్నీ తీరుస్తాడు. ఇక తను వెళ్ళి పోయిన తరవాత అవిడకు హనుమ పరాక్రమం గురించి సుగ్రీవుడి సైన్యం గురించి మళ్ళీ సందేహం కలగ కుండా లంకలో సగం వీరులను చంపి లంక తగల బెట్టి మంచి demo ఇచ్చి మరీ వెళతాడు.  సీతకే కాదు లంకలో వున్న వాళ్ళ లో చాలామందికి ఆ దెబ్బ  తో రాముడొస్తాడు యుద్ధం జరుగుతుందనే నమ్మకం కలిగేటట్లు చేస్తాడు. ఇది counselling అయ్యాక లక్షణాలు relapse కాకుండా జాగ్రత్తలు తీసుకోడం.   తరవాత అంటే ఈయన వెళ్ళిపోయాక సీత ఈన చెప్పిన మాటలు నమ్మక పోవడానికి అవకాశమే లేదు. యుద్ధం పూర్తి అయ్యేదాకా మళ్ళీ సీతకు ఏ సందేహమూ రాదు. మళ్ళీ నిరాశ కలగదు. హనుమ కల్పించిన నమ్మకం అంత గాఢ మైనదీ. 


36 వ సర్గ 47 ఆఖరు శ్లోకం లో ఆమెకు ఉన్న శోకం మొత్తం తీరింది అని సీతే చెబుతుంది. ఈ శ్లోకము తో 68 వ సర్గ 29 శ్లోకం కలిపి చదివితే ఆమె శోకం తీరిందనే విషయం ఆంజనేయుడికి కూడా బాగా తెలుసు అని తెలుస్తుంది.  


అందుకే సీతకు అందరికంటే హనుమ ఇష్టం. ఆమె ప్రత్యేకంగా పట్టాభిషేక సర్గ లో ఆయనకు హారం ఇస్తుంది.  ఆయనకు ఉన్న ద్వాదశ నామాలలో  కల్లా  చాలా ముఖ్య మైన పేరు "సీతాశోక వినాశకః" అన్నది.  రావణుని చంపి ఆమెను రక్షించి న రాముడికి ఆ పేరు రాలేదు. ఇంకెవ్వరికీ రాలేదు. హనుమకే వచ్చింది. 


*పవని నాగ ప్రదీప్*

ఆవకాయ

 




👆బడినుంచి ఇంటికిరాగానే అమ్మని వెతుక్కున్నట్టు అన్నాలకి కూర్చోగానే ఆవకాయ జాడీ ఎక్కడుందో వెతుకుతాయి కళ్లు. 


వేడివేడిగా కలగూరపప్పు, మువ్వొంకాయ కూర, ముక్కలపులుసూ ఉన్నా ఆవకాయ కనబడకపోతే ఇళయరాజా పాటలో ఫ్లూటెక్కడా వినబడనట్టు లోటుగా అనిపిస్తుంది. 


ఈలోగా అలా ఓమూల ఆలయప్రాంగణంలో పూలచెట్టులా నేనున్నానంటూ ధీమాగా పలకరిస్తుంది పింగాణీ పిల్ల. 


అసలీ ఆవకాయ జాడీలతో మనకు బోల్డన్ని జ్ఞాపకాలు. 


మా చిన్నతనంలో వంటింట్లో నీలంరంగు చెక్కతలుపుల బీరువా తెరవగానే పదునెక్కిన పాతవాసన వచ్చేది. అదో రకమైన ఘాటు. తలుపులు మూసేసి మళ్లీ వెంటనే తెరవాలనిపించేంత వ్యసనం. 


తీరా తెరిచిచూస్తే  మూతికి గుడ్డ బిగించి కట్టిన పొడవాటి జాడీ ఒకటి అలా నిలువుగా మా పెదనాన్నలా గంభీరంగా కనబడేది... కిందంతా పట్టుపంచెలా తెల్లగానూ, పైనేదో లేతపసుపు ఉత్తరీయం కప్పుకున్నట్టుగానూ!


ఆ జాడీని ఏ పదిరోజులకోసారో చూసేవాళ్లం. దాన్ని పెద్దావకాయ అనేవారు అమ్మానాన్నా!


గుండ్రంగా, గునగునలాడుతూ మా పెద్దత్తయ్యలా కనబడే చిన్నజాడీ ఒకదాన్ని ఎప్పుడూ అన్నాల దగ్గర పెట్టేది అమ్మ. ఎందుకంటే పెద్దావకాయ తియ్యడానికి మడీ తడీ అంటూ చాలా హడావిడుంటుంది .


ఎవరితోనూ మాటాడకుండా అత్యంత శ్రద్ధతోనూ, ఇంకా బోలెడంత శుభ్రతతోనూ స్టీలు గరిటొకటి పట్టుకుని అమ్మ బయల్దేరిందంటే మా ఇలవేల్పు సినిమాలో కె.ఆర్. విజయని చూసినంత భయభక్తులతో చూసేవాళ్లం. 


అలా తిన్నగా వంటింట్లోకెళ్లి కిడ్నాప్ చేసిన హీరోయిన్‌ నోట్లోంచి గుడ్డలు తీసినట్టు వాసినిగుడ్డ విప్పేది. ఆనక పెద్దజాడీలోంచి చిన్నజాడీలోకి దఫదఫాలుగా ఆరేడు గరిటెల ఆవకాయ నింపుతుండేది. గరిటె బయటపడిన ప్రతిసారీ కమ్మని నూనెవాసన, కళ్లనీళ్లొలికించే ఆవఘాటూ తగిలేవి. 


ఇక వెల్లుల్లి ఆవకాయైతే మధ్యమధ్యలో ఒక్కొక్కటి కనబడి ‘ఏరా, బావున్నావా?’ అని మమ్మల్ని పలకరించుకుంటూ జాడీలోకి జారుకునేవి.


ఇదంతా చూస్తూ ఎదిగాం. 


అసలు ఈ ఆవకాయల కోసం పెళ్లివారిలా నెలముందునుంచీ హడావుడి చేసేవారు నాన్నగారు. బారామాసి కాయలైతే ఊట బావుంటుందని, ఏడాదంతా పాడవదని అవే తెచ్చేవారు. పోనీ ఇప్పట్లా ఆ కాయలవాడి పక్కనే గోనెపట్టా వేసుక్కూర్చుని ముక్కలు కొట్టే అబ్బాయి చేత కొట్టించేవారా? ఎబ్బే! అలాచేస్తే సంతృప్తుండదుట. 


మాయింట్లోది కాకుండా పక్కింట్లోంచి మరో కత్తిపీటో, మర కత్తిపీటో తెచ్చేవారు. అదేంటో పక్కవాళ్ళ కత్తిపీటలే బావుండేవి ఎప్పుడూ! వాటితో ఈయన మొత్తం కాయలన్నిటినీ అరగంటలో తరిగేసేవారు. అప్పుడు పిల్లలం ఐదుగురం శుభ్రంగా ఉతికిన తెల్లటి గుడ్డలొక ఐదు తీసుకొచ్చి ముక్కల బేసిన్ చుట్టూ కూర్చునేవాళ్లం. స్నానం చేయించాక చంటిపిల్లల్ని తువ్వాలుతో తుడిచినట్టు తడిలేకుండా ముక్కలన్నిటినీ తుడిచి ఇచ్చేసేవాళ్లం. జీడిమీద ఉండే పల్చటి పొరల్ని చాకుతోనో, చెంచాతోనో తియ్యడమంటే నాకు భలే సరదాగా ఉండేది. 


ఈలోగా అమ్మానాన్నా కారాలూ మిరియాలూ... సారీ, కారాలు, ఉప్పూ కలిపిన ఆవపిండితో సిద్ధంగా ఉండేవారు. ఏళ్లతరబడి అందరి నోళ్లలోనూ నానుతున్న అంబటి సుబ్బన్న నువ్వులనూనె ఓపక్కగా కేజీ సైజు హార్లిక్స్ సీసాలోంచి బంగారంలా మెరిసిపోతూ ఎప్పుడెప్పుడు శివుడి జటాఝూటంలోంచి కిందకి దూకుదామా అని ఎదురుచూసే గంగలా ఉండేది. ఆవకాయలో ఒలకగానే ఆత్మానందం దానికి. ఇక ఏడాదంతా ముక్కల్నీ, పిండినీ, మనల్నీ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యతంతా తనదే కదా! అక్కణ్ణుంచి ఆ నూనె తాలూకా కమ్మదనం కాస్తా అమ్మదనంలా మారిపోతుంది. 


అబ్బ, ఆవకాయకి ఇంత వర్ణన అవసరమా అని అడుగుతారేమో? అవసరం కాదు. విధాయకం. మా మూడో మేనత్త తన ఏడుగురు కొడుకులకీ పొద్దున్నే ఇంత ఆవకాయేసి గిన్నెడు చద్దన్నం తినిపించేసి బయటికి తోసేసేది. అదే బ్రేక్‌ఫాస్ట్. వీధిలో పిల్లలతో ఆడినంతసేపు ఉత్సాహంగా ఉంటారని, దాని ఉపయోగాలు, పోషకవిలువల గురించి పాఠం చెబుతూండేది. లేకపోతే అంతమందికీ ఇడ్డెన్లూ, దోశలంటూ కూర్చుంటే బట్టలుతకడాలు, అంట్లపనీ, వంటపనీ అయ్యేనా? 


ఇక పెసరావకాయ, మెంతావకాయ, పులిహోరావకాయ అంటూ రకరకాలుగా దశాలంకరణలు చేసినా మెగాస్టార్ మాత్రం ఒరిజినల్ ఆవకాయే! 


చిన్నతనంలో మనం ఉండే మధ్యతరగతి ఇళ్లలో పెళ్లిమాటలైనా, రహస్యాలైనా అన్నీ పిల్లల ఎదురుగానే నడుస్తూ ఉండేవి. అలానే ఊరగాయలు, ఉపవాసాలూ కూడా మనకు ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేది బాల్యంనుంచీ తెలుస్తూనే ఉండేవి. ఈ విజ్ఞానానికి అదే కారణం. చదువులదేం ఉంది, తిన్నగా బడికెళితే వంటపడుతుంది. కానీ ఇలా కారాలు, మమకారాలు తెలియాలంటే మాత్రం జీవితాన్ని చదవాలి. 


అదృష్టవశాత్తూ తనుకూడా నాలాగే అటువంటి ఒళ్లోనే పెరిగి, అటువంటి బళ్లోనే చదివొచ్చిన ఇల్లాలు. 


ఇన్నేళ్ల కాపురంలో నేను కోసే కోతల గురించి (నే చెప్పేది మావిడికాయ గురించి) బానే తెలుసుకుంది.


అందుకే ఈ ఆవకాయల సీజన్లో ఎప్పుడైనా అలా నోట్లో పెన్నో, కలర్‌నోట్లో వేలో పెట్టుకుని ఆలోచిస్తుండగా తనొచ్చి పిలుస్తుంది.


‘ఆల్చిప్పల్లాంటి కళ్లతో...’ అని ఓ రెండు లైన్లు రాయగానే రెండు ఆల్చిప్పలు నాముందు పడేసి మాగాయకి తొక్కు తియ్యమంటుంది. నేనేమో వినయవిధేయరాముళ్లా కూర్చుని చెప్పిన పనల్లా చేస్తోంటే తను టీవీనైన్ వాళ్లలా స్టింగ్ ఆపరేషనొకటి నిర్వహిస్తూ ఫొటోలు, వీడియోలు తీసేసి, వాటన్నిటినీ ‘అరాచక కుటుంబ సమూహం’ అనే వాట్సప్ గ్రూపులో పెట్టేస్తుంది.


అందుకే ఈసారి కాయల మీద నేను చెయ్యిచేసుకోలేదు. తనే ముందుగా నా ఆశీర్వాదం తీసుకుని, ఆనక ఆశీర్వాద్ పేకెట్టు, అంబటి సుబ్బన్న పేకెట్లు కొనితెచ్చుకుని మా అత్తగారి సాయంతో ఆవకాయ, మాగాయ, తొక్కుడుపచ్చడీ పెట్టేసి జాడీలకెత్తేసింది. 


ఎదిగిన చెట్లు రెండూ ఇటువంటి తిళ్లు బానే తింటాయి. పెద్దాడికి ఆవకాయంటే మహాయిష్టం. ఈసారి కాస్త కారం తగ్గించి, కమ్మగా పెట్టిందేమో, వాడు తడవతడవకీ డాల్బీ సౌండ్‌లో లొట్టలేస్తూ లాగిస్తున్నాడు. 


‘ఓమూల అమ్మాయి ఉద్యోగం చేస్తోందికదా, ఇంకా ఈ చాదస్తాలేవిఁటి డాక్టర్ గారూ, కాస్తకాస్త ఏ ప్రియా పచ్చళ్లో కొనితెచ్చేసుకుని నాలిక్కి రాసుకోకా?’ అని మీరడగొచ్చు. తనకి నచ్చవు. ఇవేకాదు. దీపావళికి మతాబాలూ అంతే. కూర్చుని కూరతాం ఇప్పటికీ. అది నా సంతోషం. 


ఈ ఆవకాయనేది ఒక్కోసారి ఒక్కో రుచితో మనల్ని అలరిస్తుంది. చద్దన్నంతో తింటోంటే పల్లెటూళ్లో పొలంగట్టుమీద కూర్చున్నట్టనిపిస్తుంది. వేడివేడన్నంలో వెల్లుల్లావకాయ కలిపి తింటోంటే వెంకటేశ్వరస్వామి ఎదురుగా కూర్చున్నట్టనిపిస్తుంది. ఆక్షణం ఎన్ని జన్మలైనా మనిషిగానే, అదికూడా తెలుగువాడిగానే పుట్టించమని ఆయన్ని వేడుకోవాలనిపిస్తుంది. 


ఆవకాయ కలిపిన రోజున ఇంకా ఆ ఘాటదీ పూర్తిగా దిగకముందే ఓ నాలుగుముద్దలన్నం కలుపుకుని తినిచూడండి. కొత్తపుస్తకం అట్టవాసనలా మర్చిపోలేని మధురానుభూతి కలుగుతుంది. చిరుచేదుతో ఆవపిండి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మర్నాటికల్లా అది తన ఉనికిని మర్చిపోయి మావిడికాయతో తల్లీబిడ్డా న్యాయంగా కలిసిపోతుంది. 


ఎంత సంపాదించినా చివరిదశకి కొంత మిగుల్చుకోవాలని చిన్నప్పటి నుంచీ పొదుపూ అదుపూ నేర్పారు మనందరికీ. మనమంతా ఏం మిగుల్చుకోకపోయినా ఆవకాయన్నం తిన్న తరవాత ఓరెండు బద్దల్ని పెరుగన్నంలోకి మాత్రం మిగుల్చుకోవాలి. లేకపోతే ఆ అసంతృప్తి రోజంతా వెంటాడుతుంది. ఇది నిజం.


హొటళ్లలో వెనిగార్ ఆవకాయలవీ తిని అణగారిన ఆశలతో బతుకుబండిని లాగే కుర్రాళ్లంతా నామాట విని త్వరగా పెళ్లిళ్లు చేసుకోండి. 


కొత్తావకాయ, కొత్తకాపురం బావుంటాయి. 


శుభస్య శీఘ్రం!


....జగదీశ్ కొచ్చెర్లకోట

హిరణ్యాక్షశక్తి

 హిరణ్యాక్షశక్తి అహంకారంతో భూమిపై జీవం లేకుండా చేయాలని భూమి అంతటినీ జలమయం చేయు శక్తి కలిగిన వాడు.నీటి ద్వారానే భూమిపై జీవ లక్షణమని తెలిసి భూమిని జలమయం చేయుట యనే తత్వం. అనంతమైన జీవ ఙ్ఞానం సంపాదించి సృష్టి క్రమాన్ని కలిగిన భూమికి గల క్షేత్ర సస్య ధర్మాన్వి నాశనం చేయుట. అందుకు వరాహ అవతారంలో భూమిని జలం నుండి పైకి ఎత్తి భూమిని సస్యవృధ్దికి క్షేత్ర వృద్దిని కాపాడుట. యిది తెలిసి హిరణ్యకశిపుడు కూడాఅధర్మమని జీవ చైతన్య లక్యణమైన విష్ణుని నివారించి తనే విష్ణు శక్తికి  మూలంగా యుండుట, అనే అహంకారమనే రాక్షస తత్వం. శ్రీహరి శక్తిని ఎక్కడా కనపడక చైతన్య శక్తి తనలోనే అనగా ప్రహ్లాద జనమునకు ముందే వాయు రూపంలో హిరణ్యకశిపుని నాసిక ద్వారా విష్ణువు హిరణ్యకశిపుని దేహంలో ముందే ప్రవేశించి యుండుట. ఆ శక్తియే తిరిగి ప్రహ్లాదుని రూపంలో ప్రవేశము.తనలో యున్న విష్ణువని తెలియక ప్రపంచం అంతా చూచుట అఙ్ఞానం.హిరణ్యకశిపుని కోరికయే ఆతని మరణం.అందువలన మరణం లేకుండా కోరిక అసంభవం.పంచభూతాత్మకమైన శరీరమేదైనా లయం తప్పదు. వాటిని తట్టుకునే శక్తిని దేహము కోల్పోయిన మరణమే కదా.వకరికి ముందు వకరికి వెనుక. యిదే ప్రతీ జీవి ప్రకృతితో అనుసంధానించబడిన పరిణామం క్రమం. యింత స్పష్టంగా వేదం కధల రూపంలో వివరించింది. ఙ్ఞానం తో ఆలోచన చేయుట మానవ ధర్మం,దైవత్వంకూడాఅజ్ఞానంతో అహంకరించుట రాక్షస తత్వం. ఆతని అహంకారము అతని పతనానికి తొలి మెట్టు. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*సమాధి గది నిర్మాణం..సూచన..*


*(నలభై ఐదవరోజు)*


శ్రీ స్వామివారు దగ్గరుండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు..మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహాయం చేస్తున్నారు..పనివాళ్ళు ను శ్రీధరరావు గారు ఏర్పాటు చేస్తున్నారు..చక చకా నిర్మాణం జరుగుతున్నది..


ఒకరోజు మధ్యాహ్నం తరువాత, మీరాశెట్టి గారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చారు..మామూలు కుశల ప్రశ్నల తరువాత..తీరుబడిగా కూర్చున్నాక..


"స్వామివారు ఈరోజు ఒకమాట చెప్పారు..ప్రధాన గదిలో.. భూగృహం లాగా కట్టించమన్నారు.. అందులో కూర్చుని తాను తపస్సు చేసుకుంటానని చెప్పారు.." అని మీరాశెట్టి గారు శ్రీధరరావు దంపతులతో చెప్పారు..


ఆ మాట విని ప్రభావతి గారు  ఆశ్చర్యంగా.."ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా?..ఇందులో ఏదో అర్ధం దాగివుంది.." అని..శ్రీధరరావు గారి వైపు చూసి.."శ్రీవారూ!  మీరు వెళ్లి పూర్తివివరం కనుక్కోండి..మీరాశెట్టి గారూ మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలుపెట్టకండి..అన్ని సంగతులూ కూలంకషంగా మాట్లాడి ఆపైన చూద్దాము.." అన్నారు..


"అందుకే గదమ్మా నేను ఇక్కడిదాకా పరిగెత్తుకొచ్చింది..నాకు వివరం చెప్పలేదు..ఇప్పుడు లోపల మళ్లీ గొయ్యి త్రవ్వి..అందులో చిన్న గది లాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు..మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి.." అని శ్రీధరరావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు..


అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు..శ్రీధరరావు గారు ఆలస్యం చేయలేదు..పని వాడికి చెప్పి గూడుబండి సిద్ధం చేయించి..నాలుగు గంటల కల్లా ప్రభావతి గారిని కూడా వెంటబెట్టుకొని మీరాశెట్టి గారితో సహా ఫకీరు మాన్యం చేరారు..


వీళ్ల రాక కోసమే ఉన్నట్లు..శ్రీ స్వామివారు పాక వెలుపల..ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి వున్నారు..ముగ్గురూ శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి కలిశారు..


"నాయనా..లోపల భూగృహం కట్టించమని చెప్పారట..ఎందుకోసం?..మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా!..మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది..మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు?.." ప్రభావతి గారు గబ గబా అడిగేసారు..


శ్రీ స్వామివారు పక పకా నవ్వారు.."మీరాశెట్టి మిమ్మల్ని వెంటబెట్టుకొచ్చాడా?..సరే!..రండి..ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి గదా!.." అన్నారు శ్రీ స్వామివారు ..


వీళ్ళందరినీ వెంటబెట్టుకొని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తూ..


"అమ్మా!..నేను సాధకుడిని..తీవ్ర సాధన నా లక్ష్యం..ఇక్కడ గది లాగా కట్టిస్తున్నారు..బాగానే వుంది..దానికి తలుపులు కూడ వస్తాయి..నేను లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు..కానీ తరచూ హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితి కి వెళుతుంటాను..ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడికి కూడా సమాధి స్థితి భగ్నం అవుతుంది..ఇతమిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను..అది అనుభవించేవారికే అవగతం అవుతుంది..అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే..నాలుగు అడుగుల లోతు.. నాలుగడుగుల వెడల్పు తో చిన్న గది "నేలమాళిగ" లాగా కట్టించమన్నాను..నా తపోసాధన కొఱకు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా?.."


"మరో విషయం కూడా మీకు తెలియచేయాల్సిన అవసరం ఉంది..నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది..ఇప్పుడు నిర్మించబోయే ఆ భూగృహమే నా సమాధి అవుతుంది..నేను అందులోనే వుండబోతాను..ఎందరో తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు..ఆ సమాధినే దర్శించి తరిస్తారు..ఇక్కడ నేను ధారపోస్తున్న తపశ్శక్తి మహిమాన్వితం అయినది..అది ఈ క్షేత్రం లో కొన్ని వందల ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉంటుంది..ప్రతి పనికీ ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది..నాకు నిర్దేశింపబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి..మోక్షానికి వెళతాను..నేను చేస్తున్న ఈ తపో యజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లూ కూడా చిరస్థాయిగా నిలచిపోతాయి.." 


శ్రీధరరావు దంపతులతో పాటు మీరాశెట్టి గారు కూడా నివ్వెరపోయి వింటున్నారు..ఇంతా ఈ ఆశ్రమ నిర్మాణమే ఓ కొలిక్కి రాలేదు..మరి ఈ స్వామివారేమో..తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెపుతున్నారు..ఇంతా చేస్తే శ్రీ స్వామివారు ముప్పై యేళ్ళ వయసుకూడా లేని యువకుడు..అప్పుడే మోక్షం గురించిన ఆలోచనలు చేస్తున్నారే.. పరి పరి విధాల ఆలోచించి ఆయోమయానికి గురయ్యారు..


"మీరు చెప్పినట్టు ఆ నేలమాళిగను సిద్ధం చేయిస్తాము..మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి..మోక్షం..సమాధి..ఇవన్నీ ఇప్పుడెందుకు స్వామీ!..మీలాటి సిద్ధపురుషులు కొంతకాలం పాటు మా మధ్యలో వుండి.. మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి..ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచనలు చేయకండి.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి.."కాలమహిమను ఎవ్వరూ తప్పించలేరు..ముందు ముందు అన్నీ మీకు అర్ధం అవుతాయి.." అన్నారు..


శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..ఇవతలికి వచ్చేసారు..మీరాశెట్టి గారు అటునుంచి అటే తమ గ్రామానికి వెళ్లిపోయారు..శ్రీధరరావు దంపతులు మాత్రం శ్రీ స్వామివారి మాటలనే తలుచుకుంటూ మౌనంగా మొగలిచెర్ల కు చేరారు..


తపోసాధన..సందేహం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

శివ శబ్ద మహిమ

 శివ శబ్ద మహిమ


#శివ_శబ్ద_మహిమ


ఒకసారి ఓ పల్లెటూరి వానికి ఒక సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరకు వెళ్లాడు. శివా అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అంటారు కదా. నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడీ ప్రశ్నను కైలాసవాసుడే విన్నాడు. యోగి దగ్గరకు సన్యాసిగా వచ్చి ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అన్నాడు. యోగి చిరునవ్వుతో అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామీ అన్నాడు. ఓ జానపదుడా ఇదిగో ఈ నీకు కనిపించే ఈ చీమ చెవి దగ్గర ‘ఓం నమశివాయ’ అని అరువు అని చెప్పాడు. చీమ చెబుతుందా అన్నాడు జానపదుడు. ముందు అయితే చెప్పింది చేయి అన్నాడు సన్యాసి. జానపదుడు అట్లాగే చేశాడు. చీమ కాస్తా ప్రాణాలు కోల్పోయింది. రామ రామ! ఎంత ఘోరం జానపదుడు అనుకొన్నాడు. అట్లానే సీతాకోక చిలుక, లేడి దగ్గర శివనామం చెప్పించి వాటినీ హరీ అనిపించాడు. అంతలో అక్కడికి ఓ దంపతులు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వచ్చి అయ్యా! ఈ శిశువును ఆశీర్వదించండి అన్నారు. సన్యాసి ఎప్పటిలాగా శివనామం చెప్పమన్నాడు. జానపదుడు గడగడా వణికి, అయ్యా! అన్నాడు. మరేం ఫర్లేదు చెప్పు అని ప్రోత్సహించాడు సన్యాసి. ‘నమఃశివాయ’ అని జానపదుడు అనగానే ఆ శిశువు ‘అయ్యా! పరమ పుణ్యచరితా! మరొక్కసారి నమశివాయ అనవా’ అన్నాడు. ఇదేమి చిత్రం అని చూస్తుంటే ఆ శిశువు ఇలా చెప్పాడు. ‘అయ్యా! చీమ దగ్గరనుంచి ఇప్పటిదాకా ఆ శివనామం చెపితేనే మనిషిగా మారాను. మరి ఇప్పుడు మరోసారి శివనామం వింటే నేను దివ్యునిగా మారిపోతాను కదా. సందేహం ఎందుకు’ అన్నాడు. శివశబ్దంలోని మహిమ తెలుసుకొన్న జానపదుడు ఆగకుండా శివనామాన్ని జపిస్తూ కదులుతున్నాడు.


ఓంనమఃశివాయ

31, మే 2021, సోమవారం

తెలివితేటలకు లోటు లేదు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ  అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. 


కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.


అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.


బాగా చదువుకున్న  వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.


ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. 


కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo.  అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. 


కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...


ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.


ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.


నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.


మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.

ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు.  2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.


మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం  వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.


అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది.  ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!


ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.


రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.


అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు


చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.


అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.


ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.


CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.

అదే టాటా నానో పరిశ్రమ మోడీ  సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి.  అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.


మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.           అందుకే స్వదేశీ వస్తువులు వాడుకుందాం.... మనదేశ ఆర్థికవ్యవస్థను పెంచుకుందాం..  


*భారత్ మాతా కీ జయ్*

Sringari


 

Happyest man


 

తల్లి ప్రేమ


 

Vaccine in China