28, అక్టోబర్ 2022, శుక్రవారం

సింగారించెద తిరిపెమ!






 కం.

సింగారించెద తిరిపెమ!
బంగరు నానాథ! దేవ! భద్రము శివుడా!
పొంగకు త్వరపడి భువిలో
చెంగటి కార్తీకమందు చిఱుకొలువులకున్
( *కొలువులు=సేవలు* )
కం.
తుంటరి మనుజులు చింతిలి
యొంటరి వానిగ నినుగని యుచితవరాలన్
కొంటెగ కోరగవ చ్చొక
కంటను కనుగొని మెలగుమ! కాశీనాథా!
*~శ్రీశర్మద* 

1 కామెంట్‌:

Ravi Rachuri చెప్పారు...

చాలా బాగుంది.. మంచి పోస్ట్. ధన్యవాదములు.