🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
👨🏽రిటైరైనోడి బ్రతుకు 😩
1.పొద్దున్నే లేవకపోతే,👵🏾 లేవండి రిటైరయ్యానని ఎప్పుడూ పడుకోవడమేనా?
2. త్వరగా లేస్తే,👵🏾మీకు వయసైపోయి నిద్ర తగ్గిందని తెల్లారక ముందే లేచి అందరి నిద్ర పాడుచేస్తే ఎలా?
3.ఇంట్లో కూర్చుండిపోతే,👵🏾 అస్తమానం ఆ మొబైల్ పట్టుక్కూర్చోక పోతే వంటపనిలో సాయపడొచ్చు కదా?
4. ఒక వేళ ఇంటి బయట ఎక్కువ ఉంటే,👵🏾 కాలికి బలపం కట్టుకొని ఊరంతా తిరగకపోతే 'రామా కృష్ణా' అంటూ ఓ మూలుండవచ్చు కదా?
5. పూజ గదిలో ఎక్కువ సేపుంటే,👵🏾ఎప్పుడూ లొడలొడా మంత్రాలు చెప్తూ గంట వాయించి హారతులిస్తే దేవుడు దిగొస్తాడేంటి?
6. పార్ట్ టైమ్ జాబ్ చేసి కాస్త డబ్బులు సంపాదిస్తే,👵🏾రిటైరయ్యాక మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నానని పేద్ద ఫోజు, ఆ ఏడుపు అప్పుడు ఉండుంటే ఈ పాటికి నాలుగు అంతస్థుల మేడ ఉండేది.
7. భార్యను 'చార్ ధామ్'యాత్రకు తీసుకెళ్తే,👵🏾అబ్బో పేద్ద యాత్రలు! ఎదురింటి ఎంకట్రావ్ భార్యతో 'ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ మనాలి'తీసుకెళ్లాడు.
8. ఒకేళ 'ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ మనాలి' తీసుకెళ్తే,👵🏾 అంతలేసి డబ్బులు తగలేసే బదులు నాకు రవ్వల గాజులో లేక నెక్లేసో చేయించొచ్చు కదా?
9. అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై బిజీగా ఉంటే,👵🏾మొదట ఇంటి పనులు చేసి ఆ తర్వాత ఊరును ఉద్ధరించండి.
10. ఒక వేళ ఏది పట్టించుకోకుండా ఊరుకుంటే,👵🏾పొరుగింటి పుల్లారావును చూసి నేర్చుకోండి, అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై సెక్యూరిటీ గార్డ్ చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు. మీరూ ఉన్నారెందుకు?🤔
👌🏽ఓల్ మొత్తంగా నేను చెప్పేదేమిటంటే; రిటైరయ్యాక 'నేనది చేస్తా ఇది చేస్తా ' అని ఓవర్ గా ఇదైపోయి ఫోజులు కొట్టకుండా భార్య చెపినట్టు వింటే మంచిది. ఏది ఏమైనా భార్యచేత చీవాట్లు తప్పదు!
DISCLAIMER: అమ్మ తోడు ఇది మాత్రం నా అనుభవము కాదు. పక్కింటి పుల్లా రావు అగచాట్లు చూసి రాసింది.🤨🤔😩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి