20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఇసుకరాతలు

 నేటి జీవిత సత్యం. *అభిప్రాయాలు - -ఇసుకరాతలు.*


సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ... 

*"ఈ సముద్రం మహా దొంగ"* అని రాశాడు.


కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో...

 *"ఈ సముద్రం గొప్ప దాత"* అని రాశాడు. 


ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి.... 

*"ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి"* అని రాసింది. 


ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో .... *"‘ఈ సముద్రం ఒకటి చాలు  జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను "* అని రాశాడు.


అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. 


రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది... 


అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు...


ఇంకా... ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.


ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దాని తొలగించి ముందుకు అడుగు వేయండి.


నిజాయితీగా అంతరాత్మను తోడుగా చేసుకోండి.

వినయం, విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది..


సేకరణ. మానస సరోవరం

లైట్ భోజనం

 *లైట్ భోజనం*


ఎప్పుడొచ్చినా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొస్తారు, భోజనానికి ఎప్పుడూ ఉండరు....అనే మా చిన్ననాటి స్నేహితుడి భార్య మరీ నిష్టూరమాడుతుంటే చెప్పాను.


భోజనానికి పిలిస్తే ఎందుకు రాం. కానీ మా భయమల్లా మేం వస్తున్నామంటే మీరు పొద్దున్నే నాలుగింటికి లేచి బోల్డన్ని వెరైటీలు చేస్తారు. మీ కష్టం చూడలేకే మీ ఇంటికి భోజనానికి రావట్లేదు మేం. సరే ఇన్నిసార్లు పిలిచారు కాబట్టి మా షరతులు ఒప్పుకుంటేనే వస్తాం...అన్నాను.


సరే చెప్పండి. మీరు ఎలా అంటే అలాగే అన్నారావిడ.


సరే చెప్పాను. మరీ ఎక్కువ కాకుండా లైట్గా మామిడికాయ పప్పు, సాంబారు అంతే. అంతకు మించి ఇంకేమీ వద్దు. ఇక మీరు గుత్తొంకాయ కూర బాగా చేస్తారని మీ ఆయన చెప్తుంటాడు, కాబట్టి అదొకటే. ఇహ చిన్నచిన్నవంటారా.. ఏదో మరీ ఎక్కువ కాకుండా ఓ గుప్పెడు చల్ల మిరపకాయలు, రెండు అప్పడాలు.


ఇహ మీ అత్తగారు పెట్టిన గుమ్మడికాయ వడియాలు నాలుగు. నాకు గారెలు అంత ఇష్టం ఉండవు కాబట్టి మీకు గారెలు చేసే బాధ లేదు. ఏవో నాలుగంటే నాలుగు ఆవడలు, మరీ పెద్దవి కాకుండా చపాతీ సైజులో రెండంటే రెండు బొబ్బట్లు, ఇక మీ అమ్మగారు మీతోనే ఉన్నారు కాబట్టి ఆవిడ తరం పులిహోర అంతే. మా చిన్నప్పుడు మీ అత్తగారు దద్దోజనం, చక్రపొంగలి చేసి పెట్టేవారు. ఒకసారి ఆవిడని ఫోనులో అడిగి కొంచెం కొంచెం చెయ్యండి. 


యే పదార్థం అయినా ఎక్కువ చేసేసి తర్వాత ఇంటికి కూడా పట్టుకెళ్ళండి అని బలవంతం చెయ్యొద్దు. ఇక మీకు తెలుసుగా నేను ఆవకాయలు తినను. అందుకని కొంచెం మామిడి+కొబ్బరి కలిపిన పచ్చడి, రెండో పచ్చడి గురించి నాకు ఎక్కువ పట్టింపు లేదు, మీరు ఏదంటే అదే. ఇక భోజనానంతరం గులాబ్జామ్. 


ఇక ఇంత కంటే ఒక్కటి ఎక్కువ చేసినా వచ్చిన వాళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోతాం మరి మీ ఇష్టం అని నిష్కర్షగా చెప్పాను.


ఇంకో విషయం మర్చిపోయానండీ...మీకు తెలుసుగా నేను ఉదయం 11 గంటలకే భోజనం చేసేస్తా. అందుకని ఉదయం 10 తర్వాత కాఫీ తాగను. మేం పొద్దున్నే 7 కల్లా వచ్చేస్తాం. మరి మా ఆవిడకి కూడా ఏదో ఒకపని చెప్పండి. వూరికే కూర్చుంటే ఎలా. మీరు ఫిల్టర్ వేసి, మంచి పాలు తెప్పించి ఆ కాఫీల వ్యవహారం ఆవిడకి ఇవ్వండి. స్నేహితులం అయి మేం ఆ మాత్రం సాయం చెయ్యొద్దూ అన్నాను.


తర్వాత చాలా సార్లు వాళ్ళింటికి వెళ్ళాం కానీ భోజనం ప్రస్తావన లేదు ఎందుకో తెలియదు మరి.

సమస్యా పూరణం

 సమస్యా పూరణం;-మమత ఐలకరీంనగర్ 9247593432




*కలము యు కాగితమ్ములును కావలెనా


కవితాస్రవంతికిన్*


కలవరమొంద జెప్పెనట గాంచిన దృశ్యము మౌనివెంటనే


సులువుగ శ్లోకమై కుదుర సుస్వర వాక్కులు బ్రహ్మ మెచ్చగన్


జలజల భావజాలములు జారుచు వాహిని వోలె దూకగన్


*కలము యు కాగితమ్ములును కావలెనా


కవితాసవంతికిన్*

50+ సంవత్సరాలు నిండిన మేము రెండు తరాలకు

 ప్రియమైన  స్నేహితులు............. సరదాగా చదివి  ఆనందించి ........ నవ్వుకోండి ......!                                 🙏  🙏  🙏  🙏     👍  👍                             50+ సంవత్సరాలు    నిండిన   మేము  రెండు   తరాలకు    సాక్షులం..,

         

స్వచ్చమైన     గాలి  నీళ్ళు,.      పచ్చటి  పొలాలు.     🌾🌴

పరిశుభ్రమైన...,    వాతావరణం  లో  పుట్టి    పెరిగిన   వాళ్ళం... 

👦తలపై   నుండి    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని........,


📚  చేతికి     పుస్తకాల   సంచి తగిలించుకుని...,

ఒక్కడిగా    బయలుదేరి    దారిలో స్నేహితులను

ఒక్కొక్కళ్లను      కలుస్తూ పెద్దగుంపుగా.......  👦. 👦 👩. 👧 కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం....., 🚶🏃


జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు   లాక్కుంటూ ..., చిరుగు    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం ....., 🕺


10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు   వేసుకున్న......  ,             తరం మాదే.....! 🌲 పదవ తరగతిలో మాత్రమే పది రూపాయలు అది కూడా పరీక్ష ఫీజు చెల్లించిన వాళ్ళం మేమే


🤸🤹

గోలీలు,     బొంగరాలు,

కర్రా బిళ్ళ, కోతి కొమ్మ గంటల తరబడి కబడ్డీ ఆడిన తరం మాది


?


🚴🏊🤽

బడికి    వేసవి కాలం   సెలవులు రాగానే   గంటల తరబడి బావిలో ఈత ఒకరిని ఒకరు ముంచుకొనుడు నేరేడు చెట్లు. ..  సీమ తుమ్మ చెట్లూ..,     ఈతచెట్లు    ఎక్కి కాయలు   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లోఎండ్రకాయలు, చేపలు పట్టి..,. వొంకల్లో, వాగుల్లో  స్నానాలు     చేసిన   వాళ్ళం. 


🪔🪔🪔

దీపావళి  కి రెండు మూడు పైసలకు ఒక్కొక్క టపాకాయ కొట్టి ఆ తర్వాత ఉన్నవాళ్లు కొడుతుంటే చూసిన వాళ్ళము 


🌦️ వర్షం   వస్తే  యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం......!


📖 second    hand   text  books     కోసం     పరీక్షలు 

అయినప్పటి    నుండి   ముందు తరగతి   వాళ్ళని    బతిమాలిన తరం......., 🤣


🚴సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క  తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...


✉️ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 🌴


పండగ    సెలవులు,

వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు

ఎన్ని సెలవులు  వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా   ఆటపాటలతో ఆనందాన్ని.  🤼  🏃🏻 ⚽ 🏸 🪁🏹  🤸  ⛹️. 🏊   అనుభవించిన    తరం వోళ్ళం...,


 👨👩👧👦 పెద్దలు  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని...,   పొట్ట    చెక్కలయ్యేలా

నవ్వుకున్నదీ మేమే.... ☘️


 😄ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,

అంతామేమే  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...🍁




👨👩👧👧చుట్టాలు    వస్తేనే అమ్మ     కోడి కూర..... వండి పెట్టిన  తరం....🍁

అత్తయ్యా,

మామయ్య,.  ,పిన్ని,,    బాబాయ్,   అక్కా   ,బావ       అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న  తరం,

స్కూలు    మాష్టారు    కనపడితే భయంతో    పక్కనున్న     సందుల్లోకి    పారిపోయిన   తరం........... 🤣🤣🌺


కట్టెల    పొయ్యి    మీద  వండిన అన్నం/కూర    తిన్నవాళ్ళం ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన    పరిమళాన్ని ఆస్వాదించిన   తరం వాళ్ళం..,🌱


తాతయ్యలు   అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మా    నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,.    అత్తయ్య    మామయ్య,   అక్కలు    చెల్లెళ్లు    అన్నయ్యలు   తమ్ముళ్లు   అందరం    ఒకే  దగ్గర   చేరి    మధురమైన      అనుభూతితో  కూర్చుని   అన్నం.  తిన్న    తరం ..,..🦋


అమ్మమ్మలు / నాయమ్మల   చేత గోరుముద్దలు   తిన్నది,.   అనగనగా ఒక రాజు....      కథలు   విన్నది మేమే.......  ,🌵


నూనె పిండితో    నలుగు పెట్టించుకుని     కుంకుడు  కాయ పులుసుతో      తలంటు   స్నానం చేయించు కున్న      తరం...,🍀


📻రేడియో,

దూరదర్శన్📺

టూరింగ్ టాకీస్📽️.   కాలం చూచిన వాళ్ళం... .🍁


🎥 40 పైసల  నేల   టిక్కెట్  తో నేల   మీద   కూర్చుని....., 

1.00   chair   టిక్కెట్ తో    లో కూర్చుని    సినిమా  చూసిందీ    మేమే...🌵


 స్కూల్   , కాలేజీ   రోజుల్లోనే ఎలక్షన్లు   చూచిన    వాళ్ళం.. .🍂


అమ్మా   నాన్నా    తో     సంవత్సరానికి   ఒక సారి,   పరీక్ష పాస్     అయ్యావా.. ..    అని మాత్రమే    అడిగించు కున్న   తరం వాళ్ళం...🌹


😄చదువులు తక్కువైనా సాంప్రదాయం సంస్కారాన్ని చూసిన వాళ్ళము  చదువులు ఎక్కువ సంస్కారం తక్కువ ఉన్నవాళ్లను చూసిన వాళ్లము😂

📲🖥️🖨️

ప్రస్తుత0   ఉన్న    Whatsapp Fb skype లు   మీతో   పాటు సమానంగా     వాడేస్తున్న మాతరం...,

మేమే    ఆ  తరానికి    ఈ  తరానికి మధ్యవర్తులం...

 మేమే-- -💐


 అవును.......రెండు   తరాల   మద్యలో    జరిగిన   అనూహ్యమైన    మార్పులకు   మేమే  సాక్షులం  🌸


   అప్పటి గుండె   లోతుల్లో   నుంచి   వచ్చిన     ప్రేమని   చూసిన  వాళ్ళం..........!

ఇప్పుడు    గుండీల   పైనుంచి  వచ్చే    ప్రేమని 

చూస్తున్న వాళ్ళం.......!! 🌷

😄😄 అప్పుడు ఊర్లో ఒకరిద్దరికి మాత్రమే బీబీ షుగర్ చుసిన వాళ్ళము ఇప్పుడు ఇంటింటికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళని చూస్తున్న వాళ్ళము😳😳


ఒక  విధంగా  చెప్పాలంటే   మేం  చాలా     అదృష్టవంతులం...?

🙏🙏🙏👍👍👍....    ప్రియమైన  స్నేహితులు సరదాగా చదివి  ఆనందించి  నవ్వుకోండి .....!!    🙏🙏🙏🙏👍

అహం అనే భావన

 అహం అనే భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్ఠం, అఖండం అయిన సత్‌ స్వరూపం ‘నేను, నేను’ అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది’ అని ఈ శ్లోక భావం. భగవాన్‌ రమణ మహర్షి రచించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞాన గ్రంథం.. ‘ఉపదేశ సారం’లోని 20వ శ్లోకమిది. మనో నాశనం కావాలంటే ‘నేను’ అనే భావన తొలగిపోవాలని తెలిపిన రమణులు.. ఆ భావన పోయాక మిగిలి ఉండే స్థితి గురించి ఇందులో వర్ణించారు. అహం భావన పడిపోయాక మిగిలే ‘నేను’.. సత్యమైనది. అది జ్ఞాన స్వరూపం. సత్‌ రూపం. అఖండం, పరిపూర్ణం అయిన శాశ్వత వస్తువు. ఈ ‘నేను’నే రమణ మహర్షి ‘తాను’ అని వ్యవహరించేవారు. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు అన్ని భావనలు, మనస్సు అంతమైనా కూడా ప్రకాశిస్తూ ఉండేది ఇదే. కాకపోతే మనస్సు ఆ ‘నేను’లో లయమైందే తప్ప నశించలేదు కనుక..

మెలకువ రాగానే మళ్లీ మనసు, దాంతోపాటు ఈ జగత్తు, సుఖదుఃఖాలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా, విచారణతో ‘అహం’ భావనను నాశనం చేస్తే ఆ స్థానంలో తాను (ఆత్మ) ‘నేను నేను’ అని స్వయంగా ప్రకాశిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మ దర్శనం. అయితే.. ఆత్మదర్శనం అనే మాట నిజానికి పెద్ద తప్పు. ఎందుకంటే.. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. దర్శించడానికి అది దృశ్యమూ కాదు. అది మనచే చూడబడే వస్తువే అయితే.. అది పరిమితమైనదే అవుతుంది. పరిమితమైనది నశిస్తుంది. అలా నశించేది ఆత్మ కాదు. అది ఏకం, అద్వయం, సర్వవ్యాపకం. అది మనకన్నా వేరు కాదు. కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేం. ఆత్మ దర్వనం అంటే.. అది ‘నేనే’ అని అనుభవం కలుగుతుందంతే.

ఆత్మదర్శనం కేవలం విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. పూజ, యజ్ఞం, దానధర్మాలు మొదలైన కర్మల వల్లగానీ, జపం, ధ్యానం మొదలైన సాధనల వల్లగానీ, ప్రాణాయామం మొదలైన ప్రక్రియల వల్ల గాని ఈ ‘అహం’భావన తొలగిపోదు. ఈ సాధనలన్నీ కొన్ని ప్రక్రియలు మాత్రమే. ‘అహం’ పుట్టుక ఎక్కడో వెతకడం (విచారణ) వల్లనే అది పడిపోతుంది. అప్పుడే ఆత్మదర్శనం. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడై తగిన శ్రద్ధ చూపిస్తే సద్గురువు ద్వారా వేదాంత బోధ వింటూ ఉండగానే అతడికి ఈ స్థితి సద్యోఫలంగా లభిస్తుంది. ఆ అర్హత లేనివారు దాన్ని సంపాదించడానికే జపధ్యానాదులు. వాటి ద్వారా అర్హత సంపాదిస్తే అప్పుడు విచారణ చేసి, అజ్ఞానాన్ని తొలగించుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. 

ఆత్మ ఎక్కడి నుంచో రాదు. అది స్వయం వ్యక్తం. అందుకే రమణులు ‘స్ఫురతి హత్‌ స్వయం’ అన్నారు. వర్షాకాలంలో సూర్యుడు మబ్బుల వెనుక ఉండడం వల్ల వెలుగు కనిపించదు. అంతమాత్రాన సూర్యుడు లేనట్టు కాదు. ఆయనెప్పుడూ జ్వాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంటాడు. ఆత్మ కూడా అంతే. అజ్ఞానమనే మేఘాలు కప్పివేయడం వల్ల మనకు కనిపించడం లేదంతే. జ్ఞానమనే గాలి వీచినప్పుడు అజ్ఞానపు మబ్బులు తొలగి ఆత్మదర్శనమవుతుంది. అందుకే.. ‘నేనడంగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు’ అన్నారు రమణ మహర్షి.

ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?

ఈ మధ్య చాలమంది గురువులు కొంచెం పేరు సంపాదించి మీడియాలలో tvలలో కనిపిస్తూ ఆత్మసాక్షాత్కారం కలిగింది అని చెప్పుకుంటూనే పరమాత్మ ఎవరు అనే విషయాన్ని మరుగున పరచి శైవ వైష్ణవ శాక్తేయ గొడవలు సృష్టిస్తున్నారు కొందరైతే గ్రంథ రచనచేసి మరింత ప్రచారము చేసుకుంటున్నారు.

మనస్సు ఆత్మతో లయం చేయడమే ఆత్మసాక్షత్కారము అని ఒక tvగురువు ఈమధ్యనే ఒకగ్రంధంలో వ్రాశారు.

మనస్సు ని ఆత్మతో లయం చేస్తే ఇంద్రియనిగ్రహం వస్తుంది కాని ఆత్మసాక్షాత్కారం ఎలా వస్తుంది.

ఆయనచెప్పినది ఏమిటంటే ఆదినారాయణుడు వేరు సదాశివుడు వేరు శివుడువేరు విష్ణువు వేరు శంకరుడు వేరు మహేశ్వరుడు వేరు పరాశక్తి వేరు అని

శివుడే పరబ్రహ్మం అని సెలవిచ్చారు.

అత్మసాక్షాత్కారం పొందిన వాడు చెప్పే మాటలేనా ఇవి.

అత్మసాక్షాత్కారం అంటే సర్వం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడం.

ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మని పరమాత్మతో ఒక్కటి చెయ్యటం.

ఆత్మసాక్షాత్కారం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలిని శక్తిని

మేల్కొలిపి ఆప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారమునకు చేర్చడం.

ఆత్మసాక్షాత్కారం పొందినవాడికి సర్వము ఒక్కటే అంతా నిరాకార నిర్గుణ నిర్వికల్ప నిర్లింగ సర్వాతీత పరబ్రహ్మస్వరూపమే ఉన్నదని తెలుసుకోవడం.

ఆ పరబ్రహ్మస్వరూపానికి ఎలాంటి పేరు లేదు ఏలాంటి గుణములు లేవు నిరాకారుడు సర్వానికి అతీతుడు లింగరహితుడు ఆపరబ్రహ్మమునే ఆదినారాయణుడు అని పరమశివుడని ఆదిపరాశక్తి అని ఎవరికి నచ్చినట్లువారు పూజిస్తారు.

ఎవరిని పూజించినా చేరేది ఒక్కరికే.

ఎవరిని స్మరించినా అది ఒక్కరినే.

నారాయణుడు శివుడు బ్రహ్మ విష్ణువు శంకరుడు వేరు వేరు కాదు ఒక్కటే ఒకేపరబ్రహ్మస్వరూపులు.

నిరాకారము(పరమాత్మ)

సాకారము(జీవాత్మ)

ఒక్కటే.

పరమాత్మ యోగమాయచే శూన్యస్థితి నుండి జీవాత్మగా మారుతున్నాడు.

జీవాత్మ యోగసాధనతో పరమాత్మలో లయమయ్యి ఆశూన్యస్థితిని చేరి పరమాత్మగా మారుతున్నాడు.

సృష్టి స్థితి లయములో స్థితి శాస్వతమైనది అదే పరబ్రహ్మస్వరూపమైన శూన్యస్థితి.

అంటే నీరాకారపరబ్రహ్మమే శాశ్వతమైన స్థితి ని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము.

ప్రతీ జీవి పరమాత్మ(నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము...

ధర్మాకృతి

 ధర్మాకృతి : మాతృమూర్తి 


తమ అక్కగారిని పరామర్శించడానికి వచ్చిన మహాలక్ష్మమ్మ గారు తన పుత్రునే సన్యాసిగా ముండన కాషాయదండ కమండలాదులతో కడసారిగా దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. చిదంబర అగ్నిప్రమాదం తరువాత గిణిని గుండెలకు హత్తుకొని తండ్రితో కూడా కుమారుని ఎక్కడికీ పంపనని పలికిన మాతృమూర్తి తన వెంటనే వచ్చిన కుమారుని శ్రీమఠానికి సమర్పించి తిరుగు ముఖం పట్టారు.


మహాలక్ష్మమ్మ గారికి గిణి అంటే ప్రత్యేక అభిమానం అని మనం ముందే చెప్పుకొన్నాము. చిన్నతనం నుంచీ ఆమె తma కుమారుని దగ్గర కూర్చోబెట్టుకొని అనేక పురాణ కథలు చెప్పేవారు. అనేక శ్లోకాలు నేర్పించేవారు. చిలుక పలుకుల గిణి అమ్మ చెప్పినవన్నీ ఇట్టే గ్రహించి తన రమ్యమైన కంఠంతో ఒప్పగించేవారు. అమ్మగారిది ధర్మశాస్త్రంలో గట్టి పాండిత్యమున్న నాగేశ్వర శాస్త్రి కుమార్తె అవడం వలన నిప్పులు కడిగే ఆచారము. స్వామివారి మడి మరి వారిదేనేమో. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు హేజీబు కుమారుడు. ఆయనవి రాచపోకడలు. సంగీతాలు, స్నేహాలూనూ. 


గిణికి అప్పుడ్ పదమూడేండ్లు. ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ విసిగిస్తూ సంతోష పెడుతూ తననలరించే ఈ ముద్దుల తనయుడు ఈ పాలుగారే పసివాడు నిస్సంగునిగా, నిర్లిప్తునిగా జీవితాంతం సన్యాసిగా గడపబోతున్నాడా?” లొట్టలు క్రొంబొదుగులో జిలు ముట్టియగ్రుమ్ముదూడ నా చిత్తిని చేతబట్టుకొని సింహఘటాలి నెదుర్ప జూచెదో” అంటారు విశ్వనాథవారి దశరథుడు. అప్పటికి శ్రీరామునికి పదునారేండ్లు. బ్రహ్మర్షి విశ్వామిత్రుని తోడు ఉంది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మన గిణికి పట్టుమని పదమూడేండ్లు కూడా నిండలేదే! మళ్ళీ తన కుమారుని తాను కనులారా చూడలేదు. మాట్లాడలేదు. ఈ హఠాత్సంఘటనకు బిత్తరపోయారామె.


కామకోటి పీఠాచార్యుల వారికి, వారి పూర్వాశ్రమ బంధువులు, తండ్రితో సహా యావన్మందీ సామాన్య శిష్యగణంతో పాటు వచ్చి నమస్కారం చేసుకొంటారు. వారికి ప్రత్యేక మర్యాదలు ఏమీ ఉండదు. తల్లిగారు మాత్రం ఎదురుబడరు. పీఠాధిపతుల మర్యాదననుసరించి పరదేవతకు తప్పించి నమస్కరించే అవకాశం లేదు. అయితే తల్లి ఎదురుబడితే యతి అయినప్పటికీ నమస్కరించక పోతే ధర్మభంగం అవుతుంది. అందువల్లనే వారు తల్లిగారిని కలుసుకోరు. ఈ విషయం పరంపరగా శ్రీమఠంతో పరిచయమున్న మహాలక్ష్మమ్మ గారు ఎరుగుదురు. ఈ ఎరుక వారికి మరింత దిగులు కలుగజేసి ఉంటుంది.


తరువాత కాలంలో కూడా ఎవరైనా వారి ముందు శ్రీవారి ప్రస్తావన తెస్తే తల్లి తండ్రులిద్దరూ మౌనంలోకి జారిపోతుండేవారు. బహుశః తమ పుత్రుడు లోకోద్ధరణకై అవతరించిన దైవాంశ సంభూతుడని సరిపెట్టుకొన్నారేమో! పదమూడు సంవత్సరములుగా పెంచుకొన్న మమకారం, ప్రేమ ఆశలు సమూలంగా తెంపుకొని తన గారాలపట్టిని మనకై సమర్పించి వెనుదిరిగారు జగన్మాత. జీవన్ముక్తుని కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు. వారిపై తరాలు క్రింది పదితరాలు తరించాయి. స్వామివారి కాలంలో జీవించి వారిని దర్శించిన మనందరం తరించాము.


పట్టుబట్టి అమ్మతో శ్రీమఠానికి బయలుదేరిన గిణి శ్రీమఠానికి అధిపతులుగా ఒంటరిగా మిగిలిపోయారు. తరువాతి కాలంలో చాటుగా దర్శించాలనీ, పుత్రుని వాక్యములు వినాలనీ మహాలక్ష్మమ్మగారు రెండు మూడు పర్యాయములు ప్రయత్నించారట. అది తెలుసుకొనిన స్వామివారు అర్థాంతరంగా ఆ ఊరినుంచే మకాం ఎత్తేశారట. సన్యాసాశ్రమపు నిస్సంగత్వం క్షణికంగానైనా చెదిరిపోతుందేమోనన్న ఒక healthy fear. అయితే తమ 95ఏళ్ళ వయస్సులో వారి అమ్మగారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వామివారి కన్నులలో ఆ పదమూడేళ్ళ మెరుపు, మురిపం ఉత్సాహం కన్పించాయి.


1932 జూన్ 14వ తేదీన శ్రీవారు బుగ్గ గ్రామంలో విద్వద్గోష్ఠిలో మునిగి ఉన్నారు. దూరంగా చేతిలో తంతితో మఠం మేనేజర్ నిలుచుని ఉండడం గ్రహించారు. కుంభకోణం నుంచేనా టెలిగ్రాం అని అడిగారు. ఔనని సమాధానం వచ్చింది. శ్రీవారు మౌనముద్రాంకితులయ్యారు. సభ నిశ్శబ్దంగా ఉంది. స్వామి మనస్సులో ఉవ్వెత్తున లేస్తున్న భావతరంగాలు కనులనుండి బయటకు దూకటానికి ప్రయత్నిస్తున్నట్లున్నాయి. మరుక్షణంలో తమాయించుకొన్నట్లు కన్పించారు. మాతృనిర్యాణం విన్న సన్యాసి ఏం చేయాలి అని పండితులను ధీరోదాత్తమైన కంఠధ్వనితో ప్రశ్నించారు. పండితులకు విషయం అర్థం అయింది. చింతాక్రాంతులయ్యారు. స్వామివారు నిదానంగా లేచి బయలుదేరారు. శిష్యులందరూ భగవన్నామ సంకీర్తనతో సామిని అనుసరించారు. స్వామి అక్కడకు రెండు మైళ్ళ దూరంలో నున్న జలపాతంలో స్నానం చేశారు. పండితులు, పామరులు, పరివారం యావత్ శిష్యగణమూ శ్రీవారి వెనుకనే స్నానం చేశారు. మఠపక్షాన భూరిదానాలు చేయబడినవి. పదవ రోజున పెద్ద ఎత్తున అన్నదానం చేయబడింది.


శ్రీవారు అవతారం చాలించేరోజు ఉదయాన అమ్మగారి జన్మ స్థలమైన ఇచ్చంగుడి వేదపాఠశాలలో పెట్టడానికి తీసుకొని వెళుతున్న మహాలక్ష్మమ్మగారి పటం శ్రీవారి ముందుంచబడింది. అప్పటికి శ్రీవారు చాలాకాలంగా మౌనంగా, సహజ సంవిన్మయీస్థితిలో ఉన్నారు. అయినా ఆ పటాన్ని చూసి, చేతితో ప్రేమగా స్పృశిస్తూ అమ్మ అంటూ గౌరవాదరాలతో అలా ఎంతోసేపు చూస్తూనే ఉన్నారట. ఆ రోజున స్మరించిన ఇంకో విషయం తనకు సన్యాస దీక్ష ఈయబడిన కలవై శ్రీవారు ఏ ఊరిలో ఉన్నా ప్రతిరోజూ సంధ్యావందనం అయిన వెంటనే కనులు మూసుకొని ఖచ్చితంగా ఒక గంట జపం చేసేవారు. ఇది శ్రీమఠంలో ‘ఒరుగంట జపం’గా ప్రసిద్ధి. ఆ ఒక గంట జపం అయిపోయిన తరువాత కలవై వైపుకు తిరిగి నమస్కారం చేసేవారు. అక్కడి గురు పరమ గురువుల అధిష్ఠానాల మధ్య అనేక రోజులు ఆవాసం చేశారు. కలవై అంటే కలయిక అనే అర్థం కూడా ఉన్నది. ఆ రోజు పదిగంటల సమయంలో అకస్మాత్తుగా కనులు తెరిగి కలవై వైపు నమస్కారం చేసి కలవై అన్నారట. అక్కడున్న పారిషదులు శీవారు కలవై వెళ్ళాలనుకుంటున్నారేమో అనుకున్నారు. ఈవిధంగా తమ అవతార విరమణ సమయంలో స్వామి తమ జన్మకారకులయిన తమ అమ్మగారిని, పునర్జన్మ కారకులయిన గురు పరమ గురువులను స్మరించుకొన్నారు. స్వామిని మనకు ప్రసాదించిన వారు మనందరకూ నిరంతరమూ స్మరణీయులు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శబ్దార్థములరీతి

 శబ్దార్థములరీతి శంకరాంబికలిట్లు

అర్ధనారీశ్వరాకృతిని దాల్చి

మమ్మేల వచ్చిరి మమతానుబంధమ్ము

ముప్పరిగొన్నట్లు ముదముమీర

తల్లియైతానంత తనయుల పోషించు

జనకుడై తానంత సంస్క రించు

భువనాల భయమంత పోగట్టు కళలోన

నైపుణ్యమున్నట్టి నిపుణమతులు కాలకంఠుడతడు కాపాడు జగమెల్ల

కామాక్షి మాతయై కరుణజూచు

ఆ.వె.భక్త జనులకెపుడు ప్రాపుగా నుండగా

భయము వీడి మనము బ్రతుక వచ్చు

మాయ తెరను ద్రుంచ మనలోన కలరయ్య

వెదికి చూడ నీకు వేద్యమగును

(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

పృధ్వీలింగం( కాంచీపురం)🙏

 https://www.facebook.com/100043481421388/posts/pfbid02K3o6EiCJjy9k2UAhFcZGjUWw7A7LDT7BHgR4jKv5B6JBm3wsG7u7ma5QsaRh8cxSl/

🙏ఏకామ్రేశ్వరుడు-- 

పృధ్వీలింగం( కాంచీపురం)🙏


🙏🌹🙏🌹🙏🌹


పంచభూతలింగాలలోని "పృధ్వీలింగం"గా పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రం కాంచీపురంలోని "ఏకామ్రేశ్వరుని" దేవాలయం. 


దక్షిణభారతదేశంలోని అతి పురాతనమయిన పట్టణాల లో "కంచి" ఒకటి.చెంగల్పట్టు నుండి అరక్కోణంకు  ఉన్న రైలుమార్గంమధ్యలో ఈ పట్టణం ఉంది. తిరుపతి నుంచి కంచి 110 కి.మీ దూరంలో ఉంది.

              శ్రీ చక్రస్వరూపిణి అయిన దేవిని ఉపాసించేందుకు కంచిలోని "శ్రీకామాక్షిదేవి" ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.దాదాపు వంద దేవాలయాలతో స్వర్ణనగరంలా విలసిల్లే కాంచీపురం వైష్ణవులకూ,శైవుల కూ ఆరాధ్య మైనది. బ్రహ్మ యజ్ణంచేసి "వరదరాజ" రూపంలో విష్ణువును వెలయింపజేసిన తపోభూమి ఇది.


ఇక్కడనే పార్వతిదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు మామిడిచెట్టు రూపంలో వెలిసినట్లు భావించి సేవించిం దని ప్రతీతి. ఆచోటనే "ఏకామ్రేశ్వర దేవాలయం" ఉంది. ఇది కంచిలోని అన్ని ఆలయాలకన్నావిశాలమైనది,  ప్రాచీనమైనది.ఇక్కడ గొపురాలు,ప్రాకారాలు స్థంభాలు అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. 

 

                       శివ రూపంలో వెలిసిన ఇక్కడి మామిడిచెట్టు 3500 సంవత్సరాల నాటిదని చెబుతారు. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం. ప్రస్తుతం ఈ మామిడివృక్షం యొక్క  కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.


స్థలపురాణం.....

పార్వతిదేవి శివునికన్నులు మూయడం, అందువల్ల  జరిగిన పరిణామాలు వలన పార్వతిదేవి తపస్సుకు బయలుదేరడం , ముందుగా కాశిలో తపస్సు చేయడం, అక్కడనుంచి కంచివచ్చి మామిడి చెట్టుక్రింద సైకిత లింగంచేసి పూజలు చేస్తూ ఉండటం, పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం, తత్ఫలితంగా శివుని జటాఝూటం నుండి గంగానది పోంగడం, పార్వతిదేవి ఇసుకతో చేసిన లింగం కోట్టుకునిపొకుండా ఆలింగనం చేస్కోవడం, శివుడు సంతొషించి అనుగ్రహించడం,  అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అర్దనారీశ్వరులుగా ఏకమవడం అందరికీ తెలిసినదే కదా! అందువలన ప్రస్తావించలేదు.


        ఇక్కడి ఏకామ్రేశ్వరలింగం "పృధ్వీలింగం" కనుక ఇక్కడి మట్టికూడా చాలా గొప్పదంటారు. ఈ క్షేత్రంలో చేసిన మంచిపని ఏదయినావెంటనే  ఫలిస్తుందనీ,అది నానాటికీ పెరుగుతుందని కూడా అంటారు.


 కంచిలో ఉండటానికి వసతికి, భోజనానికి ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ గుడికి అందుబాటులోనే ఉంటాయి.


🙏🌹🙏🌹🙏🙏

తెలుసుకోవసిన సత్యలు.

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


_*జీవిత పయనంలో తెలుసుకోవసిన అక్షర సత్యలు.*_ 


1. అజ్ఞానం : - అంటే ఏమిటి ?


నన్ను నేను తెలియక విషయాదులయందు ప్రవర్తించుట, శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు, మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.


2. జ్ఞానము :- అంటే ఏమిటి ?


నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను, నేను మనసును తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావి కావు. నేను మనసును కాను. నేను ఆత్మస్వరూపుడను. నేను ప్రకాశరూపుడను. ప్రజ్ఞా స్వరూపుడను. ఈ ప్రజ్ఞయే పిపిలికాది బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనటయే జ్ఞానము.


3. విజ్ఞానము :- అంటే ఏమిటి ?


ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము. 


4. సుజ్ఞానము :- అంటే ఏమిటి ?


పైన చెప్పిన అనుభవములకు కారణము ఎఱుక అనియు. (ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే). ఈ ఎఱుకే జీవుడి అజ్ఞానమును, ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదనియూ, కాలప్రభావమున మరలా ఎఱుక సంకల్పించి, జీవేశ్వర జగత్తుగా మారవచ్చుననియూ, త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు, త్రిగుణముల యొక్క వ్యవహారమే సృష్టి అనియూ, ఇది కాలచక్రముగా అనేక బ్రహ్మాండములను పరిపోషించుచున్నదనియూ ఎరిగి, త్రిగుణములను నిరశించి, ఎరిగే ఎఱుకను వీడి, ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము...

.

.

.

అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని 

పంచతంత్ర వాక్యం. 


ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది. 


ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి. 


ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.


డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.


ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది. అప్పుడా పండితుడు- అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.


తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం. సోదరుడినుంచి వచ్చినది అధమం. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం. విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశపడకూడదు.


సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు. ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు. ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం...

.

మనిషి జీవిస్తున్నాడు 

కానీ జీవించడం తెలియదు


మనిషి పని చేస్తున్నాడు కానీ 

ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని తెలియదు


అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించి తన తక్షణ కర్తవ్యమేమిటో తెలుపమని వేడుకున్నాడు.


కార్పణ్యదోషో పహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః 

యచ్ర్ఛేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌


‘‘నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించు’’ అని ప్రార్థించాడు. 


జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే, ప్రామాణిక పరంపరకు చెందిన ఆచార్యుణ్ణి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించవలసిన ఆవశ్యకతను పై సందర్భం సూచిస్తుంది. అటువంటి ఆచార్యుడు కచ్చితంగా విశుద్ధ కృష్ణ భక్తుడై ఉండాలి.


భగవద్గీత విన్న అర్జునుడు దృఢ నిశ్చయుడై, మనస్సులో ఉప్పొంగిన ఉత్సాహంతో... ధనుస్సు చేతపట్టి నిలచి, వీరోచితంగా పోరాడాడు. విజయాన్ని సాధించాడు. 


అర్జునుణ్ణి తన కర్తవ్యం వైపు నడిపించేలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి? 


భగవద్గీతలో శ్రీకృష్ణుడు అస్త్ర శస్త్రాల గురించి గానీ, యుద్ధ నైపుణ్యాల గురించి గానీ ప్రస్తావించలేదు. మన నైపుణ్యాలు, నేర్పరితనం లాంటివేవీ... మన జీవితంలో ఎదురయ్యే ఆత్రుత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది... జీవిత సత్యాల గురించి. తద్వారా, ఉన్నత జీవన విధానాల పట్ల అర్జునునికి ఉన్న అపోహలను కృష్ణుడు మార్చేశాడు.


ఈ దేహం మనం కాదు, మనమంతా ఆత్మ స్వరూపులం అంటూ మానవ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో జీవుని నిజమైన స్వరూపాన్ని గురించి వివరించాడు. సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలని, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహంలో బంధితులై జీవిస్తున్నారన్న సత్యాన్ని బోధించాడు. 

.

పకృతి జీవజాతితో సమానంగా 

మానవజాతి మనగడ సాగిస్తుంది 


అయితే మానవులు 

కట్టుబాట్లు పెట్టుకున్నారు పేరుకు మాత్రమే 


కానీ 


అన్ని జీవుల మాదిరిగానే మానవుడు బ్రతకాలని కోరుకుంటున్నారు 


మనిషి కట్టుబాట్లలో ఉన్న 

మనసు మాత్రం పకృతి పరంగానే సంచరిస్తుంది


మానవ జాతిలో 

ఎవరిని నమ్మకూడదు 

ఎవరిని ప్రేమించకూడదు 

ఎవరిపై నమ్మకాలు పెట్టుకోకూడదు ఎక్కువ

ఎందుకంటే అందరూ మోసం చేసేవారు అందరూ వదిలి వెళ్ళిపోయేవారు

.

కన్నతల్లి అయినా ఎవరైనా మోసం చేయవచ్చు 

కన్న తండ్రి అయిన ఎవరైనా మోసం చేయవచ్చు 

అన్నదమ్ములైన మోసం చేయవచ్చు

అక్క చెల్లెలు అయినా మోసం చేయవచ్చు

భార్య కూడా మోసం చేయవచ్చు

భర్త కూడా మోసం చేయవచ్చు

బిడ్డలు కూడా మోసం చేయవచ్చు

కొడుకులు కూడా మోసం చేయవచ్చు

.

అందరు మోసం చేస్తారు ఏదో ఒకనాడు తప్పకుండా

అందరు మోసపోతారు ఏదో ఒకనాడు తప్పకుండా


అందుకే ఎవరి మీద ఎక్కువ అంచనాలు వేయకూడదు

ఎక్కువ ప్రేమ పెట్టుకోకూడదు

ఎవరిపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకూడదు

ఎవరిని కంట్రోల్ లో పెట్టాలని చూడకూడదు


అందరూ ఇలా ఉంటే బాగుండు అని అనుకోకూడదు

ఎవరు మీరు అనుకున్నట్లు ఉండరు ఉండరు ఉండరు ఉండలేరు ఇది రాసి పెట్టుకోండి.


సర్వేజనాసుఖినోభవంతు.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కృష్ణుడి గురించి చెప్తుంటే

 #Karthikeya2 సినిమా అద్భుతమే కాదు నాకైతే మహా అద్భుతమే అని చెప్పొచ్చు👌👌👌🚩


మన చరిత్రని స్పృశిస్తూ ఎన్నో అద్భుతమైన కథలు చెప్పొచ్చు అని మొత్తుకుంటూనే ఉన్నాం ఎప్పటినుంచో... ఇప్పటికి కుదిరింది ఏదో డైరెక్టర్ #Chandumondeti గారి పుణ్యమా అని... ఆ దిక్కుమాలిన ప్రేమకథలు, వెంటపడడం, ఆమె/అతడు లేకపోతే జీవితమే వ్యర్థం అన్నట్టు దిక్కుమాలిన కథలు చూపించి యువతను పెడదోవ పట్టించే సినిమాలే అన్నీ.


మ్యూజిక్ డైరెక్టర్ #kaalabhairava భలే చేశారు సంగీతం. ఆద్యంతం అద్భుతమైన సంగీత ప్రవాహంలా సాగింది. 


#AnupamKher కనిపించే 10 నిమిషాలు, కృష్ణుడి గురించి చెప్తుంటే భక్తితో, భావోద్వేగంతో మనసు కదిలిపోతుంది ఒక్కసారిగా....అసలు కృష్ణుడు దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి అద్భుతాలు చూడొచ్చు అనే అనుపమ్ ఖేర్ గారి సందేశం సినిమాకి హైలెట్.


🚩గీతతో కోట్లమందికి దారిచూపించిన అతనికన్నా గురువెవ్వరు❓


🚩రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవ్వరు❓


🚩నమ్మినవారి కోసం ఎంతటి వలయాన్నైనా ఛేదించే అతనికన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు❓


🚩యుద్ధం చేస్తే ఇన్ని లక్షల మంది తెగటారిపోతారు, ఇన్ని లక్షల లీటర్ల రక్తం ఏరులై పారుతుంది, యుద్ధం వద్దు సంధి ముద్దు అని చెప్పి ఒప్పించాలని శతకోటి ప్రయత్నాలు చేసిన అతనికన్నా ముందుచూపున్న గొప్ప శాంతిదూత ఎవరు❓


🚩చూపుతోనే మనసులోని మాటచెప్పే అతనికన్నా గొప్ప సైకాలజీస్ట్ ఎవరు❓


🚩వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు❓


🚩నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు❓


🚩ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు❓


🚩 నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమో వీర స్వర్గమో కర్త్యవం ముఖ్యం ఫలితం దైవాధీనం అని చెప్పి నడిపించిన అతనికన్నా గొప్ప దార్శనికుడు ఎవరు❓


🚩కరువూ కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజేవ్వరు❓


🚩హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న అతన్ని మించిన డైమటాలజిస్ట్ ఎవరు❓


🚩అన్ కంట్రోలబుల్ ఆర్.పి.యం.తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన డైనటిక్ ఇంజనీర్ ఎవరు❓


🚩మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించే అతనికన్నా గొప్ప వీరాగి ఎవరు❓


🚩అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, మ్యూజిషియన్, మేజిషియన్, దార్శనికుడు అనంతంలో నిండియున్న సృష్టి🚩


కృష్ణుడు అంటే సత్యం, ఆనందం, పరబ్రహ్మ స్వరూపం. అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే.


చిన్న అంశంతో ముడిపెట్టి కథని మలిచిన తీరు అద్భుతం. #ChandooMondeti గారిని అభినందించాలి. మన ఋషులు అత్యంత శక్తివంతమైన దార్శనికులు.


ఇలాంటివి మరిన్ని రావాలనే సమయం తీసుకుని ఇలా రాస్తున్నాను. ప్రోత్సహిస్తేనే మంచి కథలు వస్తాయి, తద్వారా కొంతైనా చెడు ప్రభావం తగ్గుతుంది అని ఏదో ఆశ


#జయహోసనాతనధర్మం🚩