25, జూన్ 2023, ఆదివారం

తిరస్కరించబడిన

 .            

                      _*సుభాషితమ్*_


 𝕝𝕝 శ్లోకం𝕝𝕝


*అవజ్ఞాత్రుటితం ప్రేమ* 

*నవీకర్తుం క ఈశ్వరః |*

*సన్ధిం న యాతి స్ఫుటితం* 

*లాక్షాలేపేన మౌక్తికమ్||*


తా𝕝𝕝 

తిరస్కరించబడిన ప్రేమను మళ్లీ కొత్తగా మొదటి స్థితికి తెచ్చుకోవడం ఈశ్వరునికైనను సాధ్యం కాదు. అలాగే, పగిలిపోయిన ముత్యానికి లక్క పూసినా అది చక్కబడదు.




..















 

తిరుపతి చుట్టూ చూడదగ్గ క్షేత్రాలు

 తిరుపతి చుట్టూ చూడదగ్గ క్షేత్రాలు ప్రదేశాలు...


తిరుచానూరులో పద్మావతి అమ్మవారు,నూతనంగా పునరుద్ధరించిన పేరూరు బండ వద్ద గల ఒకులామాత ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుడి ఆలయం(వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణిక కాలం ఇక్కడ స్వామిని చూసినట్టే ఉంటుంది), అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం, వికృతమాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిస్వర దర్శనం,

 గుడిమల్లం గుడి దర్శనం, అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనం, కాణిపాకం గణేష్ గుడి దర్శనం,తలకోన జలపాతం ఇంకా ముందుకు వెళదాచుకుంటే నారాయణవనంలో వెంకటేశ్వర స్వామి వివాహమైన ఆలయం, నాగలాపురంలో మచ్చా అవతార వెంకటేశ్వర స్వామి,

రామగిరి లో ఈశ్వరాలయం నంది నోటి నుంచి వచ్చే నీరు, సురుటుపల్లి లో సేయనించి

 ఉన్న ఈశ్వరుడి ఆలయం,తిరుపతిలో కపిల తీర్థం, గోవింద రాజస్వామి దర్శనం, ఇస్కాన్ టెంపుల్,చంద్రగిరి కోట, రీజనల్ సైన్స్ సెంటర్ (పిల్లలకు చాలా ఉపయోగం),శ్రీనివాసం వసతి సముదాయం లో మధ్యాహ్నం,రాత్రి ఉచిత బోజన సదుపాయం కలదు.ఇలాతిరుపతి చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు,ప్రదేశాలు ఉన్నాయి.

మీ ఓపిక మీరు కేటాయించుకున్న రోజులను బట్టి దర్శనాలు చేసుకోవచ్చు.


ఓం నమో నారాయణాయ🙏🙏🙏

ఈ రోజు పదము:

 201వ రోజు: (భాను వారము) 25-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

సోదరుడు (Brother): ఏకోదరుడు, కేశటుడు, తోబుట్టినవాడు, భ్రాత, సగర్భుడు, సజాతుడు, సనాభి, సమానోదర్యుడు, సహజన్ముడు, సహజుడు, సోదరుడు, సైదోడు. 


 ఈ రోజు పద్యము:


నరవరుఁడు నమ్మి తను నౌ

కరిలో నుంచునెడ వాని కార్యములందున్

సరిగా మెలంగ నేర్చిన 

పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!


 ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్దతో చేయుచుండిన కీర్తి పొందును.

ఆర్య చాణక్య*♦️ .*పార్ట్ - 101*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


.*పార్ట్ - 101*


ఆ అంగుళీయకాన్ని చూస్తూ సాలోచనగా భృకుటి ముడిచాడు చాణక్యుడు. దానిపై రాక్షసామాత్యుని పేరు చెక్కి ఉన్నది. దానిని చాణక్య శిష్యుడు భద్రుడు తెచ్చి సమర్పించాడు. 


చాణక్యుడు ఆ ఉంగర పరిశీలనము ముగించి తలెత్తి "చెప్పు" అని ఆదేశించాడు. భిక్షుక వేషంలో ఉన్న భద్రుడు గొంతు సవరించుకొని "నేనీ భిక్షుక వేషంలో నగరంలో వీధుల్లో సంచరిస్తూ, శత్రు రహస్యాల కోసం అన్వేషిస్తూ ఒక ఇంటి ముందు నేను భిక్ష కోసం అరుస్తుండగా ఒక బాలుడు నా గొంతువిని బాల్యచాపల్యం చేత బయటికి పరిగెత్తుకొచ్చాడు. మరుక్షణమే ఆతని తల్లి పరిగెత్తుకువచ్చి కంగారుగా కుమారుని ఎత్తుకొని లోనికి తీసుకుపోతుండగా ఆమె చేతివ్రేలినుండి ఆ ఉంగరము జారి నా ముందు పడింది. ఆమె తన కంగారులో ఉంగరం పడిపోవడానికి గమనించలేదు గానీ, నేను ఆ తల్లీ బిడ్డలను గుర్తించాను. వారు రాక్షసామాత్యుని భార్య, కుమారుడు. ఆ ఉంగరాన్ని ఎవ్వరూ చూడకుండా తస్కరించి....." అని చెప్పి నవ్వాడు. 


చాణక్యుడు తల పంకించి "మంచిది. ఇక నువ్వు పోవచ్చు...." అని చెప్పాడు. భద్రుడు నమస్కరించి నిష్క్రమించాడు. 


చాణక్యుడు తన శిష్యుడు ఆగమసిద్ధిని పిలిచి "కుమార చంద్రగుప్తునికి మా సందేశాన్ని తక్షణమే వెళ్లి వినిపించు. నేపాళ ప్రభువు పర్వతకుని మృతదేహం పైనుంచి తీసి దాచిన వారి ఆభరణాలను వెంటనే ముగ్గురు సద్భ్రాహ్మణులకు దానమియ్యవలెను. ఆ ముగ్గురు బ్రాహ్మణులను కూడా మేమే పంపిస్తామని చెప్పు. వెళ్ళు" అని ఆదేశించాడు. 


ఆగమసిద్ధి ఆగమేఘాల మీద చంద్రగుప్తుని వద్దకు వెళ్లి చాణక్యుని ఆదేశాన్ని వినిపించాడు. ఆ తదుపరి చాణక్యుని పనుపున్న ముగ్గురి శిష్యులు అక్కడికి వచ్చి ఆ దానములు స్వీకరించి, తిరిగి వచ్చి ఆభరణాలు చాణక్యునికి సమర్పించి నిష్క్రమించారు. 


అనంతరం చాణక్యుడు తన శిష్యుడు గుణశర్మకి ఆ నగలు అప్పగించి "నీవు తక్షణం రత్నవ్యాపారి వేషం ధరించి నేపాళ రాజధాని మంజుపట్టణానికి వెళ్ళు. ఈ ఆభరణాలు రాక్షసునికి విక్రయించు" అని రహస్యంగా ఆదేశించాడు. గుణవర్మ తలవూపి ఆ ఆభరణాలతో నిష్క్రమించాడు. అంతట చాణక్యుడు తిక్కిరి బిక్కిరి రాతతో ఒక లేఖ రాసి, తన శిష్యుడు సిద్ధార్థకునికి ఇచ్చి "సిద్ధార్థకా ! ఈ చేతి వ్రాత తిక్కిరి బిక్కిరి వున్నదని సాకు చూపి రాక్షసమిత్రుడు శకటదాసు స్వహస్తాలతో సాపు ప్రతి వ్రాయించి తీసుకురా. అతడు వృత్తిరీత్యా లేఖకుడు గనక నిన్ను అనుమానించడులే..." అని చెప్పి పంపించాడు. 


ఒక అర్థఘడియ కాలము తర్వాత సిద్ధార్థకుడు లేఖతో తిరిగి వచ్చాడు. చాణక్యుడు లేఖపై రాక్షసుని అంగుళీయకపు ముద్రవేసి ఆ లేఖని, అంగుళీయకాన్ని సిద్ధార్థకునికి ఇచ్చి అతని చెవిలో గుసగుసలాడి "అర్థమైంది గదా...." అన్నాడు. సిద్ధార్థకుడు మందహాసం చేసి తలవూపి వెళ్ళిపోయాడు. చాణక్యుడు మరి కాసేపు ఆలోచించి నగర రక్షకభటాధ్యాక్షుడిని తన ఆశ్రమానికి పిలిపించాడు. 


"లేఖరి శకటదాసు రాజద్రోహి. అతని తక్షణం బంధించండి. రేపు ఉదయమే అతడికి శూలారోహణం ద్వారా మరణశిక్ష అమలు చేయండి... పర్వతక మరణానికి కారణమైన విషకన్య సృష్టికర్త ఆ బౌద్ధ బిక్షువు జీవసిద్ధి. మరణము పర్వతకుడికి సంభవించినా దానిని ప్రయోగించబోయినది మన మహారాజుల వారిపైన... కనక ఆ జీవసిద్ధిని తక్షణం బంధించి అతనికి శిరోముండనం గావించి, గాడిదపై నెక్కించి ఊరేగించి దేశాన్నుంచి వెళ్లగొట్టండి.... అలాగే రత్నవ్యాపారి చందనదాస శ్రేష్టికి కబురుపెట్టండి. వారి సత్వర దర్శనం మాకు అవసరం...." అని ఆజ్ఞాపించాడు చాణక్యుడు. 


చాణక్యుని ఆజ్ఞను అనుసరించి శకటదాసును బంధించి కారాగారంలో పడేశారు. బౌద్ధభిక్షువు జీవసిద్ధికి గుండుగీయించి, గాడిదపై ఊరేగించి నగరాన్నించి వెళ్ళగొట్టారు. ఇవి జరుగుతుండగానే చందనదాసు ఆశ్రమానికి వచ్చి చాణక్యుని దర్శించుకున్నాడు. 

(ఇంకా ఉంది)....🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

రిటైరైనోడి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

👨🏽రిటైరైనోడి బ్రతుకు 😩

1.పొద్దున్నే లేవకపోతే,👵🏾 లేవండి రిటైరయ్యానని ఎప్పుడూ పడుకోవడమేనా?

2. త్వరగా లేస్తే,👵🏾మీకు వయసైపోయి నిద్ర తగ్గిందని తెల్లారక ముందే లేచి అందరి నిద్ర పాడుచేస్తే ఎలా?

3.ఇంట్లో కూర్చుండిపోతే,👵🏾 అస్తమానం ఆ మొబైల్ పట్టుక్కూర్చోక పోతే వంటపనిలో సాయపడొచ్చు కదా?

4. ఒక వేళ ఇంటి బయట ఎక్కువ ఉంటే,👵🏾 కాలికి బలపం కట్టుకొని ఊరంతా తిరగకపోతే  'రామా కృష్ణా' అంటూ ఓ మూలుండవచ్చు కదా?

5. పూజ గదిలో ఎక్కువ సేపుంటే,👵🏾ఎప్పుడూ లొడలొడా మంత్రాలు చెప్తూ గంట వాయించి హారతులిస్తే దేవుడు దిగొస్తాడేంటి?

6. పార్ట్ టైమ్ జాబ్ చేసి కాస్త డబ్బులు సంపాదిస్తే,👵🏾రిటైరయ్యాక మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నానని పేద్ద ఫోజు, ఆ ఏడుపు అప్పుడు ఉండుంటే ఈ పాటికి నాలుగు అంతస్థుల మేడ ఉండేది.

7. భార్యను 'చార్ ధామ్'యాత్రకు తీసుకెళ్తే,👵🏾అబ్బో పేద్ద యాత్రలు! ఎదురింటి ఎంకట్రావ్ భార్యతో 'ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ మనాలి'తీసుకెళ్లాడు.

8. ఒకేళ 'ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ  మనాలి' తీసుకెళ్తే,👵🏾 అంతలేసి డబ్బులు తగలేసే బదులు నాకు రవ్వల గాజులో లేక నెక్లేసో చేయించొచ్చు కదా?

9. అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై బిజీగా ఉంటే,👵🏾మొదట ఇంటి పనులు చేసి ఆ తర్వాత ఊరును ఉద్ధరించండి.

10. ఒక వేళ ఏది పట్టించుకోకుండా   ఊరుకుంటే,👵🏾పొరుగింటి పుల్లారావును చూసి నేర్చుకోండి, అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై సెక్యూరిటీ గార్డ్ చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు. మీరూ ఉన్నారెందుకు?🤔

👌🏽ఓల్ మొత్తంగా నేను చెప్పేదేమిటంటే; రిటైరయ్యాక 'నేనది చేస్తా ఇది చేస్తా ' అని ఓవర్ గా ఇదైపోయి ఫోజులు కొట్టకుండా భార్య చెపినట్టు వింటే మంచిది. ఏది ఏమైనా భార్యచేత చీవాట్లు తప్పదు!

DISCLAIMER: అమ్మ తోడు ఇది మాత్రం నా అనుభవము కాదు. పక్కింటి  పుల్లా రావు అగచాట్లు చూసి రాసింది.🤨🤔😩

Pury jagannadh temle


 

చేమకూర భావనా ప్రతిభ!

 శుభోదయం🙏


చేమకూర భావనా ప్రతిభ!! 


       ఉ:-పున్నెమిరేల దత్పురము పొంతనఁబోన్ శిఖరాళి దాకి వి 

             ఛ్ఛిన్న గతిన్ సుధారసముజింది పయింబడ నంతనుం 

               డిన్నెల సన్నగిల్లు నదినిక్కమ కాదనిరేనియా పదా 

                 ర్వన్నె పసిండిమేడలకు రాబనియేమిల సౌధనామముల్ ; 

         

                  చామకూరవేంకటకవి- విజయవిలాసము; 


           చామకూర పద చమత్కారముననేగాక,భావచమత్కారమునగూడదిట్ట. విజయవిలాసమున పురవర్ణన 

            చేయుచు ఇంద్రప్రస్ధమునందలి మేడలను వర్ణించుచు అచటిపైడిమేడలకు సౌధములను పేరువచ్చుటకు 

              కారణమేమి?అనిప్రశ్నించుచు, దానికిసమాధానముగా నీకధనువివరించుచున్నాడు. "చందమామ 

               పున్నమిరాత్రులలోనీమేడలమీదుగాపయనించుటచే,ఈమేడలకున్నపొడవైన శిఖరములు కడపులోనికి 

                దిగబడి చందమామలోని'అమృత'మంతయు చంద్రునిపై బడియుండును, లేకున్ననీబంగరుమేడలకు 

                 సౌధము లనుపేరేలవచ్చును? అనిసమాధానమొసంగుచున్నాడు. 

                           ఇక్కడ "సుధ- శబ్దమునకు- అమృతము,సున్నము,అనురెండర్ధములుఉండుటచే కవియీ 

                     చనత్కారమునుసాధించినాడు.

నిరుక్తి అలంకారము!💄

వేదాద్రి

 🕉  మన గుడి :


🔆 కృష్ణా జిల్లా : " వేదాద్రి "






👉 శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం


💠'  వేదాద్రి ' వేదాలని నిక్షిప్త్రం చేసిన పర్వత పర్వత ప్రదేశం కాబట్టి .. వేదాద్రిగా ప్రాచూర్యం పొందింది ..


💠 ప్రశాంతమైన అరణ్య మధ్యమున, కృష్ణవేణి తరంగ నాదములతో ప్రకృతి సహజసిద్ధ సౌందర్యములను నిండుగా అలంకరించుకొని భక్తకోటి ముక్తియే 'వేదాద్రి'గా అలరారుతోంది.

క్రిష్ణా నది తీరంలో  కొలువు దీరిన

అత్యంత మహిమలు గల ఈ దేవాలయం ... విజయవాడకు 60 కిలో మీటర్ల దూరం లో ఉంది .

ఒక్కసారి ఇక్కడి నర్సింహా స్వామిని దర్శించికుంటే మానసిక 

ప్రశాంతత చేకూరుతుంది


💠 కృష్ణా నదీ తీరాన వున్న పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి వేదాద్రి.  ఇది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకి సమీపంలో వున్నది.  

మిగతా నాలుగూ వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, మంగళగిరి. 


🔔 స్థలపురాణం 🔔


💠 క్షేత్రం వెనక ఉన్న పురాణ గాధ

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. 

పూర్వకాలంలో బ్రహ్మదేవుని నుండి వేదాలను సోమకారసుడను రాక్షసుడు తస్కరించి సముద్రమందు దాక్కున్నాడు. 

బ్రహ్మ తన జనకుడైన శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్ళి, జరిగింది వివరించి, వేదాలను తిరిగి అనుగ్రహించాలని ప్రార్థించాడు. భక్తవత్సలుడైన నారాయణుడు మత్స్యావతారం ధరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను కాపాడాడు. 

వేదాలు పురుష రూపం ధరించి "దేవా! మమ్ము కరుణించి తరింప జేయుము” అని ప్రార్థించగా, నేను హిరణ్య కశపుణ్ణి సంహరించడానికై నృసింహావతారం ధరిస్తాను. అప్పుడు మీ శిరస్సులపై నేను పంచమూర్తియై మీ శిరస్సులపై నివసిస్తాను. అప్పటి వరకు మీరు కృష్ణవేణి గర్భంలో సాలగ్రామ స్వరూపంలో ఉండండి. మీవలెనే కృష్ణవేణి కూడా ప్రతిరోజు నన్ను అభిషేకించాలని ప్రార్థిస్తోంది. 

ఆమె కోరిక కూడా ఈ విధంగా తీరుతుంది". అని అనుగ్రహించగా వేదాలు ఎంతో సంతోషించి, సాలగ్రామ రూపంలో కృష్ణా నదిలో వుండసాగాయి.


💠 అనంతరం నారాయణుడు నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని 

 సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.

ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వామి. ఈ క్షేత్రం పంచనారసింహ 

(జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనృసింహామూర్తుల) క్షేత్రమైన వేదాద్రిగా పిలువబడుచున్నది.


🔅 1. శ్రీ జ్వాలా నరసింహస్వామి -- స్వయంభూ -- శిఖర స్ధితి (ఆలయం పక్కనుంచి మెట్లు కనబడతాయి)


🔅2. శ్రీ సాలిగ్రామ నృసింహ స్వామి --

 బ్రహ్మ ప్రతిష్ఠ -- కృష్ణానదిలో (ఆలయంలో నుంచి కూడా చూడవచ్చు)


🔅3. శ్రీ వీర నృసింహ స్వామి -- 

స్వయంభూ -- గరుడాచలం (ఇక్కడికి 5 కి.మీ.ల దూరంలో)


🔅4. శ్రీ యోగానంద స్వామి – త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించినది --మూలవిరాట్, గర్భాలయం


🔅5. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి -- 

మూలవిరాట్ పీఠం – లోక కళ్యాణార్ధం ప్రతిష్ఠింపబడ్డది.


 

💠 యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడినది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.


💠 గుడిలో స్వామితోబాటు చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక మందిరాలు వున్నాయి. క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామికి మరియు నవగ్రహాలకు కూడా ఉపాలయములు ఉన్నాయి.


💠 కలియుగ ప్రారంభంలో కరువుకాటకాలు ఏర్పడటంతో ఋషులంతా వ్యాసుడి బోధతో కృష్ణానదీ తీరమున పంచనారసింహ క్షేత్రం కలదని, అక్కడ తపస్సు చేస్తే ముక్తి సాధ్యమవుతుందని విని, అక్కడికి వస్తుండగా, దారిలో నదీతీరం వెంబడి సుస్వరోచ్చారణమున వేదమంత్రాలు వినబడ్డాయి. ప్రకృతే ఆవిధంగా వేదాలను పఠిస్తోందని తెలుసుకుని, ఆశ్చర్యపోయారు. సమీపంలోని ఒక పర్వతం నుండే ఈ ధ్వని వినిపిస్తోందని నిశ్చయించుకొని, ఆ పర్వతానికి ప్రదక్షిణలు చేసారు. “ఋషులారా! ఇదే వేదగిరి. ఇందు శ్రీమన్నారాయణుడు నృసింహరూపంలో ఆర్చామూర్తియై వెలసినాడు. వెళ్ళి వారిని సేవించండి” అనే అశరీరవాణి మాటలు వినబడ్డాయి. వారు అట్లే వెళ్ళి స్వామివారిని కనుగొని, సేవించి తరించారు.


💠 ఈ దేవాలయాన్ని ఎఱ్ఱాప్రగడ, శ్రీనాథుడు, నారాయణతీర్థులు తదితర మహానుభావులు దర్శించి. పునీతులయ్యారు.



💠 ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది.

విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.


💠 ఈ స్వామిని సేవిస్తే గ్రహబాధలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయట. 


💠ఇక్కడ సౌకర్యాలు ఎక్కువ వుండవు.  

బస, భోజనం జగ్గయ్యపేటలో అయితే ఇబ్బందిలేకుండా వుంటుంది. 

దేవుడికి పూలమాలలు సమర్పించాలనుకుంటే జగ్గయ్యపేటనుంచి

తీసుకువెళ్ళండి. అలంకరిస్తారు. గుడి దగ్గర దొరకవు.

శ్రీ రంగనాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : 






⚜ కడప జిల్లా : పులివెందుల


⚜ శ్రీ రంగనాథ స్వామి ఆలయం


💠 పూర్వం ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. 


💠 పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం చాల ప్రసిద్దమైనది. 

పులివెందులలోని గోస్తని తీర్థం ఒడ్డున వెలసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని మాంధాత మహారాజు నిర్మించాడని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ  క్షేత్రం దివ్యస్థలంగా మారిందని ఆలయ చరిత్ర  చెబుతోంది. 


💠 1509 లో  బెజవాడ పురాధీశుడైన నరసయ్యదేవ , పులివెందుల శ్రీరంగరాజుల ( శ్రీరంగనాథుడి) నైవేద్యానికి, అంగరంగ వైభోగాల కోసం పులివెందుల  స్థలమందలి కుందలూడు అనే గ్రామాన్ని దానంచేశాడు.

ఈ శాసనం చారిత్రకంగా ఏంతో విలువైనది 


 💠 1509 నుండి 1690 వరకు శ్రీ రంగనాథ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవి. 1690 వ సంవత్సరంలో ఔరంగజేబు సర్దార్ మహమ్మద్ జాఫర్ సాహెబ్ ఈ ఆలయాన్ని కొల్లగొట్టి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశాడు.


💠 ఆ తరువాత ఈ ప్రాంతము మరాఠాల ఆధీనంలో ఉన్నప్పుడు పీష్వా బాలాజీ బాజీరావు సమయంలో చిన్న రంగాపురం కరణము పూనా వెళ్లి బాలాజీ బాజీరావు అనుమతి  తీసుకొని 1756 సంవత్సరంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ విగ్రహాన్ని పునరుద్ధరించాడు.


💠 శ్రీ రంగనాథస్వామి మహిమల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నవి. 

పులివెందుల ప్రాంతం ఒకప్పుడు  వేములపాలెంలో ఉండేది. 

982వ సంవత్సరంలో వేముల కోటను జయించడానికి రాజరాజ చోళరాజు సైన్యం దండెత్తి రాగా, వేముల పాలేగాడు శ్రీరంగనాథుడి భక్తుడైన భట్టారువారి వంశీకుడు ఆలయమును చేరి స్వామివారిని ప్రార్థించగా రంగనాథస్వామి కృపవల్ల తెల్లవారేసరికి చోళ రాజ్య సైన్యం భయపడి పలాయనం అయ్యారట. 

అప్పుడు వేముల పాలేగాడు భట్టారు వంశీకులకు "దుర్వార చోళ గర్వ తమో నిరసన మార్తాండ" అని బిరుదునిచ్చారట.


💠 ప్రతి ఏటా శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు ఇప్పటికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

పులివెందుల మున్సిపాలిటీ లోగో కూడా రంగనాథ స్వామి ఆలయ గోపురాన్ని చూడవచ్చు .

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పులివెందులలోని మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయం మరియు రంగనాథస్వామి ఆలయం పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేసింది.


💠 గుప్త నిధుల అన్వేషణ లో దుండగుల చేతిలో గర్భగుడిని చాలాసార్లు ధ్వంసం చెయ్యగా మళ్లీ ఆలయాన్ని పునరుద్ధరించారు, అలా ఈ ఆలయంలోని మూలవిరాట్‌ని ఇప్పటికి 3 సార్లు మార్చడం జరిగింది. 


💠 ఇప్పుడు ఉన్న విగ్రహం ఆదిశేషువుపై శయనించిన విష్ణు మూర్తిలాగా చాలా అందంగా ఉంటుంది. 

ఈ గుడిని చాల విశాలంగా ఎంతో సుందరంగా కట్టించారు.

గర్భగుడికి రెండు వైపుల రెండు చిన్న ఆలయాలు వాటిలో భూదేవి, నీళాదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. 


💠 గుడి వెనుక  భాగాన నాగదేవత విగ్రహలు రావి చెట్టు కింద ఉన్నాయి. మరో ప్రక్కన ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది.

అన్ని ప్రసిద్ధ ఆలయాలలాగానే ఈ ఆలయానికి కూడా నాలుగు ద్వారాలు ఉన్నాయి, ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గోపురం శిథిలావస్థలో ఉన్నందున, దాన్ని తొలగించి తిరిగి కట్టడం ప్రారంభించారు. 

గుడి ప్రాంగణం వెలుపల ఎంతో విశాలమైన పార్కు ఏర్పాటు చేసారు, 


💠 ఇక్కడి  శిల్పాలు కుడా చాలా అందంగా కనులకు వినోదాన్ని కలిగిస్తాయి.

ఈ ఆలయం ఔటెర్ రింగ్ రోడ్ కి ఆనుకుని పులివెందుల టౌన్ కి ఒక కిమీ దూరంలో ఉంది. 


💠 ఇక్కడికి చేరుకోవడానికి అన్ని ప్రముఖ పట్టణాలనుండి పులివెందులకు బస్ సౌకర్యం కలదు. 

పులివెందుల పట్టణం నుండి గుడికి ఆటోలో వెళ్లొచ్చు.