21, ఆగస్టు 2024, బుధవారం

భారతమాతగామధుర

 *మాడుగులమురళీధరశర్మ*


*ఉ‌మా.1*

భారతమాతగామధుర*

భాషిత,భూషితమాధురీసుధా!

ధారగధారఁబోసినది*

ధారణ,ధైర్యము,ధీమతుల్సదా!

ధారితసర్వశాస్త్రముల*

తన్మయసారమునందిపుచ్చినన్!

కోరినకోర్కెఁదీర్చునవ*

కోవిద,కూర్పునుఁజేయు *భారతీ!*


*ఉ‌మా.2*

సాగరమందుసాగునది*

సర్వమునందుననింపుచుండినన్!

త్యాగము,ధర్మకర్మలు,సు*

యాగము,యోగము,కార్యకర్తనల్!

రాగ,సరాగ,మాలికలు*

లాస్యము,హాస్యములందుకల్గినన్!

ధీగుణదివ్యతత్వము,సు*

ధీమతిగానిడు దివ్య *భారతీ!*

వరములనిచ్చే తల్లీ

 12-8-24 సోమవారం కి కొనసాగింపు....

*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!

25కం.

హరిహరులా వాగీశుడు

పరమ ఋషులువేల్పు లెల్ల పరమేశ్వరి నీ

కరుణా దృక్కులు బడయన్

వరదాయని నిలిచినారు పాలింప గదే!!


భావము: ఓ వరములనిచ్చే తల్లీ!హరి హర బ్రహ్మలు గొప్ప ఋషులు దేవతలు నీకరుణతోకూడి చూపులకై నిలిచియున్నారు, దయ చూడుము!

 26మ.

అనుచున్ గౌరిని వేడగా కరుణతో నౌదార్యముంజూపుచున్,

తనపుత్రున్ సుకుమారు నాఘనుని సత్వంబొందగా జేయుచున్

ననిశంబున్ దనపుత్రునే జగతిలో నాఢ్యుండుగా పూజలన్

దనరం జేయుచు దైవబృందముల కద్యక్షాఖ్యునిం జేసినన్

గనగా జాలుదురెల్లరున్ గుశలముల్ గయ్యంపు భుక్త ప్రియా!!


    భావము: అని పార్వతిని వేడగా కరుణించి తనకుమారుని శక్తివంతుని చేయుచూ లోకములో సదా తన సుతునే గొప్పవానిగా పూజలందునట్లును, దైవగణములకు నాయకుడిగను జేసిన శుభము లొందుదురయ్యా నారదా అని పలికెను.

ఉత్సాహ వృత్తమ:-

 ఉత్సాహ వృత్తమ:-

అమ్మ పేర్మి కన్న మిన్నయైన దేది సోదరా!

అమ్మ ప్రక్కనున్న మనకునదియె గొప్ప ధైర్యమున్!

సొమ్ములేమి కోరదామె చూచు నీది కుక్షి నే!

అమ్మ మాట నెప్పుడైన నాలకించ మేలు రా!

                పి.వి.శైలజ

శంకరా

 శంకరా!

      (శతకము,)


1ఉత్పలమాల


శ్రీగిరి జాసతీ హృదయ చిన్మణి

          దీపక!లింగరూపకా!

నాగవిభూషకా!భువన నాశక!

         రక్షక!ఆదిభిక్షుకా!

యోగరహస్యబోధక! మహోష్ణ

        మహాంబక! క్ష్వేళభక్షకా!

రోగనిరోధకా! ఎడద రోచివి

       నీవయ గౌరి శంకరా!


 2.

చంపకమాల


హిమగిరి కందరాన వసియింతువు

         నిత్యము, వెండి కొండపై

హిమజనుగూడినాట్య మొనరింతువు,

        భీకర రుద్రభూమి లో

ఢమరుకమూని నొప్పెదవు, ధ్యానము

       చేసెడిగుండెలోన శ్రీ

రమణుడవౌచు నుందు,జన రంజకు

          డీవయ గౌరిశంకరా

3.

మత్తేభము.


జలముల్ పుక్కెడు చిల్కరించి దళముల్

         చక్కంగ పై వైచుచున్

వెలిబూదిన్ గొని పైనరాచి శివ నీవే

        దిక్కునాకంచు లో

పలుకన్ సాంబడు చేయిపట్టికొని నా

         ప్రారబ్ధకర్మంబులన్

తొలుగన్ జేయుచు సౌఖ్యమిచ్చునెపుడున్

            తోరంబుగా శంకరా!


4.శార్దూలము.

  

రారా !సాంబసదాశివా!మృగపతీ!

            రారా !జగన్నాయకా!

రారా!బాలశశాంక మౌళి! యభవా!

           రా!నాగ హారాన్వితా!

రారా!భిక్షుక!నీలకంఠ!ధవళా!

          రా యంచు గొంతెత్తి నో

రారా పిల్చిన చెంతనిల్చెదవుపో

        రాజేశ్వరా!శంకరా!


డా.ఉపాధ్యాయుల గౌరీశంకరరావు

శరణంటి శరణంటి

 సీ

శరణంటి శరణంటి శారదామాత నీ 

చిద్రూపమును,గన చింత చేయు

చుంటిని,నోములు,చూచియు,చేసిన 

నియతి  బాటింతు నే నిష్ఠతోడ,

దర్శనముకొఱకు ధరణిలో నీకయి 

వేచియుంటినితల్లి వేల్పులమ్మ 

కన్పించవేలనో ? కనులకు రూపము 

మాత్రమే,మేలమ్మ మానవులకు!

తే.గీ.

చదువగాలేను, క్రొత్తవౌ చదువు లెల్ల

వ్రాయ గాలేను కావ్యాలు వాసి కెక్క,

జ్ఞానమేలేదునిత్యవిజ్ఞాన పఠన

జేయ, కరుణను జూపుమా చేరెద దఱి!

రూపము లేని యాత్మకు

 ఉ.

రూపము లేని యాత్మకును రూపమునద్దుచు జీవరాశిలోన్

ప్రాపును కల్గజేయుచు నపారభవాంబుధిలోన ముంచుచున్

తాప విపత్తులేర్పరచి దైన్యము నింపగజేతువేమిటో !

యాపద బాపు జీవులకునాశ్రయురాలవె ! సర్వమంగళా ! .

 


🙏🙏🙏🙏


✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,

ధర్మపురి

మత్స్యావతార చరితము

 మత్స్యావతార చరితము


విభుడీశ్వరుండైన విష్ణుదేవుండు 

వేద  భూసుర  సుర విమలసాధువుల 

ధర్మార్థ గోవుల ధరయందు గావ 

ఘనరూపములయందు , గాలిచందమున,

తనురూపములయందు, తగిలితానుండు.

ఎక్కువతక్కువ నెన్నడొందకను 

నిర్గుణత్వంబున నెఱయు ఘనుండు, 

గురుతయు దొరతయు గుణముల నొందు .

అట్టి యాపరమాత్మ యవనిని బ్రోవ 

మనుజేశ ! చోద్యమే మత్స్యంబు నగుట !

విష్ణుని మహిమలు విభవోన్నతములు 

వినుము దెల్పెదనీకు వివరంబుగాను.

ఆలకింపు మికను  నానందముగను "


బాదరాయుణుడిట్లు పలికియు న్నంత

మత్స్యావతారపు మాహాత్మ్య మంత

వీనులవిందుగా వివరించె నిటుల


     ----- మత్స్యావతారము -----


గతమందు జరిగిన కల్పాంతవేళ 

ధరయందు వెల్గొందు ద్రవిడదేశమును 

సత్యవ్రతుండను సత్త్వశోభితుడు 

పరిపాలనముజేసె ప్రజమోద మంద 


✍️గోపాలుని మధుసూదనరావు

మంగళాద్రినృసింహా

 మంగళాద్రినృసింహా!!పాహి పాహి!!

సీ..

మంగళాద్రినృసింహ మాంపాహి నరసింహ

       పానకాలస్వామి పాహి పాహి!

కృతయుగంబుననుండి యతిదయాళువునౌచు

     భక్తులబంగారు,పాహి పాహి!

:శ్రీ సుదర్శననరసింహ నముచినాశ

    పావనయజ్ఞేశ పాహి పాహి!

చీడపీడలబాధచీకుచింతలబగాథ

      పనిగట్టి పోగొట్ట పాహి పాహి!

తేగీ..

మంగళంబుల నొసగంగ మాకునెప్డు

మంగళగిరిపై కొలువైన మహితరూప

రాజ్యలక్ష్మీ ప్రియసమేత రమ్యరూప

జీవనపుటూతమగుమయ్య దేవదేవ..

పూజ

 పూజ

--------

సీ||

     హరిపూజనము సేయ నార్భాటమది యేల?

        మదిని జేసిన జాలు

        మందిరముగ!

పూజాదికాలకై పుష్పమాలిక లేల?

          స్తోత్రమాలిక చాలు 

         స్తుతుల జేయ!

నైమిత్తికమ్మగు నైవేద్యమది యేల?

            హృదయమర్పణ

           జేయ కొదువ గాదు!

హారతినిడుటేల?హరిపాద యుగళిని

             మదిని దాల్చిన 

          జాలు మరువబోక!

తే.గీ||

        భక్తి పుష్పమ్ము గోరెడి ప్రభువతండు!

శరణు గోరిన కాపాడు సదయుడతడు!

భువనముల గాయ సంసిద్ధ భూరి యశుడు!

రక్ష సేయంగ వచ్చెడి దక్షుడతడు!


------------కోడూరి శేషఫణి శర్మ

సమాచార హక్కు చట్టాన్ని

 *సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తే ఈ కింది సెక్షన్ల కింద శిక్ష సంబంధిత పౌర సమాచార అధికారి బాద్యులు అవుతారు.*


ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఎలా వ్యవహరించాలో   నిర్దేశింపబడినప్పటికి సదరు ఉద్యోగి బుద్ధిపూర్వకముగా  ఇతరులకు నష్టం కలగజేయ వనలే సంకల్పంతో బిన్నముగా వ్యవహరిస్తే *ఐపీసీ 166*/ *198 BNS of 2023* ప్రకారం ఒక సంవత్సరం శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు.  

       

సమాచార హక్కు ఇవ్వమని చట్టం నిర్దేశించిన  సమాచారం ఇవ్వడం లేదు.IPC 166 / * *198 BNS of 2023* సంబంధిత అధికారి శిక్ష అర్హుడు.


ఒక ప్రభుత్వ ఉద్యోగి  బుద్ధిపూర్వకముగా చట్టములోని నియమలను ఉల్లంఘించి లేక ధిక్కరించిన  ఉద్యోగిని విధుల నుంచి తోలగించాలి.ఆ వ్యక్తిని శిక్ష నుండి తప్పిoచుకునేటట్లు గా చేసినా ఆ నెరస్తునికి తక్కువ శిక్ష పడేటట్లు చేసిన  *ఐపీసీ 217*/ *255BNS of 2023* ప్రకారం శిక్ష అర్హుడు ఇలా చేసినందుకు గాను 2 సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు విధులు దుర్వినియోగం పరిచి నందుకు గాను అతన్ని  విధుల నుంచి తొలగించ కుండా జాలి చూపించిన, లంచం తీసుకొని రాజకీయ వత్తిళ్లు ఆ ఉద్యోగిని విధుల్లో కొనసాగించుట.


ఒక ప్రభుత్వోద్యోగి ఏదైనా రికార్డును తయారు చేయవలసినదిగా అదేశింపబడినప్పుడు ప్రజలను గాని లేదా ఎవరైనా వ్యక్తిని గాని నష్టపెట్టాలనే సంకల్పంతో బుద్ధి పూర్వజముగా రిజర్డును తప్పుగా చేసినా లేక ఒక వ్యక్తి చట్టము బారి నుండి శిక్ష పడకుండా రక్షించాలనే సంకల్పంతో రికార్డును తప్పుగా తయారు చేసిన


*ఐపీసీ 218*/ *256BNS of 2023* ప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు.


ఒక వ్యక్తి అస్థిని మరొక వ్యక్తి పేరిట నకిలీ పత్రాలు సృష్టించుట,సంతకాలు పోర్జిరి చేసిన ఐపీసీ420  /*318(4)* *BNS* *of* *2023* ప్రకారం శిక్ష అర్హుడు.  


*కొంతమంది అదికారులు రికార్డులు:*


ఉదా:- ఒక రైతు పేరిట ఉన్న భూమిని ఎటువంటి ముటేషన్ లేకుండా మరొక్క రైతు పేరిట చేర్చితే, లేక  సంబంధిత వ్యక్తులకు ఎప్పుడో పట్టాలు ఇచ్చినట్లు  రికార్డులు సృష్టించుట తాను చేసిన తప్పులు బయట పడుయనే ఉద్దేశ్యంతో   రికార్డులకు లేకుండా చేయుట చేస్తే  *ఐపీసీ 420* /  *318(4)* *BNS* *of* *2023* కింద వస్తుంది దీనికి గాను 7 సంవత్సరాలు శిక్ష విధించబడును.


దూరాలోచన పురితమైన  కావాలనే ఉద్దేశంతో       సమాచారం ఇవ్వడం లేదు. *ఐపీసీ 406*/ *316BNS of 2023*  ప్రకారం   రెండు సంవత్సరాలు లేక జరిమానా లేక రెండు విధించవచ్చు. 


 ఏదైనా ఆస్థిని విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతరుల పేరిట వ్రాయుట లేక అప్పగించుట, దుర్వినియోగం చేయుట,  నమ్మక ద్రోహముగా భావించి  అట్టివారికి *ఐపీసీ 409*/   *316BNS of 2023* ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.🇮🇳& 



*u/s of 255 of BNS 2023* & *u/s 174 of BNSS & 198 of BNS** 

*read with ఆర్టికల్ *14,*19,*20,*21,*375*