31, అక్టోబర్ 2021, ఆదివారం

*కార్తీక మాసంలో

 *కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి.*

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే *కార్తీక_మాసం *అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి..

న కార్తీక సమో మాసో 

న శాస్త్రం నిగమాత్పరమ్

నారోగ్య సమముత్సాహం 

న దేవః కేశవాత్పరః 

అంటే *కార్తీక_మాసం* లోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం...

*కార్తీక శుద్ధ పాడ్యమి :* తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

*విదియ :* సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

*తదియ :* అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

*చవితి :* నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

*పంచమి :* దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

*షష్ఠి :* ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

*సప్తమి :* ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

*అష్టమి :* ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

*నవమి :* నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

*దశమి :* నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

*ఏకాదశి :* దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

*ద్వాదశి :* ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

*త్రయోదశి :* సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

*చతుర్దశి :* పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

*కార్తీక పూర్ణిమ :* కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

*కార్తీక బహుళ పాడ్యమి :* ఆకుకూర దానం చేస్తే మంచిది.

*విదియ :* వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

*తదియ :* పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

*చవితి :* రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

*పంచమి :* చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

*షష్ఠి :* గ్రామదేవతలకు పూజ చేయాలి.

*సప్తమి :* జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

*అష్టమి :* కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

*నవమి :* వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

*దశమి :* అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

*ఏకాదశి :* విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

*ద్వాదశి :* అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

*త్రయోదశి :* ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

*చతుర్దశి :* ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

*అమావాస్య :* పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.

(సేకరణ)

న్యాయవాది వృత్తి గొప్పతనాన్ని

 *న్యాయవాది వృత్తి గొప్పతనాన్ని చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు*

46 మంది దోషులను మరణశిక్ష (ఉరి) నుండి రక్షించాలని సీనియర్ న్యాయవాది వాదించారు.

 అప్పుడు అతని సహాయకుడు వచ్చి అతనికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. న్యాయవాది దాన్ని చదివి జేబులో పెట్టుకుని తన వాదనను కొనసాగించాడు


భోజన విరామ సమయంలో న్యాయమూర్తి అతనిని స్లిప్‌లో మీకు ఏ సమాచారం వచ్చింది అని అడిగారు. న్యాయవాది నా భార్య చనిపోయింది అని అన్నారు. న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు మరియు అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?" ఎందుకు మీరు మీ ఇంటికి వెళ్ళలేదు న్యాయవాది ఇలా అన్నార నేను నా భార్య జీవితాన్ని తిరిగి తీసుకురాలేను, కాని ఈ 46 స్వాతంత్య్ర సమరయోధులకు జీవితాన్ని ఇవ్వడానికి మరియు వారు చనిపోకుండా నిరోధించడంలో నేను సహాయపడగలను. 


దీంతో ఆంగ్లేయుడైన న్యాయమూర్తి మొత్తం 46 మందిని విడుదల చేయాలని ఆదేశించారు. 

న్యాయవాది మరెవరో కాదు, 

*సర్దార్ వల్లభాయ్ పటేల్*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

సంస్కృత మహాభాగవతం

 *31.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*యది కుర్యాత్ప్రమాదేన యోగీ కర్మ విగర్హితమ్|*


*యోగేనైవ దహేదంహో నాన్యత్తత్ర కదాచన॥13030॥*


యోగి ఎట్టి నిషిద్ధకర్మలను చేయడు. ఒకవేళ ప్రమాదవశమున (మోహకారణముగా) ఏదైనను అపరాధము జరిగినచో యోగము ద్వారానే తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను. కాని, ఇతర ఉపాయముల జోలికి పోరాదు.


*20.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|*


*కర్మణాం జాత్యశుద్ధానామనేన నియమః కృతః|*


*గుణదోషవిధానేన సంగానాం త్యాజనేచ్ఛయా॥13031॥*


సాధకులు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి, ఆయా కర్మలను ఆచరించుటయే గుణము. అట్లుగాక, అందులకు విరుద్ధముగా పరధర్మములను ఆచరించుట దోషము. ఏలనన, పుట్టుకచేతనే (స్వభావరీత్యా) కర్మలు అనర్థహేతువులు. కావున కర్మలపట్ల విషయాసక్తిని తొలగించుటకే శాస్త్రములు గలవు. ఇట్టి శాస్త్రములద్వారా కర్మలయొక్క గుణదోషములు, విధినిషేధములు వివరింపబడినవి. వీటిద్వారా కర్మలయందలి ప్రవృత్తిని విడనాడి, నివృత్తిమార్గమును అనుసరింపవలెను.


*20.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*జాతశ్రద్ధో మత్కథాసు నిర్విణ్ణః సర్వకర్మసు|*


*వేదదుఃఖాత్మకాన్ కామాన్ పరిత్యాగేఽప్యనీశ్వరః॥13032॥*


*20.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*తతో భజేత మాం ప్రీతః శ్రద్ధాలుర్దృఢనిశ్చయః|*


*జుషమాణశ్చ తాన్ కామాన్ దుఃఖోదర్కాంశ్చ గర్హయన్॥13033॥*


*20.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ప్రోక్తేన భక్తియోగేన భజతో మాసకృన్మునేః|*


*కామా హృదయ్యా నశ్యంతి సర్వే మయి హృది స్థితే॥13034॥*


నా కథలయందు శ్రద్ధ గలిగినవాడు సర్వకర్మలయందు విరక్తిని పొందినవాడు. సమస్త భోగములకు - భోగ్యవిషయములు, కామ్యములు - కామ్యకర్మలు దుఃఖమయములు అని తెలిసికూడా వాటిని త్యజించుటకు అసమర్థుడైనచో, నా పట్ల శ్రద్ధాళువై దృఢనిశ్చయమును గలిగి అత్యంత ప్రేమభావముతో నన్ను భజింపవలెను. ఆ విధముగా నాయందు భక్తితత్పరుడై భోగములను అనుభవించుచూ, అవి దుఃఖహేతువులని, నిందనీయములు అని మానసికముగా చింతించుచు, వాటిని విడిచిపెట్టలేని దుఃస్థితికి లోలోన నొచ్చుకొనుచుండవలెను. ఈ విధమగా చెప్పబడిన భక్తియోగముద్వారా నిత్యనిరంతరము నన్నే భజించెడు ఆ మునియొక్క హృదయమునందు నేను స్వయంగావచ్చి నిలిచెదను. నిలిచినవెంటనే అతనిలోగల సమస్తభోగవాసనలు నశించిపోవును.


*20.30 (ముప్పదియవ శ్లోకము)*


*భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యంతే సర్వసంశయాః|*


*క్షీయంతే చాస్య కర్మాణి మయి దృష్టేఽఖిలాత్మని॥13035॥*


సర్వాత్మస్వరూపుడనైన నేను, నా భక్తుని హృదయములో సాక్షాత్కరించిన ఉత్తరక్షణముననే అతని హృదయమునందు గల అనుమానపు ముడులు విడిపోవును. సమస్త సందేహములు తీరిపోవును. అతనిలోగల వాసనలన్నియును సంస్కారములతో సహా సమసిపోవును.


*20.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*తస్మాన్మద్భక్తియుక్తస్య యోగినో వై మదాత్మనః|*


*న జ్ఞానం న చ వైరాగ్యం ప్రాయః శ్రేయో భవేదిహ॥13036॥*


అందువలన నా భక్తియుక్తుడైన యోగి నాయందే చిత్తమును నిలుపుటవలన నాకు ఆత్మీయుడైపోవును. కావున అతనికి జ్ఞానవైరాగ్యములు లేకపోయిననూ, కేవలము నా భక్తివల్లనే అతడు శ్రేయస్సును పొందును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*484వ నామ మంత్రము* 31.10.2021


*ఓం డాకినీశ్వర్యై నమః* 


విశుద్ధి చక్ర అధిష్ఠానదేవత అయిన డాకినీ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *డాకినీశ్వరీ* యను అయిదక్షరముల నామ మంత్రమును *ఓం డాకినీశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లికరుణచే ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భోగభాగ్యములు, కీర్తిప్రతిష్టలు సంప్రాప్తమగును.


*విశుద్ధిచక్రనిలయా* యను 475వ నామ మంత్రము నుండి *అమృతాది మహాశక్తి సంవృతా* యను 483వ నామ మంత్రము వరకూ, విశుద్ధిచక్రాధిష్ఠానదేవతయైన డాకినీశ్వరియొక్క విశేషణములు (లక్షణములు) చెప్పబడినవి.


ఈ డాకినీశ్వరి *ఆరక్తవర్ణా* (476వ) యను నామ మంత్రములో) పాటలవర్ణముతో (ఎఱుపు, తెలుపుల మిశ్రమవర్ణముతో) భాసిల్లుచున్నదని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్రిలోచనా* (477వ) యను నామ మంత్రములో మూడునేత్రములు కలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *ఖట్వాంగాదిప్రహరణా* (478వ) యను నామ మంత్రములో నాలుగు చేతులందు కపాలము గ్రుచ్చబడిన కర్ర (ఖట్వాంగము), ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము ధరించినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *వదనైక సమన్వితా* (479వ) యను నామ మంత్రములో ఒకే శిరస్సు గలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పాయసాన్నప్రియా* (480వ) యను నామ మంత్రములో పాయసాన్నమనిన ప్రీతిగలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్వక్ స్థా* (481వ) యను నామ మంత్రములో చర్మధాతువునందు ఉండి, చర్మమును రక్షించునదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పశులోకభయంకరీ* (482వ) యను నామ మంత్రములో అజ్ఞానులై పశుప్రాయులుగా ఉండు సమూహమునకు భయంకరిగా గోచరిస్తుందని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *అమృతాది మహాశక్తి సంవృతా* (483వ) యను నామ మంత్రములో విశుద్ధి పద్మమునందలి పదహారు దళములందు పదహారుమంది అమృతాది మహాశక్తులచే డాకినీశ్వరి పరివేష్ఠింపబడినది అని చెప్పబడినది.


డాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం డాకినీశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*483వ నామ మంత్రము* 31.10.2021


*ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః*


అమృతా మొదలైన పదహారుమంది మహాశక్తులచే పరివేష్ఠింపబడి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అమృతాది మహాశక్తి సంవృతా* యను పదునొకండక్షరముల నామ మంత్రమును *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి ఆత్మానందానుభూతితోబాటు, అంతఃకరణశుద్ధి మరియు భౌతికపరమైన శాంతిసౌఖ్యములు అనుగ్రహించును.


విశుద్ధిపద్మమునకు పదునారు దళములు గలవు. వానిలో *అ* కారాది *అః* వరకు గల బీజాక్షరములు ఉండును. ంఅదేవిధంగా ఒక్కొక్క బీజాక్షరమునకు ఒక్కొక్క మహాశక్తి చొప్పున పదహారు మహాశక్తులు ఉండును. ఆ శక్తులే అమృతాది మహాశక్తులు. మధ్యలో విశుద్ధిచక్రాధిష్ఠానదేవత అయిన డాకినీశ్వరి ఉంటుంది. ఈ డాకినీశ్వరినే వజ్రేశ్వరియందురు. ఈ వజ్రేశ్వరీదేవి మంత్రమునకు బీజము, శక్తి, కీలకము అన్నియును డ కార సంకేతమగుటచే వజ్రేశ్వరీదేవి డాకినీశ్వరి అయినది. ఈ వజ్రేశ్వరీదేవికి అమృతాది పదహారు మహాశక్తులు చుట్టూ ఉండును గనుక వజ్రేశ్వరీ స్వరూపిణియైన అమ్మవారు *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది. 'అనాహత చక్రమునకు పైన పదునారు అక్షరములుగల విశుద్ధచక్రము గలదు. దాని మధ్య కర్ణికయందు డాకినీదేవి గలదు. విశుద్ధ పద్మదళమునందు అమృత మొదలు అక్షర వఱకు గల పదునారు దేవతలు గలరు. వీరే స్వరరూపలు. విశుద్ధమునకు పైన చంద్రబింబము గలదు' అని స్వచ్చంద్ర తంత్రమునందు గలదు. 


*అమృతాది మహాశక్తుల పేర్లు:*


1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4. ఈశాని, 5. ఉషఃకేసి, 6. ఊర్ధ్వ, 7. ఋద్ధిత, 8. ౠకార, 9. కార, 10. షా, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 16. అఃక్షరా.


పైనుదహరించిన పదహారు మహాశక్తులు వజ్రేశ్వరీస్వరూపిణియైన పరమేశ్వరిని చుట్టి ఉండుటచే *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *30.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.17 (పదిహేడవ శ్లోకము)*


*నృదేహమాద్యం సులభం సుదుర్లభమ్ ప్లవం సుకల్పం గురుకర్ణధారమ్|*


*మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం న తరేత్స ఆత్మహా॥13022॥*


(ఆద్యమ్) మొదటగా మానవదేహము అత్యంత దుర్లభమైనదని గ్రహింపవలెను. అయితే భగవంతుని అపారమైన కృపచేత అది ఎంతయో సులభమైనది. సకలశ్రేయఃఫలములను పొందుటకు ఇదియే ముఖ్యసాధనము. అగాధమైన సంసారసాగరమును సులభముగా దాటిపోవుటకు ఇదియే దృఢమైన నౌక. ఈ నావకు గురువే కర్ణధారుడు. అనుకూలవాయువుగా తోడ్పడుటకు స్వయంగా భగవంతుడే సిద్ధంగా ఉన్నాడు. దైవకృపచే సకలసౌకర్యములు లభించుచున్నవి. కావున వెంటనే - ఏమాత్రమూ జాగు సేయకుండా భవసాగరమును దాటిపోవుటకు సాధకుడు ఉద్యమింపవలెను. ఇంతటి సువర్ణావకాశమును వదిలిపెట్టి చేతులు ముడుచుకొని యుండువాడు ముమ్మాటికీ ఆత్మఘాతకుడే.


*20.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*యదాఽఽరంభేషు నిర్విణ్ణో విరక్తః సంయతేంద్రియః|*


*అభ్యాసేనాఽత్మనో యోగీ ధారయేదచలం మనః॥13023॥*


పురుషుడు కామ్యకర్మల ఫలముగా దుఃఖములకు లోనై వాటియెడ విరక్తుడైనప్పుడు బాహ్యాభ్యంతర ఇంద్రియములను జయించి (జితేంద్రియుడై) యోగమునందు స్థితుడు కావలెను. క్రమముగా అభ్యాసముద్వారా మనస్సును నిశ్చలముగా నాయందే లగ్నముచేయవలెను.


*20.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ధార్యమాణం మనో యర్హి భ్రామ్యదాశ్వనవస్థితమ్|*


*అతంద్రితోఽనురోధేన మార్గేణాత్మవశం నయేత్॥13024॥*


సాధకుడు మనస్సును స్థిరముగా నిలుపుటకు ప్రయత్నించుచున్నను అది చంచలమై ఇటునిటు పరుగెత్తుచుండును. అప్పుడు అతడు వెంటనే అప్రమత్తుడై ఆ మనస్సును బుజ్జగింపువంటి తగిన ఉపాయములద్వారా వశపఱచుకొనవలెను.


*20.20 (ఇరువదియవ శ్లోకము)*


*మనోగతిం న విసృజేజ్జితప్రాణో జితేంద్రియః|*


*సత్త్వసంపన్నయా బుద్ధ్యా మన ఆత్మవశం నయేత్॥13025॥*


ఇంద్రియములను, ప్రాణములను వశమునందు ఉంచుకొని, మనస్సుయొక్క విశృంఖలత్వమును అదుపు చేయవలెను. అందులకై సాత్త్వికాహారములను స్వీకరించుట మొదలగు ఉపాయముల ద్వారా సత్త్వసంపన్నమొనర్చిన బుద్ధితో మనస్సును వశపరచుకొనవలెను.


*20.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఏష వై పరమో యోగో మనసః సంగ్రహః స్మృతః|*


*హృదయజ్ఞత్వమన్విచ్ఛన్ దమ్యస్యేవార్వతో ముహుః॥13026॥*


మొండికేసి దారికిరాని గుర్రమును రౌతు తన మనోభావములకు అనుగుణముగా తిన్నతిన్నగా బుజ్జగించుచు సరియైన దారికి మళ్ళించినట్లు అటునిటు పోవుచున్న మనస్సును మెల్లమెల్లగా సంయమనమొనర్చి భగవత్పరము గావించుటయే పరమయోగము.


*20.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*సాంఖ్యేన సర్వభావానాం ప్రతిలోమానులోమతః|*


*భవాప్యయావనుధ్యాయేన్మనో యావత్ప్రసీదతి॥13027॥*


సాంఖ్యశాస్త్రమునందు తెలిపినరీతిగా ప్రకృతినుండి శరీరపర్యంతము జరుగు సృష్టిక్రమమును మరియు శరీరమునుండి ప్రకృతివరకు జరుగు లయక్రమమునుగూర్చి (అనులోమ ప్రతిలోమ క్రమముగా) చక్కగా మనస్సునందు తర్కించుకొనవలెను. మనస్సు ప్రశాంతమై స్థిరత్వమును పొందువరకును ఈ ప్రక్రియను కొనసాగించుచునే యుండవలెను.


*20.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*నిర్విణ్ణస్య విరక్తస్య పురుషస్యోక్తవేదినః|*


*మనస్త్యజతి దౌరాత్మ్యం చింతితస్యానుచింతయా॥13028॥*


సాంసారిక విషయములవలన దుఃఖముల పాలైనవాడు విసుగు చెంది క్రమముగా వాటియందు విరక్తుడగును. అప్పుడు అతడు తన గురుజనుల ఉపదేశములను చక్కగా అవగాహన చేసికొని పదేపదే తన ఆత్మస్వరూప ధ్యానమనందే నిమగ్నుడగును. ఇట్లు అభ్యసించుటద్వారా మనస్సుయొక్క చంచలత్వము దూరమగును.


*20.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యమాదిభిర్యోగపథైరాన్వీక్షిక్యా చ విద్యయా|*


*మమార్చోపాసనాభిర్వా నాన్యైర్యోగ్యం స్మరేన్మనః॥13029॥*


'యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు' అను అష్టాంగయోగ మార్గములద్వారాను, తత్త్వవిమర్శనాత్మక విద్యద్వారాను, నన్ను అనన్యభక్తితో ఉపాసింపవలెను. అట్లు ఒనర్చుట వలన మనస్సు చాంచల్యమును వీడి ప్రశాంతమై పరమాత్మయందు లగ్నమగును. అంతేగాని, మనస్సు నిశ్చలమగుటకు మఱియొక ఉపాయములేదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

స్వామి వివేకానంద


స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..

ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!


ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..


వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...


ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!

" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"


దానికి వివేకానందుడు..!!

ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :

" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.

(1St Punch👊)


ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!

ఎలాగైనా వివేకానంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!


ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...

వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!

"వివేకానందా..!!

నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..

నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!!

ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"


వివేకానందుడు (సందేహించకుండా)...

"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!


ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..

"అనుకున్నా...నీ సమాదానం అదేనని...!!

నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!


దానికి వివేకానందుడు..!! 

" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"

(2nd Punch👊)


ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!

అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...

వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!


టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!

ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!


కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..

వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!


ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...

తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది

కోపం తగ్గిన తరువాత హుందాగా.. 

ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...

గౌరవప్రదంగా...

వినమ్రమయిన శాంత స్వరంతో...

"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు... (లాస్ట్ పంచ్👊)

my mother .

 *Thanks to the writer, who posted this*…💐🙏🙏


1) *My first restaurant* => * my mother's breast *

2) *My first toilet* => * my mother's laps *

3) *My first school* => * Mother’s kitchen *

4) *My first teacher* => * my mother *

5) *My first doctor* => * it's my mother*

6) *My first thermometer* => * my mother's fingers *

7) *My first friend* => * it's my mother*

8) * My first dresser* => * it's my mother*

9) *My first vehicle* => * my mother's back *

10) My first lawyer => * it's my mother . *


Thank you mom for all you did for giving me life💐🙏🙏


* Long live all mothers*💐🙏🙏


*A mother can easily maintain 6 children*, but 

Unfortunately it would be difficult for children to maintain a *mother*?!?!


*Submitted To all the moms and Children of the world*.

మననాత్రాయతే

 మననాత్రాయతే ఇతి మంత్ర: అంటారు.


నా సందేహమేమిటంటే, మననం అంటే బయటకు వినపడకుండా చేయడమా? (లేక) బయటకు వినపడేటట్లు చేయడమా?


ఈ సందేహానికి కారణం, మంత్రంలోని ఉదాత్త అనుదాత్తాలను పాటించాలంటే, స్వరం వినపడాలికద!

గాజులు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*స్త్రీలు గాజులు దభరించవలసిన విధి విధానాలు*


🌳🕉️🦚🍁📿🛕🌳🕉️🦚🍁📿🛕


📿చేతికి గాజులందము...చెంపకు సిగ్గులందము’ అంటారు నిజమే...లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు.


📿 గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి. 


📿 అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దిష్టి తగలకుండా ఉండడానికి నల్లగాజులు వేస్తారు. ఆ పసిబిడ్డ మెలుకువగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తూంటే.. ఆ చేతులకు ఉండే గాజులు..లయబద్ధంగా చేసే చిరుసవ్వడులు..ఆ పసివాణ్ణి పలకరిస్తాయి. అవి వింటూ..ఆ చిన్నారి ఆడుకుంటాడు. 


📿ఇలా ప్రారంభమైన గాజుల ప్రస్థానం..జీవితం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రాచీనకాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు. 


📿వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం, లయ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు.


📿 ‘జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుంది’ అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.


📿అయితే..‘ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదా’ అనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు.


📿 కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని ‘గృహలక్ష్మి’ అని గౌరవించారేగానీ.. పురుషుని ‘గృహవిష్ణువు’ అని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు...పెద్దలు.


📿 మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది


📿 కానీ... బోసి చేతులేసుకుని..నడకలో ఓ లాలిత్యం లేకుండా పెద్ద పెద్ద అడుగులేస్తూ, రాక్షసిలా ఆడపిల్ల తిరిగితే ఏం బావుంటుంది చెప్పండి.


📿 సరే...గాజుల విషయానికొద్దాం. గాజులు అందానికే కాదు.,సౌభాగ్యానికి కూడా చిహ్నం. గాజులు...తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి.


*గాజుల రంగులు ఫలితాలు*


📿ఎరుపురంగు గాజులు శక్తిని,పితృదోష నివారణకు


 నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని,భయ నివారణ


 ఊదారంగు గాజులు స్వేచ్ఛను,ధైర్యాన్ని


 ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని,సద్బుద్ధినీ


పసుపురంగు గాజులు సంతోషాన్ని,సంతానాన్ని


 నారింజరంగు గాజులు విజయాన్ని,రుణ రోగ శత్రు నివారణకు


 తెల్లరంగు గాజులు ప్రశాంతతను,దంపతుల అనుకులన్ని


 నలుపురంగు గాజులు అధికారాన్ని,


 వెండి గాజులు బలాన్ని


బంగారు గాజులు ఐశ్వర్యాన్ని

 సూచిస్తాయి. 


📿పెళ్లయిన ఆడపిల్ల...కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. 


📿ఈ కాలంలో తొమ్మిదో నెలలో కూడా చేస్తున్నారనుకోండి. అది వేరే సంగతి. 

ఈ సీమంతోత్సవంలో..పేరంటానికి వచ్చిన ప్రతి ముత్తయిదువు...ఆ సీమంతవధువు చేతులకు తలో జత మట్టిగాజులు తొడగడం అనాదినుంచి వస్తున్న ఆచారం. ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే... ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి.


📿 గాజులేస్తే జాగ్రత్త వస్తుందా.? వస్తుంది. గాజులు ఫగలడాన్ని అమంగళంగా, అశుభంగా భావిస్తారు మన భారత స్త్రీలు. అందుకే గాజులు ఫగలడాన్ని ఇష్టపడరు. గాజులు ఫగలకుండా నడవడం కోసమే.. సీమంతంలో గాజులువేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం. 


📿ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది.


📿 అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. 


🛕ఎంత పేదింటి అన్నయినా..చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు..ఓ పదో, పరకో చేతిలోపెట్టి..‘గాజులేయించకోమ్మా’ అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము ఫగలకుండా, మన సాంప్రదాయాలు ఫగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.


🦚🦚🦚🦚🦚🦚🦚🦚