21, నవంబర్ 2020, శనివారం

రుద్రాక్ష మాల

 రుద్రాక్ష మాల ధరించుటకు పాటించవలసిన ముఖ్య నియమాలు  -


 *  రుద్రాక్ష మాల ధరించాలనుకునేవారు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆవుపాలతో శుద్ధిచేసి ధరించగలరు.


 *  సంవత్సరానికి ఒకసారి రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి ఆ పూజలో రుద్రాక్షమాలను ఉంచి మరలా ధరించవలెను .


 *  ఎల్లప్పుడూ రుద్రాక్ష మాలని ధరించువారు కనీసం సంవత్సరానికి ఒకమారు ఆ రుద్రాక్ష మాలకు " మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం " చేసినచో చాలా మంచిది .


 *  రుద్రాక్ష మాలను బంగారంతో గాని వెండితో గాని చుట్టించుకొని తీసుకువచ్చి గంగాజలంతో శుభ్రపరచి , పంచామృతాలతో శుద్దిచేసి ఆయా రుద్రాక్ష యొక్క అధిష్టాన దేవత మందిరంలో ఉంచి పూజించి ధరించవలెను .


 *  రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు పౌర్ణమి , త్రయోదశి , చతుర్దశి , మహాశివరాత్రి , కార్తీకమాస సోమవారముల యందు ధరించవలెను .


 *  రుద్రాక్షలను రుద్రాక్ష పూజా మంత్రములతో పూజచేయకుండా ధరించిన ఫలితం ఉండదు.


 *  రుద్రాక్షలు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉండవలెను అనిన వాటికి ఆవునెయ్యి నెలకొకమారు రాయవలెను.


 *  ప్రతినిత్యం స్నానం చేయునపుడు రుద్రాక్షమాల తీసి పక్కన పెట్టి స్నానం చేయుట మంచిది .


 *  రుద్రాక్షలతో ముత్యాలు , పగడములు , స్పటికములు , శంఖాలు , తులసి పూసలు , నవరత్నాలు కలిపి ధరిస్తారు . ఇలా ధరించేప్పుడు కనీసం రుద్రాక్షలు 27 గాని , 54 గాని ఉండవలెను .


 *  శివరాత్రి పర్వదినమున రుద్రాక్షలతో పూజ చేయుట చాలా శ్రేష్టం .


 రుద్రాక్ష ధారణకు శుభసమయ వేళలు  -


 *  మేష , కర్కాటక , తులా , మకర , కుంభ లగ్నముల యందు రుద్రాక్ష ధారణ చేయవలెను .


 *  అశ్వని , మృగశిర , పునర్వసు , పుష్యమి , హస్త , స్వాతి , అనూరాధ , శ్రవణం , రేవతి నక్షత్రాలలో రుద్రాక్ష ధారణ చాలా మంచిది .


 *  పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , త్రయోదశి , పౌర్ణమి తిథులలో ధరిస్తే మంచిది .


 *  సోమవారం  ధరిస్తే చాలా మంచిది . లేదా శనివారం కూడా ధరించగలరు . కృష్ణపక్షంలో (పౌర్ణమి తదుపరి బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ) ధరిస్తే మంచిది .


 *  కార్తీకమాసంలో ధరిస్తే చాలా మంచిది . లేదా మార్గశిర మాసంలో కూడా ధరించవచ్చు . భాద్రపద , పుష్య , శ్రావణ , అశ్వయుజ మాసంలో కూడా ధరించవచ్చు .


 *  రుద్రాక్షమాల ధారణకు మహాశివరాత్రి పర్వదినం చాలా ఉత్తమం.


 రుద్రాక్షధారణ కు పాటించవలసిన నియమాలు -


 *  సోమరులు అయి ఉండకూడదు. సేవా కార్యక్రమాలు యందు ఆసక్తి కలిగిఉండవలెను.


 *  అపద్దాలు ఆడకూడదు . దయ, దాక్షిణ్యం , ఏకాంతం , క్షమాగుణములలో సాత్విక అభిప్రాయంతో , శాంతస్వభావులై ఉండవలెను .


 *  కామ, క్రోధ, లోభ, మోహ , మద మాత్సర్యాలను వదిలిపెట్టి సంప్రదాయ బద్ధమైన విషయాలను నిందించకూడదు .


 *  పాపాత్ములతో సావాసం చేయరాదు .


 *  వితంతువులు రుద్రాక్ష ధారణ చేయుట మంచిది .


 *  రుద్రాక్ష ధరించువారు ధూమపానం మానివేయవలెను .


 *  రుద్రాక్ష ధారణ చేసినవారు వెల్లుల్లి , నీరుల్లి , మద్యమాంసాదులు మానివేయవలెను .


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Kartika masam



 

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - ఆరవ భాగం


అమృతంతో సంబంధమున్న గరుత్మంతుడు ప్రజలను విషము నుండి రక్షిస్తాడు. చంద్రకాంత శిలామూర్తిగా అంబికను ధ్యానం చేసినవారు గరుడుని వలే పాముల విషాన్ని శమింప చేయగలడని ఆచార్యులవారంటున్నారు. “ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ”. 'శకుంతము' అంటే పక్షి. మేనకా విశ్వామిత్రుల సంతానము పక్షుల చేత పెంచబడి శకుంతల అయింది కదా! గరుత్మంతుడు శకుంతాధిపుడు పక్షిరాజు. 


ఈ శ్లోకం జపం చేయడం వలన పాముకాటు వల్ల ఎక్కినా విషము హరించడమేకాక, దోమవంటి కీటకముల వలన కలిగిన చలిజ్వరములు, వైరల్ జ్వరములు కూడా శమిస్తాయి. అంబికను అమృత కిరణమూర్తిగా ధ్యానించిన వారికి అమృతనాడి సిద్ధిస్తుంది. లేక సహస్రారంలో కురిసిన అమృతపు జల్లులకు అతడి నాడీమండలమంతా అమృత మయమవుతుంది. అమృత నాడులున్న అతడి దృష్టి జ్వరగ్రస్తుని పై పడితే చాలు, జ్వరం మటుమాయమయిపోయి అతడు సుఖిస్తాడు. 


“జ్వరపుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా”


అంబిక అరుణారుణమైన తనుచ్ఛాయతో నభోంత రాళములు ప్రకాశిస్తున్నట్లు ఆ కాంతితో భూమ్యాకాశములు నిండిపోయినట్లు భావించిన సాధకునికి వశీకరణ శక్తి లభిస్తుందని పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పబడి ఉంది. సాధారణంగా అంబిక తనుచ్ఛాయ శుద్ధస్ఫటికం వలె ప్రకాశించేదే అయినప్పటికీ, శ్రీవిద్యాధిదేవతగా అంబిక అరుణవర్ణంతో ప్రకాశిస్తుందని చెప్పబడింది. అది శ్రీ విద్యాధిదేవత యొక్క ప్రత్యేకత. సూర్యోదయ కాలంలో ఆకాశమంతా అరుణిమతో ప్రకాశిస్తుంది కదా! అదే విధంగా భూమ్యాకాశములు, సమస్త బ్రహ్మాండము ఆమె తనుచ్ఛాయవలన అరుణారుణంగా ప్రకాశిస్తోందనే భావన చేయాలన్నమాట. వశీకరణ విషయంలో మనం వశీకరింపబడకూడదనే ఉద్దేశంతో నేనా శ్లోకాన్ని వ్యాఖ్యానించలేదు. అయితే అంబిక యొక్క ప్రత్యేకత అయిన ఈ అరుణ వర్ణం గురించి చెప్పుకోకుండా ఉండేదెలా? అదీకాక వశీకరణం యొక్క అంతరార్థం గురించి మనం చెప్పుకోవద్దా?


సొందర్యలహరిలోనూ మరి అటువంటి ఇతర శాక్త గ్రంథములలోనూ వశీకరణ, స్త్రీవశ్యము, మన్మథునిబోలిన గురించి బహుధా చెప్పబడి ఉంటుంది. ఆ మాటల అర్థాన్ని కేవలం వాచ్యార్థంగా తీసుకొంటే ప్రమాదమున్నది. ఒక వ్యక్తీ ఇంకొకరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడంటే అర్థమేమిటి? అతడు వారిచే ఆకర్షించబడినాడన్న మాట. అందువల్లనే వశీకరణ మంత్రాలను ఉపయోగించి వారిని స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకరు ధన కనక వస్తువాహనాది సంపదను సంపాదించి, వాటిని తాను స్వంతం చేసుకొన్నానని భావిస్తారు. నిజంగా జరిగేది ఏమంటే అతడు వాటిచేత స్వంతం చేసుకోబడ్డాడు. వాటికి బానిస అయినాడు. దీనికి తార్కాణమేమిటి? ఒకవేళ ఆ సంపద పోయినట్లయితే ఈతడి మతి చలించిపోతోంది కదా! ఏదో ఒక వస్తువునో, వ్యక్తినో వశీకరించుకోవాలని మంత్రజపం చేసే వ్యక్తి, తన వశ్య మంత్రానికి గమ్యమైన వస్తువు లేక కోరికకు బానిస అయిపోయాడు. అటువంటి వానికి అంబికను సదా తన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ క్రమశః ఆత్మసాక్షాత్కారం పొందే దారి మూసి వేయబడుతుంది.


మంత్రశాస్త్రాన్ని ఆవిష్కరించిన ఆచార్యుల వారి వంటి మహాపురుషులు ఒక మనిషి తన పరమగమ్యము చేరుకోవడానికి పయనించవలసిన దారిని మూసివేసే పద్ధతి ఉపదేశిస్తారని మీరనుకొంటున్నారా? అంబిక భక్తులు మనఃస్థితిని ఆచార్యులవారు “మృదితమల మాయేన మనసా” అని అభివర్ణిస్తారు. భక్తుని మనసు చెడ్డ ఆలోచనలకు, కోరికలకు దూరంగా మాయను అణచి ఉండే విధంగా ఉంటుందట. అంబిక భక్తుడు తుచ్ఛమైన వశీకరణాది విషయాల్లో మనస్సు పెట్టేవాడుకాదు. మాయ అనే మహా సర్పాన్ని కాళీయ మర్దనం చేసిన కృష్ణునివలె మర్దించేవాడు. కాబట్టి 'వశ్యము' అనేదానికి అంబికను ధ్యానించే సాధకుడు ఎటువంటి ఆకర్షణలకు బానిసకాడనీ, అతడి మనస్సు ఎప్పుడూ అతడి అధీనంలోనే ఉంటుందనీ అర్థం చెప్పుకోవాలి. అతడు వశీకరించు కొన్నాడన్న మాటకు ఆ వస్తువు అతనిలో ఐక్యమయిందనే అర్థం చెప్పుకోవాలి. గీతలో భగవానులు “సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవిశంతి సర్వే” అంటారు. సముద్రం నదులన్నిటినీ తనవైపుకు లాగి తన అధీనంలోనికి తెచ్చుకొన్నట్లు - వశ్యమంటే తన వైపుకు లాగుకొనడమేకదా! నదులుగానీ, సముద్రం గానీ ఒకదాని కొకటి భిన్నంగా గుర్తించుకోలేవు కదా! సముద్రము నదులూ కూడా అద్వైత భావాన్ని పొది “శాంతిం ఆప్నోతి” శాంత స్థితిని పొందుతాయి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

వేమన పద్యం *


 వేమన పద్యం *


తనువ  దెవరిసొమ్ము తనదని పోషింప, 

ధనమదెవరిసొమ్ము  దాచుకొనగ, 

ప్రాణ  మెవరిసొమ్ము పాయకుండగ  నిల్ప, 

విశ్వదాభిరామ వినురవేమ *


భావము =


మనిషి జన్మ పలు జన్మల పుణ్య సిద్ధి యని ఆర్యోక్తి. అలాంటి మనిషి పై, అతనిపై అతనికే అధికారములేదు, అది అంతా ఆ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడు లీల. ఆయనే అన్ని నీకు సమకూర్చుతాడు, హరింపచేస్తాడు. ఈ సుందరమైన దేహం దేవుడిచ్చిన బహుమానం.  దీన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటాము. ఎన్నాళ్లు  ఉంటామో ఈ సుందర రూపంతో తెలియని మనిషి తన అశాశ్వత రూపాన్ని ఎంతో ఆపురూపంగా చూచుకొన్నపటికి, ఆ దైవం ఆజ్ఞ కాగానే, నీది అనుకొన్న తనువు విడచి పోవాలిసిందే, ఇది అంతా నాది అనే ఆశతో దాచుకొన్న ధనము అంతా పరాధీనమై పోతుంది, ప్రాణము ను పోకుండా ఆపలేము, ఈ తనువు, ధనము, ప్రాణము,  అన్ని ఆ భగవంతుడు ఇచ్చినవి, ఈ లోకంలో ఆయన పిలవగానే అన్నిటిని విడచి ఆయన సన్నిధికి చేరుకోవలిసిందే.వున్న కొన్నినాళ్లు తోటి మనిషిని ప్రేమిస్తూ, సఖ్యత తో విరోధము లేక  జీవనమ్ సాగించటమే మనిషి ధర్మం.   ఇది ఈ నాటి వేమన పద్య భావన.


మీరు రాజబాబు 😷🎹🎼🎤

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

 శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం


తిరుప‌తి, 2020 నవంబ‌‌రు 19: సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఉద‌యం 11.52 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 


ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకీ ఉత్సవం ఆలయంలో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన మండపానికి వేంచేపు చేశారు. 


తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 9.00 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 


అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు :


ఈ సందర్భంగా 112 గ్రాములు బ‌రువుగ‌ల బంగారు పతకం, 249 గ్రాములు బ‌రువుగ‌ల ప్లాటినం లక్ష్మీ పతకం, దశావతారముల బిళ్లలు కలిగిన ప్లాటినం చైను సారెతో పాటు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.


శోభాయ‌మానంగా స్న‌ప‌న‌ తిరుమంజ‌నం


 వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.


నెమలి ఈకలు, యాలకులు, నెల్లి, ఫైనాపిల్, బ్లాక్ క్యాన్ బెర్రీ, లిల్లీ, తులసి, ఆర్కాడ్ పూలతో రూపొందించిన మాలలు, కిరీటాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 


తిరుపూర్ కు చెందిన దాతలు ఈ మాల‌ల త‌యారీకి విరాళం అందించారు. సేలంకు చెందిన కళాకారులు ఈ మాలలను రూపొందిచారు. 


ఆకట్టుకున్న ఫలపుష్ప మండపం:


టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, రోజా, సంపంగి, ఆరు రకాల కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. 


కాగా రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 22*

 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 22*


సోదిని నమ్మే ఆచారము వున్నది కదా! అందుచే శ్రీనివాసుడు కనకాంబరము చీర కట్టాడు. కాని రంగు రవికె తొడుగుకున్నాడు. ముద్దొచ్చే పచ్చబొట్టు ముఖానికి పెట్టుకున్నాడు. కండ్లకు నల్లనైన కాటుక పెట్టుకున్నాడు. తలమీద సోదిబుట్ట పెట్టుకొన్నాడు.


ఈ విధముగా ఎరుకలసాని వేషము ధరించినవాడై శ్రీనివాసుడు అచ్చు ఆడుదానివలె తయారయి ఆకాశరాజు నగరములో ప్రవేశించాడు. సరాసరి రాజభవనము చేరింది ఆ క్రొత్త సోది స్త్రీ‘. సోది చెబుతానమ్మా సోదీ!’ అని బిగ్గరగా కేక వేసింది. 


ఆకాశరాజు భార్య ధరణీదేవి ఈ మాట విన్నది. పిలిపించి ఆమెను ‘మా అమ్మాయికి సోది చెప్పుము’ అంది. ‘సరే’ యన్నది. ఎరుకల సాని పద్మావతిని బుట్టకి ఎదురుగా కూర్చుండజేసి చేటలో విలువైన ముత్యాలు పోయించినది. 


గద్దెపలక వుంటుంది కదా దానికి పసుపూ, కుంకుమా పెట్టించింది. దేవతలను కొలిచినది. మూలదేవతలకు మ్రొక్కినది. ఇంక సోది చెప్పుట ప్రారంభించినది.....


‘‘ఇనుకోవె ఓ పిల్లా ఇవరంగా చెప్పుదు

జరిగేది యంతా నిజముగా చెప్పుడు

వనములో పురుషుని వలపుతో జూసి 

అతని నీ మనసులో అట్లే దాచావు

గుండెలో నతుడు బాగుండినాడే పిల్ల 

శృంగార వనములో శృంగార పురుషుడే ‘‘నన్ను 

ప్రేమింతువా?’’ యని యన్నందుకే నీవు 

రాళ్ళతో కొట్టించు రాలుగాయీ పిల్లా.

వెన్నవంటీ మనసున్నవాడే వాడు. 

నిన్న బోలిన బాధ నున్నాడు వాడు. 

ఆ రోజు నడవి వాడనుకొంటివే వెఱ్ఱి!

ఆదిదేవుడు, నారాయణుడతండే. 

శ్రీనివాసునిగాను చెలగుచున్నాడే

ఆకాశమె క్రిందుగా గమనించిననూ 

భూమియే పైపైకి పోయినా ఏమైనా 

దంపతులగుదరు పెండ్లియు జరిగు 

దిగులు నీ పెండ్లితో దిగునులే పిల్లా‘‘

అని వున్నవీ, జరిగేవీ వివరముగా సోది చెప్పినది. వారిచ్చిన కట్నము తీసుకొని వెళ్ళిపోయింది ఎరుకులసాని.


ఎరుకసాని వేషము వేసుకొని సోది చెప్పిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతి గురించే ఆలోచించసాగాడు. పద్మావతి శ్రీనివాసునితో తనకు ఏ విధముగా పెండ్లి జరుగుతుందా అనే ఆలోచనలో పడింది.


ఆకాశరాజు, ధరణీదేవి పద్మావతిని చూచి విచారించసాగారు. పద్మావతికి కలలో శ్రీనివాసుడు కనుపించి అనేకమైన లీలలు చూపించినాడు. ఆమె ఆవిషయము తన తల్లిదండ్రులతో చెప్పి తాను శ్రీనివాసుని తప్ప మరొకరిని వివాహమాడననెను. ధరణీదేవీ, ఆకాశరాజూ కూడా తాము పెద్దలను సంప్రదించి ఆమె కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తా మన్నారు.


వకుళ, రాయబారము సాగించుటకు నారాయణపురము చేరినది. అంత:పురములో ప్రవేశించినది. ఆకాశరాజు, ధరణీదేవి ఆమెను తగురీతిని గౌరవించి పూజించారు. 


అనంతరము ఆకాశరాజు వకుళతో ‘‘అమ్మా! చూడగా మీరు యోగినివలె కనిపించుచున్నారు. మీ రాకవలన మా గృహము పావనమైనది. మీ రాకకు గల కారణము తెలుసుకొనవలెనని కుతూహల పడుచుంటిమి. మీరు యెక్కడ వుంటుంటారు? ముఖ్యంగా మీరు శ్రమపడి వచ్చిన పనిని తెలియజేయ కోరుతున్నాము. అన్నాడు. 


వకుళాదేవి ఆకాశరాజుతో మహారాజు! నేను శేషాచల నివాసిని, నాకు ఒక్కగానొక్క, కుమారుడు. అతనిపేరు శ్రీనివాసుడు. నాకుమారుని అందము చెప్పడానికి భాషలోని మాటలు చాలవు. అతనిది వశిష్టగోత్రము అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే. ఒకనాడు మావాడు వేటకు వెళ్ళి శృంగారవనమున ప్రవేశించి, మీ ముద్దుల కుమార్తె అయిన పద్మావతి యొక్క సౌందర్యతిశయాన్ని చూసి ప్రేమించినాడు. పద్మావతిని తప్ప అన్య కన్యను ఒల్లనంటున్నాడు.’’ ఈ మాటలు అంటూంటే ధరణీదేవి మా అమ్మాయి కూడా యింతే కదా అనుకొన్నది.


వకుళ చెప్పసాగినది. ‘‘నా కుమారుడు మూడు లోకాల్ని ఏలగల దిట్టడు. ఆ లక్షణాలన్నీ వున్నాయి. బుద్ధిమంతుడూ, అందగాడూ అయిన మా పిల్లవాడికి బుద్ధిమంతురాలూ, సుందరీ అయిన మీ కుమార్తెనిచ్చి వివాహము చేస్తే ఉభయత్రా బాగుంటుంది. కనుక, మీరు సందేహించక ఆ విధముగా చేయండి. మావాడు దైవాంశజుడేగాని, మానవమాత్రుడు కానేకాడు’’ సాత్త్విక భావము తొణికిసలాడే ఆమె పలుకులకు ఆకాశరాజు ఆనందించి ‘‘ అమ్మా! మీరు ఉన్న విషయాలన్నీ చెప్పారు. ఈ విషయాలన్నీ మా పెద్దలతో కూలంకషంగా యోచించి, ఏ విషయమూ మీకు వర్తమానము పంపుతాను’’ అన్నారు. వకుళాదేవి వారివద్ద శలవు గైకొని తిరిగి తన స్థలానికి చేరుకొన్నది.


*బిల్వపత్రార్చిత గోవిందా, బిక్షుక సంస్థుత గోవిందా,* *బ్రహ్మాండ రూప గోవిందా, భక్త రక్షక గోవిందా; |* 


*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా,* *వేంకట రమణా గోవిందా. |* |22||


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వెంకటేశాయ*

🙏🙏🙏🙏🙏

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 21*

 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 21*


శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందిస్తూ ‘‘మాతా! ఈనాడు నీకొక రహస్యము చెప్పగలవాడను వినుము. పూర్వకాలములో నేను శ్రీరామావతారము ధరించినప్పుడు నేను లేని సమయము చూసి, రావణుడు సీతను యెత్తుకుపోయాడు. 


మార్గ మధ్యములో అగ్నిదేవుడు రావణునకు అడ్డుపడినాడట. అడ్డుపడి నేను అసలు సీతను అగ్నిచెంత దాచి, ఆశ్రమమున మాయ సీతను వుంచితిననియూ, అతడు తీసుకుపోతున్న సీత మాయసీతే ననియు నమ్మించాడు. మాయసీత నాకేలనని రావణుడు అగ్నిదేవునకిచ్చి వేసినాడు. ‘అసలు సీత యిదిగో ఈమె’ యని చెప్పి, తనవద్దనున్న వేదవతిని రావణున కిచ్చినాడట. 


నాకు యీ విషయము తెలియదు, రావణుని నేను సంహరించిన అనంతరం సీతను ఒకవేళ లోకము శంకిస్తుందేమో యని అగ్నిప్రవేశము చేయించాను.


అప్పుడు అగ్నిదేవుడు వచ్చి విషయము చెప్పి వేదవతినీ కూడా సీతాదేవితో పాటు ఏలుకోవలసినదని కోరాడు. అప్పుడతనితో నేను వేదవతిని కలియుగములో వివాహమాడెదనని మాట నిచ్చివేయుటము జరిగినది. ఆ వేదవతియే యీ పద్మావతి. కనుకనే పద్మావతిని నేను వివాహమాడవలసి యున్నది. అన్ని వకుళతో వివరముగా చెప్పినాడు.


శృంగార వనములో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపములో వున్న శ్రీనివాసుని చూచినదో అప్పటినుంచీ యామెకు ఆ పురుషుని గూర్చిన ఆలోచనలే మనసులో మెదలడము ప్రారంభించినాయి. 


కన్ను మూసినా, తెరచినా అతడే కనిపిస్తున్నాడు. అతడు తన హృదయముపై చెరగని ముద్రవేసినాడు. అతనిని వివాహము చేసుకొన్న బాగుండునని పద్మావతి భావించినది. అయితే తల్లికికానీ, తండ్రికి కానీ విషయము చెప్పలేదు, చెలికత్తెలకి చెప్పడానికి గూడా సిగ్గేసింది. 


‘బోయవాడు, బికిరివాడు నీకు భర్తగా రావడమేమిటి?’ అని తల్లిదండ్రులు తనను చీవాట్లు పెట్టవచ్చు. అందువలన ఆమె సరిగా తినడము సరిగా నిద్రపోవడము మానేసి చాలా కాలమైనది. సింగారించు కోవడము మానినది.


వనవిహారము మానినది, చివరకు చెలికత్తెలతో సరిగా మాట్లాడడము కూడా మానివేసినది. ప్రేమ జ్వరము ఆమెను క్రుంగదీయడము ప్రారంభించినది. 


పద్మావతి వనోవ్యాధితో మంచమెక్కినది. ఆకాశరాజు, ధరణీదేవి విప్రవర్యులచే పద్మావతి ఆరోగ్యమునకై పూజలూ, అభిషేకములూ జరిపించారు. రాజవైద్యులు కూడా వైద్యము చేశారు. ఏమి చేయించినా ఆమె వ్యాధి కుదటపడదని ప్రారంభించనే లేదు పైగా ఆ వ్యాధి ఆ రోజు కారోజు పెరిగిపోసాగినది. ఇక్కడ పద్మావతియిలా వుంటే

అక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని కాల పరిణామము తెలియకుండా అదే పనిగా పద్మావతిని గూర్చి ఆలోచించసాగాడు.


శ్రీనివాసుని దిగులు వకుళాదేవికి విచార కారణమయినది. వకుళ పరిష్కారమును గూర్చి ఆలోచించసాగినది.


 శ్రీనివాసునితో ఆమె ’’నాయనా! నీ దిగులు చూస్తే నాకు మతిపోతోంది. బాధపడకు, ఆకాశరాజుగారి వద్దకు ఇంక నేనే స్వయముగా వెళతాను వెళ్ళి అన్నీ మాట్లాడుతాను మాట్లాడి, ఈ నీ వివాహము ఎలాగైనా జరిపించాలని అర్ధిస్తాను. శాయశక్తులా కృషిచేసి రాయబారము సాగించి వస్తాను.

నీవు బాధపడడము మాత్రము మానుకో! అని నారాయణపురానికి బయలుదేరినది. 


పాపం వకుళాదేవి శ్రమపడి వెళుతోంది కానీ, ఆకాశరాజా వాళ్ళూ అంగీకరిస్తారో లేదో? అందుచేత ఈ లోపున దానికి బలముగా ఒక పధకం వేయవలసి వుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు.


 *వజ్రకవచధర గోవిందా,* *వసుదేవ తనయ గోవిందా,* *వైజయంతిమాల గోవిందా,* 

*వేంకట నాయక గోవిందా; |* 


*గోవిందా హరి గోవిందా, వేంకటరమణా గోవిందా,*

*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.|* |21||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వెంకటేశాయ*

🙏🙏🙏🙏🙏

గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు

 గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు  - 


 *  ఎల్లప్పుడూ మితిమీరి ఆహారాన్ని భుజించకుడదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్దాలు మాత్రమే తినాలి .


 *  తినాలి అనిపించినప్పుడు వీధిలోని పదార్దాలు భుజించ కూడదు. ఇంట్లో చేయించుకొని తినాలి .


 *  కొంతైనా శారీరక శ్రమ చేయాలి.


 *  ప్రసవించెంత వరకు సామాన్యంగా ఇతరుల ఇళ్ళకు వెళ్ళకూడదు. ముఖ్యంగా చావులు, ఘర్షణలు , గొడవలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు .


 *  గర్భిణులు బలవంతమైన అతి కష్టమైన పనులు అసలు చేయకూడదు. ఎత్తు ప్రదేశాలు ఎక్కడం , వేగంగా దిగడం చేయకుడదు . 


 *  కారం, చేదు, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్దాలు గర్భిణి లు తినకూడదు . 


 * పగలు నిద్రించడం, రాత్రి మేలుకోవడం , అతిగా టీవీ చూడటం, సినిమాలు చూడటం చేయకూడదు 


 *  మనసుకి ఆందోళన కలిగించే విషయాలు వినకుడదు .


 *  నూలు బట్టలు వదులు గా ఉన్నవి ధరించాలి.


 *  మనసులో ఈర్ష్య, ద్వేషం , అసూయ లాంటి రజో,తమో గుణాలు కి గురి కాకూడదు . అలా గురి అవ్వడం వలన లోపల బిడ్డ మీద ప్రభావం పడుతుంది. పుట్టే వారు కూడా అవే లక్షణాలతో పుడతారు.


 *  గర్భిణి స్త్రీలు చన్నీటి స్నానం చేయకూడదు .


 *  ఆరోవ మాసం నుంచి సంభోగంలో పాల్గొనకుడదు . సంభోగం నుంచి ఆలోచనలు రాకూడదు.


 *  సంభోగం లో పాల్గొనడం వలన గర్భ స్రావాలు , 8 మాసాలకే ప్రసవాలు , మృత శిశువులు పుట్టడం ఒక్కోసారి తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లడం జరుగుతుంది.


 *  గర్భిణి స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోను కొబ్బరి బొండాలు తాగకూడదు. అలా తాగడం వలన అప్పుడే నెల తప్పినా , మూడు లేకా నాలుగు మాసాల గర్భవతిగా ఉన్నా లేత కొబ్బరి బొండాల నీళ్లు తాగడం వలన గర్భ స్రావాలు జరుగుతాయి.


 *  నువ్వులతో చేసిన కజ్జికాయలు, నువ్వుల నూనెతో వండిన పిండి వంటలు, నువ్వుల నూనెతో తయారయిన ఉరగాయ పచ్చళ్ళు తినడం వలన కూడా గర్భ విచ్చిత్తి జరుగుతుంది.


 *  పాతకాలపు ఇళ్ళలో మొదటి సారిగా సమర్త ఆడిన ఆడపిల్లలకు నువ్వులు , బెల్లం కలిపి           " చిమ్మిరి " తయారు చేస్తారు ఆ చిమ్మిరి ముద్ధలని పొరపాటుగా గర్భవతులు గనక సేవిస్తే వెంటనే గర్బం విచ్చిత్తి జరుగుతుంది.


 *  రెండు, మూడు నెలలు గర్బవతులు గా ఉన్నప్పుడు అతిగా వేడిచేసే ఆవపిండి, ఆవకాయ , ఎక్కువుగా ఉప్పు , కాకరకాయ , కర్బూజా పండు , ఇంగువ, శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు, నువ్వులు , బ్రాంది , విస్కీ, రమ్ , ఎక్కువ ఎండు కారం , లవంగాలు, కర్పూరం , వస, వెల్లుల్లి, సునాముఖి మొదలయిన పదార్దాలు ఎక్కువుగా వాడటం వలన కూడా గర్భ విచ్చిన్నం జరుగును.


  

     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మూఢుడు

 *విదురనీతి*


*సంసారయతి కృత్యాని సర్వత్ర విచికిత్సతే*

*చిరం కరోతి క్షిప్రార్థే స మూఢో భరతర్షభ*


"తన పనుల్ని ఇతరులకు పురమాయిస్తాడు. 

అన్నిచోట్ల సందేహిస్తుంటాడు. 

తొందరగా ముగిసే పనిని సాగదీస్తాడు. 

అతణ్ణి మూఢుడు అంటారు."


====================

మత్స్య యంత్రము

 #భువనేశ్వరిపీఠం

మత్స్య యంత్రము


మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు ద‌శావ‌తార‌ముల‌లో మొట్టమొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్రము, ఇత‌ర యంత్రముల క‌ంటే చాలా విశిష్టమైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్షర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్రదాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డింది.


పూజా విధి ఈ మ‌త్స్య యంత్రమును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్రతిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్రమును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెం ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది. 


మత్స్య యంత్రమును 

                శ్లో || స్వర్ణేన రజతే నాపి పంచాంగుళ ప్రమాణకమ్ |

                         యంత్రపత్రం విరచ్యాధ సప్తకోణం లిఖేత్పురమ్ |

                         వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |

                         మధ్యేతు మత్స్య మాలిఖ్య గృహస్థాపన శోభనమ్ |

                         అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |

                         శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||

                          

                   మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించిన గృహ దోషములు, శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557