మొగ తోబుట్టువులు లేని ఆడపిల్లను మాత్రమే " పుత్రిక " అనాలి. అన్యథా
" కూతురు " అనే అనాలి. శుభలేఖలు జాగ్రత్తగా వ్రాయించండి.
చాలా మంది ఈ తప్పు చేస్తున్నారు.
*పుత్రిక - కూతురు తేడా:*
*పుత్రిక* అంటే - మగ సంతానం లేని వారికి, ఆస్తి, వంశం, పిండ ప్రదానం కోసం కూతురిని పుత్రుడిగా భావించి ఇచ్చే పేరు. ధర్మశాస్త్రం ప్రకారం అన్నదమ్ములు లేని ఆడపిల్ల మాత్రమే పుత్రిక.
సోదరులు ఉన్న ఆడపిల్లను పుత్రిక అంటే - ఆమెకు అన్నదమ్ములు లేరని, ఆ తండ్రికి కొడుకులు లేరని అర్థం వస్తుంది. అది ఆ కుటుంబానికి అశుభం లాంటిది.
కాబట్టి -
- సోదరులు లేని అమ్మాయికి మాత్రమే శుభలేఖలో *"చి.ల.సౌ. పుత్రిక"* అని వ్రాయాలి.
- అన్నదమ్ములు ఉన్న అమ్మాయికి *"చి.ల.సౌ. కూతురు"* లేదా *"కుమార్తె"* అని మాత్రమే వ్రాయాలి.
ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అందరికీ ఒకేలా "పుత్రిక" అని కొట్టేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి