ఏకం సత్. ఉన్నది వకటే అన్నప్పుడు యీ విశ్వంలో పదార్ధం లేక శక్తిని లేక అయస్కాంత చలన శక్తియా? దీనిని లెక్కింప శక్తి కొలమానం అశ్వ చలన శక్తి యని. అయిన సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఏక చక్ర రధం రూఢం సూర్యశక్తియని తెలియుచున్నది. ఏక చక్ర అనగా వకే వృత్తాకరంగా వున్న సమస్తం శక్తి రెండుగా రాహు కేతు తత్వ శక్తిగా మారి అపై ఐదు రంగులుగల గాయత్రీ రంగులైన ముక్తా విద్రుమ, హేమ నీల ధవళ రూపమై ఆపై గ్రహ శక్తి అది రూప గుణ లక్షణముగా మారు చున్నది. ఏడు రంగుల ఏడు గ్రహముల శక్తిగా మారు చున్నది. అది విబ్జాయర్ అని ఆధునికుల విషయం. సప్త సప్త మహా సప్త యని సప్త ద్వీప పరివృత్తమై యున్న శక్తిని కొలుచుట సాధ్యమా. పరిశీలన చేసిన అది అనంత మని పరిమాణ రూపం లేనిదని అదే వ్యాప్తంగా విషు విష్ణు తత్వ మని తెలియుచున్నది. ఏడు గ్రహముల శక్తికి మూలం రాహు కేతు మూలమైన శక్తియే.మూల శక్తి లక్షణము తెలియుట అసాధ్యం. మహా సౌర నిర్ణయం కూడా రాహువు తత్వం తెలియక కేతు తత్వమే మూలమని భాసయత్ ప్రకాశించిన తరువాతనే తెలిసినది. అదియును అసంపూర్ణమే.ప్రకాశవంతవంతమైన తరువాతనే పదార్ధరూపం. జీవునికి చైతన్యరూప జీవునిగా దేహ సంబంధమైనదని తెలియుట వక్క మానవునికే తప్ప యితర జీవ జాలము లకు తెలియదు. అదియే ప్ర ఙ్ఞానమని తెలియును. ఉత్తమమైనది మానవ జన్మయే. మరలా అది వచ్చునో రాదో.వచ్చినా పురుషుడు పురుషుడుగా వచ్చుట అసంభవం స్ర్రీ స్త్రీగా వచ్చుట కూడా అసంభవం. దీనికి సాధనయే మూలం. అసలు జీవుడుగా ధరించకుండుటకు సాధన తప్ప వేరు మార్గం లేదు. తస్మాత్ జాగృత జాగ్రతః ఎల్లప్పుడు జాగ్రత్తగా వుండుట కుదరదు. మాయవలన. మాయనుండి వచ్చుటవలన మాయ గానే వెడలుట సృష్టి ధర్మం. దీనికి అతీతముగా వెడలుటయే మెూక్షమని, తిరిగి రాకుండుటయే యని తెలియుట. దీనినే పునరావృత్తి రహితయని లలితా సహస్రం తెలుపు చున్నది. తెలుసుకుంటూ నే వుందాం. ఆచరిస్తూ నే వుందాం.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
1, మే 2021, శనివారం
మొగలిచెర్ల
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు..*
*(పదునాలుగవ రోజు)*
శ్రీ స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరి, కొంతకాలం సాధన చేసిన అనంతరం, చిత్తూరు జిల్లాలోని పాపానాయుడుపేట గ్రామంలో "బాలబ్రహ్మం" గారి వద్ద ఉపదేశం పొంది..తిరిగి స్వగ్రామం ఎర్రబల్లె చేరారు..అక్కడనుంచి మాలకొండ కు వెళ్లి, అక్కడ తన తపోసాధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు..
శ్రీ స్వామివారి తల్లి, సోదరులు అప్పటికే మానసికంగా సిద్ధపడిపోయారు..తమ బిడ్డ ఇక ఏవిధంగానూ సాధారణ జీవనం గడిపే అవకాశం లేదని వారికి తేటతెల్లంగా అవగతం అయింది..మాలకొండ క్షేత్రం తమ గ్రామం నుంచి రమారమి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది..శ్రీ స్వామివారు సాధన చేసుకుంటున్నప్పుడు ఆహారం మితంగా తీసుకునేవారు..కేవలం కొద్దిగా బియ్యం, అందులో కొద్దిగా పెసరపప్పు కలిపి ఉడికించుకొని దానినే ఆహారంగా స్వీకరించేవారు..అదికూడా తాను సాధన నుంచి లేచిన తరువాతే..శ్రీ స్వామివారు ఆహారం తిన్నా..తినకుండా వున్నా..తల్లి సోదరులు మాత్రం ఆయనకు అవసరమైన బియ్యం, పెసరపప్పు ఇతర వెచ్చాలు మాలకొండకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు..అలా ఎన్నాళ్ళు జరగాలి అని వారు అనుకోలేదు..ఎంతకాలం పాటు శ్రీ స్వామివారు తపస్సు చేసుకుంటున్నా..అంతకాలం పాటు తాము ఈ ఆహారపదార్ధాలు సమకూర్చాలని నిశ్చయం చేసుకున్నారు..
ఇక..క్రమం తప్పకుండా శ్రీ స్వామివారికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకోవాలి?..ఒకరోజుతో తీరిపోయే విషయం కాదు..ఎంతకాలం అని ఎవరూ నిశ్చయంగా తేల్చి చెప్పలేరు..కానీ అక్కడ ఆయన తపోసాధన లో వున్నంతకాలం..తాము ఇక్కడనుండి పంపాలి..ఎలా?..ఆరోజుల్లో బస్సు సౌకర్యం కూడా లేదు..సైకిల్ మీద..తప్పిందా..ఇక కాలి నడకే..ఎర్రబల్లె నుంచి, వెలిగండ్ల గ్రామం మీదుగా మన్నేరు నది దాటి..మొగలిచెర్ల గ్రామం మీదుగా మాలకొండ చేరాలి..
శ్రీరాముడు వనవాసం చేయాలని నిర్ణయం తీసుకోగానే..సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించి ఆయనను అనుగమించింది..ఆ దంపతులు ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి, లక్ష్మణుడు కూడా నారవస్త్రాలు ధరించి వారితో కలిసి వనవాసానికి బైలుదేరాడు..రాముడు వారించినా...అన్నగారి సేవే పరమార్ధం అని చెప్పాడు..ఆవిధంగానే నడచుకున్నాడు.. అదే విధంగా..శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య కూడా..తల్లికి సోదరులకు అభయం ఇచ్చాడు.."అన్నయ్య కు వస్తువులు చేర్చే బాధ్యత నాది.." అప్పుడు పద్మయ్య వయసు కేవలం పదహారు మాత్రమే!..
ప్రతి ఇరవై రోజులకూ ఎర్రబల్లె లో బయలుదేరి మాలకొండ దాకా బియ్యం పప్పులు మోసుకుంటూ..(ఒక్కొక్కసారి సైకిల్ ఉండేది కాదు..కాలి నడకే శరణ్యం) వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారి కోసం ఎదురుచూస్తూ వుండేవాడు..శ్రీ స్వామివారు సాధన పూర్తి చేసుకొని పద్మయ్య ను చూసి నవ్వేవారు..ఆ నవ్వు చూడగానే పద్మయ్యకు తాను అప్పటిదాకా పడిన శ్రమ అంతా ఎగిరిపోయేది..అతి కొద్దిసేపు మాత్రమే శ్రీ స్వామివారు పద్మయ్య తో గడిపేవారు..కానీ పద్మయ్యకు ఆ కొద్దిపాటి దర్శనమే కొండంత సంతోషాన్ని ఇచ్చేది..
ఒకరోజు..పద్మయ్య మాలకొండకు వచ్చి, శ్రీ స్వామివారి రాకకోసం పార్వతీదేవి మఠం వద్ద ఎదురుచూస్తూ వున్నాడు.. ఇంతలో శ్రీధరరావు గారు కూడా అక్కడికి వచ్చారు..ఇరవై ఏళ్లు కూడా లేని ఈ యువకుడెవరా అని శ్రీధరరావు గారు ఆలోచించి..ఆమాటే అడిగేశారు.. తాను ఫలానా అని, ఇలా స్వామివారికి తమ్ముణ్ణి అనీ..స్వామివారికి తమ ఇంటినుంచి వెచ్చాలు తీసుకొచ్చి ఇస్తూవుంటాననీ చెప్పాడు..శ్రీధరరావు గారు కూడా తనను పరిచయం చేసుకున్నారు..ఆనాటి నుండి..పద్మయ్య కు మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారిల్లు ఒక మజిలీగా మారిపోయింది..ప్రభావతి గారు కూడా పద్మయ్య ను తమ బిడ్డల్లో ఒకరిగా ఆదరించారు..
పద్మయ్య ది నిస్వార్థ సేవ..శ్రీ స్వామివారిని అన్నయ్య గా కాదు..సాక్షాత్ దైవస్వరూపంగానే కొలిచాడు.. శ్రీ స్వామివారు సిద్ధిపొంది నేటికి దాదాపుగా 42 ఏళ్ళు అవుతోంది..పద్మయ్యనాయుడి మదిలో నేటికీ అదే దైవభావం..
"నేనే కోరికలు కోరలేదు..కానీ ఈరోజు నేను ఈమాత్రపు స్థితిలో ఉన్నానంటే..ఆయన ఆశీర్వాదమే కారణం "అంటూ ఉంటారు..శ్రీ స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా..పద్మయ్య భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు..శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి..అలాగే మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవానికి కుటుంబసమేతంగా మొగలిచెర్ల ఆశ్రమానికి క్రమం తప్పకుండా వచ్చి, శ్రీ స్వామివారి సమాధి వద్ద కొద్దిసేపు గడిపి వెళ్లడం పద్మయ్య పెట్టుకున్న నియమం..
శ్రీ స్వామివారి సేవలో ఆనాటి నుంచీ ఈ క్షణం వరకూ తరిస్తున్న ధన్యజీవి పద్మయ్య నాయుడు..
శ్రీ స్వామివారి ఆశ్రమ సన్నాహాలు..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
సంతోషం
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
*"మాస్క్"* పెట్టుకుంటున్నారు. *సంతోషం* 👌
బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా
*"భౌతిక_దూరం"* పాటిస్తున్నారు. *సంతోషం*.. 👌
బలవర్ధకమైన " *ఆహారం* " తీసుకుంటున్నారు. *సంతోషం*.. 👌
*"ప్రాణాయామం"* లాటి యోగా క్రియలు చేస్తున్నారు. *సంతోషం*
చాలా *సంతోషం* .....
చాలామంచి పని చేస్తున్నారు.. *సంతోషం*...
🤗కానీ...
మీరు *"తెలుగు_TV_న్యూస్_చానళ్ళు"* కూడా చూస్తే,
మీరు *పైన చెప్పినవెన్ని* చేసినా ప్రయోజనం వుండదు......
చేసినవన్నీ *బూడిద* లో పోసినట్టే.....
ఎందుకంటే, మన *తెలుగు చానళ్ళ* ల్లో వచ్చే *కరోనా* వార్తలు చూడ్డం వలన......
వాళ్ళు చెప్పే మాటల వల్ల...
*"వంటింటి పోపు"* కు మీకు... దగ్గు వచ్చినా.....
మీకు *"కరోనా"* వచ్చిందనే ఓ భయానికి లోనై.......
మానసికంగా బలహీనమై మీరు *"రోగానిరోధక శక్తి"* ని సర్వం కోల్పోయి,
అప్పుడు నిజంగానే 'కరోనా' భారిన పడవచ్చు.....
*కనుక మొట్టమొదటగా తెలుగు TV వార్తా చానళ్లు చూడ్డం ఆపేయండి*.....
*మన తెలుగు TV వార్తా చానళ్ళు గనుక చూస్తే*,
ఎక్కడో నట్టనడి సముద్రంలో ఓ ద్వీపంలో ఒక్కరే పూర్తి ఒంటరిగా పూర్తిగా మానవ సమాజానికి అత్యంత దూరంగా వున్నప్పటికీ,
మీకు *'కరోనా'* సోకవచ్చు.....
*వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి.*....
హెచ్చరిక :
*ప్రస్తుత సమయంలోనే కాదు*,
*ఎప్పుడు... ఎక్కడ తెలుగు TV చానళ్లు చూసిన ప్రమాదమే.*.....
విస్తృత *జనబాహుళ్యం* క్షేమం కోరి ఈ మాటలు చెప్పడమైనది...️✊️
30, ఏప్రిల్ 2021, శుక్రవారం
మన సిద్దాంతాలు
మన సిద్దాంతాలు ...
⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
*విశిష్టాద్వైతం:- దీనిని రామానుజాచార్యులు వారు ప్రవచించినారు. ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టి మొత్తం మూడే విస్తరించాయని ప్రతిపాదించినారు. అవి జీవుడు వేరు, ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని.*
*ద్వైతం:- దీనిని మధ్వాచార్యులు వారు ప్రవచించినారు. వీరి ప్రకారం సృష్టిలో ఉన్నవి రెండే అని అవి జీవుడు మరియు పరమాత్మ అని వీరి సిద్ధాంతం. ప్రకృతి అనునది జీవునిలో అంతార్భాగమేనని వీరి సిద్ధాంతం.*
*అద్వైతం:- దీనిని ఆదిశంకరాచార్యులు వారు ప్రవచించినారు. రెండు లేవు, ఉన్నది ఒకటేనని, ఆ ఒకటి ఆత్మ పదార్థం అని. ఈ సృష్టి మొత్తం నిండి వున్నది ఆత్మ తప్ప మరేమి లేదు అని వీరి సిద్ధాంతం.*
*ఆది, అంతం లేనిదే 'వేదాంతం'.*
ఏ దారిలో వెళ్ళినా చేరుకునే. దేవుడు ఒక్కడే 🙏🏻🌷🙏🏻
⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
_రాబోయే తరాలకు
ఎండమావులు
*****
చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
కొత్త గౌను కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...
ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ.. చేతిలో
రూపాయో... అర్ధ
రూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...
సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...
ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..
పక్కింట్లోవాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియోలో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంటకి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...
కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు,
కబుర్లు, కధలు,
చందమామలు,
బాలమిత్రలు...
సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....
సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...
మూడు గదుల రైలుపెట్టె
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..
రెండు రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..
ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...
తీర్థంలో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?
రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం...
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాల
నగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో
ఫోన్లు...అరచేతిలో
స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు...
అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు నేస్తం...?
ఎందుకు...?ఎందుకు...?
చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...?
ఎండమావి
అయిపోయింది..?
మార్పు ఎందులో...?
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో నేస్తం...?
చెప్పవా తెలిస్తే....!!
👍 _*త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...*_😢😢🙏
_*రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచంనుండి కనుమరుగవబోతూవుంది..!
_అవును ఇది ఒక చేదు నిజం.!!_
_ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు._
_వాళ్ళు.._
_రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!_
_ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!_
_నడక అలవాటు ఉన్నవాళ్ళు.!_
_మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!_
_వాళ్ళు....._
_ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !_
_ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!_
_మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!_
_పూజకు పూలు కోసే వాళ్ళు !_
_వాళ్ళు...._
_పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !_
_మడిగా వంట వండేవాళ్ళు!_
_దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!_
_దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు.!_
_దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!_
_మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!_
_వాళ్ళు_
_అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!_
_కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!_
_స్నేహంగా మెలిగే వాళ్ళు...!_
_తోచిన సాయం చేసేవాళ్ళు..!_
_చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!_
_వాళ్ళు_
_ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!_
_ఉత్తరాలు తీగకు గుచ్చిన వాళ్ళు...!_
_పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!_
_ఫోన్ నెంబర్ లు డైరీలో రాసిపెట్టుకునే వాళ్ళు....!
_వాళ్ళు_
_పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!_
_కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!_
_సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!_
_పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!_
_వాళ్ళు ..._
_తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!_
_ఆచారాలు పాటించే వాళ్ళు..!_
_తిధి, వారం, నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!_
_పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!_
_వాళ్ళు ...._
_చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!_
_లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు...!_
_చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!_
_అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!_
_వాళ్ళు ...._
_తలకు నూనె రాసుకునే వాళ్ళు .!_
_జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!_
_కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు...!_
_చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !_
_ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం....._
_ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు_
_మీకు తెలుసా ?_
_వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు._
_మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు._
_మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి_
_లేదంటే ....._
_లేదంటే ...._
_లేదంటే ...._
_ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది._
_వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో, మానవత్వంతో, స్నేహంతో కూడి ఉండే తరం.._
_సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!_
_స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !_
_కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!_
_ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగినతరం_
_ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!_
_సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది.!_
_లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !_🙏
_ఇరుగుపొరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!_😊
_తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం_
_వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది_ 🤔
_మీ కుటుంబంలో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. ._🙏
_సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..._
_సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశంగా ఈ భారతాన్ని మార్చెయ్యకండి.!!!_
_తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!_🤝
_సర్కారు చేసే చట్టాలు కాదు..._🙏
_రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను, స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు.._🤔
_*అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి* జై భారత్🌹🙏
మెడికల్ కిట్..
* ఇంట్లో ఉండవలసిన కోవిడ్ మెడికల్ కిట్..💼*
_*1. డోలో 650 mg*_
_*2. అజిత్రో మైసిన్ 500mg*_
_*3. _Montek LC*_
_*4. మౌత్ వాష్ మరియు గార్గ్ల్*_
_*కోసం బీటాడిన్*_
_*5. విటమిన్ సి మరియు డి3*_
_*6. బి కాంప్లెక్స్ Beplex forte*_
_*7. Zincovit tablets*_
_*8. ఆవిరి కోసం ఆవిరి యంత్రం + Karvol plus గుళికలు*_
_*9. పల్స్ ఆక్సిమీటర్*_
_*10. థర్మ మీటర్*_
-_*ఆక్సిజన్ సిలిండర్ (అత్యవసర*_
_*పరిస్థితికి మాత్రమే)*_
- _* ఆరోగ సేతు అనువర్తనం*_
- _* శ్వాస వ్యాయామ పరికరాలు *_
*☘️ కోవిడ్ మూడు దశలు :*
_*1. ముక్కులో మాత్రమే కోవిడ్ -*_
_*రికవరీ సమయం సగం రోజు.*_
_*(ఆవిరి పీల్చడం), విటమిన్ సి*_
_*సాధారణంగా జ్వరం ఉండదు.*_
_*కన్పించడం.*_
_*2. గొంతులో కోవిడ్ - గొంతు నొప్పి,*_
_*కోలుకునే సమయం 1 రోజు*_
_*(వేడి నీటి గార్గ్లే, త్రాగడానికి*_
_*వెచ్చని నీరు, టెంప్ ఉంటే*_
_*పారాసెటమాల్. విటమిన్ సి,*_
_*బికాంప్లెక్స్. యాంటీబయాటిక్*_
_*కన్నా తీవ్రంగా ఉంటే.*_
_*3. ఊపిరితిత్తులలో కోవిడ్-*_
_*దగ్గు మరియు ఊపిరి 4 నుండి*_
_*5 రోజులు. (విటమిన్ సి,*_
_*బి కాంప్లెక్స్, వేడి నీటి గార్గ్లే,*_
_*ఆక్సిమీటర్, పారాసెటమాల్,*_
_*తీవ్రంగా ఉంటే సిలిండర్,*_
_*ద్రవం చాలా అవసరం, లోతైన*_
_*శ్వాస వ్యాయామం.*_
*🌸 ఆసుపత్రికి చేరుకోవలసిన దశ :*
_*ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షించండి. ఇది 94 (సాధారణ 98-100) దగ్గరకు వెళితే మీకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉండకపోవచ్చు .*_
_*ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!*_
_దయచేసి భారతదేశంలోని మీ పరిచయాలకు ఫార్వార్డ్ చేయండి... ఇది ఎవరికి సహాయపడుతుందో మీకు తెలియదు._
_టాటా గ్రూప్ మంచి చొరవను ప్రారంభించింది, వారు చాటింగ్, టెలి మెడిసిన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత వైద్యుల సంప్రదింపులను అందిస్తున్నారు. ఈ సదుపాయం మీ కోసం ప్రారంభించబడింది, తద్వారా మీరు వైద్యుల కోసం బయటకు వెళ్లవలసిన అవసరం లేదు మరియు మీరు ఇంట్లో సురక్షితంగా ఉంటారు._
_క్రింద ఉన్న లింక్, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను._
https://www.tatahealth.com/online-doctor-consultation/general-physician.
[02/07, 15:20]
+91 74069 28123:
_*ఐసోలేషన్ ఆసుపత్రుల నుండి సలహా, మేము ఇంట్లో చేయవచ్చు.*_
_*ఐసోలేషన్ ఆసుపత్రులలో తీసుకునే మందులు..*_
_*1. విటమిన్ సి -1000*_
_*2. విటమిన్ ఇ (ఇ)*_
_*3. (10 నుండి 11) గంటల వరకు,*_
_*సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు*_
_*కూర్చుని.*_
_*4. గుడ్డు భోజనం ఒకసారి ..*_
_*5. మేము కనీసం 7-8 గంటలు*_
_*విశ్రాంతి తీసుకుంటాము /*_
_*నిద్రపోతాము*_
_*6. మేము రోజూ 1.5 లీటర్ల*_
_*నీరు తాగుతాము*_
_*7. అన్ని భోజనాలు వెచ్చగా*_
_*ఉండాలి (చల్లగా కాదు).*_
_*రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మేము ఆసుపత్రిలో చేస్తున్నది అంతే..!*_
_*కరోనావైరస్ యొక్క pH 5.5 నుండి 8.5 వరకు మారుతుందని గమనించండి.*_
_*అందువల్ల, వైరస్ను తొలగించడానికి మనం చేయాల్సిందల్లా వైరస్ యొక్క ఆమ్లత స్థాయి కంటే ఎక్కువ ఆల్కలీన్ ఆహారాలను తీసుకోవడం.*_
_*● ఆకుపచ్చ నిమ్మకాయ - 9.9 పిహెచ్*_
_*● పసుపు నిమ్మకాయ - 8.2 పిహెచ్*_
_*● అవోకాడో - 15.6 పిహెచ్*_
_*● వెల్లుల్లి - 13.2 పిహెచ్*_
_*● మామిడి - 8.7 పిహెచ్*_
_*● టాన్జేరిన్ - 8.5 పిహెచ్*_
_*● పైనాపిల్ - 12.7 పిహెచ్*_
_*● వాటర్‌క్రెస్ - 22.7 పిహెచ్*_
_*● నారింజ - 9.2 పిహెచ్*_
_*మీరు కరోనా వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి?*_
_*1. గొంతు దురద*_
_*2. పొడి గొంతు*_
_*3. పొడి దగ్గు*_
_*4. అధిక ఉష్ణోగ్రత*_
_*5. శ్వాస ఆడకపోవడం*_
_*6. వాసన కోల్పోవడం ....*_
_*మరియు వెచ్చని నీటితో నిమ్మకాయ ఊపిరితిత్తులకు చేరే ముందు ప్రారంభంలో వైరస్ను తొలగిస్తుంది ...*_
_*👆ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవద్దు. మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ అందించండి..🙏*_
అద్వైతం
*🏵కాకి నేర్పే అద్వైతం🏵*
ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు.
స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.
క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!
విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.
అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది.
అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?
అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణంకలిగినది.
మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.
ఇది ఎంతమంది పాటిస్తున్నారు?
కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు.
మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.
కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.
నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు......🙏
29, ఏప్రిల్ 2021, గురువారం
శానిటైజర్స్
🙏🕉💐🌼🏵❌✅🙏
*శానిటైజర్స్ లభించటం లేదా? సమస్యే లేదు*
🙏🕉💐🌼🏵❌✅🙏
డెట్టాల్, డెట్టాలు సోప్ లు దొరకడం లేదా? చింత వద్దు. సబినా సోప్/ లైఫ్ బాయ్ సోప్ ఉపయోగించండి.
శానటైజర్స్ దొరకడం లేదా చింత వద్దు. మీరే తయారు చేసుకోండి.
మార్కెట్లో దొరికే శానిటైజర్ చాలా ఖరీదుగా ఉంటోంది. అందులోనూ శానిటైజర్ల కోసం జనం ఎగబడటంతో స్టాకు కూడా ఉండటం లేదు. అయితే.. ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే సులువుగా అతి తక్కువ ఖర్చుతో శానిటైజర్ తయారు చేసుకునే విధానం కోసం సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఫార్ములా ప్రకారం రూ.20తోనే 200 మి.లీ.శానిటైజర్ తయారు చేసుకోవచ్చు. శానిటైజర్ తయారీకి వినియోగించే ద్రావణాలు ల్యాడ్ కెమికల్స్ అమ్మే దుకాణాల్లో లభిస్తాయి. బజార్‌లో ప్లాస్టిక్ స్ప్రే బాటిళ్లు దొరుకుతాయి.
ఇప్పడు శానిటైజర్ ఎలా చేసుకోవాలో చూద్దాం..
200 మిల్లీ లీటర్ల శానిటైజర్ తయారీకి అవసరమైనవి
ఐసోప్రొపైల్ ఆ్కహాల్ –100 మి.లీ.
హైడ్రోజన్ పెరాక్సైడ్ – టేబుల్ స్పూన్
స్వచ్ఛమైన నీరు –90 మి.లీ.
గ్లిజరిన్/గ్లిజరాల్ – టేబుల్ స్పూన్
ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్ ఆ్కహాల్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ చొప్పున గ్లిజరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపితే, శానిటైజర్ తయారు. ఇంట్లో వాడేసిన ఖాళీ స్ప్రే బాటిల్ లేదా ప్లాస్టిక్ బాటిల్‌లో పోసి, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగడానికి శానిటైజర్‌గా వాడుకోవచ్చు.
2. లేదా వేపాకు ను తెచ్చుకొని, కొద్దిగా పసుపు పొడి కలిపి, కచ్చా పచ్చగా నలుగకొట్టి నీళ్లలో వేసి మరిగించి, వడకొట్టుకొని ఆ నీటిని వాడుకొనండి. కొంతలో కొంత మేలు జరుగుతుంది.
***************************
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
యం.జి.మొదలియార్
*మనో దైర్యం
*చావు వార్తలు ఆపండి*
*మనో దైర్యం నింపండి*
ఒక రైతు పొలం పని చేసుకొని చీకటి పడ్డంక ఇంటికి వెళ్తున్నాడు. దారిలో కాళ్ల మీద ఎదో పడ్డట్లు అనిపించింది. మసక చీకట్ల తెల్ల తెల్లగ కన్పించిన దాన్ని చూసి.. పాము అనుకొని చేతికర్రతో నాలుగైదు దెబ్బలేసి పాము సచ్చింది అనుకున్నాడు. ఇంటికి పోయి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. పాము కరవలేదు కానీ దానిని చంపిన అని వివరించాడు. కుటుంబ సభ్యులు దైర్యం చెప్పి పడుకోమంటే ఆ రైతు భయం భయంగనే ఆ రాత్రి నిద్రపోయాడు. ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడు.
కుటుంబ సబ్యులు ఏడ్చి ఏడ్చి.. పాము కరిచిందేమో చూద్దామని రాత్రి రైతు నడిచిన దారిలో వెతికారు. చచ్చిన పాము కనపపడలేదు. కానీ చనిపోయిన రైతు నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు వాళ్లకు దొరికింది. తన వెండి నడుము గొలుసు జారి తన కాళ్లమీద పడ్డట్టుంది. ఆ రైతు పాము అనుకొని భయంతో ఆలోచించి ఆలోచించి నిద్రలోనే చనిపోయాడు. భయం ఎంత చెడ్డదో ఈ కథ స్పష్టంగా చెప్పింది.
ఇప్పుడు సేమ్ ఇదే పరిస్థితి కరోనా విషయంలోనూ జరుగుతుంది. ఈ మధ్య గాలి ద్వార కరోన వ్యాప్తి చెందుతుందని ప్రచారం చేస్తున్నరు అది నిజమో.. అబద్దమో.. తెలువదు. కానీ కరోనా గాలి ద్వారా వ్యాపిస్తే ఈ భూమి మీద మనుషులు అంతం అయినట్టే.
99% రికవరీ రేటును వదిలి కరోనాను భూతద్దంలో చూపెడితే ఎట్ల?? కరోనా చావులల్ల 90% భయం, ఇతర శరీర రుగ్మతల వల్లనే అన్నది 100% వాస్తవం.
*అన్ని తెలిసినోడు అమావాస్య నాడు చనిపోతే.. ఏమీ తెల్వనోడూ ఏకాశినాడు సచ్చిండంట*
కరోనా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసూకుంటూ తనకు తెలవకుండ భయానికి గురైతున్నరు చాలా మంది. కరోనా గురించి పెద్దగా అవగాహన లేనోళ్లు.. కరోనా వార్తలు అసలే పట్టించుకోనోళ్లు.. హాయిగా పని చేసుకొని ఏదైతే అదే అయితది అని మొండిగ ఉన్నోళ్లకు ఏమైతలేదు. తలలో భయాన్ని నింపితే అది గెలుకుతనే ఉంటది.
దయచేసి కరోనా (చావు) వార్తలు పోస్ట్ చేయకండి. మనో ధైర్యాన్ని ఇచ్చే విషయాలను పోస్ట్ చేయండి.
🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
నరేంద్ర మోడీగార మీడియాకి ఎందుకు నచ్చరో
నరేంద్ర మోడీగారు మన మీడియాకి ఎందుకు నచ్చరో ఈ క్రింది ఆర్టికల్ చదివితే మీకే అర్థం అవుతుంది
ఇది రెండేళ్ల క్రితం రాసిన పోస్ట్...
భారత మీడియా హౌస్ లకి స్వర్ణ యుగం :2004-2014 UPA 1 & UPA 2. మౌన ముని [మన్మోహన్] ప్రధానిగా ఉన్న 10 సంవత్సరాలు అటు లెఫ్ట్ మీడియా ఇటు ఖాంగ్రెస్ బూట్లు నాకే మీడియా కి స్వర్ణ యుగం.
మౌనముని విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంట ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు, IFS,IRS,IAS అధికారులు వెంట వెళ్ళేవారు ఇది సహజం,అవసరం కూడా. కానీ ప్రధాని పర్యటన కవరేజీ కోసం తన వెంట మీడియా ప్రతినిధులని తీసుకెళ్ళేవారు. ఒకరో ఇద్దరో కాదు తంబలు తంబలుగా వెళ్ళేవారు. ఎయిర్ ఇండియా ఒన్ విమానంలో 36 'బిజినెస్' క్లాస్ టికెట్స్ వీళ్ళకోసం కేటాయించేవారు. విమానం ఎక్కినప్పటి నుండి వీళ్ళకి రాచ మర్యాదలు జరిగేవి. ఖరీదయిన విదేశీ మద్యం సరఫరా చేసేవారు ఇన్ ఫ్లయిట్ లో. వీళ్లలో కొందరు తమకి ప్రత్యేక బ్రాండ్ కావాలని పట్టుబట్టి మరీ సెర్వ్ చేయించుకునే వారు. ఆహారం అంతా కాంటినెంటల్ స్టైల్ అడిగి మరీ వడ్డించుకునేవారు. ఇక ప్రధాని వెళ్ళిన దేశంలో వీళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేసేవారు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు. ప్రధాని సమావేశం చాలా క్లుప్తంగా జరిగిపోయేది. ఒకరో ఇద్దరినో ఆ సమావేశం కోసం వదిలి మిగతావాళ్ళు ఆ దేశంలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ని చూడడానికి వెళ్ళేవాళ్లు అఫ్కోర్స్ ప్రయాణం కోసం కార్లు అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఉచితంగా ఏర్పాటు చేసేవారు. ఇక సాయంకాలాలు ఆయా దేశాల్లో షాపింగ్ చేసిన తరువాత ఆ దేశ ప్రధానో,అధ్యక్షుడో మన ప్రధానికోసం విందు ఏర్పాటు తప్పనిసరి ప్రోటోకాల్. సదరు జర్నలిస్టులు విందుకు హాజరయ్యేవారు. తాగినంత,తిన్నంత ...వస్తూ వస్త్తో అక్కడ అతిధులకోసం ఉంచిన మద్యం బాటిళ్ళు తమతో పాటు హోటల్ కి పట్టుకెళ్ళేవాళ్లు. ఇక ప్రధానితో పాటు వచ్చిన అతిధులు కాబట్టి ఆతిధ్యమ్ ఇచ్చే దేశం ఉచిత కానుకలు అందరితో పాటు వీళ్ళకి కూడా. తిరిగి మన దేశంలోకి వచ్చినప్పుడు దౌత్యవేత్తలకి మాత్రమే ఉండే 'గ్రీన్ చానెల్ ' ద్వారా విమానాశ్రయం నుండి బయటికి వచ్చేవాళ్లు ...అంటే కస్టమ్స్ చెకింగ్,పన్నులు కట్టడాలు ఏమీ ఉండవు. తమతో పాటు తెచ్చుకున్న ఖరీదయిన ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ కి టాక్స్ ఫ్రీ ఎగ్జిట్ అన్నమాట. టాక్స్ పేయర్స్ సొమ్ము వీళ్ళ పాలు.
ప్రధానితో పాటు విమానంలో ప్రయాణిచ్చేటపుడు ప్రధాని కార్యాలయ [PMO ] ముఖ్య అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం వాటిని ఉపయోగించుకొని పైరవీలు చేసి డబ్బు సంపాదించడం జరిగింది. అడిగిందే తడవుగా మౌనముని వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాబట్టి అధికారులు వీళ్ళు అడిగిన పని చేసిపెట్టేవారు.ఇక ప్రధాని ఇచ్చే విందు సమావేశాలలో వీళ్ళకి 'బ్లాక్ లేబుల్ ' తప్పని సరిగా ఉండాలి. సమావేశం ముగియగానే తలా ఓ రెండు మూడు బ్లాక్ లేబుల్ బాటిళ్ళు తమతో తీసుకెళ్ళేవారు. ఒక దశలో వీళ్ళని ప్రధాని కార్యాలయ సిబ్బంది బ్లాక్ లేబుల్ బాచ్ వస్తుంది ఈ రోజు కాబట్టి మామూలుగా కంటే ఎక్కువ కౌంటర్ల మీద పెట్టాలి అని విసుక్కునెంతగా ఉండేది వీళ్ళ ప్రవర్తన.
వీళ్ళు చేసిన సేవలకి గాను పద్మశ్రీ,,పద్మ విభూషణ్ లు కానుకగా ఇచ్చింది UPA ప్రభుత్వం. రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్,శేఖర్ గుప్తా [పద్మ విభూషణ్ ],వినోద్ దువా , జావేద్ ఆనంద్ [ఈ పేరేంటో వింతగా లేదు ?తీస్తా సెతేల్వాద్ భర్త ],ప్రఫుల్ బిద్వాయి ,పుణ్య ప్రసూన్ బాజ్పెయీ ,విక్రమ్ చంద్రా [ఓనర్ NDTV ],ప్రాంజోయ్ గుహ తాకుర్త, రవీశ్ కుమార్ [NDTV ],అరుణ్ పూరీ , నిధి రజ్దాన్ [NDTV], కిరణ్ ధాపర్ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఏం పొడిచారని ? ఖాంగ్రెస్ కుంభకోణాలని వెనకేసుకువచ్చారనా ?
డిసెంబర్ 2013 లో NDTV 25th వార్షికోత్సవం రాష్ట్రపతి భవన్ లో జరిగింది తెలుసా ? రాష్ట్రపతి భవన్ ఏమన్నా ఫంక్షన్ హాలా ? ఎవరి రికమెండేషన్ తో అనుమతి ఇచ్చారు ? ఇలాంటి అనుమతులే The Hindu,Times of India కి ఇచ్చారు. అసలు ఈ విషయం ఎవరి దృష్టికీ రాకపోయి ఉండవచ్చు.
రాజ్దీప్ సర్దేశాయ్ బంగ్లా ఢిల్లీ ల్యూటెన్స్ లో ఉంది. ఇతర జర్నలిస్టుల బంగ్లాలు కూడా అదే VVIP ప్రాంతంలో ఉన్నాయి. నీతి,నిజాయితీ అంటూ మడి కట్టుక్కూర్చున్న జర్నలిస్టులకి అక్కడ బంగ్లా ఉంటుందా ? NDTV మనీ లాండరింగ్ కేసులో కూరుకుపోయి ఉంది. బర్ఖా దత్, వీర్ సంఘ్వి ,రోహిణీ సింగ్ [The Wire], రాడియా టేపుల కుంభకోణంలో ఉన్నారు.
The Tribune : UPA2 కి వచ్చేసరికి ఒక జోక్ ప్రచారంలో ఉండేది అదేమిటంటే మౌనముని తన పార్టీలో ఏమి జరుగుతున్నది,అసలు తన ప్రభుత్వం గురుంచి తెలుసుకోవడానికి ట్రిబ్యూన్ పత్రిక చదివేవాడు. ఈ ట్రిబ్యూన్ పత్రిక పంజాబ్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్, J&K రాష్ట్రాలలో ఫేమస్ కానీ పూర్తిగా ఖాంగ్రెస్ అనుకూల వార్తలు మాత్రమే ప్రచురిస్తుంది. అంటే తన ప్రభుత్వం గురుంచి తెలుసుకోవడానికి యే పత్రిక చదవాలో తెలియని పరిస్థితిలో ఉండేవాడు మౌనముని. ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే 2010 లో ఒక సమావేశంలో మాట్లాడుతూ కపిల్ సిబాల్ దాదాపు 150 ప్రింట్,ఎలెక్ట్రానిక్,వెబ్ మీడియా హౌసెస్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఖాంగ్రెస్ కి చెందినవి ఉన్నాయి అంటూ నోరు జారాడు. తన పార్టీ గొప్పదనం గురుంచి చెప్పాలనుకొని అసలు విషయం బయటపెట్టుకొని సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. 150 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ కపిల్ సిబాల్ కి తెలియకపోవచ్చు. అసందర్భంగా కాంగ్రెస్ ని తిడుతూ సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ని వెనకేసుకొచ్చే మీడియా కేంద్రాలు చాలానే ఉన్నాయి కాకపోతే మనం నిశితంగా పరిశీలిచలేకపోవడమే మనకి తెలియకపోవడానికి కారణం.
కొన్ని నిజాలు : 1.శోభన భర్తీయా ,కాంగ్రెస్ MP, చైర్ పర్సన్ ,హిందుస్తాన్ టైమ్స్ . 2.సోనియా సింగ్ , కాంగ్రెస్ MP -MPRPN సింగ్ భార్య ,ఎడిటోరియల్ డైరెక్టర్, NDTV. 3. రాజీవ్ శుక్లా , న్యూస్ 24 చానెల్ యజమాని , కాంగ్రెస్ MP. 4. నవీన్ జిందాల్ కాంగ్రెస్ MP మామకి 17% స్టేక్ NDTV లో ఉంది. 5. బర్ఖా దత్ ,గ్రూప్ డైరెక్టర్,NDTV, రాడియా టేపుల కేసులో నిండుతురాలు,కాంగ్రెస్ స్టూజ్ . 6. వీర్ సంఘ్వి ,అడ్వైసర్ , హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్,రాడియా టేపుల కేసులో మరో నిందితుడు. ఈ లిస్ట్ చాలా పెద్దది వ్రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకం అవుతుంది.
2014: శ్రీ నరేంద్ర మోడీ నాయక్త్వంలో BJP అధికారంలోకి వచ్చింది. PMO లో పని చేసే వారు ఎవరయినా 10.30 కల్లా వాళ్ళ సీట్లలో ఉండాలి. బయో మెట్రిక్ ని స్ట్రిక్ట్ చేశారు. ప్రధాన మంత్రి సమావేశం ఉంటే I&PR ద్వారా తెలియచేస్తారు. సమావేశానికి ముందు టీ ,బిస్కిట్స్ మాత్రమే ఏర్పాటు చేస్తారు. ప్రధాని సమావేశం అయిపోగానే ఎక్కువసేపు అక్కడ ఎవరూ ఉండడానికి వీలులేదు. రాజ్దీప్ సర్దేశాయ్,బర్ఖా దత్, రవీశ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రధానికి దూరంగా ఉండి వివరాలు నోట్ చేసుకోవాలి. మౌన ముని లాగా పక్కన కూర్చోపెట్టుకొని బాతాఖానీ ఉండదు.
ఇక మోడీ విదేశీ పర్యటనకి తనతో పాటు దూర్ దర్శన్ కి సంబంధించిన 6 గురు సిబ్బందిని తీసుకెళతారు. రోజుకి 18 గంటలు పనిచేసే ప్రధాని వీలున్నంత వరకు ఎయిర్ ఇండియా ఒన్ ఫ్లయిట్ లోనే నిద్రపోతారు మరీ అత్యవసరం అయితేనే వెళ్ళిన దేశంలో హోటల్ లో బస చేస్తారు. ప్రోటోకాల్ ప్రకారం విందు ఉన్నా కేవలం పళ్ల రసంతోనే సరిపెట్టేస్తారు. తిరిగి భారత్ కి రాగానే ఎయిర్ పోర్ట్ లోనే పత్రికా సమావేశం పెట్టి విలేఖరులకి తన పర్యటన విశేషాలు చెపుతారు. ఇంకా ఇన్ఫోర్మేషన్ కావాలంటే దూర్ దర్శన్ నుండి తీసుకోవచ్చు. మద్యం,మాంసం ఉండవు. కాంప్లిమెంటరీ బ్లాక్ లేబుల్ బాటిల్స్ లేవు. మౌన ముని హయాం లో PMO లో అన్నీ విభాగాల్లో స్వేచ్చగా తిరిగి అన్నీ విషయాలు తెలుసుకునే వాళ్ళు ,కీలక రక్షణ రంగ కాంట్రాక్టుల విషయంలో తల దూర్చేవాళ్లు , చివరికి అగాస్టా హెలికాప్టర్ కుంభకోణంలో కొందరి జర్నలిస్టుల పేర్లు బయటపడ్డాయి అంటే వీళ్ళు ఎంతలా ప్రభుత్వ విషయాల్లో చొచ్చుకుపోయారో ఊహించుకోండి.కీలకమయిన రక్షణరంగ కాంట్రాక్టుల విషయంలో విదేశీ సంస్తలతో మాట్లాడి కాంట్రాక్ట్ ఇప్పించే హామీలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. ఇప్పుడు ఆ అవకాశం కాదు కదా PMO ఛాయలకి వెళ్లడానికి అవకాశం లేదు.
అన్నీ మేజర్ మీడియా హౌస్ లకి NGO ల ద్వారా విరాళాల రూపంలో డబ్బు అందేదీ. మోడీ NGO లని లెక్కలు అడిగాడు. చెప్పము లేదా చెప్పలేము అన్న అన్నీ NGO లని మూసేశాడు. స్వదేశంలో ఆదాయం రాక,విదేశాలనుండి విరాళాలు ఆగిపోవడం చేత తమ జేబుల్లోనుండి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం మోడీ వ్యతిరేకతకి ప్రధాన కారణం. మన్ కీ బాత్ పేరుతో మోడీ తానే నేరుగా ప్రజలతో మాట్లాడడం,అత్యవసర సమయాల్లో తానే టివి ముందుకు వచ్చి నేరుగా ప్రజలకి సందేశం ఇవ్వడం తో ఈ మీడియా హౌస్ ల ప్రాధాన్యం తగ్గడం మరో కారణం. మోడీ వీళ్ళని బై పాస్ చేసేశాడు. దూర్ దర్శన్ ని ప్రజలు మళ్ళీ చూడడం ప్రారంభించారు. ఫైవ్ స్టార్ హోటళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసి బిల్ కట్టకుండా వచ్చే అవకాశం ఇప్పుడు లేదు , వీళ్ళని ఎవరూ లెక్క చేయడం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి ఇదివరకటిలాగా డబ్బు రావట్లేదు అనేకన్నా వీళ్ళని బేఖాతర్ చేస్తున్నారు. క్వింట్ జర్నలిస్ట్ సుప్రీతో మోడీ చనిపోతే బాగుండు అని వాగాడు, మోడీ ఏమన్నా చర్య తీసుకున్నడా ? ఒక ప్రధానిని అలా అనడం పత్రికా స్వేచ్చ అన్నమాట . టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ లతీఫ్ అనేవాడు మోడీకి కరోనా వైరస్ రావాలి అని బహిరంగంగా వాగాడు కానీ ఎడిటర్స్ గిల్డ్ ఎలాంటి చర్యా తీసుకోలేదు. స్థలాభావం వల్ల చాలా విషయాలు వ్రాయకుండా వదిలేస్తున్నాను.
ఇప్పుడు చెప్పండి ! పాల్ఘార్ లో నాగా అఖాడా సాధువులని చంపితే వీళ్ళు స్పందిస్తారు అని ఎలా అనుకుంటాం ? మోడీ మీది ద్వేషం వీళ్ళు కలిసికట్టుగా ఉండడానికి కారణం. పైగా గత నెలరోజులుగా కరోనా వల్ల వచ్చిన నష్టం వల్ల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్నీ మీడియా హౌసులు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని స్థితి. ఉద్యోగులని తీసివేయడం,జీతాలు లేకుండా సెలవుల మీద ఉండండి అని అడిగే స్థితి. చైనా కి జలుబు చేస్తే వీళ్ళకి తుమ్ములు వస్తాయి. పాకిస్తాన్ కి కడుపు నెప్పి వస్తే వీళ్ళకి వీరేఛానలు అవుతాయి. పాపం పండింది. వీళ్ళ మీడియా కంటే వేగంగా ఫేస్బుక్ లో వార్తలు,వీడియోలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు అందరూ కలిసి ఆర్నాబ్ గో స్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మరో పోస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను.
జై హింద్ !
పార్ధసారధి పోట్లూరి గారి వాల్ నుండి సేకరణ