12, మార్చి 2026, గురువారం

అల్లసాని పెద్దన :

  అల్లసాని పెద్దన :


సాహితి సమరాంగణ చక్రవర్తి కృష్ణరాయని ఆస్థానకవియు, ఆంతరంగికుడునై మసలినవాడు. ఈతడు అష్టదిగ్గజములలో నొకడని ప్రతీతి. కృష్ణరాయని కంకితమిచ్చిన మనుచరిత్రము ఒక రసవత్తర ప్రబంధము. భువనవిజయము నందీతనికి జరిగిన మర్యాదలు, మన్ననలు ఏ కవియును నోచుకొనలేదు.


“భువనవిజయ” మందొకనాడు కృష్ణరాయడు బంగారు పళ్లెరమున గండపెండెరము ఒకటి తెప్పించి సంస్కృతాంధ్రములందు సమముగా కవిత్వము చెప్పగలవారందు కొమ్మనినాడు. సభ్యులందరు మిన్నకుండిరట. దీనికి కృష్ణరాయ లాశ్చర్యము చెంది


*ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగా* 

*నొద్దిక “నాకొసంగు'మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?*


యని సగము పద్యము చెప్పగా పెద్దనలేచి,


*పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే?* 

*పెద్దన కీదలంచినను, బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!*


యని మిగిలిన సగమును జవాబుగా పూరించినాడు. కృష్ణరాయడు పెద్దనకీయ తలంపు మనసు నందుంచుకొనినాడో యేమో ప్రాసస్థానమున పెద్దన వచ్చునట్లే ముద్దుగాయని ద్విత్వ "ద" కారముతో ప్రారంభించినాడు. 

〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 11 మార్చి 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                 1️⃣6️⃣1️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *161 వ రోజు*                    

*వన పర్వము సప్తమాశ్వాసము*


*యక్షుడు ధర్మరాజును పరీక్షించుట*```


ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. 

“ధర్మరాజా! నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తి పరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చెదను కోరుకొనుము” అన్నాడు. 


ధర్మరాజు “మహాత్మా! నా తమ్ముడు నకులునకు ప్రాణములు తిరిగి ఇమ్ము” అన్నాడు. 


యక్షుడు “అదేమిటి భీమార్జునులను వదిలి నకులుని కోరుకున్నావు” అని అడిగాడు. 


ధర్మరాజు “అయ్యా! నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. మా తండ్రి రెండవ భార్య మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతనిని కోరుట ధర్మం కదా?” అన్నాడు. 


యక్షుడు “ధర్మరాజా నీ ధర్మ నిరతికి మెచ్చాను. నీ తమ్ములు అందరూ పునరుజ్జీవితులు కాగలరు” అని వరం ఇచ్చాడు. 


వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు. 


ధర్మరాజు “మహాత్మా! నీవు మామూలు యక్షుడవు కావు. నీ వెవరో ఎరిగింపుము” అని ప్రార్థించాడు.```


*యక్షుని నిజ రూపం*```


యక్షుడు “ధర్మరాజా! నేను యమధర్మరాజును. నిన్ను చూడవలెనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, సౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పైగుణములను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో!” అన్నాడు యమధర్మరాజు. 


ధర్మరాజు “యమధర్మరాజా! నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణిని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపుము” అని అడిగాడు. 


యమధర్మరాజు “ధర్మరాజా! నేనే ఆ లేడిని, నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకు వచ్చాను, ఇదిగో అరణి తీసుకో” అని అరణిని తిరిగి ఇచ్చాడు. 


యమధర్మరాజు “పాండవులారా! మీకు పన్నెండేళ్ళు అరణ్యవాసం పూర్తి అయింది. ఇక ఒక సంవత్సరం అజ్ఞాత వాసం మిగిలి ఉంది. అజ్ఞాత వాస సమయంలో మీకు ఏరూపాలు కోరితే ఆరూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరూ గుర్తింపకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో!” అన్నాడు. 


ధర్మరాజు “దేవతలలో ఆది దేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావలసినది ఏముంది. నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మమార్గాన చరించేలా, క్రోధము, మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు!” అన్నాడు. 


యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. 


ధర్మరాజు అరణిని బ్రాహ్మణునికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందారు. 

ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసారు.```


*వన పర్వము సమాప్తం*

*వన పర్వము సప్తమాశ్వాసము సమాప్తం*


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

12మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷గురువారం🌷*

 *🌹12మార్చి2026🌹*    

  *దృగ్గణిత పంచాంగం*  

                    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : నవమి* ‌పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం  : మూల* రా 12.43 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : సిద్ధి* ఉ 09.59 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* సా 05.27 *గరజి పూర్తి రాత్రి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*               

అమృత కాలం : *సా 05.36 - 07.23*

అభిజిత్ కాలం  : *ప 11.53 - 12.41*

*వర్జ్యం    : ఉ 06.54 - 08.41 & రా 10.56 - 12.43*

*దుర్ముహూర్తం  : ఉ 10.17 - 11.05 మ 03.05 - 03.53*

*రాహు కాలం   :మ01.47- 03.17*

గుళికకాళం      : *ఉ 09.17 - 10.47*

యమగండం    : *ఉ 06.18 - 07.48*

సూర్యరాశి : *కుంభం*         

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.27*  

సూర్యాస్తమయం :*సా 06.25*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.18- 08.42*

సంగవ కాలం      :*08.42 - 11.06*

మధ్యాహ్న కాలం   :*11.05 - 01.29*

అపరాహ్న కాలం   :*మ 01.29- 03.53*

*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ బహుళ నవమి*

సాయంకాలం       :*సా03.53- 06.17*

ప్రదోష కాలం        :*సా 06.17- 08.41*

రాత్రి కాలం          :*రా 08.41- 11.53*

నిశీధి కాలం         :*రా 11.53 - 12.41*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.41 - 05.29*

<><><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*


*క్షరాక్షరస్వరూపాయ* 

*పరాత్పరతరాయ చ*

*దత్తముక్తిపరస్తోత్ర*

*దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 11 మార్చి 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*                   

                 *22వ భాగం*


*స్వాయంభువ మనువు తన పుత్రికలు ఆకూతి దేవహూతి ప్రసూతిలను రుచి మహర్షి, కర్దమ మహర్షి, దక్ష ప్రజాపతిలకు ఇచ్చి వివాహం చేయుట*```


చతుర్ముఖ బ్రహ్మ ఆదేశానుసారం స్వాయంభువ మనువు భూమండలానికి రాజై పరిపాలన చేయసాగాడు. కాలక్రమంలో స్వాయంభువ మనువుకి, శతరూపకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మించారు.


శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసిన కర్దముని కరుణించి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.  


కర్దముడు అనేక విధాల స్తుతించి నమస్కరించి “శ్రీహరీ! నా తండ్రి బ్రహ్మదేవుడు నన్ను జగత్ సృష్టికి సహకరించమని ఆదేశించాడు. ఇందుకోసం నాకు తగిన ఉత్తమురాలైన భార్యను, సత్సంతానాన్ని అనుగ్రహించండి”అని వరం కోరాడు.


శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై “కర్దమా! నీ కోరిక తీరుతుంది. మనువంశ మూలపురుషుడు స్వాయంభువ మనువు నిన్ను అన్వేషిస్తూ వచ్చి తన కుమార్తె దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాడు. నీకు, ఆమెకు తొమ్మిది మంది పుత్రికలు జన్మించి బ్రహ్మ మానస పుత్రులైన తొమ్మిది మంది ప్రజాపతులకు భార్యలు అవుతారు. వీరి వలన ప్రజా సృష్టి జరుగుతుంది. తరువాత నేనే మీకు పుత్రుడై జన్మించి తరింప చేస్తాను” అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు.


కొంతకాలం తరువాత శ్రీమహావిష్ణువు స్వాయంభువ మనువుకి కలలో కనపడి “బ్రహ్మావర్త అధిపతీ! స్వాయంభువ మను చక్రవర్తీ! నీ పుత్రిక, నా భక్తురాలు దేవహూతికి కర్దమ ముని తగిన వరుడు. కర్దముడు బిందు సరోవర తీరంలో ఆశ్రమం ఏర్పరచుకుని నివసిస్తున్నాడు. నీవే భార్యాపుత్రికలతో వెళ్లి నీ కుమార్తెను కన్యాదానం చేసి వివాహం చేయుము. నేను త్వరలో వారికి కుమారుడనై జన్మించి మీ రెండు వంశాలను తరింప చేస్తాను" అని ఆశీర్వదించాడు.


తెల్లవారిన వెంటనే స్వాయంభువ మనువు భార్యా పుత్రికలతో కలిసి కర్దమ ముని ఆశ్రమానికి వెళ్లాడు. కర్దముడు స్వాగతం పలికి అతిథి సత్కరాలు చేశాడు. స్వాయంభువ మనువు కర్దమ మునికి నమస్కరించి "మునీంద్రా! శ్రీమన్నారాయణుడు నా కుమార్తె దేవహూతిని మీకు కన్యాదానం చేసి వివాహం చేయమని ఆదేశించాడు.


ఈమె నా కుమార్తె దేవహూతి. సౌందర్యంతో పాటు సకల సద్గుణ సంపన్నురాలు. భూదేవి అంత వినయ విధేయతులు కలిగి ఉన్నది. మహావిష్ణువుకి పరమ భక్తురాలు. ఈమెను అర్ధాంగిగా స్వీకరించి నన్ను ధన్యుని చేయండి” అని కోరాడు.


కర్దముడు అంగీకరిస్తూ “మను చక్రవర్తీ! విష్ణువు ఆదేశం నాకు శిరోధార్యం. తప్పక చేసుకుంటాను. కాని నాకు ఒక నియమం ఉంది. నేను తగిన కన్యను వివాహం చేసుకుని సంతానం పొంది సృష్టికి సహకరిస్తాను” అని నా తండ్రి బ్రహ్మదేవునికి మాట ఇచ్చాను. కనుక మీ అమ్మాయి దేహహూతిని వివాహం చేసుకుని సంతానం పొందుతాను. సంతానవృద్ధి జరుగగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. దీనికి మీ కుమార్తె అంగీకరిస్తే తప్పక వివాహం చేసుకుంటాను” అన్నాడు.


స్వాయంభువ మనువు తన భార్య, పుత్రిక దేవహుతితో మాట్లాడి ఆ నియమానికి అంగీకరించాడు. 


దేవహూతి వివాహం కర్దమునితో జరిపించడానికి నిశ్చయించి స్వాయంభువ మనువు మిగిలిన ఇద్దరు పుత్రికల వివాహం కోసం బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి “తండ్రీ! నా రెండవ కుమార్తె దేవహూతి వివాహం, శ్రీమన్నారాయణుని ఆదేశం ప్రకారం కర్దమ మునితో నిశ్చయమైంది. పెద్ద కుమార్తె ఆకూతికి, చిన్న కుమార్తె ప్రసూతికి తగిన వరులను మీరు చెబితే ముగ్గురి వివాహం ఒకేసారి చేస్తాను” అని కోరాడు.


బ్రహ్మదేవుడు ఆలోచించి మందహాసంతో “మను చక్రవర్తీ! నీ పెద్ద కుమార్తె ఆకూతిని రుచి మహర్షికి, చిన్న కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి ముగ్గురి కుమార్తెల వివాహం జరిపించు” అని చెప్పాడు. 


స్వాయంభువ మనువు బ్రహ్మ చెప్పినట్టు ఆకూతిని రుచి మహర్షికి, దేవహూతిని కర్దమ మహర్షికి, మూడవ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి ఒకేసారి వివాహం చేశాడు.


రుచి మహర్షికి, ఆకూతికి విష్ణువు అంశగా యజ్ఞుడు అనే దివ్య పురుషుడు జన్మించాడు. స్వాయంభువ మన్వంతరంలో యజ్ఞుడు మనువుని అనేక మంది రాక్షసుల నుంచి కాపాడి ప్రసిద్ధి చెందాడు.


కనిష్ఠ పుత్రిక ప్రసూతికి దక్ష ప్రజాపతికి అనేక మంది పుత్రికలు జన్మించారు. వారికి సంతానంగా దేవ రాక్షస పశు పక్ష్యాది జాతులు జన్మించి వృద్ధి చెందాయి.


              *(సశేషం)*

*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం.*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


 *ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

దర్పణ దృశ్యమాన

 🙏*విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం||| పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా!!!*

*యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మాన మేవాద్వయం|||*

*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!!!*🙏


శుభ గురువారం 🕉️Happy Thursday 

చిలక ఆ చిలకే

 సతీదేవి శివుని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చినప్పుడు,ఆమెతో పెంపుడు చిలుక కూడా వచ్చింది.దానికి సతీదేవి అంటే ప్రేమ,ప్రాణం.సతీదేవి కనపడకపోతే తిండి తినేది కాదు,నీళ్ళు తాగేది కాదు.సతీదేవి కి శివుడంటే ప్రాణమని, ముద్దు ముద్దు మాటలతో శివ శివ అనేది.ఎన్ని సార్లు శివనామ స్మరణ చేసిందో కానీ దానికి కైలాసప్రాప్తి కలిగింది.సతీదేవి శివుల సమక్షం లో ఆనందం పొందగలిగింది.,దాని చేష్టలతో ఆనందింప చేయగలిగింది.కైలాసం లో ప్రథమ గణాల భక్తి, నంది భక్తి వలన దానికి ఇంకా శివ చింతన ఎక్కువైంది.దక్ష యజ్ఞం కు,సతీ దేవి ప్రథమ గణాలతో వెళ్ళినప్పుడు,,ఈ చిలక ఎక్కడో మూలన శివ ధ్యానం లో ఉంది.,,,,,,,వెళ్ళలేదు.తల్లికి అవమానం జరిగి,దహనం అవుతుంటే,, అంత ధ్యానం లో ఉన్న చిలక్కు,ఏదో భయం,కీడు జరిగిందన్న ఆలోచన,నిలబడనీయక,,, యజ్ఞ వాటికకు ఎగిరివెళ్తే,,,సతీదేవి దహనం చూసి,,,దుఃఖం బాధ తో ఆ మంటలోకి దూకేసింది.ఆ తరువాత అమ్మవారు కంచి కామాక్షి అయినా మధుర మీనాక్షి అయినా అమ్మవార్ల దగ్గర చిలక ఆ చిలకే.

శ్రీరామ స్తుతి🙏

 ☘️ శ్రీరామ స్తుతి🙏


 సీ.భరతాగ్రజా !  రామ ! భానువంశ ప్రదీప !

                  నిరతమ్ము నినుగొల్తు నిగమవేద్య !

     తారకమంత్రమ్ము తలచిన మాత్రాన

                 పాపముల్ నశియించి పరము గల్గు  

     కౌసల్యనందనా ! కమనీయ గుణధామ !

                 కైవల్యమిచ్చినన్ గావు మయ్య

     భూమిజపతిరామ ! భువనైక మోహనా !

                 కోసలాధిప రామ ! కూర్మి  కొలుతు

తే.నీదునామమ్ము  దలచియు న్నిచ్చ లందు     

     బడసె కైవల్య పదము నా భక్త శబరి      

     భక్తితో నిన్ను  గొల్చిన ముక్తి గల్గు

     దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !


       జయలక్ష్మి  పిరాట్ల

11, మార్చి 2026, బుధవారం

పంచాంగం

 


శుకపికాలాపరావాలసుప్రభాత

 *"


తే.గీ.

శుకపికాలాపరావాలసుప్రభాత 

స్తోత్రపాఠాల మేల్కొల్పు శుభదమౌను 

నరుణకిరణాలు తూర్పున నలదుకొనగ 

మీకిదె శుభోదయమగు మేలిసఖుడ! 

*~శ్రీశర్మద*


🌸విఘ్నేశ్వర స్తుతి🙏


గణపతి దేవా రావా

మణిమయ భూషణ గణేశ మంగళతనయా

గుణమణి మూషిక రథుడా

గుణధామా నిను కొలిచెద కుడుముల తోడన్

 

కందపద్యం

గరికను తెచ్చియు గణపతి

నిరతము నిన్నే కొలుతురు నీ భక్తు రిలన్ 

వరములు నియ్యగ దేవా

గిరిదిగి రావా బిరబిర గిరిజా తనయా


సాహితీ శ్రీజయలక్ష్మి

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - జేష్ఠ -‌‌ సౌమ్య వాసరే* (11.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*