శ్రీకృష్ణుడు స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఎందుకు బేధించాడు ?
................................……………………..
ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని బేధించాడని మనకు తెలుసు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఒక స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని బేధించి మద్రరాజ పుత్రిక లక్షణను వివాహమాడు.
దీని వెనుక కారణం, మద్రరాజు తన కుమార్తె లక్షణకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అనేకమంది రాజులు వచ్చారు. రాజు నిబంధన ప్రకారం ఆకాశంలో తిరుగుతున్న మత్స్యయంత్రం కంటిని లక్ష్యంగా కొట్టి క్రింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని చూసి బాణం వేయాలి. శ్రీకృష్ణుడు క్షత్రియ ధర్మం ప్రకారం స్వయంవరంలో పాల్గొని, తన దివ్య లక్ష్యనైపుణ్యంతో మత్స్యయంత్రాన్ని బేధించి లక్షణను గెలుచుకున్నాడు. ఇది కృష్ణుని వీరత్వానికి, ధర్మపరిరక్షణకు నిదర్శనం.
(1) కుశధ్వజుడు > జనకమహారాజుకు సొంత తమ్ముడు. జనక మహారాజు తన పుత్రిక సీతాదేవిని శ్రీరాముడికిచ్చి పరిణయం చేయగా, కుశధ్వజుడు తన కుమార్తెలైన శ్రుతకీర్తి మాండవిలను శత్రుఘ్న భరతులకిచ్చి వివాహం చేశాడు. జనకమహారాజు పుత్రికలైన సీత, ఉర్మిళలను రామ, లక్ష్మణులు పెండ్లాడారు. ఈ విధంగా సూర్యవంశం, విదేహ వంశాల మధ్య గొప్ప బంధుత్వం ఏర్పడింది.
(2) ఇలబిల > ఈమె కుబేరుని తల్లి. ఈమె భర్త విశ్రవసుడు. ఇలబిల కుమారుడు కనుక కుబేరునకు ఐలబిలుడనే పేరు వచ్చింది.
కుబేరుడు ఉత్తరదిశకు అధిపతి, భార్య చిత్రరేఖ, రాజధాని అలకాపురి, ఇతని ఆయుధం గద, ఇతని వాహనం నరుడు. అందుకే నరవాహనుడని ప్రసిద్ధి. కుబేరుడు ధనానికి అధిపతిగా పూజింపబడతాడు.
(3) జయంతుడు > అజ్ఞాతవాసంలో భీముడికి గల పేరు. వంటలు చేస్తాడు కనుక వలలుడు అన్నారు.
జయత్సేనుడు > అజ్ఞాతవాసంలో నకులుని పేరు. తామగ్రంథి అనే మరో పేరు కూడా ఉంది. గుర్రాలను పాలించడంలో నిపుణుడు. తంత్రీపాలుడు > అజ్ఞాతవాసంలో సహదేవుని పేరు. పశువులను కాచేవాడు.
ధర్మరాజుకు కంకుభట్టు, అర్జునునికి బృహన్నల అనే మారు పేర్లున్నాయని మనకు తెలుసు. ఈ పేర్లతో పాండవులు విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం గడిపారు.
(5) తక్షకుడు > శ్రీరామచంద్రుని తమ్ముడైన భరతుని కుమారుడు. ఇతను తన పేరున తక్షశిలను నిర్మించాడు. ప్రస్తుతం తక్షశిల నగరం పాకిస్తాన్ లో ఉంది. ఇక్కడ గల సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాన్ని శ్వేతహుణులు నాశనం చేశారు. చంద్రగుప్తమౌర్యుడు, చరకుడు, కౌటిల్యుడు ఈ తక్షశిల మహావిశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఇది ప్రపంచంలోని పురాతన విద్యాకేంద్రాలలో ఒకటి.
(6) మత్స్యయంత్రాన్ని చేధించి అర్జునుడు స్వయంవరంలో ద్రుపదరాజ కూతురైన ద్రౌపదిని చేపట్టాడని చదువుకున్నాము కదా ! ఇది వాస్తవం. పాంచాలి స్వయంవరం పాండవుల జీవితాలను మలుపు తిప్పింది.
శ్రీ కృష్ణుడు కూడా ఇటువంటి స్వయంవరంలోనే మత్స్యయంత్రాన్ని చేధించి మద్రరాజ తనయ లక్షణను చేపట్టాడు.
(అ) రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే పదిమంది కొడుకులు కలిగారు. ప్రద్యుమ్నుడు కామదేవుని అవతారం.
(ఆ) సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే పదిమంది కొడుకులు కలిగారు.
(ఇ) జాంబవతి శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. సాంబుడు చాలా ప్రసిద్ధుడు.
(ఈ) నాగ్నజితి కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆముడు, శంకుడు, వసుడు అనే పిల్లలు కలిగారు.
(ఉ) కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, సోమకుడు అనే కుమారులు జన్మించారు.
(ఊ) లక్షణ కు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
(ఎ) మిత్రవింద కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాంసుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.
(ఏ) భద్రాదేవి అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. ఈ ఎనిమిది మంది అష్టభార్యలు.
(7) మాతలి > ఇతను దేవేంద్రుని రథసారథి. దేవతల రథాలను నడపడంలో ప్రసిద్ధుడు. అర్జునునికి రథసారథ్యం కూడా చేశాడు.
(8) వృషసేనుడు > కర్ణుని పెద్ద కుమారుడు. మహాభారత యుద్ధంలో 17వ రోజు అర్జునుని చేతిలో వీరస్వర్గం పొందాడు. కర్ణుడికి అత్యంత ప్రియమైన కుమారుడు.
(9) వైశంపాయనుడు> వ్యాసుని శిష్యులలో ముఖ్యుడు. జనమేజయునికి సర్పయాగ సమయంలో భారతకథను వినిపించినవాడు. భారతాన్ని మనకు అందించడంలో ఇతని పాత్ర చాలా గొప్పది.
(10) వ్యాఘ్రేశ్వరుడు > కాశీక్షేత్రంలో శివుడికి గల మరో పేరు. దుంధుభి అనే రాక్షసుడు కాశీలోని వ్యాఘ్రరూపంలో శివభక్తులను హింసిస్తుంటే, శివుడు పులిలా మారి దుంధుభిని సంహరించాడు. కనుక పరమశివుడికి వ్యాఘ్రేశ్వరుడనే పేరు వచ్చింది. వ్యాఘ్రం అంటే పులి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి