13, డిసెంబర్ 2025, శనివారం

ఆపుకోగలడా

 🙏మంద వారే 👃Happy Saturday 🙏 *

🌹ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చూసుకోగలడా, పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా.. తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా.. పోనీ వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా లేదు కదా... ఈ మూడునాళ్ళ ముచ్చట కోసం పగలూ, ప్రతీకారాలు, ఈర్ష్యాద్వేషాలు వీడి... జీవించినంత కాలం స్వార్థాన్ని వీడి అందరితో సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా గడుపుదాం మంచి మనుషులుగా జీవిద్దాం..!*🌹

అవహేళన- పశ్చాతాపం

  🌹అవహేళన- పశ్చాతాపం🌹


ఒక 30 సంవత్సరాల యువకుడు తన వృద్దుడైన తండ్రీ 

తో రైలు ప్రయాణం చేస్తున్నాడు. రైలు కిటికీ ప్రక్కన చోటు దక్కడంతో చాలా ఆనందపడుతున్నాడు


ఆ పక్కనే కూర్చున్న ప్రయాణికులు ఈ యువకుడినే చూస్తున్నారు.


రైలు స్టేషన్ నుండి బైలుదేరింది. 


ఇంతలో ఆ యువకుడు నాన్న నాన్న చూడు చూడు. ప్లాట్ఫాం పై ఉన్న వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నారు అని గట్టిగా కేరింతలు నవ్వుతున్నాడు. పక్కన ఉన్న ప్రయాణికులు ఈ యువకుడినే చూస్తూ ఆసక్తిగా గమనిస్తు నవ్వుకుంటున్నారు.


ఇంతలో ఆ రైలు స్టేషన్ దాటి పక్కనే ఉన్న పల్లెప్రాంతం వైపుగా వెళ్తుంది. మళ్ళి ఈ యువకుడు గట్టిగా "నాన్న నాన్న చూడు చెట్లు, కొండలు, రాళ్ళు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి" అని కేరింతలు మొదలు పెట్టాడు. 


 యువకుడి తండ్రి హాయిగా నవ్వుతూనే "సరే" అంటు కొడుకు వైపు చూస్తూ ఆనందగా ఉన్నాడు ..,


మళ్ళి ఈ యువకుడు గట్టిగా "నాన్నా నాన్నా చూడు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నా మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి" అంటూ కేరింతలు మొదలు పెట్టాడు.  


ఇంతలో చిన్న చిరు జల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఆ కిటికీ కడ్డీలకి జాలువారుతున్న చుక్కలని చూసి. ఆ చుక్కల్లోనుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవ్వుతున్న యువకుడిని చూసి కొంతమంది ప్రయాణికులు " మీ అబ్బాయి మాటలు మాకు గోలగా ఉంది. మీ అబ్బాయిని ఏదైనా మానసిక ఆసుపత్రి లో చూపించండి. ఎందుకైనా మంచిది" అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నారు.


ఈ యువకుడి తండ్రి "ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం బాబు","పుట్టుకతో అంధుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాము. ఇతని తల్లి రెండు వారాల క్రితం మరణించింది. డాక్టర్లు ఆమె కళ్ళు తీసి మా అబ్బాయికి పెట్టారు. పుట్టుకతో కళ్ళు లేకపోవడం వల్ల మేఘాలు వర్షం నీరు అన్ని మొదటి సారిగా చూస్తున్నాడు. మా అబ్బాయి మీ ఏకాగ్రతను భంగం కలిగించినందుకు క్షమించండి 

 ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు." అని ఆనందంగా తండ్రి వెల్లడించాడు. 


అసలు విషయం తెలుసుకోకుండా ఆ అబ్బాయిని ఎగతాళి చేసి తామెంత తప్పుగా ప్రవర్తించామో అని వారంతా సిగ్గుతో తల దించుకున్నారు.


"ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్తితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం..

ఎదుటి వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం లేదా ఇతరుల గురించి తీర్పులు చెప్పడం మంచి పద్ధతి కాదు.

ప్ర'పంచ' దంపతులు

 *🍀ప్ర'పంచ' దంపతులు*🍀

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా 

వాళ్ళంతా 5 విధాలు

గానే ఉంటారు.


*మొదటిది* *లక్ష్మీనారాయణులు* విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట


*రెండవది*

 *గౌరీశంకరులు* అర్థనారీశ్వరరూపం,

తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, 

కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.


*మూడవది*

*బ్రహ్మ సరస్వతుల జంట*

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా 

ఏ మాట మాట్లాడినా, 

ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.


*నాల్గవది*

*ఛాయా సూర్యులు* సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు, 

అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.

తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.

ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో. 

ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.


*ఐదవది*

*రోహిణీ చంద్రులు*

రోహిణీ కార్తెలో 

రోళ్ళు కూడా పగులుతాయనే 

సామెత ఉంది, 

చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, 

ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ, 

ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

*చదివారు కదా*

ఇంతకీ ఈ 5 జంటలలో *మీరు ఏ జంట అయ్యారో* చెప్పండి.



ॐ

సేకరణ

గురుకుల్‌లో చదువు కోసం

 ఉచితం


ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకును హరిద్వార్ గురుకుల్‌లో చదువు కోసం చేర్చాలనుకుంటే, మార్చి 15, 2026 నుండి జూలై 15, 2026 వరకు హరిద్వార్‌లోని ఆచార్య పాణిగ్రహి చతుర్వేద సంస్కృత వేదపాఠశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.


"ఆ పిల్లవాడు 6వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి."


గురుకులంలో వసతి, ఆహారం మరియు అన్ని ఇతర సౌకర్యాలు పూర్తిగా ఉచితం. అదనంగా, నెలకు ₹8,000 స్కాలర్‌షిప్ అందించబడుతుంది. పిల్లవాడు నాలుగు వేదాలు, వ్యాకరణం, సాహిత్యం, ఇంగ్లీష్ మరియు ఇతర ఆధునిక విషయాలలో విద్యను పొందుతాడు. గురుకుల్ వేదాలలో నిపుణుడిగా మారడానికి మరియు M.A వరకు ఉన్నత చదువులకు మార్గదర్శకత్వం అందించడానికి కూడా సహాయపడుతుంది.


ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో పోస్ట్ చేయండి.

మీ మతం యొక్క గొప్ప విద్యా సంప్రదాయానికి మద్దతు ఇవ్వడానికి వీలైనంత ఎక్కువ మంది హిందువులకు ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించండి.


వెంటనే సంప్రదించండి!

హీరాలాల్ జీ – 9654009263


(ఈ సందేశం హిందువుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు అందరు హిందువులకు చేరాలి.)


✊ జై! హిందూ!!🚩

ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷

భగవద్గీతలో (7.14) శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు:


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।

మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।। 


"భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన నా యొక్క ఈ దివ్యశక్తిని 'మాయ', అధిగమించడం చాలా కష్టం. కానీ, నాకు శరణాగతి పొందినవారు దానిని సునాయాసముగా దాటిపోగలరు." 


ఇది నిజానికి హరిదాస ఠకురా ప్రవర్తన ద్వారా నిరూపించబడింది. 

మాయ ప్రపంచం మొత్తాన్ని మంత్రముగ్ధులను చేస్తుంది. 

నిజానికి, భౌతిక ప్రపంచం యొక్క అద్భుతమైన ఆకర్షణల కారణంగా ప్రజలు జీవితపు అంతిమ లక్ష్యాన్ని మరచిపోయారు. 


కానీ ఈ మిరుమిట్లు గొలిపే ఆకర్షణ, ముఖ్యంగా స్త్రీ యొక్క ఆకర్షణీయమైన అందం, పరమాత్మునికి శరణాగతి పొందని వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. 


భగవంతుడు చెప్తున్నాడు, మామ్ ఏవ యే ప్రపద్యంతే మాయం ఏతాం తరంతి తే: [Bg. 

7.14] "నాకు శరణాగతి పొందిన వ్యక్తిని భ్రమాత్మక శక్తి జయించలేడు." 

హరిదాస ఠాకురాను పరీక్షించడానికి వ్యక్తిగతంగా స్వయాన భ్రమ కలిగించే మాయా శక్తి వచ్చింది, కానీ ఇక్కడ ఆమె తన ఓటమిని అంగీకరించింది, ఎందుకంటే ఆమె అతనిని ఆకర్షించలేకపోయింది. 

ఇది ఎలా సాధ్యం?


ఎందుకంటే హరిదాస ఠాకురా, కృష్ణుడి పాద పద్మాలకు పూర్తిగా శరణాగతుడైయ్యాడు, భగవంతుని పవిత్ర నామాలను ప్రతిరోజు 3,00,000 సార్లు జపించడం ద్వారా ఎల్లప్పుడూ కృష్ణుని ఆలోచనలలో మునిగిపోయాడు.


(చైతన్య-చరితామృత అంత్య-లీల

అధ్యాయం.3, వచనం.250)


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

అష్టాదశ పురాణాలు

  అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - శివ తాండవ కథనం - నూట నలభై నాలుగవ భాగం

______________________________________________________


శౌనకాది మునులు సూత మహర్షిని "మహర్షీ! శివుడు శివతాండవః ఎప్పుడు ఎందుకు ప్రారంభించాడో తెలియచేయండి" అని అడిగారు.


సూత మహర్షి "మునులారా! శ్రీ లింగ మహాపురాణంలో చెప్పినది వివరిస్తాను. వినండి.


పూర్వం దారుకుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి "స్త్రీ నుంచి పురుషుని ద్వారా సృష్టించబడిన స్త్రీ వలనే మరణం పొందే" వరం పొందాడు. తరువాత ముల్లోకముల పైకి దాడి చేసి దేవతలను, మునులను హింసించి చంపసాగాడు. యజ్ఞయాగాదులు చేయకుండా అడ్డుపడ్డాడు.


దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి దారుకుని నుంచి రక్షించమని కోరగా బ్రహ్మ " ఆ ఆసురుడు స్త్రీ ద్వారా పురుషుడి నుంచి సృష్టించబడిన స్త్రీ చేతిలో మరణిస్తాడు" అని చెప్పాడు. అలాంటి స్త్రీ జననం కోసం ఏం చేయాలి అని అడగగా బ్రహ్మ "మనమందరం మహాదేవుడు, మహాదేవి వద్దకు వెళ్లి ప్రార్ధించుదాం. వారే దారి చూపుతారు " అని వారిని తీసుకుని కైలాసం వెళ్ళాడు.


శివపార్వతులను అనేక విధాలుగా స్తుతించి దర్శనం ఇమ్మని ప్రార్థించారు. ఉమాదేవితో కలసి పరమేశ్వరుడు దర్శనమిచ్చి రాకకు కారణం అడిగాడు. బ్రహ్మ నమస్కరించి "పరమేశ్వరా! దారుకుడు అనే రాక్షసుడు తపస్సు చేసి స్త్రీ ద్వారా పురుషుని వలన సృష్టించబడిన స్త్రీ వలనే మరణం పొందే వరం పొందాడు. తరువాత దేవతల స్వర్గం పై దాడి చేసి తరిమి కొట్టాడు. భూమి పై మునులు, బ్రాహ్మణుల పై దాడి చేసి బాధపెడుతూ, చంపుతూ యజ్ఞయాగాదులు మొదలైనవి అన్ని ఆపివేశాడు. తమరే ఆ స్త్రీని సృష్టించి దారుకుని చంపి మమ్మల్ని రక్షించండి" అని ప్రార్ధించాడు.


పరమేశ్వరుడు పార్వతీదేవి వంక చూసి "ముల్లోకాల రక్షణ కోరకు రాక్షస సంహారానికై తగిన స్త్రీ శక్తిని సృష్టించడానికి నాకు సహాయం చేయాలి " అని కోరాడు. పార్వతీదేవి సరేనని తన అంశ రూపాన్ని శివునిలో ప్రవేశపెట్టింది. చూస్తున్న దేవతలకు మాత్రం ఒకరి వంక ఒకరు చూస్తూ పక్క పక్కన కూర్చుని చిరునవ్వు నవ్వుతున్న శివ పార్వతులు కనిపిస్తున్నారు.


పరమేశ్వరునిలో ప్రవేశించిన పార్వతి అంశ రూపము శివుని కంఠంలోకి చేరింది. కంఠంలో గల విషమును పార్వతి తన అంశరూపంతో కలిపి నీలవర్ణముతో విషపూరితంగా చేసింది.

పరమేశ్వరుడు ఆ నీల స్త్రీ శక్తి రూపాన్ని తన మూడవ నేత్రము తెరచి బయటకు తెచ్చి కాళికాదేవిని సృష్టించాడు. త్రినేత్ర అయిన కాళికాదేవి నల్లని కంఠంతో అగ్ని జ్వాలలు చిమ్ముతూ భీకరంగా కనిపిస్తుండటంతో ఇంద్రాది దేవతలు భయపడి దూరంగా పారిపోయారు.


కాళికాదేవి లలాటము పై మూడో నేత్రము, శిరస్సు పై చంద్రవంక కలిగి త్రిశూలము ధరించి జగన్మాత పార్వతి వంక చూసింది. దారుకుని సంహరించ వలసిందిగా పార్వతీదేవి ఆదేశం ఇచ్చింది. పార్వతి ఆదేశం పాటించి కాళికదేవి దారుకుని నగరానికి వెళ్లింది. ఆమె వెంట భూత పిశాచ గణాలు వెళ్లాయి.


దారుకునితో పోరాడి భయంకరంగా దారుకుని సంహరించింది. రాక్షసుడి సంహారం తరువాత కూడా కాళికదేవి ఉగ్రరూపం శాంతించ లేదు. అడ్డు వచ్చి వారిని సంహరిస్తూ, రక్త పానం చేస్తున్న కాళికకు భయపడి దేవతలు మునులు శివుని శరణు వేడారు. శివుడు బాలకుని రూపం దాల్చి కాళికదేవికి ఎదురు వెళ్లాడు.


శ్మశానంలో భీకరంగా గర్జిస్తూ తిరుగుతున్న కాళికాదేవి ఎదురుగా వచ్చిన చిన్న బాలుని చూసి ఆగిపోయింది. శివమాయ చేత బాలునిపై మాతృ ప్రేమ కలిగి ఎత్తుకుని శిరస్సును ముద్దాడి తన వక్షస్థలానికి హత్తుకుంది. పసిబాలుడైన శివుడు ఆమె పాలతో పాటు క్రోధాగ్నిని త్రాగి వేసి అదృశ్యమయ్యాడు. 


శాంతురాలైన కాళికదేవి శశ్మానంలో కూర్చుండి మౌనంగా ఉండిపోయింది. సంధ్యా కాలము అయ్యింది. కాళికదేవిని ప్రసన్నం చేయడానికి శివుడు భూత ప్రేత గణాలతో అక్కడకు వచ్చి మొదటిసారి శివ తాండవ నృత్యము చేశాడు. కాళీకాదేవి కూడా ప్రసన్నురాలై తన యోగిని గణాలతో కూడి శివునికి కలిసి తాండవ నృత్యం చేసింది.


శివ కాళికాదేవిల తాండవ నృత్యం చూసిన బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు, మునులు కాళికదేవిని అనేక విధాలుగా స్తుతించారు. కాళికదేవి ప్రసన్నురాలై అదృశ్యమయ్యింది. శివ పార్వతులు ప్రత్యక్షమైనారు. బ్రహ్మాది దేవతలు వారిని స్తుతించి తమను దారుకుని నుంచి రక్షించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


ఇది మొదటి సారి శివుడు చేసిన తాండవ నృత్య కథ. కొందరు శివతాండవం యోగకారణము చేత కలిగిన ఆనందము వలన చేసింది అని అంటారు" అని సూత మహర్షి ఆ రోజుకి భాషణం ముగించాడు.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - నవమి - హస్త -‌‌ స్థిర వాసరే* (13.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఎగ్జిమాయె యైన నెల్లర్జి దురదైన

  ఎగ్జిమాయె యైన నెల్లర్జి దురదైన

సొరియసిస్సు గాని శోభి గాని

తామరైన నిజము తగ్గించు హోమియో

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: చర్మవ్యాధులు కనిపించగానే అందరూ మేధావుల్లా డాక్టర్ల అవతారమెత్తేసి, ఇంగ్లీష్ మందుల షాపు నుంచి సిట్రాజెన్, ఏంటీబయోటిక్ టాబ్లెట్లు, ఏంటీబయోటిక్ ఆయింట్మెంట్లూ కొని తెచ్చేసుకుని వాడేస్తూ, దానిని కట్టడిలో పెట్టేసిన వీరుల్లా ఫీలైపోతారు! ఆనక అది తొండ ముదిరి ఊసరవెల్లిగా మారి, చుక్కలు చూపించినప్పటికి తమ వల్ల కాదనుకుని ఇంగ్లీషు స్కిన్ స్పెషలిస్టులందరి తెలివితేటలను కూడా చర్మంపై ప్రయోగిస్తూ, జీవితకాలం పాటు దానితో రాజీపడి గోక్కుంటూ, మా బ్రతుకింతేనని సరిపెట్టుకుని, మచ్చలు, దురదలు, దద్దుర్లు, పొలుసులు, పగుళ్ళు, రక్తాలు, చీము కంపులతో గతిలేక గోక్కుంటూ బ్రతికేస్తారు! నిజానికి వీళ్ళంతా తెలుసుకోవలసిన నగ్న సత్యం ఒకటుంది! అదేమిటంటే "ఇంగ్లీషు వైద్యంలోని ఏ మందులూ, ఆయింట్మెంట్లూ, ఏ చర్మవ్యాధినీ నయం చేయకుండా, లోలోపల అణచిపెట్టి (సప్రెస్ చేసి), ముదరబెట్టి, మరింత మొండి వ్యాధిగా మార్చి, ఎప్పటికీ మీరు వాళ్ళ చుట్టూ తిరిగే కుక్కలుగా మార్చుకుంటారు! అదే ఆంగ్లేయుల శైలి, ఆంగ్ల వైద్య శైలీ! సమస్య లేనివాడు వాళ్ళను పట్టించుకోడు! కాబట్టి అర్జంటుగా రిలీఫ్ కనిపించాలి, ఆహా! భలే వైద్యమని అనిపించాలి, ఆ ఒక్క రోగానికి వేసుకునే మందులే వీళ్ళకు తెలియకుండా వంద రోగాలను పుట్టించి, వీడు అందరు స్పెషలిస్టులకూ ఆహారమవ్వాలి! ఇది కదా ఇంగ్లీషు స్ట్రేటజీ! ఇదే నచ్చుతుంది అందరికీ! ఎందుకంటే అందరూ దాని మాయలో ఏనాడో జాంబీలుగా మారిపోయారు కాబట్టి! నిజానికి ఎలర్జీలు గానీ, దురదలు, చర్మవ్యాధులు ఏమైనా కనిపించిన తొలి రోజుల్లో దానిపై కేవలం కొబ్బరి నూనె రాసుకుని పడుకోవాలే తప్ప, ఏ మాత్రలూ, ఆయింట్మెంట్లూ వాడకూడదు! దానిని ఏమీ గెలక్కుండా వదిలేస్తే, మన ఆటోఇమ్యూన్ వ్వవస్థే దానిని నయం చేసేస్తుంది! కానీ అర్జంటుగా రిలీఫ్ వచ్చెయ్యాలని రాసే ఆయింట్మెంట్లు దానిని చర్మం దగ్గర అడ్డుకుని, రివర్స్ లో రక్తంలోకి పోయేలా చేస్తాయి! అలా రక్తంలోకి పోయినది రక్తమంతా తిరుగుతూ, అన్ని చోట్లకూ విస్తరిస్తుంది! ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ బయటపడటానికి ప్రయత్నిస్తుంది, అక్కడ కూడా ఆయింట్మెంట్లు రాస్తే, ఇంకొక కొత్త ప్లేస్ చూసుకుంటూ, చర్మానికి, అంతర్గత అవయవాలకూ దాని ప్రభావాన్ని విస్తరిస్తూ, ఆస్తమా, కేన్సర్, గుండె జబ్బులు, మైగ్రేన్ తలనొప్పులు, ఫిట్స్, బ్రెయిన్ ట్యూమర్లు, మానసిక జబ్బులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కీళ్ళు, కిడ్నీ, లివర్ జబ్బులు, ఇలా ఎన్నో జబ్బుల సృష్టికి బీజాలు వేస్తుంది! పైకి రాసేది పసరైనా, ఆయింట్మెంట్ అయినా, వేసేది ఇంగ్లీషులో ఏ మందైనా, ఏ ఇంజక్షనైనా సప్రెషన్ క్రిందకే వస్తుంది! పిల్లి అయినా తలుపులు మూసి కొడితే తిరగబడుతుంది, అణచివేతకు గురైన వాడు ఎవ్వడైనా ఎప్పుడో ఒకప్పుడు మన మీద పడి, మన పీక నొక్కి, ప్రాణం తీయక మానడు! అదే సృష్టి ధర్మం! మందులే వాడుదాం అనుకుంటే హోమియో వాడండి, ఇది మాత్రమే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి నివారణ చేస్తుంది! లేదంటే అసలు ఏ మందులూ వాడకుండా, యోగా, ప్రాణాయామం, ధ్యానం, ప్రకృతి ఆహారంతో కొన్నాళ్లు గడపండి! సకల రోగాలూ సరైపోతాయి! ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే ఎలర్జీలు, శోభి, దురద, ఎగ్జిమా, తామర, సొరియాసిస్ ఇలా ప్రతీ చర్మ వ్యాధినీ హోమియోతో సమర్థవంతంగా నయం చేయవచ్చు! ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమ్ పడుతుంది, కాబట్టి ఓర్పు, ఓపికతో నిలబడి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోండి! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

వంటిల్లు గ్రూప్......

 శర్మాస్ & శాస్త్రిస్ వారి వంటిల్లు గ్రూప్......


     అందరికీ నమస్కారము..

దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు చక్కటి బ్రాహ్మణ భోజనము, ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా అందజేస్తాము.

మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందుగా మాకు తప్పక తెలియచేయవలెను. మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా టిఫిన్స్,భోజనం,పులిహార,దద్దోజనం, పొంగల్, చంటి పిల్లలకు పాలు, టీ, ఫిల్టర్ కాఫీ (ప్లాస్క్కు తెచ్చుకోవలెను, లేనిచో సిల్వర్ పౌచ్ కవర్లో ఇస్తాము) మందులు, మీ ప్రయాణంలో ఇంకా ఏ రకమైన సహాయము కావాలన్నా తగిన రుసుము తీసుకొని అందజేస్తాము,


01. Rajahmundry : 6304049434, 

02. Vijayawada: 9346021045

03. Secunderabad: 9346747694

04. Kottayam : 9567583429

05. Ramagundam : 9849259500

06. Anantapur: 8374392377

07. Cudappah : 9866261232

08. Kadiri : 90326 90554

09. Vizag: 62810 23114

10. Guntur: 6300070049

11. Shiridi: 9511111585

12. Tirupati: 9133160580

13. Renigunta : 9441218771

14. Varanasi : 8985667737

15. Bangalore : 9448605879

16. Kurnool : 9885777077

17. Nellore : 7658990739

18. Nellore : 80745 96345

19. Badrachalam : 80969 19125

20. Varanasi: 7318366814

21. New delhi : 9650873730

22. Housur (Tamil Nadu), Mallur (Karnataka) border : 9944799931

23. Coimbatore : 7448408447

24. Nagpur: 94033 02715

25. Arunachalam : 8682683536

26. Chennai : 7395932954

27. Ujjain : 98899 84688

28. Kerala : 9447136023

29. Madurai : 9842191826

30. Mumbai : 74484 08447


నలుగురికి ఉపయోగపడే పోస్ట్. దయచేసి అందరికీ షేర్ చేయండి.🙏

12, డిసెంబర్ 2025, శుక్రవారం

దేవతల పేర్లు

  వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి. 

నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు.  కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా  లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం. 

కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు. 

అదే విధంగా అనేక షాపులు కిరాణా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 

ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు , కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంతే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. 

పూజా సామానులు.  

అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉదుబత్తులు , ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతల పేర్లు  కాకుండా దేవుళ్ళ బొమ్మలు  ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్న అట్ట డబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు నచ్చిన  వస్తువో  జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు. 

మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడటం లో మీ వంతు  కృషి  చేయగలరు.