ఉ॥
నిన్నటి వెన్నదొంగ గననేరడు నేడిట దాగెనెచ్చటో
తిన్నగ నుండనీయక మదింగొని నాయది బోయెఁ గానకన్
అన్నులమిన్నలార! కలడందురె మీ హృదులందు జూడరే
ఉన్నను నాకొసంగరె మహోన్నతులై గృప జూపు డియ్యెడన్
*~శ్రీశర్మద*
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
ఉ॥
నిన్నటి వెన్నదొంగ గననేరడు నేడిట దాగెనెచ్చటో
తిన్నగ నుండనీయక మదింగొని నాయది బోయెఁ గానకన్
అన్నులమిన్నలార! కలడందురె మీ హృదులందు జూడరే
ఉన్నను నాకొసంగరె మహోన్నతులై గృప జూపు డియ్యెడన్
*~శ్రీశర్మద*
శ్రీభారత్ వీక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు 🌹 శ్రీకృష్ణుడు జగద్గురువు. మనిషిగా కనిపించే భగవంతుడు. ఆ విషయం స్వయంగా ప్రకటించుకున్నవాడు, ధర్మ సంస్థాపన కోసం ఆవిర్భవించిన వాడు శ్రీకృష్ణుడు. అందుకేనేమో! కన్నయ్య అంటే భారతీయులకు వల్లమాలిన ప్రేమ. శ్రావణ బహుళ అష్టమి ఆయన పుట్టినరోజు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అందించిన ఆ వివరాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - భరణి & కృత్తిక - స్థిర వాసరే* (16.08.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
*శ్రీకృష్ణాష్టమీ పర్వదిన శుభాకాంక్షలతో...*
ఆ.వె.
లీల లెన్నొ జేసి క్రీడలెన్నియొ నాడి
వెన్నలారగించి వేణువూది
విశ్వదర్శనమ్ము విందిడి తల్లికిన్
గీతబోధ మాకు కృష్ణ! జయము!
*~శ్రీశర్మద*
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము*
*461 వ రోజు*
*గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట*
ఇంతలో దూరంగా సుయోధనుడి శవం పడి ఉండటం చూసింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి గాంధారి కుప్పకూలి పోయింది. తన కుమారుడి శవం మీద పడి రోదిస్తూ " నాయనా సుయోధనా ! ఏమిటిది సుయోధనా ! నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొర్లడం ఏమిటయ్యా ! నీ తల్లి గాంధారిని వచ్చాను నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయనా ! కృష్ణా ! చూడవయ్యా నా కుమారుని చూడు. వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా ! నాకు పాదాభివందనం చేసాడయ్యా ! అప్పుడు నేను ధర్మమం జయిస్తుందని ఆశీర్వదించాను. అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణా !నాడు కురు సభలోజూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు " ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. కౌరవులకు నాశనం తప్పదు " అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణా ! నేను ఇంకా ఇలా అన్నాను యుద్ధంలో వెనుతిరిగి పోవడం కంటే వీరమరణం పొందడమే మేలు అన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగి రా ! లేకున్న వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా ! నా కుమారుడు రెండవది నిజంచేసాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కాని వేరు కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీరస్వర్గం చేరిన నాకుమారుడి గుర్తించి ఎందుకు దుఃఖిస్తాను. ఈ ముదిమివయసులో నాకూ నా భర్తకు కొడుకుల ఆసరా లేక పోయిందేనన్నదే నా బాధ. కృష్ణా ! నా కుమారుడు అభిమానధనుడు అష్టైశ్వర్య సంపన్నుడు అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం విదురుడు ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధముల చెప్పాడు. మదించిన గర్వంతో వారా మాటలను పెడచెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా ! పదకొండు అక్షౌహినుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా ! నా భర్త కుమారుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన కురుసామ్రాజ్యం పరుల హస్తగతం అయిందయ్యా ! అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది " అని
*గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట*
కృష్ణా ! పోయిన కొడుకులు ఏటూ పోయారు. బతికి ఉన్ననా కోడళ్ళ దుఃఖమును చూడ లేక పోతున్నానయ్యా ! ఇలాంటి మనో వేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి ! రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికీ ఘోర శిక్ష ఏమిటి. అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా ! కడుపున పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తుందయ్యా ! నా కుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా ! కురులు విరబోసుకుని పిచ్చి వారిలా తిరుగుతున్న నా కోడళ్ళను చూడవయ్యా ! వాళ్ళేమి చేసారని వారికి ఈ చిత్తక్షోభ. నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను. నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు. నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా ! వీరి దుఃఖముకు అంతు లేదా ! భీముని చేతిలో హతులైన నాకుమారుల శవాలు చూసి నాకోడళ్ళు భోరు భోరున రోదిస్తున్నారయ్యా ! పాలరాతి భవనాల్లో చందనచేర్చిత ముఖాలతో కళ కళ లాడే వారి ముఖాలు ఈ రోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోదిస్తున్నారయ్యా ! ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్ళ్కు పట్టిన దుర్గతి చూసావా ! ఇదంతా నేను నా భర్తా చేసిన పాప ఫలితం కాక పోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా ! అని గాంధారి పలు విధముల విలపిస్తుంది. కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దు!ఖం బహిర్గతమైతే కాని దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
🔔 *అనగనగా...* 🔔
ఒక కవి ఇంట్లో
దొంగలు పడ్డారు!
ఆరు వారాల నగలు
మూడు లక్షల నగదు
ఐదు పుస్తకాలు పోయాయి!!
పుస్తకాలది ఏముందయ్యా...నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.
పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు...ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....
ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో...కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...
పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..
ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...
" పోద్దురు బడాయి "
" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే...అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి...నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని...కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే...అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.
https://youtu.be/LAFG_ujf6BU
" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.
కవి గారికి
నమస్కారములు...
బీరువా తాళాలు పగులగొట్టి చూశా..నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా..బీరువాలో ఎందుకు దాచారు...వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా..నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది.. అది జ్ఞాన నిధి..తప్పుచేశానని తెలుసుకున్నా..
ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది.. చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా..డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...
ఇట్లు
దొంగతనాలు మానిన దొంగ
ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..
ఆయన భార్య ముఖంలో ఆలోచనలు
లక్ష్మీదేవి గొప్పదా?
సరస్వతీ దేవి గొప్పదా?
ప్రతి విద్యార్థికి ఈ కథ ఒక పాఠం కావాలి
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
తే.గీ.
వర్షధారల కురిపించి వసుధలోని
తెలుగు నేలల మురిపించి చలువబరచి
జలనిధిగజేసె వరుణుండు క్షమనెల్ల
వలదు వలదంచు వేడగా వరుణవిభుడు
*~శ్రీశర్మద*
🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯
*🪷బుధవారం 13 ఆగస్టు 2025🪷*
*శ్రీమదాంధ్ర మహాభారతం*
*ఆదిపర్వము*
*మహా భారత కథ*
*ప్రారంభం(1 -6)*
ఇంక భారత కధను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో
అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహా యజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్లు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేసారు.
సారమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి సరమకు
జరిగిన విషయం చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. “ఓ జనమేజయ మహారాజా! నీ తమ్ములు ఏ మాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమేయుని కొట్టారు. ఓ రాజా! యుక్తా యుక్త వివేచన విచక్షణ లేకుండా మంచి వారికి, సాధువులకు అపకారం చేసే వారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి.” అని పలికి ఆ సరమ అనే కుక్క వెళ్లి పోయింది.
తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము
పూర్తి చేసాడు. తన రాజధాని హస్తినా పురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలోశ్రుత శ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు. “తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి." అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని
ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేసాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానసాయిత, అనే ఎనిమిది సిద్ధులు పొందాడు. ఒక రోజు గురువు గారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్యు మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము ( ఆవు పేడ) భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు.
తరువాత పౌష్యమహారాజు వద్దకు వెళ్లాడు. “మహారాజా! నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్ను కుండలములు
ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి.” అని అడిగాడు. "మహాత్మా! ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి.” అని అన్నాడు.
ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్లాడు. కాని ఆమె ఉదంకునికి
కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి “రాజా! మహారాణి నాకు
కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి." అని అడిగాడు. "మహాత్మా! నా భార్మ మహా పతివ్రత. చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు.” అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది. తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని. ఆ అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు.
సశేషం
తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం
*సేకరణ*
*న్యాయపతి నరసింహారావు*
🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯