11, డిసెంబర్ 2025, గురువారం

12డిసెంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌹 _*శుక్రవారం*_ 🌹

*🪷12డిసెంబర్2025🪷*    

   *దృగ్గణిత పంచాంగం* 

    

          *స్వస్తి శ్రీ విశ్వావసు*

          *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి  : అష్టమి* ‌మ 02.56 వరకు ఉపరి *నవమి*

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం  : ఉత్తర* రా 05.50 తె వరకు ఉపరి *హస్త* 

*యోగం : ప్రీతి* ప 11.12 వరకు ఉపరి *ఆయుష్మాన్*

*కరణం  : కౌలువ* మ 02.56 *తైతుల* రా 03.42 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

              *ఉ 06.30 - 08.30 & 09.30 - 10.30*

అమృత కాలం  : *రా 10.04 - 11.47*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.24*

*వర్జ్యం    : ప 11.42 - 01.25*

*దుర్ముహూర్తం  : ఉ 08.40 - 09.25 మ 12.24 - 01.08*

*రాహు కాలం   : ఉ 10.38 - 12.01*

గుళికకాళం      : *ఉ 07.50 - 09.14*

యమగండం    : *మ 02.49 - 04.12*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 06.37*

సూర్యాస్తమయం :*సా 05.43*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :*ఉ 06.26 - 08.40*

సంగవ కాలం         :     *08.40 - 10.54*

మధ్యాహ్న కాలం    :    *10.54 - 01.08*

అపరాహ్న కాలం    : *మ 01.08 - 03.22*

*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ అష్టమి*

సాయంకాలం        :  *సా 03.22 - 05.36*

ప్రదోష కాలం         :  *సా 05.36 - 08.10*

రాత్రి కాలం           :*రా 08.10 - 11.36*

నిశీధి కాలం          :*రా 11.36 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.44 - 05.36*

<><><><><><><><><><><><><><>

      *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*నిత్యానందా నిత్యబోధా* 

*నాదినీ జనమోదినీ*


             *🪷ఓం శ్రీ🪷*

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

పంచాంగము

 


ఆన్లైన్లో సంగీతం క్లాసులు

 ఆన్లైన్లో సంగీతం క్లాసులు


 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము. మీరు పెట్టిన కామెంట్లు ఈ బ్లాగులో ఎవరికి కనబడవు. 


మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 


ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు  శిక్షణ తీసుకుంటున్నారు.

తెలుసుకోండి

  తెలుసుకోండి.

 మీకు తెలుసా❓

 స్వాతంత్రానికి ముందే అన్నదమ్ములు గాంధీ గారిని తన గుప్పెట్లో ఉంచుకొని, భారతదేశాన్ని మూడు ముక్కలు చేసి, పంచుకున్నారని.

(1) భారతదేశ0- నెహ్రూ 

(2) పాకిస్తాన్ - జిన్నా 

(3) కాశ్మీర్- ఓమార్ అబ్దుల్లా

 పై మూడు ప్రదేశాలలో మెజార్టీ ఓటు బ్యాంకు కలిగిన భారతదేశాన్ని అందులో ఉన్న, హిందువులను బకరాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా భారతదేశాన్ని ఏలాలంటే మెజార్టీ కలిగిన హిందువులలో *కులాలను* ఏర్పరచి, మైనార్టీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, భారతదేశంలో హిందుత్వాన్ని అనిచివేసేందుకు "*సెక్యులర్*" అనే పదాన్ని రాజ్యాంగం ద్వారా వాడింది. పాఠ్యపుస్తకాలలో అక్బర్, బాబర్, ఔరంగా జోక్, టిప్పు గతి లేని సుల్తాన్ చరిత్రహీనులను భవిష్యత్ తరాలలో మన పిల్లలకు వీరులుగా చూపించేందుకు పాఠ్యపుస్తకాలను ఆయుధాలుగా వాడారు. అందులకు ఐదు 5 మంది కేంద్ర విద్యా శాఖ మంత్రులు చరిత్రను పాఠ్యపుస్తకాలలో 📕📗📙 భవిష్యత్ తరాల పిల్లల కోసం కీర్తిస్తూ చరిత్రను తయారు చేశారంటే నమ్మగలరా ❓ అవును మీరు విన్నది నిజమే.✅భారత దేశంలో హిందువుల ఆధిపత్యం తగ్గించడానికి హిందువుల జనాభా పెరగకుండా కుటుంబ నియంత్రణ ఒక హిందువులలోనే అమలు చేశారు. హిందుత్వాన్ని దెబ్బతీయాలంటే బ్రాహ్మణులను అంతకు చేయాలని కుట్ర పన్ని, హారతి పళ్లెంలో డబ్బులు వెయ్యకుండా దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేశారు. ఈ పద్ధతిని చర్చిలలో మసీదులలో ఏర్పాటు చేయలేదు. ఎండోమెంటు శాఖను ఏర్పాటు చేసి అన్య మతస్తులకు ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించారు. ప్రస్తుతం, తమరు హుండీలో వేసిన డబ్బులతో వారు ముదిరి, తమరి గ్రంథాలను శాస్త్రాలను దేవుళ్లను అవమానపరిచే విధంగా 24*7 పనిచేస్తున్నారు.

Ex :- ఈ మధ్యకాలంలో మాలాధారణ చేసిన స్వాముల పై జరుగునుతున్న దాడులే ఉదాహరణ గా చెప్పవచ్చు.

 కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి వ్యతిరేకంగా 22 Ex:-MiM, TMC, DMK, APP, BRS, కొత్తగా తమిళనాడులో TVK ఈ పార్టీ నాయకుడు మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తాడు కానీ, చరిత్ర కలిగిన స్వయంభుగా వెలిసిన, తమిళనాడు దేవాలయాలకు వెళ్లి పూజించడు. అలాంటప్పుడు ఇలాంటి వారికి ఓట్లు వేస్తే హిందుత్వం ఎలా అభివృద్ధి చెందుతుంది ❓ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీలను చాప కింద నీరుల చాలా తయారు చేసింది, హిందువులు మాత్రం నిద్రపోతూ ఉన్నారు. వారు అధికారం కోసం పక్కనున్న దేశాల ముస్లింలను అరువు తెచ్చుకొని తమరి Tax ద్వారా వచ్చిన డబ్బులతో డబుల్ ఫ్లాట్ బెడ్ రూములు, రేషన్,ఆధార్, ఓటర్ కార్డులు పుట్టించుకొని కొన్ని దశాబ్దాలుగా సంపాదించుకున్న తమరి ఆస్తి పై కన్ను వేసి, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్,పంచర్ జిహాద్, పెన్షన్ జిహాద్, అంటూ హిందువులపై హిందుత్వ వినాశనానికి కృషి చేస్తున్నారు. దయచేసి మేల్కొందాం భక్తితో పాటు 🙏 రాజకీయ నాయకులను ప్రశ్నించే గుణాన్ని ఓటు బ్యాంకు ఐక్యత హిందుత్వ కుటుంబాలలో ప్రతి ఒక్కరిలో తీసుకువద్దాం. లేకపోతే భవిష్యత్ తరాలు సుడాన్, నైజీరియా, కాశ్మీర్ పశ్చిమబెంగాల్ లాగా తమరి పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసుకుంటారా❓


 ** Choice is your**


 కానీ నేను, నా కుటుంబం నిర్ణయం తీసుకున్నాం.

 హిందూ వ్యతిరేకులకు, హిందూ దేవాలయాలు దోచుకునే పార్టీలకు, హిందువుల సంక్షేమానికి కృషి చేయని ఏ పార్టీకైనా హిందువు నిలబడిన ఓటు వేయకూడదని 👆❌

 మరి మీరు❓

(1) హిందువుల కొరకు హిందూ బోర్డు ఏర్పాటు ఏర్పాటుచేసి, వారి సంక్షేమం కోసం నిధిని ప్రతిపణాళికలో కేటాయించాలి.

(2) మానస సరోవర యాత్ర కొరకు అవకాశాలు కల్పించాలి.

 హిందువులు అడగటం లేదు కదా అని రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో జెరూసలేం యాత్ర మక్కాయాత్ర అంటూ తమరి హుండీ ఆదాయాలను ఇతర మతాలకు పంచడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో మీ ఉద్యోగాలు తమరి సంక్షేమం ❓

 అందుకే హిందువులు భక్తితో 🙏పాటు ఓటు బ్యాంకు చైతన్యాన్ని👆✊ రాజకీయ నాయకులను ప్రశ్నించే గుణాన్ని 🗣️❓💓అలవర్చుకోవాలి అప్పుడే భారత దేశంలో హిందుత్వం బలపడుతుంది. చెప్పడం నా వంతు మేల్కొనడం మీ వంతు.


 *ఇట్లు 

బెస్త బద్రీనాథ్*


 నచ్చితే పదిమంది హిందూ గ్రూపులకు షేర్ చేసి మేలుకొలపండి

10, డిసెంబర్ 2025, బుధవారం

పంచాంగం 11.12.2025 Thursday,

ఈ రోజు పంచాంగం 11.12.2025 Thursday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన  విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష సప్తమి తిథి బృహస్పతి వాసర పూర్వఫల్గుని నకత్రం నిష్కంభ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: ఈ రోజు శ్రాద్ధ తిథి లేదు.

 


నమస్కారః , శుభోదయం🙏🏻

పంచాంగం

 


తెలుగుభాష!!

'చచ్చిన' అనే పదాన్నికూడా బతికించే భాష

తెలుగుభాష!!


తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! 


అందరూ పొగ *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.* 


-ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. 


      సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం ఖచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. 

*ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. 


*చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? 


*ఆశ చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకుని చావనివాళ్లు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు? 


*తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది. 


ఇలాంటి అతీత శక్తులు యావత్‌ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి. 

ఎంత గొప్ప! ఎంత చిత్రం !


 *మత్తు పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను ‘సేవిస్తున్నా’ నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు. 

ఇదేం చిత్రమో! 


*ఇంకా చిత్రమేంటంటే మందు ‘కొడుతున్నా’నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా? 


*బాతాఖానీ కొట్టకు అంటాడు. దీని పరిస్థితీ ఇదే. 


*అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని ఆరోగ్యప్రదాయిని అయిన మందు పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా? 


*తెలుగువాడు ఎందులోనైనా ఆటను చూడగలడు. మాట్లాడతానంటాడు. పోట్లాడతానంటాడు. 


*మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి? 


ఇంకోమాట! 


*హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా? 


*తెలుగువాడి ‘న్యాయమే’ వేరు. 


బడాయి గానీ మాట మాట్లాడితే ‘మనస్సాక్షిగా’ అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి! 


*అగ్నిసాక్షిగా పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి? 


*కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం! 


*పెళ్లికాని ఆడపిల్లను గుండెల మీద కుంపటి అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్‌ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? 


*మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది! 


*నవ్వితే నవరత్నాలు రాలతాయంటాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! చిటికెలో పని అయిపోతుందంటాడు. 


*అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది !

 

*ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు. 


*అప్పు తీసుకునేటప్పుడు ‘నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తా’నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కాదూ! 


*ఎవరో చిన్నచూపు చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా? 


*వంట చేయడాన్ని చేయి కాల్చుకోవడం అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి !

 

 *సంగీతమంటే చెవి కోసుకుంటానని ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు. 


*తప్పు చేసినవాడు అడ్డంగా దొరికిపోయాడు అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరుకుతాడు తప్ప. 


*అన్నట్టు గిట్టనివాణ్ని అడ్డమైనవాడు అని తిడతారు. అదేంటి? దాని భావ మేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది. 


*పశువా అని తిట్టినట్టు. మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. అదీ సంగతి! 


*ఎవడి మీదైనా కోపం వస్తే ఏ మొహం పెట్టుకుని వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా! 


*ఫలానావాడు తలలు మార్చేరకం అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా ?


*తెలుగువాడు బండ చాకిరీ చేస్తానంటాడు. బండ దాని మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది? 


*ఏముంది ఎడమ చేత్తో చేస్తానంటాడు. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది? 


*అన్నం ఉడకలేదా అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా! 


*జోకులు పేల్లేదు అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి! 


*వీపు విమానం మోత మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా? 


*లేస్తే మనిషిని కానంటాడొకడు. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా! 


*శక్తిని కూడా భక్తికి ముడి పెట్టడం తెలుగువాడికి రివాజు. 


*ఉన్న పూజలు చాలక బడితెపూజ ఒకటి.


  *జంతువుల్లో కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేకత. 


*గిట్టనివాళ్లను పంది, కుక్క, గాడిద అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని పులి, సింహం, గుర్రం అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు.


*ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు. 

*గుండె జారిపోయింది అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే! 


*నీ నోరు పడిపోను అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా? 


*పాడమని అడిగితే గాయకులు గొంతుపోయింది అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు? 


*నోరు పారేసుకోవడం అంటారు. అది ఎలా సాధ్యం? 


*మా ఆయనకు నోట్లో నాలుకలేదని ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? 


*‘వాసన చూడు’ అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం? 


*రుచి చూడటం కూడా అంతే. ఎవరు చూడగలరు? 


 *పత్రికలు చదివి చదివి వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు. 


*ఫలానావాడు బాధకు గురయ్యాడు అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా. 


*దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు. 


*తప్పు చేస్తే పాపం అంటాడు సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే అయ్యో ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?


 దేశ భాషలందు తెలుగు లెస్స 

తెలుగు భాషా జిందాబాద్‌

💐💐💐

8, డిసెంబర్ 2025, సోమవారం

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🕉️

*🕉️సోమవారం 8 డిసెంబర్ 2025🕉️*


             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                         6️⃣8️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


       *సంపూర్ణ మహాభారతము*         

                    *68 వ రోజు*

                    

      *వన పర్వము ప్రథమాశ్వాసము*


              *హస్థినా పురం*```


హస్థినా పురంలో ధృతరాష్ట్రుడు విదురునితో “విదురా పాండవులు ఏమి చేస్తుంటారు” అని అడిగాడు. 


దానికి విదురుడు “పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు, శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకు సుయోధనుని విడిచి పెట్టు.ద్రౌపదికి,భీమునికి దుశ్శాశనునితో క్షమాణలు చెప్పించు” అన్నాడు. 


ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి “సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం!” అన్నాడు. 


వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. 


ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. 


ధృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. 


సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. 


దృతరాష్ట్రుడు “విదురా! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ధి లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు!” అన్నాడు. 


విదురుడు “ధృతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మంతప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు!” అన్నాడు. 


విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ “పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, ధృతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి?” అన్నాడు. 


శకుని “సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు!” అన్నాడు. 


కర్ణుడు “ఈ అదను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము. శత్రుశేషం లేకుండా చేద్దాం!” అన్నాడు. 


కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. 


ఇది తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి “నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు?” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను” అన్నాడు. 


వ్యాసుడు “ధృతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు" అన్నాడు.


ధృతరాష్ట్రుడు “అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి” అన్నాడు. 


వ్యాసుడు “మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు” అని వెళ్ళి పోయాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గొప్ప పురాణ కథ

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹

  ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిత్వం పెరగాలంటే ఆదర్శప్రాయులైనవారి కథలైనా తెలుసుకోవాలి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అటువంటి గొప్ప పురాణ కథ ఈ ఎపిసోడ్ లో అందిస్తున్నారు. కుశనాభుడి కుమార్తెల కథ వింటే యువతులు ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ఆన్లైన్లో సంగీతం క్లాసులు

  ఆన్లైన్లో సంగీతం క్లాసులు




 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము.




మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 




ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు."